సాక్షి, తూర్పుగోదావరి: భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. వరద నీరు మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. దీంతో, 24 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. 20.6 అడుగులకు నీటిమట్టం చేరింది. 23.94 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోగా కొనసాగుతోంది.
గోదావరి ఉప నదులు గౌతమి, వశిష్ట, వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పరిస్థితులను పరీక్షిస్తున్నారు. మరోవైపు.. కోనసీమ జిల్లాలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహానికి అక్విడెక్ట్ బ్రిడ్డి మునిగిపోయింది. కాగా, అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడిగట్టు బలహీనంగా ఉంది. ఈ క్రమంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
Comments
Please login to add a commentAdd a comment