PALASA
-
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది. -
టీడీపీ కార్యకర్త అమానుషం.. దివ్యాంగురాలిపై అఘాయిత్యం
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ కార్యకర్త దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెను బెదిరించి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పలాస మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ దివ్యాంగురాలి(20)పై కన్నేసిన భాస్కరరావు ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉండగా.. పెదంచలలో తన నానమ్మతో కలిసి ఉంటోంది ఆమె.ఇక, తన మనుమరాలికి న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు భాస్కరరావు వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు.. కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ..‘అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా నా మనవరాలు గర్భవతి అని తెలిసింది. వరిశి భాస్కరరావు నా మనవరాల్ని గర్భవతిని చేశాడు. మాకు అన్యాయం జరిగింది.. న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
నాలుగు నెలల్లోనే బాబు సర్కార్ ఘోర వైఫల్యం: వైఎస్సార్సీపీ
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో లైంగికదాడికి గురైన బాలికల కుటుంబాన్ని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ. 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.అనంతరం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. పలాసలో బాలికలపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. బాధిత కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయన ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి చెక్కు అందజేశామన్నారు.‘‘నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నాలుగు నెలల్లో భారీగా పెంచారు. చంద్రబాబుకు అబద్దాల చెప్పడం ఎప్పుడూ అలవాటే. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్ హయాంలోనే వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ నిర్మించిన, ఇక్కడ ప్రజలకు 700 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’’ అని ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. -
కాశీబుగ్గ అత్యాచార ఘటన నిందితులకు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు
-
శ్రీవారి చెంతకు పలాస జీడిపప్పు
-
కిడ్నీ పరిశోధన కేంద్రంపై దుశ్చర్య
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రంపై టీడీపీ కార్యకర్తలు శుక్రవారం దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ కేంద్రంపై పేరులో ఉన్న వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించారు. శిలాఫలకాలను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను తొలగించారు.ఆస్పత్రి రెండు విభాగాలుగా ఉన్న భవనాలపై ఏర్పాటు చేసిన వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్ అనే తెలుగు, ఇంగ్లిష్ అక్షరాల్లో వైఎస్సార్ అనే అక్షరాలను తీసేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్దాన ప్రాంతంలో ఉన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. అన్ని రకాల పరీక్షల నుంచి డయాలసిస్, అరుదైన ఆపరేషన్లకు ఈ ఆస్పత్రి నెలవుగా మారింది. ఉచితంగా స్కానింగ్ చేసి మందులు ఇస్తున్నారు. ఈ చర్యను మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తీవ్రంగా ఖండించారు. -
ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టాం: సీఎం జగన్
-
ఉద్దానం సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాం: సీఎం జగన్
-
ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు: సీఎం జగన్
-
మంత్రి సీదిరి అప్పలరాజు మాస్ స్పీచ్..దద్దరిల్లిన పలాస
-
సీఎం జగన్ ని చూడగానే మార్మోగిన సభ ప్రాంగణం
-
పవన్ కన్నా బర్రెలక్క ఎంతో బెటర్: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్-200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్.. గురువారం ప్రారంభించారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. బాబు ఇంకో పార్ట్నర్. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు. ‘‘విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే చంద్రబాబు, అనుంగు శిష్యులు ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు. ‘‘ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం’’ అని సీఎం పేర్కొన్నాం. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నామని సీఎం అన్నారు. పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడికి ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి ఎలా లాగాలి, ఎలా బతుకులు మార్చాలని అనే తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇదీ అని గమనించాలి. సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే లెక్కే లేదు. తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే లేదు. కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్లీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. మరి సొంత నియోజకవర్గం, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది? ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది ఆలోచన చేయాలి. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం గానీ, మమకారం గానీ చూపించని ఈ చంద్రబాబు. 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకొనే దానికి ఒక్క మంచిపనీ లేదు. తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకొనే దానికి ఒక్క స్కీమ్ కూడా లేని పరిస్థితి. తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడని, మాట కోసం ఎందాకైనా పోయాడని, నిలబెట్టుకున్నాడని కనీసం చెప్పుకొనేందుకు ఒక్క విషయం అయినా లేదు. ఇలాంటాయన ఎన్నికలు వచ్చే సరికే పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్దమనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిగా యాక్టర్‌ను పెట్టుకొని డ్రామాలు ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరంటే, ఎలాంటి వాడు అంటే.. మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటాడు. తన దురదృష్టం అంటాడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్. ఈ పెద్ద మనిషి ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెంలగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, ఈ మ్యారేజీ స్టార్. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లు ఎన్నో తెలుసా? చివరికి ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలేదు. ఈ పెద్దమనిషికి చంద్రబాబు ప్రయోజనవర్గం ఉంది తప్ప, ఆంధ్ర రాష్ట్రంపై ప్రేమే లేదు. సొంత నియోజకవర్గం లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య ఎన్నికల్లో కలిసి వచ్చారు. 2014-2019 మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచి నీరు ఇవ్వడం ఎలా అని కనీసం ఆలోచన అయినా చేశారా అంటే అదీ లేదు. కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్, ఆస్పత్రి నిర్మించారా అంటే అది కూడా లేదు. వీళ్ల బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచీ లేదు. ప్రతి పక్షంలో ఉండి కూడా వాళ్లు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాం అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి అడ్డుకుంటున్న దుర్మార్గం వీరిది. ఉత్తరాంధ్రలో ఒక బిల్డింగ్ కట్టినా వీళ్లు ఏడుస్తాడు. మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటే ఏడుస్తారు. ఈ ఏడుపంతా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా తయారయ్యారు. ఓ చంద్రబాబు ఓ రామోజీరావు, దత్తపుత్రుడు, రాధాకృష్ణ, టీవీ5 వీళ్లంతా ఒక దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తుంటారు. వీళ్లలో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లంతా ఉండేది హైదరాబాద్‌లో.. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్లు నిర్ణయిస్తామని మనకు చెబుతారు. దానికి తగ్గట్టుగా ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్, చంద్రబాబు, దత్తపుత్రుడు.. ఇవే కథలు.. రోజూ ఈ డ్రామాలు. వీళ్లలో ఏ ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలట. నేనుచెప్పిన విషయాలు ఆలోచన చేయాలి. అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు, వారు ఏనాడూ ఇవ్వని విధంగా ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన వెయ్యి పించన్ మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3 వేలు చేస్తుంటే ఏడుపు. వారి హయాంలో విచ్చలవిడి దోపిడీని అరికట్టి, జన్మభూమి కమిటీలు రద్దు చేసి ప్రతి గ్రామంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేద వాడికీ తోడుగా ఉండి నడిపిస్తుంటే ఏడుపు. వారు ఇవ్వని విధంగా, ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2.10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు. వారి ఐదేళ్ల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆర్బీకే వ్యవస్థ, పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ.. ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ అందిస్తున్నందుకు వీరంతా ఏడుపు. అక్కచెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని నిలువునా ముంచేసిన ఈ బాబుకు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న అమ్మ ఒడి.. ఇవన్నీ కూడా పార్టీలు కూడా చూడకుండా మీ బిడ్డకు గతంలో ఓటు వేశారా లేదా అన్నది చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేయాలని అడుగులు వేస్తుంటే ఏడుపు. ఐదేళ్లు వాళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం పేద వాడికి ఒక సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఉండాలి, లక్షాధికారులు కావాలని తపన పడుతూ 31 లక్షల ఇంటి పట్టాలు వారి చేతిలో పెడితే ఏడుపు. ఏకంగా 22 లక్షల ఇళ్లు మీ బిడ్డ కట్టిస్తుంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి, పేద పిల్లలు వెళ్తున్న గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద, నాడు-నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడుల్లో పెడితే ఏడుపు. 6వ తరగతి, ఆ పై తరగతుల పిల్లలకు, ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ తెస్తే ఏడుపు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు హక్కులేని భూములకు, అసైన్డ్ భూముల మీద పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 2014-19 మధ్య వాళ్లు అధికారంలో ఉన్నారు. మేనిఫెస్టోలో 10 శాతం వాగ్గానాలు కూడా అమలు చేయని వీరు.. మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను తెచ్చి ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేస్తే ఏడుపు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబు. బటన్ ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబు. మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.40 లక్షల కోట్లు మీ బిడ్డ హయాంలో నేరుగా బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నా ఏడుపే ఏడుపు. మరో 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీగా పేద వారి కోసం ఇస్తున్నా కూడా ఏడుపే ఏడుపు. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో మూడు నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని తెలియజేస్తున్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, పేదల వ్యతిరేకులంతా, పెత్తందార్లంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా తీర్పు ఇవ్వాలని మిమ్మల్నందరినీ సవినయంగా కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, మోసాలు ఎక్కువ అవుతాయి. ఎవరు మాట ఇచ్చారు. మాట మీద నిలబడింది ఎవరు అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ బిడ్డ ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్ప గలుగుతున్నాడు. మీ ఇంటికి, మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే సైనికులుగా మీ బిడ్డకు నిలబడండి అని అడుగుతున్నాడు. ఇలా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా? రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు, ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెబితే గానీ నమ్మరు అని చెప్పి.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని చెబుతారు. మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసేవాళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండని కోరుతున్నా. మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకు ఉంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆశీర్వదించండి. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. -
Live: వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ ప్రారంభించనున్న డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్
-
పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభానికి 12న సీఎం జగన్
కాశీబుగ్గ: పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభించేందుకు డిసెంబర్ 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలాస రానున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను బుధవారం ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి సందర్శించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజాసంఘాలు, వామపక్షాలతో కలిసి కిడ్నీ బాధితుల పక్షాన గళం వినిపించామని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రాలు కార్యరూపం దాల్చాయని చెప్పారు. రూ.700 కోట్లతో మంచినీటి పథకం సైతం నిర్మించినట్టు తెలిపారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం జగన్ డిసెంబర్ 12న పలాస వస్తున్నారని చెప్పారు. అన్నిరకాల వైద్యసేవలూ పొందేలా.. పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ ఆస్పత్రి కేవలం కిడ్నీ వ్యాధిగ్రస్తులకేననే అపోహ ఉందని మంత్రి అప్పలరాజు అన్నారు. కానీ.. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, న్యూరాలజీ, పల్మనాలజీ, ఆడియోగ్రఫీ, ఐసీయూ వంటి అత్యవసర వైద్యసేవలు 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అత్యవసర వైద్యం అవసరమున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందవచ్చన్నారు. డయాలసిస్ యూనిట్లో 40 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు షిఫ్ట్‌లలో రోజుకు 120 నుంచి 200 మందికి రోజుకు డయాలసిస్ చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఆయన వెంట మహేంద్ర రైతు కూలీ సంఘం, ఉద్దాన రైతు కూలీ సంఘం, జీడి రైతు సంఘం, యూటీఎఫ్, యూవీవీ సేవా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, పలాస యూత్ అసోసియేషన్, శ్రీవివేకానంద సేవాసమితి, గ్రీన్ ఆర్మీ అసోసియేషన్, సీపీఐ ప్రతినిధులు ఉన్నారు. -
మానవతా దృక్పథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది: మంత్రి అప్పలరాజు
-
‘సీఎం జగన్‌ది ఆదర్శవంతమైన పాలన’
సాక్షి, పలాస(శ్రీకాకుళం జిల్లా): వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎనిమిదో రోజు ఆదివారం పలాసలో నిర్వహించిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు ప్రజలు భారీ స్థాయిలో సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా పలాసలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. జనం భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, ఎంఎల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇన్నాళ్ళూ ఉద్దానం ప్రాంతం వెనుక బడింది. జగన్ సీఎం అయ్యాక రూ. 75 కోట్ల తో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టాము. 7వందల కోట్ల రూపాయలతో వంశధార తాగునీరు తెచ్చాము. వలసల నివారణకు మూల పేట పోర్ట్ నిర్మాణం చేపట్టాం. వంశధార ఎడమ కాలవకి నీరు రావడం లేదు. అందుకే ఈ ప్రాంతానికి ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ గతంలో చిన్న చిన్న సమస్యలకు జనం ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు ప్రజా సమస్యలు మేమే పరిష్కరిస్తున్నాం. కిడ్నీ రోగుల సమస్యలు తీర్చడానికి వంశధార ప్రాజెక్ట్ తాగు నీరు అందించాలని అనుకుని ఈ ప్రభుత్వం కాలం లోనే అనుకుని, ఈ ప్రభుత్వకాలంలోనే పూర్తి చేస్తాం. గ్రామ స్థాయిలో అవినీతి తగ్గించాము. ప్రధాన మంత్రులు సైతం అవినీతిని ఆపలేకపోయారు. సీఎం జగన్ అవినీతిని రూపు మార్చగలిగారు. పరిపాలన లో గొప్ప గొప్ప సంస్కరణలు తెచ్చాము. జగన్ అమలు చేస్తున్న పథకాల వంటి వాటి పై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెంచాలని జగన్ ఆలోచన. మన రాష్ట్రం లో తీసుకొచ్చిన మార్పులు ఓట్ల కోసం కాదు. పిల్లలకు చదువు చెప్పడం ఓట్ల కోసం కాదు. విద్యా ద్వారా పేదరికం తొలగించే పని. ఇది ఆదర్శవంతమైన పాలన’ అని పేర్కొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తే ప్రతిపక్షానికి నష్టం ఏమిటి?. విద్యార్థులకి ఇస్తున్న విద్యా కానుక, పౌష్టికాహారం, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నారు. ఈ సృష్టి లో ఇద్దరే ఇద్దరు మామలు. ఒకటి చందమామ, రెండు జగన్ మామ. చదువు పేదవాడి జీవనాన్ని మార్చుతుంది. పేదవాడి ఆరోగ్యం నయం చేసిన ఘనత సీఎం జగన్‌ది. వైద్య రంగం లో సమూలమైన మార్పులు తెచ్చాం’ అని పేర్కొన్నారు. -
‘ఏపీ ప్రయోజనాలు కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా టెక్కలిలో కృష్ణదాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. అండగా జగనన్న ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’’ అని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. చదవండి: ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి’ -
నేడు పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
సామాజిక సాధికార బస్సు యాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: నేడు ఎనిమిదో రోజు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార యాత్ర జరుగనుంది. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో యాత్ర ముందుకు సాగుతుంది. సామాజిక సాధికార యాత్రలో పలువురు వైస్సార్సీపీ నేతలు పాల్గొననున్నారు. పలాసలో యాత్ర రూట్ మ్యాప్: ⏰ఉదయం 10:15 గంటలకు: శ్రీకాకుళం నుండి బయలుదేరి టెక్కలి చేరుకుంటుంది. ⏰ ఉదయం 11:00 గంటలకు: ఎస్ కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్. ⏰మధ్యాహ్నం 12:00 గంటలకు: టెక్కలి నుండి బయలుదేరి పలాస వరకు బస్సు యాత్ర సాగుతుంది. ⏰మధ్యాహ్నం 1గంటకు: పవర్ గ్రిడ్ అతిథి గృహం (రామకృష్ణాపురం) పలాసకు చేరుకోవడం, భోజన కార్యక్రమం. ⏰ మధ్యాహ్నం 2 గంటలకు: పవర్ గ్రిడ్ గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమవుతుంది. ⏰ మధ్యాహ్నం 2:15 గంటలకు: కోసంగిపురం జంక్షన్‌కు చేరుకుంటుంది. ⏰ మధ్యాహ్నం 2:30 గంటలకు: 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & ఆసుపత్రికి చేరుకోవడం (అభివృద్ధి కార్యాచరణ సందర్శన) ⏰ మధ్యాహ్నం 2:45 గంటలకు: కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నుండి ప్రారంభమై వైఎస్సార్ స్క్వేర్ కాశీబుగ్గ వరకు సాగుతుంది. ⏰ మధ్యాహ్నం 3.00 గంటలకు: కాశీబుగ్గ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సామాజిక సాధికర యాత్ర సభా వేదిక వద్దకు చేరుకుంటుంది. -
రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం జగన్
-
విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం జగన్ పరామర్శ..!
-
విజయనగరం ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, గుంటూరు: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆపై విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సిగ్నల్ లేకపోవడంతో భీమాలి-అలమండ స్టేషన్ల మధ్యలో పలాస ప్యాసింజర్ అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో ఈలోపు వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. పలాస ప్యాసింజర్‌కు చెందిన గార్డ్ బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి ముందున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి, అవతలి ట్రాక్‌పై బొగ్గు లోడ్‌తో ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయగడ ప్యాసింజర్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. దాని రెండు బోగీలూ పట్టాలు తప్పాయి. ఘటనలో 13 మంది మృతి చెందగా.. 50 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. అలాగే సీఎం జగన్ సూచనతో మంత్రి బొత్స ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం ప్రకటన కూడా చేశారు సీఎం జగన్. రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఘటన నుంచి సీఎం జగన్‌ను ఫోన్ చేసి ఆరా తీసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. ఫొటోగ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
దొంగల తెలివి మామూలుగా లేదు.. 3 రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేశారు..
