flood range
-
అలర్ట్.. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.కాగా, భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ఎగువన భారీ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల అవుతోంది.ఇక, క్రమంగా వరద నీరు వస్తుండటంతో 48 అడుగులకు నీటి మట్టం చేరితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. మరోవైపు.. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరద ప్రవాహం కారణంగా పర్ణశాలలో నారా చీరల ప్రాంతం నీటి మునిగింది. -
కట్టలు తెంచుకున్న కడెం ప్రాజెక్ట్ .. (ఫొటోలు)
-
దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్
అహ్మదాబాద్: హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను వణికించిన వర్షాలు ఇక గుజరాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నేడు గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కేవలం కొన్ని గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. దీంతో రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. రానున్న మరికొన్ని గంటల్లో దక్షిణ గుజరాత్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది. వర్షాల ధాటికి గుజరాత్లో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. రహదారులపై నీరు పేరుకుని రాకపోకలు దెబ్బతిన్నాయి. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. #WATCH | Gujarat | Severe waterlogging in Dhoraji city of Rajkot district due to incessant rainfall. (18.07) Around 300 mm of rainfall has been recorded in the last few hours. 70 people have been shifted to safer places. pic.twitter.com/oaf5Z03q5R — ANI (@ANI) July 18, 2023 గుజరాత్లో నేడు ఉదయం 6 గంటల నుంచి దాదాపు 14 గంటల్లోనే గిర్ సోమనాథ్ జిల్లాలోని సుత్రపడ తాలూకాలో అత్యధికంగా 345 మీమీ వర్షపాతం సంభవించింది. రాజ్‌కోట్‌లోని ధోరాజీ తాలూకాలో 250 మీమీ వర్షపాతం రాగా.. కేవలం రెండు గంటల్లోనే 145 మీమీ వర్షం సంభవించడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా గుజరాత్లో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ జారీ చేశారు. 18 డ్యామ్‌లకు అలర్ట్ జారీ చేశారు. భారత విపత్తు నిర్వహణ శాఖా కూడా అలర్ట్ అయింది. ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంట్ షాక్‌తో 15 మంది దుర్మరణం -
సుప్రీంకోర్టుకు చేరిన వరద నీరు.. సైన్యం సహకారాన్ని కోరిన కేజ్రీవాల్..
ఢిల్లీ: యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రెయిన్ రెగ్యులేటర్ పాడవడంతో ఐటీఓ క్రాసింగ్ ఏరియా, నిత్య రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి యమునా నది వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీ సహాయం కోరాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సహాయం తీసుకుని రెగ్యులేటర్‌ను సరిచేయాలని కోరారు. ఇందుకోసం ఇంజినీరు బృందాలు రాత్రంతా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇంద్రప్రస్తా బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్ఓ బిల్డింగ్ మధ్య ఉండే డ్రెయిన్ రెగ్యులేటర్ పాడయిపోయిన కారణంగా వరద ఉద్దృతి ఈ ప్రాంతానికి చేరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. ఐటీఓ క్రాసింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌కు షాక్ వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX — Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023 సుప్రీంకోర్టుకు వరద నీరు.. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉప్పొంగిన యమునా నది ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్న యమునా నది 208.46 మీటర్ల మేర ప్రవహించింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానానికి 208.30కు తగ్గుతుందని కేంద్ర వాటర్ కమిషన్ అంచనా వేసింది. అయితే.. ఇప్పటికే వరద నీరు ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఢిల్లీలో వరద నేపథ్యంలో ఫ్రాన్స్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలువులు ప్రకటించారు. ఇదీ చదవండి: Delhi Rainfall Floods: యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం -
గ్రామాన్ని ముంచెత్తిన వరద.. అంతా బురదమయం.. వీడియో వైరల్..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండల నుంచి జారు వారుతున్న వరద నీరు నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొండ వాలులో ఉన్న మండి జిల్లాలోని ఒనైర్ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని గ్రామంలోని మార్కెట్ ప్రాంతంపై ప్రవహించింది. ఇళ్లను, దుకాణాలను తనలో కలిపేసుకుంది. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. #Video| Continuous rain for 3 days wreaks havoc in #HimachalPradesh's Mandi pic.twitter.com/HieNQW5fm2 — NDTV (@ndtv) July 10, 2023 అటు.. ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rainfalls: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద నీరు భారీగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ 25 లక్షలు 8 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడుదల చేశారు. గోదావరి ఉధృతితో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి పాయలు పోటెత్తుతున్నాయి. గోదావరి పాయలు ముంచెత్తడంతో లంకల్లో ఆరుడగుల వరద నీరు చేరింది. కోనసీమలో 51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏటిగట్లపై ఉన్నతాధికారులు దష్టిసారించారు. 40 వేల ఇసుక బస్తాలతో బలహీనమైన ప్రాంతాల్లో ఏటి గట్లను పట్టిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు, ఏటిగట్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా వాలంటీర్లతో బండ్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కోనసీమ జిల్లాలోని 88 గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. కోనసీమజిల్లాలో ఇప్పటి వరకు 18 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరద పరిస్ధితులని కలెక్టర్ హిమాన్షు శుక్లా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి మోనిటరింగ్ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 25లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి.. మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇంతటి వరదను 1986 తర్వాత ఇంతటి వరద చూడలేదని లంక గ్రామ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం వరద ప్రభావం నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగాలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గండ్లు పడే ప్రమాదం ఉన్న చోట అదనంగా సిబ్బందిని మెటీరియల్‌ని సమీకరించాలని ఆదేశించింది. ఏటీ గట్లను మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏఈఈలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. -
వరద ప్రవాహానికి మునిగిన అక్విడెక్ట్ బ్రిడ్జి
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద హై టెన్షన్
సాక్షి, తూర్పుగోదావరి: భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. వరద నీరు మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. దీంతో, 24 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. 20.6 అడుగులకు నీటిమట్టం చేరింది. 23.94 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోగా కొనసాగుతోంది. గోదావరి ఉప నదులు గౌతమి, వశిష్ట, వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పరిస్థితులను పరీక్షిస్తున్నారు. మరోవైపు.. కోనసీమ జిల్లాలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహానికి అక్విడెక్ట్ బ్రిడ్డి మునిగిపోయింది. కాగా, అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడిగట్టు బలహీనంగా ఉంది. ఈ క్రమంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -
ఉత్తరఖండ్ లో వరదలు బీభత్సం
-
ఉగ్ర స్వరూపిణి కృష్ణమ్మ
-
కన్నెపల్లి వద్ద పెరిగిన వరద
కాళేశ్వరం: జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మూడు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. గోదావరి, ప్రాణహిత నదులు కలవడంతో కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద 5.40 మీటర్ల ఎత్తులో ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం, కన్నెపల్లిలో గోదావరి వద్ద 30 వేల క్యూసెక్కుల వరద మేడిగడ్డ వైపు తరలిపోతుండటంతో ఇప్పటికే 30కి పైగా గేట్లను మూశారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఒకటవ మోటార్ నిరంతరం నీటిని ఎత్తిపోస్తుండటంతో గ్రావిటీ కాల్వ సగం వరకు నిండి 13.345 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మూడో మోటార్‌కు శనివారం రాత్రి వెట్‌రన్ నిర్వహించనున్నారు. నిమిషానికి 2,110 క్యూసెక్కులు కన్నెపల్లి పంపుహౌస్ నుంచి డెలివరీ సిస్టంలో వదిలిన నీళ్లు గ్రావిటీ కాల్వ నుంచి తరలిపోయి అండర్ టన్నెల్ వద్ద అన్నారం బ్యారేజీలోని గోదావరిలో కలుసుతున్నాయి. నిమిషానికి 2,110 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు అక్కడ ఉన్న 66 గేట్లు మూసి ఉంచారు. కన్నెపల్లి, మేడిగడ్డకు అర్ధరాత్రి వరకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వరదను కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం వైపు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో కన్నెపల్లి పంపుహౌస్‌లో ఒకటి, మూడు, ఆరో మోటార్లు నిరంతరం నడుపనున్నారు. కాగా, వరద ప్రవాహం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్నారం, మేడిగడ్డ వంతెనలపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఐ రంజిత్‌కుమార్ తెలిపారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద డెలివరీ సిస్టంలో ఎత్తిపోస్తున్న నీరు ప్రాజెక్టు వద్ద భద్రత పెంపు: ఎస్పీ కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతుండటంతో భద్రతను పెంచారు. శనివారం ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంపుహౌస్, గ్రావిటీ కాల్వలను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ, అండర్ టన్నెల్, కన్నెపల్లి, గ్రావిటీ కాల్వ వెంట భద్రతను కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులను చేపలు పట్టకుండా నిలువరించాలని, ఓడరేవుల వద్ద నాటు పడవలు నడపొద్దని ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో సందర్శకులను అనుమతించవద్దని ఎస్పీ చెప్పినట్లు సీఐ వివరించారు. పెరుగుతున్నగోదావరి నీటి మట్టం ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరుగులు పెడుతోంది. ప్రాణహిత, పెనుగంగా, ఇంద్రావతిలోని వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల వద్ద శుక్రవారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 72 మీటర్లకు చేరింది. శనివారం 75 మీటర్లకు చేరడంతో ఇన్‌టేక్ వెల్ వద్ద నీరు చేరింది. దేవాదుల పంప్‌హౌస్ వద్ద సముద్ర మట్టానికి 72 మీటర్లు ఉంటేనే మోటార్ల పంపింగ్‌కు నీరు అందుతుంది. అయితే 75 మీటర్లకు చేరడంతో ఇంజనీరింగ్ అధికారులు రెండో దశలోని ఒక మోటార్‌ను ప్రారంభించి ఎగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. అలాగే తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద శనివారం 73 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉప నదులు ఉప్పొంగి గోదారమ్మ ఒడిలో కలుస్తున్నాయి. -
శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నీటిమట్టం తగ్గింది. ఇన్‌ఫ్లో నిల్, ఔట్‌ఫ్లో 16,076 క్యూసెక్కులుగా ఉంది. ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
855.10 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం
కర్నూలు: శ్రీశైలం జలశయంలో చేరిన వరద ఉధృతితో ప్రస్తుత నీటిమట్టం 855.10 అడుగులకు చేరింది. అయితే ఇన్ప్లోలో 8వేల క్యూసెక్కులు, ఔట్ఫ్లోలో 28.539 క్యూసెక్కులు నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో 4 జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. -
856 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం
కర్నూలు: శ్రీశైలం జలశయంలో చేరిన వరద ఉధృతితో ప్రస్తుత నీటిమట్టం 856 అడుగులకు చేరింది. అయితే ఔట్ఫ్లోలో 30వేల 365 క్యూసెక్కులు నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, లెఫ్ట్ పవర్ హౌస్‌లో 4 జనరేటర్ల ద్వారా 580 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.