కాంగ్రెస్‌ కనుసన్నల్లో టీడీపీ: భూమన | Bhumana Karunakar Reddy alleges collusion between Congress, TDP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కనుసన్నల్లో టీడీపీ: భూమన

Published Mon, Nov 4 2013 2:32 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

కాంగ్రెస్‌ కనుసన్నల్లో టీడీపీ: భూమన - Sakshi

కాంగ్రెస్‌ కనుసన్నల్లో టీడీపీ: భూమన

తిరుపతి: చంద్రబాబు నాయుడు విభజన ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనపై స్పష్టమైన అభిప్రాయం చెప్పకుండా సీమాంధ్రులకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ కనుసన్నల్లోనే టీడీపీ పనిచేస్తోందని ఆరోపించారు.

సమైక్య ప్రకటన వచ్చే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని భూమన అంతకుముందు ఆరోపించారు. జగన్ పేరు వింటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు  వణుకుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement