MMTS
-
నేటి నుంచి ఎంఎంటీఎస్ కొత్త టైంటేబుల్
సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్ కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 88 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్– మేడ్చల్, ఫలక్‌నుమా– ఉందానగర్, ఘట్కేసర్– లింగంపల్లి మధ్య కొత్తగా ఎంఎంటీఎస్ సేవలు విస్తరించాయి. ఈ మేరకు వివిధ మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల వేళల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులకు సంబంధించిన సమాచారం అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటుందన్నారు. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు. సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. -
కాజీపేటలోనే ఎంఎంటీఎస్ కోచ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయి. ఇక్కడే కాకుండా, ముంబై లోకల్ రైల్ సర్వీసులకు అవసరమైన కోచ్‌లను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇటీవలే కోచ్ తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లతో పాటు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ)లను కూడా తయారు చేయనున్నారు. ఫ్యాక్టరీ సిద్ధమైన వెంటనే ఈఎంయూల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.తొలుత నెలకు 24 కోచ్‌ల ఉత్పత్తి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకల్ రైళ్లుగా ఈఎంయూ కోచ్‌లతో కూడిన రేక్స్‌ను వినియోగి స్తున్నారు. ప్రధాన నగరాలకు చేరువగా ఉన్న అన్ని రూట్లను దాదాపు విద్యుదీకరించడంతో వీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్‌లోని మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్)లో వాడుతున్న కోచ్‌లు కూడా ఈఎంయూలే. ఈ కోచ్‌లలోనే లోకోమోటివ్ అంతర్భాగంగా ఉంటుంది. ఇవి పుష్–పుల్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఎక్కువగా ముంబైలో లోకల్ రైళ్లుగా, చెన్నై శివారులో సబర్బన్ రైళ్లుగా వినియోగిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈఎంయూ కోచ్‌లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు.వందే భారత్‌కు డిమాండ్ పెరగటంతో..దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నందున ఐసీఎఫ్‌లో వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తిని పెంచారు. దీనితో అక్కడ ఈఎంయూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ మేరకు ఇతర కోచ్ ఫ్యాక్టరీలలో వాటిని ఉత్పత్తి చేయనున్నారు. కాజీపేటలో సిద్ధమవుతున్న కోచ్ తయారీ కేంద్రానికి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 16 ఎంఎంటీఎస్ రేక్స్ నడుస్తున్నాయి. 12 కోచ్‌లతో కూడిన రైలును ఒక రేక్ అంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ విస్తరణ నేపథ్యంలో మరిన్ని రేక్స్ అవసరం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయితే ఇంకా వినియోగం పెరుగుతుంది.అప్పటికల్లా కాజీపేట ఫ్యాక్టరీ సిద్ధంకానుండటంతో.. ఆ కోచ్‌లను ఇక్కడే తయారు చేయనున్నారు. దేశంలో ఎక్కువ ఈఎంయూలను వాడుతున్నది ముంబై లోకల్ రైల్వే వ్యవస్థ. అక్కడ ప్రస్తుతం నిత్యం 191 రేక్స్ 2,500కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ముంబైకి కూడా కాజీపేట నుంచే ఈఎంయూ కోచ్‌లు సరఫరా కానున్నాయి. నెలకు 24 కోచ్‌ల (రెండు రేక్స్) సామర్థ్యంతో యూనిట్ ప్రారంభం కానుంది. తర్వాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. -
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుపై ప్రయాణికుల సంఘాలు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఏ రైలు ఎపుడొస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఎందుకు రద్దవుతుందో తెలియదు. నగరానికి లైఫ్‌లైన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్‌పైన నిర్లక్ష్యమెందుకు’ అంటూ రైల్వే ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపైన దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ప్రయాణికుల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో నడుస్తున్న ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకల పట్ల వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతే కుమార్ జైన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ లోకేష్ విష్ణోయ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు సికింద్రాబాద్‌లోని సంచాలన్‌భవన్, హైదరాబాద్ భవన్లలో ప్రయాణికుల సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ, జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్, అమ్ముగూడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానందపురం వెల్ఫేర్ అసోసియేషన్, దక్షిణ మధ్య రైల్వే రైల్ ఫ్యాన్స్ అసోసియేషన్, తదితర సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సకాలంలో రైళ్లు నడపాలి.. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు, మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు గతేడాది సర్వీసులను ప్రారంభించారు. కానీ ఈ రూట్లలో ప్రతి రోజు రైళ్లు రద్దవుతున్నాయి. పైగా ఏ ట్రైన్ ఎప్పుడొస్తుందో తెలియదు. మధ్యాహ్నం సమయంలో నడిపే రైళ్ల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఉండే సమయాల్లోనే రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. ఈ రూట్లో సకాలంలో రైళ్లు నడపాలని జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి నూర్ కోరారు. ఉదయం 9 గంటలకు రావలసిన ట్రైన్ 11 గంటలకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోవైపు మల్కాజిగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది కాలనీలకు సిటీబస్సుల కంటే ఎంఎంటీఎస్ ఎంతో ప్రయోజనంగా ఉంటుందని భావిస్తే ఈ రూట్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు రైళ్లు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయిందని అమ్ముగూడ, రాఘవేంద్రనగర్ కాలనీలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రీ సర్వే.. రంగంలోకి సర్వేయర్లు ‘హైలైట్స్’ పునరుద్ధరించాలి... ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందజేసే ‘హైలైట్స్’ మొబైల్ యాప్ సేవలను పునరుద్ధరించాలని ప్రయాణికుల సంఘాలు కోరాయి. చిన్న చిన్న కారణాలతో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడం పట్ల కూడా ప్రయాణికుల సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా కూడా రైళ్లను రద్దుచేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సంఘాల నుంచి వచ్చిన సమస్యలను, సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్ధనలను పరిశీలించిన అనంతరం, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని దక్షిణమధ్యరైల్వే జనరల్మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
నిమజ్జనానికి ఎంఎంటీఎస్ స్పెషల్స్
హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఈ రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్–నాంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి. నాంపల్లి–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–సికింద్రాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. -
యాదాద్రికి ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఉన్న 33 కిలోమీటర్ల మార్గంలో ఇప్పుడున్న రెండు లైన్లతో పాటు ఎంఎంటీఎస్ కోసం మరోలైన్ అదనంగా నిర్మించనున్నారు. వాస్తవానికి ఎంఎంటీఎస్ రెండోదశ కింద 2016లోనే ఈ ప్రాజెక్టు చేపట్టారు. కానీ రాష్ట్రప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర జాప్యం నెలకొంది. రూ.330 కోట్లతో అప్పట్లో అంచనాలు రూపొందించారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.430 కోట్లకు చేరింది. రైల్వేశాఖ వందశాతం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. రైల్ వికాస్‌నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయి. జీఎం సమీక్ష దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, ఆర్వీఎన్ఎల్ చీఫ్‌ప్రాజెక్ట్ మేనేజర్ మున్నాకుమార్, సికింద్రాబాద్ డీఆర్ఎం ఏకే గుప్తాలతో కూడిన ఉన్నతాధికారుల బృందం గురువారం యాదాద్రి రైల్వేస్టేషన్‌ను సందర్శించింది. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలు, కొత్తగా నిర్మించాల్సిన ఎంఎంటీఎస్–2 లైన్, తదితర పనులపైన జీఎం సమీక్షించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి స్టేషన్లు, యార్డులలో అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతమున్న రైల్వేస్టేషన్లో నూతనంగా నిర్మించిన ప్లాట్‌ఫాం, స్టేషన్ ఇతర వసతుల కోసం స్థలాన్ని జీఎం పరిశీలించారు. ప్రస్తుతం గుట్టవైపు ఉన్న స్టేషన్‌కు ఎదురుగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి అనువుగా ఉన్నట్టు గుర్తించారు. యాదాద్రి క్షేత్ర ఆలయ నమూనాతో రైల్వేస్టేషన్ ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని, రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించాలని, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాసిన వినతిపత్రాన్ని జీఎంకు భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందజేశారు. జీఎం ముందుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. యాదాద్రి పునరాభివృద్ధి అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రి రైల్వేస్టేషన్‌ను పునరాభివృద్ధి చేయనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఎంఎంటీఎస్ –2 లైన్ కోసం స్టేషన్ తూర్పు వైపున విస్తరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ స్టేషన్ అభివృద్ధికి రైల్వేశాఖ నిధులు కేటాయించిన దృష్ట్యా అమృత్‌భారత్ పథకం కింద పడమర వైపున కూడా స్టేషన్ అభివృద్ధి చేస్తామని, టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. ప్లాట్ ఫామ్‌ల పైకప్పు నిర్మాణం, ప్రధాన ముఖద్వార అభివృద్ధితో పాటు స్టేషన్ భవనాన్ని మెరుగుపరచనున్నట్టు తెలిపారు. ఎంఎంటీఎస్‌తోపాటు, స్టేషన్ అభివృద్ధి వల్ల యాదాద్రికి భక్తులు అతి తక్కువ చార్జీల్లోనే వెళ్లవచ్చన్నారు. -
HYD: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 28 రైళ్లు రద్దు
సికింద్రాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 19(సోమవారం) నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, హైదరాబాద్ జంటనగరాల్లో ప్రజలకు సర్వీసులందించే 23 ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటనలో స్పష్టంచేశారు. వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. అయితే, 28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గుంతకల్-బోధన్ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లో 23 ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. రైళ్ల రద్దను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. Cancellation / Partial Cancellation / Rescheduling of Train @drmhyb @drmsecunderabad pic.twitter.com/KXdebBaGpq — South Central Railway (@SCRailwayIndia) June 18, 2023 ఇది కూడా చదవండి: మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం -
జంటనగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
-
కేసీఆర్ సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది
-
ఎంఎంటీఎస్ కొత్త రూట్‌తో వారికి నిరాశే! హైటెక్ సిటీకి వెళ్లాలంటే కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులను ఎంతో ఊరించిన ఎంఎంటీఎస్ కొత్త రూట్ అరకొర కనెక్టివిటీతో ఉస్సూరుమనించే అవకాశం కనిపిస్తోంది. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే ఇది పరిమితం కానుంది. ఈ నెల 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఉందానగర్–ఫలక్‌నుమా మధ్య కూడా రైళ్లను ప్రారంభించనున్నారు. కానీ మేడ్చల్, మల్కాజిగిరి వాసులు హైటెక్‌సిటీ, లింగంపల్లి వైపు వెళ్లాలంటే సికింద్రాబాద్‌లో మరో రైలు మారాలి. ఇది కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. మరో ట్రైన్ కోసం సికింద్రాబాద్‌లో పడిగాపులు కాయాల్సి ఉంటుంది. మేడ్చల్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం సికింద్రాబాద్ వరకే పరిమితం చేసినట్లు సమాచారం. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు మేడ్చల్, సుచిత్ర, కొంపల్లి, అల్వాల్, నేరేడ్మెట్, సైనిక్‌పురి, బొల్లారం, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వైపు రాకపోకలు సాగిస్తున్నారు. వారంతా సిటీ బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. మేడ్చల్ వాసులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అరకొర కనెక్టివిటీ వల్ల పాక్షిక సదుపాయంగానే మిగలనుందనే భావన కలుగుతోంది. ఉందానగర్ నుంచి ఉన్నా... ● పాలు, కూరగాయలు తదితర వస్తువులను విక్రయించే చిరువ్యాపారులు ఉందానగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. మేడ్చల్, మల్కాజిగిరి వైపు రాకపోకలు సాగించేవారు ఉన్నారు. ఉందానగర్, ఫలక్‌నుమా నుంచి వచ్చేవారు. లేదా మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు సికింద్రాబాద్‌లో దిగి మరో రైలు మారాలి. దీంతో ఈ రూట్లోనూ ఇది అరకొర సదుపాయమే కానుంది. ● అలాగే ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు ఇప్పట్లో రైళ్లు అందుబాటులోకి రాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో కొత్తగా రెండు రూట్లలో ఏకంగా ప్రధాని చేతుల మీదుగా రైళ్లను ప్రారంభించనున్నప్పటికీ వందశాతం కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండకపోగా, అలంకారప్రాయంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెల్లాపూర్ రూట్ తెల్లారినట్టే.. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా తెల్లాపూర్– బీహెచ్ఈఎల్ మధ్య కొత్తగా లైన్లను నిర్మించి రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కానీ లింగంపల్లి నుంచి తెల్లాపూర్ మీదుగా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున రెండు సర్వీసులు మాత్రమే నడిపారు. దీంతో ప్రయాణికులు పెద్దగా వినియోగించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆ రూట్లో రైళ్లు తిరగడం లేదు. ఇలా అయితే ఎంతో మేలు.. ఉత్తరం వైపు ఉన్న మేడ్చల్ నుంచి పడమటి వైపున ఉన్న లింగంపల్లి వరకు సుమారు 50 కిలోమీటర్ల వరకు రైళ్లను నడపడం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దక్షిణం వైపున ఉన్న ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లికి రైళ్లను నడిపితే ఈ రూట్లో కనెక్టివిటీ పెరుగుతుంది. నగరంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పడమటి వైపు ఉన్నప్రాంతాలతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసినట్లవుతుంది.మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు నేరుగా రైళ్లను ఏర్పాటు చేస్తే ఉత్తర– దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. -
త్వరలో కాజీపేట ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణలోని రైల్వేల అభివృద్ధికి రూ. 4,418 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2009–14 మధ్య ఉమ్మడి ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు కేవలం రూ.886 కోట్లు కేటాయింపులు జరగ్గా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు రూ. 12,800 కోట్లు కేటాయించామన్నారు. శుక్రవారం ఢిల్లీలోని రైల్ భవన్లో అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కాజీపేటలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కాజీపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెండర్లను పిలిచామని... త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందులోనే పీరియాడిక్ ఓవర్‌హాలింగ్, రిపేర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఉన్నాయన్నారు. దేశంలో వ్యాగన్ ఓవర్ హాలింగ్‌కు డిమాండ్ ఉందని... కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఓవర్ హాలింగ్లకు మధ్య పెద్ద తేడా ఉండదన్నారు. అందువల్ల కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే దేశంలో చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పారు. విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కాగా, కాజీపేటలో నెలకు 250 రైల్వే వ్యాగన్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి వాటి జీవితకాలాన్ని పెంచుతారు. దీనివల్ల దాదాపు 1,500 మందికి ఉపాధి కలుగుతుందన్న అంచనాలున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే సహకరించడం లేదన్న విమర్శలను అశ్వనీ వైష్ణవ్ కొట్టిపారేశారు. ఈ ఏడాది బడ్జెట్లో ఎంఎంటీఎస్‌కు రూ. 600 కోట్లు కేటాయించామని... ఎంఎంటీఎస్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వమే సహకరించట్లేదని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం చేయాల్సింది చేస్తుందని... మొదట ఎంఎంటీఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల తరహాలో 50 నుంచి 70 కి.మీ. దూరంలోని పట్టణాలను కలుపుతూ హైస్పీడ్ వందేభారత్ మెట్రో ప్రాజెక్టును త్వరలో పట్టాలెక్కించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు. -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ట్రైన్ ఎక్కిన తరువాత కూడా ఏ సమయానికి గమ్యం చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు సమయపాలనలో నెంబర్ వన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. మరోవైపు సరీ్వసుల సంఖ్యను సైతం భారీగా తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రైళ్ల నిర్వహణ కోసం ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నారు. దీంతో ఈ సరీ్వసుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రతి సర్వీసు ఆలస్యమే... ‘రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎంఎంటీఎస్‌కే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే’ లక్ష్యంతో ప్రారంభించిన ఈ లోకల్ రైళ్ల సేవలు క్రమంగా మసకబారుతున్నాయి. కోవిడ్ ప్రభావంతో కుదేలైన ఎంఎంటీఎస్ వ్యవస్థను పునరుద్ధరించి ఏడాది దాటినా ఇప్పటికీ ఈ రైళ్ల నిర్వహణ పట్టాలెక్కకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రతి సరీ్వసు అరగంట నుంచి గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎంఎంటీఎస్‌ను నమ్ముకొని ప్రయాణం చేశారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాలకు చెందిన వేలాది మంది ఈ సరీ్వసులకు దూరమయ్యారు. కేవలం సమయపాలన లేకపోవడం వల్లనే ఎంఎంటీఎస్‌లో ప్రయాణించలేకపోతున్నట్లు బాలకిషన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు.‘మధ్యాహ్నం 3 గంటలకు ఒక ట్రైన్ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు బయలుదేరితే సాయంత్రం 4.30 వరకు మరో ట్రైన్ అందుబాటులో ఉండదు. పైగా ఏ రైలు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.’ అని శేఖర్ అనే మరో ప్రయాణికుడు తెలిపారు.ఏదో ఒక విధంగా బేగంపేట్ వరకు చేరినా అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రావడానికే అరగంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు గంటలో చేరుకోవలసి ఉండగా ఒక్కోసారి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. భారీగా ట్రిప్పుల రద్దు.. కోవిడ్‌కు ముందుకు ప్రతి రోజు 121 సరీ్వసులు నడిచాయి. ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మధ్య ప్రతి రోజు 1.6 లక్షల మంది ప్రయాణం చేశారు. కోవిడ్ అనంతరం 75 నుంచి 100 సర్వీసులను పునరుద్ధరించారు. కానీ నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఈ రైళ్లపైన ప్రయాణికులు నమ్మకం కోల్పోయారు. దీంతో రైళ్ల సంఖ్య తగ్గింది. శని, ఆదివారాల్లో గంటకు ఒక రైలు కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రతి వారం 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అందుబాటులో ఉండే రైళ్ల సంఖ్య చాలా తక్కువ. సికింద్రాబాద్‌పై ఒత్తిడి.. మరోవైపు ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్ల రాకపోకలతో ఈ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో పండుగ రద్దీ కారణంగా రెండు రోజులుగా ప్లాట్‌ఫామ్‌లపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎంఎంటీఎస్‌లు నిలిపేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. -
రైళ్లలో సాహసాలు చేస్తే ఇకపై అంతే సంగతులు
చెన్నై: చెన్నైలోని ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ రైళ్లలో వీరంగం సృష్టించినా, సాహసాలు ప్రదర్శించినా కటకటాల్లోకి నెడుతామని విద్యార్థులకు పోలీసులు హెచ్చరించారు. రైళ్లలో కొందరు విద్యార్థుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రైలు బయలుదేరే సమయంలో పరుగులు తీయడం, ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం, రైలు కిటికీలను పట్టుకుని వేలాడటం వంటి సాహసాలు చేసే వాళ్లు ఎక్కువే. అలాగే గ్రూపు తగాదాలకు నెలవుగా కూడా రైల్వే స్టేషన్లు మారాయి. ఈ క్రమంలో విద్యార్థులకు హెచ్చరికలు చేస్తూ రైల్వే, పోలీసు యంత్రాంగం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ రైళ్లల్లో, స్టేషన్లలో అకతాయి తనంతో వ్యవహరించినా, ఇష్టారాజ్యంగా వీరంగం సృష్టించినా, సహసాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, మార్గాల్లో నిఘా ఉంచుతామని తెలిపారు. పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: (అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష) -
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలు ఇవిగో..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల14వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు లేకపోవడంవల్ల ఈ మేరకు ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి, తదితర రూట్లలో నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. పలు రైళ్లు రద్దు.. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని తాటిచెర్ల–జంగాలపల్లి డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు గురువారం తెలిపారు. గుంతకల్–హిందూపూర్ డెమూ రైలు 12 నుంచి 19 వరకు, హిందూపూర్–గుంతకల్ డెమూ రైలును 13 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. తిరుపతి–గుంతకల్ రైలు ఈ నెల 12 నుంచి 19వ వరకు ధర్మవరం–గుంతకల్ మీదుగా, గుంతకల్–తిరుపతి రైలు ఈ నెల 12 నుంచి 19 వరకు గుంతకల్–ధర్మవరం మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. (క్లిక్: ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ.. పదివేలు దాటినా సీఎస్సీ పక్కా) -
ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో మరో సదుపాయాన్ని కల్పించారు. ఫస్ట్‌క్లాస్ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్లో సబర్బన్ రైలు సర్వీసుగా సేవలందజేస్తున్న ఎంఎంటీఎస్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రతి సింగిల్ రూట్ ప్రయాణంలో ఈ రాయితీ వర్తిస్తుందని ద.మ.రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు గ్రేటర్‌లోని సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్– లింంగంపల్లి–రామచంద్రాపురం, నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం, ఫలక్‌నుమా– నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం నుంచి తెల్లాపూర్ వరకు 29 స్టేషన్ల మీదుగా ప్రస్తుతం 86 సర్వీసులు నడుస్తున్నాయి. (క్లిక్: పక్కాగా ప్లాన్.. కథ మొత్తం కారు నుంచే..) 50 కిలోమీటర్లకుపైగా ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది. రోజుకు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, తదితర సుమారు 30 శాతం రెగ్యులర్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ( ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు) -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినప్పటికీ ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో సర్వీసులు రద్దయ్యాయి. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్ సర్వీసులను గణనీయంగా పెంచారు. ఐటీ సంస్థలు చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపై ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్ధరాత్రి వరకూ సర్వీసులు.. కోవిడ్ కారణంగా రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు. ఇక నుంచి తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. గతేడాది జూన్ 21 నుంచే దశలవారీగా ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని యథావిధిగా అర్ధరాత్రి వరకూ నడపాలని అధికారులు నిర్ణయించారు. ► ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడుస్తున్నాయి. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్లకు పైగా సర్వీసులను విస్తరించారు. చార్జీలు తక్కువ... ►ప్లాట్‌ఫాం చార్జీల కంటే తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ సదుపాయం లభించనుంది. సాధారణంగా సిటీ బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు రూ.40 వరకు చార్జీ ఉంటే ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం రూ.15. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తదితర వాహనాల కంటే తక్కువ చార్జీలతో ఎక్కువ వేగంతో నగరం నలువైపులా అందుబాటులో ఉన్న సర్వీసులను వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ కోరారు. టికెట్ బుకింగ్ కౌంటర్లతో పాటు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు. -
ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రీజినల్ రింగ్‌రోడ్డు(ట్రిపుల్ ఆర్) ప్రాజెక్ట్ చుట్టూ ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని వేయగలిగితే అది దేశంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్‌గా మారుతుందని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. సవివరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకొస్తే రైల్వే అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తాను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కలసి ప్రధాని నరేంద్రమోదీ వద్ద దీనిపై చర్చిస్తామని చెప్పారు. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ అయినందున ఇప్పటికిప్పుడు దానిపై ప్రకటన సాధ్యంకాదని స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతల సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆలోచన బాగుందని బండి సంజయ్, సీహెచ్ విఠల్ తదితర నేతలు పేర్కొన్నారు. రైల్వేమంత్రి స్పందించి ట్రిపుల్ ఆర్ వెడల్పు ఎంతని అడగగా వంద మీటర్లని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బదులిచ్చారు. వంద మీటర్లలో రైల్వేశాఖకు 30 మీటర్లు కేటాయిస్తే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, డా.జి.మనోహర్‌రెడ్డి, కొల్లి మాధవి, జయశ్రీ, గూడూరు నారాయణరెడ్డి, రాకేశ్‌రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు. రాష్ట్రవాటా చెల్లించడంలేదు.. హైదరాబాద్‌లోని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) పూర్తి చేయడానికి కేంద్రం మూడొంతుల నిధులు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడంలేదని రైల్వే మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూయూపీఏ హయాంలో రైల్వేకు సంబంధించి 2009–14 మధ్యలో ఉమ్మడి ఏపీకి ఏడాదికి రూ.886 కోట్లు కేటాయించగా, మోదీ ప్రభుత్వం 2014–19 మధ్యలో ఒక్క తెలంగాణకే ఏడాదికి రూ.1,110 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 2019లో రూ.2,056 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,048 కోట్లకు పెంచినట్లు తెలిపారు. 2009–14 మధ్యలో తెలంగాణలో ట్రాక్ డబ్లింగ్, ఇతర పనులు శూన్యంకాగా ఇప్పుడు 24 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయని, ఈ ఏడాది అవి రెట్టింపు కాబోతున్నాయని చెప్పారు. -
హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ కోసం కేంద్రం ఈసారి రూ.70 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొలిదశ విస్తరణ పనులను చేపట్టనున్నారు. రానున్న రెండేళ్లలో చర్లపల్లి టర్మినల్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ఈసారి కేంద్ర బడ్జెట్లో కొత్త రైళ్లు, లైన్లు, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. గతంలోనే ప్రతిపాదించిన చర్లపల్లికి మాత్రం ఈసారి నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.10 లక్షలు కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం తెలిపారు. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. చర్లపల్లి విస్తరణ ఇలా.. ► మొదటి దశలో రూ.54.58 కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నారు. రెండు సబ్‌వేలు, 3 ర్యాంప్‌లు, 6 చోట్ల మెట్ల మార్గాలను నిర్మిస్తారు. 5 చోట్ల బ్రిడ్జి పనులతో పాటు, 2 హైలెవల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనున్నారు. ► ఇప్పుడున్న అన్ని ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు, పొడవు పెంచుతారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించనున్నారు. మురుగునీటి కాల్వలు, ఇతర పనులను పూర్తి చేస్తారు. (క్లిక్: ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం) రెండో దశలో... ► సుమారు రూ.62.67 కోట్ల పనులను చేపట్టనున్న పనుల్లో భాగంగా చర్లపల్లి స్టేషన్ ప్రాంగణం విస్తరణ,సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్, స్టేషన్ నిర్వహణ షెడ్, తదితర పనులు చేపడతారు. ► 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు (వాటిలో 3 సబ్‌వేల కోసం, 6 ప్లాట్‌ఫామ్‌లపైన ఏర్పాటు చేస్తారు). కొత్తగా 4 పిట్లైన్లను నిర్మించనున్నారు. పార్శిల్ షెడ్, బయో టాయిలెట్, తదితర పనులు రెండో దశలో పూర్తి చేయనున్నారు. చర్లపల్లి స్టేషన్ విస్తరణ వల్ల ప్రతి రోజు కనీసం 100 రైళ్లను నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రోకు వైరస్ బ్రేక్) ఎంఎంటీఎస్‌కు నిధుల కొరత.. మరోవైపు రక్షణశాఖ పరిధిలో ఉన్న మౌలాలీ– సనత్‌నగర్ మార్గంలోని 5 కిలోమీటర్లు మినహాయించి ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయిందని జనరల్ మేనేజర్ తెలిపారు. నిధుల కొరత వల్ల రైళ్ల కొనుగోళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.129 కోట్లు మాత్రమే అందాయని, మరో రూ.760 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. పెండింగ్ నిధుల కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లబోదన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం దక్షిణమధ్య రైల్వే రూ.330 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల కొరతే కారణమని అధికారులు స్పష్టం చేశారు. (క్లిక్: సికింద్రాబాద్ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్) -
అయ్యో!.. ఎంఎంటీఎస్ రైలు ఎవరెక్కడం లేదా?
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు లేక ఎంఎంటీఎస్ రైళ్లు వెలవెలబోతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత ఈ రైళ్లను పునరుద్ధరించి 45 రోజులు దాటినప్పటికీ ప్రయాణికుల ఆదరణ కనిపించడం లేదు. రోజుకు 30 వేల మంది కూడా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవడం లేదు. సాధారణ రోజుల్లో 1.6 లక్షల మంది రాకపోకలు సాగించగా ఇప్పుడు మూడొంతుల మంది ఎంఎంటీఎస్‌కు దూరమయ్యారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల కంటే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులపైన పునరుద్ధరణ అనంతరం పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ప్రయాణికుల వినియోగం పెరగడం లేదు. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో గతేడాది నుంచి ఐటీ రంగం పునరుద్ధరణకు నోచకపోవడం వల్ల వివిధ మార్గాల్లో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి స్టేషన్ల మధ్య ప్రస్తుతం 45 నుంచి 50 ఎంఎంటీఎస్ సరీ్వసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో సగం వరకు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నట్లు రైల్వే అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 16 నెలల తర్వాత పట్టాలపైకి.. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 22వ తేదీన నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే 121 ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోయాయి. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో లోకల్ రైళ్లను చాలా రోజుల క్రితమే పునరుద్ధరించినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ఈ ఏడాది జూన్ 22వ తేదీన పునరుద్ధరించారు. 2003లో ఈ రైళ్లను ప్రారంభించిన అనంతరం మొట్టమొదటిసారి కోవిడ్ కారణంగా స్తంభించాయి. సుమారు 16 నెలల పాటు ఎంఎంటీఎస్ సేవలు ఆగిపోవడంతో నగరవాసులు దాదాపుగా ఈ రైళ్లను మరిచారు. ఇదే సమయంలో సొంత వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఐటీ రంగం పునరుద్ధరించకపోవడం వల్ల సికింద్రాబాద్–హైటెక్‌సిటీ, లింగంపల్లి–హైటెక్‌సిటీ మార్గంలో డిమాండ్ పూర్తిగా తగ్గింది. ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిరువ్యాపారులు, వివిధ వర్గాలు ఈ ఏడాదిన్నర కా లంలో చాలా వరకు సొంత వాహనాల వైపు మ ళ్లారు. దీంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు ఆదరణ తగ్గినట్లుగానే ఎంఎంటీఎస్ రైళ్లకు సైతం తగ్గింది. రద్దు దిశగా ఎంఎంటీఎస్ ► గతంలో రోజుకు 121 సరీ్వసులు నడిచేవి. ప్రస్తుతం 45 నుంచి 50 సరీ్వసులు మాత్రమే నడుస్తున్నాయి. ► ఈ సరీ్వసులకు సైతం ఆదరణ లేకపోవడం వల్ల సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను తగ్గించారు. ► ప్రతి ఆదివారం 10 రైళ్లను రద్దు చేస్తున్నారు. గ త మూడు వారాలుగా ఈ రద్దు కొనసాగుతోంది. కొరవడిన ప్రచారం ► దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణికుల సదుపాయాలపైన ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టినా విస్తృతంగా ప్రచారం చేస్తారు. వివిధ రూపాల్లో ఈ ప్రచారం కొనసాగుతుంది. 16 నెలల తరువాత పునరుద్ధరించిన ఎంఎంటీఎస్‌పైన ఆ స్థాయిలో ప్రచారం లేకపోవడం వల్లనే ప్రయాణికుల ఆదరణ లేదని ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. -
ఎంఎంటీఎస్ ప్రయాణీకులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సీజనల్ టిక్కెట్ల గడువును పొడిగించారు. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సరీ్వసులను బుధవారం నుంచి పాక్షికంగా నడుపనున్నారు. దీంతో గతేడాది రైళ్ల రద్దు కారణంగా చాలామంది ప్రయాణికులు తమ సీజనల్ టికెట్లను వినియోగించుకోలేకపోయారు. అలాంటి వారు నష్టపోయిన కాలాన్ని ప్రస్తుతం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మేరకు సీజనల్ టికెట్ల గడువును పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సీజనల్ టికెట్ ప్రయాణికులు బుధవారం నుంచి ఈ పొడిగింపు సేవలను పొందవచ్చు. అంటే సీజనల్ టికెట్ మిగిలిన రోజులను ఇప్పుడు వినియోగించుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకున్నా, కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన టికెట్లయినా ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ సీజనల్ టికెట్ పొడిగింపునకు ఎమ్ఎమ్టీఎస్/సబర్బన్ స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్ల వద్ద సంప్రదించాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ సూచించారు. యూటీఎస్‌ను వినియోగించుకోండి... ► ఎంఎంటీఎస్ ప్రయాణానికి బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేయడమే కాకుండా నగదు రహితంగా టికెట్లను పొందవచ్చు. ► అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న అటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లలో స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్లను పొందవచ్చు. ఈ టిక్కెట్లపైన 3 శాతం బోనస్ లభిస్తుంది. ► ఈ మేరకు తమ పాత స్మార్ట్ కార్డులను పునరుద్ధరించుకొనేందుకు ఎంఎంటీఎస్ స్టేషన్లలో సంప్రదించవచ్చు. ► అలాగే అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్) మొబైల్ యాప్ వినియోగించే వారు కూడా ఎంఎంటీఎస్ టికెట్లను పొంద వచ్చు. యూటీఎస్ నుంచి టిక్కెట్లు తీసుకొనేవారికి 5 శాతం బోనస్ లభిస్తుంది. ► కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కోరారు. చదవండి: ‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి -
హైదరాబాద్ లో వచ్చే వారం నుంచి ఎంఎంటీస్ రైళ్లు ప్రారంభం
-
తెలంగాణ బడ్జెట్: ‘గ్రేటర్’కు సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రోకు తాజా బడ్జెట్లో కాసుల వర్షం కురిసింది. మెట్రోకు రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించడంతో ఎంజీబీఎస్–పాత నగరం (5.3 కి.మీ), రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంలో మెట్రో కూత పెడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత మూడేళ్లుగా మెట్రోకు రాష్ట్ర సర్కారు మొండిచేయి చూపడంతో హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్ఎంఆర్) అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికుల వసతుల కల్పన ప్రాజెక్టులు అటకెక్కిన విషయం విదితమే. చివరకు హెచ్ఎంఆర్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు లేని దుస్థితి నెలకొన్న తరుణంలో తాజా బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. తొలి విడత మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్– ఫలక్‌నుమా మార్గంలో మెట్రో విస్తరణ పనులు నిధుల లేమి కారణంగా పట్టాలెక్కని విషయం విదితమే. రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తాజాగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో మొదలవుతాయని మెట్రో వర్గాలు తెలిపాయి. పట్టాలెక్కని ఎంఎంటీఎస్! ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు బడ్జెట్లో మొండిచెయ్యే దక్కింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల కొరతతో ఇప్పటికే చాలా చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని రూట్లలో రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ పూర్తయినా కొత్త రైళ్ల కొనుగోళ్లకు నిధులు లేక పట్టాలు అలంకారప్రాయంగా మారాయి. అయిదేళ్ల క్రితం రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.550 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు దశలవారీగా రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైల్వేశాఖ సొంత నిధులతోనే చాలావరకు పనులు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు లేక కొంతకాలంగా రైల్వేశాఖ సైతం చేతులెత్తేయడంతో పనులు స్తంభించాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు సైతం నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే సర్వే పూర్తయింది. ప్రగతిరథ చక్రం రయ్ రయ్ సిటీ బస్సుకు ఊరట లభించింది. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రెండేళ్లుగా ఆర్థిక నష్టాలతో పాటు ప్రయాణికుల ఆదరణను సైతం కోల్పోయిన ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పునర్వైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాటు, మరో రూ.1500 కోట్ల బడ్జెటేతర సహాయం అందజేయనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రతిపాదించిన 25 డబుల్ డెక్కర్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు సైతం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తాజా కేటాయింపులతో బస్సుల కొనుగోళ్లు వేగంగా జరిగే అవకాశం ఉంది. ‘ఆర్టీసీకి ఇది అన్ని విధాలా సానుకూల సమయం. సకాలంలోనే డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కుతాయి’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేటాయింపులతో కొత్త బస్సులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గ్రేటర్లో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడంతో పాటు ఇప్పుడు ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత ప్రగతి సాధించే అవకాశముంది. ‘మహా’ అత్తెసరు! హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో పాటు మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కైవే, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ర్యాంపులు, చెరువులు సుందరీకరణ, నెక్లెస్ రో డ్డులో అభివృద్ధి పనులు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ బడ్జెట్లో అభివృద్ధి కార్యకలాపాల కోసం కేవలం రూ.10 లక్ష లు మాత్రమే కేటాయించడం అధికారులను విస్మయపరిచింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా హెచ్ఎండీఏ సొంత ఆదాయంతోనే పనులను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రూ.900 కోట్లపైగా అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనులకు ఇక హెచ్ఎండీఏ అటు కోకాపేట, ఇటు మూసాపేట భూముల విక్రయాలపై వచ్చే ఆదాయమే ఆధారం కానుంది. 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు 2011 నుంచి ప్రతి ఏడాది బీఓటీ అన్యూటి పేమెంట్ రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు చెల్లిస్తోంది. 2016 నుంచి రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చిన హెచ్ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.440 కోట్లు చెల్లించింది. గతేడాది ఓఆర్ఆర్ బీవోటీ అన్యూటి పేమెంట్ల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి జైకా రుణం చెల్లింపుల కోసం రూ.478 కోట్లు అడిగితే రూ.472 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్‌తో రుణాల చెల్లింపు ముగియనుంది. ఆర్ఆర్ఆర్.. హుషార్: భూసేకరణకు రూ.750 కోట్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికిగాను భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. మహానగరం చుట్టూ విస్తరించిన ప్రధాన పట్టణాలను కలుపుతూ సుమారు 330 కి.మీ మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆర్ఆర్ఆర్.. దక్షిణ మార్గం రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లనుంది. చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, కడ్తాల్, యాచారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద కలుస్తుంది. సుమారు 120 కి.మీ పరిధి రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. దక్షిణ మార్గానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించలేదు. చౌటుప్పల్ నుంచి భువనగిరి, గజ్వేల్ మీదుగా కంది వరకు విస్తరించనున్న ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా బడ్జెట్లో భూ సేకరణకు నిధులు కేటాయించడంతో తొలుత ఈ మార్గంలో భూ సేకరణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ మార్గంలో అలైన్మెంట్ ఖరారు కావడానికి కొంత సమయం పట్టనుండటంతో భూ సేకరణ కొంత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో జిల్లా రూపు రేఖలు మారిపోయాయి. త్వరలో ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్తో జిల్లా మరింత అభివృద్ధి దిశగా పయనించే వీలుంది. మూసీకి మహర్దశ: రూ.200 కోట్ల కేటాయింపులు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్ భాగ్యరేఖ.. చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనులకు తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్ నుంచి ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గంలో నదికి సమాంతరంగా ఇరువైపులా తీరైన రహదారుల ఏర్పాటు, పాదచారుల దారులు, సుందర ఉద్యానాల ఏర్పాటు, ప్రక్షాళన, సుందరీకరణ పనులు ఊపందుకోనున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబర్మతి, గంగా నది తరహాలో మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు కాలుష్య కోరల నుంచి విముక్తి లభించనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర వాసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడంతో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం ఒకవైపు వాహన విస్ఫోటనం. మరోవైపు కాలుష్యం చిమ్ముతున్న కాలం చెల్లిన వాహనాలు. నగరజీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సముచితమైన ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు తాజా బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు ఈ రంగానికి ఊతమిచ్చాయి. ఎలక్ట్రిక్ రవాణా, వ్యక్తిగత వాహనాల తయారీకి సబ్సిడీ ఇవ్వడంతో పాటు వాహన కొనుగోలుదారులకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపు లభించనుంది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో కేవలం 5,700 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే నమోదయ్యాయి. సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలు కాగా.. మిగతావి బస్సులు, ఇతర కేటగిరీలకు చెందిన రవాణా వాహనాలు ఉన్నాయి. మరోవైపు నగరంలో రోజురోజుకూ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలన్నీ సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 15 లక్షలకుపైగా కాలం చెల్లినవే. వ్యక్తిగత వాహనాలతో పాటు 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు కూడా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆటో రిక్షాలు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర కేటగిరీల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి కొంత మేరకు రక్షణ లభించనుంది. -
రెంటికీ రెడ్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: కేవలం రూ. 25 చార్జీతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేలా ఎంఎంటీఎస్ నడిపేందుకు నాలుగేళ్ల క్రితం దక్షిణమధ్య రైల్వే ముందుకొచ్చింది. కానీ రైల్వేస్టేషన్ ఏర్పాటుకు జీఎమ్మార్ నిరాకరించడంతో ప్రతిష్టంభన నెలకొంది. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు రూ. 9000 కోట్లతో 32 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మించనున్నట్లు ప్రభుత్వం తరచూ ప్రకటిస్తోంది. కానీ నష్టాల్లో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఎయిర్‌పోర్టుకు పరుగులు పెట్టే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కేవలం రూ.250 కోట్లతో ఎంఎంటీఎస్ పూర్తి చేస్తే ఎయిర్‌పోర్టుకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు లోకల్ రైళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంఎంటీఎస్ పరుగులు పెట్టడం సులభమే. బెంగళూరులో లోకల్ ట్రైన్ పరుగులు ⇔ బెంగళూర్‌లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2 కి.మీ దూరంలోని రైల్వేస్టేషన్ కొద్దిరోజులుగా ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో సందడిగా మారింది. విమానాల రాకపోకలతో పాటు అన్ని వివరాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. ⇔ ఆ రైల్వేస్టేషన్ నుంచి టెర్మినల్‌కు చేరుకొనేందుకు షటిల్ సర్వీసులు నడుస్తున్నాయి. కానీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి అనుమతి లభిస్తే ప్రయాణికులు ట్రైన్ దిగి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా రైళ్లను నడపనున్నట్లు ద.మ రైల్వే గతంలో స్పష్టం చేసింది. ⇔ రైల్వేస్టేషన్‌కు స్థలాన్ని ఇచ్చేందుకు జీఎమ్మార్ నిరాకరించింది. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తే భూగర్భ స్టేషన్ నిర్మాణానికి అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ⇔ నగరంలోని వివిధ మార్గాల్లో రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తున్న మెట్రో రైళ్లు కి.మీ కూడా అదనంగా పరుగెత్తే అవకాశం ఇప్పట్లో లేదు. ‘బెంగళూరు ప్రయాణికులు రూ.20 లోపు చార్జీలతోనే ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. ఎంఎంటీఎస్‌కు అవకాశం లభిస్తే హైదరాబాద్‌లోనూ అలాంటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని ద.మ. రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఉందానగర్ నుంచి 6 కి.మీ ⇔ ఎంఎంటీఎస్ రెండో దశలో ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు సింగిల్ లైన్‌ను డబ్లింగ్ చేసి విద్యుదీకరించాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు 6 కి.మీ వరకు కొత్తగా లైన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ,250 కోట్లు ఖర్చవుతుందని 2013లోనే అంచనాలు రూపొందించారు. ⇔ రెండో దశలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని భావించినప్పటికీ జీఎమ్మార్ నిరాకరించడంతో పాటు ప్రభుత్వం కూడా ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ⇔ నగర శివార్లను కలుపుతూ ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కొరత వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.550 కోట్లు విడుదల కాకపోవడంతో లైన్ల నిర్మాణం పూర్తయినా రైళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. ⇔ రెండో దశ పూర్తయితే సికింద్రాబాద్– ఘట్కేసర్, సికింద్రాబాద్– బొల్లారం, మౌలాలీ– నగత్నగర్, తెల్లాపూర్– బీహెచ్ఈఎల్, ఫలక్‌నుమా– ఉందానగర్, ఎయిర్‌పోర్టు– ఉందానగర్ మధ్య రైళ్లు నడుస్తాయి. యాదాద్రి అంతే.. ⇔ రూ.330 కోట్లతో రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కూడా నిధుల కొరత కారణంగా పడకేసింది. ⇔ ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగించాల్సి ఉంది. అక్కడి నుంచి మరో 6 కి.మీ రోడ్డు మార్గంలో వెళ్తారు. కానీ ఈ ప్రాజెక్టు సర్వేకే పరిమితమైంది. -
రాష్ట్ర వాటా చెల్లిస్తేనే రెండో దశ పనులు
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజా రవాణాలో ఎంతో కీలకంగా మారినందున ఎంఎంటీఎస్ రెండో దశ పనులు వే గంగా పూర్తయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కోరారు. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవటంతో పనులు నిలిచిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు. ‘ఆరేళ్ల క్రితం రూ.816.55 కోట్ల అంచనాతో రెండో దశ పనులు మొదలయ్యాయి. ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.544.36 కోట్లు రైల్వేకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ.129 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగతావి బకాయి ఉన్నాయి. రైల్వే శాఖ తన వాటాకు కొన్ని రెట్లు అధికంగా రూ.789.28 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవటంతో పనులు నిలిచిపోయాయి. జాప్యంవల్ల ప్రస్తుతం అంచనా రూ.951 కోట్ల కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా రూ.634 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక యాదాద్రిని ఈ ప్రాజెక్టుతో అనుసంధానించే లా కేంద్ర ప్రభుత్వం రూ.412 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ఊపింది. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ లైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ.75 కోట్లు సమకూర్చాలని రైల్వే కోరింది. ఆ డబ్బు చెల్లించకపోవటంతో పనులు మొదలు కాలేదు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా నేను శాయశక్తులా కృషి చేస్తాను’అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
హైదరాబాద్ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్... సిటీజనులకు అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి లోకల్ ట్రైన్. 2003లో పాతబస్తీలోని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్ల నుంచి లింగంపల్లి వరకు ఒక ‘లైఫ్‌లైన్’గా మొదలైన ఎంఎంటీఎస్ రైలు కరోనా కారణంగా మొట్టమొదటిసారి నిలిచిపోయింది. ఇక అన్‌లాక్ తర్వాత మెట్రో రైళ్లు, సిటీ బస్సులను పునరుద్ధరించారు. ముంబయి లోకల్ రైళ్లు మూడు నెలల క్రితమే పట్టాలెక్కాయి. కానీ ఎంఎంటీఎస్ మాత్రం 9 నెలలుగా నిలిచిపోయింది. అంతేకాదు. గ్రేటర్ హైదరాబాద్‌ని శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 8 ఏళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ సైతం ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. కోవిడ్ సాకుతో ఒకవైపు ఇప్పటికే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు పూర్తవుతాయా అనే సందేహం నెలకొంది. అక్కడ అలా... ఇక్కడ ఇలా... లాక్‌డౌన్‌తో అన్ని దూరప్రాంత రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను మార్చి 23వ తేదీ నుంచి నిలిపివేశారు. నిబంధనల సడలింపు తరువాత దశలవారీగా 200 రెగ్యులర్ రైళ్ల స్థానంలో సుమారు 72 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించారు. ఇదే సమయంలో ముంబయి, కోల్కత్తా వంటి నగరాల్లో రాకపోకలు సాగించే లోకల్ రైళ్లలో 50 శాతానికి పైగా నడుస్తున్నాయి. నగరంలో లింగంపల్లి–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి స్టేషన్ల మధ్య నడిచే 121 రైళ్లలో ఇప్పటి వరకు ఒక్క సర్వీసును కూడా పునరుద్ధరించకపోవడం గమనార్హం. ఈ 9 నెలల్లో ఎంఎంటీఎస్ రైళ్లపైన దక్షిణమధ్య రైల్వే రూ.కోటి వరకు ఆదాయాన్ని కోల్పోయింది. కానీ అంతకంటే ముఖ్యంగా కేవలం రూ.15 టిక్కెట్‌తో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం నగరవాసులకు దూరమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎంఎంటీఎస్ రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెలవారీ పాస్‌లపైన రాకపోకలు సాగించే సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఆ సదుపాయానికి దూరమయ్యారు. రెండో దశపైన ప్రతిష్టంభన... ఎనిమిదేళ్ల క్రితం 2013లో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. పటాన్చెరు, ఘట్కేసర్,మేడ్చెల్, ఉందానగర్, శంషాబాద్,తదితర నగర శివార్లను కలుపుతూ చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో ఇప్పటి వరకు తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 5.75 కిలోమీటర్లు, బొల్లారంమేడ్చెల్ (14 కిలోమీటర్లు) మాత్రం పూర్తయ్యాయి. బొల్లారంసికింద్రాబాద్ మధ్య రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు కూడా పూర్తి చేసి రైళ్లు నడిపేందుకు అనుకూలమేనని సర్టిఫికెట్ ఇచ్చింది. సుమారు రూ.850 కోట్ల అంచనాలతో 88.05 కిలోమీటర్ల మేర రెండో దశ కింద చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన సుమారు రూ.500 కోట్లు అందకపోవడం వల్లనే బోగీల కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడిందనీ, దాంతో పూర్తయిన మార్గాల్లో రైళ్లను నడుపలేకపోతున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కానీ రైళ్ల ప్రైవేటీకరణ కారణంగానే కొత్త ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం కొనసాగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లడం కష్టమే!) -
బస్సేది.. ఎలా వెళ్లేది..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ప్రజారవాణా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన సిటీ బస్సులు 8 నెలల తర్వాత కూడా పూర్తిస్థాయిలో రోడ్డెక్కలేదు. నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్ రైళ్లూ పట్టాలెక్కలేదు. మెట్రో రైళ్లు తప్ప ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం లేదు. శివారు కాలనీలు, గ్రామాలను నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానం చేసే సిటీ బస్సులు రద్దయ్యాయి. దీంతో రాత్రి 8 గంటలు దాటితే సిటీలో చిక్కుకున్న ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆటోలు, క్యాబ్ నిర్వాహకులు రెట్టింపు చార్జీలతో ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నారు. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లోని మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కార్యాచరణకు నోచుకోలేదు. ‘చక్ర బంధం’లో సిటీ బస్సు.. ⇔ కోటికి పైగా జనాభా, 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రేటర్ అవసరాల మేరకు కనీసం 7,500 బస్సులు అవసరం. రోజురోజుకూ వందల కొద్దీ కొత్త కాలనీలు నగరంలో విలీనమవుతున్నాయి. కానీ ఇందుకు అనుగుణంగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణ మాత్రం జరగడం లేదు. ⇔ ఐటీ హబ్ విస్తరణతో పాటు ఫార్మాసిటీ వంటి కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఇటు పటాన్చెరు నుంచి సదాశివపేట వరకు, అటు ఘట్కేసర్ నుంచి బీబీనగర్ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం సిటీ బస్సులు లేకపోవడం వల్ల ప్రజలు సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్‌లు వంటి వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. మనుగడ ప్రశ్నార్థకం.. ⇔ గతేడాది ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘమైన సమ్మె చేపట్టారు. అప్పటి వరకు నగరంలో ప్రతిరోజూ 3,550 బస్సులు 33 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని కలి్పంచేవి. 44 వేలకు పైగా ట్రిప్పులు తిరిగేవి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండేవి. ⇔ ఏ రాత్రయినా సరే ఇల్లు చేరుకుంటామనే భరోసా ప్రయాణికులకు ఉండేది. ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎలాంటి భయం లేకుండా సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ⇔ సుదీర్ఘ కార్మికుల సమ్మె తర్వాత సిటీ బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. 800 బస్సులను పూర్తిగా విస్మరించారు. నగర శివార్లలోని పల్లెలకు రాకపోకలు సాగించే సుమారు 250 ⇔ దీంతో ఇబ్రహీంపట్నం, శంకరపల్లి, చేవెళ్ల, కీసర, పటాన్చెరు, ఘట్కేసర్ తదితర ప్రాంతాల చుట్టూ ఉన్న పల్లెలకు 80 శాతానికి పైగా సిటీ బస్సులు వెళ్లడం లేదు. పిడుగుపాటుగా ‘కోవిడ్’.. ⇔ రవాణా నిపుణుల అంచనా మేరకు గ్రేటర్ అవసరాల మేరకు 7,500 బస్సులు అవసరం. కానీ ఇప్పుడు ఉన్నవి 2,750 మాత్రమే. పైగా కోవిడ్ దృష్ట్యా దశలవారీగా బస్సులను పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం బస్సులే రోడ్డెక్కాయి. ⇔ గతంలో రోజుకు 33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే ఇప్పుడు కనీసం 15 లక్షల మందికి కూడా సిటీ బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ⇔ సాధారణంగానే ప్రతిరోజూ రూ.కోటి నష్టంతో నడుస్తున్న సిటీ బస్సులకు ఆర్టీసీ కారి్మకుల సమ్మె, కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ మరిన్ని నష్టాలను తెచి్చపెట్టింది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ రూ.550 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ⇔ బస్సుల సంఖ్య తగ్గించడంతో పాటు సుమారు 2 వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను కూడా విధుల నుంచి తప్పించి డిపో అటెండర్లుగా, బంకుల నిర్వాహకులుగా, కార్గో బస్సు సిబ్బందిగా మార్చారు. ఎంఎంటీఎస్ ఎక్కడ? ⇔ ప్రతిరోజూ 1.5 లక్షల మందికి రవాణా సదుపాయంఅందజేసే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విస్తరణకు నోచుకోని ఎంఎంటీఎస్.. కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. గతంలో రోజుకు 121 సరీ్వసులు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గాల్లో సర్వీసులు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించే రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ ఇప్పటికీ నోచుకోలేదు. ఘట్కేసర్–సికింద్రాబాద్, పటాన్చెరు-తెల్లాపూర్, సికింద్రాబాద్-బొల్లారం వంటి మార్గాల్లో లైన్లు పూర్తయినా రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు. నిధుల కొరత ఈ ప్రాజెక్టును వెంటాడుతోంది. ఆర్టీసీపై మెట్రో ప్రభావం గ్రేటర్ ఆర్టీసీపై మెట్రో ప్రభావం కూడా పడింది. ప్రస్తుతం నాగోల్– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతిరోజూ 57 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 1200 ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయం ఉంది. ప్రస్తుతం కోవిడ్ వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గినప్పటికీ సాధారణ రోజుల్లో 3.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. గతంలో హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్, జేఎన్టీయూ తదితర రూట్లలో ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసిన వాళ్లు క్రమంగా మెట్రోవైపు మళ్లారు. దీంతో ఆ రూట్లలో తిరిగిన సుమారు 35 ఏసీ బస్సులను ఆర్టీసీ విరమించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈ బస్సులు నడుస్తున్నాయి. ఉపాధి కోసం నగరానికి వెళ్లేవారు గతంలో మా ఊరిలో ఆర్టీసీ బస్సు రాత్రి బస చేసేది. ఉదయమే చాలామంది నగరానికి ఉపాధి కోసం వెళ్లేవారు. గ్రామం నుంచి మెహిదీపట్నం వరకు బస్సు నడిపించేవారు. ఆ బస్సును నిలిపివేయడంతో గ్రామస్తులు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. రాత్రివేళలో ఆటోలు లేక తిప్పలు తప్పడం లేదు. పాత సరీ్వసులను పునరుద్ధరించాలి. – పులకంటి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ చౌదరిగూడ, ఘట్కేసర్ మా ఊరికి ఆటోలు రావు మాది మజీద్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే పీర్లగూడెం. మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు. గ్రామ పంచాయతీకి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాములు రోజుల్లో మా గ్రామానికి రోజుకు రెండుసార్లు మాత్రమే బస్సు వచ్చేది. కరోనా కాలం నుంచి రావడం లేదు. కనీసం ఆటో సదుపాయాలు కూడా లేవు. ఆస్పత్రికి వెళ్లాలన్నా కష్టమే.. – లక్ష్మమ్మ, పీర్లగూడెం, అబ్దుల్లాపూర్‌మెట్ -
సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. లాంగ్ రూట్లకే పరిమితం.. ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా అధికారులు ఇప్పటికే కొన్ని మార్గాలను ఎంపిక చేశారు. హయత్‌నగర్– పటాన్చెరు, లంగర్‌హౌస్– రిసాలాబజార్, ఉప్పల్–మెహిదీపట్నం, సికింద్రాబాద్– బీహెచ్ఈఎల్, జీడిమెట్ల– ఎంజీబీఎస్ వంటి కొన్ని రూట్లలో మాత్రమే నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి, కూకట్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు టికెట్లు ఎలా ఇవ్వాలనే అంశంపై కూడా ఆర్టీసీలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ సెప్టెంబరు 1 నుంచి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కోవిడ్ ఉద్ధృతి మాత్రం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో బస్సులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ లిమిటెడ్ సర్వీసులు... కేంద్రం అనుమతిస్తే సికింద్రాబాద్– లింగంపల్లి రూట్లో మాత్రమే మొదట ఎంఎంటీఎస్ సర్వీసులు నడిచే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్కువగా హైటెక్ సిటీ, లింగంపల్లి తదితర ప్రాంతాల నుంచి రావాల్సివస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో కొన్ని సర్వీలను మాత్రమే ఈ రూట్‌కు పరిమితం చేయనున్నారు. కాగా.. ఎంఎంటీఎస్ రైళ్లకు కేంద్రం అనుమతిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. వచ్చే నెలలో మెట్రో.. మెట్రో రైళ్లు వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లిఖిత పూర్వకంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఆ తర్వాతే తేదీలను ప్రకటించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. -
పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్ ట్రైన్
హఫీజ్‌పేట్ : లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ లోకల్ రైలు పట్టాలు తప్పింది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళే రైలు (47141) సాయంత్రం 5.20 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. 5 నిమిషాల అనంతరం చందానగర్ రైల్వే స్టేషన్ దాటిన అనంతరం హఫీజ్‌పేట్ స్టేషన్ వద్ద రైలు చివరి బోగి చక్రం రాడ్ విరిగింది. దీంతో పెద్ద శబ్దంతో ఒక్కసారి పట్టాలు తప్పి బోగి పక్కకు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా రైలును నిలిపిపివేశారు. ఆలస్యంగా ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైలు... ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పడంతో లింగంపల్లి నుంచి హైదరాబాద్, ఫలక్‌నూమాకు వెళ్ళే లోకల్ రైళ్ళను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, షిర్డి, గుల్బర్గా, కాకినాడలకు వెళ్ళే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. తాండురు, గుల్బర్గా నుంచి నగరానికి రావల్సిన ప్యాసింజర్ రైళ్ళు రెండు గంటల తరువాత నడిచాయి. లింగంపల్లికి రావాల్సిన అన్ని లోకల్ రైళ్ళు హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ నుంచి తిప్పి పంపారు. -
ఆ ‘వెసులుబాటే’ కొంపముంచిందా..?
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్.. నవంబర్ 11, ఉదయం 10.30 గంటలు.. అంతకు ఐదు నిమిషాల క్రితం లింగంపల్లి నుంచి వచ్చి ఫలక్‌నుమా వెళ్లేందుకు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఎంఎంటీఎస్ రైలు సిగ్నల్ లేకున్నా ముందుకు కదిలింది. చూస్తుండగానే వేగం గంటకు దాదాపు 40 కి.మీ. అందుకుంది. సరిగ్గా 500 మీటర్ల దూరం వెళ్లి మరో ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లేందుకు లైన్ క్రాస్ చేస్తూ ఎదురుగా వచ్చిన కర్నూలు టౌన్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొంది. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ క్యాబిన్లోకి చొచ్చుకెళ్లింది. రైళ్ల కదలికల్లో సిగ్నళ్లదే కీలక పాత్ర. వాటిని గమనించకుండా లోకోపైలట్లు రైళ్లను ముందు కు కదిలించరు. మరి సిగ్నల్ ఇవ్వకున్నా ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ దాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్లారు అన్నది అర్థంకాని ప్రశ్న. సమాధానం చెప్పేందుకు ఆయన ప్రస్తుతం ప్రాణాలతో లేరు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన రైల్వే కమిషనరేట్ అధికారులు ప్రమాదానికి కారణాలను శోధించే పనిలో రెండు రోజులు పర్యటించారు. తుది నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ.. అధికారులు మాత్రం ప్రమాదానికి ఓ ‘వెసులుబాటే’ కారణమని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఏంటది? నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేకంగా సిగ్నళ్లకు సంబంధించి ఓ వెసులుబాటు ఉంది. ఏదైనా స్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు ఆగిన తర్వాత రెండు నిమిషాలకు తిరిగి బయలుదేరుతుంది. సాధారణంగా మిగతా రైళ్లు సిగ్నల్ ఇచ్చే వరకు వేచి ఉంటాయి. ఎంఎంటీఎస్ రైళ్లకు మాత్రం ఈ విషయంలో ఓ వెసులుబాటు ఉంది. రెండు నిమిషాల్లో సిగ్నల్ పడకున్నా రైలును ముందుకు తీసుకెళ్లచ్చు. అయితే ఆ సమయంలో దాని వేగం 12 కి.మీ. లోపే ఉండాల్సి ఉంటుంది. తక్కువ వేగంతో ఉన్నప్పుడు బ్రేక్ వేసి ఆపే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి, హఫీజ్‌పేట స్టేషన్లలో మాత్రం ఈ వెసులుబాటు ఉండదు. ఈ ఆరు స్టేషన్లలో లూప్ లైన్లు ఉన్నందున రైళ్లు ఎదురుగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఆరు స్టేషన్లలో మాత్రం కచ్చితంగా సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ముందుకు కదలాలి. కాచిగూడ స్టేషన్లో ఆ వెసులుబాటు లేదనే విషయాన్ని మరిచి సిగ్నల్ లేకున్నా లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లాడని అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలో వేగం 40కి.మీ.కి చేరుకోవటం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రైలు బయలుదేరేముందు లోకోపైలట్ తన క్యాబిన్‌లోనే బెల్ మోగిస్తాడు, గార్డు కూడా తిరిగి బెల్ మోగిస్తేనే లోకోపైలట్ రైలును ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ప్రమాద సమయంలో ‘బెల్’ విషయంపై అధికారులు గార్డును విచా రించారు. అధికారులు మాత్రం ప్రమాదానికి సిగ్నల్‌తో సంబంధం లేకుండా ఎంఎంటీఎస్ ముందుకు వెళ్లేందుకు ఉన్న వెసులుబాటే కారణమని భావిస్తుండటం విశేషం. -
లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) శనివారం రాత్రి మృతి చెందాడు. ఎంఎంటీఎస్, ఇంటర్సిటీ రైలు సోమవారం ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ రైలు క్యాబిన్లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ చంద్రశేఖర్‌ను అతికష్టంమీద బయటకు తీసి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. రెండ్రోజుల క్రితమే ఆయన కుడికాలును కూడా తొలగించారు. కిడ్నీలు కూడా పనిచేయడం మానేశాయి. శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
జనగామ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలి
సాక్షి, హైదరాబాద్: రాయగిరి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ రైలును జనగామ వరకు పొడిగించాలని, ప్యాసింజర్ రైలు (ఎంఈఎంయూ)ను ఫలక్‌నుమా నుంచి భువనగిరి దాకా విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను ఆపడంతోపాటు పలు సమస్యలు పరిష్కరించాల న్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎంను కలసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. -
లోకోపైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ చంద్రశేఖర్ (35) కుడికాలు ను గురువారం తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిధ్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడిమోకాలి పైభాగం వరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బౌద్ధ నగర్‌కు చెందిన లెక్చరర్ శేఖర్(36)తో పాటు మరో నలుగురికి వివిధ రకాల చికిత్సలందిస్తున్నారు. -
ఆ ఆరింటిలోనే!
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్ ఏమరుపాటు వల్లే కాచిగూడ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. సాధారణంగా నగరంలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో రైలు 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆటోమేటిక్‌గా సిగ్నల్ పడుతుంది. దాంతో రైలు ముందుకు వెళ్తుంది. కానీ 6 ప్రధాన స్టేషన్లలో మాత్రం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. ఈ ఆరింటిలో స్టార్టింగ్ సిగ్నల్ అందితేనే రైలు ముందుకు కదులుతుంది. సోమవారం కాచిగూడ స్టేషన్లో 2 నిమిషాలు ఆగిన ఎంఎంటీఎస్ స్టార్టింగ్ సిగ్నల్ వెలగకుండానే బయలుదేరింది. ఆ సమయంలో అదే ట్రాక్‌పై వస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హోమ్ సిగ్నల్ పడింది. ఇది గమనించకుండానే ఎంఎంటీఎస్ దూసుకురావడంతో ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొట్టింది. ఇదంతా కాచిగూడ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో 30 సెకన్ల వ్యవధిలో జరిగినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రేటర్లో మొత్తం 45 కిలోమీటర్ల పరిధిలో 26 స్టేషన్ల మీదుగా ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 20 స్టేషన్లు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై ఆధారపడి ఉండగా... ఆరింటిలో మాత్రం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. అంటే లోకోపైలెట్‌కు గ్రీన్ సిగ్నల్ అందితే తప్ప ముందుకు వెళ్లడానికి వీల్లేదు. హోమ్ సిగ్నలింగ్ ఎక్కడెక్కడ? సికింద్రాబాద్, కాచిగూడ, ఫలక్‌నుమా, లింగంపల్లి, నాంపల్లి, హఫీజ్‌పేట్ స్టేషన్లలో ఎంఎంటీఎస్‌తో పాటు ఇతర రైళ్ల రాకపోకల కోసం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంది. పది ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సికింద్రాబాద్ స్టేషన్లో ఒక దానిపైనున్న రైలు బయలుదేరితే తప్ప మరో దానికి అవకాశం లభించదు. కంట్రోల్ సెంటర్ రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ద్వారా రైళ్లకు ప్లాట్‌ఫామ్‌లను కేటాయిస్తారు. సికింద్రాబాద్‌తో పాటు మిగతా 5 స్టేషన్లలోనూ ఇదే విధంగా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. కాకినాడ, విశాఖ నుంచి వచ్చే పలు రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించడం వల్ల అక్కడ రైళ్లు హోమ్ సిగ్నలింగ్‌పై ఆధారపడి రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్ తర్వాత నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లు. ఇక్కడ పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు ఉంటాయి. అలాగే మహబూబ్‌నగర్, కర్నూల్, ఉందానగర్ నుంచి వచ్చే రైళ్లతో ఫలక్‌నుమా రద్దీగా ఉంటుంది. హఫీజ్‌పేట్ మీదుగా కొన్ని రైళ్లను మళ్లిస్తారు. దీంతో ఈ ఆరు హోమ్ సిగ్నలింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఆయా స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో ‘స్టార్టింగ్’ సిగ్నల్ అందితే తప్ప ముందుకు కదలడానికి అవకాశంఉండదు. 2నిమిషాల సమయం నేచర్‌క్యూర్ ఆస్పత్రి, బోరబండ, బేగంపేట్, జామై ఉస్మానియా, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా, ఉప్పుగూడ తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ ద్వారా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్లలో కేవలం ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలే ఉంటాయి. దీంతో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి సిగ్నల్ వస్తుంది. లోకోపైలెట్లు సిగ్నల్ కోసం ఎదురు చూడకుండానే 2 నిమిషాలు ఆగిన తరువాత వాకింగ్ స్పీడ్‌తో రైలును కదిలిస్తారు. ఆటోమేటిక్‌గా సిగ్నల్ అందుతుంది. దీంతో రైలు వేగాన్ని పెంచేస్తారు. నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇదే పద్ధతిలో రాకపోకలు సాగిస్తున్నాయి. వేగం ఎక్కువే... సాధారణంగా ఎంఎంటీఎస్ రైళ్లు 25 కేవీ విద్యుత్ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పాత రైళ్లకు వన్ ఫేజ్ విద్యుత్ మోటార్ పని చేస్తుండగా.. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఎంఎంటీఎస్ రైళ్లకు (టెటీస్కోపిక్ కోచ్‌లు ఉన్నవి) త్రీ ఫేజ్ మోటార్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రైళ్లు బయలుదేరిన క్షణాల్లోనే వేగాన్ని అందుకుంటాయి. ‘కాచిగూడలో ప్రమాదానికి కారణమైన ట్రైన్ కూడా టెటీస్కోపిక్ కోచ్‌లతో కూడి, త్రీ ఫేజ్ మోటార్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో హంద్రీని ఢీకొనే సమయానికి కనీసం 50 కిలోమీటర్ల వేగంతో ఉండి ఉంటుంది. ఆ సమయంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్ 10 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా లూప్లైన్లో ట్రాక్ మారుతుండడం వల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. -
లోకోపైలెట్‌పై కేసు
కాచిగూడ స్టేషన్లో సిగ్నల్‌ను గమనించకుండా వెళ్లి హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆర్పీఎఫ్ అధికారులు, కాచిగూడ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కోలుకున్న తర్వాత అధికారులు వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై దక్షిణమధ్య రైల్వే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. రైళ్ల రాకపోకలు షురూ... ప్రమాదం జరిగిన అనంతరం చేపట్టిన పునరుద్ధరణ పనులు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మొదట సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం సుమారు 2గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరి వెళ్లింది. తర్వాత పలు ప్యాసింజర్ రైళ్లు వెళ్లాయి. సాయంత్రం 7:05 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరాల్సిన కాచిగూడ–మైసూర్ (12785) ఎక్స్‌ప్రెస్ రాత్రి 10:05 గంటలకు వెళ్లింది. అలాగే కాచిగూడ–యశ్వంత్‌పూర్ (17603) ఎక్స్‌ప్రెస్ రాత్రి 9:05 గంటలకు బదులు రాత్రి 11:05 గంటలకు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో అన్ని ట్రాక్‌లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోలకు మార్గం సుగమమైంది. ఇక ప్రమాద ఘటన నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా నడిచాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు మాత్రమే రా>కపోకలు సాగించాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సాధారణ రోజుల్లో 1.5 లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించకుంటుండగా... మంగళవారం 80వేల మంది వరకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సెలవు దినం కావడం కూడా ఇందుకు మరో కారణం. -
రైలు ప్రమాదం: పైలెట్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని గుర్తించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరగిందిని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్‌డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై పలు కేసులను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైలు ఒక ట్రాక్‌పై వెళ్లాల్సిందిగా, మరో ట్రాక్‌పై తీసుకువెళ్లి పైలెట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే.( చదవండి: ఎంఎంటీఎస్‌లో తొలి ప్రమాదం) పైలెట్ పరిస్థితి విషమం.. రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఇంకా కోలుకోనట్లు వైద్యులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. -
మొట్టమొదటి దుర్ఘటన
సాక్షి, సిటీబ్యూరో:కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం చోటుచేసుకున్న ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు, లోకోపైలెట్ చంద్రశేఖర్ గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిటీ లైఫ్‌లైన్ ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రతిరోజు సుమారు లక్షన్నర మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రజా రవాణాలో ఇది సిటీ లైఫ్‌లైన్‌గా నిలిచింది. తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి 15–30 నిమిషాల వ్యవధిలో ఒక సర్వీసు చొప్పున నడుస్తోంది. పాలు, కూరగాయలు విక్రయించే చిరువ్యాపారుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎంఎంటీఎస్ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అటు బీహెచ్ఈఎల్, పటాన్చెరు వంటి దూరప్రాంతాల్లో ఉంటూ హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు.. ఇటు భువనగరి, ఘట్కేసర్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సికింద్రాబాద్ చేరుకొని అక్కడి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి ఎంఎంటీఎస్ ఒక లైఫ్‌లైన్‌లా మారింది. నాంపల్లి, ఖైరతాబాద్, సెక్రటేరియట్, గాంధీభవన్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఎంతోమంది ఉద్యోగులు ఎంఎంటీఎస్ రైళ్లలోనే పయనిస్తున్నారు. లక్షా 60వేల మందికి సేవలు... పెరుగుతున్న నగర జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాలు, అన్నింటికీ మించి వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2003లో ఎంఎంటీఎస్ సేవలకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో సుమారు రూ.69.50 కోట్ల వ్యయంతో ఇవి పట్టాలెక్కాయి. తొలుత సికింద్రాబాద్–లింగంపల్లి వరకు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ ఈ సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత సికింద్రాబాద్–ఫలక్‌నుమా వరకు విస్తరించారు. 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. ప్రస్తుతం 121 సర్వీసులు ప్రతిరోజు తిరుగుతున్నాయి. సుమారు లక్షా 60వేల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. బోగీల సంఖ్యను 6–9కి, ఆ తర్వాత 12కు పెంచారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలిస్కోపిక్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. 2010లో ప్రారంభించిన ‘మాతృభూమి’ మహిళల ప్రత్యేక రైలులో బోగీల సంఖ్యను కుదించినప్పటికీ, 4 బోగీలను ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించారు. ఇక రెండో దశ పనులు సైతం తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్, రామంద్రాపురం, తెల్లాపూర్ వరకు వేసిన కొత్త రైల్వే మార్గంలో 2 సర్వీసులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్–బొల్లారం లైన్లు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని మార్గాల్లో విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. రెండో దశ పూర్తయితే ఘట్కేసర్, పటాన్చెరు, మేడ్చల్ లాంటి శివారు ప్రాంతాలు నగరానికి చేరువవుతాయి. డీఆర్ఎఫ్ కీలక పాత్ర సాక్షి, సిటీబ్యూరో: కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్న సంఘటన స్థలానికి జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ బృందాలు అతి తక్కువ సమయంలోనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే 50 మందితో కూడిన మూడు బృందాలు ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, విపత్తుల నివారణ శాఖ సిబ్బందితో కలిసి పని చేశాయి. డీఆర్ఎఫ్ విభాగం వద్దనున్న పరికరాలతోనే ఈ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించడంలో ఈ బృందాలు కీలక పాత్ర పోషించాయి. -
మృత్యుంజయుడిగా నిలిచిన లోకోపైలట్
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. క్యాబిన్లో ఇరుక్కున్న లోకో పైలట్ చంద్రశేఖర్ 8 గంటల ఉత్కంఠ... ప్రమాదంలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్.. ఎంఎంటీఎస్ ముందు భాగాన్ని చీల్చు కుంటూ డ్యాష్‌బోర్డును స్వల్పంగా ధ్వంసం చేసి ఆగిపోయింది. దీంతో లోకోపైలట్ చంద్రశేఖర్ అందులో ఇరుక్కుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్సిటీ రైలు ఇంజిన్‌ను కదలకుండా చేసి, ఎంఎంటీఎస్ రైలు ఎడమవైపు ఐరన్ షీటును కట్టర్లతో తొలగించారు. దాని వెనకాలే చంద్రశేఖర్ ఇరుక్కుని ఉండటంతో అక్కడ నుంచి మిగతా జాగ్రత్తగా చేతులతోనే కట్ చేయడం ప్రారంభించారు. 11.15 గంటలకు లోకోపైలట్‌కు ఆక్సిజన్ పెట్టారు. నిరంతరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. బీపీ చెక్ చేస్తూ.. అతడు మత్తులోకి జారిపోకుండా మాట్లాడిస్తూ ఆపరేషన్ కొనసాగించారు. సాయంత్రం 5.25 గంటలకు రైలుకు ఎడమ పక్కన ఉన్న ఐరన్షీటు పూర్తిగా తొలగించారు. రక్త ప్రసరణ లేకపోవడంతో అతడి కాలు వాచిపోయి ఉన్న సంగతి అప్పుడు గుర్తించారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రశేఖర్ తల కనిపించడంతో వైద్యులు వెళ్లి ధైర్యం చెప్పారు. భయపడవద్దని మరికొద్ది నిమిషాల్లో బయటికి వస్తావని చెప్పారు. సాయంత్రం 6.05 గంటలకు డ్యాష్ బోర్డులో ఇరుక్కున్న చంద్రశేఖర్ వెనక ఉన్న మరో ఐరన్షీట్ను తొలగించారు. అయినా తల, ఛాతి, వెన్ను అలాగే ఉండిపోయాయి. సాయంత్రం 6.40 గంటలకు మిగిలిన భాగాలను కూడా కత్తిరించి, అతడిని బయటకి తీసుకొచ్చారు. వెంటనే చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. రియల్ హీరో ‘నిశాంత్’ ప్రమాదం జరిగాక అక్కడి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ నిశాంత్ చివరి వరకు అక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్‌ని నిత్యం మాట్లాడిస్తూ.. అతనికి నీళ్లు ఇస్తూ.. ధైర్యం చెబుతూ వచ్చాడు. రైలును కట్టర్లతో కోస్తున్నపుడు చంద్రశేఖర్‌పై నిప్పురవ్వలు ఎగిసిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిశాంత్‌కు తోడుగా రైల్వే సిబ్బంది శ్రీను, ఆక్సిజన్ సిలిండర్‌ను చివరి వరకు పట్టుకున్న స్టేషన్ ఉద్యోగి రాజు.. లోకోపైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. -
కాచిగూడ స్టేషన్లో రెండు రైళ్లు ఢీ
సాక్షి, హైదరాబాద్ : నిత్యం పలు రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి రెండు రైళ్లు ఢీకొన్నాయి. కర్నూలు–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. స్టేషన్ కావడంతో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఒకవేళ రెండు రైళ్ల వేగం ఎక్కువగా ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేది. ప్రాణనష్టం లేకపోవటంతో దీనిని చిన్న ప్రమాదంగానే పరిగణిస్తున్నా, ప్రమాదానికి దారితీసిన కారణాన్ని మాత్రం భారీ తప్పిదంగానే రైల్వే భావిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే సేఫ్టీ కమిషనర్ రాంక్రిపాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టనుంది. నుజ్జునుజ్జయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్ (ఇన్సెట్లో) ప్రమాదంలో గాయపడిన పి.శేఖర్ ఏం జరిగింది? కాచిగూడ స్టేషన్లోకి సోమవారం ఉదయం 10:20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి ఆగింది. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. అంతకు ముందే కర్నూలు టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ వద్దకు చేరుకుంది. అది మూడో నంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్లాల్సి ఉంది. అది వచ్చిన సమయంలో మరో రైలు ఆ ప్రాంతాన్ని దాటాల్సి ఉండటంతో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను హోం సిగ్నల్ ప్రాంతంలో ఆపి ఉంచారు. అది ఆగిన ప్రాంతం ప్లాట్‌ఫామ్‌కు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 10.30 గంటల సమయంలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన లైన్ మీదుగా వచ్చినందున అది తొలుత ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్, ఆ తర్వాత రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్‌లను దాటుకుని మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్‌పైకి వెళ్లాలి. సిగ్నల్ పడగానే ఆ రైలు బయలుదేరి మొదటి ట్రాక్‌ను దాటి రెండో ట్రాక్‌పైకి వచ్చి దాన్ని క్రాస్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అప్పటికే రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నుమా వైపు ముందుకు కదిలింది. దాని లోకోపైలట్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ ట్రాక్ మీదుగా మరో ట్రాక్‌లోకి క్రాస్ అవుతున్న సంగతిని గుర్తించలేదు. దీంతో ఎంఎంటీఎస్ నేరుగా దూసుకెళ్లి ఇంటర్సిటీ ఇంజిన్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగింది ఇలా.. (సీసీ టీవీ దృశ్యాలు) ఈ ఘటనలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్‌లోకి చొచ్చుకుపోయింది. ఎంఎంటీఎస్ తొలి నాలుగు బోగీలు ఎగిరి పట్టాల పక్కన పడిపోగా.. మరో రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఇంటర్సిటీకి చెందిన మూడు బోగీలు సైతం పట్టాల నుంచి పక్కకు దిగిపోయాయి. ప్రమాద ఘటనలో ఎంఎంటీఎస్ ఒక్కసారిగా పెద్ద కుదుపుతో గాలిలోకి ఎగిరి కింద పడటంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. బోగీ డోరు వద్ద ఉన్నవారు కొందరు కిందకు పడిపోయారు. ఘటన జరిగిన వెంటనే భయాందోళనలకు గురైన ప్రయాణికులు బోగీల నుంచి దూకి చెల్లాచెదురుగా పారిపోయారు. ఇంటర్సిటీ ఇంజిన్ చొచ్చుకెళ్లడంతో లోకోపైలట్ చంద్రశేఖర్ కేబిన్‌లోనే చిక్కుకుపోయారు. దాదాపు 8 గంటల తర్వాత ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఆయన్ను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. వేగం తక్కువగా ఉండటంతో.... ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ట్రాక్ మారే ప్రయత్నంలో ఉన్నందున ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వేగం 10 కిలోమీటర్ల లోపే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ వేగం 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉందని రైల్వే చెప్పారు. సాధారణంగా ప్లాట్‌ఫామ్ నుంచి బయలు దేరి 500 మీటర్ల దూరం వచ్చేసరికి ఎంఎంటీఎస్ రైళ్ల వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ట్రాక్ ఛేంజింగ్ పాయింట్ కావటంతో అక్కడ వేగం అందులో సగానికి తక్కువే ఉంటుంది. ఇదే ఇక్కడ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఉస్మానియా, కేర్లలో చికిత్స.. ప్రమాద ఘటనలో గాయపడినవారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాస్త ఎక్కువ గాయాలైన 17 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో 11 మందికి ఓపీలో చికిత్స చేసి పంపించగా.. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. పరకాలకు చెందిన పి.శేఖర్(36)కి తల, చేతులపై తీవ్ర గాయాలు కాగా, యాకుత్‌పురాకు చెందిన రహీమోద్దీన్(55)కి కూడా బలమైన గాయాలయ్యాయి. వీరికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. గద్వాలకు చెందిన బాలేశ్వరమ్మ(52)కు ఎడమ కాలు, హఫీజ్‌పేట్‌కు చెందిన రాజ్‌కుమార్(35)కు కుడికాలు విరిగిపోయాయి. వీరికి ఉస్మానియాలో కట్టు కట్టిన తర్వాత మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. లోకోపైలట్ చంద్రశేఖర్‌తోపాటు మరో క్షతగాత్రుడు సాజిద్‌ను కూడా కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వల్ప గాయాలతో బయటపడిన సులోచన(32), ఆంజనేయులు(35), మహ్మద్ అలీ(45), ప్రభాకర్(65), రాజ్‌కుమార్(24), మౌనిక(18), అనురాధమ్మ(40), మీర్జాబేగం(46), బలరాం(45), మల్లమ్మ(50), ఆనంద్(25)లకు ఉస్మానియా ఓపీలో చికిత్స చేసి పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే బోగీ నుంచి బయటకు దూకి పరుగులు తీస్తున్న ప్రయాణికులు గవర్నర్ ఆరా... రైలు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు రైల్వే అధికారులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి చికిత్స నిమిత్తం రూ.25 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దశబ్దం వచ్చింది రైళ్లు ఢీకొనగానే భారీగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను మహిళా బోగీలో ఉన్నాను. అంతా హాహాకారాలు చేశారు. బోగీలో కొద్దిగా తొక్కిసలాట కూడా జరిగింది. వెంటనే తేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాం.– ఆంజనేయరాజు, ఆర్పీఎఫ్ కొందరు బయటపడ్డారు నేను మహిళా బోగీలో విధుల్లో ఉన్నాను. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. డోర్ల వద్ద నిలుచున్న చాలామంది ఎగిరి అవతల పడ్డారు. రైలు పట్టాలు తప్పిందని అర్థమైంది. నేను వెంటనే బోగీ నుంచి కిందకు దిగి, రైలు ఇంజిన్ వైపు పరిగెత్తాను. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి, అధికారులను అప్రమత్తం చేసాను. – ఎమ్మార్సీ రాజు, ఆర్పీఎఫ్ -
ఎంఎంటీఎస్ మాల్స్..మల్టీప్లెక్స్
సాక్షి, హైదరాబాద్:నగరంలో ఇక రైల్వే మాల్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే పరిమితమైన రైల్వే స్టేషన్లలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వే జోన్లలో రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు కేంద్రం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలోని ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో ప్రస్తుతం మెట్రో రైళ్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలోనే ఎంఎంటీఎస్ నిర్వహణ ఉంటుంది. మెట్రో స్టేషన్లు, సంబంధిత స్థలాల్లో మాల్స్ ఏర్పాటు చేసినట్లుగానే ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ రైల్వే మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. రానున్న మూడేళ్లలో ఈ ప్రైవేటీకరణ పూర్తి చేయాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రైవేట్ సంస్థలు టికెట్టేతర ఆదాయాన్ని ఆర్జించేందుకు షాపింగ్‌మాల్స్, మల్లీప్లెక్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తాయి. నగరంలో ప్రస్తుతం 26 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ పూర్తయితే 5 స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో హైటెక్‌సిటీ, లింగంపల్లి, లక్డీకాపూల్, సంజీవయ్య పార్కు, బేగంపేట్, మలక్‌పేట్ వంటి స్టేషన్ల పరిధిలోని రైల్వే స్థలాల్లో ఈ తరహా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ 121 ఎంఎంటీఎస్ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. చార్జీలు పెరిగే అవకాశం.. ఎంఎంటీఎస్ సేవలను ప్రైవేటీకరించడం వల్ల ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రైల్వే స్థలాలను కమర్షియల్‌గా అభివృద్ధి చేయడం వల్ల టికెట్టేతర ఆదాయం లభిస్తుంది. 40 శాతం ఆదాయం టికెట్లపైన, మిగతా 60 శాతం టికెట్టేతర రూపంలో లభించే విధంగా ప్రైవేటీకరణ చర్యలు ఉంటాయి. స్థలాలను, రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రైల్వేలపైన నిర్వహణ భారం తగ్గుతుంది. పైగా ప్రైవేట్ సంస్థల నుంచి లీజు రూపంలోనూ, అద్దెల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఈ వ్యూహంతో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. కానీ రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. నిధులు విడుదలలో జాప్యం.. నగర శివార్లను కలుపుతూ చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ చివరి దశకి చేరుకుంది. సికింద్రాబాద్–బొల్లారం, సికింద్రాబాద్–ఘట్కేసర్, మౌలాలి–సనత్‌నగర్, తెల్లాపూర్–పటాన్చెరు తదితర మార్గాల్లో రైల్వే లైన్ల విద్యుదీకరణ, లైన్ల డబ్లింగ్ పూర్తయింది. పలు చోట్ల ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంపు పనులను పూర్తి చేశారు. కొత్త స్టేషన్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది.త్వరలో రెండో ఫేజ్ కూడా అందుబాటులోకి రానుంది. రెండో దశ కోసం కొత్త రైళ్లు రావాల్సి ఉంది. కొత్త రైళ్లు వస్తే తప్ప రెండో దశ పట్టాలపైకి ఎక్కే అవకాశం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కార్ నుంచి అందాల్సిన సుమారు రూ.450 కోట్లకు పైగా నిధులు ఇంకా అందకపోవడం వల్లనే జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.ఎంఎంటీఎస్ మొదటి, రెండో దశ ప్రాజెక్టుల్లో రైల్వే శాఖ 1/4 చొప్పున, రాష్ట్రం 2/3 చొప్పున నిధులను అందిస్తున్నాయి. ప్రైవేటీకరణ తప్పనిసరైతే ఈ ఒప్పందం ఎలా ఉంటుందనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. -
కాంబో కథ కంచికేనా?
సాక్షి, సిటీబ్యూరో: మేడిపల్లికి చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ నిపుణుడు. హైటెక్ సిటీలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగి. మెట్రో రాకముందు ప్రతిరోజు క్యాబ్‌లో వెళ్లేవాడు. ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... అతని రవాణా సదుపాయాల్లో మార్పులు వచ్చాయి. మేడిపల్లి నుంచి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ వరకు సిటీ బస్సులో వస్తాడు. అక్కడి నుంచి మెట్రోలో హైటెక్ సిటీకి వెళ్తాడు. ఇందుకోసం అతడు రెండుసార్లు టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. తిరుగు ప్రయాణంలో హైటెక్ సిటీ నుంచి ఎంఎంటీఎస్ రైలులో సికింద్రాబాద్ వరకు వస్తాడు. అక్కడి నుంచి సిటీ బస్సు/మెట్రోలో వెళ్తాడు. ఈ మూడు రకాల ప్రయాణాలకు మూడు టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పైగా ఎంఎంటీఎస్ స్టేషన్లో, మెట్రో స్టేషన్లో టికెట్ కోసం కొంత సమయం వెచ్చించక తప్పదు. ఇది ఒక్క శ్రీకాంత్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. చాలామంది ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఒక రకమైన రవాణా సదుపాయం నుంచి మరో రకమైన రవాణా సదుపాయంలోకి మారేందుకు ఒకే టికెట్‌పై ప్రయాణం చేసే అవకాశం లేకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. పైగా ప్రయాణికులు కొన్ని రాయితీలు, సదుపాయాలనూ కోల్పోవాల్సి వస్తోంది. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్.. ఈ మూడింటిలోనూ పనిచేసే విధంగా కామన్ టికెట్ ప్రవేశపెట్టాలని సంకల్పించినప్పటికీ... అది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇది అమల్లోకి వస్తే ప్రయాణికులకు ఉమ్మడి రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రయాణం ఏకీకృతం గ్రేటర్ ప్రజా రవాణాలో ఇప్పటికీ ఆర్టీసీనే అతి పెద్ద సంస్థ. సుమారు 3,850 బస్సులతో ప్రతిరోజు 32లక్షల మందికి పైగా రవాణా సదుపాయం అందజేస్తోంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన మార్గాల్లో అనివార్యంగానే కొన్ని ట్రిప్పులను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే మార్గంలో ఏసీ బస్సులను ఉపసంహరించుకున్నారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే ఏసీ బస్సులు కూడా దాదాపు రద్దయ్యాయి. మెట్రో రైలుకు సమాంతరంగా ఉన్న మార్గాల్లో సిటీ బస్సులకు కొంతమేర ఆక్యుపెన్సీ తగ్గింది. ప్రస్తుతం మెట్రో రైళ్లలో ప్రతిరోజు 3లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు తిరుగుతున్నాయి. రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అలాగే మరో 5లక్షల మంది ఆటోరిక్షాలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.3 లక్షల ఆటోలు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. అయితే అన్ని రకాల ప్రజా రవాణా సాధనాల్లో రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా ఒకే స్మార్ట్ కార్డు (కామన్ టికెట్)ను అందుబాటులోకి తేవాలని ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ తరహా అన్ని రవాణా సదుపాయాల్లో వినియోగించుకొనే స్మార్ట్‌కార్డును తయారు చేసి అందజేసేందుకు అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటిచింది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. రాయితీలతో ప్రయోజనం ఆర్టీసీ, మెట్రో కంటే ఎంఎంటీఎస్‌లో ప్రయాణం ఎంతో చౌక. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు కేవలం రూ.10. ప్రయాణం చేసే దూరాన్ని బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు ఎంఎంటీఎస్ నెలవారీ పాస్‌లు ఉన్నాయి. కానీ అన్ని రూట్లలో ఎంఎంటీఎస్ లేదు కదా! అలాగే స్మార్ట్‌కార్డులపై మెట్రో 10 శాతం రాయితీ అందజేస్తోంది. ఏరోజుకారోజు టికెట్ తీసుకొని ప్రయాణం చేయడం కంటే.. ఇది ఎంతో ప్రయోజనం. సిటీ బస్సుల్లోనూ వివిధ రకాల పాస్‌లు ఉన్నాయి. రోజువారీ టికెట్లపై 25శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఈ మూడు రకాల సదుపాయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక స్మార్ట్‌కార్డు (కామన్ టికెట్) రూపంలో ఉమ్మడి ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తే... ప్రయాణికుడికి మూడు సదుపాయాలు లభించడమే కాకుండా వివిధ సంస్థలు అందజేసే రాయితీలతో చార్జీలు తగ్గే అవకాశం ఉంది. పైగా ఆన్లైన్ చెల్లింపుల వల్ల కూడా కొంత రాయితీ లభించవచ్చు. ప్రయాణికుడు ఏ రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకుంటే ఆ సంస్థ ఖాతాలోకి చార్జీలు జమయ్యే విధంగా ఈ కామన్ కార్డు ఉంటుంది. ప్రస్తుతం మెట్రో స్టేషన్లలో స్మార్ట్ కార్డులను వినియోగిస్తున్న ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ ఎంట్రీ గేట్ల తరహాలో ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సిటీ బస్సుల్లో అయితే ఈ తరహా సదుపాయాన్ని డోర్స్ వద్ద ఏర్పాటు చేస్తారు. లేదా కండక్టర్లకే ఆటోమేటిక్ టిక్కెట్ ఫేర్ కలెక్షన్ యంత్రాలను అందజేయాల్సి ఉంటుంది. -
ఫుట్‌బోర్డు..సెల్‌ఫోన్
నాంపల్లి: ఎంఎంటీఎస్ రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడమే కాకుండా...సెల్‌ఫోన్ మాట్లాడుతూ..కింద పడిన ఫోన్‌ను అందుకునే ప్రయత్నం చేస్తూ ఓ యువతి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన నాంపల్లి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని బేగంపేట రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... సీతాఫల్మండి వీరలబస్తీకి చెందిన రామచందర్ కుమార్తె మాధవి అశ్విని(22) ప్రైవేట్ ఉద్యోగిని. ఈమె రోజూ ఎంఎంటీఎస్ రైలులోప్రయాణం చేస్తూ విధులకు వెళ్తుంటుంది. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి ప్రయాణించే రైలులో సీతాఫల్మండి రైల్వే స్టేషన్ వద్ద ఎక్కి...ప్రకృతి చికిత్సాలయం రైల్వే స్టేషన్ వద్ద దిగుతుంటుంది. బుధవారం రోజు మాదిరిగా విధులకు బయలుదేరింది. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటం చేత ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తోంది. ఇదే క్రమంలో మాధవి అశ్విని సెల్‌ఫోన్ మాట్లాడుతోంది. సెల్‌ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఫోన్ కిందపడింది. అప్పుడే ఎంఎంటీఎస్ రైలు ఒక పట్టా నుంచి మరో పట్టాకు క్రాసింగ్ జరుగుతోంది. సెల్‌ఫోన్‌ను అందుకోవడానికి కిందకు వంగడం, రైలు క్రాసింగ్ జరగడం ఒకే సమయంలో జరగడంతో ప్రమాదవశాత్తు జారి కిందపడింది. కిందపడ్డ యువతి రైలు చక్రాల కిందకు చేరుకుంది. దీంతో ఆమె దేహం రెండు ముక్కలుగా తెగిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించి ఉస్మానియా మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా మాధవి అశ్వినికి వివాహం కాలేదు. ఫుట్‌బోర్డు ప్రయాణమే ఆమె మరణానికి కారణమైనట్లు పోలీసులు తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టికెట్ తీసుకుంటుండగా బాలుడి కిడ్నాప్..!
సాక్షి, హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటుండగా తమ కుమారుడు జయప్రకాష్ (విక్కీ) కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ చుట్టు పక్కల అంతా వెతికామని, విక్కీ జాడ తెలియరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండో దశ..నిరాశ
సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రహసనంగా మారాయి. ఐదేళ్లుగా కొనసాగుతున్న పనులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పనులు పూర్తయిన మార్గాల్లో రైళ్లు పట్టాలెక్కలేదు. రెండో దశ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి 2013లో ప్రారంభించే వరకు, తర్వాత పనులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలొచ్చాయి. ఏడాదికోసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా రైల్ నిలయంలో పార్లమెంట్ సభ్యుల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ ప్రాజెక్టు మాత్రం నత్తనడకనే సాగుతుండడం నేతల అంకితభావానికి అద్దం పడుతోంది. రెండో దశ రైళ్లను పట్టాలెక్కించేస్తామని రెండేళ్ల క్రితం అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ చెప్పారు. ఆరు మార్గాల్లో చేపట్టిన పనులను దశలవారీగా పూర్తిచేసి గత డిసెంబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ మరో డిసెంబర్ వచ్చినా రెండో దశ ఎంఎంటీఎస్ ఎక్కడా కనిపించనే లేదు. ఆర్టీసీ తర్వాత ప్రజా రవాణాలో కీలకమైన ప్రాజెక్టుగా భావించే ఎంఎంటీఎస్‌పై కమ్ముకున్న నిర్లక్ష్యపు నీడలు తొలగిపోవడం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లోనూ ఈ ప్రాజెక్టుకు స్థానం లభించడం లేదు. చివరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ప్రసంగాల్లోనూ ఈ ప్రాజెక్టు పత్తా లేదు. హైదరాబాద్‌లో ప్రజారవాణా విస్తరణకు మెట్రో రైల్‌ను ఏకైక మార్గంగా భావిస్తున్నారు. కానీ నగర శివార్లను అనుసంధానం చేస్తూ అనూహ్యంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాన్ని అందజేసే ముఖ్యమైన ప్రాజెక్టు ఎంఎంటీఎస్ మాత్రమే. ఎన్నో ఏళ్లుగా అదే నిర్లక్ష్యం.. పటాన్చెరు, ఘట్కేసర్, మేడ్చల్, ఉందానగర్, శంషాబాద్ తదితర నగర శివార్లను కలుపుతూ ఎంఎంటీఎస్ రెండో దశను రూపొందించారు. చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 5.75 కి.మీ, బొల్లారం–మేడ్చల్ (14 కి.మీ) మాత్రం పూర్తయ్యాయి. బొల్లారం–సికింద్రాబాద్ మధ్య రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు కూడా పూర్తి చేసి రైళ్లు నడిపేందుకు అనుకూలమేనని సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ రెండు మార్గాలు మినహాయించి మిగతా మౌలాలీ–ఘట్కేసర్, సనత్‌నగర్–మౌలాలి, ఫలక్‌నుమా–ఉందానగర్ తదితర మార్గాల్లో పనులు సాగుతునే ఉన్నాయి. సుమారు రెండేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న మౌలాలి– సనత్‌నగర్ మార్గంలో రక్షణశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇటీవల పరిష్కారం లభించింది. కానీ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఈ రూట్లో డిఫెన్స్ భూముల్లోంచి మూడు కి.మీ మేర రైల్వేలైన్లను వేయాల్సి ఉంది. రక్షణశాఖ అధికారులు అడ్డుకోవడంతో రెండేళ్ల క్రితం పనులు నిలిచిపోయాయి. సుమారు రూ.850 కోట్ల అంచనాతో 2012లో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను తర్వాత ఏడాదికి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అడ్డంకులతో సాగుతున్నాయి. మొత్తం 88.05 కి.మీ మేర రెండో దశ కింద చేపట్టారు. కనీస సదుపాయాలు లేని స్టేషన్లు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, నాంపల్లి–సికింద్రాబాద్ మార్గాల్లోని 26 స్టేషన్లలో చాలా వరకు రోడ్డు కనెక్టివిటీ, సిటీ బస్సు సదుపాయం లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ మార్గాల్లో ప్రతిరోజు 121 సర్వీసులు సడుస్తున్నాయి. లక్షా 50 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. లింగంపల్లి, హైటెక్‌సిటీ, బేగంపేట్, సికింద్రాబాద్, కాచిగూడ, విద్యానగర్, నాంపల్లి వంటి కొన్ని ప్రధాన స్టేషన్లు మినహాయించి మిగతా స్టేషన్లకు సిటీ బస్సు సదుపాయం లేదు. ట్రైన్ దిగిన ప్రయాణికులు కనీసం రెండు కి.మీ నడిస్తే తప్ప బస్సులు లభించని పరిస్థితి. దీంతో ప్రయాణికులు ఆటోడ్రైవర్ల దోపిడీకి గురవుతున్నారు. కేవలం రూ.8 తో 30 కి.మీ. ఎంఎంటీఎస్‌లో ప్రయాణం చేసినవారు మరో 2 కి.మీ. కోసం రూ.50 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఫలక్‌నుమా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, సీతాఫల్మండి, బోరబండ, హఫీజ్‌పేట్, మల్కాజిగిరి తదితర స్టేషన్లకు రోడ్డు కనెక్టివిటీ అంతంత మాత్రమే కావడం సమస్యగా మారింది. ఇక వేసవిలో స్టేషన్లలో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్‌నీర్ లభించడం లేదు. నల్లాల్లో నీరు రాదు. మరోవైపు స్వచ్ఛరైల్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు రైల్వే స్టేషన్లను వెక్కిరిస్తున్నాయి. ప్రత్యేక లైన్ లేకపోవడంతో సమస్య ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకల్లోనూ జాప్యం ప్రయాణికుల పాలిట పెద్ద శాపం. రైళ్లు నడిచేందుకు ప్రత్యేకమైన లైన్ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్లు నడిచే మార్గాల్లోనే వీటిని నడుపుతున్నారు. దీంతో ఎక్స్‌ప్రెస్, మెయిల్ సర్వీసులు వచ్చి వెళ్లే వరకు ఎంఎంటీఎస్ రైళ్లు ప్లాట్‌ఫామ్‌లపైనే నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కొన్నిసార్లు సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేయడం పెద్ద శాతంగా మారింది. 2003లో ఎంఎంటీఎస్‌ను ప్రారంభించినప్పుడు ఈ రైళ్ల కోసం ఒక ప్రత్యేక లైన్ ఉండాలని ప్రతిపాదించారు. 2019 నాటికి కూడా అలాంటి లైన్ ఒకటి నిర్మాణం కాకపోవడం గమనార్హం. రెండో దశ ప్రాజెక్టు ఇదీ.. ♦ మౌలాలి–ఘట్కేసర్ 12.20 కి.మీ ♦ ఫలక్‌నుమా–ఉందానగర్–ఎయిర్‌పోర్టు 20 కి.మీ ♦ బొల్లారం–మేడ్చల్ 14 కి.మీ ♦ సనత్‌నగర్–మౌలాలి 22.10 కి.మీ ♦ తెల్లాపూర్ –రామచంద్రాపురం 5.75 కి.మీ ♦ మౌలాలి–సీతాఫల్మండి 10 కి.మీ మొత్తం రూట్ పొడవు 88.05 కి.మీ -
పట్టాలెక్కవా?
సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లకేళ్లుగా అదే నిర్లక్ష్యం. నగరంలో చేపట్టిన రైల్వేప్రాజెక్టులన్నీ ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయి. 5 సంవత్సరాల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశలో ఇప్పటి వరకు ఒక్క లైన్ కూడా పూర్తి కాలేదు. గత ఏడాది డిసెంబర్ నాటికే రెండో దశ రైలు పట్టాలెక్కుతుందన్న హామీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కూడా అమలయ్యే దాఖలాలు కనిపించడం లేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రతిపాదనకు రెండేళ్లు దాటినా ఒక్క రాయి కూడా వేయలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పగటి కలగామారింది. నగరంలోని మూడు ప్రధాన స్టేషన్లపైన ఒత్తిడిని తగ్గించేందుకు చర్లపల్లి, వట్టినాగులపల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వే టర్మినళ్లపై ఎలాంటి కదలిక లేదు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఎంపీల సమావేశాలు కేవలం ప్రహసనంగా మారాయి. వచ్చే జనవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వేలో ప్రజల సమస్యలు, డిమాండ్లు, ప్రతిపాదనలపైన రేపు రైల్‌నిలయంలో నిర్వహించనున్న ఎంపీల సమావేశం మరోసారి మొక్కుబడి జాబితాలో చేరిపోతుందా...లేక ఏ ఒక్క ప్రాజెక్టునైనా సాధిస్తుందా...ప్రజల అవసరాలను, డిమాండ్లను ప్రతిపాదిస్తుందా... వేచి చూడాల్సిందే. ఎంఎంటీఎస్ రెండో దశ నత్తనడక... గత సంవత్సరం డిసెంబర్ నాటికి 10 కిలోమీటర్ల బొల్లారం–సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ లైన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఏడాది గడిచింది. ఈ మార్గంలో భద్రతా కమిషన్ తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్లు రాలేదు. పట్టాలెక్కలేదు.ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుపనున్నట్లు చెప్పారు. పటాన్చెరు–తెల్లాపూర్ మధ్య ఎంఎంటీఎస్ పరుగులు తీస్తుందన్నారు. ఇప్పటి వరకు అతీ గతీ లేదు. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు, అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్తలైన్ల నిర్మాణం రద్దయిపోయింది. మౌలాలీ–సనత్‌నగర్ మధ్య 5 కిలోమీటర్ల మేర రక్షణశాఖ భూముల్లో రెండో దశ లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణకు రక్షణశాఖ నుంచి అనుమతి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇవీ పనులు...... రెండో దశలో ఘట్కేసర్ నుంచి మౌలాలీ వరకు 14 కిలోమీటర్లు కొత్త లైన్లు వేసి విద్యుదీకరించాలి. సనత్‌నగర్ నుంచి మౌలాలీ వరకు 23 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించవలసి ఉంది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరించవలసి ఉంది. బొల్లారం –మేడ్చల్ మధ్య మరో 14 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాలి. తెల్లాపూర్ నుంచి పటాన్చెరు వరకు 10 కిలోమీటర్ల పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండో దశలో ఫిరోజ్‌గూడ, సుచిత్ర జంక్షన్, బిహెచ్ఈఎల్, భూదేవీనగర్, మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేçషన్లు నిర్మించవలసి ఉంది. కానీ ఇప్పటి వరకు స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కదలిక లేని చర్లపల్లి టర్మినల్ ...... వట్టినాగులపల్లి టర్మినల్ ఇప్పట్లో నిర్మించలేకపోయినా, హైదరాబాద్ అవసరాల దృష్ట్యా ఈ ఏడాది చర్లపల్లి టర్మినల్ విస్తరణ చేపట్టి వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. కానీ టెండర్లు ఖరారు కాలేదు. ఇప్పట్లో పనులు ప్రారంభమవుతాయన్న ఆశలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల పైన పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని 4వ రైల్వే టర్మినల్‌గా చర్లపల్లిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితం ప్రతిపాదించారు. సుమారు వంద ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ టర్మినల్ కోసం రూ.250 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గతేడాది రైల్వేశాఖ రూ.80 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. మొదట 6 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించి, కనీçసం 100 రైళ్ల రాకపోకలకు అనువుగా దీన్ని అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ అంతే సంగతులు.. లక్షలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు మార్గంపైన కూడా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ ఏడాది టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగానే భావించింది. కానీ నిధులు మాత్రం అందజేయలేదు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లను పొడిగించి విద్యుదీకరించవలసి ఉంది. ఇందుకోసం రూ.330 కోట్లతో అంచనాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా 51 శాతం నిధులను, మిగతా 49 శాతం నిధులను రైల్వేశాఖ అందజేçయాల్సి ఉంది. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సికింద్రాబాద్ నుంచి నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోవలసి ఉంటుంది. అటకెక్కిన సికింద్రాబాద్ ఆధునీకరణ... అంతర్జాతీయ ప్రమాణాల మేరకు, విమానాశ్రయంలోని సేవలు, సదుపాయాలను తలదన్నేవిధంగా చారిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రెండేళ్ల క్రితం బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రయాణికుల సదుపాయాలు, వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని భావించారు. మల్టిప్లెక్స్ థియేటర్లు, బడ్జెట్ హోటళ్లు, అత్యాధునిక వినోద సదుపాయాలతో సికింద్రాబాద్‌ను ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన అటకెక్కింది. స్టేషన్లో నిర్మించతలపెట్టిన నాలుగో వంతెన నిర్మాణానికి కూడా ఇప్పటికీ మోక్షం కలుగలేదు. -
ఎంఎంటీఎస్‌కు పదిహేనేళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సిటీ బస్సులే అందుబాటులో ఉన్న రోజుల్లో ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ వ్యవస్థ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు నగరం రెండు వైపులనుఅనుసంధానించేదిగా నిలిచింది. ప్రస్తుతం 121 సర్వీసులతో ప్రతిరోజు 1.6 లక్షల మంది రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్2003 ఆగస్టు 9న తొలి రైలు పట్టాలెక్కినేటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రైలు పరుగులు ఇలా మొదలు.. పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, అన్నింటికీ మించి వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో రూ.69.50 కోట్లతో ఈ లోకల్ రైళ్లు పట్టాలెక్కాయి. మొదట సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటి ఉపప్రధాని ఎల్కే అద్వానీ ముఖ్య అతిథిగా హాజరై ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. అనతి కాలంలోనే సేవలు విస్తరించి సికింద్రాబాద్–ఫలక్‌నుమా మధ్య కూడా సర్వీసులను ప్రారంభించారు. మొదట 25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు.. ప్రయానికుల రద్దీకి అనుగుణంగా 2005 నాటికి సర్వీసుల సంఖ్య 48కి పెరిగాయి. ప్రస్తుతం 121 సర్వీసులు తిరుగుతున్నాయి. సుమారు లక్షా 60 వేల మంది ఎంఎంటీఎస్‌ను వినియోగించుకుంటున్నారు. రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో 2009లో బోగీల సంఖ్యను 6 నుంచి 9కి పెంచారు. అటు హైటెక్ సిటీ నుంచి ఇటు పాతనగరం వరకు అన్ని వర్గాల జీవితాల్లో ఎంఎంటీఎస్ ఒక భాగమైంది. ఈ క్రమంలోనే 2010లో మహిళల కోసం ‘మాతృభూమి’ని అందుబాటులోకి వచ్చారు. ప్రయాణికుల రద్దీ మేరకు రెండో దశ విస్తరణకు చర్యలు చేపట్టారు. ఇందులో సికింద్రాబాద్–బొల్లారం మధ్య త్వరలో రెండో దశ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అటు ఘట్కేసర్ నుంచి ఇటు పటాన్చెరు, తెల్లాపూర్ వరకు, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు నగరం నలువైపులా శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 2013లో రెండోదశ నిర్మాణం చేపట్టారు. నేడు పుట్టిన రోజు వేడుక నిత్యం ఎంఎంటీఎస్‌లో ప్రయానించే కొంతమంది ప్రయాణికులు కలిసి 10 ఏళ్ల క్రితం ‘ఎంఎంటీఎస్ ట్రావెలర్స్ అసోసియేషన్’ను ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఏటా ఆగస్టు 9న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘ఎంఎంటీఎస్ పుట్టిన రోజు’ వేడుకలు నిర్వహిస్తుంది. రైల్వే ఉన్నతాధికారులు, ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం 15 ఏళ్లు నిండిన సందర్భంగా గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేçషÙన్ 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు సంఘం ప్రతినిధులు చంద్ర, రవి తదితరులు తెలిపారు. అలాగే హైటెక్‌సిటీ స్టేషన్లో మొక్కలు నాటనున్నారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మా సేవలు ఎలా ఉన్నాయి.. నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభించిన 15 ఏళ్లు నిండిన సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రయాణికుల అభిప్రాయాల సేకరిస్తోంది. వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఆశిస్తోంది. ఎలాంటి సర్వీసులను కోరుకుంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. స్టేషన్లలో ఉన్న సమస్యలు వంటిపై ఆరా తీస్తోంది. ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను uఠిఝఝ్టటఃజఝ్చజీ .ఛిౌఝకు మెయిల్ ద్వారా తెలియజేవచ్చు. ఈ మేరకు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక లోగోను విడుదల చేశారు. -
శివారు.. సిటీ.. ఓ ఎంఎంటీఎస్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతాలను నగరంతో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ మొత్తం 96.25 కి.మీల దూరంతో రూ.641 కోట్ల అంచనా వ్యయంతో 2012– 13లో ఈ పనులకు అనుమతులు వచ్చాయి. పెరిగిన అంచనా వ్యయం మేరకు రూ.817 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రాష్ట్రం రూ.544 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే రూ.272 కోట్లు భరించాలి. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.110 కోట్లు మాత్రమే విడుదల చేయగా, దక్షిణ మధ్య రైల్వే తన వంతు నిధులను పూర్తిగా ఖర్చు చేసింది. మిగతా నిధులు కూడా విడుదలైతే ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకువస్తా మని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ పనులు పూర్తయితే తెల్లాపూర్–రామచంద్రాపురం, సనత్‌నగర్–మేడ్చల్–బొల్లారం, ఫలక్‌నుమా–ఉందానగర్ ప్రాంతాలు.. శంషాబాద్ విమానాశ్రయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో సులువుగా అనుసంధానం అవు తాయి. ఫలితంగా నగరవాసులకు భారీగా సమయం, ఇంధన ఆదా, ప్రయాణ ఖర్చులు కలసి వస్తాయి. పెరిగిన అంచనా వ్యయం.... ప్రారంభం నాటి అంచనా ప్రకారం ప్రాజెక్టు విలువ రూ.641 కోట్లు.. తరువాత భూసేకరణ, పనుల్లో జాప్యం తదితర సమస్యల కారణంగా రూ.817 కోట్లకు చేరింది. మిగతా మార్గాల్లో సమస్యలు కొలిక్కి రాగా, సనత్‌నగర్–మౌలాలి మార్గంలోని సుచిత్ర ప్రాంతంలో భూ సేకరణపై కాస్త ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై ద.మ.రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి.. ♦ 1. తెల్లాపూర్–రామచంద్రాపురం ♦ 2. సికింద్రాబాద్–బొల్లారం ఇంకా రావాల్సింది.. రూ.434 కోట్లు.. ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 18 నాటికి పనులు పూర్తవ్వాలి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వాటాలోని మిగిలిన రూ.434 కోట్లు కూడా విడుదలైతే త్వరలోనే రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ మార్గాలివే... 1.ఫలక్‌నుమా–ఉందానగర్–శంషాబాద్ ఎయిర్‌పోర్టు (13.5 కి.మీ.+6.5 కి.మీ.) డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్ పనులు. అంచనా వ్యయం రూ.85 కోట్లు. (ఇందులో ఉందానగర్– ఎయిర్‌పోర్టు 6.5 కి.మీ.ల దూరంలో కొత్త రైల్వేలైను నిర్మాణ పనులకు ఇంకా అనుమతి రాలేదు.) 2.తెల్లాపూర్–రామచంద్రాపురం (5.75కి.మీ). పాత ట్రాక్‌ను పునరుద్ధరణ+విద్యుదీకరణ. అంచనా వ్యయం రూ.32 కోట్లు 3. సికింద్రాబాద్–బొల్లారం (14కి.మీ.).ఎలక్ట్రిఫికేషన్+స్టేషన్ ఆధునీకరణ.అంచనా వ్యయం రూ.30 కోట్లు 4.సనత్‌నగర్–మౌలాలి (22.4 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.170 కోట్లు 5. మౌలాలి–మల్కాజిగిరి–సీతాఫల్మండి (10 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.25 కోట్లు 6. బొల్లారం–మేడ్చల్ (14 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.74 కోట్లు. 7. మౌలాలి–ఘట్కేసర్ (12.2 కి.మీ.).నాలుగులైన్ల నిర్మాణం+ఎలక్ట్రిఫికేషన్.అంచనా వ్యయం రూ.120 కోట్లు 8. ప్రయాణికుల సదుపాయాలకురూ.20 కోట్లు 9. రైలు కోచ్‌లకు రూ.85 కోట్లు మొత్తం వ్యయం... 641 కోట్లు గడువులోగా పూర్తి చేస్తాం... ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు పూర్తిగా సహకరిస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో సమావేశం నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కూడా విడుదల చేసింది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది. – వినోద్‌కుమార్ యాదవ్, జీఎం, ద.మ. రైల్వే -
మెట్రో రైలుపై అంచనాలు తప్పాయా?
మహానగరంలో మెట్రో రైలు పరుగుపై అధికారులు పెంచుకున్న అంచనాలు తప్పాయి. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని భావించగా.. ఇందులో సగం మంది కూడా ప్రయాణించడం లేదు. గ్రేటర్లో మెట్రో రైలు పరుగులు మొదలై బుధవారానికి 22 రోజులు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో సుమారు 25 లక్షల మంది జాయ్‌రైడ్ చేసి ఆనందించారు. శని, ఆదివారాల్లో రద్దీ రెండు లక్షలు కాగా.. మిగతా రోజుల్లో కనాకష్టంగా లక్ష మంది ప్రయాణించారు. దీనికంతటికీ ఆయా స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడం, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడమే కారణమని తేలింది. నగరవాసులకు ప్రయాణ సేవలు అందిస్తున్న ఎంఎంటీఎస్‌పై మెట్రో రైలు ప్రభావం చూపిస్తుందని అంతా భావిస్తే.. ఇప్పుడా లెక్క తప్పని తేలింది. సిటీలో మెట్రో రైలు 22 రోజులుగా పరుగులు తీస్తున్నా ఎంఎంటీఎస్‌కు ప్రయాణికుల ఆదరణ మాత్రం తగ్గలేదు. రోజూ సుమారు 1.50 లక్షల మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు ఎంఎంటీఎస్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో వల్ల సికింద్రాబాద్–హకీంపేట్ మార్గంలో కొంతమేర ప్రభావం ఉండవచ్చని మొదట్లో రైల్వే వర్గాలు భావించినా రద్దీ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతోంది. దీనికి ఎంఎంటీఎస్ సేవలు ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండడం, టికెట్ ధర కూడా తక్కువ కావడమేనని అధికారులు భావిస్తున్నారు. 22 రోజుల్లో 25 లక్షల మంది మెట్రో జర్నీ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మెట్రో రైలు పరుగులు తీస్తున్న నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని తొలుత అధికారులు వేసిన అంచనాలు తల్లకిందులైంది. ఈ 22 రోజుల్లో కేవలం 25 లక్షల మంది మాత్రమే ప్రయాణించినట్టు లెక్క తేల్చారు. అదీ శని, ఆదివారాల్లోనే రద్దీ పెరిగినట్టు గుర్తించారు. మెట్రో నడుస్తున్న మొత్తం 30 కి.మీ. మార్గంలోని 24 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పార్కింగ్ సదుపాయం ఉన్న స్టేషన్లు కేవలం ఐదు మాత్రమే. మిగతా 19 స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్య జఠిలంగా మారడంతో వ్యక్తిగత వాహనాలతో స్టేషన్లకు వచ్చినవారికి అగచాట్లు తప్పడంలేదు. వసతుల లేమితో వెనుకంజ నగరంలోని మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు సమీప కాలనీల నుంచి ఆర్టీసీ ఫీడర్ బస్సులు అరకొరగానే నడుస్తున్నాయి. ఇక స్టేషన్లకు లక్షలాదిమంది ప్రయాణికులు ఒకేసారిగా తరలివస్తే రద్దీ నియంత్రణ కష్టతరమవుతోంది. స్టేషన్లలో మంచినీరు వసతి అసలే లేకపోవడం, టాయిలెట్ వసతులు అరకొరగా ఉండడం.. అదీ పెయిడ్ విధానం కావడం పట్ల ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపడం లేనట్టు తెలుస్తోంది. ఇక టోకెన్లు, స్మార్ట్‌కార్డుల కొనుగోలు, వాటి రీచార్జి వంటి అంశాలపై ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా మెట్రో నేర్పిన పాఠాలు.. అధికారులు నేర్వాల్సిన గుణపాఠాలు.. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు.. పబ్లిక్ డిమాండ్స్ ఇలా ఉన్నాయి.. ♦ పార్కింగ్ పరేషాన్ పరిష్కరించాలి: మొత్తం 24 స్టేషన్లల్లో మియాపూర్, రసూల్‌పురా, సికింద్రాబాద్ పాత జీహెచ్ఎంసీ కార్యాలయం, నాగోల్ మెట్రో డిపో, చాలిస్ మకాన్ (అమీర్‌పేట్)లో మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. అన్ని చోట్లా ఉచిత పార్కింగ్ వసతి కల్పించాలని సిటీజన్లు కోరుతున్నారు. ♦ ఫీడర్ బస్సుల సంఖ్యను పెంచాలి: ప్రస్తుతం 30 కి.మీ. మెట్రో కారిడార్‌లో సమీప కాలనీలకు ఆర్టీసీ కేవలం 50 ఫీడర్ బస్సులను 10 రూట్లలో మాత్రమే నడుపుతోంది. ప్రతీ స్టేషన్ నుంచి 25 బస్సులు నిరంతరం సమీప కాలనీలు, బస్తీలకు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలి. ♦ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందే: నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ) మార్గంలో ప్రస్తుతం 7 చొప్పున 14 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక రద్దీ నేపథ్యంలో వీటి సంఖ్యను పదికి పెంచాలన్నది పబ్లిక్ డిమాండ్. ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ 10–15 నిమిషాలుగా ఉంది. దీన్ని 5 నిమిషాలకు తగ్గించాలి. ♦ రద్దీ నియంత్రణ : శని,ఆదివారాల్లో మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్‌ను తలపిస్తున్నాయి. వేలాదిమంది పిల్లాపాపలతో స్టేషన్లకు తరలివస్తున్నారు. రద్దీ నియంత్రణకు పోలీసు శాఖ సహకారంతో తొక్కిసలాట జరగకుండా స్టేషన్లలోనికి, ప్లాట్ఫారం పైకి, బోగీల్లోకి వెళ్లే సమయంలో క్యూపద్ధతి, బార్కేడింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. ♦ స్మార్ట్‌కార్డు, మొబైల్యాప్: మెట్రో స్మార్ట్‌కార్డు ప్రస్తుతానికి మెట్రో జర్నీకే ఉపయుక్తం. దీని ద్వారా షాపింగ్, ఇంధన అవసరాలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఇలా 16 రకాల సేవలు అందేలా చర్యలు తీసుకుంటే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. ఈ కార్డు ద్వారా అందే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన పెంచాలి. ఇక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ‘టి–సవారీ’ యాప్ ఉపయోగాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సివుంది. ♦ టోకెన్ల తకరారు: స్టేషన్లలో టిక్కెట్ విక్రయయంత్రాల వద్ద పాతనోట్లను యంత్రాలు తిరస్కరిస్తున్నాయి. టిక్కెట్‌కు సరిపడా చిల్లర లభించక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. వీటి వినియోగం పైనా జర్నీ చేసేవారికున్న అపోహలను మెట్రో అధికారులు తొలగించాల్సిన అవసరం ఉంది. ♦ మంచినీరు, టాయిలెట్స్: మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు దాహార్తిని తీర్చుకునే అవకాశం లేక విలవిల్లాడుతున్నారు. ప్రతీ స్టేషన్లో స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ఇక స్టేషన్లలో ఉన్న పే అండ్ యూజ్ టాయిలెట్లు.. అదీ అరకొరగానే ఉండడంతో ప్రయాణీకుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తక్షణం స్టేషన్ రెండు చివరలా అత్యధికులు ఉపయోగించుకునేలా ఉచిత టాయిలెట్లు ఉండాలి. ♦ ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ ఫర్నిచర్: ప్రతీ స్టేషన్ వద్ద తీరైన ఫుట్‌పాత్‌లు, బస్‌లు, ఆటో, క్యాబ్‌లు నిలిపేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్న అధికారుల మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. పలు స్టేషన్ల వద్ద ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నాయి. ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు, హరిత వాతావరణం ఏర్పాటు చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను తక్షణం పూర్తిచేయాలి. ♦ అమ్మో సైకిల్‌స్టేషన్లు: ప్రస్తుతానికి మియాపూర్ మెట్రోడిపోలనే ఈ సదుపాయం ఉంది. మరిన్ని స్టేషన్లకు ఈ సదుపాయం కల్పించాలని.. సైకిలింగ్ క్లబ్లో ప్రవేశించేందుకు సభ్యత్వ రుసుం సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ మెట్రో రూట్లలో తగ్గని ట్రాఫికర్: ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో జర్నీ చేస్తున్నవారి సంఖ్య లక్షకు మించడం లేదు. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో ట్రాఫికర్ అధికంగానే కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ వసతి లేకపోవడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సమస్య కారణంగా మెజార్టీ సిటీజన్లు తమ వాహనాలనే నమ్ముకుంటున్నారు. దీంతో మెట్రో రూట్లలో ఉదయం,సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ టెర్రర్ అలాగే ఉంది. ♦ హైటెక్‌సిటీ.. ఎల్బీనగర్ వరకు ఉండాలి: అమీర్‌పేట్ వరకున్న మెట్రో మార్గాన్ని ఇటు హైటెక్‌సిటీ.. అటు ఎల్బీనగర్ వరకు పొడిగిస్తేనే మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని మెజార్టీ సిటీజన్ల అభిప్రాయం ప్రధానంగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో పలు ఆస్తుల సేకరణ, స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల డిజైన్లు మమార్చడం, సైబర్ టవర్స్, శిల్పారామం ప్రహరీల కూల్చివేతలు రీడిజైనింగ్ కారణంగా.. ఈ ప్రాంతాల్లో మెట్రో రూటు పనులు జఠిలంగా మారనున్నాయి. అమీర్‌పేట్– ఎల్బీనగర్ మార్గంలో లక్డీకాపూల్ వద్ద రైలు ఓవర్‌బ్రిడ్జీ నిర్మాణం, పుత్లీబౌలి వద్ద మెట్రో పనులు నత్తనడకన సాగుతుండడం ప్రతిబంధకంగా మారింది. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఈ రెండు మార్గాలు పూర్తయితేనే మెజార్టీ సిటీజన్లకు మెట్రో జర్నీ ఉపయుక్తంగా ఉంటుంది. ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.... సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ముద్రపడిన మెట్రో రైలు.. ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. గత 22 రోజులుగా మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నా ఎంఎంటీఎస్ సర్వీసులను వినియోగించుకుంటున్న ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు 1.50 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. రెండు రైళ్లు రాకపోకలు సాగించే మార్గాలు వేరు కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే ప్రయాణికులకు ఎంఎంటీఎస్ అందుబాటులో ఉంది. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఐటీ కార్యాలయాలు ఉండడంతో ఎంఎంటీఎస్‌కు డిమాండ్ ఉంది. అటు లింగంపల్లి నుంచి, ఇటు నాంపల్లి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే వాళ్లకు కూడా ఎంఎంటీఎస్ మాత్రమే సౌకర్యంగా ఉంది. నాగోల్–అమీర్‌పేట్– మియాపూర్ మెట్రో మార్గానికి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–హైటెక్‌సిటీ–లింగంపల్లి ఎంఎంటీఎస్ మార్గానికి ఎలాంటి సంబంధం లేదు. దీంతో ఎంఎంటీఎస్‌పై మెట్రో ప్రభావం చూపలేదు. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ, లింగంపల్లికి ఎక్కువ మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్ చౌకైన ప్రయాణం మెట్రో చార్జీలతో పోలిస్తే ఎంఎంటీఎస్ టికెట్ ధరలు చాలా తక్కువ. కనిష్ట చార్జీ రూ.5 కాగా గరిష్ట చార్జీ రూ.10 మాత్రమే. మెట్రోలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు చార్జీ ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు, సిటీ బస్సుల కంటే కూడా ఎంఎంటీఎస్ ప్రయాణం చాలా చౌకగా ఉంది. ప్రయాణికుల ఆదరణ ఏ మాత్రం తగ్గకపోవడానికి ఈ చౌక చార్జీలు కూడా కారణమయ్యాయి. ఎంఎంటీఎస్‌లో రూ.10 టిక్కెట్‌పై ఏకంగా ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు పయనించవచ్చు. అదే మెట్రోలో ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లేలంటే రూ.60 ఖర్చవుతుంది. మరోవైపు కేవలం రూ.450 ఎంఎంటీఎస్ పాస్‌పైన నెలంతా పయనించవచ్చు. ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ప్రస్తుతం రూ.10 ఉంది, కానీ అంతే ధరతో ఎంఎంటీఎస్ టిక్కెట్‌పై 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే సదుపాయం లభించడం గమనార్హం. అందుకే గ్రేటర్లో అన్ని వర్గాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్ ఒక లైఫ్‌లైన్‌గా మారింది. ఉదయం 4 నుంచి రాత్రి 11.30 వరకు కూడా ఈ రైళ్లు అందుబాటులో ఉండడం మరో సదుపాయం. రెండో దశతో మరో 2 లక్షల మందికి సేవలు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పూర్తయితే మరో 2 లక్షల మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది. ముఖ్యంగా అటు పటాన్చెరు–తెల్లాపూర్ నుంచి ఇటు మేడ్చల్–బొల్లారం–సికింద్రాబాద్ వరకు, ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు, ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు నగర శివార్లను కలుపుతూ ఎంఎంటీఎస్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దీంతో ఇప్పటి వరకు కేవలం సిటీబస్సులు మాత్రమే ఉన్న ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు పనులకు నిధుల లేమి గండంగా మారింది. 2012లో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఆరు మార్గాల్లో రూ.812 కోట్లతో అంచనాలను రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొత్తం రూ.1000 కోట్లు దాటినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం మూడొంతుల నిధులను అందజేయాలి. మిగతా 1/4 వంతు రైల్వే అందజేస్తుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి రూ.150 కోట్ల వరకే అందాయి. అన్ని మార్గాల్లో సింగిల్ లైన్ డబ్లింగ్ చేశారు. కొన్ని చోట్ల విద్యుదీకరణ పూర్తయింది. మొత్తం 60 శాతం పనులు పూర్తయ్యాయి. కొత్త రైళ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. అల్వాల్, భూదేవినగర్, తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాలి. ఇంకా కొన్ని రూట్లలో విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు పూర్తి చేయాలి. నిధుల కొరత కారణంగా ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఈ డిసెంబర్‌కు బొల్లారం–సికింద్రాబాద్ మధ్య రెండో దశ రైళ్లు నడపాలని భావించారు. అలాగే ఘట్కేసర్–సికింద్రాబాద్, పటాన్చెరు–తెల్లాపూర్ లైన్లను కూడా వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ నిధుల లేమి కారణంగా పనులు స్తంభించాయి. మెట్రో రెండో దశ పూర్తయితే.. రెండో దశ ఎంఎంటీఎస్ పనుల పూర్తికి డిసెంబర్ గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో 2018లో పూర్తి చేయాలని తాజాగా నిర్ణయించారు. కానీ వచ్చే జూన్ నాటికి మెట్రో రెండో దశ హైటెక్‌సిటీ–రాయదుర్గం లైన్ పూర్తయితే ఎంఎంటీఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులు మెట్రో వైపు మళ్లొచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. నగర శివారును అనుసంధానం చేసే ఎంఎంటీఎస్ రెండో దశను సకాలంలో పూర్తి చేస్తే 2 లక్షల మందికి అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది. -
నిర్లక్ష్యం తీసిన ప్రాణం..
► మట్టిపెళ్లలు పడి కూలీ మృతి ► ఎంఎంటీఎస్ ఆర్యూబీ నిర్మాణంలో దుర్ఘటన సాక్షి, హైదరాబాద్: రైల్వే అధికారుల పర్య వేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చిన కూలీ బతుకు తెల్లారిపోయింది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా రైల్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) కోసం తవ్విన పెద్ద గుంతలో మట్టి పెళ్లలు విరిగిపడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీ శ్రీనివాస్(29) అక్కడికక్కడే మృతిచెం దాడు. బోయినపల్లి పూల్‌బాగ్ వద్ద సోమ వారం ఉదయం 6.30గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.సరైన భద్రతా ప్రమాణాలు పాటించ కపోవడం, అధికారుల పర్యవేక్షణ, నిఘా లోపంవల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని నిపుణులు పేర్కొన్నారు. గుంతలో మట్టి పెళ్లలు విరిగిపడి... ఆర్యూబీ పనులు దక్కించుకున్న కాంట్రా క్టర్లు విజయ్, నాగభూషణ్‌రెడ్డి... మేస్త్రీ రమణ కు ఆ బాధ్యతను అప్పగించారు. కుత్బు ల్లాపూర్ ప్రశాంత్‌నగర్‌లో ఉండే 24 మంది కూలీలతో రెండు రోజుల కిందట రమణ పనులు ప్రారంభించాడు. కాగా, ఆర్యూబీ కోసం తవ్విన 6.5మీటర్ల భారీ గుంతల్లో పేరు కున్న మట్టిని తొలగించి బెడ్లు అమర్చాల్సి ఉంది. ఈ క్రమంలో కూలీలు సోమవారం గుంతల్లోకి దిగి మట్టి తీస్తుండగా... అదే సమయంలో క్రేన్‌తో సిమెంటు దిమ్మెను గుంతలోకి దించేందుకు ఉపక్రమించారు. దిమ్మ... పైనున్న మట్టి దిబ్బలకు తగిలి మట్టి పెళ్లలు గుంతలో ఉన్న కార్మికులపై పడ్డాయి. దీంతో లోపలున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించగా, మరో కార్మికుడు శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాము, రామారావు, ఆనంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని బీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలిం చారు. మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. రూ.9 లక్షల నష్టపరిహారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కాంట్రక్ట ర్ నుంచి శ్రీనివాస్ కుటుంబానికి రూ.9లక్షల నష్టపరిహారం, రూ.50వేలు దహన సంస్కా రాలకు ఇప్పించారు. గాయపడ్డ వారికి మెరు గైన చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కాంట్రాక్టర్‌పై కేసు... రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శ్రీనివాసరావు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడి కుటుం బాన్ని పరామర్శించారు. బోయినపల్లి పోలీసులు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్‌కు చెందిన క్రేన్ ఆపరేటర్ అజాగ్రత్తవల్లే ఈ ప్రమాదం జరి గిందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. కూలీలు బయట కు వచ్చిన తరువాత బాక్స్‌లను ఏర్పాటు చేసివుంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదని నిపుణులు అంటున్నారు.అక్కడే ఉన్న రైల్వే ఇంజనీరింగ్ అధికారులు... గుంతలో ఉన్న కూలీలను కనీసం అప్రమత్తం చేయకపోవడం గమనార్హం. -
నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
ఈ నెల 15వ తేదీన జరుగనున్న వినాయక నిమజ్జనోత్సవానికి రవాణా, ఆర్టీసీ, రైల్వే విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి సహా వేల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్‌బండ్‌కు తరలించనున్నారు. వాహనాల రద్దీ, తరలింపులో జాప్యం, తదితర ఇబ్బందుల దష్ట్యా రెండు రోజుల ముందు నుంచే విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మండప నిర్వాహకులను నిమజ్జనానికి ప్రోత్సహిస్తున్నారు. అందుకనుగుణంగా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో చర్యలు చేపట్టాయి. నీటిపారుదల, రెవిన్యూ, పోలీసు, రవాణా,తదితర విభాగాలు రంగంలోకి దిగాయి. గత ఏడాది 50 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 60 వేలు దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రధాన నిమజ్జనం జరుగనున్న ట్యాంక్‌బండ్‌తో పాటు, నగరంలోని ఇతర చెరువుల వద్ద మొత్తం 64 భారీ క్రేన్లను అందుబాటులో ఉంచేందుకు నీటిపారుదలశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. అలాగే, విగ్రహాల తరలింపు కోసం భారీ వాహనాలతో పాటు, తేలికపాటి వస్తు రవాణా వాహనాల వరకు 3500 పైగా సమకూర్చేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి టోకెన్ తీసుకొని వచ్చే మండపాల నిర్వాహకులకు వాహనాలను అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. అన్ని చోట్లా అందుబాటులో క్రేన్లు... ట్యాంక్‌బండ్‌కు రెండు వైపులా 34 భారీ క్రేన్లను ఈ సారి ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు, మీరాలం ట్యాంకు, రాజన్నబౌలీల్లో ఒక్కోటి, సరూర్‌నగర్ చెరువులో 7, కూకట్పల్లి ఐడీపీఎల్ చెరువులో 4, ప్రగతినగర్ చెరువులో 2, సఫిల్‌గూడ చెరువులో 2, కాప్రా చెరువులో 5, దుర్గం చెరువు-2, అల్వాల్ కొత్త చెరువు-1,పల్లెచెరువు-2,పత్తికుంట చెరువు-1, వెన్నెలగడ్డ చెరువు-1,ఏదులాబాద్, షేక్‌పేట్, సూరారం, జీడిమెట్ల, మేడ్చెల్, శంషాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున క్రేన్లు ఏర్పాటు చేస్తారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌కే తరలించకుండా సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో 3500 వాహనాలు.... ప్రధాన నిమజ్జన వేడుకలు జరుగనున్న 15వ తేదీన విగ్రహాల తరలింపు కోసం ఇప్పటికే 3500 వాహనాలను సిద్ధం చేశారు. డిమాండ్ మేరకు మరిన్ని వాహనాలను సమకూర్చనున్నట్లు జేటీసీ తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచే వాహనాలను మండపాల నిర్వాహకులకు అందజేస్తారు. ఇందుకోసం వారు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి టోకెన్ తీసుకోవలసి ఉంటుంది. నాగోల్, మలక్‌పేట్, టోలీచౌకి, జూపార్కు,ఆరాంఘర్,నెక్లెస్‌రోడ్డు, తిరుమలగిరి, మేడ్చెల్, సుచిత్ర, గచ్చిబౌలి, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, అత్తాపూర్, తదితర కేంద్రాల్లో వాహనాలను అందుబాటులో ఉంచుతారు. మండపాల నిర్వాహకులు తమ సమీపంలోని ప్రాంతీయ రవాణా అధికారుల సహాయంతో వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. భారీ ట్రేలర్లకు రూ.20 వేలు, లారీలకు రూ.4,500, మధ్యతరహా వాహనాలకు రూ.5,500, టాటాఏసీ వంటి వాహనాలకు రూ.1000 చొప్పున అద్దె ఉంటుంది. ఇవి కాకుండా ట్రేలర్లు మినహా ఇతర వాహనాలకు నిర్వాహకులే డీజిల్ సమకూర్చుకోవాలి. డ్రైవర్, క్లీనర్లకు రూ.500 చొప్పున బత్తా చెల్లించాలి. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు... నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకొని 15వ తేదీ రాత్ర 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ తెలిపారు. నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-నాంపల్లి, లింగంపల్లి-నాంపల్లి,లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ల మధ్య ప్రతి గంటకు ఒక ట్రై యిన్ అందుబాటులో ఉంటుంది. -
ఎంఎంటీఎస్.. భూగర్భంలో..
