గోదావరికి పొంచి వరద ముప్పు...? | its chance to fleds godavari | Sakshi
Sakshi News home page

గోదావరికి పొంచి వరద ముప్పు...?

Published Mon, Sep 26 2016 8:59 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

గోదావరికి పొంచి  వరద ముప్పు...?

గోదావరికి పొంచి వరద ముప్పు...?

–ఉప్పొంగుతున్న ఉపనదులు 
–ఎగువ ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేత
–గోదావరిలో భారీగా చేరుతున్న వరదనీరు
కొవ్వూరు:
గోదావరికి వరద ముంపు పొంచి ఉంది.ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలోకి భారీగా వరదనీరోచ్చి చేరుతుంది.ఉప నదులైన మంజీరా,ప్రాణహిత, ఇంద్రావతి,శబరి, సీలేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతుంది.ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు 8 లక్షల నుంచి పదిలక్షల క్యూసెక్కుల వరద దిగువకి చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అంచనాలు వేస్తుంది. వీటికి తోడు రానున్న రెండు రోజుల్లో  పరివాహాక ప్రాంతంలో విస్తారం గా వర్షాలు కురిస్తే ఈ వరద మరింత పెరిగే సూచనలున్నాయని చెబు తున్నారు.ఎగువన భద్రచలంలో ఉదయం 21 అడుగులున్న నీటిమట్టం మధ్యహ్నాం నుంచి క్రమంగా క్రమంగా పెరుగుతుంది. సాయంత్రం ఐదు గంటలకు 27.1 అడుగులకు చేరింది.ఈ ప్రభావం తో మంగళ వారం ఉదయం నుంచి ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుదల అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  బుధవారం సాయంత్రానికి వరద త్రీవత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువున వరద ఉధతిని దష్టిలో ఉంచుకుని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.భద్రచలంలో మంగళవారం మధ్యాహ్నానికి మొదటి ప్రమాదహెచ్చరిక స్ధాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.ధవళేశ్వరం ఆనకట్టకి ఉన్న 175 గేట్లును 0.70 మీటర్లు ఎత్తులేపి 2,13,327 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు.
ఎగువున పెరుగుతున్న నీటిమట్టం:
ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కాలేశ్వరం 9.73 మీటర్లు, పేరూరులో 11.24, దమ్ముగూడెంలో 8.47, కూనవరంలో 8.20, కుంటలో4.66, పోలవరంలో 7.23 మీటర్లు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 12.90 అడుగులు చోప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి.
నీటివిడుదల కుదింపు:
జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకి నీటి సరఫరా కుదించారు.వెయ్యి క్యూసెక్కుల చోప్పున నీరు విడుదల చేస్తున్నారు. దీనిలో ఏలూరు కాలువకి 379, నరసాపురం కాలువకి 304,అత్తిలి కాలువకి 208 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.జిల్లాలో వర్షాల నేపధ్యంలో ఉండికాలువ, జీ అండ్‌ వీ కాలువలకు నీటì  సరఫరా నిలిపివేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement