విభజనలో సమన్యాయమేదీ?: భూమన | Where is Equal Justice in Bifurcation: Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

విభజనలో సమన్యాయమేదీ?: భూమన

Published Wed, Aug 7 2013 8:00 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

విభజనలో సమన్యాయమేదీ?: భూమన - Sakshi

విభజనలో సమన్యాయమేదీ?: భూమన

రాష్ట్ర విభజన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాలకు సమ న్యాయం పాటించడంలో విఫలమైందని తిరుపతి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం తిరుపతిలో 1500 మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. దాదాపు 50 కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీ తిరుపతి పురవీధుల గుండా వెళ్లింది. ర్యాలీకి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సోనియా గాంధీ రెండుగా చీల్చి వేశారన్నారు. సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసినట్లు ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు ఊతమిస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. విభజన జరిగిన వెంటనే ముందుగా స్పందించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. తరువాత రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూసిన టీడీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement