ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన | YSR Congress party Motorcycle rally support for Samaikhyandhra | Sakshi
Sakshi News home page

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన

Published Wed, Aug 7 2013 11:42 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర:  భూమన - Sakshi

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన

తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతోంది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నీచ రాజకీయాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు విశ్వసిస్తున్నారని భూమన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన హైలెవల్ కమిటీపై ప్రజలకు నమ్మకం లేదని భూమన వ్యాఖ్యానించారు. అదంతా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన విమర్శించారు.

మరోవైపు సమైక్యాంధ్ర ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఏలూరులో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ వరకు ఆటోమోబైల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement