తన నీటితో ప్రాణాలను నిలిపే గోదారమ్మ ఒడిలో ఘోరం జరిగింది. పసిడిపంటలకు దోహదపడే ఆనకట్టపై ప్రాణాల్ని హరించే మృత్యుదేవత పంట పండింది. బిడ్డను బలి తీసుకుని తల్లిపై దయజూపితే; మనుమలను కబళించి తాతను కరుణిస్తే; భర్తను కాటేసి భార్యను విడిచిపెడితే.. ఆ శోకంతో వారు తనకు పెట్టే శాపనార్థాలు తగులుతాయనుకుందో, ఏమో.. ఆ మృత్యుదేవత అలాంటి అవకాశమే లేకుండా కుటుంబాలకు కుటుంబాలనే నిర్మూలించింది. ఐదు పదులు దాటిన ముదురాకు నుంచి రెండు వసంతాల చిగురాకు వరకూ నిర్దాక్షిణ్యంగా రాల్చేసింది. కష్టం, సుఖం కలసి పంచుకున్న; ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకున్న; ఒకరి కిలకిల నవ్వులో మరొకరు శృతి కలిపిన 22 మందిని నిస్సంకోచంగా ఊచకోత కోసింది. అరుున వారందరినీ పోగొట్టుకున్న ఓ బాలుడు..మృత్యువును గెలిచినా ఓడినవాడిలాగే మిగిలాడు.
రాజమండ్రి/ రాజమండ్రి రూరల్ : వేదంలా ఘోషించే గోదావరి ఒడిలో మరణ మృదంగం మార్మోగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌పై మృత్యువు కరకు గజ్జెలతో కరాళనృత్యం చేసింది. అలసి సొలసి, వాలిన కనురెప్పో లేక అతి వేగమో మృత్యువు ఆకలి తీర్చడానికి ప్రాణాలనే విందుగా మార్చారుు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌పై స్కవర్ల స్లూయిజ్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన దుర్ఘటన జిల్లాలోనే అత్యంత విషాదకర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన సమీప బంధువుల కుటుంబాలు తీర్థయూత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారు ప్రయూణిస్తున్న తుఫాన్ వ్యాన్ బ్యారేజ్ పైనుంచి కిందకు పడడంతో అందులోని 23 మందిలో ఒక బాలుడు మినహా అంతా మృత్యువాత పడ్డారు. త్వరలో గోదావరి మాత మహాపర్వంగా పుష్కరాలు జరగనుండగా ఆ అమ్మ ఒడిలోనే సంభవించిన ఈ విషాదం జిల్లావాసులను కలచివేసింది. ప్రాణాలను బలిగొనే ప్రమాదాలు జిల్లాకు కొత్తకాకపోరుునా.. ఓ చిన్నవాహనంలో ప్రయూణిస్తున్న వారందరినీ ఇలా మృత్యువు కబళించిన నిజం వారి ఆత్మీయులకే కాదు.. ఇతరులకూ జీర్ణం కావడం లేదు. పగటిపూట ఈ ప్రమాదం జరిగి ఉంటే కొందరైనా బతికే వారని నిట్టూరుస్తున్నారు.
జిల్లాలో మృత్యువు ఇంతగా తాండవమాడిన పెను ప్రమాదాల్లో ఇది రెండవదని జిల్లా వాసులు గుర్తు చేసుకుంటున్నారు. 1996లో రోడ్డు కం రైలు వంతెన నుంచి ఆర్టీసీ బస్సు గోదావరిలో పడడంతో 42 మంది మృత్యువాత పడ్డారు. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 16 మంది మృత్యువాతపడ్డారు. 19 ఏళ్ల తరువాత రోడ్డు కం రైలు వంతెన సమీపంలో ధవళేశ్వరం బ్యారేజ్‌పై జరిగిన దుర్ఘటనలో మృత్యువాత పడ్డ 22 మందిలో ఒకే కుటుంబానికి చెందిన తాత నుంచి మనుమల వరకూ 14 మంది ఉండగా, మిగిలిన 8 మంది కూడా వారికి అత్యంత సమీప బంధువులే.
ఆ మృత్యుంజయుడిని ఊరడించేదెవరు?
22 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రమాదంలో ఈగల కిరణ్‌సాయి అనే పదేళ్ల బాలుడొక్కడే మృత్యువును జరుుంచాడు. అరుుతే అతడి తల్లిదండ్రులు, సోదరి, నానమ్మలతో పాటు దగ్గరి బంధువులంతా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయూరు. దీంతో అతడిని ఊరడించే వారు, కన్నీరు తుడిచే వారు లేకుండా పోయూరు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ‘అమ్మా.. నాన్నా కావాలి’ అని కంటికి కడివెడుగా రోదిస్తున్న సారుుని చూస్తుంటే అందరికీ కడుపు తరుక్కుపోరుుంది. కాగా దుర్ఘటన గురించి తెలిసి మృతుల బంధువులు, గ్రామస్తులు ఇక్కడికి చేరుకునే వరకు మృతులను గుర్తించేవారే లేకపోయూరు. పంచనామా కోసం మృతదేహాలకు నంబర్లు ఇవ్వడం అందరి గుండెలనూ కలుక్కుమనిపించింది. అచ్యుతాపురం నుంచి వచ్చిన బంధువులు విగతజీవులైన తమవారిని చూసి గొల్లుమన్నారు. ‘యూత్రలకని బయల్దేరిన వారికి అదే అంతిమయూత్ర అరుుంది’ అని రోదించారు. ‘రాత్రి 12 గంటలకు ఫోన్ చేశారు. పొద్దునే ఇంటికి వచ్చేస్తామన్నారు. టీవీలో స్క్రోలింగ్ చూసి అనుమానంతో ఫోన్ చేస్తే పోరుుంది మీ వాళ్లేనని చెప్పారు’ అని మృతుల్లో ఒకరైన అప్పారావు మేనల్లుడు చిన్నా బావురుమన్నాడు.
గోదారమ్మ ఒడిలో..విషాదపు వరద
Published Sun, Jun 14 2015 1:47 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement