రాష్ర్టంలోని ప్రాజెక్టులకు జలకళ
సాక్షి నెట్‌వర్క్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ర్టంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం నుంచి దిగువప్రాంతాలకు ఆదివారం 3,38,809 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 189.8936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 880.30 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర డ్యాం 25 క్రస్ట్‌గేట్లను మూడున్నర అడుగులు, మిగతా 8క్రస్ట్‌గేట్లను అడుగు మేర ఎత్తి 1,49,646 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం్చలోని నీటిమట్టం 1631.67 అడుగులుగా ఉంది. 1,66,739 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 21,18,170 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారంరాత్రి జూరాల ప్రాజెక్టుకు 1.52 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా, అర్ధరాత్రి నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా పెరిగినట్లు పేర్కొన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 518.450 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.