godavari water
-
Bhadrachalam: ఉగ్ర ‘గోదావరి’.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం 48 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక, ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. ఇప్పటికే చర్ల మండలంలోని మూడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు.ఇక ధవళేశ్వేరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.7 అడుగులకు చేరుకుంది. మరోవైపు, పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం 12.5 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గోదావరి నుంచి ప్రస్తుతం 10 లక్షల 28 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల అవుతోంది. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజలు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. -
అలర్ట్.. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.కాగా, భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ఎగువన భారీ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల అవుతోంది.ఇక, క్రమంగా వరద నీరు వస్తుండటంతో 48 అడుగులకు నీటి మట్టం చేరితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. మరోవైపు.. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరద ప్రవాహం కారణంగా పర్ణశాలలో నారా చీరల ప్రాంతం నీటి మునిగింది. -
గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం
నాగోలు/అంబర్పేట్/మన్సూరాబాద్ (హైదరాబాద్): మహా నగరంలో ఉన్న చారిత్రక మూసీ నదిని స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో నింపుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నార్సింగి వద్ద గోదావరి జలాలను మూసీలో కలిపి మురుగు నీరు లేకుండా చర్యలు చేపడతామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మూసీని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికి కూపంగా మారిపోయిందన్నారు. సోమవారం రూ.52 కోట్ల అంచనా వ్యయంతో మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన హైలెవెల్ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, వీటికి అద్భుతమైన డిజైన్లను రూపొందించేందుకు మన ఇంజనీర్లతో విదేశాల్లో అధ్యయనం చేయించామని తెలిపారు. సినిమాల్లో చూపిన మాదిరిగా బ్రిడ్జి డిజైన్లు ఉంటాయని, శంకుస్థాపన చేసిన వంతెనలు 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో దేశంలోనే హైదారాబాద్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఇప్పుడు రోజుకు 2వేల మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, ఇవి పూర్తయితే మూసీలోకి పూర్తిస్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్ధితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. సీఎం కలను నెరవేరుస్తాం మంచిరేవుల నుంచి ఘట్కేసర్ దాకా మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని కేటీఆర్ చెప్పారు. 160 కి.మీ. ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జిలు, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ. 5వేల కోట్లతో రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు. వారం పది రోజుల్లో 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీవో 118లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎల్బీ నగర్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు అద్భుతంగా ఉందని కేటీఆర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి కితాబునిచ్చారు. కేటీఆర్ పార్కు మొత్తం కలియతిరిగి అక్కడ ఏర్పాటుచేసిన ఆకృతులను ఆసక్తిగా తిలకించి.. జీహెచ్ఎంసీ కార్మికులతో ఫొటోలు దిగారు. హైదరాబాద్ మతసమరస్యానికి ప్రతీక అని, పార్లమెంటులో లేని మతసమరస్యాం మన హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ అన్నారు. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేసుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారనే దానికి నిదర్శనమని తెలిపారు. -
ఇంకా ఉత్కంఠే.. నీటి మట్టం 60 అడుగుల వరకూ..
ఖమ్మం: గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వరద వస్తుండడంతో గోదావరి శాంతించడం లేదు. అయితే అంతే స్థాయిలో వరద దిగువకు వెళుతుండడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. వరద తీవ్రత, తీసుకోవాల్సిన చర్యల గురించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ ప్రియాంక ఆల ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఐఏఎస్ అధికారి దురిశెట్టి అనుదీప్, ఎస్పీ డాక్టర్ జి.వినీత్, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తదితరులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నేడూ వరద పోటు.. శనివారం రాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి 15,96,899 క్యూసెక్యుల నీటి ప్రవాహం దిగువకు వెళుతుండగా నీటి మట్టం 56.10 అడుగులుగా ఉంది. గోదావరికి ఎగువ ప్రాంతాన ఉన్న సమ్మక్క బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9 గంటలకు 13 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. సమ్మక్క బ్యారేజీ భద్రాచలనికి ఎగువన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శనివారం మధ్యాహ్నం వదిలిన గరిష్ట వరద భద్రాచలం చేరేందుకు 24 గంటల సమయం పడుతుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు వరద పోటు కొనసాగే అవకాశం ఉంది. గరిష్ట వరద భద్రాచలం చేరుకునే సమయానికి నీటి మట్టం 60 అడుగుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం దగ్గర నీటి మట్టం 53 అడుగుల దిగువకు తగ్గి, ఎగువ నుంచి వరద రాకుంటే పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ముంపు బాధితులకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. -
గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్
సాక్షి, భద్రాచలం: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది. దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఈ సందర్బంగా కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా పెరుగుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలి. గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉదృతంగా నీరు వస్తున్నందున ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది కూడా చదవండి: 5 లక్షల ఎకరాల్లో పంటల మునక! -
రాజమహేంద్రవరం: గోదావరికి వరద (ఫొటోలు)
-
‘సీతారామ’పై సందేహాలు.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన గోదావరి యాజమాన్య బోర్డు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుల ఉమ్మడి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ప్రాజెక్టుతో దిగువన ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలకు నష్టం జరగదని నిర్ధారించాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కోరింది. ప్రధానంగా 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఖరారు చేసిన మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద 561 టీఎంసీల లభ్యతకు రక్షణ కల్పించాలని సూచించింది. ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో భాగంగా సీడబ్ల్యూసీ గతంలో డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు పంపించింది. బోర్డు ఏమందంటే.. ఏపీ, తెలంగాణ మధ్య సమ్మతి లేదు.. రాష్ట్రాలు, ప్రాజెక్టుల వారీగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నీటి కేటాయింపులు జరపలేదు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన గోదావరి జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చివరకు ఉమ్మడి ఏపీకి గోదావరి జలాల లభ్యత, ప్రాజెక్టుల ద్వారా వినియోగం లెక్కలపై సైతం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తేల్చాలి.. ఇప్పటికే ఉన్న, నిర్మాణంలోని, నిర్మాణం ప్రారంభం కాని తమ ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ చెబుతున్నాయి. అయితే గోదావరిలో 1,743 టీఎంసీల మేరకు నీటి లభ్యత లేదని ఆయా రాష్ట్రాలే అంగీకరిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం 1,486.155 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని తెలంగాణ అంటోంది. 2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం కేవలం 1,360 టీఎంసీల లభ్యతే ఉందని, అలాగే 70 టీఎంసీల ఊట నీళ్ల లభ్యత ఉందని ఏపీ పేర్కొంటోంది. అయితే ఊట నీళ్లను పరిగణనలోకి తీసుకోరాదని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పేర్కొంటోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000–2020 మధ్యకాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంటోంది. ఈ అంశాల నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధ్యయనం జరగాలి. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా సీతారామ వద్ద గోదావరిలో 347.06 టీఎంసీల లభ్యత ఉందని ప్రాజెక్టు డీపీఆర్ పేర్కొంటోంది. దీనిపై అధ్యయనానంతరం సీడబ్ల్యూసీ నిర్ధారిత లెక్కలు పంపించాలి. గోదావరి జలాలను కృష్ణాకు ఎలా తరలిస్తారు? సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల ద్వారా 10.109 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించనున్నట్టు డీపీఆర్‌లో ప్రతిపాదించారు. అయితే తరలింపును సమర్థిస్తూ డీపీఆర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
గోదావరి నీటి వాటాలపై జలసౌధలో సమావేశం
-
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరి గ్రాండ్ ఆనకట్టకు గోదావరి జలాలను తరలించేలా గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 70వ సమావేశం మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిలల్లోకి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా రూపొందించిన గోదావరి – కావేరి అనుసంధానం డీపీఆర్‌పై చర్చించారు. ఇందులో 40 టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు కేటాయించి, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. తమ కోటాలో నీటిని మళ్లించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ చెప్పింద. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఇతర బేసిన్లకు మళ్లించే గోదావరి జలాలకుగాను తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. తమకు ఏ ప్రాతిపదికన 9.8 టీఎంసీలు కేటాయించారని కర్ణాటక ప్రశ్నించింది. తమకు అంతకంటే ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేసింది. కావేరికి గోదావరి జలాలు తరలిస్తున్నందున, కావేరి జలాల్లో 92 టీఎంసీలు తమకు ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. నీటి లభ్యతను తేల్చాకే గోదావరి జలాలను కావేరికి తరలించాలని, అప్పుడే వర్షాభావ ప్రాంతాలకు సాగు, తాగు నీరు లభిస్తుందని పేర్కొంది. గత నెల 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక రూపకల్పనలో తాము వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. తెలంగాణ కూడా ఇదే రీతిలో స్పందించింది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేశారు. -
మహానది టు కావేరి వయా గోదావరి!
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానం ద్వారా 477 టీఎంసీలను వినియోగించుకోవచ్చని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ కేంద్రానికి ప్రతిపాదించింది. మహానది నుంచి 230, గోదావరి నుంచి 247 టీఎంసీలను తరలించడం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేయొచ్చంది. అనుసంధానంపై ఏకాభిప్రాయానికి ఆ నదుల పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర జల్ శక్తి శాఖ నిర్ణయించింది. మహానది – గోదావరి అనుసంధానం ఇలా.. ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలిస్తారు. గోదావరి–కావేరి అనుసంధానం ఇలా.. జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కి తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఈ 247 టీఎంసీల గోదావరి జలాలకు మహానది నుంచి గోదావరిలోకి వచ్చిన 230 టీఎంసీలను జతచేసి.. మొత్తం 477 టీఎంసీలను మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానం ద్వారా తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. -
గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్‌పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద నీటిలో మునిగి రైతు మృతి కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్‌వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ మునిగిపోయాడు. ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి, శబరి నదులు -
లక్ష్మీపంప్‌హౌస్‌లో పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్లు.. కొత్తవాటికి ఆర్డర్?
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంప్హౌస్లోకి గత నెల 14న వరద నీరు చేరి రక్షణ గోడ కూలి మోటార్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీవాటరింగ్ ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌లోకి తాత్కాలికంగా నిచ్చెనలు తయారు చేసి కూలీలు, ఇంజనీర్లు దిగుతున్నారు. దీంతో పంప్‌హౌస్‌లో మొత్తం 17 మోటార్లు, పంపులకు గాను ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. దీంతో ఫిన్లాండ్, ఆస్ట్రియా దేశాలకు ఆరు మోటార్ల కోసం సీడీఓ (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు డిజైన్స్ పంపినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ అధికారులంతా అదేపనిలో పడ్డట్లు సమాచారం. ఇక్కడి ఇంజనీర్లు మోటార్లకు సంబంధించిన కంపెనీలకు చెందిన విదేశాల్లోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. మిగతా మోటార్లలో ఐదు వరకు.. ఉన్న స్థానం నుంచి పక్కకు జరిగి వంగినట్లు చెబుతున్నారు. మరికొన్ని మోటార్లు పాక్షికంగా చెడిపోయినట్లు సమాచారం. రక్షణ గోడ పూర్తిగా నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోర్‌బేకు పంప్‌హౌస్ మధ్యలో పొడవునా మళ్లీ పూర్తిగా నిర్మాణం చేయడానికి డిజైన్స్ రెడీ చేసినట్లు తెలిసింది. కాగా, వర్షాకాలం కావడంతో గోడ నిర్మాణం సాధ్యం కాదని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత చేపట్టనున్నారని ఇంజనీర్లు చెబుతున్నారు. కాళేశ్వరంలో గోదావరి ఉధృతి తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి 11.70 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 7.30 లక్షల క్యూసెక్కుల నీరు లక్ష్మీబ్యారేజీకి తరలిపోతోంది. ములుగు జిల్లా పేరూరు వద్ద సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరింది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. టేకులగూడెం గ్రామ చివరన 163 నంబర్ జాతీయ రహదారి మునిగిపోవడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. దీని వల్ల ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 45-55 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, పెరుగుతున్న వరద ప్రవాహం కారణంగా గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో, గోదావరి పరివాహక ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి 9,35,465 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలో నీటి మట్టం 9.8 అడుగులకు చేరుకుంది. 7 లక్షల 26 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ నుండి సముద్రంలోకి చేరుతోంది. డెల్టా కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: 9 నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు -
ధవళేశ్వరం వద్ద తగ్గిన వరద.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 14,97,070 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 15.1 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. డెల్టాకు 5,400 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 14,91,670 క్యూసెక్కులను బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన కాస్త పెరుగుదల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎగువన గోదావరిలో వరద ఉధృతి కాస్త పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీలోకి 8,62,610 క్యూసెక్కులు చేరుతోంది. సీతమ్మసాగర్‌లోకి వస్తున్న 12,27,650 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 12,42,264 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 48.4 అడుగులకు చేరుకుంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 13,86,917 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 35.25 మీటర్లకు చేరింది. వస్తున్న ప్రవాహాన్ని వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తూ.. అధికారులు సమర్థంగా వరదను నియంత్రిస్తున్నారు. ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి -
TS: గోదారమ్మ ఉగ్రరూపం.. మంత్రిపై వరద బాధితుల ఆగ్రహం
గోదావరి వరద ఉధృతి కారణంగా భద్రాచలం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్బంగా వరద బాధితులు ఆందోళనకు దిగారు. కరకట్ట పొడిగింపుపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి సుభాష్ నగర్ వరకు కరకట్టను పొడగించాలని నినాదాలు చేశారు. వరదల్లో చిక్కుకున్న తమకు తాగేందుకు నీరు కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని కన్నీంటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లిపోయారు. సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. కరకట్ట పొడిగించి తమకు న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వీరయ్య వరద బాధితులకు మద్దతు తెలిపారు. ఇక, అధికారులు సుభాష్ నగర్ ప్రజలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. గోదారమ్మ కొంచెం శాంతించింది. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 70.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. కానీ, మూడో ప్రమాద హెచ్చరిక మాత్రం కొనసాగుతోంది. మరో 24 గంటలు కీలమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద హై టెన్షన్
సాక్షి, తూర్పుగోదావరి: భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. వరద నీరు మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. దీంతో, 24 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. 20.6 అడుగులకు నీటిమట్టం చేరింది. 23.94 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోగా కొనసాగుతోంది. గోదావరి ఉప నదులు గౌతమి, వశిష్ట, వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పరిస్థితులను పరీక్షిస్తున్నారు. మరోవైపు.. కోనసీమ జిల్లాలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహానికి అక్విడెక్ట్ బ్రిడ్డి మునిగిపోయింది. కాగా, అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడిగట్టు బలహీనంగా ఉంది. ఈ క్రమంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -
AP: భారీ వర్షాల ఎఫెక్ట్.. విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ
సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా గోదావరికి ఉధృతి పెరిగింది కాగా, ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరిస్థితిని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద ప్రభావితం చేసే మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల్లో మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. కాగా, లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇది కూడా చదవండి: బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు -
తూ.గో.: ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి జలాలు విడుదల
సాక్షి, విజ్జేశ్వరం: అన్నదాతలకు అండగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి సాగునీరు విడుదల చేశారు. బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం దగ్గర డెల్టా కాల్వలకు నీటిని విడుదల చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి పశ్చిమ డెల్టా కాలువ సాగునీరు విడుదల చేశారు. తద్వారా 5.29 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టారు జలవనరుల శాఖ మంత్రి అంబటి. చంద్రబాబు తెలివితక్కువతనం వల్లే.. ‘‘2018 నాటికి పోలవరం పూర్తి చేసేసి నీళ్లు ఇస్తానన్న చంద్రబాబు, దేవినేని ఉమా.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. పోలవరంలో డయాఫ్రం వాల్ దెబ్బతింది. కాపర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టింది టీడీపీ ప్రభుత్వం. ఈ తెలివితక్కువ పని వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. డయాఫ్రం వాల్ రిపేర్ చేయాలా? లేదంటే పునర్నిర్మించాలా? అనే విషయంపైనే ఇప్పుడు ఇరిగేషన్ నిపుణులు ఆలోచిస్తున్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో కచ్చితంగా జాప్యం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. పోలవరం ఫలానా డేట్ కు పూర్తవుతుందని స్పష్టంగా చెప్పలేము. త్వరిత గతిన పూర్తి చేయడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం అని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు. -
విషాదం: కలిసి చదివారు.. కలిసున్నారు.. చివరికి కలిసే..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్/ఆత్రేయపురం: వారిద్దరూ కలిసి చదువుకుంటున్నారు. కలసిమెలసి ఉండేవారు. చివరికి మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో స్నానాలకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమహేంద్రవరం ఐఎల్టీడీ బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన కొల్లాబత్తుల దయాకరుణ్ ఎలియాస్ సన్నీ (20), రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బాణావత్ సత్యనారాయణ (20) ధవళేశ్వరం వివేకానంద ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. గురువారం సాయంత్రం తరగతులు ముగిశాక ఇద్దరూ గోదావరి స్నానానికి పిచ్చుకలంక వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో పడ్డారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి వారి మృతదేహాలు శుక్రవారం గోదావరి ఒడ్డున లభ్యమయ్యాయి. దయాకరుణ్ తండ్రి శేఖర్ పెయింటింగ్ పనుల కాంట్రాక్టు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు సత్యనారాయణ తండ్రి సీతనాయక్ రైల్వే శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఐటీఐ చదివి ఉద్యోగాలు పొందుతారని భావించిన తరుణంలో విద్యార్థులిద్దరూ మృత్యువాత పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
మల్లన్న సాగర్‌లోకి గోదారి ట్రయల్‌రన్ విజయవంతం
దుబ్బాకటౌన్/తొగుట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు, ఈఈ వెంకటేశ్వర్రావు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ కొద్దిసేపట్లోనే మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్ విజయవంతం అవడంతో సంబురాలు జరుపుకొన్నారు. 10 టీఎంసీలు నింపేందుకు.. మల్లన్నసాగర్లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుక్కాపూర్ పంపుహౌజ్‌లోని మొత్తం ఎనిమిది పంపులకుగాను.. మూడు పంపుల (రెండో, ఆరో, ఏడో నంబర్ పంపుల) ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా రోజుకు (24 గంటల్లో) 1.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మూడింటిని పూర్తిస్థాయిలో నడిపితే.. రెండు, మూడు రోజుల్లోనే మల్లన్నసాగర్లో 10 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. భారీగా బందోబస్తు మల్లన్నసాగర్లో నీళ్లు నింపుతున్న నేపథ్యంలో పోలీసులు శనివారం మధ్యాహ్నమే రిజర్వాయర్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుక్కాపూర్, రాంపురం వాగుగడ్డ, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై పికెట్లు ఏర్పాటు చేశారు. ఎవరినీ కట్ట వద్దకు వెళ్లనీయడం లేదు. గ్రామస్తులను కూడా పూర్తి వివరాలు అడిగి నిర్ధారించుకున్నాకే వెళ్లనిస్తున్నారు. అర్ధరాత్రి గ్రామాలు ఖాళీ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని కుటుంబాలను రెవెన్యూ అధికారులు శనివారం అర్ధరాత్రి ఖాళీ చేయించారు. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, బి.బంజేరుపల్లి గ్రామాల నుంచి అందరినీ బయటికి తరలించారు. నిజానికి ఈ గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గతంలోనే ఆదేశించారు. కానీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కొందరు ఖాళీ చేయలేదు. వారిని ఇప్పుడు బయటికి తరలించారు. గట్టు గుట్ట పూజారి అక్కడే..! వేములఘాట్ శివారు అటవీప్రాంతంలోని గట్టు గుట్టపై దీకొండ మైసమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ తండాకు చెందిన మంగీలాల్.. ఆలయంలోనే నివసిస్తూ పూజారిగా పనిచేస్తున్నారు. ముంపు గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో.. ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ఆయనతో మాట్లాడి బయటికి రావాలని కోరారు. కానీ మంగీలాల్ తిరస్కరించారు. అధికారులు ఆయనను బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం: మంత్రి హరీశ్ ‘కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం.. తెలంగాణకు అమృత జలాభిషేకం’ అని పేర్కొంటూ రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ఫొటోలను ట్విట్టర్లో మంత్రి హరీశ్‌రావు పోస్టు చేశారు. ‘సాకారమైన సాగరం.. అనుమానాలు, అపశకునాలు, అవరోధాలు తలవంచి తప్పుకున్నాయి.కుట్రలు, కుహానా కేసులు, వందల విమర్శలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. గోదారి గంగమ్మ మల్లన్నసాగరాన్ని ముద్దాడింది. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. పట్టుదలతో పనిచేస్తే కానిదేదీ లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది..’’ అని పేర్కొన్నారు. -
ముందుకా.. వెనక్కా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై మళ్లీ కదలిక వచ్చింది. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చిన ఇచ్ఛంపల్లి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు నీటి తరలింపుపై పరీవాహక రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యతపై భిన్న వాదనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మరోమారు సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 17న ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్ బాడీ నదుల అనుసంధాన ప్రక్రియపై కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో చర్చించనుంది. మిగులు జలాల తరలింపు విషయంలో ఛత్తీస్‌గఢ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, రాష్ట్ర అవసరాలు తీరాకే నీటిని తరలించాలంటున్న తెలంగాణ, ఏపీ వాదనల నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇంద్రావతిలో మిగులుందని ముందుకు పోవద్దు.. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఇప్పటికే జనంపేట, అకినేపల్లి, తుపాకులగూడెం నుంచి నీటిని తరలించే ప్రణాళికలు తెరపైకి తెచ్చిన కేంద్రం వాటిపై తెలంగాణ ఆమోదం లేని నేపథ్యంలో మళ్లీ ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అటునుంచి నీటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనకు ప్రాణం పోస్తోంది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి మొత్తంగా ఇచ్ఛంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలిస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.86వేల కోట్ల అంచనాతో ఇదివరకే రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్రాలకు పంపింది. అయితే ఇందులో ఇంద్రావతిలో లభ్యతగా ఉన్నాయని చెబుతున్న 273 టీఎంసీల నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలున్నాయంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీలు వినియోగిస్తామని అంటోంది. ఒకవేళ మిగులు ఉందని చెప్పి వేల కోట్ల ఖర్చుతో అనుసంధాన ప్రక్రియ చేపడితే, భవిష్యత్తులో తాము నీటి వినియోగం మొదలుపెట్టేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తే నీళ్లే ఉండవని, అప్పుడు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనని హెచ్చరిస్తోంది. ఛత్తీస్‌గఢ్ వాదనతో తెలంగాణ సైతం ఏకీభవిస్తోంది. ఏ నదీ బేసిన్‌లోని నీటిని ఆ బేసిన అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు తరలించాలని ట్రిబ్యునల్స్, చట్టాలు చెబుతున్నాయని అంటోంది. ఛత్తీస్‌గఢ్ అవసరాలు తీరకుండా, వాటికి హక్కు ఇవ్వకుండా మిగులు నీటిని ఇతర బేసిన్లకు తరలించడం కష్టమేనని చెబుతోంది. ఇంద్రావతి జలాలపై స్పష్టత ఇచ్చాకే ముందుకెళ్లాలని అంటోంది. -
రిజర్వాయర్లకు నయా లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలు పర్యాటకంగా వెనుకబడే ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, పర్యాటకానికి అనువుగా లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో గోదావరి జలాలతో నిండుతున్న రిజర్వాయర్లు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులు పర్యాటకానికి ఆస్కారమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన ప్రతిపాదనల ఆధారంగా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద అభివృద్ధి చర్యలు చేపడుతోంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నాలుగు రిజర్వాయర్ల వద్ద.. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగు రిజర్వాయర్లపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కీలక పట్టణంగా ఎదుగుతున్న సిద్దిపేటకు సమీపంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్, సిరిసిల్ల శివార్లలోని అన్నపూర్ణ రిజర్వాయర్, అవకాశాలు ఉండీ ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోని అప్పర్, మిడ్‌మానేరు రిజర్వాయర్లను ఎంపిక చేసింది. ఆయా చోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవలే పర్యాటకాభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. జాతీయ స్థాయిలో సంస్థలు కాన్సెప్టు, డీపీఆర్‌లతో ఈ నెల 15 నాటికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. పనులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని పేర్కొంది. వచ్చిన ప్రతిపాదనల్లో మేలైన దాన్ని ఎంపిక చేసి ఆ ఇతివృత్తానికి తగ్గట్టు రిజర్వాయర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రంగనాయకసాగర్‌ను తొలిదశలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతగిరి రిజర్వాయర్‌లోని ప్రకృతి అందాలు రివర్ ఫ్రంట్‌గా లోయర్ మానేరు.. లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని రివర్‌ఫ్రంట్ పేరుతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నీటిపారుదల శాఖకు రూ.350 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు, ఆకర్షణీయ పనులు చేసేందుకు పర్యా టక శాఖకు రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటు నియామక ప్రక్రియ జరుగుతోంది. దీనితో కలిపి ఐదు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. అయితే పర్యాటక అభివృద్ధి పనులు నిధుల కొరతతో చతికిలబడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది. -
గోదావరికి పోటెత్తిన వరద
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వరద ఉధృతితో గురువారం రాత్రి 11 గంటలకు గోదావరి నీటిమట్టం 17.03 అడుగులు ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు 18.90 అడుగులకు చేరింది. అది పెరుగుతూ రాత్రి 11 గంటలకు 33.10 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా వరద నీరు ఉపనదుల ద్వారా గోదావరికి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. అంతేకాకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని దిగువకు వదులుతుండటంతో శనివారం మధ్యాహ్నానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు, 1986లో వచ్చిన 75.6 అడుగుల నీటిమట్టంకన్నా పోలవరం బ్యాక్ వాటర్‌తో ఇప్పుడు భద్రాచలంలో గోదావరి ఒకట్రెండు అడుగులు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందన్న ప్రచారంతో ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్‌కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్ శాఖ సిద్ధ్దమవుతోంది. భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది. సింగూరులో 510 లెవల్ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్ అలైన్మెంట్, పంప్‌హౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు డీపీఆర్‌కి సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్‌లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్‌లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా -
బోర్డుల పరిధి నోటిఫై చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి రెండు నదుల మేనేజ్మెంట్ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేసేందుకు నిర్ణయించామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. రెండు నదులపై చేపట్టే కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఎవాల్యుయేషన్ కోసం పంపడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి షెకావత్ అధ్యక్షతన ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం మంగళవారం ఇక్కడి శ్రమశక్తి భవన్లో జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ నుంచే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. సమావేశానంతరం జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరె, కార్యదర్శి యూపీ సింగ్, అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ, సంయుక్త కార్యదర్శి సంజీవ్ అవస్తీతో కలిసి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడారు. ‘ఇరు రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చి జల వివాదాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు వీలు కలిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ఇచ్చిన ఆజ్ఞను పాటించడంలో సఫలీకృతులమయ్యాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక.. ‘గోదావరి, కృష్ణా నదుల అధికార పరిధిని కేంద్రం నోటిఫై చేయడానికి తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. కానీ, చట్టప్రకారం దీనిపై ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేనందువల్ల రెండు నదుల మేనేజ్మెంట్ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. ఇందుకు తెలంగాణ సీఎం కూడా సుముఖత వ్యక్తంచేశారు’.. అని షెకావత్ తెలిపారు. అలాగే.. ‘కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని సెక్షన్–3 కింద ట్రిబ్యునల్‌కు సూచించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అపెక్స్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ కేసును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తీసుకెళ్లినందువల్ల ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్న అంశాన్ని ట్రిబ్యునల్‌కు సూచించడం వీలుకాదని తెలియచేయడంతో కేసీఆర్ ఆ కేసును వెంటనే ఉపసంహరించుకుంటామని చెప్పారు. అంతేకాక, లిఖితపూర్వక హామీ ఇచ్చిన తరువాత దానిని కొత్త ట్రిబ్యునల్‌కు పంపాలా లేక ప్రస్తుత ట్రిబ్యునల్‌కు పంపాలా అన్నదానిపై చట్టపరమైన సలహాలను తీసుకుని నిర్ణయిస్తాం. గోదావరి నది జలాల పంపిణీ వివాదాల పరిష్కారానికి మరో ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని రెండు రాష్ట్రాలు కోరాయి. ఇందుకు సంబంధించిన విజ్ఞప్తిని మరుసటి రోజే కేంద్రానికి పంపుతానని తెలంగాణ సీఎం తెలిపారు. కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి రెండు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపాయి..’ అని షెకావత్ వివరించారు. ఏపీ సీఎంతో ఏకీభవించిన షెకావత్ అంతకుముందు అపెక్స్ సమావేశంలో.. కొత్త ట్రిబ్యునల్ ఇచ్చేంతవరకు ఏం మాట్లాడినా లాభంలేదని, తాను పంపించిన అంశాలు అజెండాలో లేవని కేసీఆర్ ప్రస్తావించారు. అయితే, ఆలస్యంగా వచ్చినందున ఆ అంశాలు రాలేదని, మరోసారి సమావేశమవ్వొచ్చని మంత్రి షెకావత్ సూచించారు. ఈ నేపథ్యంలో.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తాను పంపిన అభ్యంతరాలను కేసీఆర్ ప్రస్తావించారు. వీటిని ఏపీ సీఎం వైఎస్ జగన్ తిప్పికొట్టారు. గోదావరి నదిపై చేపడుతున్న కాళేశ్వరం, సీతారామసాగర్ తదితర ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విస్తరణ పేరుతో కొత్తగా ప్రాజెక్టులు చేపడుతోందని, ఏపీలో అదే రీతిలో తాము ప్రాజెక్టులు విస్తరిస్తే అభ్యంతరం ఎందుకని తన వాదన వినిపించారు. రెండు రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలనేది తన అభిప్రాయం అని చెప్పారు. కేంద్రమంత్రి ఈ వాదనలతో ఏకీభవించారు. ‘రెండూ ఒకేరీతిలో ఉండాలి. ఒకచోట ఒక విధానం మరొకచోట మరో విధానం ఉండరాదు..’ అని సూచించారు. అలాగే, పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు ఏపీ తరలిస్తోంది... ఇది అక్రమమని కేసీఆర్ చేసిన మరో వాదనను కూడా వైఎస్ జగన్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా.. కేడబ్ల్యూడీటీ–1 తీర్పులోని 128వ పేజీని చదువుతూ.. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్‌కు నీటిని తరలించడం న్యాయమేనని ఆ తీర్పు చెప్పిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తుంగభద్ర హెచ్ఎల్సీ ద్వారా, కేసీ కెనాల్ ద్వారా ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించారని జగన్ గుర్తుచేశారు. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు దశాబ్దాలుగా శ్రీశైలం నుంచి తరలిస్తున్నారని తెలిపారు. దేశంలో రావి, చినాబ్, సట్లెజ్ తదితర నదుల నుంచి కూడా నీటిని మళ్లీస్తున్న అంశాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. అనంతరం.. ‘డీపీఆర్‌లు సమర్పిస్తే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది..’ అని మంత్రి చెప్పగా.. ఇందుకు ఇద్దరు సీఎంలూ సమ్మతించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ పట్టు అజెండా అంశాలపై జరిగిన చర్చలో.. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్–3ని అనుసరించి కొత్త ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని తాము చేసిన అభ్యర్థనను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే పట్టుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదన సరిగ్గా వినలేదని, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై లోతుగా అధ్యయనం జరగాలని కోరారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. ‘వీటన్నింటినీ ట్రిబ్యునల్ ఒక్కటే పరిష్కరించలేదు.. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది..’ అని సమాధానమిచ్చారు. అజెండాలో లేని అంశాలపై కేంద్రం అభిప్రాయం.. అజెండాలో లేని కొన్ని అంశాలపై కేంద్రం తన అభిప్రాయాన్ని సమావేశంలో పంచుకుంది. అవి.. ► కృష్ణా బేసిన్లో చాలా ప్రాజెక్టులున్నాయని, కానీ.. నదీ జలాలు మాత్రం పరిమితంగా ఉన్నాయని వివరించింది. ► ఉనికిలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, తద్వారా మరిన్ని కొత్త ప్రాజెక్టులు పనిచేసేలా తిరిగి కేటాయింపులు జరపడం సాధ్యపడుతుందని అభిప్రాయపడింది. ► గోదావరి బేసిన్లో కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక చేసే ముందు.. అనుమతులున్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడం ద్వారా లభ్యత ఉన్న మొత్తం జలాలను సరిగ్గా వినియోగించుకోవాలని సూచించింది. ► గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదన ఉన్నందున.. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలపై శ్రద్ధ చూపాలి. ► ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు సాగునీటి శాఖ మంత్రి అనిల్‌కుమార్, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. అజెండాలోని అంశాల వారీగా కేంద్రం ప్రతిపాదనలు.. 1 మొదటి అంశంపై కేంద్రమంత్రి వివరిస్తూ.. ‘బోర్డులు ఏర్పడి ఆరేళ్లయినప్పటికీ వీటి పరిధి నోటిఫై కాకపోవడానికి కారణం రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడమే. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని నియంత్రించడం, కొత్త ప్రాజెక్టుల సాంకేతిక అనుమతులివ్వడం ఈ బోర్డుల విధి. అయితే వీటిని నోటిఫై చేయకపోవడం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో నిర్ణయాధికారం కేంద్రానిదే అయినందున ప్రస్తుతం నోటిఫై చేసేందుకు నిర్ణయించాం. దీని ద్వారా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది..’ అని వివరించారు. 2 అజెండాలోని రెండో అంశం కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించడం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఆయా ప్రాజెక్టులను సాంకేతికంగా మదింపు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన ఆదేశాలతో సంబంధం ఉన్న ప్రాజెక్టులు.. అలాగే, అనుమతుల్లేని పాత ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా సమర్పించాలి. తొలుత బోర్డులు సాంకేతిక మదింపు జరిపి సమ్మతించిన తరువాత అపెక్స్ కౌన్సిల్ వాటికి అనుమతిస్తుంది. కేడబ్ల్యూడీటీ–1 ద్వారా కేటాయింపులున్న ప్రాజెక్టులన్నింటినీ పాత ప్రాజెక్టులుగా పరిగణించాలి. ట్రిబ్యునల్స్ ద్వారా వాటికి కేటాయింపులు లేనిపక్షంలో.. కేడబ్ల్యూడీటీ–2 ద్వారా కేటాయింపులు తెచ్చుకోవాలి. ఈ రెండు కేటగిరీల్లో లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి. వీటి డీపీఆర్‌లు సమర్పించాలి. 3 రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వాటా నిర్ధారించేందుకు యంత్రాంగం ఏర్పాటుచేయడం. రెండు రాష్ట్రాలు పరస్పరం వీటిపై ఫిర్యాదు చేసినందున అపెక్స్ కౌన్సిల్ సామరస్యంగా పరిష్కరించేందుకు ఒక మెకానిజం ప్రతిపాదించింది. గోదావరి జలాల విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ద్వారా లేదా కొత్త ట్రిబ్యునల్ నిర్ణయించడం ద్వారా గోదావరి జలాలు పంపిణీ చేసుకోవచ్చు. అలాగే, గోదావరి జలాలను కృష్ణా నదికి (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి) మళ్లించినప్పుడు దాని నుంచి వాటా పంచేందుకు మెకానిజం ఏర్పాటుచేయాలి. 4 కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు అంగీకారం కుదిరింది. -
నిలకడగా కృష్ణమ్మ
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 89,731 క్యూసెక్కులు చేరుతుండటంతో.. నీటి మట్టం 838.8 అడుగులకు చేరింది. నీటి నిల్వ 60.10 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నిండాలంటే ఇంకా 155 టీఎంసీలు అవసరం. ► జూరాల ప్రాజెక్టులోకి 86,280 క్యూసెక్కులు చేరతుండగా.. స్పిల్‌వే వద్ద 7 గేట్లు ఎత్తి, విద్యుత్ కేంద్రం ద్వారా 84 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ► జూరాల నుంచి వస్తున్న జలాలకు హంద్రీ, తుంగభద్ర జలాలు జత కలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 89,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. ► ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 4,502 క్యూసెక్కులు వదిలి 12,907 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో స్థిరంగా.. ► గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 56,039 క్యూసెక్కులు చేరుతుండగా.. 55,539 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► వంశధార నదిలో వరద ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీలోకి 2,685 క్యూసెక్కులు చేరుతుండగా 2,391 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. -
నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని, నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాల్సిన అవసరముందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంత పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ, గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. నదులకు 5 కి.మీ. దూరం నుంచి రైతుల పొలాలలో నీడనిచ్చే చెట్లు, ఉద్యాన పంటలు వంటివి వేయాలన్నారు. వాగులకు రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా పచ్చదనాన్ని పెంచాలన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాల భూమిలో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ సంచాలకులు జయప్రసాద్, శాస్త్రవేత్త డీఆర్ఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ కృష్ణమ్మ ఉగ్రరూపం
-
ఉగ్ర గోదారి
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం/ఏలూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో 15 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. 14.70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద సాయంత్రం 6 గంటలకు 47.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, ఏజెన్సీ మండలాల్లో 111 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వీఆర్ పురం మండలాల్లో 20 గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు మండలంలో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దేవీపట్నం మండలంలో తొయ్యేరు, పూడిపల్లి తదితర 36 గ్రామాలు ఎనిమిదో రోజూ వరద ముంపులోనే ఉన్నాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 30 లంక గ్రామాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండగా.. దిగువన ఆచంట, యలమంచిలి మండలాల్లో అనగారలంక, పెదమల్లంలంక, అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమాలలంక, దొడ్డిపట్ల పల్లెపాలెం, లక్ష్మీపాలెం, పెదలంక, కనకాయలంక గ్రామాల్లో వరద నీరు చేసింది. వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట, రేపాకగొమ్ము, తిర్లాపురం, నాళ్లారం, కట్కూరు, కొయిదా సహా 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు మండలంలో గొమ్ముగూడెం, కౌండిన్యముక్తి గ్రామాలను వరద చుట్టుముట్టింది. పాత పోలవరంలోని నెక్లెస్ బండ్ కోతకు గురై గోదావరిలోకి అండలుగా జారుతూ భయపెడుతోంది. ఇదిలావుంటే.. వంశధార, నాగావళి నదుల్లో శుక్రవారం వరద తగ్గింది. ఒకరి మృతి.. ఇద్దరు గల్లంతు తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం కొచ్చావారివీధి వద్ద జర్తా భద్రమ్మ అనే మహిళ మడేరు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఇదే జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై నడిచి వెళ్తున్న నమీర్‌బాషా (23), షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతు కాగా.. షేక్ వజీర్ అనే యువకుడిని స్థానికులు రక్షించారు. ముంపును జయించి పెళ్లాడింది పెండ్లి కుమార్తెను ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి వివాహం జరిపించిన అరుదైన ఘటన తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడిలో చోటుచేసుకుంది. పెదపట్నంలంకకు చెందిన దేవిశ్రీకి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వివాహం నిశ్చయించారు. ఆమెను నగరం గ్రామంలోని వరుడు దాకే బాలరాజు ఇంటికి తీసుకు వెళ్లాల్సి ఉంది. ప్రధాన రహదారులన్నీ వరద ముంపులో చిక్కుకోవడంతో దేవిశ్రీని అప్పనపల్లి మలుపు వరకు కారులో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి అనుకున్న సమయానికే వివాహ తంతును పూర్తి చేశారు. -
ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక
సాక్షి, పశ్చిమగోదావరి : గోదావరిలో వరద ఉగ్రరూపు దాల్చింది. ఐదు రోజుల నుంచి ఏజెన్సీలో 19 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొవ్వూరులో గోష్పాద క్షేత్రాన్ని గోదావరి వరద ముంచెత్తింది. క్షేత్రంలో రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లో లంకభూముల్లో పంటలు నీటమునిగాయి. యలమంచిలి మండలం కనగాయలంక కాజ్‌వేపై నుంచి నాలుగు అడుగుల మేరకు వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అక్కడ పడవలు ఏర్పాటు చేసి జనాన్ని ఒడ్డుకు చేర్చుతున్నారు. పెరవలి మండలంలో కానూరు, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు, మల్లేశ్వరం, ఖండవల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు వరదనీట మునిగాయి. కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం, నిడదవోలు, పెనుగొండ మండలాల్లోను లంకభూములు ముంపుబారిన పడ్డాయి. ఏజన్సీలో పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలో 39 గ్రామాలకు ఐదు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతంలో వరద నెమ్మదిస్తుండడంతో ఉదయం పది గంటల నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి 14.10 నుంచి నిలకడగా కొనసాగింది. ఒంటిగంటకి 14.20 అడుగులకు పెరిగింది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లను పూర్తిగా ఆల్ క్లియర్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆనకట్ట నుంచి 13,50,363 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో వరద ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు స్ధిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. గోదావరికి ఎగువ ప్రాంతంలో భద్రాచలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ కాళేశ్వరం, దుమ్ముగూడెం, పేరూరు తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో వరద ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,800 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. తూర్పు డెల్టాకు 4వేలు, సెంట్రల్‌కి 1,800లు, పశ్చిమ డెల్టాకు 2వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడిచి పెడుతున్నారు. ముంపులోనే పంటపొలాలు డెల్టాలో గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో ఇంకా 4,746 హెక్టార్ల పంట ముంపులోనే ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. 591 హెక్టార్లలో వరి నారుమళ్లు ముంపు బారిన పడితే దీనిలో 412 హెక్టార్ల నారుమళ్లు కుళ్లిపోయాయన్నారు. 7,550 మంది రైతులకు చెందిన 1,026 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంపులో ఉన్న పంటలు తేరుకుంటే నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అ«ధికారులు చెబుతున్నారు. పెరవలి మండలంలో సుమారు 2,200 ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. మిగిలిన తీర ప్రాంత మండలాల్లో సుమారు రెండు వందల ఎకరాల పంట నీటమునింది. ముంపు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ పర్యటన ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్ కలెక్టర్ సలీమ్‌ఖాన్‌లు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. లంక గ్రామాల్లో పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్దమల్లం లంక, అయోధ్యలంక, రవిలంక, మర్రిమూల, పుచ్చలలంక గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 39 గ్రామాలకు రాకపోకలు బంద్ గోదావరి వరద ముంచెత్తడంతో పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద బాధితుల కోసం పోలవరం, వేలేరుపాడు గ్రామాల్లో రెండు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 51 కుటుంబాలకు చెందిన 133 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ వరద పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఇన్చార్జ్ మంత్రి సుభాష్ చంద్రబోస్‌లు ముంపు ప్రాంతంలో పర్యటించారు. ముంపు ప్రభావిత గ్రామాలకు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించి ముందుస్తు ఏర్పాట్లు చేశారు. ముంపు ప్రాంతంలో 4,088 కుటుంబాలకు అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 1,022 క్వింటాళ్ల బియ్యం, బంగాళ దుంపలు, ఉల్లిపాయాలు, 4,088 లీటర్ల పామాయిల్, 8,716 లీటర్ల కిరోసిన్, 4,188 కేజీల కందిపప్పు అందజేశారు. 56 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతంలో 53 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 1,156 మందికి వైద్య సేవలు అందజేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 13 డెంగీ, డయేరియా కేసులకు వైద్యం చేశామన్నారు. ముంపు గ్రామాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలతో పాటు అన్ని రకాలైన మందులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
దిశ మార్చి వస్తోంది..దశ మార్చబోతోంది..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ దశాబ్దాల కల సాకారమైంది. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తొలుత ఉదయం 11:23 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం విశిష్ట అతిథి గవర్నర్ నరసింహన్, మరో ముఖ్యఅతిథి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు వై.ఎస్. జగన్, సీఎం కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గుమ్మడికాయను కొట్టి సరిగ్గా ఉదయం 11:26 గంటలకు రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అలాగే మధ్యాహ్నం 1:07 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి స్విచాన్ చేశారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పంప్‌హౌస్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని బటన్ నొక్కి ఆవిష్కరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. చిత్రంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ తదితరులు కన్నెపల్లి వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గోదావరి.. ఘనంగా జల సంకల్ప యాగం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద శృంగేరీ పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితులు పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు సీఎంలను, గవర్నర్‌ను ఆశీర్వదించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగిన యాగంలో కేసీఆర్ దంపతులు, కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర జరిగిన యాగంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను మంత్రి మహమూద్ అలీ, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌లను మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. యాగశాలలో కేసీఆర్ దంపతుల పూజలు. చిత్రంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు ఫడ్నవిస్, జగన్, మంత్రులు ఇంద్రకరణ్, ఈటల తదితరులు ముగ్గురు సీఎంలు కలిసిన సందర్భం.. నదీజలాల వాటాలు, పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరీవాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్య మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వంతోనూ నీటి వివాదాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మహారాష్ట్ర ప్రభుత్వంతో, ఏపీలో కొలువుదీరిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహపూర్వక దౌత్య సంబంధాలు నడిపారు. అతిథులు, బ్యాంకర్లకు సన్మానం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యఅతిథులు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన కేసీఆర్... అతిథులు వెళ్లేటప్పుడు హెలికాప్టర్ దాకా వెళ్లి మరీ ఒక్కొక్కరికీ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించిన వివిధ బ్యాంకుల ప్రతినిధులను సీఎం సన్మానించి జ్ఞాపికలు అందించారు. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కన్నెపల్లిలో నిర్మించిన పంపుహౌస్ లిఫ్ట్‌లో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇరుక్కుపోయారు. ప్రాజెక్టు ప్రారంభానికి హాజరైన ఆయన... కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్లను చూసేందుకు లిప్టులో కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంటన్నర తర్వాత లిఫ్ట్ అద్దాలు పగలగొట్టి అధికారులు వారిని నిచ్చెన ద్వారా మరో ఫ్లోర్‌లోకి ఎక్కించారు. సువర్ణాక్షరాలతో లిఖించే రోజు: సీఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన జూన్ 21వ తేదీని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి అభివర్ణించారు. అతిథులు, బ్యాంకర్లను సన్మానించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ జోషి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డీజీపీ జైస్వాల్, ఎంపీలు జోగినిపల్లి సంతోశ్ కుమార్, బి.వెంకటేష్ నేత, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరే రామ్, వెంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ. గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒకే కారులో ముగ్గురు సీఎంలు, గవర్నర్... మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభోత్సవం సందర్భంగా బ్యారేజీకి అనుబంధంగా గోదావరి నదిపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నిర్మించిన బ్రిడ్జిని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్ ఒకే కారులో తెలంగాణ సరిహద్దు నుంచి బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు. అనంతరం బ్యారేజీ లోపలికి నీరు నిల్వ ఉంచే చోటును పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అతిథులతో కలిసి సీఎం కేసీఆర్ తిలకించారు. గోదావరి నీటి వినియోగానికి ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించిన విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథులకు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీరు అందిస్తున్నది విడమరిచి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ గురించి మ్యాప్ ద్వారా సీఎంలు ఫడ్నవిస్, జగన్‌లకు వివరిస్తున్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందమే కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్ని రకాలుగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రారంభం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, గవర్నర్ నరసింహన్‌లను పంప్‌హౌస్ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన పంపుల వద్దకు తీసుకువెళ్లి చూపించారు. పంపుల సామర్థ్యం, ఉపయోగంపై విపులంగా చెప్పారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి అతిథులకు నిర్మాణాల విశిష్టతను వివరించారు. అయితే షెడ్యూల్డ్ కార్యక్రమాలు ఉండటంతో ఫడ్నవిస్ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రారంభోత్సవంకన్నా ముందే వెళ్లిపోయారు. ముక్తీశ్వరుడ్ని దర్శించుకున్న ఫడ్నవిస్ కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ మేడిగడ్డ బ్యారేజీ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరాలయానికి ఉదయం 11.45 గంటలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ అనిల్ కుమార్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ మధుర ఘట్టాలు.. ఉదయం 7:15 గంటలకు : హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలు దేరారు. అప్పటికే మేడిగడ్డ వద్ద శృంగేరీ పీఠానికి చెందిన ఫణి శశాంక్ శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులతో వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ మహాక్రతువు నిర్వహించారు. 8:30: సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద 10 నిమిషాలపాటు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. 9:10: హోమంలో కూర్చన్న కేసీఆర్ దంపతులు 9:30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. వారికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. 9:50: యాగశాలలో కూర్చున్న ఏపీ సీఎం వై.ఎస్. జగన్, మంత్రులు 10:45: మహారాష్ట్ర సీఎం పఢ్నవిస్, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లు మేడిగడ్డ వద్ద నిర్వహిస్తున్న హోమం వద్దకు చేరిక.. వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం. 11:00: జలసంకల్ప హోమం పూర్తి 11:15: ప్రాజెక్టుపై ఫొటో ప్రదర్శ నను తిలకించిన సీఎంలు, గవర్నర్, అతి«థులు. 11:20: ప్రాజెక్టు డాక్యుమెంటరీ వీక్షణ 11:23: వైఎస్.జగన్ మేడిగడ్డ వద్ద పైలాన్ బటన్‌నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 11:26: గేట్ల వద్ద రిబ్బన్ కత్తిరించిన సీఎం కేసీఆర్, అంతకు ముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో గవర్నర్, కేసీఆర్, జగన్ మహారాష్ట్ర సరిహద్దుకు వెళ్లారు. మధ్యాహ్నం 12:50: కన్నెపల్లికి చేరుకున్నారు. 12:50 నుంచి 12:53 వరకు ‘మేఘా’ ప్రతినిధులు పంపుల పనీతీరును గవర్నర్, సీఎంలకు వివరించారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసిన సీఎం కేసీఆర్ అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రిబ్బన్ కట్ చేశారు. 12:55: శిలాఫలకం ఆవిష్కరణ. అక్కడి దిగువన ఉన్న మోటార్ల పరిశీలన. 1:07: ఆరో నంబర్ మోటార్‌ను స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేస్తున్న సీఎం కేసీఆర్. నీటి పంపింగ్ అనంతరం ఉరకలెత్తుతున్న గోదావరి జలాలు 1:30: మధ్యాహ్న భోజన విరామం, ఆ తర్వాత అతిథులు, ఇంజనీర్లు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రులు, గవర్నర్ మాట్లాడారు. అనంతరం అతిథులను సన్మానించారు. 2:00 గంటల తర్వాత నుంచి ఒకరి తర్వాత ఒకరు తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా గవర్నర్ నరసింహన్, తర్వాత ఏపీ సీఎం జగన్‌కు సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. 2:25 గంటలకు బ్యాంకర్లు, కొందరు అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరారు. -
మేడారం ‘సర్జిపూల్’ సక్సెస్
ధర్మారం (ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌లోకి గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం వరకు రెండు అండర్ టన్నెల్ల ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేశారు. మోటార్ల వద్ద విశాఖపట్నంకు చెందిన పది మంది గజ ఈతగాళ్లతో లీకేజీ తనిఖీలు, మరమ్మతులు పూర్తి కావడంతో సోమవారం నీటి ప్రవాహం పెం చారు. పాలకుర్తి మండలం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ వద్ద కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, సాంకేతిక నిపుణుడు పెంటారెడ్డి సోమవారం ఉదయం రెండు గేట్లు ఎత్తి 1,000 క్యూసెక్కుల నీరు సర్జిపూల్‌కు విడుదల చేశారు. సర్జిపూల్ మోటార్‌కు నీటి విడుదల సర్జిపూల్లో కీలకమైన రెండో ఘట్టం విజయవంతమైంది. 6వ ప్యాకేజీ మేడారంలో నిర్మించిన సర్జిఫూల్లో సోమవారం రాత్రికి నీటిమట్టం 133.004 మీటర్లకు చేరడంతో కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సాంకేతిక సలహాదారుడు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ మొదటి మోటార్ వెట్‌రన్‌కు అవసరమైన నీటికి గేట్ ఎత్తి విడుదల చేశారు. సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి లాంఛనంగా సర్జిఫూల్ గేట్ ఎత్తడంతో పంప్‌హౌస్‌లోకి నీరు చేరింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్జిపూల్లోనే ఉన్న ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి నీటిమట్టాన్ని మోటార్ల వెంట్రన్కు అవసరమైన చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని నిర్ధారణ కావడంతో 6:30 గంటలకు లాంఛనంగా స్విచ్ ఆన్ చేసి గేట్ ఎత్తడంతో నీరు మోటార్ వద్దకు చేరి వెట్‌రన్‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఏమైనా లీకేజీలు ఉన్నాయో గుర్తించేందుకు మంగళవారం గజ ఈతగాళ్లను మళ్లీ సర్జిపూల్‌లోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్నీ తనిఖీ చేసిన తర్వాత ఈనెల 24న వెట్‌రన్ ద్వారా మూడో ప్రక్రియలో మోటార్లు రన్చేసి నీటిని మేడారం రిజర్వాయర్‌లోకి లిఫ్ట్ చేస్తారు. -
కృష్ణాకే గతిలేదు.. గోదావరి నీళ్లంట!
సాక్షి,పోరుమామిళ్ల : ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రకటన చేశారు.వెలుగొండ నుంచి గోదావరి నీళ్లు తెప్పిస్తామని మొన్న బద్వేలులో జరిగిన సభలో పేర్కొన్నారు. పూర్తయిన బ్రహ్మంసాగర్‌కు కృష్ణాజలాలు ఇవ్వడం అంతంతమాత్రమే.వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మళ్లీ గోదావరి పల్లవి అందుకున్నారు.గోదావరి జలాలు ఎలా తెస్తారో అయనకే తెలియాలి. వైఎస్సార్సీపీ నేతలు బ్రహ్మంసాగర్ నుంచి నీరందని పొలాలకు వెలుగొండ నుంచి అందించాలని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తదుపరి కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఒప్పించడంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సఫలీకృతులయ్యారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు ఏనాడూ దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికళ వేళ ఇలా ప్రకటన చేయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈసారి ఆయన మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. నందమూరి తారక రామారావు ప్రసాదించిన వరం తెలుగుగంగ ప్రాజెక్టు, బ్రహ్మంసాగర్ చంద్రబాబు పాలనలో కనుమరుగైన సంగతి ప్రజలు మరిచిపోలేదు. వైఎస్ జలయజ్ఞంతో బద్వేలుకు తెలుగుగంగ జలాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యంతో మళ్లీ పురుడు పోసుకుంది తెలుగుగంగ ప్రాజెక్టు. జలయజ్ఞంతో కుడి, ఎడమ కాలువలు పూర్తయ్యాయి. బ్రహ్మంసాగర్‌కు తెలుగుగంగ జలాలు చేరాయి. బద్వేలు ప్రజలు కష్ణాజలాలు కళ్లారా చూశారు. పంటలు సాగు చేశారు. ఆ నాయకుడు అనంతలోకాలకు వెళ్లడం, చంద్రబాబు అధికారంలోకి రావడంతో మళ్లీ గ్రహణం పట్టిందంటున్నారు ప్రజలు.ఉత్తరాదిన కురిసిన భారీ వానలకు వరదలు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు చేరినా బ్రహ్మంసాగర్‌కు కనీసం 10 టీఎంసీ నీరివ్వలేదు. 17 టీఎంసీ సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్‌కు 5 టీఎంసీలతోనే సరిపెట్టారు. ఆ నీరు కూడా ఆర్టీపీపీకి తరలించారు. లక్షా అరవై అయిదు వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 1983లో ప్రారంభమైన తెలుగుగంగ ప్రాజెక్టు 2005లో వైఎస్ హయాంలో పూర్తయింది. కాలువలు తయారై పుష్కరకాలం గడచినా ఒక్క ఎకరా భూమికి నీరు అందలేదు. అమ్మకు అన్నంపెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులంటే నమ్మాలా? పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాలకు మూడు టీఎంసీలు ఇస్తే యాభైవేల ఎకరాలు సాగుకు నోచుకుంటాయి. బ్రహ్మంసాగర్‌కు 10 టీఎంసీలు వదిలితే లక్ష ఎకరాలు సాగవుతాయి. రెండు పట్టణాల ప్రజలకు తాగునీరు లభిస్తుంది. ఇందుకు కష్ణా జలాలే చాలు. మళ్లీ గోదావరి దాకా పోవాల్సిన అవసరం లేదు. కష్ణా నీరు ఇవ్వని ముఖ్యమంత్రి గోదావరి జలాలు తెస్తాడంటే జనాలు నవ్వరా? అమ్మకు అన్నం పెట్టనోడు అత్తకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్ముతారా? అచ్చం అలాగే ఉంది చంద్రబాబు వైఖరి. శ్రీశైలం నుంచి సకాలంలో నీరు వదిలితే బద్వేలులో కరువు ఉండదు. అందుకు శాశ్వత జీఓ విడుదల చేయాలి. అదేం చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. బద్వేలు ఓటర్లనే కాదు రాయచోటి ఓటర్లను మాయ చేసేందుకు వారికి కష్ణాజలాల ఎర వేశారు. ఓటర్లు చంద్రబాబు గారడీలకు మోçసపోయేందుకు సిద్ధంగా లేరనే వాస్తవం ఆయన తెలుసుకొనే సమయం చాలా దగ్గరలోనే ఉందని పలువురు పేర్కొంటున్నారు. వెలుగొండ నీళ్లు కూడా ఇస్తాడట 1996లో చంద్రబాబే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తర్వాత దాన్ని మరచిపోయారు. వెలుగొండ వల్ల పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లోని 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇది ఇప్పటి కల కాదు. నాలుగు దశాబ్దాల పోరాటం. అయినా పూర్తి కాలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోంది. -
మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించే ప్రతిపాదనపైనా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దృష్టి పెట్టింది. గతంలో ప్రతిపాదించిన మాదిరి ఇచ్చంపల్లి వద్ద భారీ రిజర్వాయర్ కాకుండా చిన్న రిజర్వాయర్ నిర్మించి మిగులు జలాలను తరలించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జానంపేట, అకినేపల్లి ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. పాతదే.. మళ్లీ కొత్తగా.. దక్షిణాది నదుల కోసం ద్వీపకల్ప నదుల అభివృద్ధి పథకాన్ని చేపట్టిన కేంద్రం... అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014లోనే మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానానికి 299 కి.మీ. మేర నీటి తరలింపు ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరమవుతాయని, ఇందులో ప్రధాన లింక్ కెనాల్‌కే రూ. 14,636 కోట్లు అవసరమని లెక్కగట్టింది. 312 కి.మీ. పొడవైన ఇచ్చంపల్లి–పులిచింతలకు సైతం భారీ అంచనా వ్యయాలనే ప్రతిపాదించారు. ఇక అనుసంధాన కాల్వల వెంబడి రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకంతో 226 గ్రామాలు, లక్ష మంది ప్రజలు ప్రభావితం కానున్నారు. మరో 51 వేల ఎకరాల అటవీ, 70 వేల ఎకరాల వ్యవసాయ భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉందని గతంలో తేల్చారు. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో ఇది మూలన పడింది. దీనికి బదులుగా ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 247 టీఎంసీలు సాగర్‌కు, అటు నుంచి కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపైనా తెలంగాణ వ్యతిరేకత చూపడంతో ఇదే జిల్లాలో జానంపేట నుంచి పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించింది. అయితే దీని ద్వారా సైతం తమకు ఒనగూరే ప్రయోజనం లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇక్కడ చిన్న రిజర్వాయర్ నిర్మించి ఆ నీటిని పెద్దవాగు రిజర్వాయర్, తమ్మలగుట్ట రిజర్వాయర్ల మీదుగా తరలించి సూర్యాపేట వద్ద గల మూసీతో కలపాలని ప్రతిపాదిస్తున్నారు. ఇటు నుంచి సాగర్ ఎడమ గట్టు కాల్వ పరిధిలోని ఆయకట్టుకు నీరందిస్తూ గోదావరి నీటిని సాగర్‌కు తరలించేలా ఈ కొత్త ప్రతిపాదన ఉంది. నీటిని పూర్తిగా పైప్‌లైన్ ద్వారా తరలిస్తేనే మేలన్న అభిప్రాయం ఉంది. ఇలా అయితే సాగర్ కింద కృష్ణా నీటి అవసరాలను తగ్గించవచ్చని, డిండిలో భాగంగా ఉన్న గొట్టిముక్కుల రిజర్వాయర్‌కు సైతం గోదావరి నీటిని తరలించే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నీటితో ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతాలైన చుండూర్, పెద్దఊర, గుర్రంపాడు, నార్కట్‌పల్లి ప్రాంతాలకు నీటిని అందించవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఇది వీలుకాకుంటే ఇప్పటికే నిర్మిస్తున్న తుపాకులగూడెం నుంచి మూసీకి, అటు నుంచి సాగర్‌కు తరలించేలా మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన సైతం ఉంది. అయితే ఇందులో ఈ ప్రతిపాదనను తెలంగాణ ఆమోదిస్తుందన్నది తెలియాల్సి ఉంది. -
సింగూరుకు ఇక సెలవు..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి రింగ్‌మెయిన్–3 పనుల పూర్తితో గ్రేటర్ హైదరాబాద్‌కు సింగూరు, మంజీరా జలాశయాల నీటితరలింపునకు శాశ్వతంగా సెలవు ప్రకటించాల్సిందేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర శివార్లలోని ఘన్పూర్ నుంచి పటాన్చెరు వరకు 43 కి.మీ. మార్గంలో రింగ్‌మెయిన్ పనులు పూర్తికావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కావడంతో అక్కడి తాగునీటి అవసరాలకు నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరమవుతుందని, గ్రేటర్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలు మినహా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అధికారులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిడులు తీవ్రం కావడంతో జలమండలి అప్రమత్తమైంది. ఇప్పటికే రూ.398 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్‌మెయిన్–3 పనుల్లో గౌడవెల్లి ప్రాంతంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ పైప్‌లైన్‌పై వాల్వ్‌ల ఏర్పాటు వంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఈ వారంలో ట్రయల్‌రన్ నిర్వహించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గ్రేటర్ దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా జలాలు భాగ్యనగరానికి జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల తరవాత 70వ దశకం నుంచి సింగూరు, మంజీరా జలాల తరలింపు ప్రక్రియ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు పటాన్చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలకు ఈ జలాలే దాహార్తిని తీర్చేవి. అయితే, గోదావరి మొదటిదశ పథకం పూర్తితో సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని నగరానికి తరలించినప్పటికీ ఇందులో సింహభాగం పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాలతోపాటు ఇక్కడున్న పలు ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. ఏడాదిగా నగర తాగునీటి అవసరాలకు నిత్యం సుమారు 10 మిలియన్ గ్యాలన్ల సింగూరు, మంజీరా జలాలను మాత్రమే సరఫరా చేసినట్లు జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. రింగ్‌మెయిన్ పైప్‌లైన్–3 పూర్తితో ఇక నుంచి సింగూరు జలాలు నిలిచిపోయినప్పటికీ కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ఈ వారంలో ట్రయల్‌రన్ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారం నుంచి గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని తెలిపింది. కృష్ణా, గోదావరి జలాలే ఆధారం... జంట జలాశయాల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడం, త్వరలో సింగూ రు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోనుండటంతో భాగ్యనగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆధారం కానున్నా యి. ప్రస్తుతానికి కృష్ణా మూడు దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాల న్లు, గోదావరి మొదటిదశ ద్వారా మరో 130 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. రింగ్‌మెయిన్–3 పనుల పూర్తితో అదనంగా మరో 60 ఎంజీడీల గోదావరి జలాలను సిటీకి తరలించనున్నారు. దీంతో నిత్యం నగరానికి 460 మిలియ న్ గ్యాలన్ల జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటిని నగరంలోని 9.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫ రా చేయనున్నట్లు జలమండలి అధికా రులు చెబుతున్నారు. -
గోదావరి జలాల సాధనే లక్ష్యం
సాక్షి,తుర్కపల్లి : ఆలేరుకు గోదావరి జలాల సాదనే తన లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.గురువారం తుర్కపల్లి మండలంలో రుస్తాపూర్, జాలబావి తండా, చౌక్లతండా, పీర్యతండా, మోతీరాంతండా, రామోజీనా యక్‌తండా, పల్లెపహాడ్, గొల్లగూడెం గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు.తలాపున తపాస్‌పల్లి రిజర్వాయర్ పారుతున్నా స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రతి తెల్ల రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారుడికి నెలకు 5 వేల రూపాయలు ఇచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గజం ఉప్పలయ్య, గ్రామ, మండల స్థాయి నాయకులు మ«ధుసూదన్రెడ్డి, మారగోని శ్రీరాంమూర్తి, మహేశ్, జహంగీర్, మోత్కుపల్లి రఘు, సీతానారాయణ, కోట భిక్షపతి, బొల్లారం జగదీశ్, పాముల రాజు, బోరెడ్డి జానార్దన్‌రెడ్డి, ఎడవల్లి మైసయ్య, మోత్కుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. చివరి పోటీ.. అవకాశం ఇవ్వండి: యాదగిరిగుట్ట : నా రాజకీయ జీవితంలో ఇవే నా చివరి ఎన్నికలు.. ఆలేరు నియోజకవర్గ ఓటర్లంతా ఒక్క సారి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని బీఎల్ఎఫ్ బలపర్చించిన అసెంబ్లీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గాన్ని 15 ఏళ్లుగా ఎవ రూ పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులే నేటికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్ని కల్లో గెలిపిస్తే గంధమల్ల రిజర్వాయర్ పూర్తిచేసి, తపాసుపల్లి ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువస్తానన్నారు. -
మిషన్ భగీరథతో ఇంటింటికీ గోదావరి జలాలు
పాల్వంచరూరల్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేర్కొన్నారు. మిషన్ భగీరథలో భాగంగా పాల్వంచ మండలం తొగ్గూడెంలో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు గోదావరి జలాలు చేరాయి. ఆదివారం ఎమ్మెల్యే ఏరియేటర్లోకి నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించి, గంగమ్మతల్లికి పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరి కాయలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసి పట్టుదలతో ఇంటింటికీ గోదావరి జలాలు చేరేవిధంగా కృషి చేస్తున్నారన్నారు. తొగ్గూడేనికి గోదావరి జలాలు విజయవంతంగా చేరడం హర్షణీయమన్నారు. సోమవారం అధికారికంగా ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈలు సాయి, తాతారావు, జెడ్పీ వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు జీవీకే.మనోహర్, అయితా గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భువనసుందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఔటర్ చుట్టూ జలహారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) చుట్టూ జలవలయం లా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 158 కిలోమీటర్ల మార్గంలో విస్తరించిన ఓఆర్ఆర్ చుట్టూ రూ.3 వేల కోట్లతో ఈ వాటర్‌గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం 3,000 ఎంఎం డయా వ్యాసార్థంగల మైల్డ్ స్టీల్‌తో సిద్ధం చేసిన భారీ మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమా యత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నీటిని నగరం నలుచెరగులా సరఫరా చేసేం దుకు వీలుగా ఈ గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఈ జలవలయం పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మరో మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధంచేసి పనులు మొదలుపెట్టే దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది. భారీ జలవలయం.. దాహార్తి దూరం.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీతోపాటు.. ఔటర్‌కు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, నూతనంగా ఏర్పాటుకానున్న టౌన్ షిప్‌లు, కాలనీలకు 24 గంటలు తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతీ వ్యక్తికి తలసరిగా నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్ పర్ క్యాపిటాడైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ వాటర్‌గ్రిడ్ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది. ఏ మూలకైనా తరలించేలా.. ఈ నీటిని ఔటర్ లోపల ఏ మూలకైనా తరలించే అవకాశం ఉంది. ఈ గ్రిడ్ వ్యవస్థతో జల మండలి పరిధిలోని 500 స్టోరేజీ రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఆయా జలాశయాల నుంచి వచ్చే నీరు పంపింగ్ అంతగా అవసరం లేకుం డా గ్రావిటీ(భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నేరుగా గ్రిడ్ పైప్లైన్లోకి చేరేలా నేలవాలు అధికంగా ఉండే చోటనే అనుసంధానించనుండటం విశేషం. ఈ వాటర్‌గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగరాల్లో అమలులో ఉంది. ఆయా నగరాల అనుభవాలను కూడా పరిశీలించిన తర్వాతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. 7 చోట్ల వాటర్‌గ్రిడ్ జంక్షన్లు.. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాల నీటిని ఈ వాటర్‌గ్రిడ్ భారీ పైప్‌లైన్‌కు అనుసంధానించేందుకు ఔటర్ చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. పటాన్చెరు వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్‌కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ పైప్‌లైన్‌కు అనుసంధానించనున్నారు. శామీర్‌పేట్ వద్ద కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలాలను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్ నీటిని కిస్మత్పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మనాగారం(చౌటుప్పల్) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్పేట్ ఔటర్ జంక్షన్ వద్ద గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేసిన తాగునీరు ఈ గ్రిడ్‌లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. -
రైతుల కాళ్లు కడుగుతాం
వలిగొండ (భువనగిరి) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగడమే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మండలంలోని రెడ్లరేపాక నుంచి టేకులసోమారం వరకు రూ.కోటీ 60 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను ఆదివారం రెడ్లరేపాకలో ఆయన ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలోని మారెమ్మకాలనీలో, బుడిగజంగాలకాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గౌడ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ జలాశయం కళావిహీనంగా మారడానికి సమైక్య రాష్ట్రంలోని పాలకులే కారణమన్నారు. మూసీ ఆధునీకరణకు ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. గోదావరి, కృష్ణాతో మూసీని అనుసంధానం చేసి ఆధునీకరించనున్నట్లు తెలిపారు. దత్తత గ్రామాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వడంలేదన్నారు. దత్తత గ్రామాల అభివృద్ధికి వివిధ రూపాల్లో నిధులు సమీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. భువనగిరి మండలం ఎర్రంబెల్లి నుంచి కంచనపల్లి మీదుగా రెడ్లరేపాకకు బీటీ రోడ్డు, రెడ్లరేపాక నుంచి వలిగొండ వరకు రోడ్డు ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, సర్పంచ్ పబ్బు ఉపేందర్, పీఆర్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ అయిటిపాముల జ్యోతీసత్యనారా యణ, సర్పంచ్ మాద లావణ్యశంకర్, ఎంపీటీసీ మల్లికార్జున్, భాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, అయోధ్యగౌడ్, కళ్లెం మారయ్య, సంగిశెట్టి క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. -
ముందు భగీరథ.. తర్వాత యాసంగి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిలో మిషన్ భగీరథ అవసరాలకు పోగా మిగతా నీటిని యాసంగి పంటలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, ఎల్ఎండీ, సింగూరులో తాగునీటి అవసరాల మేర పక్కనపెట్టి మిగతా నీటిని పంటలకు మళ్లించడానికి అంగీకరించారు. లభ్యతగా ఉన్న నీటితో ఆయా ప్రాజెక్టుల కింది ఆయకట్టుతోపాటు ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీ సాగర్, లక్ష్మికెనాల్ కింది ఆయకట్టుకు నీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ నీటితో రెండో పంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు మళ్లించాలని ఆదేశించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు కె.తారక రామారావు, ఈటల రాజేందర్, చీఫ్ విప్‌లు కొప్పుల ఈశ్వర్, పాతూరి సుధాకర్ రెడ్డి, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బి.వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఎకరాకు నీరందేలా.. నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతోపాటు, తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున.. వీలైనంత మేరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల వెంట పడి పనులు చేయించుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతీ ఎకరాకు నీరందేలా ఏర్పాటు జరగాలని స్పష్టం చేశారు. రామగుండం ప్రాంతంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని సూచించారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎస్సారెస్పీ కాల్వల సామర్థ్యం పెంచాలని, అన్ని రకాల కాల్వలకు మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్సారెస్పీలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. కాల్వలు సిద్ధం చేయండి.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని రకాల చెరువులను గోదావరి నీటితో నింపుకునేలా కాల్వలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీరు అందుబాటులోకి వస్తున్నందున ఈ లోపుగానే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులే ఈ పనుల విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పారు. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బ్యారేజీ నిర్మిస్తున్నామని, అక్కడ 1,700 టీఎంసీల సగటు నీటి లభ్యత ఉందని చెప్పారు. ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు చిన్న నీటి వనరుల్లో 265 టీఎంసీల వాటా ఉందని 1974లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు ధ్వంసం కావడంతో అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పూర్తి నీటి లభ్యత ఉంటుందని, అన్ని చెరువులు నింపుకునేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. -
ఏకే బజాజ్ కమిటీ కథ కంచికి?
సాక్షి,హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై అపరి ష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికై ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీని కేంద్ర జల వనరుల శాఖ పక్కన బెట్టినట్లుగా తెలిసింది. కమిటీ ఏర్పాటై ఐదున్నర నెలలు కావ స్తున్న ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిం చలేదు. మళ్లింపు జలాల అంశమై బ్రిజేశ్ కుమా ర్ ట్రిబ్యునల్ ముందు వాదనల నేపథ్యంలో కమిటీని బాధ్యతల నుంచి తప్పిస్తూ కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్లు కృష్ణా బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మా పరిధిలో లేదు: ఏకే బజాజ్ దీనిపై ఏకే బజాజ్ స్పందిస్తూ.. మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది. దీనికి అభ్యంతరం తెలిపిన తెలంగాణ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనంతరం ఏకే బజాజ్ కమిటీతో కేంద్రం చర్చించి మళ్లింపు జలాలపై మధ్యేమార్గాన్ని సూచించాలని ఆదేశించింది. ఈలోగానే కమిటీకి ముందస్తుగా నిర్ణయించిన ఆరు నెలల గడువు ముగియడం, వివాదం తేలకపోవడంతో మరోమారు కమిటీ గడువును అక్టోబర్ 8 వరకు పొడిగించింది. గడువు పొడిగించిన నాటి నుంచి రాష్ట్రాల పరిధిలో కమిటీ ఎలాంటి పర్యటనలు జరపలేదు. బోర్డు సభ్యులే ఆగస్టులో ఢిల్లీకి వెళ్లి వివాదానికి సంబంధించిన వివరణలు ఇచ్చారు. అనంతరం కమిటీ పర్యటన ఉంటుందని భావించినా అది జరగలేదు. ఇటీవలే కేంద్ర జల సంఘం కమిటీని పిలిపించుకొని మళ్లింపు జలాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ఎలాంటి నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. దీంతో కమిటీని బాధ్యతల నుంచి తప్పించినట్లేనని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై అధికారిక ఉత్తర్వులు అందితే తప్ప ఎలా ముందుకు పోవాలన్న దానిపై కేంద్రాన్ని స్పష్టత కోరుతామని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ కమిటీ తేల్చని పక్షంలో ట్రిబ్యునల్ మాత్రమే ఈ వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. గోదావరి జలాల వాటాలపై.. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ గతేడాది అక్టోబర్‌లో ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని కోరింది. దీనికి తోడు క్యాచ్‌మెంటు, సాగు యోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన చూసినా ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టీఎంసీలు రావాల్సి ఉందని తెల్చింది. -
బాబ్బాబు.. ఎలాగైనా ఆపండి..!
రోడ్డుపాలవుతున్న గోదావరి జలాలు.. పైపులైన్‌కు పగిలి 48 గంటలైనా పట్టించుకోని అధికారులు.. లీకేజీని అరికట్టాలని కాంట్రాక్టర్లను బతిమాలుతున్న వైనం చింతల్: నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి జలాల పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిష్ర్పమోజనంగా మారుతోంది. ఈ నెల 1వ తేదీ అర్థరాత్రి చింతల్ హెచ్ఎంటి వాటర్‌ట్యాంక్ సమీపంలో భారీ పైపులైన్ పగిలిపోవడంతో నీళ్లు ప్రధాన రహదారిని ముంచేశాయి. శనివారం ఉదయం 10 గంటలకు తాపీగా అక్కడికి చేరుకున్న వాటర్‌వర్క్స్ అధికారులు సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అయినా లీకేజీలు ఆగకపోవడంతో వాటర్ వర్క్స్ అధికారులు స్థానిక కాంట్రాక్టర్‌ను సంప్రదించగా, తాను మేజర్ పైపులైన్ పనులు చేయలేనని చెప్పడంతో అధికారులు ఇతర కాంట్రాక్టర్ల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడం, సోమవారం కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు, జలమండలి ఉన్నతాధికారులు ఆరు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసేందుకు ఆ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న అధికారులు ఎలాగైనా పనులు పూర్తి చేయాలని పలువురు కాంట్రాక్టర్లను కాళ్లవేళ్ల పడుతున్నట్లు సమాచారం. ఇదే పైపులైన్‌కు నెల రోజుల్లో రెండు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టడం గమనార్హం.