సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ఎగువన భారీ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల అవుతోంది.
ఇక, క్రమంగా వరద నీరు వస్తుండటంతో 48 అడుగులకు నీటి మట్టం చేరితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. మరోవైపు.. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరద ప్రవాహం కారణంగా పర్ణశాలలో నారా చీరల ప్రాంతం నీటి మునిగింది.
Comments
Please login to add a commentAdd a comment