ధవళేశ్వరం బ్యారేజీలో ఈతకెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.
రాజమండ్రి : ధవళేశ్వరం బ్యారేజీలో ఈతకెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పదవతరగతి పరీక్షలు పూర్తి కావడంతో గురువారం సరదాగా ఈతకెళ్లిన రాము(15) అనే విద్యార్థి ప్రమాదవశాత్తూ ధవళేశ్వరం బ్యారేజీలో చిక్కుకుని మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.