సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండల నుంచి జారు వారుతున్న వరద నీరు నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొండ వాలులో ఉన్న మండి జిల్లాలోని ఒనైర్ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని గ్రామంలోని మార్కెట్ ప్రాంతంపై ప్రవహించింది. ఇళ్లను, దుకాణాలను తనలో కలిపేసుకుంది. ఈ భయానక దృశ్యాలు భీతికొల‍్పుతున్నాయి.
#Video| Continuous rain for 3 days wreaks havoc in #HimachalPradesh's Mandi pic.twitter.com/HieNQW5fm2
— NDTV (@ndtv) July 10, 2023
అటు.. ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప‍్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి.
ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది.
ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rainfalls: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..
Comments
Please login to add a commentAdd a comment