railway GM
-
రెండేళ్లలో కొత్త రైళ్లు..
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తానని, రెండేళ్లలో కొత్త రైళ్లు వేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. పలు అభివృద్ధి పనులతోపాటు కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భద్రతపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే ఇంజిన్ కండీషన్, కొత్త రైళ్ల పొడిగింపు, రైల్వేస్టేషన్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రభుత్వానికి బడ్జెట్ కోసం నివేదికను పంపించామని, నిధులు విడుదలైతే రెండేళ్లలో కొత్త రైళ్లతోపాటు ఆయా పనులు చేపడుతామన్నారు. కలకత్తా, బెంగళూరు, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైళ్ల రాకపోకలు సాగించాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి ఉందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రైళ్ల కోసం టెండర్ పనులు ప్రారంభించామని, త్వరలోనే టెండర్లు పూర్తయితే పనులు ప్రారంభిస్తామన్నారు. గతంలో మీటర్‌గేజ్ రైలు, ప్రస్తుతం బ్రాడ్‌గేజ్ రైళ్లు నడుస్తున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం మరింత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి నాందేడ్ వరకు వచ్చే రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని పలువురు విన్నవించారని, ఈ విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పిప్పల్‌కోటి, ముత్ఖేడ్ ఎలక్ట్రేషన్ పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది డబ్లింగ్ పనులు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. చిల్ర్డన్ పార్క్, సోలార్ ప్లాంట్, టీటీఈ రెస్ట్‌రూమ్‌లను ప్రారంభించారు. రైల్వే క్వార్టర్స్‌ను పరిశీలించి అక్కడ ఉంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ పనులను పరిశీలించారు. రోడ్డు సౌకర్యం, బోరు వేయించాలని అందులో ఉంటున్న వారు విన్నవించడంతో సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకనే ఆటంకాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే రైల్వే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. ప్లైఓవర్, అండర్‌బ్రిడ్జి కోసం రూ.78 కోట్లు అవసరం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని, నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు చేపట్టడం లేదన్నారు. అలాగే ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ జాయింట్ వెంచర్‌కు సంబంధించిందని, ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయమై పలుసార్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిశామని, మరోసారి కలిసి ఈ పనుల విషయమై చర్చిస్తామన్నారు. వినతుల వెల్లువ.. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు పలువురు వినతులు సమర్పించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రైల్వే జీఎంను కలిసి పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించాలని విన్నవించారు. చిల్ర్డన్ పార్కు, సోలార్ విద్యుత్, రైల్వే సిబ్బంది క్వార్టర్‌ను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి నాందేడ్‌కు వచ్చే వివిధ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ వైస్‌చైర్మన్ రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, రాష్ట్ర నాయకులు బండి దత్తాత్రితోపాటు పలువురు రైల్వే జీఎంను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రైల్వేఓవర్, అండర్‌బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ పనులను చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్–ఢిల్లీ రైలు వేయాలని, ఆదిలాబాద్–ముత్ఖేడ్ వరకు డబుల్ రైల్వే లైన్ పనులు చేపట్టాలని, నిజామాబాద్ వరకు వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని, ఆదిలాబాద్–హైదరాబాద్ వరకు ఉద యం పూట రైలు నడిపించాలని, ఆదిలాబాద్–నాగ్‌పూర్ రైలు సాయంత్రం వేళల్లో నడిపించాలని విన్నవించారు. కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో రెండు స్వీపర్ బోగీలను పెంచాలని కోరారు. -
జనగామ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలి
సాక్షి, హైదరాబాద్: రాయగిరి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ రైలును జనగామ వరకు పొడిగించాలని, ప్యాసింజర్ రైలు (ఎంఈఎంయూ)ను ఫలక్‌నుమా నుంచి భువనగిరి దాకా విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను ఆపడంతోపాటు పలు సమస్యలు పరిష్కరించాల న్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎంను కలసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. -
ప్రతిపాదనల చిట్టా.. రైలెక్కాలి పట్టా
రాష్ట్రానికి కేంద్రం కొత్త రైల్వే జోన్ ప్రకటించిన నేపథ్యంలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విన్నవించారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు కేటాయించాల్సిన నిధులు.. ఇతరత్రా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. పలు ప్రాంతాలకు కావాల్సిన కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన.. రైల్వేల పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరారు. సాక్షి, విజయవాడ: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా విజయవాడలో సమావేశమయ్యారు. స్థానిక సత్యనారాయణపురంలోని ఈటీటీఎస్లో నిర్వహించిన సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎంపీలతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. కాగా విజయవాడ నుంచి కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్ల కోసం అనేక వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించనందుకు సమావేశం నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) బాయ్‌కాట్ చేశారు. అంతకుముందు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి పలు సమస్యలపై విజ్ఞాపన పత్రం అందజేశారు. విజయవాడ–మేళ్ల చెరువు రైల్వేలైను, విజయవాడ–భద్రాచలం రైల్వేలైనుకు అవసరమైన ఆర్ఓబీ వెంటనే మంజూరు చేయాలని.. బెంగళూరు, ముంబై, వేలాంగణి ప్రాంతాలకు కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మోడల్ స్టేషన్‌గా బందరును తీర్చిదిద్దండి మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను మోడల్‌రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి జీఎంకు విన్నవించారు. అలాగే వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం– బెంగళూరు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యూలర్ రైలుగా మార్చాలని కోరారు. మరిన్ని ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ► మచిలీపట్నం–విశాఖపట్నం పాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చి, ఏసీ బోగీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల విశాఖ–మచిలీపట్నం మధ్య ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. కాకినాడ– షిర్డీసాయి నగర్ ఎక్స్‌ప్రెస్‌కు గుడివాడలో కొన్ని అదనపు బోగీలు కలపాలి. దీనివల్ల కృష్ణాజిల్లా వాసులకు షిర్డీనగర్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ► పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ నుంచి కాకుండా మచిలీపట్నం నుంచి నడపాలి. ► మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, ధర్మవరం–మచిలీపట్నం, విజయవాడ–మచిలీపట్నం, మచిలీపట్నం–గుడివాడ రైళ్లకు వడ్లమన్నాడులో హల్ట్ ఇవ్వాలని స్థానికులు కోరుతుండటంతో పరిశీలించాలి. ► విజయవాడ–జగ్గయ్యపేట–సిక్రిందాబాద్ మధ్య గూడ్స్ రైలు మార్గం ఉంది. ఆ మార్గంలో పాసింజర్ రైలు ఏర్పాటు చేయాలి. దీనవల్ల రెండు లక్షల మంది రైల్వే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. బాపట్లలో వెయిటింగ్ హాల్ అవసరం బాపట్ల స్టేషన్లో ఏవీటీఎంలను రెండు, మూడు ప్లాట్‌ఫారాలపై ఏర్పాటు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్.. ప్రయాణికులకు వెయిటింగ్ హల్ ఏర్పాటు చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విన్నవించారు. అలాగే వాహనాల పార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని వినతులు ఇవి.. ► వేమూరు నియోజకవర్గం వలివేరు గ్రామంలో హాల్టింగ్ రైల్వేస్టేషన్ ను పునరుద్ధరించాలి. ► వేమూరు రైల్వేస్టేషన్ నందు గలం రైల్వే పార్కు పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలి. ► చీరాల సమీపంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ గ్రీనరీగా మార్చాలి. ► సంతనూతలపాడు నియోజకవర్గం అమ్మనబ్రోలు గ్రామం రైల్వేస్టేషన్ నందు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్‌ను పునరుద్ధరించాలి. ► చీరాల నియోజకవర్గం పైర్ ఆఫీసు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. ► వేటపాలెం రైల్వేస్టేషన్ నందు బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. డెమో రైలు వద్దు మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ► అలాగే లెవెల్ క్రాసింగ్స్ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి.. ► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. ► సికింద్రాబాద్–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి. ► నల్లపాడు–నంద్యాల సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి. ► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి. ► మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ► అలాగే లెవెల్ క్రాసింగ్స్ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి.. ► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. ► సికింద్రాబాద్–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి. ► నల్లపాడు–నంద్యాల సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి. ► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి. -
రైల్వేలో మ్యాన్ ఆఫ్ ద మంత్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: కర్తవ్య నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ.. అవాంఛనీయ పరిస్థితులను అధిగమించడంలో అప్రమత్తంగా వ్యవహరించిన 13 మంది ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ‘మ్యాన్ ఆఫ్ ద మంత్’అవార్డులను ప్రదానం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత, రైళ్ల సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రైలు పట్టాల పునరుద్ధరణ, సిగ్నల్ వ్యవస్థ, వెల్డింగ్ వైఫల్యాలపై దృష్టి పెట్టి అవాంఛనీయ సంఘటనలకు తావీయకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రతకు సంబంధించిన విషయాల్లో గేట్మెన్, ట్రాక్‌మెన్, లోకో పైలట్లు, గార్డులకు అవగాహన కల్పించి రైళ్లు సాఫీగా నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నడుస్తున్న రైళ్లలో, స్టేషన్లలో అగ్నిమాపక వ్యవస్థను పరిశీలించి అగ్ని ప్రమాదాలు జరగకుండా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ కె.వి.శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వై జర్ (పీఎఫ్ఏ) బ్రజేంద్ర కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎన్.వి.రమణారెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డెరైక్టర్ టి.జె.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట - కరీంనగర్ రైల్వే లైన్‌కు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్ : కాజీపేట నుంచి కరీంనగర్‌కు నేరుగా రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ప్రస్తుతం కాజీపేట నుంచి కరీంనగర్ వెళ్లేందుకు పెద్దపల్లి మార్గంలో రైల్వే లైన్ ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. కాజీపేట నుంచి వయా హుజురాబాద్ మీదుగా కరీంనగర్‌కు రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధ్యయనం చేయనున్నట్లు ఎంపీ వినోద్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్‌తో తెలంగాణ ఎంపీలు బుధవారం సమావేశమై కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ర్టానికి రైల్వే కేటాయింపుల ప్రాధాన్యాలు, పెండింగ్ పనులపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కే కేశవరావు, నగేష్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. రైల్వే జీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలని నెరవేర్చాలని రైల్వే జీఎంను కోరినట్లు వినోద్ తెలిపారు. తెలంగాణలో మూడు రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్తపల్లి - మనోహరాబాద్ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌ను ఎలక్ట్రిఫికేషన్ చేయాలని కోరామని తెలిపారు. ఇందుకు టెండర్లు కూడా పిలిచినట్లు లిఖితపూర్వంగా రైల్వే జీఎం సమాధానం ఇచ్చారని చెప్పారు. ఈ మార్గాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేస్తే మెమో, లోకల్ రైళ్లు తిరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తక్కువగా ఉన్నాయని వినోద్ తెలిపారు. ఈ క్రమంలో రైల్వే లైన్ల కిలోమీటర్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో ముందు ఉందని పేర్కొన్నారు. కానీ సమస్యల పరిష్కారంలో దక్షిణ మధ్య రైల్వే ఆలస్యం చేస్తున్నదని తెలిపారు. 1997లో నల్లగొండ - మాచర్ల మధ్య లైన్ మంజూరైనప్పటికీ.. 20 ఏండ్లు అయినా పనులు ప్రారంభం కాలేదని ఎంపీ గుర్తు చేశారు. పగిడిపల్లి - నల్లపాడు డబ్లింగ్ పనుల గురించి అడిగితే కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. జగ్గయ్యపేట - మేళ్లచెర్వు గూడ్స్ మార్గాన్ని ప్యాసింజర్ లైన్‌గా మార్చాలని రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశామని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
దయచేసి చెప్పండి!
► నేడు ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం ► పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించాలి ► నిధుల సాధనకు ప్రయత్నించాలి ► కీలక భేటీకి బందరు ఎంపీ డుమ్మా! పుష్కరాలకు మాత్రమే పని చేసే శాటిలైట్ స్టేషన్లు... ఏళ్ల తరబడి కొనసాగుతున్న డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు... కొలిక్కిరాని ఖాజీపేట–చెన్నై మూడో లైను మార్గం... అటకెక్కిన రైల్‌నీర్ ప్రాజెక్టు... పేదలకు అక్కరకురాని జన్ ఆహార్... విజయవాడలో కొనసాగుతున్న అవుటర్ కష్టాలు... బందరు పోర్టు, రాజధానికి నూతన రైలు మార్గాల ఏర్పాటు... ఇలా అనేక సమస్యలు విజయవాడ రైల్వే డివిజన్లో నెలకొన్నాయి. స్టేషన్లలో వసతులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలో రైల్వే జీఎం జోన్ పరిధిలోని ఎంపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మన ఎంపీలు, అధికారులు డివిజన్లోని సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులను జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ) : దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తుంది. ఈ డివిజన్లో 2016–2017వ ఆర్థిక సంవత్సరంలో రూ.4వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నిత్యం విజయవాడ మీదుగా 350కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 400 వరకూ గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత గల డివిజన్‌ను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. పాలకులు పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపివేయడంతో డివిజన్‌కు మరింత అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం రైల్వే జీఎంతో పార్లమెంట్ సభ్యుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. శాటిలైట్ స్టేషన్ల ఊసేలేదు విజయవాడ మెయిన్ స్టేషన్‌పై భారం తగ్గించేందుకు గుణదలను శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తామని కొన్నేళ్ల కిందట ప్రకటించారు. ఆ తర్వాత రోడ్డు కనెక్టివిటీ ఉంటేనే గుణదల స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కృష్ణా పుష్కరాల సమయంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోట్లాది రూపాయలతో గుణదల, రాయనపాడు, కృష్ణాకెనాల్ జంక్షన్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించారు. పుష్కరాల అనంతరం ఈ స్టేషన్లను పట్టించుకోవడం లేదు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన నేపథ్యంలో ఈ స్టేషన్లను అభివృద్ధి చేసి కొన్ని రైళ్లను అక్కడ నిలిపితేవిజయవాడ మెయిన్ స్టేషన్ రద్దీని కొంత మేరకు నివారించవచ్చు. నత్తనడకన మూడో రైలు మార్గం పనులు ఖాజీపేట–చెన్నై మూడో రైలు మార్గాన్ని 2012 బడ్జెట్లో ప్రకటించారు. నిధుల కొరత కారణంగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ లైను నిర్మాణానికి రూ.1,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అయితే సర్వే నిమిత్తం కోటి రూపాయిలు మాత్రమే విడుదల చేయడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ లైను నిర్మాణం పూర్తయితే ప్రతిపాదిత బుల్లెట్ రైళ్లు నడపవచ్చు. ఇవి గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో విజయవాడ మెయిన్ స్టేషన్లో ట్రాఫిక్ తగ్గడమే కాకుండా చెన్నై, హైదరాబాద్ నగరాలకు గంటన్నర వ్యవధిలోనే చేరుకోవచ్చు. అటకెక్కిన రైల్ నీర్ ప్రాజెక్టు రైల్వే బడ్జెట్–2012లో విజయవాడకు ప్రకటించిన రైల్ నీర్ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్న చందంగా మారాయి. కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి అన్ని శాఖల నుంచి అనుమతులు లభించాయి. అయితే లీజు విషయంలో వివాదం కారణంగా ప్రాజెక్టు అటకెక్కింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది. జన్ ఆహార్ను విస్తరించాలి పేద, మధ్య తరగతి ప్రయాణికులకు తక్కువ ధరకు ఆహారాన్ని అందించేందుకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ జన్ ఆహార్ పథకం ప్రవేశపెట్టారు. ప్రారంభ సమయంలో దశల వారీగా డివిజన్లోని ఇతర స్టేషన్లకు విస్తరిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు విస్తరణకు నోచుకోలేదు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జన్ ఆహార్ స్టాళ్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. వేధిస్తున్న ఇంజిన్ల కొరత డివిజన్లో రైలు ఇంజిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన అనంతరం ఒక్కో ఇంజిన్‌కు ఓవర్ హాలింగ్‌కు పంపాలి. ఇంజిన్ల కొరత నేపథ్యంలో తుప్పు పట్టిన ఇంజిన్లనే ప్రయాణికుల రైళ్లకు వాడుతున్నారు. దీని వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఉద్యోగాల భర్తీ ఊసే లేదు డివిజన్లోని వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం డివిజన్లో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. సిబ్బంది కొరత వల్ల ఆ ప్రభావం ప్రయాణికుల సేవలపై పడుతోంది. వాణిజ్య, భద్రత విభాగాల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. నేను సమావేశానికి వెళ్లడం లేదు : ఎంపీ కొనకళ్ల రేపల్లె–బాపట్ల–ఒంగోలు వరకు మచిలీపట్నం రైలు మార్గానికి లింకు కలపాలని తాను ప్రతిపాదించినట్లు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 9వ తేదీన విజయవాడలో జరగనున్న రైల్వే శాఖ సమీక్షా సమావేశానికి తాను హాజరుకావడం లేదని చెప్పారు. అయితే ఈ సమవేశంలో చర్చించేందుకు తాను ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఒత్తిడి చేయాలి పెండింగ్ ప్రాజెక్ట్‌ల కోసం రైల్వే బోర్డుపై పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తేవాలి. గతంలో ఇటువంటి సమావేశాలు తూతూ.. మంత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. డివిజన్‌కు ఒక్క ప్రాజెక్టు సాధించలేకపోయారు. విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. రాజధాని నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తూంటారు. వారి ప్రయాణ నిమిత్తం విజయవాడ–గుంటూరు మధ్య మరిన్ని సర్క్యులర్ రైళ్లను నడపాలి. – జీఎన్ శ్రీనివాసరావు, రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి డివిజన్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కల్పించేందుకు పార్లమెంట్ సభ్యులంతా కృషి చేయాలి. ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దాదాపు 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రాజధాని నేపథ్యంలో విజయవాడ నుంచి అన్ని ప్రధాన నగరాలకు రైళ్లను నడపాలి. విజయవాడ–గుడివాడ, మచిలీపట్నం–నరసాపురం, డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి. కొత్తగా బందరు పోర్టు ఏర్పాటు కానుండటంతో పనులు వేగంగా చేపట్టాలి. – బండ్రెడ్డి వెంకట చలపతిరావు, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ కార్యదర్శి -
పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన రైల్వే జి.ఎం
విజయవాడ (రైల్వేస్టేçÙన్) : కృష్ణా పుష్కరాలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు తరలి రానున్న నేపథ్యంలో విజయవాడ స్టేషన్లో చేసిన ఏర్పాట్లను రైల్వే జి.ఎం కె.రవీంద్రగుప్తా బుధవారం పరిశీలించారు. పార్శిల్ కార్యాలయం, తారాపేట టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన పుష్కర నగర్లను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల వసతి, తాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డి.ఆర్.ఎం అశోక్‌కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావు, సీనియర్ డీ.సి.ఎం షిఫాలి, ఇన్చార్జ్ పి.ఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్, స్టేషన్‌మేనేజర్ సి.హెచ్.సురేష్‌లు పాల్గొన్నారు. -
అనంత రైల్వే కేంద్రంలో రైల్వే జీఎం తనిఖీలు
-
ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు
-
ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలులో ఆయన ప్రయాణించి, ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై జీఎంకు పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోదశ ఎంఎంటీఎస్ పనులు ప్రారంభమయ్యాయని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం ఇప్పటికే 817 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రక్షణ శాఖతో సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరించుకుని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. -
ఈసారైనా న్యాయం జరిగేనా?
మంచిర్యాల టౌన్ : పారిశ్రామికంగా, ఆర్థికంగా తూర్పు జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నా రైల్వే బడ్జెట్లో మాత్రం ప్రతీసారి అన్యాయం జరుగుతోంది. జిల్లా తూర్పులో మంచిర్యాల రైల్వేస్టేషన్ తలమానికంగా ఉన్నా సమస్యలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో జిల్లాకు న్యాయం చేయాలని ఎంపీలు ప్రతిపాదనలు రూపొందించారు. బుధవారం హైదరాబాద్‌లో రైల్వే జీఎం శ్రీవాస్తవతో తెలంగాణ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశం కాగా వారివారి ప్రతిపాదనలు జీఎం ముందుంచారు. 2015-16 రైల్వే సాధారణ బడ్జెట్లోనైనా తూర్పు ప్రాంతానికి, రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే అవకాశాలు ఏమైనా ఉంటాయా అన్న సందిగ్ధం నెలకొంది. ఈక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ రైల్వే జీఎం దృష్టికి పలు ప్రతిపాదనలు తీసుకువెళ్లారు. ఈ రైల్వే బడ్జెట్లో తూర్పునకు ఏ మేర ప్రాధాన్యత లభిస్తుందో చూడాలి. రైల్వే జీఎం శ్రీవాస్తవను పెద్దపల్లి నుంచి బెల్లంపల్లి వరకు రైల్లో ప్రయాణించాలని ఎంపీ సుమన్ ఆహ్వానించడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. -
బహిరంగ మల విసర్జన చేసే భారీ జరిమానా
గుంటూరు : రైల్వేస్టేషన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని రైల్వే జీఎం పికె శ్రీవాత్సవ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రైల్వేస్టేషన్లలో బహిరంగంగా మల విసర్జన చేసే భారీ జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. పరిశుభ్రతపై త్వరలో రైల్వే చట్టాల్లో మార్పులు తీసుకు వస్తామని రైల్వే జీఎం తెలిపారు. కాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 32 రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతను 450 సిసిటివిల ద్వారా పర్యవేక్షించే వ్యవస్ధను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశ రైల్వే చరిత్రలో 32 పెద్ద రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతను చేపట్టడం, సిసిటివీల ద్వారా పర్యవేక్షించడం ఇదే ప్రథమం.