శ్రీకాకుళం : రాష్ట్ర విభజనను నిరసిస్తూ గురువారం కూడా జిల్లావ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రను కోరుతూ పలాసలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మరోవైపు వెటర్నరీ, వ్యవసాయ, విద్యుత్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు.
కాగా సీమాంధ్ర జిల్లాల్లో విభజన సెగలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరాయి.
తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా పత్తిపాడు మండలం వానపల్లిలో సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కాగా విభజనను నిరసిస్తూ కోరుకొండ మండలం నర్సాపురంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు.
వైఎస్‌ఆర్ జిల్లాలో సమైక్యాంద్రకు మద్దతుగా ఎర్రగుంట్లలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే నెల్లూరుజిల్లా కావలిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. డిపోల నుంచి బస్సులు కదలటం లేదు.
పలాసలో జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు
Published Thu, Aug 8 2013 9:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement
Advertisement