Heavy Rains In Gujarat Streets Flooded Cars Submerged - Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్

Published Wed, Jul 19 2023 3:48 PM | Last Updated on Wed, Jul 19 2023 6:58 PM

Heavy Rains In Gujarat Streets Flooded Cars Submerged  - Sakshi

అహ్మదాబాద్‌: హిమాచల్ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలను వణికించిన వర్షాలు ఇక గుజరాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నేడు గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.  కేవలం కొన్ని గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. దీంతో రాజ్‌కోట్‌, సూరత్, గిర్‌ సోమనాథ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. 

రానున్న మరికొన్ని గంటల్లో దక్షిణ గుజరాత్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది. వర్షాల ధాటికి గుజరాత్‌లో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. రహదారులపై నీరు పేరుకుని రాకపోకలు దెబ్బతిన్నాయి. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. 

గుజరాత్‌లో నేడు ఉదయం 6 గంటల నుంచి దాదాపు 14 గంటల్లోనే గిర్ సోమనాథ్ జిల్లాలోని సుత్రపడ తాలూకాలో అత్యధికంగా 345 మీమీ వర్షపాతం సంభవించింది. రాజ్‌కోట్‌లోని ధోరాజీ తాలూకాలో  250 మీమీ వర్షపాతం రాగా.. కేవలం రెండు గంటల్లోనే 145 మీమీ వర్షం సంభవించడం గమనార్హం. 

భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ జారీ చేశారు. 18 డ్యామ్‌లకు అలర్ట్ జారీ చేశారు. భారత విపత్తు నిర్వహణ శాఖా కూడా అలర్ట్ అయింది.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి కరెంట్‌ షాక్‌తో 15 మంది దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement