
సాక్షి, హైదరాబాద్: రాయగిరి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ రైలును జనగామ వరకు పొడిగించాలని, ప్యాసింజర్ రైలు (ఎంఈఎంయూ)ను ఫలక్‌నుమా నుంచి భువనగిరి దాకా విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను ఆపడంతోపాటు పలు సమస్యలు పరిష్కరించాల న్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎంను కలసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.