first warning
-
అలర్ట్.. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.కాగా, భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ఎగువన భారీ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల అవుతోంది.ఇక, క్రమంగా వరద నీరు వస్తుండటంతో 48 అడుగులకు నీటి మట్టం చేరితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. మరోవైపు.. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరద ప్రవాహం కారణంగా పర్ణశాలలో నారా చీరల ప్రాంతం నీటి మునిగింది. -
భద్రాచలం రామాలయం చుట్టూ వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతోంది. 44.40 అడుగులకు నీటిమట్టం చేరింది. రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. అన్నదాన సత్రం నీటమునిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి దిగువకు 9.92 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే స్థానిక అధికారులకు సహకరించి పునరావస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి ప్రాణహిత నదుల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. కాలేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి కూడా లక్షల కొద్ది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. చర్ల మండలంలోని తల్లి పేరు ప్రాజెక్టు నుంచి కూడా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతున్నదని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చదవండి: కొట్టుకుపోతుంటే.. ప్రాణాలకు తెగించి మరీ భద్రాచలం నుండి చర్ల వెళ్ళు రహదారిపైకి సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందున రాక పోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజలు రవాణా చేయకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుందని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని, ప్రజలు కూడా దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొన్నారు. పశువులను మేతకు బయటికి వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, వరద చేరిన సందర్భంగా పశువులను ఎతైన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలన్నారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. -
కృష్ణా నదికి పెరుగుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, విజయవాడ: కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల నుంచి ఔట్‌ఫ్లో 5.11లక్షల క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాగులు దాటే ప్రయత్నం చేయొద్ధని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. -
వరద ఉధృతి: మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, తూర్పుగోదావరి: గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ శాఖ అధికారులు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికం కావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద నీటిని సుమారు పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే భద్రాచలం వద్ద 45.10 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. గోదావరి ఎగువ ప్రాంతంలోని కాలేశ్వరం వద్ద 9.17 మీటర్లు, పేరూరు వద్ద 11.70, దుమ్ముగూడెం వద్ద 12.52, భద్రాచలం వద్ద 45.10 అడుగులు, కూనవరం వద్ద 18.30 మీటర్లు, కుంట వద్ద 12.94 మీటర్లు, కొయిదా వద్ద 23.15మీటర్లు, పోలవరం వద్ద 12.94, రాజమహేంద్రవరం రైల్వే హేక్ బ్రిడ్జి వద్ద 16.23 మీటర్ల తో వరద గోదావరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న గోదావరి ఉప నదుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
గోదారి పరవళ్లు.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
రాజమండ్రి/కొవ్వూరు: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమండ్రి వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరదనీరు వస్తుండడంతో మంగళవారం ఉదయం 8 గంటలకు 12.30 అడుగులకు నీటి మట్టం చేరింది. ఉదయం 4.45 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. గేట్లు ఎత్తివేసి 10,99,359 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిపారుదల అధికారులు అప్రమత్తంగా ఉండి గోదావరి వరదనీటి ప్రవాహాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే 10.34 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.