
కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
సాక్షి, విజయవాడ: కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల నుంచి ఔట్‌ఫ్లో 5.11లక్షల క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాగులు దాటే ప్రయత్నం చేయొద్ధని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.