'రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి' | AP govt should give Rs 5 laksh ex-gratia for familes | Sakshi
Sakshi News home page

'రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి'

Published Sat, Jun 13 2015 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

AP govt should give Rs 5 laksh ex-gratia for familes

విశాఖ/తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిందిగా వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శనివారం వారు మీడియాతో మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని  వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పారు. ఈ ప్రమాద ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడ్డారు.

కాగా,  తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement