దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment