శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున ఎంపీ బూర నర్సయ్యగౌడ్
వలిగొండ (భువనగిరి) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగడమే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మండలంలోని రెడ్లరేపాక నుంచి టేకులసోమారం వరకు రూ.కోటీ 60 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను ఆదివారం రెడ్లరేపాకలో ఆయన ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలోని మారెమ్మకాలనీలో, బుడిగజంగాలకాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గౌడ సంఘం భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ జలాశయం కళావిహీనంగా మారడానికి సమైక్య రాష్ట్రంలోని పాలకులే కారణమన్నారు. మూసీ ఆధునీకరణకు ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. గోదావరి, కృష్ణాతో మూసీని అనుసంధానం చేసి ఆధునీకరించనున్నట్లు తెలిపారు. దత్తత గ్రామాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వడంలేదన్నారు. దత్తత గ్రామాల అభివృద్ధికి వివిధ రూపాల్లో నిధులు సమీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. భువనగిరి మండలం ఎర్రంబెల్లి నుంచి కంచనపల్లి మీదుగా రెడ్లరేపాకకు బీటీ రోడ్డు, రెడ్లరేపాక నుంచి వలిగొండ వరకు రోడ్డు ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, సర్పంచ్ పబ్బు ఉపేందర్, పీఆర్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ అయిటిపాముల జ్యోతీసత్యనారా యణ, సర్పంచ్ మాద లావణ్యశంకర్, ఎంపీటీసీ మల్లికార్జున్, భాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, అయోధ్యగౌడ్, కళ్లెం మారయ్య, సంగిశెట్టి క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment