ధవళేశ్వరం లాంటి ప్రమాదాల నివారణపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా, ధవళేశ్వరం వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వంటివి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
గత నెల 13న ధవళేశ్వరం ఆనకట్టపై జరిగిన ఘోర ప్రమాదంలో 22 మంది చనిపోయారు. ఈ ఘటన కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ స్థానిక న్యాయవాది జి.అచ్యుతరావు హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను కోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఏం చర్యలు తీసుకుంటున్నారు?
Published Tue, Jul 21 2015 2:49 AM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
Advertisement