dhavaleswaram
-
ధవళేశ్వరం బాలికల మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్...
-
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్‌లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్‌వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
కోనసీమలో ముంపులోనే లంక గ్రామాలు
-
ఉగ్ర గోదావరి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలు, పోటెత్తుతున్న ఉప నదులు కలసి దిగువ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. దానికి దిగువన కడెం ప్రాజెక్టు నుంచి, వాగుల నుంచి వస్తున్న వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది.అయితే దాని దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్షి్మ) బరాజ్‌కు 9,54,130 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహానికి ఇతర ఉప నదులు, వాగులు కలసి.. తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌ల వద్ద మరింత ఎక్కువగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు 50.20 అడుగులుగా...భద్రాచలం వద్దకు వచ్చేసరికి గోదావరి ఉగ్ర రూపం దాల్చు తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 50.20 అడుగుల నీటిమట్టంతో 13 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. భద్రాచలం నుంచి వెళ్తున్న నీరంతా పోలవరం, ధవళేశ్వరం మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వరద ప్రమాదకర స్థాయికి పెరిగే చాన్స్ మధ్య గోదావరి సబ్ బేసిన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నీళ్లన్నీ గోదావరిలోకి చేరేందుకు ఒక రోజు పడుతుంది. దీంతో మంగళవారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. భద్రాచలం వద్ద వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన ములుగు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నది, సామాజిక ఆస్పత్రిని, పలు వరద ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలుమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలతో గోదావరి నది పోటెత్తుతోంది. కొన్ని నెలలుగా సరిగా వానల్లేక, నీటికి కటకటతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు భారీగా వరదలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తేయడం, నీటి ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహాలు లేక ఎల్లంపల్లిలోకి నీటి చేరిక మెల్లగా కొనసాగుతోంది.మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే.. అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లిని నింపుకొని, అక్కడి నుంచి మిడ్‌మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను నింపుకొనే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. కానీ గోదావరి నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేక వరద అంతా సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం.. గోదావరిలో ఈ నెల 17 నుంచి సోమవారం సాయంత్రం వరకు 200 టీఎంసీల మేర నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి నీళ్లు రాక, కాళేశ్వరం లిఫ్టింగ్ లేక.. ఈసారి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమేనన్న చర్చ జరుగుతోంది. -
గోదావరి ఉధృతి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, ఖమ్మం/తూర్పుగోదావరి: భద్రాచలం వద్ద గోదావరి వరద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్లోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో రామయ్య ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని రివర్స్‌గా మళ్లీ గోదావరిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు గోదావరి: ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద తీవ్రత పెరుగుతుంది. కోటిపల్లి స్నాన ఘట్టాలను వరద తాకడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటి ప్రయాణాలు నిలిపివేశారు. కోటిపల్లి గోదావరి సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయ గట్టుకు వరద తాకిడితో తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం,పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్‌వేల పైకి కూడా వరద నీరు చేరనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పోర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై వరంగల్‌తో పాటు పలు గ్రామాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా టేకులగూడెం వద్ద గోదావరి వరద ఉధృతికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట మండలం కట్రియాల- ఇల్లంద మద్య జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలడంతో వరంగల్-ఖమ్మం మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆధార్ సిన్హా, రజత్ కుమార్, సునీల్ శర్మ,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు హాజరయ్యారు. -
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
చెలరేగిన బ్లేడ్ బ్యాచ్.. నడిరోడ్డుపై యువకుడి హత్య
సాక్షి, తూర్పుగోదావరి(ధవళేశ్వరం): ప్రశాంతంగా ఉన్న ధవళేశ్వరం గ్రామంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బ్లేడ్‌బ్యాచ్ దుండగులు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడి దాడిలో ధవళేశ్వరం కంచర్లలైన్ ప్రాంతానికి చెందిన యువకుడు అండిబోయిన రాజేష్ (23) మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కత్తితో దాడి తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్న అండిబోయిన రాజేష్ తండ్రి గతంలో మృతి చెందారు. తల్లి, రాజేష్ కలిసి జీవనం సాగిస్తున్నారు. అతడికి వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం కంచర్లలైన్ సెంటర్లో రాజేష్ ఉన్నాడు. ఆ సమయంలో బ్లేడ్‌బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సభ్యులు బైక్‌పై అక్కడకు వచ్చారు. రాజేష్‌ను వెయ్యి రూపాయలు అడిగారని స్థానికులు చెబుతున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో రాజేష్‌ను ఇందిరా కాలనీకి చెందిన బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడు (మైనర్) కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ముగ్గురు దుండగులూ అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న రాజేష్‌ను స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాడికి పాల్పడిన బాలుడిపై ధవళేశ్వరంలో ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రాజేష్ హత్యతో అతడి తల్లి రోడ్డున పడింది. చదవండి: (రాసింది ఒకటి.. చేసింది మరొకటి.. ‘స్టార్’ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాకం) స్థానికుల ఆగ్రహం బ్లేడ్‌బ్యాచ్ దాడిలో రాజేష్ మృతి చెందడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ధవళేశ్వరం ప్రధాన రహదారిపై మంటలు వెలిగించి, బైఠాయించారు. రాజేష్‌ను హత్య చేసిన బ్లేడ్‌బ్యాచ్ యువకుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రధాన రహదారి మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిచారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బ్లేడ్‌బ్యాచ్ పని పట్టాలి ధవళేశ్వరంలో రోజురోజుకూ పేట్రేగిపోతున్న బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కంచర్లలైన్ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం దాడికి ఒడిగట్టిన బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు తరచుగా కంచర్లలైన్ ప్రాంత వాసులపై దాడులకు పాల్పడుతున్నారని, అయినప్పటికీ పోలీసులు తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంతో వారి ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బ్లేడ్‌బ్యాచ్ పని పట్టే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద
సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం(బుధవారం ఉదయం నాటికి) 16.50 అడుగులకు చేరుకుంది వరద నీటిమట్టం. సుమారు 17 లక్షల 15 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి బాగా తగ్గింది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 34.6 మీటర్లకు చేరుకుంది వరద నీరు. 48 గేట్ల ద్వారా దిగువకు 15.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నారు. నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 2,52,967 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 19,070 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.00 అడుగుల వద్ద ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 168.2670 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది. మరో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండడంతో.. మిగతా చోట్ల సైతం సాధారణం నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం వద్ద.. అరుదుగా వరదలొచ్చే నదులు పొంగిపొర్లడంతో మూకుమ్మడిగా గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రాణహిత, పెన్‌గంగా, వార్ధా నదులు వరదలతో ఉగ్రంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, కడెం నుంచి దిగువకు భారీగా వరద నీరు విడుదల అవుతోంది. భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పలిమెల పోలీస్ స్టేషన్ నీట మునిగింది. మేడిగడ్డ కంట్రోల్ రూంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు కొందరు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు సమాచారం. అలాగే భద్రాద్రికి రాకపోకలు బంద్ అయ్యాయి. మిగిలిన ఏకైక మార్గం కూడా మూసివేశారు అధికారులు. అత్యవసరమైతేనే భద్రాద్రిలోకి అనుమతిస్తున్నారు. భద్రాచలం బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. 48 గంటలపాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం 62 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం.. రాత్రికి లేదంటే రేపు ఉదయానికి గోదావరి మట్టం 70 అడుగులకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. సీఎస్ సోమేశ్‌కుమార్ అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏపీలోనూ.. రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉదృతంగా ఉంది. నీటిమట్టం 16 అడుగులు దాటింది. 17.75 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. అదే జరిగితే ఆరు జిల్లాలపై ప్రభావం పడనుంది. 42 మండలాల్లోని 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపులోకి మరికొన్ని ప్రాంతాలు. ఆచంట, యలంచిలి మండలాల్లో లంకగ్రామాలు నీట మునగ్గా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయక చర్యల్లో ఏడు ఎన్డీఆర్ఎఫ్, ఐదు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఏపీ విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
మహోగ్ర గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
సాక్షి, అమరావతి/అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/చింతూరు/ఎటపాక: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది బుధవారం మహోగ్రరూపం దాల్చింది. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి 15,11,169 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 15.1 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కాళేశ్వరంలో 14.67 మీటర్లు, పేరూరులో 16.46 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.41 మీటర్లు, కూనవరంలో 22.27మీటర్లు, కుంటలో 13.31 మీటర్లు, పోలవరంలో 13.84 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 17.23 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు. డెల్టా కాలువలకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 15,07,169 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 19 లక్షల క్యూసెక్కులు దాటితే ఇళ్లలోకి నీరు చేరుతుందని భావిస్తున్నారు. గురువారం రాత్రికి బ్యారేజీలోకి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పోటెత్తిన కడెం ప్రాజెక్ట్ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో జూలై రెండో వారంలోనే గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం కడలి వైపు పరుగులు తీస్తోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 3.82 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో కడెం ప్రాజెక్టు స్పిల్ వేను నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టులోకి కడెం వాగు నుంచి 5.69 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజీల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేసి.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజీలోకి 17.65 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 15,14,976 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 54.70 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికి భద్రాచలం వద్దకు 18 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉందని.. నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. గోదావరి చరిత్రలో ఆగస్టు 16, 1986లో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. భద్రాచలం వద్ద వరద మట్టం 75.6 అడుగులుగా నమోదైంది. పోలవరం వద్ద 24 గంటలూ అప్రమత్తత ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 14,54,636 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే వద్ద నీటిమట్టం 34.21 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వరద విడుదల చేస్తుండటంతో దిగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 26 మీటర్లకు చేరుకుంది. గురువారం ఉదయానికి పోలవరం ప్రాజెక్టులోకి 18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లంకల్ని ముంచెత్తిన వరద – నీట మునిగిన రహదారులు.. కాజ్‌వేలు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద ముంపు మరింత పెరిగింది. ప్రధాన రహదారులు ముంపుబారిన పడ్డాయి. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఊడుమూడిలంక, నాగుల్లంక, కె.ఏనుగుపల్లి ముంపుబారిన పడ్డాయి. ఈ గ్రామాల్లో నాలుగు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. అలాగే మానేపల్లి శివారు పల్లిపాలెం, శివాయలంక జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, కనకాయలంక, పెదమల్లంలంక, అనగారలంక సైతం నీట మునిగాయి. మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి కాజ్వే, అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంకాఫ్ ఠాన్నేల్లంకలో ఎస్సీ కాలనీలు ముంపుబారిన పడ్డాయి. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు పరిధిలో పొగాకులంక, పొట్టిలంకల్లో రోడ్ల మీద నీరు ప్రవహిస్తోంది. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపుబారిన పడింది. పాండిచ్చేరి పరిధిలోని యానాంలో బాలయోగి నగర్ కాలనీ, ఓల్డ్ రాజీవ్ నగర్ వద్ద వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 43 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముంపులోనే విలీన మండలాలు తగ్గినట్టే తగ్గిన గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వరద మరింత పెరిగే పరిస్థితి నెలకొంది. నాలుగు మండలాల్లో 87 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా ఇప్పటికే 6,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చింతూరు ఐటీడీఏలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బోటులో ప్రయాణించి వరద పరిస్థితిని, సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. చింతూరు నుంచి బోట్లు, లాంచీల సాయంతో నిత్యావసర సరుకులను ముంపు మండలాలకు తరలిస్తున్నారు. బోటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్! .. గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి కారణంగా పర్యాటక శాఖ బోటింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. పోచమ్మగండి నుంచి పాపికొండలుకు విహార యాత్రను రద్దు చేసింది. రాజమండ్రి ఘాట్లతో పాటు దిండి ప్రాంతంలో బోటింగ్ ఆపేసింది. విజయవాడలోని బెరంపార్క్–భవానీ ద్వీపానికి జల ప్రయాణానికి విరామం ప్రకటించింది. చురుగ్గా సహాయక చర్యలు గోదావరి వరద సహాయక చర్యల్లో 6 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమై ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గోదావరి లంక గ్రామాల ప్రజలు వారి ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 1800–425–0101, 08632377118లో సంప్రదించాలన్నారు. కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. మూడో ప్రమాద హెచ్చరిక వస్తే ప్రభావితం చూపే మండలాలపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. కృష్ణా నదిలో వరద పరవళ్లు కృష్ణా నదితోపాటు ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డాŠయ్మ్లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం, ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గేట్లు ఎత్తేసి దిగువకు భారీ ఎత్తున వరదను విడుదుల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గురువారం నుంచి వరద ప్రవాహం పెరగనుంది. పశ్చిమ కనుమల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా శ్రీశైలంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 167.49 టీఎంసీలు అసవరం. నాగార్జునసాగర్‌కు దిగువన కురుస్తున్న వర్షాల వల్ల మూసీ నుంచి పులిచింతల్లోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతలకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి వరద కృష్ణా నది మీదుగా ప్రకాశం బ్యారేజీలోకి 27,746 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 23,746 క్యూసెక్కులను 30 గేట్లను అరడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఎందుకో?.. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు..
సీటీఆర్ (రాజమహేంద్రవరం): పాత్రికేయునిగా, కథా రచయితగా, సినీ రచయితగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న ముళ్లపూడి వెంకట రమణ ధవళేశ్వరంలో 1931 జూన్ 28న జన్మించారు.. తన జన్మదినం గురించే ఆయన స్వీయచరిత్రలో విసిరిన చమక్కులను ముందుగా చూద్దాం...‘జ్యేష్ఠా నక్షత్రం, వృశ్చికరాశిలో పుట్టాను. అంటే జూన్ 28 తెల్లవారు జామున, 1931లో. పీవీగారు కూడా జూన్ ఇరవైయ్యెనిమిదే, 1921లో. అంటే నా కన్నా పదేళ్ల చిన్న. ఈ మాటంటే ఆయన పకాపకా నవ్వారు. ఎందుకో?... రాజమండ్రి, ధవళేశ్వరాల మధ్యనున్న ఆల్కాట్ గార్డెన్స్ ఆసుపత్రిలో పుట్టాను. నేను పుట్టినప్పుడు దేవదుందుభులు మోగలేదు. అచ్చరలాడలేదు. గంధర్వులు పాడలేదు. పూలవాన కురవలేదు.’’ కష్టాలతో చెలిమి... పట్టుమని పదేళ్లు రానివయసులోనే ముళ్లపూడి తండ్రిని కోల్పోయారు. కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పొట్ట చేతపట్టుకుని మద్రాసు మహానగరానికి వెళ్లారు. ఒక మెట్టగదిలో ముళ్లపూడి, ఆయన సోదరుడు, తల్లి కాపురం. తల్లి విస్తర్లు కుట్టి, ప్రెస్సులో కంపోజింగ్ పనులు చేసి సంసార నౌకను నడిపారు. మధ్యలో 7,8 తరగతులు చదువుకోవడానికి ముళ్లపూడి తల్లి, సోదరుడితో కలసి రాజమండ్రి వచ్చి, ఇన్నీసుపేటలోని కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చదివారు. తిరిగి మద్రాసు చేరుకున్నారు. ఎస్సెల్సీ వరకు చదువు కొనసాగింది. పూలేకాదు, ముళ్ళూ... పాత్రికేయ జీవితంలో అందుకున్న సన్మానాలు, పొందిన బిరుదుల, మెళ్లో వేసిన శాలువాలూ, పూలదండలే కాదు, పొందిన అవమానాలు, అగచాట్లు, డబ్బు చిక్కులూ, ఛీత్కారాలు అన్నిటినీ ముళ్లపూడి తన స్వీయచరిత్రలో చెప్పుకొచ్చారు. పొలిటికల్ కాలమిస్టుగా పనిచేస్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు క్లబ్‌కు తీసుకువెళ్లి నా పేరు చెప్పి భోజనం లాగించెయ్. .అన్నారు..అప్పటికే ఆకలి ‘రుచి’పూర్తిగా తెలిసిన ముళ్లపూడి డైనింగ్ హాలులోకి వెళ్లి బేరర్‌కు చెప్పారు. ‘డ్రైవర్సుకీ, బోయెస్కీ బాక్ సైడ్ షెడ్లో ఇరికప్పా, పిన్నాలే పో’ అన్నాడు వాడు. సంజీవరెడ్డిగారికి ఏదో అనుమానం వచ్చి, హాలులోకి వచ్చి బేరర్‌ను చివాట్లు పెట్టారు. సినీ రిపోర్టరుగా ఉండగా గుచ్చుకున్న మరో ముల్లు.. సినీ స్టూడియోలో ఓ సారి ఎస్వీ రంగారావుగారు ఎదురయ్యారు. రమణని పిలిచి చెంప ఛెళ్లు మనిపించారు..‘‘చూడు రమణా! పత్రికకూ, నీ ఆఫీసుకూ ఓ స్టేటస్ ఉంది. స్టార్‌గా నాకో దర్జా ఉంది. నువ్విలా మాసిన గడ్డంతో, కాల్చిన చిలకడదుంపలా రావడం ఇన్సల్టు. మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండవచ్చును గదా’’ అన్నారు ఎస్వీఆర్.. ఇలాంటి అనుభవమే ఒకసారి అక్కినేనితో ఎదురయింది. ఆయన ఏదో కబుర్లు చెబుతూ...‘రమణగారూ. కొన్ని తత్వాలే అంత. ఫరెగ్జాంపుల్, మిమ్మల్ని మార్చడం మీ దేవుడి తరం కాదు, మీకు కోటి రూపాయలిచ్చినా ఈ మురికి బట్టలే వేసుకుంటారు..’ రమణ కోపంతో రిటార్ట్ ఇచ్చారు..‘‘సార్. ఇవి నలిగిన బట్టలు కావచ్చుకాని, మురికివి మాత్రం కావు. నేను ఒకసారి కట్టివిడిచిన బట్టను ఉతికి ఆరేస్తేకాని కట్టను. మీరు మీ ప్యాంట్లూ, సిల్కు చొక్కాలూ తొడిగి విప్పాక, చిలక్కొయ్యకేస్తారు. పదేసి రోజులు అదే వాడుతారు. నాకున్నది ఒకటే జత. కాని ప్రతిరాత్రి ఉతికారేసుకుంటాను. తువ్వాలు కట్టుకుని పడుకుంటాను. నాకు సిగ్గులేదు కాని, పొగరుంది...’ నిరుద్యోగ విజయాలు, పాత్రికేయునిగా ఉద్యోగం రెండేళ్ల ‘నిరుద్యోగ విజయాలు’ తరువాత నాటి ప్రముఖ ఆంధ్రపత్రికలో పాత్రికేయునిగా ఉద్యోగం ముళ్లపూడిని వరించింది. పాత్రికేయునిగా తనదైన ముద్ర వేస్తూనే, కథారచయితగా ముళ్లపూడి తన సత్తా చూపారు. రెండుజెళ్ల సీతలూ, సీగానపెసూనాంబలు, బుడుగులూ, అప్పారావులూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి. గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశంలాగా, పానుగంటి జంఘాల శాస్త్రిలాగా ముళ్లపూడి సృష్టించిన అప్పారావు పుస్తకాల పుటల నుంచి వచ్చి, తెలుగువారి జీవితంలోకి చొరబడ్డాడు. (చదవండి: వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ?) తాగింది కావేరి జలాలు, ఉపాసించింది గోదావరి జలాలు తుది వరకు మద్రాసులోనే జీవించినా, ఆయన ధ్యాస, యాస, శ్వాస గోదావరి చుట్టుతానే తిరిగింది. తన 14 ఏటా నుంచి నేస్తం అయిన బాపుతో కలసి నిర్మించిన సాక్షి, అందాలరాముడు, ముత్యాలముగ్గు, స్నేహం, బుద్ధిమంతుడు మొదలైన సినిమాలు ఈ గడ్డనే పురుడు పోసుకున్నాయి. ఈ మాండలికమే ఆ పాత్రలు మాట్లాడాయి.. ఆరుద్ర చెప్పినట్లు ‘‘హాస్యం ముళ్లపూడి వాడి, వేడి తాకిడికి ఈ డేరింది’’ అనడంలో అతిశయోక్తి లేదు. (చదవండి: పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే) -
Wheelchair Cricket: వైకల్యాన్ని జయించారు
కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలిరా.. అన్నట్టు హుషారుగా బ్యాట్ ఝుళిపించారు. పరుగుల వరద పారించారు. భళా అనిపించారు.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో దివ్యాంగుల క్రీడోత్సాహ దృశ్యాలివి. రాజమహేంద్రవరం రూరల్: చిన్న ఓటమి, అపజయానికే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దివ్యాంగ క్రీడాకారులు. అంగ వైకల్యంతో కుంగిపోకుండా, పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమకు ఇష్టమైన క్రికెట్లో సత్తా చాటుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా, సౌకర్యాలు తక్కువగా ఉన్నా వీల్ చైర్ క్రికెట్లో సాధన చేసి అనుకున్నది సాధించారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి చేరారు. త్వరలో ఐడబ్ల్యూపీఎల్ (ఇండియన్ వీల్‌చైర్ ప్రీమియర్ లీగ్)లో ఆడనున్నట్లు సంతోషంగా చెబుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు చెందిన వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు. సాధారణ క్రికెట్ మాదిరిగానే వీల్‌చైర్ క్రికెట్ కూడా ఉంటుంది. జట్టులో 11 మంది క్రీడాకారులు ఉంటారు. బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్, ఫీల్డింగ్ అంతా వీల్‌చైర్‌లో ఉంటూనే చేస్తారు. సాధారణ క్రికెటర్లు పరిగెత్తినట్టుగా మైదానంలో వీల్ చైర్లో తిరుగుతూ ఆడతారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో జరుగుతున్న వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బాలుర హైస్కూల్ క్రీడాప్రాంగణంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్లో తలపడుతున్నారు. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. ధృడ సంకల్పం ధృడ సంకల్పం ఉంటే ఎంత కష్టమైన పనిలోనైనా విజయం సాధించవచ్చని వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు నిరూపిస్తున్నారు. వీల్‌చైర్‌లోనే క్రికెట్ ఆడుతూ క్రీడలపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. బంతిని అందుకునే సమయంలో క్రీడాకారులు అదుపుతప్పి పడిపోయినట్లే ఒక్కోసారి వీరుకూడా వీల్‌చైర్ నుంచి కింద పడిపోతారు. అయినా మొక్కవోని దీక్షతో తమ సత్తా చాటుతున్నారు. సత్తా చాటుతాం జాతీయస్థాయి వీల్‌చైర్ క్రికెట్లో సైతం సత్తా చాటుతాం. రెండేళ్లుగా ముమ్మర సాధన చేస్తున్నాం. త్వరలో జరిగే ఇండియన్ వీల్‌చైర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పాల్గొంటున్నారు. పిడింగొయ్యి పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఖాళీ సమయంలో వీల్‌చైర్ క్రికెట్ సాధన చేస్తున్నాను. హైదరాబాద్‌లో జరిగిన టోర్నమెంట్లో ఆంధ్రా జట్టు రన్నర్‌గా నిలిచింది. – మానుపాటి ప్రవీణ్ కుమార్, ఏపీ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ క్రికెట్‌పై మక్కువ అంగవైకల్యం ఉన్నా ఏరోజూ కుంగిపోలేదు. ఆటపై ఉన్న మక్కువతో వీల్ చైర్ క్రికెట్లో సాధన చేశాం. పలువురు అందించిన ప్రోత్సాహంతో అనేక రాష్ట్రాలలో క్రికెట్ ఆడాను. బ్యాటింగ్‌లో మంచి స్కోర్‌ను సాధించగలిగాను. టీమ్ సమష్టి కృషితో ముంబైలో జరిగిన టోర్నమెంట్లో రన్నర్‌గా నిలిచాం. మరింత సాధన చేసి జాతీయ టీమ్‌లో స్థానం సంపాదించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను. – ఎస్కే సమీయుద్దీన్, తెలంగాణ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ప్రోత్సాహం బాగుంది వీల్‌చైర్ క్రికెట్లో రాణిస్తున్నాం. క్రికెట్ ఆడేందుకు మాకు వైకల్యం అడ్డుకాలేదు. ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణ తో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఒడిశాను ఉత్తమ జట్టుగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్రాలో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. వీల్‌చైర్ క్రికెట్‌కు వస్తున్న ప్రోత్సాహంతోనే ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి ఆడుతున్నాం. – అభయ్, ఒడిశా వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై హత్యాయత్నం
ధవళేశ్వరం(తూర్పుగోదావరి): గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొండపాటి శ్రీను(45)పై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల ఎదురుగా శ్రీను షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో నిర్మాణ పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు దుండగులు ఆ భవనంలోకి వెళ్లి శ్రీను కంట్లో కారం కొట్టి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడ పనిలో ఉన్న కూలీలు భయంతో బయటకు పరుగులు తీశారు. దాడి అనంతరం దుండగులు కారులో పరారయ్యారు. రక్తం మడుగులో ఉన్న దొండపాటి శ్రీనును రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని దక్షిణ మండలం డీఎస్పీ శ్రీలత సందర్శించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. శ్రీనుతో విభేదాలున్న వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వ్యక్తిగత కక్షలతోనే హత్యాయత్నం జరిగిందా రాజకీయ కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తన అన్నపై పడాల శ్రీను, మరికొంతమంది హత్యాయత్నం చేశారని శ్రీను సోదరుడు మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు.. ఎమ్మెల్యే గద్దె స్వగ్రామంలో టీడీపీకి ఆశాభంగం -
బ్యారేజీల్లో భారీగా ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీల్లో భారీగా పేరుకుపోయిన ఇసుకను వెలికితీయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరితగతిన చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 పైగా ఓపెన్ ర్యాంపుల్లో తవ్వకాలు జరపడం, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేయడం ద్వారా డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక విధానం–2019కి సవరణల ద్వారా పాలసీని మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చిన ప్రభుత్వం డ్రెడ్జింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కాటన్, ప్రకాశం బ్యారేజీల్లో ఇసుక పరిణామాన్ని అంచనా వేయడం కోసం బాతిమెట్రిక్ (నీటి లోతుల్ని, నేలల్ని పరీక్షించడం) సర్వే జరిపించింది. ఒక్కొక్క బ్యారేజీలో రెండేసి కోట్ల టన్నుల చొప్పున ఇసుక నిక్షేపాలున్నట్లు సర్వేలో తేలింది. నిబంధనల ప్రకారం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కూడా అంగీకారం తెలిపింది. అవరోధాలు తొలగిపోవడంతో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలని రాష్ట్ర గనుల శాఖ అధికారులు జల వనరుల శాఖను కోరారు. ఆ శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపించి ఎలా చేయాలనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గనుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండు శాఖల సమన్వయంతో డ్రెడ్జింగ్ రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీగా ఇసుక చేరి పేరుకుపోయింది. దీనిని జల వనరుల, గనుల శాఖలు సమన్వయంతో డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసి ప్రజల డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గుర్తించిన ఓపెన్ రీచ్‌లకు చట్టబద్ధమైన పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకునే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. -
గ్రామాలను చుట్టుముట్టిన వరద
-
ఉధృతంగా గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి వస్తున్న వరద నీటితో ఇంకా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరిన నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 48.50 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉందని, అప్పటి వరకూ వరద పరిస్థితి కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నుంచి 14,81,674 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ గోదావరి జలాలు 2,479 టీఎంసీలు కడలి పాలయ్యాయి. సోమవారం 128 టీఎంసీలు సముద్రంలో కలసిపోయాయి. ముమ్మరంగా సహాయక చర్యలు తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు, వీఆర్‌పురం మండలాలు వరద నీటిలో ఉన్నాయి. ఆ జిల్లాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. వీరవరంలో రెండు, చింతూరులో ఒకటి, రాజమహేంద్రవరంలో ఒకటి మొత్తం నాలుగు బృందాలతో ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది. రంపచోడవరం కేంద్రంగా 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, 90 మంది సిబ్బందితో కూడిన అగ్నిమాపక శాఖ విభాగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా పోతోంది. పోలవరం కాఫర్ డ్యామ్ కారణంగా దేవీపట్నం పరిసర గ్రామాలను వరద ముంచేసింది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. నీట మునిగిన దేవీపట్నం దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. చినరమణయ్యపేట–దేవీపట్నం, దండంగి–పురుషోత్తపట్నం రోడ్లు ముంపులో ఉండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి విగ్రహం నీట మునిగింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. బాధితులకు ప్రభుత్వ సిబ్బంది భోజనాలు పంపిణీ చేశారు. మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు, ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్ వాటర్‌తో చింతూరు–వీఆర్ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం దిగువున కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. వరద ఉధృతి పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉప నదులైన భీమా, తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.34 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 884.60 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 2.17 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సోమవారం రాత్రి సాగర్ రెండు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 587.90 అడుగుల్లో 306.04 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో 20 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 308.71 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. మంగళవారానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. స్థిరంగా వంశధార.. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 30,975 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ గొట్టా బ్యారేజీ నుంచి 53.31 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది. -
విద్యాసంస్థల భూములపై ప్రభుత్వం డేగ కన్ను
-
జనపథం - రాజమండ్రి రూరల్
-
అవినీతికి చిరునామా ధవళేశ్వరం పంచాయతీ
కమర్షియల్ కాంప్లెక్స్‌లకు సాధారణ పన్నులు పేదప్రజలపై భారీగా పన్నుల మోత ఇంటి నిర్మాణ అనుమతుల్లోనూ భారీ అవకతవకలు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి ధవళేశ్వరం : ధవళేశ్వరం పంచాయతీ అవినీతికి చిరునామాగా మారిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి బుధవారం ఆమె ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడి అవకతవకలపై కార్యదర్శి టి.శ్రీనివాసరావును నిలదీశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి డెత్ సర్టిఫికేట్ నుంచి ఇంటి పన్నుల వరకు ప్రతి దానిలోనూ అవినీతి పొంగిపొర్లుతోందని ఆరోపించారు. 48మంది పంచాయతీ కార్మికులను చూపిస్తున్నారని వీటిలోనూ భారీ అవకతవకలు జరిగాయన్నారు. లేనివారి పేరిట జీతాలు స్వాహా చేస్తున్నారని ఆమె విమర్శించారు. గ్రామంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆశ్రమాలు, అపార్ట్మెంట్లు, థియేటర్లు, కాలేజీలు, ఫ్యాక్టరీలకు సాధారణ పన్నులు వేసి ప్రజలపై భారాన్ని వేశారని జక్కంపూడి ఆరోపించారు. కమర్షియల్ పన్నులు పడాల్సిన చోట సాధారణ పన్నులు వేసేందుకు ఎవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఏడాదికి 500రూపాయలు కట్టే సామాన్య ప్రజలపై సుమారు 10రెట్లు భారం వేసి రూ.5వేలు వరకు పన్నులు పెంచేశారన్నారు. పంచాయతీ క్యాష్ బుక్‌లో ఫిబ్రవరి వరకే వివరాలు నమోదు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన నకళ్లకు కార్యాలయంలో ఉన్న వాటికి సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ట్రాన్స్ఫర్లు లేనప్పటికీ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. డెత్ సర్టిఫికేట్లకు సుమారు రూ.వెయ్యి వరకు గుంజుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి సొమ్మును ఇచ్చిన వారిని తీసుకువచ్చి చెప్పించారు. రూ.6వేలు కుళాయి పన్ను వసూలు చేస్తూ రూ.5వేలకు మాత్రమే రశీదు ఇస్తున్నారని ఆరోపించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ కోసం వచ్చిన వారి వద్ద నుంచి కూడా భారీగా సొమ్మును గుంజుతున్నారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనని చెప్పుకునే గోరంట్ల నియోజకవర్గంలోనే భారీ అవినీతి చోటు చేసుకుంటోందన్నారు. ఎన్నికలకు ముందు మూడు నెలల్లో రూరల్ గ్రామాలకు ఎన్నికలు జరిపిస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తోక్కారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని జక్కంపూడి విమర్శించారు. జన్మభూమి కమిటీల అవినీతితో వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ బిల్డింగ్ ప్లాన్లలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుగుణానగర్లో 14శాతం కట్టించుకోవాల్సి ఉన్నప్పటికీ కట్టించుకోకుండా అనుమతులు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ధవళేశ్వరం పంచాయతీలో చోటు చేసుకున్న భారీ అవినీతి అక్రమాలపై గురువారం కమిషనర్, సబ్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు, గోలి దేవకుమార్, షట్టర్ బాషా, దాసరి శివ, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, చంటి, ఏజీఆర్ నాయుడు, గునిపె అశోక్, పందిళ్ల భానుప్రసాద్, కేతా సాయి, పుట్టా పరేష్‌నాథ్, సత్యం వెంకటరమణ, బర్రి కామేశ్వరరావు, ప్రశాంత్‌కుమార్, మిరప రమేష్, ఏలీషా జగన్, కపూర్, యర్రంశెట్టి శ్రీరామ్, ఆకుల సూర్యప్రకాష్, తోలేటి రాజా, బలరామ్, మోహన్‌బాబు, పిల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరికి పొంచి వరద ముప్పు...?
–ఉప్పొంగుతున్న ఉపనదులు –ఎగువ ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేత –గోదావరిలో భారీగా చేరుతున్న వరదనీరు కొవ్వూరు: గోదావరికి వరద ముంపు పొంచి ఉంది.ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలోకి భారీగా వరదనీరోచ్చి చేరుతుంది.ఉప నదులైన మంజీరా,ప్రాణహిత, ఇంద్రావతి,శబరి, సీలేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతుంది.ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు 8 లక్షల నుంచి పదిలక్షల క్యూసెక్కుల వరద దిగువకి చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అంచనాలు వేస్తుంది. వీటికి తోడు రానున్న రెండు రోజుల్లో పరివాహాక ప్రాంతంలో విస్తారం గా వర్షాలు కురిస్తే ఈ వరద మరింత పెరిగే సూచనలున్నాయని చెబు తున్నారు.ఎగువన భద్రచలంలో ఉదయం 21 అడుగులున్న నీటిమట్టం మధ్యహ్నాం నుంచి క్రమంగా క్రమంగా పెరుగుతుంది. సాయంత్రం ఐదు గంటలకు 27.1 అడుగులకు చేరింది.ఈ ప్రభావం తో మంగళ వారం ఉదయం నుంచి ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుదల అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి వరద త్రీవత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువున వరద ఉధతిని దష్టిలో ఉంచుకుని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.భద్రచలంలో మంగళవారం మధ్యాహ్నానికి మొదటి ప్రమాదహెచ్చరిక స్ధాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.ధవళేశ్వరం ఆనకట్టకి ఉన్న 175 గేట్లును 0.70 మీటర్లు ఎత్తులేపి 2,13,327 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ఎగువున పెరుగుతున్న నీటిమట్టం: ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కాలేశ్వరం 9.73 మీటర్లు, పేరూరులో 11.24, దమ్ముగూడెంలో 8.47, కూనవరంలో 8.20, కుంటలో4.66, పోలవరంలో 7.23 మీటర్లు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 12.90 అడుగులు చోప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. నీటివిడుదల కుదింపు: జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకి నీటి సరఫరా కుదించారు.వెయ్యి క్యూసెక్కుల చోప్పున నీరు విడుదల చేస్తున్నారు. దీనిలో ఏలూరు కాలువకి 379, నరసాపురం కాలువకి 304,అత్తిలి కాలువకి 208 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.జిల్లాలో వర్షాల నేపధ్యంలో ఉండికాలువ, జీ అండ్ వీ కాలువలకు నీటì సరఫరా నిలిపివేశారు. -
గోదావరిలో తగ్గని వరద ఉధృతి
కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 10.40 అడుగులకు చేరింది. ఆనకట్ట నుంచి 4,01,182 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో డెల్టా కాలువలకు నీటి విడుదల కొద్దిమేర పెంచారు. శుక్రవారం 8,400 క్యూసెక్కులు విడిచిపెట్టిన అధికారులు శనివారం సాయంత్రం నుంచి 10,300 క్యూసెక్కులు వదులుతున్నారు. పశ్చిమ డెల్టా కాలువకు 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శుక్రవారం కంటే వెయ్యి క్యూసెక్కుల నీటిని పెంచి విడుదల చేస్తున్నారు -
ఏం చర్యలు తీసుకుంటున్నారు?
ధవళేశ్వరం లాంటి ప్రమాదాల నివారణపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా, ధవళేశ్వరం వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వంటివి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. గత నెల 13న ధవళేశ్వరం ఆనకట్టపై జరిగిన ఘోర ప్రమాదంలో 22 మంది చనిపోయారు. ఈ ఘటన కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ స్థానిక న్యాయవాది జి.అచ్యుతరావు హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను కోర్టు సుమోటోగా స్వీకరించింది. -
వ్యాను ఢీకొని పుష్కర భక్తురాలు మృతి
ధవళేశ్వరం (తూర్పుగోదావరి) : పుష్కర స్నానం చేసి రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలు వ్యాను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రాంతానికి చెందిన గ్రంథి మాణిక్యాంబ(60) గురువారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో పుష్కర స్నానం చేసి అన్నదాన సత్రం వైపు వెళ్లేందుకు రోడ్డు దాడుతుండగా వేగంగా వచ్చిన వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు డ్రైవర్‌ను, వ్యానును అదుపులోకి తీసుకున్నారు. -
పిండప్రదానం చేస్తూ వ్యక్తి మృతి
ధవళేశ్వరం (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఉన్న గాయత్రి పుష్కరఘాట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఓ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ అయిన విజయవాడకు చెందిన మహంకాళి సుబ్బయ్య(65) గురువారం పుష్కరస్నానం చేసేందుకు గాయత్రిఘాట్కు చేరుకున్నారు. కాగా, పిండ ప్రదానం చేసే సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇవ్వగా, ఆ వాహనం అక్కడికి చేరుకునేలోగానే సుబ్బయ్య తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జగన్ హెచ్చరికతో బాధితులకు పరిహారం
విశాఖపట్నం: ‘దవళేశ్వరం వద్ద ప్రమాదంలో 22మంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగి 18 రోజులు అయినా బాధితులకు పరిహారం ఇవ్వరా?... ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా... నాలుగు రోజుల్లో పరిహారం ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అల్టిమేటం. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన ప్రభుత్వానికి ఈమేరకు హెచ్చరించారు. వై.ఎస్.జగన్ హెచ్చరికతో ప్రభుత్వ దిగివచ్చింది. రూ.2లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించి ఇన్నాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.2లక్షల పరిహారాన్ని శనివారం పంపిణీ చేయాలని నిర్ణయించింది. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శనివారం మధ్యాహ్నం బాధిత కుటుంబాలకు ఈ మేరకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ‘వై.ఎస్.జగన్ రాకతోనే ప్రభుత్వం దిగివచ్చింది... ఇంతకాలం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడైనా పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. జగన్ రాకపోయి ఉంటే మాకు పరిహారం దక్కేదే కాదు. ఆయన వచ్చి ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించారు ’ అని బాధిత కుటుంబాల సభ్యులు చెబుతున్నారు.