dhavaleswaram barrage
-
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/ విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) వర్షాలు తెరపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద తగ్గుముఖం పడుతోంది. వర్షపాత విరామం వల్ల ఉపనదుల్లో వరద తగ్గడంతో ఆదివారం గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. భద్రాచలం వద్ద వరద మట్టం 30.9 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 8,50,469 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇందులో గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 8,39,469 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు వరద మట్టం 11.7 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గిన నేపథ్యంలో సోమవారం ధవళేశ్వరం వద్ద ప్రవాహం మరింత తగ్గనుంది. స్థిరంగా వంశధార, నాగావళి వంశధార, నాగావళి నదుల్లో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 40,602 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 1,186, ఎడమ కాలువకు 142 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 30,186 క్యూసెక్కులను బ్యారేజ్ 16 గేట్లను 0.6 మీటర్ల మేర ఎత్తి బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 11,462 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 6,979 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి 2.16 లక్షల క్యూసెక్కులు కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,16,946 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేలు, కల్వకుర్తి ద్వారా 1,600, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,954, స్పిల్ వే నాలుగు గేట్లను పదడుగులు ఎత్తి 1,11,564.. మొత్తం 1,74,518 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.4 టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 1,62,647 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 9,500, ఎడమ కాలువకు 8,108, ఏఎమ్మార్పీకి 1,800, వరద కాలువకు 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,967, స్పిల్ వే 14 గేట్లను ఐదడుగులు ఎత్తి 1,09,872.. మొత్తం 1,42,839 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 585.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 1,36,192 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ 8వేలు, స్పిల్ వే 5 గేట్లను మూడడుగులు ఎత్తి 1,15,665.. మొత్తం 1,23,665 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.81 అడుగుల్లో 38.08 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,59,148 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 13,898 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 1,45,250 క్యూసెక్కులను 60 గేట్లను మూడడుగులు, 10 గేట్లను రెండడుగులు ఎత్తి çకడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని డ్యామ్‌లలోకి వరద తగ్గడంతోసోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత తగ్గనుంది. -
భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల)/విజయపురిసౌత్: గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 47.7 అడుగులు, ధవళేశ్వరం వద్ద 15 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 15,05,850 క్యూసెక్కులు వస్తుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 14,94,850 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇచ్చాయి. దాంతో ఎగువన గోదావరిలో వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోకి వరద 7.40 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన ఉన్న తుపాకులగూడెం బ్యారేజ్‌లోకి 8.84 లక్షలు, సీతమ్మసాగర్‌లోకి 11.47 లక్షల క్యూసెక్కులకు ప్రవాహం తగ్గింది. ఆ నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టనుంది. స్థిరంగా వంశ‘ధార’ వర్షాల ప్రభావం వల్ల వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 22,809 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ఆయకట్టుకు 2,215 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 20,594 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళిలోనూ వరద కొనసాగుతోంది. తోటపల్లి బ్యారేజ్‌లోకి 6,358 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,838 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. నిలకడగా కృష్ణమ్మ బేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణాలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,89,909 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కులు, స్పిల్ వే 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,23,864 క్యూసెక్కులు.. మొత్తం 3,06,217 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్‌లోకి 1,74,167 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,831, ఎడమ కాలువకు 8,193, ఏఎమ్మార్పీకి 600, వరద కాలువకు 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,927, స్పిల్ వే 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,23,216 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 586.2 అడుగుల్లో 301.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 1,36,582 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం ద్వారా 8 వేలు, స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,30,616 క్యూసెక్కులు.. మొత్తం 1,38,616 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,35,847 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,797 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,23,050 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. -
గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్‌పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద నీటిలో మునిగి రైతు మృతి కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్‌వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ మునిగిపోయాడు. ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి, శబరి నదులు -
పెరుగుతున్న సాగర్ నీటిమట్టం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/శ్రీశ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జున సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 575 అడుగుల్లో 269.12 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 70,359 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 42.88 టీఎంసీలు అవసరం. కృష్ణా, తుంగభద్ర నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త తగ్గింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,436 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండు గేట్లను మూసివేశారు. ఒక గేటు ద్వారా 27,846 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 63,332 క్యూసెక్కులు.. వెరసి 91,178 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద గోదావరిలో మళ్లీ వరద పెరుగుతోంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్‌కి వచ్చే ప్రవాహం పెరిగింది. ఇక్కడి నుంచి డెల్టాకు 6,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,68,278 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 6,46,715 క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 36.6 అడుగులకు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో వంశధారలోనూ వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 10,465 క్యూసెక్కులు చేరుతోంది. ఆయకట్టుకు 1,897 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8,568 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతలలో 40.632 టీఎంసీలు కృష్ణా డెల్టాలో నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే సాగర్‌లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 30,640 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. సాగర్‌లో నీటిని నిల్వ చేయకుండా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీకి 4,844 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నుంచి తెలంగాణ విడుదల చేస్తున్న నీటికి మూసీ, హాలియా జలాలు తోడవడంతో 42,705 క్యూసెక్కులు పులిచింతలలోకి చేరుతున్నాయి. పులిచింతలలో 40.632 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. దీంతో పులిచింతల గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 42,705 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, పాలేరు, వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 77,603 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,513 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 69,990 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నాగార్జునసాగర్‌లోకి 1.56 లక్షల క్యూసెక్కుల వరద
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లోకి ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,56,766 క్యూసెక్కులు చేరుతుండగా కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీలకు 7,048 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ నదిలోకి 4,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 572.10 అడుగుల్లో 261.84 టీఎంసీల నీరు ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 50 టీఎంసీలు కావాలి. ఆదివారం పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్రలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద సాగర్‌లో విద్యుదుత్పత్తి దిగువకు విడుదల చేస్తున్న నీటికి, మూసీ, హాలియా నదుల ప్రవాహం తోడవడంతో పులిచింతల్లోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి పాలేరు, మున్నేరు తదితర వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 50,276 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణాడెల్టాకు 9,741 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగిలిన 40,535 క్యూసెక్కులను బ్యారేజ్ 55 గేట్లు ఒక్క అడుగుమేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ 30 గేట్లు ఎత్తివేత శనివారం రాత్రి, ఆదివారం పశ్చిమ కనుమల్లో తుంగ, భద్ర నదులు పురుడుపోసుకునే కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు తుంగభద్ర డ్యామ్‌లోకి 98,519 క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ గరిష్టస్థాయిలో 101.27 టీఎంసీలు ఉండటంతో 30 గేట్లను ఎత్తి 98,561 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పరీవాహక ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం కాస్త పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3,10,843 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 9,700 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,01,143 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజ్, నారాయణపురం ఆనకట్టల నుంచి సముద్రంలోకి.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పరవళ్లు తొక్కుతున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 7,470 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1,392 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 6,078 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నాగావళి వరద ఉద్ధృతితో నారాయణపురం ఆనకట్టలోకి 6,200 క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది మూడోసారి శనివారం రాత్రి శ్రీశైలంలోకి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. కానీ.. శనివారం రాత్రి, ఆదివారం నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,52,670 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో మూడుగేట్లను పదడుగుల మేర ఎత్తి 83,673 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,442 క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. దీంతో 1,47,115 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం సాగర్ వైపు పరుగులు పెడుతోంది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. -
ధవళేశ్వరం వద్ద తగ్గిన వరద.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 14,97,070 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 15.1 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. డెల్టాకు 5,400 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 14,91,670 క్యూసెక్కులను బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన కాస్త పెరుగుదల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎగువన గోదావరిలో వరద ఉధృతి కాస్త పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీలోకి 8,62,610 క్యూసెక్కులు చేరుతోంది. సీతమ్మసాగర్‌లోకి వస్తున్న 12,27,650 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 12,42,264 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 48.4 అడుగులకు చేరుకుంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 13,86,917 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 35.25 మీటర్లకు చేరింది. వస్తున్న ప్రవాహాన్ని వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తూ.. అధికారులు సమర్థంగా వరదను నియంత్రిస్తున్నారు. ఇదీ చదవండి: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద.. శ్రీశైలం వద్ద ఉధృతి -
తగ్గుతున్న గోదా‘వడి’
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి, ప్రతినిధి, ఏలూరు/ధవళేశ్వరం/చింతూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో గోదా‘వడి’ కూడా క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద సోమవారం రాత్రి 10 గంటలకు 20,79,187 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం కూడా 18.70 అడుగులకు తగ్గింది. 17.75 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరుకోకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 5,900 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 20,73,287 క్యూసెక్కులను (179.17 టీఎంసీలను) సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో మంగళవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎగువన గోదావరి, ఉపనదుల్లో వరద తగ్గింది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 6.06 లక్షలకు తగ్గితే.. దాని దిగువనున్న తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద 10.95 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ బ్యారేజ్‌కు దిగువన ఉన్న సీతమ్మసాగర్‌లోకి వస్తున్న వరద 15.48 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ బ్యారేజ్‌లలోకి చేరుతున్న వరదను వచ్చింది వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుతోంది. సోమవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 16.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో వరద మట్టం 56.20 అడుగులకు తగ్గింది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులు లేదా అంతకంటే దిగువకు చేరుకునే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరంలోకి వచ్చే వరద సైతం క్రమేణా తగ్గుతోంది. సోమవారం రాత్రి 10 గంటలకు 17,76,590 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 35.44 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 27.18 మీటర్లుగా నమోదైంది. పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వరదను సమర్థంగా నియంత్రిస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ లంకలను వీడని ముంపు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లంకల్లో ఇళ్లను చుట్టుముట్టిన నీరు నెమ్మదిగా దిగువకు లాగుతోంది. కాగా పి.గన్నవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, కొత్తపేట, కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని లంక గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. ముంపు బాధితులకు పునరావాస, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం రెబ్బనపల్లి, అమలాపురం రూరల్ బండార్లంక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు పాలు, భోజనం ప్యాకెట్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. గోదావరి, శబరి నదుల వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టినా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వందలాది గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా విలీన మండలాలైన కూనవరం, ఎటపాక, వీఆర్ పురం, చింతూరు మండలాల్లోని వందలాది గ్రామాల్లో ఇంకా వరద నీరు ఉంది. కొన్ని ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. మరో రెండురోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏలూరు జిల్లాలో పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మండలాల్లోని ముంపు గ్రామాలకు సోమవారం నేవీ హెలికాప్టర్ ద్వారా నాలుగువేల ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేశారు. ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి ఆదేశాలతో రేషన్ సహా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ముంపునకు గురయ్యే వీలున్న 15 ప్రాంతాల్లో కరకట్టలను పటిష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లో 31 గ్రామాల్లో వరద ప్రభావం ఉంది. గో‘దారి’ క్లియర్ సముద్రంలో సంభవించే ఆటు పోటులు వరదపై ప్రభావం చూపుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో 4 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గోదావరి నుంచి కొత్త నీటిని రాకుండా అడ్డుకున్నట్టుగా మారటంతో వరద నీరు వెనక్కి పొంగి గ్రామాలను ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రం పోటు తగ్గి.. ఆటు వచ్చి వెనక్కి వెళ్లిపోడవంతో వరద నీరు సముద్రంలో ఆటంకం లేకుండా సునాయాసంగా కలుస్తోంది. ఇప్పటివరకు పోటెత్తిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. -
51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద నీరు భారీగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ 25 లక్షలు 8 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడుదల చేశారు. గోదావరి ఉధృతితో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి పాయలు పోటెత్తుతున్నాయి. గోదావరి పాయలు ముంచెత్తడంతో లంకల్లో ఆరుడగుల వరద నీరు చేరింది. కోనసీమలో 51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏటిగట్లపై ఉన్నతాధికారులు దష్టిసారించారు. 40 వేల ఇసుక బస్తాలతో బలహీనమైన ప్రాంతాల్లో ఏటి గట్లను పట్టిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు, ఏటిగట్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా వాలంటీర్లతో బండ్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కోనసీమ జిల్లాలోని 88 గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. కోనసీమజిల్లాలో ఇప్పటి వరకు 18 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరద పరిస్ధితులని కలెక్టర్ హిమాన్షు శుక్లా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి మోనిటరింగ్ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 25లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి.. మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇంతటి వరదను 1986 తర్వాత ఇంతటి వరద చూడలేదని లంక గ్రామ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం వరద ప్రభావం నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగాలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గండ్లు పడే ప్రమాదం ఉన్న చోట అదనంగా సిబ్బందిని మెటీరియల్‌ని సమీకరించాలని ఆదేశించింది. ఏటీ గట్లను మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏఈఈలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. -
వరద ప్రవాహానికి మునిగిన అక్విడెక్ట్ బ్రిడ్జి
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద హై టెన్షన్
సాక్షి, తూర్పుగోదావరి: భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. వరద నీరు మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. దీంతో, 24 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. 20.6 అడుగులకు నీటిమట్టం చేరింది. 23.94 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోగా కొనసాగుతోంది. గోదావరి ఉప నదులు గౌతమి, వశిష్ట, వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పరిస్థితులను పరీక్షిస్తున్నారు. మరోవైపు.. కోనసీమ జిల్లాలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహానికి అక్విడెక్ట్ బ్రిడ్డి మునిగిపోయింది. కాగా, అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడిగట్టు బలహీనంగా ఉంది. ఈ క్రమంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -
రూ. 256.53 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీలో పూడికతీత
సాక్షి, అమరావతి: ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేసిన రెండు కోట్ల క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక మేటల తొలగింపునకు రూ. 256.53 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21న ఆర్థిక బిడ్, అదే రోజున రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టెండర్లను జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఇసుక మేటల తొలగింపు ద్వారా బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా గోదావరి డెల్టా రైతులకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయడంతో పాటు పూడిక తీసిన ఇసుక ద్వారా నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలన్నది సర్కార్ ఉద్దేశ్యం అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గోదావరి డెల్టాలో ఉన్న 10.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తారు. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు వేయడం వల్ల ఆ నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. ఖరీఫ్‌లో పంటలకు నీళ్ల ఇబ్బంది లేకపోయినా.. రబీలో నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో బ్యారేజీకి 3 కి.మీ. నుంచి 12.5 కి.మీ. వరకూ ఎడమ వైపున ఇసుక మేటల తొలగింపునకు రూ. 135.85 కోట్లు.. కుడి వైపున ఇసుక దిబ్బల తొలగింపునకు రూ. 120.68 కోట్లతో అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్లను ఖరారు చేశాక ఇసుక తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఏపీఎండీసీకి బాధ్యత అప్పగింత.. ధవళేశ్వరం బ్యారేజీలో ఇసుక మేటలను తొలగించేందుకు అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) భరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇసుకను తొలగించడం, దాన్ని విక్రయించడం వరకు అన్ని బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించింది. పూడిక తీసిన ఇసుకను విక్రయించగా రూ. 256.53 కోట్ల కంటే అధికంగా ఆదాయం వస్తే.. ఆ లాభంలో వాటాలు ఏపీఎండీసీకి, సర్కార్ ఖజానాకు చేరుతాయి. పూడికతీతతో వచ్చే ఇసుకతో నిర్మాణరంగానికి మేలు జరుగుతుందని, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. -
చకచకా పోలవరం జలవిద్యుత్ కేంద్రం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు జలాశయం పనులను ఇప్పటికే కొలిక్కి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. జలవిద్యుత్కేంద్రం పనులనూ వేగవంతం చేసింది. ఇందులో కీలకమైన ప్రెజర్ టన్నెళ్ల తవ్వకాలు ప్రారంభమైన నాలుగు నెలల్లోనే 150.3 మీటర్ల పొడవు తొమ్మిది మీటర్ల వ్యాసంతో కూడిన ఒక టన్నెల్‌ను పూర్తిచేసింది. మరో టన్నెల్ తుదిదశకు చేరుకుంది. మిగిలిన పది టన్నెళ్ల పనులను వేగవంతం చేసింది. గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహమంతా పోలవరం ప్రాజెక్టు మీదుగానే ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. దీని ప్రధాన ఆనకట్ట ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వం జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ నీటి లభ్యత అధికంగా ఉన్నందువల్ల హిమాలయ నదులపై ఏర్పాటుచేసిన జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో కరెంట్ ఉత్పత్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చౌకగా అందుబాటులోకి వచ్చే ఈ విద్యుత్ రాష్ట్ర విద్యుత్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని.. పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. పోలవరంలో జలవిద్యుదుత్పత్తి ఇలా.. ► పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ► ఇక్కడ 35.52 మీటర్ల నీటి మట్టం నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. ► ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. ► ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ చానల్ తవ్వుతారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. ► టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ చానల్ ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌కు దిగువన నదిలోకి కలుపుతారు. ► ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను భోపాల్‌కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ తయారుచేస్తోంది. ఇవి ఆసియాలోనే అత్యంత పెద్దవి. శరవేగంగా సాగుతున్న పనులు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం గోదావరి గట్టుకు అవతల ఎడమ వైపున ఉన్న కొండలో 21,39,639 క్యూబిక్ మీటర్లు తవ్వారు. ఈ కొండ తవ్వకం పనులను దాదాపుగా పూర్తిచేశారు. కొండలో ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూర్తయిన టన్నెళ్లకు సిమెంట్ లైనింగ్ చేసి.. టర్బైన్లను అమర్చడానికి కసరత్తు చేస్తున్నారు. వీటికి వంద మెగావాట్ల సామర్థ్యంతో కూడిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లను అమర్చనున్నారు. -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/కొవ్వూరు: నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9,09,385 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 9,00,185 క్యూసెక్కుల (77.78 టీఎంసీలు)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉప నదులు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. పోలవరం వద్దకు చేరుతున్న 9.10 లక్షల క్యూసెక్కులను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్నాయి. కృష్ణా, ప్రధాన ఉప నది, తుంగభద్రల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 880.1 అడుగులకు చేరుకుంది. ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 11 వేల క్యూసెక్కులు తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 188.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 14,757 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 305.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 35,150 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,755 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 22,260 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2,600 కుటుంబాలు తరలింపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమం తగ్గుతూ సాయంత్రానికి 11.10 అడుగులకు చేరింది. ఆనకట్టకు దిగువన యలమంచిలి మండలం కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు పెరగడంతో వేలేరుపాడు మండలంలో పెద్ద వాగు, ఎద్దెలవాగు, మేళ్ల వాగులోకి వరదనీరు చేరింది. మండలంలోని 32 ఏజెన్సీ గ్రామాలు, పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 2,600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. -
గోదావరిలో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. గోదావరి డెల్టా కాలువలకు కొంతనీరు వదిలి, మిగిలిన 7,62,609 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ బ్యారేజి వద్ద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 70,577 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,426 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 878.80 అడుగుల్లో 181.8320 టీఎంసీల నీరు ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో 71.067 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి› చేసింది. నాగార్జునసాగర్‌లోకి 17,151 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 19,444 క్యూసెక్కులను స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 63,003 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 11,203 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 51,800 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు వదిలేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 26 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.84 టీఎంసీలకు చేరుకుంది. మరో 5.16 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. సోమశిల నుంచి వదలుతున్న నీటిలో కండలేరు రిజర్వాయర్‌లోకి 8,600 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం కండలేరులో 54.98 టీఎంసీల నీరుంది. కండలేరు నిండాలంటే ఇంకా 13.05 టీఎంసీలు అవసరం. -
గోదావరిలో పెరిగిన వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: వర్షాల ప్రభావం వల్ల ఎగువన ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే వద్ద నీటిమట్టం 32.94 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 10,14,385 క్యూసెక్కులు చేరుతుండటంతో వరద నీటిమట్టం 11.75 అడుగులు దాటింది. దాంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి డెల్టాకు 5,700 క్యూసెక్కులు ఇచ్చి మిగులుగా ఉన్న 10,08,685 క్యూసెక్కులు (87.16 టీఎంసీలు)ను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆదివారం పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో వరద తగ్గుముఖం పడుతోంది. లంకల్ని చుట్టేస్తున్న వరద ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. పి.గన్నవరం మండలం చాకలిపాలెం గ్రామాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కనకాయలంక కాజ్వే ఆదివారం వరద ఉధృతికి నీట మునిగింది. ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తుండటంతో అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. జి.పెదపూడి రేవులో రహదారి కొట్టుకుపోవడంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి జిల్లాల సరిహద్దున గల అనగారలంక, పెదమల్లంలంక, సిర్రావారిలంక, అయోధ్యలంకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
ఉప్పొంగుతున్న నదులు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/అచ్చంపేట/తాడేపల్లి రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వరదతో పోటెత్తుతున్నాయి. ఎగువన కృష్ణా నదిలో వరద పెరగడంతో ముందు జాగ్రత్తగా ఆల్మట్టి, నారాయణపూర్‌లను ఖాళీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని పెంచేస్తూ దిగువకు 31 వేల క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో శ్రీశైలం నీటిమట్టం 849 అడుగుల వద్దే ఉండిపోయింది. 854 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అత్యవసరాల కోసం ఆరేడు వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి శనివారం వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మూసీ, కట్టలేరు, వైరా, మున్నేరు ఉప్పొంగడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో 70 గేట్లు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. గోదావరిలోనూ వరద ఉధృతి గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్దకు రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో నీటిమట్టం 28.7 మీటర్లకు పెరిగింది. వచ్చిన వరదను వచ్చినట్టు 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.09 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.64 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి పోలవరం ప్రాజెక్టు వద్దకు పది నుంచి 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంపునకు గురయ్యే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, చింతూరు, వీఆర్ పురం, కూనవరం, నెల్లిపాక మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు పునరావాసం కల్పిస్తున్నారు. కాగా, నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,048 క్యూసెక్కులు వస్తుండగా.. ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,562 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వంశధార నుంచి 1,873 క్యూసెక్కులు గొట్టా బ్యారేజీలోకి చేరుతుండగా.. ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,200 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పెన్నానదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టులోకి 8,700 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 52.21 టీఎంసీలకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితి ఇలా.. వచ్చే మూడు రోజులు వర్షాలు బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరంల్లో 7.2 సెం.మీ., పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 7.1 సెం.మీ. వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో 1 నుంచి 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వివరించారు. -
Godavari Delta: గోదావరి డెల్టాకు భరోసా
సాక్షి, అమరావతి: గోదావరి డెల్టాలో నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు శివారు భూములకు నీళ్లందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆధునికీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డెల్టాలో ఖరీఫ్‌కు జూన్.. రబీకి డిసెంబర్లో నీటిని విడుదల చేస్తారు. ఏడాది మొత్తంలో కేవలం రెండు నెలలు మాత్రమే డెల్టాలో పంటలు సాగు చేయరు. ఆ రెండు నెలల్లోనే కాలువల ఆధునికీకరణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. రబీ పంట కాలం పూర్తయి, ఖరీఫ్ పంట సాగు ప్రారంభించే లోగా కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. గత ఏడాదిలో రెండు నెలలు, ప్రస్తుత రబీ పంట పూర్తయినప్పటి నుంచి డెల్టా ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.148.04 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులను భారీ ఎత్తున చేపట్టింది. సర్ ఆర్థర్ కాటన్ హయాంలో నిర్మించిన పురాతనమైన కాలువలు అస్తవ్యస్థంగా మారడంతో డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. దీంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో గోదావరి డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. కాలువలు, రెగ్యులేటర్లు ఆధునికీకరణకు రూ.802.59 కోట్లు వ్యయం చేశారు. ఆయన మరణం తర్వాత డెల్టా ఆధునికీకరణ పనులను టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. బ్యారేజీని పటిష్టం చేసేలా.. గోదావరి డెల్టాకు నీటిని సరఫరా చేసే ధవళేశ్వరం బ్యారేజీని మరింత పటిష్టం చేసే పనులపైనా దృష్టి పెట్టిన అధికారులు.. మరోవైపు బ్యారేజీలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసే పనులను చేపడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. గోదావరికి వచ్చే భారీ వరద ప్రవాహంతో పెద్దఎత్తున ఇసుక కొట్టుకొచ్చి ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేస్తోంది. ఇటీవల జల వనరుల శాఖ అధికారులు నిర్వహించిన బ్యాథమెట్రిక్ సర్వేలో సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేసినట్టు గుర్తించారు. దీనిని డ్రెడ్జింగ్ ద్వారా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యారేజీలో ఇసుక పూడికను తొలగించి.. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా 10.13 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టుకు మరింత సమర్థవంతంగా నీళ్లందించాలని నిర్ణయించారు. డిజైన్ మేరకు నీరు ప్రవహించేలా.. అత్యంత ఆధునాతన ఏడీసీపీ (అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) పరికరం ద్వారా ప్రస్తుతం కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని అధికారులు కొలుస్తున్నారు. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యం తగ్గితే, దాన్ని పెంచేలా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. డెల్టాలోని 713.20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలను ఇదే రీతిలో ఆధునికీకరిస్తున్నారు. డి్రస్టిబ్యూటరీలను అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టారు. -
నదుల అనుసంధానంపై నేల విడిచి నీటి వ్రాలు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో పేర్కొన్న గణాంకాలు అస త్యాలతో (నీటి వ్రాలు) కూడుకుని ఉన్నాయని ఏపీ జల వనరుల శాఖ తేల్చి చెప్పింది. నీటి లభ్యతపై స్పష్టత లేదంటూ జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు లేఖ రాసింది. ఈ విషయంలో కచ్చితమైన అంచనా లేకుండా.. ఏ సమ యంలో నీటిని మళ్లించాలనే దానిపై స్పష్టత లేకుం డా.. ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత ఆయకట్టుకు నీళ్లందిస్తారనేది తేల్చకుండా డీపీఆర్ రూపొందించడాన్ని ఎత్తిచూపింది. గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ వరకూ వరద ప్రవాహం ఉంటుందని.. ఆ సమయంలో మహానది నుంచి గోదావరికి నీటిని మళ్లిస్తే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేయడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండ దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్‌కు రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఇటీవల లేఖ రాశారు. దేశంలో హిమాలయ నదులను, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడంలో భాగంగా గంగా–మహానది–గోదావరి–కష్ణా–కావేరీ అనుసం« దానంపై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మహానది (బర్ముల్)–గోదావరి (ధవ ళేశ్వరం బ్యారేజీ) అనుసంధానంపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్)తో కలిసి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన డీపీఆర్‌పై అభి ప్రాయాలు చెప్పాలని ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాలను స్పష్టంగా వివరించింది. అనుసంధాన ప్రతిపాదన ఇదీ ఒడిశాలో బర్ముల్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఆధా రంగా మహానదిలో 1,733.95 టీఎంసీలు ఉంటా యని.. ఇందులో వరద కాలం పూర్తయ్యాక పున రుత్పత్తి ద్వారానే 910.46 టీఎంసీల లభ్యత ఉం టుందని ఎన్ఐహెచ్ అంచనా వేసింది. ఎన్ఐహెచ్ నివేదిక ఆధారంగా బర్ముల్ వద్ద మహానదిపై బ్యారేజీ నిర్మించి.. 356.84 టీఎంసీలను మళ్లించా లని పేర్కొంది. ఈ నీటిలో 178.65 టీఎంసీలను ఒడిశా సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఇవ్వాలని.. మిగతా 178.19 టీఎంసీలను గోదా వరికి మళ్లించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది.మానస్–సంకోష్–తీస్తా–గంగా–మహానది అ నుసంధానం తర్వాత మరో 51.34 టీఎంసీలతో కలిపి మొత్తం 229.53 టీఎంసీలను గోదావరిలోకి మళ్లించేలా డీపీఆర్‌ను రూపొందించింది. బర్ముల్ నుంచి ఒడిశాలో నయాఘర్, కుర్దా, గంజాం, గజ పతి జిల్లాలు.. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మీదుగా 844.595 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వాలని పేర్కొంది. ఈ కాలువ ద్వారా మహానది జలాలను తొర్రిగెడ్డ డ్రెయిన్‌లోకి తరలించి.. ధవళేశ్వరం బ్యారేజీకి 17 కిలోమీటర్ల ఎగువన సీతానగరం వద్ద గోదావరిలో కలపాలని ప్రతిపాదించింది. ఒడిశాకు కేటాయించిన 178.65 టీఎంసీల నీటిని 3.51 లక్షల హెక్టార్లకు అందించాలని పేర్కొంది. ఏపీకి కేటా యించిన 21.39 టీఎంసీలతో 91,110 హెక్టార్లకు నీళ్లందించి.. మిగతా 208.14 టీఎంసీలను కావేరి నదికి మళ్లించేలా డీపీఆర్‌ను సిద్ధం చేసింది. ఆ రెండు లెక్కలపై పొంతన ఏదీ! మహానదిలో నీటి లభ్యతపై ఎన్ఐహెచ్, ఎన్ డబ్ల్యూడీఏ వేర్వేరుగా రూపొందించిన అంచనాలకు పొంతన కుదరకపోవడాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తి చూపింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బర్ము ల్ వద్ద మహానదిలో సహజసిద్ధ ప్రవాహం రూపం లో కేవలం 123.528 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంటుందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క గట్టిందని గుర్తు చేసింది. సాధారణంగా సహజసిద్ధ ప్రవాహం 20 శాతం మాత్రమే పునరుత్పత్తి (రీజనరేషన్) ద్వారా వస్తాయని అంటే.. పునరుత్పత్తి ద్వారా వచ్చే జలాలు 12.35 టీఎంసీలకు మించవని స్పష్టం చేసింది. కానీ.. ఎన్ఐహెచ్ మాత్రం పునరుత్పత్తి ద్వారా 910.46 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిందని, ఆ స్థాయిలో లభ్యత ఎలా ఉంటుందో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ ఆయకట్టుకే నీళ్లిస్తే ఏం ప్రయోజనం! మానస్–సంకోష్–తీస్తా–గంగా–మహానది అనుసంధానం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదని ఏపీ ప్రభుత్వం కుండబద్ధలు కొట్టింది. మహానది–గోదావరి నదుల అనుసంధానానికి చేసిన ప్రతిపాదనలో పేర్కొన్న మేరకు ప్రధాన కాలువ వంశధార, తోటపల్లి, పోలవరం ఆయకట్టు ద్వారా వెళ్తుందని తెలిపింది. ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకే మహానది–గోదావరి నదుల అనుసంధానం ద్వారా నీళ్లందిస్తే ప్రయోజనమని ఏమిటని ప్రశ్నించింది. ఒడిశాలోని ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లందించాలని ప్రతిపాదించారని, ఏపీలో మాత్రం ఒక పంటకే నీళ్లివ్వాలని డీపీఆర్‌లో పేర్కొనడాన్ని తప్పు పట్టింది. -
పోటాపోటీగా.. కృష్ణా, గోదావరి
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పరీవాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి వరద ఉధృతితో పోటెత్తుతున్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 1,14,096 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక ఉపనదులు ఉరకలెత్తడంతో గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు అధికారులు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.93 లక్షల క్యూసెక్కులు ► ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.93 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ► శ్రీశైలం స్పిల్ వేకు ఉన్న 12 గేట్లలో పది గేట్లను ఎత్తి కుడిగట్టు విద్యుత్కేంద్రం ద్వారా నాగార్జునసాగర్‌కు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేశారు. ► నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 299.45 టీఎంసీలకు చేరుకుంది. గేట్లు ఎత్తి 1.38 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. n పులిచింతలలో నీటి నిల్వ 26.5 టీఎంసీలకు చేరుకుంది. శనివారం ఉదయానికి ప్రాజెక్టు నిండిపోతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. ► వర్షాలతో మున్నేరు, కట్టలేరు, వైరా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. బ్యారేజీలోకి 1.27 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు వదలగా మిగులుగా ఉన్న 1.14 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు గోదావరిపై ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి 18,68,370 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటిమట్టం 17.50 అడుగుల్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. -
ఉగ్రరూపం దాల్చిన గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం (రాజమహేంద్రవరం): శబరి, ఇంద్రావతి, సీలేరు, ప్రాణహిత, తాలిపేరు, కొండవాగులు ఉప్పొంగుతుండటంతో గోదావరి వరద అంతకంతకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ చానల్లోకి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,24,268 క్యూసెక్కుల ప్రవాహం రాగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా గోదావరికి వచ్చిన గరిష్ట వరద ఇదే కావడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకూ 1463.404 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. మరోవైపు వంశధార, నాగావళిలల్లో వరద ప్రవాహం నిలకడగా ఉంది. నెలాఖరు నాటికి సాగర్ నిండే అవకాశం కృష్ణా, తుంగభద్రల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆల్మటి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులోకి వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి ఏడు గంటలకు 2,13,349 క్యూసెక్కులు చేరాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి లిఫ్ట్‌లకు 30 వేల క్యూసెక్కులు వదిలి మిగతా 1.83 లక్షల క్యూసెక్కులను నాగార్జునసాగర్‌లోకి వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.3 అడుగుల్లో 206.1 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 553.4 అడుగుల్లో 217.33 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూసీ, హాలియాల ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి 11,883 క్యూసెక్కులు చేరుతుండటంతోనీటి నిల్వ 5.33 టీఎంసీలకు చేరింది. పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,35,768 క్యూసెక్కులు రాగా.. 1,28,727 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. రాత్రి ఏడు గంటలకు 57,179 క్యూసెక్కులకు వరద తగ్గడంతో అంతే స్థాయిలో గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండటంతోపాటూ పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముంపులోనే కొవ్వూరు గోష్పాదక్షేత్రం గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల వద్ద మూడు అడుగుల మేరకు వరద ప్రవహిస్తోంది. మరోవైపు ఎర్రకాల్వ తన ప్రతాపం చూపుతూనే ఉంది. నందమూరు అక్విడెక్ట్ వద్ద 39.7 అడుగుల నీటి ప్రవాహం ఉండగా, ఆ గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిడదవోలు మండలంలో శెట్టిపేట గ్రామ శివారున ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లోపలకు ఎర్రకాలువ వరద నీరు ప్రవేశించడంతో తాడేపల్లిగూడెం – నిడదవోలు మధ్య రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు నిడదవోలులోని ఐదు వార్డుల్లోకి వరదనీరు ప్రవేశించింది. లంక గ్రామాల్లో కూరగాయల పంటలు పూర్తిగా కుళ్లిపోవడంతో సుమారు ఐదు వేల ఎకరాల్లో రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయోధ్యలంకలోకి వరదనీరు ప్రవేశించడంతో అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అయోధ్యలంక పరిధిలోని పుచ్చల్లంక, రాయిలంకలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. భీమలాపురం ఏటిగట్టు దిగువన ఉన్న కాపులపాలెంను వరదనీరు చుట్టిముట్టింది. ఆచంట, పోడూరు మండలాల్లోని నక్కల డ్రెయిన్‌కు వరద ఉధృతి పెరగడంతో ఈ మండలాలలో దాదాపు 1500 ఎకరాలు నీట మునిగాయి. -
డెల్టా ఆధునికీకరణతో.. మళ్లీ అరకొరేనా!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ పంటకు నీటి విడుదల గడువు ఆదివారంతో ముగుస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు మార్చి 31తో నీటిని నిలిపివేయాల్సి ఉన్నా పలు ప్రాంతాల్లో పంట పొట్టదశలో ఉండడంతో రైతుల విజ్ఞప్తి మేరకు ముందు పది రోజులు, ఆ తర్వాత మరో ఐదు రోజులు వెరసి ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించారు. ప్రస్తుతం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 15న సాయంత్రం 6 గంటలకు మూడు డెల్టా కాలువలను మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం నిర్ణయం తీసుకోనున్నారు. 16 నుంచి మే 30 వరకు 45 రోజుల పాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. గత ఏడాదిలాగే ఈ సారి జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేయనున్నారు. 2,020 పనులు.. రూ.308 కోట్లు.. రబీ ఆరంభానికి ముందు గత ఏడాది నవంబర్‌లో కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చే యాలని నిర్ణయించారు. మార్చి 31న కాలువలు మూసి వేసి మే 30 వరకు 60 రోజులపాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. రైతుల విజ్ఞప్తి మేరకు అదనంగా 15 రోజులు నీరు విడుదల చేయడంతో డెల్టా ఆధునికీకరణ పనులకు 45 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది రూ. 308 కోట్లతో 2,020 పనులు చేసేందుకు జలవనరులశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డెల్టా ఆధునికీకరణ కింద రూ. 173 కోట్లతో 370 పనులు చేయనున్నారు. నీరు– చెట్టు పథకంలో రూ.135 కోట్లతో 1650 పనులు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పునరావృతం కాకూడదంటున్న రైతులు గత ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ఆధునికీకరణలో భాగంగానే రూ. 60 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ప్రధాన కాలువలు, చానల్స్, పంట బోదెలు, డ్రైన్లలో పూడిక తీత, రిటైనింగ్ వాల్స్, హెడ్ స్లూయిజ్, స్లూయిజ్ పనులు చేపట్టారు. నెల రోజులు ఆలస్యంగా మే నుంచి పనులు చేయడం ప్రారంభించారు. మరికొన్ని పనులు హడావుడిగా మే నెలాఖరున ప్రారంభించారు. జూన్ 1నే నీరు విడుదల చేయాలన్న రైతుల పోరాటం ఫలించినా పనులు పూర్తి కాకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. జూన్ ఒకటిన అధికారులు కాలువలకు నీరు విడుదల చేసినా ఆధునికీకరణ పనులు మధ్యలో ఉండడంతో ఫలితం లేకపోయింది. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ కాలువలకు అడ్డుకట్టలు వేసి పనులు చేయడంతో కాలువలకు పూర్తి స్థాయిలో నీరు 15 రోజులు ఆలస్యంగా అందింది. గత ఏడాది అదృష్టవశాత్తూ అక్టోబర్‌లో తుపాన్లు రాకపోవడం వల్ల పంట కోత ఆలస్యమైనా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఏడాదైనా డెల్టా ఆధునికీకరణ పనులు సకాలంలో మొదలు పెట్టి నిర్ణీత గడువు మే 30 నాటికి పూర్తి చేసి జూన్ ఒకటిన నిరు విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మోసయ్యపేటలో విషాదచాయలు!
-
22కు పెరిగిన మృతుల సంఖ్య!
-
అయినా అక్క చనిపోయింది...
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ఘటనలో ఓ చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్పంగా గాయపడిన ఈగల కిరణ్ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన అతడు... ' రాత్రి 8 గంటలకు ప్రమాదం జరిగిం. ప్రమాదం జరిగే సమయంలో నేను మా డాడీ ఒళ్లో ఉన్నాను. అప్పుడు మా డాడీ నన్ను, అక్కను గట్టిగా పట్టుకుని దాచాడు. డాడీకి బాగా దెబ్బలు తగిలాయి. మమ్మీకీ కూడా. నాకు తలమీద పెద్ద దెబ్బ తగిలింది. అక్కను బయటకు తీసుకు వద్దామని ప్రయత్నించాను. అయితే నాకు కుర్చీలు అడ్డు వచ్చాయి. నేను కిటికీలోంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత వేరేవాళ్లకు చెప్పి అక్కను బయటకు తెచ్చాం. అయినా అక్క చనిపోయింది. నేనొక్కడినే బతికాను' చెప్పాడు. కాగా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కిరణ్ సోదరి ఈగల సంధ్య కూడా ప్రాణాలు కోల్పోయింది. తుఫాన్ వాహనం గోదావరి నదిలో బోల్తాపడిన దుర్ఘటనలో 22మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
మృత్యుంజయుడు కిరణ్!
-
ఈతకెళ్లి విద్యార్థి మృతి
రాజమండ్రి : ధవళేశ్వరం బ్యారేజీలో ఈతకెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పదవతరగతి పరీక్షలు పూర్తి కావడంతో గురువారం సరదాగా ఈతకెళ్లిన రాము(15) అనే విద్యార్థి ప్రమాదవశాత్తూ ధవళేశ్వరం బ్యారేజీలో చిక్కుకుని మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.