రాజమండ్రి/కొవ్వూరు: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమండ్రి వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరదనీరు వస్తుండడంతో మంగళవారం ఉదయం 8 గంటలకు 12.30 అడుగులకు నీటి మట్టం చేరింది. ఉదయం 4.45 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
గేట్లు ఎత్తివేసి 10,99,359 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిపారుదల అధికారులు అప్రమత్తంగా ఉండి గోదావరి వరదనీటి ప్రవాహాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే 10.34 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.