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో తొలి భూగర్భ రైల్వే మార్గానికి అడుగులు పడుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి నివేదిక అందజేయాల్సిందిగా ‘రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్)’ను రైల్వే శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లో ఆ సంస్థ నివేదికను అందజేయనుంది. హైదరాబాద్ నగరానికి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైల్వే భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్ చిక్కులకు కొంతమేర పరిష్కారంగా గతంలో నిర్మించిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఫలక్‌నుమా స్టేషన్‌తో నిలిచిపోయింది. శివారు ప్రాంతాలను ఎంఎంటీఎస్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు రెండో దశను కూడా రైల్వే ప్రారంభించింది. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించిన రైల్వే.. ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. విమానాశ్రయానికి చేరువగా కాచిగూడ-మహబూబ్‌నగర్ రైలు మార్గంపై ఉన్న ఉందానగర్ స్టేషన్ మీదుగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడి నుంచి విమానాశ్రయం ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యతిరేకిస్తున్న జీఎంఆర్.. విమానాశ్రయం వరకు రైల్వే లైను ఏర్పాటు చేయడాన్ని జీఎంఆర్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని విస్తరిస్తామని, ఇందుకు అదనపు టెర్మినళ్లు, రన్‌వే అవసరం ఉంటుందని, వీటిని దృష్టిలో ఉంచుకుని కొంత స్థలాన్ని సిద్ధంగా ఉంచుకున్నామని చెబుతోంది. రైల్వే లైన్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో విస్తరణ సాధ్యం కాదని సర్వేలో తేలితే.. ఎట్టి పరిస్థితిలో ఎంఎంటీఎస్ లైన్ ఏర్పాటుకు అంగీకరించబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాష్ట్రప్రభుత్వం ద్వారా జీఎంఆర్‌తో మాట్లాడించి ఆమోదం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికీ జీఎంఆర్ అంగీకరించకపోతే భూగర్భ లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌తో విమానాశ్రయాన్ని అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని వెంట ఆదివారం నగరానికి వచ్చిన ప్రభు.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో భేటీ అయిన సందర్భంలో దీనిపై చర్చించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జీఎంఆర్‌తో మాట్లాడినా ఫలితం రాలేదు. ఇప్పుడు మరోమారు మాట్లాడినా సానుకూల ఫలితం వచ్చే అవకాశం లేదని, భూగర్భ ట్రాక్ నిర్మాణం తప్పదనే అభిప్రాయాన్ని రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
ఆ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్–ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య 6 ఎంఎంటీఎస్ సర్వీసులను మూడు నెలల పాటు రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు ఇది అమలులో ఉంటుంది. ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ప్రయోగాత్మకంగా 6 సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. -
నిరాశే మిగిలింది నేస్తం
సురేష్ ప్రభు రైల్వేబడ్జెట్ నగరానికి నిరాశే మిగిల్చింది. హైదరాబాదు నగరానికి ఈ సారి ప్రాధాన్యత లభిస్తుందనుకున్న నగరవాసికి నిరాశే మిగిలింది. ప్రధాన రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తామన్నారే కానీ.. ఆ వివరాలేవీ ప్రకటించలేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు కాస్త ఊరటనిచ్చింది. రాజేంద్రనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎంఎంటీఎస్ పొడిగింపు అంశం ఈ బడ్జెట్లో కూడా లేదు. గురువారం రైల్వేమంత్రి ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌పై పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.. ఆ వివరాలు వారి మాటాల్లోనే.. - సికింద్రాబాద్/రాజేంద్రనగర్/పహాడీషరీష్/కాచిగూడ రైల్వే బడ్జెట్ భేష్ ఆడంబరాలు,అబద్దాలు లేకుండా కేంద్ర రైల్వే బడ్జెట్ వాస్తవానికి అద్దం పట్టింది. తెలంగాణాకు మొత్తం 569 కోట్ల ప్రాజెక్ట్‌లను కేటాయించారు. ఇందులో ముఖ్యంగా మల్కాజిగిరి నియోకజవర్గంలోని చర్లపల్లి టర్మినల్ విస్తరణ, అధునాతన సదుపాయాల కోసం రూ.80 కోట్లను కేటాయించటం సంతోషకరమైన అంశం. చర్లపల్లి టర్మినల్‌ను విస్తరిస్తే ప్రయాణీకులు రైళ్లలోనే గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా పోతుంది. అదే విధంగా సికింద్రాబాద్ స్టేషన్ నుండి వెళ్లే ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా రెండు అన్ రిజర్వుడు బోగీలను వేయాలని నిర్ణయించటం హర్షణీయం. - సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ మల్కాజిగిరి జంట నగరాలకు మొండిచేయి రైల్వే బడ్జెట్ జంట నగరాల ప్రయాణీకులను నిరాశ పరిచింది. గతంలో సికింద్రాబాద్ స్టేషన్ ఎన్డీఏ ప్రకటించిన ప్యాకేజీని పక్కన బెట్టి, కేవలం యాదాద్రికి ఎంఎంటీఎస్ లైన్, చర్లపల్లి టర్మినల్‌కు నిధులు తప్పితే మరేవీ లేవు. - నగేష్ ముదిరాజ్, రైల్వే సలహా సంఘం మాజీ సభ్యులు ఆమోదయోగ్యం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంది. టికెట్ చార్జీలను పెంచకపోగా, ప్రయాణికులకు వసతుల కల్పనలో పెద్దపీట వేశారు. రైలు ప్రయాణాల్లో భద్రత ప్రమాణాలు పెంచేందుకు, బీమా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేయడం అభినందనీయం. బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలను త్వరగా అమలులోకి తెస్తే మంచిది. -రమేశ్, ప్రయాణికుడు వసతులు కరువు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిరాశ పరిచేలా ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశకు అధిక ప్రాధాన్యత ఇస్తారనుకున్నాం. సికింద్రాబాద్ వంటి పెద్ద రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కూడా ప్రాధాన్యం లభించలేదు. ప్రయాణికులకు వసతులు కరువై ఇబ్బందుల పాలవుతున్నా స్టేషన్ల ఆధునీకరణ కోసం బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం విచారకరం. -ఖాజా మోహినుద్దీన్, ప్రయాణికుడు -
కరుణించు ప్రభు!
♦ కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్‌పై ఆశ ♦ శివార్లకు ఎంఎంటీఎస్ వచ్చేనా? ♦ శంషాబాద్‌లో ఎయిర్‌కార్గోకు మోక్షం లభించేనా? ♦ నేటి రైల్వేబడ్జెట్‌పై జిల్లావాసుల గంపెడాశ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్- కృష్ణా బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ కేంద్రం కరుణ కోసం నిరీక్షిస్తోంది. నాలుగేళ్ల క్రితం సర్వే పూర్తిచేసుకున్న ఈ లైను పట్టాలెక్కేందుకు నిధులు విదిల్చకపోతారా? అని ఆశగా చూస్తోంది. 121.70 కిలోమీటర్ల ప్రతిపాదిత ఈ రైలు మార్గానికి రూ.787.80 కోట్లు అవసరమని రైల్వేశాఖ అంచనా వేసింది. అదేసమయంలో సరుకు రవాణాకు ఈలైను అంతగా ఉపయోగపడదని, ప్రయాణికుల నిష్పత్తి కూడా నిర్ధేశితశాతం నమోదు కావడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా భారంగా మారే ఈ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యపడదని స్పష్టం చేసింది. సగటున 14శాతం రేట్ ఆఫ్ రిటర్న్(ఆర్ఓఆర్) ఉన్నవాటికే ప్రాధాన్యమిస్తామని, ఈ మార్గంలో కేవలం 6.9 శాతం మాత్రమే వచ్చే వీలుందని రైల్వే ఇంజినీరింగ్ శాఖ తేల్చిచెప్పింది. ఈ ప్రాంత సామాజిక అవసరాల దృష్ట్యా నిర్మాణ వ్యయంలో సగం వాటాను రాష్ర్ట సర్కారు భరిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఉమ్మడి ప్రభుత్వం భూసేకరణ సహా ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వెచ్చించేందుకు ముందుకొచ్చింది. అందులో భూసేకరణకు రూ.3,683 కోట్లను కూడా విడుదల చే సేందుకు అంగీకరించింది. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైల్వేబోర్డు ఈ లైన్ నిర్మాణానికి ఆసక్తి చూపడంలేదు. 2019 నాటికి ఈ మార్గాన్ని అందుబాటులోకి తెస్తామని నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లో కృష్ణా- వికారాబాద్ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతారో లేదో వేచి చూడాల్సిందే! రైల్వేమంత్రి సురేశ్‘ప్రభు’ రైలుబండిపై జిల్లా ప్రజానీకం గంపెడాశలు పెట్టుకుంది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ‘రైలు కూత’ వినిపించకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులకు లైన్‌క్లియర్, కొత్త మార్గాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్‌కార్గో హబ్‌గా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమం లో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. ఇప్పటికీ అతీగతిలేకుండా పోయింది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్‌ను నిర్మించాలని గతంలో జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించిన ఫైలు అటకెక్కింది. వికారాబాద్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రాజ్‌కోట్, గరీబ్థ్ ్రతదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపాలనే డిమాండ్ ఉంది.ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం చేస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటికీ పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్పల్లి, మల్కాజ్గిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ రైలుబండి.. రాలేదండీ! ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్) రైళ్లను శివారు ప్రాంతాలకు పొడగించాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా రెండో దశ విస్తరణ పనులకు రూ.324 కోట్లను కేటాయించింది. ఈ నిధుల్లో మూడోవంతు నిధులను రైల్వేశాఖ భరిస్తుండగా, మిగతా నిధులను రాష్ర్టం వ్యయం చేస్తోంది. ఈ నిధులతో శివారు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రెండో, మూడు లైన్ ను కొత్తగా వేయాలని ప్రతిపాదించారు. రెండో దశ కింద సికింద్రాబాద్ -మేడ్చల్ (28కి.మీ), ఫలక్‌నుమా -శంషాబాద్ (20కి.మీ), సికింద్రాబాద్- ఘట్కేసర్ (19కి.మీ), అలాగే మౌలాలి -సనత్‌నగర్ (21కి.మీ), మౌలాలి -కాచిగూడ(10కి.మీ), తెల్లాపూర్ -పటాన్చెరు (8కి.మీ) రూట్లలో ఎంఎంటీఎస్‌ను విస్తరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా సిగ్నలింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్త ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లను పొడగించాలనే ఉద్ధేశంతో విడుదల చేసిన నిధులు మూలుగుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటివరకు కనీస భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. -
'యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు పొడిగించండి'
- రైల్వే బోర్డు చైర్మన్‌కు ఎంపీ బూర విజ్ఞప్తి హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టలను కలిసి విజ్ఞప్తి చేశారు. మూడో లైను ఏర్పాటు ద్వారా ఈ సర్వీసులు పొడిగించవచ్చని, తద్వారా రైల్వే శాఖకు కూడా వెసులుబాటు కలుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడింట రెండు వంతుల వ్యయాన్ని భరించేందుకు సిద్ధమైందని ఆయన తెలిపారు. -
యాదాద్రికి ఎంఎంటీఎస్!
చర్లపల్లి వద్ద భారీ టెర్మినల్ ప్రతిపాదనలు రూపొందిస్తున్న రైల్వేశాఖ రానున్న బడ్జెట్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు రాష్ర్ట ప్రతిపాదనలపై కేంద్రం సుముఖత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు ఉద్దేశించిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును భువనగిరి నుంచి రాయగిరి వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. అలాగే చర్లపల్లిలో అతిపెద్ద ప్రయాణికుల టెర్మినల్‌ను నిర్మించాలని భావిస్తోంది. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లోనే ఈ రెండు ప్రాజెక్టులను చేర్చడంతో పాటు, నిధులను కేటాయించేందుకు సన్నాహాలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే భక్తుల కోసం ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రాయగిరి వరకు పొడిగించాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ఒత్తిడి పెరిగినందున చర్లపల్లి, వట్టినాగులపల్లి వద్ద మరో రెండు టెర్మినళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనను కూడా రైల్వేశాఖ ఆమోదించనుంది. అయితే మొదట చర్లపల్లి టెర్మినల్ నిర్మాణానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. ఎంఎంటీఎస్ పొడిగింపుతోపాటు రైల్వే టెర్మినళ్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా అందజేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ఈ రెండు ప్రాజెక్టులను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ ప్రాజెక్టులపై చర్చించారు. తొలగనున్న అడ్డంకులు పటాన్చెరు, ఘట్కేసర్, ఉందానగర్, శంషాబాద్ వంటి నగర శివార్లను కలుపుతూ మొత్తం 6 మార్గాల్లో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుంది. రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు తొలిగిపోయే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మౌలాలీ నుంచి సనత్‌నగర్ మధ్యలోని డిఫెన్స్ ఏరియాలో 5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. అలాగే నగరంలో మరో 50 చోట్ల జీహెచ్ఎంసీ నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ప్రస్తుతం రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున రైల్వేలై న్ల నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోనున్నాయి. మౌలాలి-ఘట్కేసర్, మౌలాలి-సనత్‌నగర్, సనత్‌నగర్-పటాన్చెరు, తెల్లాపూర్-పటాన్చెరు, ఫలక్‌నుమా-ఉందానగర్ , ఉందానగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు ఆరు మార్గాల్లో రూ.850 కోట్లతో రెండో దశ ను ప్రారంభించారు. ఉందానగర్-శంషాబాద్ మార్గంలో తప్ప మిగతా అన్ని మార్గాల్లో పనులు జరుగుతున్నాయి. కొత్తలైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త స్టేషన్ల నిర్మాణం తదితర పనుల వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులను అందజేస్తుంది. శివార్లలోనే నిలిచిపోతున్న రైళ్లు సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు, ఎంఎంటీఎస్ రైళ్లు అన్నీ కలిపి సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ అధికంగా ఉండే రోజుల్లో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరిగిన ఒత్తిడి దృష్ట్యా చాలా రైళ్లు నగర శివార్లలోనే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చర్లపల్లి, వట్టినాగులపల్లిలో టెర్మినల్స్ నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా రవీంద్ర గుప్తా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను పరిశీలించి రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందజేశారు. -
యాదాద్రి వరకు ఎంఎంటీఎస్
- రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసిన సీఎం కేసీఆర్ - భక్తుల సౌకర్యార్థం రెండో దశను విస్తరించాలని విజ్ఞప్తి - ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు అదనపు లైన్ వేయాలి సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్టకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్కేసర్ నుంచి రాయగిరి (యాదాద్రి) వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని కోరారు. అందుకయ్యే ఖర్చులో మూడింట రెండు వంతుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లిస్తామన్నారు. 2016-17 రైల్వే బడ్జెట్లో కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల్లో కొత్త లైన్ విస్తరణకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. హైదరాబాద్‌కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి అభివృద్ధికి 2 వేల ఎకరాల భూములను సేకరించడంతో పాటు పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్-కాజీపేట రైల్వే లైన్ మార్గంలో రాయగిరి రైల్వే స్టేషన్‌కు సమీపంలో యాదాద్రి ఆలయం ఉందని, అందుకే ఎంఎంటీఎస్ రెండో విడతను ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు మరో 32 కిలోమీటర్ల మేరకు ఈ లైన్‌ను పొడిగించి ఎంఎంటీఎస్ సేవలు అందించాలని కోరారు. ఈ అదనపు లైన్ నిర్మాణానికి దాదాపు రూ.330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఎంఎంటీఎస్‌కు సంబంధించి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం అయ్యే ఖర్చులో మూడింట రెండు వంతుల వాటాను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాయగిరి స్టేషన్‌ను ‘యాదాద్రి’ స్టేషన్‌గా పేరు మార్చి అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. యాదాద్రి మాస్టర్ ప్లాన్ సంపూర్ణంగా అమలయ్యే నాటికి యాదాద్రికి ప్రతి రోజు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లే భక్తుల సంఖ్య లక్ష దాటిపోతుందని వివరించారు. -
ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలులో ఆయన ప్రయాణించి, ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై జీఎంకు పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోదశ ఎంఎంటీఎస్ పనులు ప్రారంభమయ్యాయని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం ఇప్పటికే 817 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రక్షణ శాఖతో సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరించుకుని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. -
మళ్లీ బ్రేక్!
- ఎంఎంటీఎస్ రెండో దశను అడ్డుకున్న రక్షణశాఖ - 50 చోట్ల జీహెచ్ఎంసీ నుంచి అందని భూములు - ఎయిర్‌పోర్టు మార్గంపై మరో దఫా చర్చలు సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు మరోసారి బ్రేక్ పడింది. ఫైరింగ్ రేంజ్లో ఉన్న భూమిని రైల్వే లైన్లకు ఇవ్వబోమంటూ రక్షణ శాఖ తెగేసి చెప్పింది. గతంలో తమ నుంచి పొందిన భూములకు ప్రతిగా మరోచోట భూమి కానీ, పరిహారం కానీ ఇవ్వకపోవడం... అదే మార్గంలో ప్రస్తుతం రెండో దశ డబ్లింగ్ పనులు చేపట్టడంతో డిఫెన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ అంశంపై రక్షణ, రైల్వేశాఖల మధ్య ఇప్పటి వరకు ఉన్నత స్థాయి చర్చలు లేకపోవడంతో రెండు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సుచిత్ర నుంచి సనత్ నగర్ వరకు నాలుగు కిలోమీటర్ల మార్గం రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ మార్గంలోనే సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు 1983లో సింగిల్ ట్రాక్ నిర్మించారు. దాని కోసం తీసుకున్న భూమికి ప్రతిగా మరో చోట తమకు స్థలం కేటాయించాలని రక్షణ శాఖ కోరింది. తమకు అంత భూమి అందుబాటులో లేదని, పరిహారం చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే రైల్వే నుంచి డిఫెన్స్‌కు భూమి, పరిహారం.. ఏవీ అందలేదు. ఈ వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది. రెండో దశతో తెరపైకి... తాజాగా రెండో దశ పనుల ప్రారంభంతో పాత వివాదం తిరిగి తెరపైకి వచ్చింది. గతంలో నిర్మించిన సింగిల్ లైన్‌కు పరిహారం చెల్లించకుండా... రెండో దశ కు అదే మార్గంలో డబ్లింగ్ చేపట్టడంతో డిఫెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అప్పట్లోనే తాము 900 ఎకరాలు కోల్పోయామని, మరోసారి భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు చేపట్టిన ఆరు మార్గాల్లోనూ భూముల సేకరణపై ఇప్పటి వ రకు స్పష్టత లేకపోవడం గమనార్హం. రూ.819 కోట్లతో కూడిన ఈ ప్రాజెక్ట్ పనులు 2013లో ప్రారంభమయ్యాయి. 50 చోట్ల ప్రతిష్టంభన.... రెండో దశ ప్రాజెక్టులో చేపట్టిన మౌలాలీ-ఘట్కేసర్, మౌలాలీ-సనత్‌నగర్, బొల్లారం-మేడ్చెల్, సికింద్రాబాద్-బొల్లారం, ఫలక్‌నుమా-ఉందానగర్ మార్గాల్లో సుమారు 50 చోట్ల జీహెచ్ఎంసీ నుంచి 35 ఎకరాలకు పైగా భూమి అందవలసి ఉంది. నిర్మాణ సంస్థ ఆర్వీఎన్ఎల్ ఈ మేరకు ట్రాక్‌ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం భూమి అవసరమని జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు అందజేసింది. వాటిపై ఎలాంటి పురోగతి లేదు. ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 6.5 కిలోమీటర్ల మేర రెండో దశ విస్తరణలోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో దఫా జీఎమ్మార్‌తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
2017 నాటికి పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండోదశను జూన్-డిసెంబర్ 2017 నాటికి పూర్తి చేయాలని అధికారులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. తెలంగాణలోని పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై మంత్రి సోమవారం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ద.మ.రైల్వే జీఎం శ్రీవాత్సవ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, జలమండలి ఎండీ జగదీశ్వర్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్‌బ్రిడ్జిలు, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ ప్రాజెక్టులపై ద.మ. రైల్వే జీఎంతో సమీక్షించారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనులు చర్లపల్లి-ఘట్కేసర్, బొల్లారం-మేడ్చల్ మార్గాల్లో ఊపందుకున్నాయని జీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. సనత్‌నగర్-అమ్ముగూడా మార్గంలో పనులు చేపట్టేందుకు నాలుగు ఎకరాల రక్షణ శాఖ స్థలం సేకరణలో జాప్యం అవుతోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫలక్‌నుమా-ఉందానగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు జీఎంఆర్ సంస్థ అంగీకరించడం లేదని తెలపగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే విస్తరణ పనులు మార్చి 2016 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పథకం పూర్తికి రూ.50 కోట్ల మేర నిధుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే గోదావరి మంచినీటి పథకంలో భాగంగా చేపట్టిన పైప్‌లైన్ పనులకు మెట్టుగూడా రైల్వే క్రాసింగ్ వద్ద అనుమతులు మంజూరు చేయించాలని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ మంత్రిని కోరారు. అమృత్ పథకం కింద మూసీ ప్రక్షాళన రెండోదశను చేపట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖపై ఒత్తిడి తేవాలని జలమండలి ఎండీ జగదీశ్వర్ కోరగా.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. -
'చిక్కుముడులను పరిష్కరిస్తున్నా'
హైదరాబాద్: రైల్వే, జీహెచ్ ఎంసీ, వాటర్ బోర్డు మధ్య ఉన్న చిక్కుముడులను పరిష్కరిస్తున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రైల్వే, వాటర్ బోర్డు అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. కరీంనగర్-పెద్దపల్లి రైల్వేలైనుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంఎంటీఎస్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు పొడిగించే ఆలోచన ఉందని దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండో దశలపై రైల్వే మంత్రి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఆర్వోబీ, ఆర్ యూబీలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. జీహెచ్ ఎంసీ నుంచి అనుమతులు రావాల్సివుందన్నారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో వైఫై
♦ దశల వారీగా ఎ-1,బి స్టేషన్లకు విస్తరణ ♦ ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి జీఎమ్మార్ ససేమిరా ♦ వేసవి ప్రత్యేక రైళ్లకు మౌలాలిలో హాల్టింగ్ ♦ దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగైదు రోజుల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు అరగంట పాటు తమ మొబైల్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఎ, ఎ-1, బి కేటగిరీ రైల్వేస్టేషన్లకు దశల వారీగా దీన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న రైల్వే వారోత్సవాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాణికుల సదుపాయా లు, భద్రత, రైళ్ల నిర్వహణ, ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, బోగీల కొరత, తదితర అంశాలను వివరించారు. ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి అడ్డంకి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అనేకసార్లు జీఎమ్మార్ ప్రతినిధులతోనూ, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సంప్రదించినట్టు జీఎం వెల్లడించారు. కానీ జీఎమ్మార్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. దీనిపై మూడుసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఎయిర్‌పోర్టు, ట్రైన్, రోడ్డు కనెక్టివిటీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో వెళితే రూ.400 నుంచి రూ.800 వరకు ఖర్చవుతుందని... గంటన్నరకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు. రైలు అందుబాటులోకి వస్తే కేవల రూ.20 చార్జీతో, అరగంట వ్యవధిలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చునన్నారు. రూ.850 కోట్లతో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టులోనే ఎయిర్‌పోర్టు వరకు రైలు మార్గం విస్తరణ పూర్తయితే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 6 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంఎంటీఎస్‌తో కాకుం డా విడిగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమన్నారు. 2017 జూన్ నాటికి రెండో దశ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మల్కాజిగిరి ప్రాంతంలోని 4 కిలోమీటర్ల కంటోన్మెంట్ మార్గంలో ఆర్మీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని, త్వరలో రక్షణ శాఖతో సంప్రదించి పనులు కొనసాగించనున్నట్లు చెప్పారు. కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీకి బ్రేక్ కాజీపేట్‌లో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ ఫ్యాక్టరీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలో రైల్వే బోర్టు నూతన వ్యాగన్ విధానాన్ని రూపొందించనున్న దృష్ట్యా దీనిని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’కు ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా త్వరలోనే మార్పు వస్తుందని, కాజీపేట్ డివిజన్ ఏర్పాటుకూ రైల్వే శాఖ సుముఖంగా ఉందని చెప్పారు. అదనపు రైళ్లు నడపలేం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదనపు రైళ్లు నడపడం చాలా కష్టంగా ఉందని జీఎం చెప్పారు. వేసవి ప్రత్యేక రైళ్లను మౌలాలి నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మౌలాలీ నుంచి సిటీ బస్సులు నడపాలని, రోడ్డు వెడల్పు చేయాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన వెంటనే కాజీపేట్, బల్లార్ష, విజయవాడ మార్గాల్లో రాకపోకలు సాగించే కొన్ని ప్రత్యేక రైళ్లను మౌలాలీ నుంచి నడుపుతామనీ జీఎం చెప్పారు. ప్రయాణికుల విశ్రాంతి గదులు, ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టేషన్‌ను విస్తరించనున్నట్లు తెలిపారు. వట్టినాగులపల్లి, మౌలాలీలో టెర్మినళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. సేవలు సంతృప్తికరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న శ్రీవాస్తవ మరి కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. తన పదవీ కాలంలో ప్రయాణికుల, ఉద్యోగుల సంక్షేమానికి తాను చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. రూ.80 కోట్లతో ప్రయాణికుల సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. భద్రతకు ప్రాధాన్యం ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు జీఎం శ్రీవాస్తవ చెప్పారు. అన్ని రైల్వేస్టేషన్లు, రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలను పెంచామన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట చైన్‌స్నాచింగ్‌లు, అక్రమ రవాణా, దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాపలా లేని రైల్వే గే ట్లన్నింటినీ 2016 నాటికి తొలగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాపలా లేని 88 చోట్ల ‘గేట్ మిత్ర’లను నియమించామన్నారు. -
ఎంఎంటీఎస్ రైళ్లలో ఆర్పీఎఫ్ దాడులు
హైదరాబాద్ సిటీ: ఎంఎంటీఎస్ రైళ్లలో పోకిరీలు, అక్రమ ప్రయాణికుల బెడద మళ్లీ మొదటికొచ్చింది. బుధవారం నగరంలోని వివిధ మార్గాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నిర్వహించిన దాడుల్లో ఏకంగా 134 మంది పట్టుబడ్డారు. వీరిలో అనేక మంది మహిళలు, వికలాంగుల బోగీల్లో ప్రయాణిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. మరి కొందరు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ అరెస్టయ్యారు. నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి, సికింద్రాబాద్-నాంపల్లి రూట్లలో ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించింది.అనంతరం పట్టుబడిన వారందరి పైన కేసులు నమోదు చేసి సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రూ.30 వేల వరకు జరిమానా విధించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.అలాగే స్టేషన్లలో, రైళ్లలో పరిసరాల అపరిశుభ్రతకు పాల్పడుతూ పట్టుబడిన మరో 22 మంది ప్రయాణికుల పై కోర్టు ఆదేశాల మేరకు రూ.6550 జరిమానా విధించారు. -
హైదరాబాద్‌లో నిలిచిన MMTS రైళ్లు
-
కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు
ఇరుకుగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా.. మౌలాలి, వట్టినాగులపల్లి స్టేషన్లలో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: అటు ఉత్తరాదికి, ఇటు దక్షిణాదికి కీలకంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుఇరుకుగా మారడం. రైళ్లరద్దీ, ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్రరాజధానిలో మరో రెండు భారీ టెర్మినళ్లు నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్లో స్థానం కల్పించాలని కోరుతూ రైల్వేబోర్డుకు ప్రతిపాదనలను పంపింది. దాదాపు రూ.120 కోట్ల ఖర్చయ్యే ఈ పనులకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నిత్యం దాదాపు 210 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఈ స్టేషన్లో 10 ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. నగరంలో కీలకంగా మారిన ఎంఎంటీఎస్ రైళ్లకు కూడా ఇవే శరణ్యం. దీంతో ప్లాట్‌ఫామ్స్ దొరికేవరకు పలు రైళ్లను మౌలాలి సహా ఇతర శివారు స్టేషన్లలో నిలిపివేస్తున్నారు. కొన్నింటినైతే సుమారు 40 నిమిషాలవరకు ఆపేస్తున్నారు. అందుకే కొత్త టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అవి పూర్తయితే ముఖ్యమైన రైళ్లను మాత్రమే సికింద్రాబాద్ వరకు రప్పిస్తారు. మిగతావాటిని కొత్తస్టేషన్లలోనే నిలిపేస్తారు. దీంతో సికింద్రాబాద్‌పై భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీటీవీలు... భద్రతదృష్ట్యా నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థతోకూడిన సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఈమేరకు నిర్ణయించారు. అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రాధాన్యక్రమంలో పనులు : జీఎం శ్రీవాస్తవ గతంలో మంజూరైన పనులు కూడా చాలావరకు పెం డింగ్‌లో ఉన్నందున ముఖ్యమైన వాటిని ప్రాధాన్యక్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ చెప్పారు. గురువారం ఆయన ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమయ్యా రు. రూ.5490 కోట్లతో వివిధ దశల్లో ఉన్న 637 పను పెండింగ్ పనులు, ప్రతిపాదనలను సమీక్షించారు. -
టికెట్ తీసుకోలేదని మహిళపై దాడి!
-
ఎంఎంటీఎస్ రెండో దశకు మోక్షం!
పక్షం రోజుల్లో పనులు ప్రారంభం జీఎమ్మార్ రాకతో పురోగతి రూ.379 కోట్లతో డబ్లింగ్, విద్యుదీకరణ రూ.300 కోట్లతో కొత్త రైళ్లు, స్టేషన్ల నిర్మాణం 2016 నాటికి పట్టాల పైకి రైళ్లు సాక్షి,సిటీబ్యూరో : సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పది రోజుల క్రితమే జీఎమ్మార్, కాళింది రైల్ నిర్మాణ్, టాటా ప్రాజెక్ట్స్ కన్సార్షియం ఈ ప్రాజెక్టును దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ రెండో దశ పనులపై దృష్టి కేంద్రీకరించింది. 15 రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రెండో దశలో ప్రతిపాదించిన ఆరు లైన్లలో ఒకేసారి పనులు ప్రారంభమవుతాయని, వీలైనంత త్వరగా లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.379 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. మొత్తం 84 కిలోమీటర్లు వరకు లైన్ల నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేసి, 2016 చివరి నాటికి మరో రూ.300 కోట్లతో స్టేషన్ల నిర్మాణం, కొత్త రైళ్లు తెప్పించి పనులను పూర్తి చేస్తారు. రెండో దశ నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి దక్షిణమధ్య రైల్వేకు అందజేయాలని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఊరటనిచ్చినా...రైలు చార్జీల పెంపు భారమే
రోజువారీ, ఎంఎస్టీ టికెట్ల ధరల్లో భారీ పెరుగుదల సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ ధరలను పెంచిన కేంద్రం దేశవ్యాప్తంగా కనిపించిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని రోజులవారి ప్రయాణాలు, నెలవారీ సీజనల్ టికెట్ ధరల్లో స్వల్ప మార్పులు చేసిన ప్పటికీ ప్రయాణికుల జేబుపై పెద్ద భారమే పడనుంది. ముఖ్యంగా నగరాలకు రోజువారీ ప్రయాణం చేసేవారిపై మోపిన భారం నుంచి కొంత ఊరట లభించేలా ఛార్జీలను స్వల్పంగా తగ్గించినప్పటికీ నెలవారీ పాసుల ధరల్లో పెరుగుదల భారీగానే కనిపిస్తోంది. 150 కిలోమీటర్ల మేర ప్రయాణించే నెలవారీ సీజనల్ టికెట్లు కొనేవారు ఇప్పటి వరకు సెకండ్ క్లాస్‌కు రూ.460 భరిస్తుండగా అది రూ.525కు పెరుగుతోంది. అదే మొదటి తరగతిలో ప్రయాణించేందుకు కొనే నెలవారీ సీజన్ టికెట్ ధర ప్రస్తుతం రూ.1840 ఉండగా అది రూ.2100 పెరగబోతోంది. 1-150 కిలోమీటర్ల వరకు రోజువారి ప్రయాణం, నెలవారీ సీజనల్ టికెట్ ధరలు ఇలా... 1-15 కిలోమీటర్ల వరకు రెండో తరగతి నాన్ సబర్బన్, సబర్బన్ రోజువారీ ప్రయాణ టికెట్ దరల్లో మార్పు లేదు. అది రూ.5గానే ఉండనుంది. నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎస్టీ) ధర మాత్రం ప్రస్తుతం నాన్ సబర్బన్‌కు రూ.85 ఉండగా అది రూ.100గా, సబర్బన్‌కు రూ.130 ఉండగా అది రూ.150కి పెరగనుంది. ఫస్ట్‌క్లాస్ నాన్‌సబర్బన్, సబర్బన్ టికెట్ ధర 1-10 కి.మీకు రూ.45 ఉండగా అది రూ.50కి, అదే కేటగిరీ నాన్ సబర్బన్ ఎంఎస్టీ ధర రూ.300 ఉండగా రూ.340కి, సబర్బన్ ధర రూ.445 ఉండగా, అది రూ.510కి పెరిగింది. రెండో తరగతి ఎంఎస్టీల ధరలు 20కి.మీ. నుంచి 35 కి.మీ. మధ్య పెరగగా, ఏపీ క్లాస్ ధరలు మాత్రం ప్రతి ఐదు కిలోమీటర్ల చొప్పున పెంచారు. 50 కి.మీ.కు ప్రస్తుత ఎంఎస్టీ నాన్సబర్బన్కు రూ.235 ఉండగా రూ.270, ఫస్ట్‌క్లాస్ నాన్‌సబర్బన్ ధర రూ.800 నుంచి రూ.వేయికి పెరిగింది. అదే 100 కి.మీ.లకు ఇవి వరసగా రూ.310 నుంచి రూ.355కు, రూ.1380 నుంచి రూ.1580కి పెరిగాయి. 150 కి.మీ. వచ్చే సరికి ఇవి రూ.460 నుంచి 525కు రూ.1840 నుంచి రూ.2100 పెరిగాయి. కొత్త ఛార్జీలు ఈనెల 28 నుంచి అమలులోకి రానున్నాయి. -
ఎంఎంటీఎస్-2 కూత
టెండర్లు దక్కించుకున్న జీఎమ్మార్ సంస్థ 30 నెలల్లో రూ.389 కోట్లతో లైన్ల నిర్మాణం కొత్త ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు అందుబాటులోకి సాక్షి, సిటీబ్యూరో : ఎట్టకేలకు ఎంఎంటీఎస్ రెండోదశలో ప్రతిష్టంభన తొలగిపోయింది. దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం జీఎమ్మార్ సంస్థకు అప్పగించింది. మొత్తం ఆరు మార్గాల్లో నిర్మించనున్న రెండోదశలో లైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల కోసం రూ.389 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ఇందులో రూ.207 కోట్ల విలువైన పనులను జీఎమ్మార్ సంస్థ పూర్తి చేయనుంది. ఇందుకోసం 30 నెలల కాలపరిమితిని విధించారు. టాటా ప్రాజెక్ట్, కాళింది రైల్ నిర్మాణ్ సంస్థలతో కలిసి జీఎమ్మార్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. వచ్చేనెలలో పనులు ప్రారంభించే అవకాశ ం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రిటన్ సంస్థ బాల్‌ఫోర్‌బెట్టి ముందుకొచ్చినప్పటికీ గతేడాది సాంకేతిక కారణాల వల్ల విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో ఆ సంస్థతో కలిసి పనిచేసేందుకు కాళింది సంస్థ కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది. బాల్‌ఫోర్‌బెట్టి టెండర్లను కూడా దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో కొందరు రాజకీయ నేతలు కమిషన్లు అడిగినందుకే ఆ సంస్థ వెనకడుగు వేసినట్లు సమాచారం. దీంతో రెండోదశకు బ్రేకులు పడ్డాయి. తాజాగా జీఎమ్మార్ ఈ టెండర్లను దక్కించుకోవడంతో మళ్లీ కదలిక ప్రారంభమైంది. లైన్ల నిర్మాణ ం ఇలా... రెండోదశలో ఘట్కేసర్ నుంచి మౌలాలీ వరకు 14 కి.మీ. మేర కొత్త లైన్లు వేసి విద్యుదీకరిస్తారు. సనత్‌నగర్ నుంచి మౌలాలీ వరకు 23 కి.మీ. లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాలి. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరిస్తారు. ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6 కి.మీ. మేర కొత్త లైన్లను నిర్మించాలి. బొల్లారం-మేడ్చల్మధ్య 14 కి.మీ. లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరిస్తారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు 14 కి.మీ. విద్యుదీకరిస్తారు. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 10 కి.మీ. పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండోదశ వల్ల ఫిరోజ్‌గూడ, సుచిత్ర జంక్షన్, బీహెచ్ఈఎల్, భూదేవినగర్, మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. -
‘వాణిజ్యం’పై సమైక్య సమ్మెట!
అయినా లక్ష్యంలో 82.53 శాతం వసూళ్లు అదనపు ఆదాయ వసూలులో ముందంజ అమ్మకపు పన్ను వసూళ్లు రూ.1294.12 కోట్లు విశాఖ డివిజన్ డీసీ టి.శివశంకరరావు సాక్షి, విశాఖపట్నం : ‘సమైక్యాంధ్ర ఉద్యమంతో వ్యాపారాలు మందగించాయి. కస్టమ్స్ సుంకం పెంపు, నిబంధనలు కఠినతరం కావడంతో బులియన్ రాబడి తగ్గుముఖం పట్టింది. ఈ విభాగంలో ఒక్క ఎంఎంటీఎస్ డీలర్ ద్వారానే రూ.31 కోట్లు తక్కువగా అమ్మకపు పన్ను వసూలు జరిగింది. వరుస సమ్మెలతో పారిశ్రామిక రంగం డీలాపడింది. అయినా 2012-13 ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను వసూలు (రూ.1254.16 కోట్లు) కంటే ఇటీవల ముగిసిన ఆర్ధికేడాదిలో 3.19 శాతం (రూ.39.96 కోట్లు) వృద్ధితో రూ.1294.12 కోట్లు వసూలు సాధించినట్టు’ విశాఖపట్నం డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ టి.శివశంకరరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి డివిజన్ సాధించిన అమ్మకపు పన్ను, వసూళ్ల ప్రగతిని వివరించారు. ప్రధాన డివిజన్లలో ముందంజ : గత ఏడాది వ్యాట్ రూ.1254.16 కోట్లు వసూలవగా, ఈసారి రూ.1294.12 కోట్లు వసూలైంది. గతేడాది పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉండటంతో అమ్మకపు పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1568.06 కోట్లలో 82.53 శాతం మాత్రమే సాధించగలిగినట్టు పేర్కొన్నారు. పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో కలిపితే రూ.1351.47 కోట్లు వసూలైనట్టు తెలిపారు. డివిజన్లో 58 శాతంగా ఉన్న ఎల్టీయూ సర్కిల్ ఈ సారి కేవలం 0.15 శాతం మాత్రమే ప్రగతి నమోదు చేసుకుందన్నారు. రూ.130 కోట్లు వరకు ఈ ఒక్క విభాగంలోనే గతంలోకంటే గతేడాదికంటే పన్ను వసూళ్లు తగ్గడంతో ఆ ప్రభావం డివిజన్‌పై స్పష్టంగా కనిపించిందన్నారు. పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించడం, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఆడిట్లపై అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆశించిన స్థాయిలో వ సూళ్లు సాధించగలిగినట్టు తెలిపారు. భారీ క్షీణత వీటిలోనే.. కొన్ని ప్రధాన సంస్థలు 2012-13 కంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారీ క్షీణత నమోదు చేసుకున్నాయి. ఎంఎంటీసీ 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.205.32 కోట్లు అమ్మకపు పన్ను చెల్లించింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.117.42 కోట్లుకు తగ్గింది. ఈసారి ఇందులో కూడా రూ.31 కోట్లు తక్కువగా ఈ సంస్థ పన్ను చెల్లించింది. ఆర్థిక సమస్యలతో పీఎస్ఎల్ లిమిటెడ్ సంస్థ గతంలో కంటే రూ.13 కోట్లు తక్కువగా చెల్లించింది. ఎన్టీపీసీ ఆర్డర్స్ లేక బొగ్గు దిగుమతులు క్షీణించి కోస్టల్ ఎనర్జీ సంస్థ కూడా 29 కోట్లు తక్కువగా పన్ను చెల్లించింది. -
గుర్తించడం ఇక సులభం
-
ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు త్వరలో శంకుస్థాపన
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: లింగంపల్లి నుంచి రామచంద్రాపురం వరకు రానున్న ఎంఎంటీఎస్ కోసం చేపట్టే పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు మెదక్ ఎంపీ విజయశాంతి తెలిపారు. శుక్రవారం ఆమె రామచంద్రాపురంలో విలేకరులతో మాట్లాడారు. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 4.75 కిలోమీటర్ల లైన్ కోసం రూ.28 కోట్లను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. మొదట పటాన్‌చెరుకు ఎంఎంటీఎస్‌ను తేవాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామచంద్రాపురం వరకే పరిమితమైనట్టు చెప్పారు. ఈ పనులను లండన్‌కు చెందిన సంస్థ దక్కించుకుందని, ఏడాదిలోపు పనులు పూర్తి కావచ్చన్నారు. ఎంఎంటీఎస్ విషయంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు మారినా ప్రజల ఆశీస్సులతో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు. పనుల శంకుస్థాపన కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రి సమయం తీసుకున్నట్టు తెలిపారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వేలైన్ పనులను త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ఓ వైపు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు విజయశాంతి తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి షేక్ అబ్దుల్ ఘని, టెలికం బోర్డు సభ్యుడు రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండోదశకు పచ్చజెండా!
సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండోదశలో వేగం పెరిగింది. వచ్చే అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించి మూడేళ్లలో మొత్తం 84 కిలోమీటర్లు పూర్తి చేసేందుకు రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ కార్యాచరణకు దిగింది. ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఆరు బడా కంపెనీలు రంగంలోకి దిగగా.. ఈ కంపెనీల నుంచి అందిన టెక్నికల్ బిడ్ల పరిశీలన పూర్తయింది. త్వరలో ఫైనాన్షియల్ బిడ్లను కూడా పరిశీలించి అర్హత సాధించిన కంపెనీలకు పనులను అప్పగించేందుకు అధికారులు పనుల వేగం పెంచారు. దక్షిణమధ్య రైల్వే, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలువుతోన్న రెండోదశ పూర్తయితే ఘట్కేసర్,మేడ్చల్, పటాన్చెరు, శంషాబాద్‌లకు రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. ప్రస్తుతం లక్షన్నరమంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటుండగా, రెండోదశవల్ల మరో రెండు లక్షలమందికి అదనంగా ప్రయాణ సదుపాయం లభించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం ఎంఎంటీఎస్ రైలు నడిపేందుకు జీఎమ్మార్ సంస్థ సుముఖతను వ్యక్తం చేయడంతో మూడేళ్లలో ఉందానగర్ నుంచి శంషాబాద్ వరకు కూడా రెండోదశ పూర్తి చేయనున్నట్లు రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2016 నాటికి ప్రతిపాదిత రెండో దశ మొత్తం పూర్తమవుతుందని, 80 శాతానికి పైగా స్థల సేకరణ పూర్తయ్యిందని పేర్కొన్నారు. మొదట రూ.642 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు అంచనా ప్రస్తుతం రూ.816.55 కోట్లకు పెరిగింది. ఇందులో రాష్ట్రప్రభుత్వం 2/3 వంతు, రై ల్వే 1/3 వంతు చొప్పున నిధులు సమకూరుస్తున్నాయి. రెండో దశ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఎల్అండ్టీ(ఫరీదాబాద్),జీఎమ్మార్ (బెంగళూరు),బాల్‌ఫోర్‌బెట్టి (న్యూఢిల్లీ),సింప్లెక్స్ (కోల్కత్తా),కేఇసి, ఎస్ఈడబ్ల్యూ (హైదరాబాద్)కంపెనీలు తీవ్రంగాపోటీపడుతున్నాయి. రెండోదశ మార్గాలివే.. ఘట్కేసర్ నుంచి మౌలాలి వరకు 14 కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్నవాటితో పాటు రెండు కొత్త లైన్లుతో విద్యుదీకరిస్తారు. దీంతో ఈ మార్గంలో 4 లైన్లు అందుబాటులోకి వస్తాయి. సనత్‌నగర్ నుంచి మౌలాలి వరకు 23 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాల్సి ఉంది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్‌లైన్ డబుల్ చేసి విద్యుదీకరిస్తారు. బొల్లారం-మేడ్చల్ మధ్య 14 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరిస్తారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు మరో 14 కిలోమీటర్లు విద్యుదీకరించాల్సి ఉంది. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 10 కి.మీ పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండోదశ వల్ల ఫిరోజ్‌గూడ, సుచి త్ర జంక్షన్, బీహెచ్ఈఎల్,భూదేవీనగర్,మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.