హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టలను కలిసి విజ్ఞప్తి చేశారు.
- రైల్వే బోర్డు చైర్మన్‌కు ఎంపీ బూర విజ్ఞప్తి
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టలను కలిసి విజ్ఞప్తి చేశారు. మూడో లైను ఏర్పాటు ద్వారా ఈ సర్వీసులు పొడిగించవచ్చని, తద్వారా రైల్వే శాఖకు కూడా వెసులుబాటు కలుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడింట రెండు వంతుల వ్యయాన్ని భరించేందుకు సిద్ధమైందని ఆయన తెలిపారు.