మృతుల కుటుంబాలకు జగన్ ఎక్స్ గ్రేషియా | YS Jagan condolence to boat accident effected families | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 4 2014 1:58 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

ధవళేశ్వరం పడవ బోల్తా దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా పార్టీ సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ రాజమండ్రి వచ్చారు. ఈ సందర్బంగా రాజమండ్రిలో ధవళేశ్వరం పడవ బోల్తా పడి మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మధురపూడి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరో రెండు బాధిత కుటుంబాలను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. పార్టీ తరఫున ఆయా కుటుంబాలకు కూడా రూ. లక్ష చొప్పును ఆర్థిక సాయం అందించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement