tree trunks
-
గ్రామాన్ని ముంచెత్తిన వరద.. అంతా బురదమయం.. వీడియో వైరల్..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండల నుంచి జారు వారుతున్న వరద నీరు నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొండ వాలులో ఉన్న మండి జిల్లాలోని ఒనైర్ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని గ్రామంలోని మార్కెట్ ప్రాంతంపై ప్రవహించింది. ఇళ్లను, దుకాణాలను తనలో కలిపేసుకుంది. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. #Video| Continuous rain for 3 days wreaks havoc in #HimachalPradesh's Mandi pic.twitter.com/HieNQW5fm2 — NDTV (@ndtv) July 10, 2023 అటు.. ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rainfalls: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
ఆ భయంకరమైన క్రీడ.. వాళ్లకు వినోదం!
జపాన్: ప్రతి ఆరు సంవత్సరాలకు వచ్చే ఆ పండుగ అంటే అక్కడి ప్రజలకు ఎంతో పవిత్రం. ఆ పండుగే 'ఆన్భషీరా'. ఈ సందర్భంగా జరుపుకునే ఉత్సవంలో వందల సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొని పెద్ద చెట్టు మొండాలకు మోకుతాడులు బిగించి కూర్చొని స్వారీ చేస్తారు. 12 వందల సంవత్సరాల కాలం నుంచి వస్తున్న తమ ఆచార సంప్రదాయలను పాటిస్తూ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి రెండు నెలలపాటు ఈ పండుగను జరుపుకుంటారు జపాన్ వాసులు. శువాలో జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో గాలి, నీరును వారు దేవుళ్లుగా కొలుస్తారు. ఈ ఉత్సవంలో జరుపుకునే క్రీడ అతి భయంకరమైనది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 టన్నుల (అంటే అక్షరాల 10వేల కిలోలు అన్నమాట) బరువు ఉన్న చెట్టు మొండాలకు మోకుతాడులు బిగించి పై కొండ మీద నుంచి లోయలోకి జారుకుంటూ వెళ్లాలి. అంతేకాదు.. చెట్ల మొండాలపై బిగించిన తాళ్లను గట్టిగా పట్టుకుని జట్లగా కొండ మీద గడ్డి సాయంతో కిందకు జారుతుంటారు. ఈ క్రమంలో పొరపాటున జారిపడితే అంతే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయినా తమ ప్రాణాలను లెక్కచేయకుండా క్రీడలో పాల్గొనడానికి ఎంతోమంది ఔత్సాహికులు పోటీపడుతుంటారు. ఇలా కొండపై నుంచి జారుతూ స్వారీ చేయాల్సి ఉంటుంది. తమ గమ్యం చేరుకునే లోపు ఒకవేళ కిందపడినా మళ్లీ లేచి ఆ చెట్టు మొండాలకు ఉన్న తాళ్ల సహాయంతో మళ్లీ స్వారీ చేస్తుండటం ఈ క్రీడా విశేషం. ఎంతో పవిత్రంగా భావించే ఈ పండుగ క్రీడను అక్కడి ప్రజలు దేవుడికి సమర్పించే మొక్కుగా చెల్లిస్తుంటారు. ఈ క్రీడలో పాల్గొన్న వారంతా ఆ చెట్టు మొండాలతో జారుకుంటూ కొండ దిగువన ఉన్న షెరైనాలోని షింటోలో గ్రామ పురోహితుడి ఆధ్వర్యంలో జరిగే శుద్దీకరణ వేడుక వద్దకు రావాలి. ఈ క్రమంలో ఎవరైనా మార్గం మధ్యలో తీవ్రంగా గాయపడినా, లేక మరణించినా వారికి పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రీడను అక్కడి ప్రజలు 'కిటోషీ' గా పిలుస్తారు. కొండ కిందకు చేరుకున్న తరువాత ఆ చెట్టు మొండాలను తాళ్ల సాయంతో పైకెత్తగా మరొకొందరూ ఆ చెట్ల మొండాలపైకి ఎగబాకి పైనున్న వాలాలను అందుకోవాలి. ఈ సమయంలో కొందరూ జారిపడుతుంటారు.. అయినా మళ్లీ ప్రయత్నిస్తూ పైకి ఎగబాకుతారు. మే నెలలో జరిగిన ఉత్సవంలో చెట్టు మొండాన్ని పైకెత్తే క్రమంలో మోకుత్రాడు జారిపోవడంతో ఒక్కసారిగా 40 అడుగుల చెట్టు మొండంపై నుంచి కిందకు జారిపడి ఒక వ్యక్తి మృతిచెందాడు. గతంలోనూ ఇదే తరహా క్రీడలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు.