Bura Narsaiah Goud
-
బూర నర్సయ్యగౌడ్ ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు : మల్లారెడ్డి
-
మునుగోడులో అసలు ఏం జరుగుతోంది.. అలా చేసింది ఎవరు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయాల్లో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం, కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాజాగా నియోజకవర్గంలోని చండూరులో మరోసారి పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. నేడే విడుదల.. షా సమర్పించు రూ. 18వేల కోట్లు.. కోవర్టురెడ్డి అంటూ పోస్టర్లు వెలశాయి. కాగా, ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికిస్తుండగా బీజేపీ కార్యకర్త గమినించారు. దీంతో, వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కార్లలో దుండగులు పరారైనట్టు బీజేపీ కార్యకర్త తెలిపారు. దీంతో, బీజేపీ వ్యతిరేక పోస్టర్లు ఎవరు అంటించారు అనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్.. గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ‘‘అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా నాతో సంప్రదింపులు జరపలేదు. పార్టీకి నా అవసరం లేదని భావిస్తున్నా. నాకు అవమానం జరుగుతుందని తెలిసి కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్‌ను కలవాలంటే ఇప్పుడు తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తాను మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందకు సిద్ధంగా ఉన్నానని కూడా నర్సయ్య గౌడ్ కామెంట్స్ చేయడం విశేషం. -
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. టీఆర్ఎస్ అధిష్టానం నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని రోజులుగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న టీఆర్ఎస్ అభ్యర్థిపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. మునుగోడు నియోజకవర్గంలోని చల్మెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి నర్సింహారెడ్డిని టీఆర్ఎస్ పోటీకి పెడుతోంది. గురువారం రాత్రి ఏడున్నర గంటల దాకా జిల్లా నేతలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చివరకు వేమిరెడ్డి నర్సింహారెడ్డి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇన్నాళ్లూ ఏ పార్టీలో లేని నర్సింహారెడ్డిని గులాబీ కండువాకప్పి పార్టీలో చేర్చుకుని, బీ–ఫారం ఇచ్చి పంపారు. భువనగిరి స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేరునే ఖరారు చేశారు. ఆయన పోటీ చేయడం ఖాయమని ముందునుంచే పార్టీ వర్గాల్లో ఓ అవగాహన ఉన్నా.. గురువారం ఆయనకు బీ–ఫారం అందజేయడంతో అధి కారికంగా ప్రకటించినట్లు అయ్యింది. ఆయన రెండోసారి భువనగిరి నుంచి ఆయ న తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక, నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం ప్రకటించారు. ఈసారి నల్లగొండ ఎంపీ స్థానం నుంచి తటస్థులను పోటీకి పెట్టాలన్న కసరత్తు రెండు వారాలుగా సాగుతోందని సమాచారం. దీనిలో భాగంగానే హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని రాజధాని బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. తర్జన.. భర్జన! కాంగ్రెస్‌నుంచి ఇప్పటికే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పేరును ఆ పార్టీ ప్రకటించాక టీఆర్ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడిందని అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిపై బలమైన అభ్యర్థినే పెట్టాలని భావించి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని తిరిగి పోటీలో నిలపాలన్న ఆలోచనకు వచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ నుంచి 1.93లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది . ఆ తర్వాత గుత్తా టీఆర్ఎస్లో చేరారు. మూడు సార్లు ఎంపీగా పనిచేసిన సీనియారిటీ, నియోజకవర్గంలో పట్టు, గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ .. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ్ కుమా ర్ రెడ్డిపై పోటీకి పె ట్టాలన్న చర్చ పార్టీ లో జరిగిందని చె బుతున్నారు. అయి తే, అప్పటికే తమకో అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని సంప్రదించిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకున్నా.. చివరి నిమిషయం దాకా ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. గురువారం మధ్యాహ్నం వేమిరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చినా.. సాయంత్రం కల్లా సీన్ మారింది. జిల్లా నాయకులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో భేటీ అయ్యాక.. చర్చ జరిపాక, చివరకు వేమిరెడ్డి నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారని పార్టీ వర్గాల సమాచారం. భువనగిరి నుంచి ... బూర భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్ బూర న ర్సయ్యగౌడ్ రెండో సారి పోటీ చేయనున్నారు. ఆయన అభ్యర్థిగా గురువారం పార్టీ అధినేత కేసీఆర్ నుం చి బీ–ఫారం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ల జేఏసీ నాయకుడిగా చురుగ్గా పనిచేసిన బూరకు టీఆర్ఎస్ అధినేత తొలిసారి పార్టీ టికెట్ ఇ చ్చారు. ఆయన ఆ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు. కాగా, ఈ సారి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటిం చింది. దీంతో నాడు తమ్ముడిపై పోటీ చేసి గెలిచిన బూర ఈ ఎన్నికల్లో అన్నపై పోటీ చేస్తున్నారు. గుత్తాకు ... ఎమ్మెల్సీ అవకాశం నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తనకు మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అధి నాయకత్వాన్ని అసలు కోరనే లేదని చెబుతున్నారు. ఆయన పార్టీలో చేరిన సమయంలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటా మన్న హామీ ఇచ్చారని ఆయన అనుచర వర్గం చెబు తోంది. ఆ ప్రభుత్వంలో ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వలేని కారణంగానే రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా కేబినెట్ ర్యాంకుతో పదవి ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. అయితే.. ఇటీవలే ముగిసిన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో తిరిగి ఎంపీగానే పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. ఈ కారణంగానే గురువారం సాయంత్రం వరకూ ఆయన పేరు పార్టీ అధినేత వద్ద పరిశీలనలోనే ఉందని అంటున్నారు. ఆఖరుకు వేమిరెడ్డి నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారు. గుత్తాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఏప్రిల్ మొదటి వారంలో కొన్ని స్థానాలకు జరిగే మండలి ఎన్నికల్లో గుత్తా ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. భువనగిరి ఎంపీ అభ్యర్థి బయోడేటా పేరు: డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తల్లిదండ్రులు: లక్ష్మయ్య, రాజమ్మ స్వగ్రామం: తాళ్లగడ్డ, సూర్యాపేట జిల్లా భార్య: అనిత కుమార్తె: రోహిత విద్యాభ్యాసం: ఎంబీబీఎస్(ఉస్మానియా) తెలంగాణ ఉద్యమంలో ప్రవేశం: డాక్టర్ జేఏసీని స్థాపించి అనంతరం డాక్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. రాజకీయ రంగంలో ప్రవేశం : 2014లో భువనగిరి ఎంపీ టికెట్ రావడంతో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. వివిధ హోదాల్లో: స్టాండింగ్ కమిటీ ఆన్ లేబ ర్, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీఎస్, కన్సోలేటివ్ కమిటీ ఆన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండ్రస్టీ, కన్సోలేటివ్ కమిటీ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థి బయోడేటా పేరు : వేమిరెడ్డి నర్సింహారెడ్డి స్వగ్రామం : చల్మెడ, మునుగోడు మండలం, నల్లగొండ తల్లిదండ్రులు : లింగారెడ్డి, రామనర్సమ్మ భార్య : ఇందిర, గృహిణి సంతానం : ఇద్దరు కుమారైలు, ఒకరు డాక్టర్, మరొకరు రాజధాని బ్యాంక్ డైరెక్టర్ వృత్తి : రియల్ఎస్టేట్ వ్యాపారం, బ్యాంకుల నిర్వహణ. 1995లో రాజధాని బ్యాంక్ స్థాపన. ప్రస్తుతం బ్యాంక్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు. కోఆపరేటివ్ బ్యాంక్ జాతీయ డైరెక్టర్‌గా, వీఎన్ఆర్ గ్రూప్స్ అధినేతగా ఉన్నారు. 1984లో జరిగిన మునుగోడు మండల పరిష త్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. -
‘ఖిలాపై గులాబీ జెండా ఎగురవేస్తాం’
సాక్షి, యాదగిరిగుట్ట : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, యాదగిరిగుట్ట పట్టణ అద్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానికంగా వారు విలేకరులతో మా ట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతను ఏవిధంగా గెలిపించామో.. అదే విధంగా ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకుని సత్తా చాటుతామన్నారు. ఈనెల 23వ తేదీన యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్య, అధికార ప్రతినిధి చిత్తర్ల బాలయ్య, ఉపాధ్యాక్షుడు నువ్వుల రమేష్, నాయకులు కోట వెంకటేష్, కాంటేకార్ పవన్‌కుమార్, వంగపల్లి అరుణ్, మిట్ట అరుణ్గౌడ్, వేముల రవీందర్, కొన్యాల నర్సింహారెడ్డి, బూడిద అయిలయ్య, సయ్యద్ బాబా, దావూద్, కృష్ణ తదితరులున్నారు. నర్సయ్యగౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఆత్మకూరు(ఎం) : భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా బూర నర్సయ్యగౌడ్‌ను రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలుపించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బూర నర్సయ్య గౌడ్ పార్లమెంట్ సభ్యుడిగా భువనగిరి అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్‌ను ఎంపిగా గెలిపించాలని ఆయన కోరారు. -
10 సీట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ప్రకటనను టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంచనాతో జాబితా రూపొందిస్తోంది. రాష్ట్రంలో 16 లోక్‌సభ సెగ్మెంట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే పది స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. ‘ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి. నామినేషన్ దాఖలకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోండి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’అని టీఆర్ఎస్ అధిష్టానం పది స్థానాల్లోని ఆశావహులకు సమాచారం ఇచ్చింది. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితాలో నాలుగు టీఆర్ఎస్ సిట్టింగ్ సెగ్మెంట్లు ఉండటంతో ఆ ఎంపీల్లో ఆందోళన పెరుగుతోంది. ఆయా సిట్టింగ్ ఎంపీలు, ఆశావహులు పరస్పరం ఫోన్లు చేసుకుంటూ ‘అన్నా ఆ సెగ్మెంట్‌పై అధిష్టానం స్పష్టత ఇచ్చిందట. మీకు సమాచారం వచ్చిందా? ఫోన్ వస్తే నాకు కచ్చితంగా చెప్పండి’అని చెప్పుకుంటున్నారు. పెండింగ్ సీట్లపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభ తర్వాత లేదా మంగళవారం నిజామాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ తర్వాతే అభ్యర్థులపై స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారంలోగా మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ముందుగానే జరగవచ్చని తెలుస్తోంది. ఆరు లోక్‌సభ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారుపై టీఆర్ఎస్ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్ స్థానాల్లోని అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ఈ సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను ఖరారు చేసి అన్ని సీట్లకూ ఒకేసారి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ►నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలోనే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థానంలో తేరా చిన్నపరెడ్డి, వి. నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ►మహబూబ్‌నగర్ లోక్‌సభ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారుపై ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మాజీమంత్రి సి.లక్ష్మా రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. ►ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు పొంగులేటి ప్రయత్నించారని టీఆర్ఎస్ అభ్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనికితోడు ఈ సెగ్మెంట్లో ఖమ్మంలోని మరో కీలక సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లను పరిశీలిస్తోంది. ►మహబూబాబాద్ సెగ్మెంట్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ చివరి నిమిషంలో టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్ పేర్లను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. ►పెద్దపల్లి అభ్యర్థి ఖరారుపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఈ స్థానం ఉంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జి. వివేకానంద టికెట్ ఆశిస్తున్నారు. అయితే వివేకానంద అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అన్నింటినీ పరిశీలించి నిర్ణయానికి రావా లని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నా రు. చివరి నిమిషంలో వివేకానందకు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ►సికింద్రాబాద్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అధినేత సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని టికెట్లను ఖరారు చేస్తున్నారు. తలసాని సాయికిరణ్ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, దండె విఠల్ పేర్లను పరిశీలిస్తున్నారు. ►టీఆర్ఎస్ అధిష్టానం పది స్థానాలపై స్పష్టతకు వచ్చింది. ఈ స్థానాల్లో అభ్యర్థులుగా ఉండే వారికి అనధికారికంగా సమాచారం ఇచ్చింది. సమాచారం ఇచ్చిన స్థానాలు ఇవీ ఆదిలాబాద్: గోడం నగేశ్ కరీంనగర్: బోయినపల్లి వినోద్ కుమార్ నిజామాబాద్: కల్వకుంట్ల కవిత జహీరాబాద్: భీంరావు బసంత్‌రావు పాటిల్ మెదక్: కొత్త ప్రభాకర్‌రెడ్డి భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ వరంగల్: పసునూరి దయాకర్ చేవెళ్ల: జి. రంజిత్‌రెడ్డి మల్కాజిగిరి: కె. నవీన్‌రావు నాగర్ కర్నూల్: పి. రాములు -
కశ్మీర్ అంశంలో కేంద్రానికి మద్దతు
సాక్షి, హైదరాబాద్: దేశంలో హింసకు పాల్పడుతోన్న పాక్ ఉగ్రమూకకు బుద్ధిచెప్పిన వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, కశ్మీర్ పరిష్కారంలో కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీనేనని, నెహ్రు విధానాలతోనే ఈ సమస్యను రాచపుండుగా మార్చాయని బూర దుయ్యబ ట్టారు. కశ్మీర్‌కు తెలంగాణకు సారూప్యతలు ఉన్నాయని, ఈ రెంటికీ కారణమైంది నెహ్రూనేనని ఆరోపించారు. పటేల్ సమర్ధత వల్లే అప్పుడు తెలంగాణ భారత్‌లో విలీనమయ్యిందని, లేదంటే కశ్మీరు లాగే తెలంగాణ నిత్యం రగిలేదని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందనడానికి ఇవే నిదర్శనమన్నారు. కశ్మీరు, అయోధ్య సమస్యలకు పరిష్కారం కేసీఆర్ వంటి విజనరీ నాయకుల వల్లే సాధ్యమవుతుందన్నారు. మా పోరాటాల వల్లే ప్రయోజనాలు తమ పార్టీ ఎంపీల పోరాటాల వల్లే తెలంగాణకు కొన్ని ప్రయోజనాలు చేకూరాయన్నారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను తీసుకురావడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైతే తాము పోరాడి సాధించుకున్నామన్నారు. ‘హైకోర్టును పోరాడి సాధించుకున్నాం, సొంత పనుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ఏనాడూ ఏదీ అడగలేదు. ఎయిమ్స్ తెలంగాణకు వచ్చిందంటే అది టీఆర్ఎస్ ఘనతే. పార్లమెంటులో ప్రజా సమస్యలపై గొంతెత్తడంలో టీఆర్ఎస్ ఎంపీలు రాజీ లేని ధోరణి ప్రదర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు ఏకపక్ష మద్దతు ఇస్తారు. కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు టీఆర్ఎస్ మద్దతునిస్తుంది’ అని బూర స్పష్టం చేశారు. ఏకాకిని చేయాలి: ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడిని దేశంపై జరిగిన దాడిగా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. దేశాన్ని రక్షించుకునేందుకు భారత వాయు సేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడి జరపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసే చర్యలన్నిటినీ కేంద్రం తీసుకోవాలని కోరారు. -
కాంగ్రెస్ విముక్త తెలంగాణ: ఎంపీ బూర
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విముక్త్ భారత్ అవుతుందో లేదో తెలియదుగానీ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ విముక్తం కాబోతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ జోస్యం చెప్పా రు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఆపాలని కోర్టులకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈవీఎం లపైన కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశ పెట్టిన తర్వాత ప్రపంచానికి మరింత ఆదర్శంగా మారాం. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చోట ఈవీఎం లను తప్పుబట్టని కాంగ్రెస్ నేతలు ఓడి పోయిన చోట మాత్రం తప్పు పడుతు న్నారు. టీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు ఓట్లలో 15% తేడా ఉన్నా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం అర్థరహితం. ఆ పార్టీ నేతల ఆరోపణలు ప్రజాస్వామ్య మను గడకే ప్రమాదం. కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో ఈవీఎంలను ప్రవేశ పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా అని అన్ని సర్వేలు సూచిస్తున్నాయి. ఫెడ రల్ ఫ్రంట్ గురించి అపహాస్యం చేసిన వాళ్లు ఇప్పుడు తమ వైఖరిని సమీక్షిం చుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌కు మద్దతు పెరుగుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీల కపాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీలు ఏపీలో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ నేతలు టీఆర్ఎస్ను బూచీగా చూపుతూ ఆరోపణలు చేయడం ఆపితే మంచిది’ అని అన్నారు. -
ఓబీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
ఢిల్లీ: ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలంతా కలిసి కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను విజ్ఞప్తి చేసినట్లు భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. అలాగే మూడు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి ఎంపీలు తీసుకెళ్లినట్లు వివరించారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం బూర నర్సయ్య విలేకరులతో మాట్లాడుతూ..చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అలాగే ఎన్సీబీసీకి చైర్మన్‌ను నియమించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఏక్ దేశ్- ఏక్ నీతి ఉండాలనేదే మా అధినేత కేసీఆర్ నినాదమని స్పష్టం చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కూడా కేంద్రం ఇప్పటి వరకు ఓబీసీలకు సంబంధించిన మంత్రిత్వశాఖపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలో ఒక్కో రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్సీబీసీ ఏర్పాటు చేసి 9 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చైర్మన్‌ను నియమించలేదని తెలిపారు. -
ప్రాజెక్ట్‌ల నిర్మాణానికే అప్పులు చేశాం: ఎంపీ బూర నర్సయ్యగౌడ్
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసమే అప్పు చేశామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. బుధవారం పోచంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రతిపక్షాలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 70 కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు. అయితే ప్రాజెక్ట్‌లు, మిషన్ భగీరథ, మెట్రో ప్రాజెక్ట్ కోసం పెట్టుబడి కింద రూ. లక్షా పదివేల కోట్లు మాత్రమే అప్పు చేశామని పేర్కొన్నారు. కాని చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టకుండానే రూ.2లక్షల కోట్ల అప్పుచేశారని విమర్శించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్, జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, చంద్రంయాదవ్, కర్నాటి రవి, గుండు మధు, బాలనర్సింహ, కందాడి రఘుమారెడ్డి తదితరులు ఉన్నారు. మరిన్ని వార్తాలు... -
డిసెంబర్ 7న నిండు చంద్రుడు వస్తాడు: బూర
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ 7న అమావాస్య రోజున నిండు చంద్రుడు ఉదయిస్తాడని, కేసీఆర్ తెలంగాణకు మరోసారి సీఎం అవుతారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేత డీకే అరుణ ఇరువురూ మెమొరీలాస్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌వి దింపుడుకళ్లెం ఆశలని, ఆ పార్టీ నేతలంతా పదవులు ఉన్నప్పు డు ఒకలా.. పదవులు లేనప్పుడు ఒకలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యం కావడానికి తీవ్ర యత్నాలు చేశారని, కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రాన్ని వదిలి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఓటర్ల జాబితాపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మర్రి శశిధర్‌రెడ్డి, అంతర్జాతీయ కోర్టుకు పోతారేమో అని ఎద్దేవా చేశారు. -
నిమ్స్‌లో త్వరలో ఐపీ సేవలు
బీబీనగర్(భువనగిరి) : బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్ (ఐపీ) విభాగాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. గురువారం నిమ్స్ భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిమ్స్ భవనంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించినట్లు తెలిపారు. జూన్‌లోపు నిర్మాణ పనులు పూర్తవుతాయని, తదుపరి మొదటి దశలో 13 విభాగాలతో, 250 పడకలతో ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండో దశలో 700లకుపైగా పడకలతో ఇతర విభాగాలతో కూడిన పూర్తిస్థాయి ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు వివరించారు. మొదటి దశలో కావాల్సిన సదుపాయాలు, అవరమయ్యే నిధులపై ప్లాన్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిపారు. అంతకుముందు నిమ్స్ భవనంలో పూర్తయిన పనులు, పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేయించిన ఎంపీ వాటిని సీఎంకు చూపించనున్నట్లు ఆయన తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి బీబీనగర్‌లోనే ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ నర్సయ్యగౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా మొగ్గు చూపుతున్నారని, కేంద్రానికి అందజేయాల్సిన స్థల సేకరణ ప్రతిపాదనలను రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ నుంచి కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. బీబీనగర్‌లో ఏయిమ్స్ నిర్మాణానికి అనుకూలంగా ఉందని సీఏం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, నిమ్స్ సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అమరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్ తదితరులు ఉన్నారు. -
రైతుల కాళ్లు కడుగుతాం
వలిగొండ (భువనగిరి) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగడమే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మండలంలోని రెడ్లరేపాక నుంచి టేకులసోమారం వరకు రూ.కోటీ 60 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను ఆదివారం రెడ్లరేపాకలో ఆయన ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలోని మారెమ్మకాలనీలో, బుడిగజంగాలకాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గౌడ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ జలాశయం కళావిహీనంగా మారడానికి సమైక్య రాష్ట్రంలోని పాలకులే కారణమన్నారు. మూసీ ఆధునీకరణకు ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. గోదావరి, కృష్ణాతో మూసీని అనుసంధానం చేసి ఆధునీకరించనున్నట్లు తెలిపారు. దత్తత గ్రామాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వడంలేదన్నారు. దత్తత గ్రామాల అభివృద్ధికి వివిధ రూపాల్లో నిధులు సమీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. భువనగిరి మండలం ఎర్రంబెల్లి నుంచి కంచనపల్లి మీదుగా రెడ్లరేపాకకు బీటీ రోడ్డు, రెడ్లరేపాక నుంచి వలిగొండ వరకు రోడ్డు ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, సర్పంచ్ పబ్బు ఉపేందర్, పీఆర్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ అయిటిపాముల జ్యోతీసత్యనారా యణ, సర్పంచ్ మాద లావణ్యశంకర్, ఎంపీటీసీ మల్లికార్జున్, భాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, అయోధ్యగౌడ్, కళ్లెం మారయ్య, సంగిశెట్టి క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సు యాత్రే..!
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టాలనుకునే బస్సు యాత్ర తుస్సు యాత్రే అవుతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్సుయాత్ర వాహనాలకు డీజిల్, పెట్రోల్ కూడా దండగే అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పాలకపక్షంలో ఎవరు ఉండాలో, ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, వారు మాట్లాడే పదజాలం ఏమాత్రం బాగాలేదని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ నల్లగొండలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ఎంపీ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ శంకుస్థాపన, బత్తాయి మార్కెట్‌ను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. బీవెల్లం ప్రాజెక్టు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకుని నిర్మాణ పనులు నిలిపేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వెల్లంల ప్రాజెక్టు మీద దృష్టి పెట్టే నిర్మాణం పూర్తి చేశామని ఎంపీ తెలిపారు. మార్చి లేదా ఏప్రిల్‌లో ట్రయల్ రన్ చేస్తారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ఏజెండగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, మహిళా కోఆర్డినేటర్ మాలెశరణ్యారెడ్డి, ఎంపీపీ రేగట్టె మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
బీమాను సద్వినియోగం చేసుకోవాలి
చండూరు (మునుగోడు) : లక్ష్మీనర్సింహస్వామి వృత్తిదారుల బీమా పథకాన్ని ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఆదివారం చండూరు రహదారి బంగ్లాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని తనకు ఆలోచన వచ్చిందన్నారు. కార్మికుల నుంచి పథకానికి అనూహ్య స్పందన వస్తోందన్నారు. మొదటగా భువనగిరి పార్లమెంట్ స్థాయిలో బీమా పథకం ప్రవేశపెట్టానని, అనంతరం ఉమ్మడి జిల్లా నుంచి అనేకమంది ఫోన్ల ద్వారా కోరుతుండడంతో ప్రస్తుతం అంతటా బీమా పథకాన్ని విస్తరించామన్నారు. మార్చి 01 తేదీ నుంచి బీమా అమల్లోకి వస్తుందన్నారు. కార్మికులు ఫిబ్రవరి చివరి వరకు అన్ని వివరాలు అందించాలన్నారు. బీమా చేసిన కార్మికులకు ఐడీ కార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో తెలంగాణ ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆయన వెంట ఎంపీపీ తోకల వెంకన్న, గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వడ్డెపల్లి గోపాల్‌గౌడ్, తిరందాసు ఆంజనేయులు, సురేష్, కొత్త గంగాధర్, తదితరులు ఉన్నారు. -
దివ్యాంగులకు నా నిధులిస్తా
సాక్షి, యాదాద్రి : దివ్యాంగులు మానసికంగా కృం గిపోకుండా నైపుణ్యం పెంపొందించుకుని పట్టుదలతో పైకి ఎదగాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ ఉపకరణాల తయారీ సంస్థ (అలిమ్కో), జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల కోసం తన పార్లమెంట్ నిధులను కేటాయిస్తానన్నారు. పా ర్లమెంట్‌లో చర్చించి ఎలక్ట్రిక్, మోటరైట్ వాహనా లు వికలాంగులకు అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక పరికరాలు సమకూర్చుకోలేని వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు అందించడం పట్ల అభినందించారు. వికలాంగులు ఉపకరణాలను సద్వి నియోగపర్చుకోవాలన్నారు. కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ తన సర్వీసు కాలంలో సదరమ్ క్యాంపులకు రూపకల్పన చేసే అవకాశం తన కు రావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నా రు. ఎంపీ ప్రత్యేక చొరవతో 467 మంది లబ్ధిదారులకు అలిమ్కో సంస్థ ద్వారా రూ. 32లక్షల ఖర్చుతో ఉపకరణాలు ఉచితంగా అందించడం పట్ల కలెక్టర్ అభినందించారు.డీఆర్డీఓ వెంకట్రావ్ మా ట్లాడుతూ జిల్లాలో 12,874 మంది వికలాంగులకు ప్రతినెలా రూ.2.27కోట్లు పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 32 సదరం క్యాంప్‌లు నిర్వహించి 3,043 మంది వికలాంగులకు ధృవపత్రాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసిన కార్యక్ర మంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్, డీఆర్డీఓ వెంకట్రావ్, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, ఏపీఎం రమణ తదితరులు ఉన్నారు. -
తెలంగాణ ఎయిమ్స్ పనులు ప్రారంభించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్‌కు వెంటనే నిధులు విడుదలచేసి, పనులు ప్రారంభించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆ శాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ను వేర్వేరుగా కలసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో హామీ ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. -
‘వాళ్లు బిగ్‌బాస్ షోలో టైంపాస్ చేసుకోవచ్చు’
యాదగిరిగుట్ట: కాంగ్రెస్ నాయకులకు ఏ పని, పాట లేకపోతే బిగ్ బాస్ షోకు వెళ్లి టైం పాస్ చేసుకోవచ్చని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో అండర్ పాస్ నిర్మాణాల కోసం కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంతో సామరస్య పూర్వకంగా మెలుగుతూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీతో అభివృద్ధి ఎజెండా మాత్రమే ఉంటుందని రాజకీయ ఎజెండా ఉండదని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం భవిష్యత్‌లో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ఎంపీ చెప్పారు. -
కోమటిరెడ్డి మాటలన్నీ అసత్యాలే
ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కులవృత్తులకు ముఖ్య మంత్రి కేసీఆర్ చేయూతనిస్తున్నారని, బీసీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు ఏం చేయలేదన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయ నకు వింతవ్యాధి వచ్చినట్లు ప్రవర్తిస్తు న్నా రని మండిపడ్డారు. కోమటిరెడ్డి బీసీలంద రికీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. మత్స్యకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసిందని, వీటి పెంపకంతో రూ. 4 వేల కోట్ల సంపద సమకూరుతుందన్నారు. -
అధికార దాహంతో కుట్ర
ప్రతిపక్షాలపై మండిపడ్డ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘మల్లన్నసాగర్’ పూర్తి చేస్తాం న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీలు.. ప్రాజెక్ట్ ముంపు బాధితులను రె చ్చగొడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేసి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ముంపుప్రాంతాలు లేకుండా ఏ ప్రాజెక్టును నిర్మించలేమని, అలా నిర్మించిన ప్రాజెక్టులు దేశంలో ఏమైనా ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయడంతోపాటు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ వల్ల 12 వేల కుటుం బాలు నిర్వాసితులైన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరిచారా అని నర్సయ్య ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీలో వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్న టీడీపీ.. తెలంగాణలో నీతులు చెప్పడం సరికాదన్నారు. -
'యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు పొడిగించండి'
- రైల్వే బోర్డు చైర్మన్‌కు ఎంపీ బూర విజ్ఞప్తి హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టలను కలిసి విజ్ఞప్తి చేశారు. మూడో లైను ఏర్పాటు ద్వారా ఈ సర్వీసులు పొడిగించవచ్చని, తద్వారా రైల్వే శాఖకు కూడా వెసులుబాటు కలుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడింట రెండు వంతుల వ్యయాన్ని భరించేందుకు సిద్ధమైందని ఆయన తెలిపారు. -
హైదరాబాద్-అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు!
చౌటుప్పల్: తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఇంకా నిర్మించని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసు నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి. సోమవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో విలేకరులతో మాట్లాడిన భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జురుగుతున్నాయని, దానితోపాటే 65వ నంబర్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా అభివృద్ధి చేసేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారని ఎంపీ తెలిపారు. వచ్చే వారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ 65వ నెంబర్ జాతీయ రహదారిని పరిశీలించేందుకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జంటనగరాల నుంచి విజయవాడకు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లే తప్ప హైస్పీడ్ రైళ్లేవీ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. కొత్త నెట్ వర్క్ ఏర్పాటుతో ఆ లోటు పూడే అవకాశం ఉంది. -
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
లండన్‌లో బ్రిటిష్-సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్ -2015 {పపంచంలో మేటిగా టీఎస్ ఐ పాస్: ఎంపీ బూర సాక్షి, హైదరాబాద్: ఏ రంగంలో పెట్టుబడులు పెట్టడానికైనా భారత్‌లో అన్ని రాష్ట్ర్రాల కంటే తెలంగాణ అనువైన రాష్ట్రమని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అభిప్రాయ పడ్డారు. లండన్‌లో గురువారం జరిగిన ‘బ్రిటిష్ - సౌత్ ఇండియా బిజినెస్ మీట్-2015 ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్రిటిష్ పార్లమెంటులో జరుగుతున్న ఈ మీట్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతోపాటు భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ వీరేంద్రశర్మ, తెలంగాణ పర్యాటక కారద్యర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈ మీట్లో ఎంపీ బూర ప్రసంగిస్తూ.. తెలంగాణ విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, పారిశ్రామిక ప్రగతి, ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ తదితర అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ పేరుతో సరికొత్త పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన టీ.హబ్ దేశంలోనే పెద్దదని వివరించారు. పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర్రానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ బిజినెస్ మీట్లో తెలంగాణ పర్యాటక రంగం విశిష్టత, రాష్ట్రంలోని దర్శనీయ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, హైదరాబాద్ బిర్యానీ తదితర అంశాల గురించి పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
కులవృత్తిని మట్టుబెట్టజూస్తే ఖబడ్దార్
గౌడ సమ్మేళనంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ♦ గౌడలను ప్రభుత్వానికి దూరం చేయజూస్తే ఊరుకోం ♦ అన్యాయం జరిగితే సహించం: ఎంపీ బూర సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: విశ్వాసానికి ప్రతీకగా నిలిచే గౌడ కులస్తులను, కల్లు వృత్తిదారులను ప్రభుత్వానికి దూరం చేసేందుకు, కులవృత్తిని మట్టుబెట్టేందుకు కొందరు అధికారులు పనిగట్టుకుని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇందుకు వత్తాసు పలుకుతున్న కొందరు నాయకుల బండారం కూడా త్వరలో బయటపెట్టి తీరతామని హెచ్చరించా రు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని జెడ్పీ మైదానంలో జరిగిన జిల్లా గౌడ సమ్మేళనం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు అండ గా ఉండటమే తాను చేసిన నేరంగా కొందరు చిత్రీకరించి రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారి కుట్రల ను చేధిస్తామన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టయినా కులవృత్తులను కాపాడుకుంటామ న్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమకు ప్రాధాన్యమివ్వాల ని సీఎంను కోరతామని, త్వరలో ఆయన సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ‘‘కులానికి, ధనానికి మేం తక్కువేమోగానీ వ్యక్తిత్వానికి మమ్మల్ని మించిన వారు లేరు. అదే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో గౌడ సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తా’’ అని చెప్పారు. ‘కార్పొరేట్’ కుట్ర: కల్లు వృత్తిని కాపాడుకోవాలని సాక్షాత్తు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నా అధికారులు వక్రభాష్యం వెతుకుతూ ఆ వృత్తిని నిర్మూలించడం ద్వారా కార్పొరేట్ లిక్కర్ కంపెనీలకు చేయూతనిచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్తీ పేరుతో కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెట్టలనే ఉద్ధేశంతో కొందరు అధికారులు పనికట్టుకుని చేస్తున్న ప్రయత్నాలను ఇక చూస్తూ ఊరుకోబోమన్నారు. తాము తలచుకుంటే అధికారులు బండారం బయట పెడతామని, కులవృత్తులను అణచివేతకు ప్రయత్నిస్తే దాడులు చేయడానికి సైతం వెనుకాడబోమని అన్నారు. ‘‘కల్లులో కల్తీ ఉందని పదే పదే దుష్ర్పచారం చేస్తున్న అధికారులు, కొందరు నేతలు ఇప్పటిదాకా సంభవించిన మరణాల్లో ఏ ఒక్కటైనా కల్లు వల్లే జరిగిందని పోస్టుమార్టం సహా ఏ రిపోర్టులోనైనా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. అవసరమైతే కులవృత్తికి స్వస్తి చెప్పడానికీ సిద్ధం. రాజకీయాల్లో తన ఉన్నతిని తట్టుకోలేక తప్పుడు ఆరోపణలతో కుట్రలు చేస్తూ పత్రికల్లో రాయించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాము తలుచుకుంటే గీతకార్మికులను ఇబ్బంది పెట్టే ఏ అధికారి పొలిమేర దాటలేరని ఆయన హెచ్చరించారు. ఐక్యతే మహాబలం సమస్యల సాధనకు ఐక్యతే ప్రధాన ఆయుధమని భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. అనేక ప్రాంతాల్లో గౌడ కులస్తులపై ఆబ్కారీ అధికారులు దాడులకు పాల్పడి వేధిస్తున్నా, వారి ఓట్లతో గెలుపొందిన నేతలు దీన్ని ప్రశ్నించ కపోవడం దారుణమన్నారు. ‘‘ఏదేమైనా కల్లు వృత్తిని కాపాడుకుని తీరుతాం. గౌడలకు అన్యాయం జరిగితే సహించేదే లేదు’’ అన్నారు. -
గులాబీలో డిష్యుం డిష్యుం!
- వీధికెక్కిన ‘పట్నం’రాజకీయాలు - రెండుగా చీలిన టీఆర్ఎస్ - మంచిరెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు - వైరివర్గాలతో జతకట్టిన ఎంపీ బూర ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా గులాబీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపు వీధికెక్కింది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ రచ్చకెక్కింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధికార పార్టీలో రాజకీయం వేడెక్కింది. నాలుగు నెలల క్రితం మంచిరెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో లుకలుకలకు దారితీసింది. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మరో సీనియర్ నేత ఈసీ శేఖర్‌గౌడ్ ఈ పరిణామంతో డీలా పడ్డారు. ఈ క్రమంలోనే ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో కంచర్ల పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆయన వర్గీయులను కూడా తనవైపు తిప్పుకునేందుకు మంచిరెడ్డి అనుసరిస్తున్న వైఖరితో గుస్సా మీద ఉన్న ఆయన ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈసీ శేఖర్‌గౌడ్ ఏకంగా విలేకర్ల సమావేశం పెట్టి మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలను సంధించారు. భూ అక్రమాలకు పాల్పడుతూ పార్టీ విలువలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలను అణగదొక్కుతున్నారని విమర్శించారు. నావేలితో నాకన్నే పొడిపించారు మరోవైపు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా ఎమ్మెల్యే వైఖరిపై కినుక వహించినట్లు తెలిసింది. వైరివర్గాలకు అనుకూలంగా మాట్లాడిన తీరు ఆయన అసమ్మతిని బయటపెట్టింది. భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో నేను మాట్లాడితే.. మరొకరు చెక్కులను పంపిణీ చేయడమేమిటనీ’ ఆయ న ఇబ్రహీంపట్నంలో విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా ‘రాజకీయాల్లో నేనొక అజ్ఞానినని, నా వేలితోనే నా కంటిని పొడిపించిన మేధావులు ఇక్కడి వారని’ పరోక్షంగా మంచిరెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం చూస్తే ‘పట్నం’ లో గ్రూపురాజకీయాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ వర్గీయుడిగా గుర్తింపు పొందిన ఈసీ శేఖర్‌గౌడ్ విలేకర్ల సమావేశం పెట్టడం చర్చకు తెరలేపింది. మహేందర్‌తో కంచర్ల భేటీ ఇదిలావుండగా, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితో బుధవారం చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అ య్యారు. ఇబ్రహీంపట్నం నియోజకవ ర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించిన చంద్రశేఖర్‌రెడ్డి.. తనవర్గీయులకు జరుగుతు న్న అన్యాయంపై ఏకరువు పెట్టినట్లు తెలిసిం ది. మంచిరెడ్డితో ముందు నుంచి అభిప్రాయబేధాలున్న మహేందర్.. ఈ అంశంపై లోతు గా వెళ్లకుండా.. పరిస్థితులను చక్కదిద్దుతానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుండగా, మంచిరెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. ఈ మేరకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. -
‘సీఎం పదవిలో కొనసాగడానికి చంద్రబాబు అనర్హుడు’
యాదగిరిగుట్ట/ఆలేరు : ఏపీ సీఎం చంద్రబాబు ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డిలు అన్నారు. గురువారం రాత్రి గుట్టలో, అంతకు ముందు ఆలేరులోని ప్రభుత్వ అతిథి గృహంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడి, తమ బాస్ ఆదేశాల మేరకు చేశానని చెప్పారని గుర్తు చేశారు. స్టీఫెన్‌తో ఫోన్లో మాట్లాడింది మూమ్మాటికీ బాబేనని అన్నారు. ఇకనైనా బాబు తన తప్పు ఒప్పుకొని ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్- భూపాలపట్నం 163వ జాతీయ రహదారి విస్తరణ పనులకు ప్రతిఒక్కరూ సహకరించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఆలేరులోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 1905.23కోట్లు కేటాయిం చడం హర్షణీయమన్నారు. వారి వెంట నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, కర్రె వెంకటయ్య, గడ్డమీది రవీందర్‌గౌడ్, బూడిద స్వామి, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, వైస్ ఎంపీపీ కొరకొప్పుల కిష్టయ్య, ఉపసర్పంచ్ దాసి సంతోష్, మల్లేశం, బెంజారం రవి, శమంతారెడ్డి, పాల్గొన్నారు.