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో దొంగిలించిన బైక్ రూపు రేఖలు మార్చి మూడు రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బైక్ యజమాని తెలిపిన వివరాల మేరకు.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్ పాత్రో మే 27న తన బండిని పోగొట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడకు మూడు రోజుల తర్వాత ఆగ్రాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతియాబాద్ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ వాహన తనిఖీల్లో పోలీసులకు ఓ బండి దొరికిందని, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే పలాసకు చెందిన బైక్ అని నిర్ధారణ జరిగిందని వారు చెప్పారు. అయితే ఆ వాహనం ఫొటోలు చూసి ఉదయశంకర్ పోల్చుకోలేకపోయారు. తన బండి అలా ఉండదని చెప్పేశారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం ఇంజిన్ వివరాలు మీ పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. ట్యాంక్ కవర్ చింపేసి, అద్దాలు తీసేసి రూపురేఖలు మార్చేశారని వివరించారు. దీంతో ఆయన వెంటనే ఫతియాబాద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించి అక్కడి పోలీసులకు సీ–బుక్ చూపించడంతో వివరాలన్నీ సరిపోయాయి. దీంతో ఆయనకు ష్యూరిటీపై బైక్‌ను తిరిగి అప్పగించారు. బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగలు తెలివి మీరిపోయారని, రెండు మూడు రోజుల్లోనే బైక్ రూపురేఖలు మార్చేసి లారీలు ఎక్కించి రాష్ట్రాలు దాటించేస్తున్నారని బాధితుడు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చదవండి: AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ -
ఇదో రాకాసి మీనం: వలను చించేస్తూ.. భూమిని చీలుస్తూ!
చిత్రంలో మీరు చూస్తున్నది చేపే. కానీ ఇది కొంచెం వైల్డ్. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రచెరువులో బుధవారం దర్శనమిచ్చింది. మామూలు చేపలతో పోలిస్తే విభిన్నంగా కనిపించడంతో ప్రజలు దీనిని చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ చేప కోసం పరిశోధకుల్ని సంప్రదిస్తే వారు బోలెడు విషయాల్ని వివరించారు. – కాశీబుగ్గ ఇదీ చేప కథ.. శాస్త్రీయ నామం: టెరిగో ఫ్లిక్తీస్ పరదాలిస్ వ్యవహారిక నామం: అమెజాన్ అంటుబిల్ల.. సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్ నీటి అడుగు భాగంలో బొరియలు చేస్తాయి. తద్వారా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. మత్స్యకారుల వలలను తమ శరీర భాగాలతో చించేస్తాయి. ఈ చేపల్ని పక్షులు ఆరగిస్తే వాటి ఆహార నాళం చిరిగిపోయి మరణిస్తాయి. ఇది విదేశాలకు చెందినది. అక్వేరియంలో పెంచేందుకు దీనిని గతంలో భారత్‌కు తీసుకొచ్చారు. అక్వేరియంలో ఉండే నాచు పదార్థాన్ని తిని శుభ్రపరచడం దీని ప్రత్యేకత. నీరు లేకపోయినా ఎక్కువ సేపు బయట బతకగలగడం మరో ప్రత్యేకత. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇవి కనిపిస్తాయని జీవ వైవిధ్య శాస్త్రవేత డాక్టర్ కర్రిరామారావు ‘సాక్షి’కి వివరించారు. 2014లో దీనిని తెలంగాణలో తొలిసారి గుర్తించినట్లు ఆయన తెలిపారు. -
Chakrapani Nagari: పాటల తుపాకీ...
దేశ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్. వేదికల మీద పాటలు పాడుతూ తనలో ఉన్న కళకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. ‘డ్యూటీలో ఉంటూ గాన సాధన కూడా చేయడంతో ఈ పాట నాకు బాగా వంటపట్టింది’ అంటూ ఇటీవల హైదరాబాద్ వచ్చిన చక్రపాణి నగరి తన గురించి వివరించారు. ‘‘మాది శ్రీకాకుళం జిల్లా, పలాస. టెన్త్‌క్లాస్ వరకు హైదరాబాద్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ సమయంలో బీఎస్ఎఫ్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి, అప్లై చేశాను. ఆ పరీక్షల్లో సెలక్ట్ అయ్యి 2013లో బీఎస్ఎఫ్లో చేరాను. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో పని చేశాను. ఇప్పుడు సెలవు మీద హైదరాబాద్‌కు వచ్చాను. సెలవు పూర్తవగానే జమ్ములో విధులు నిర్వర్తించాలి. డ్యూటీలో ఉంటూ.. ఏదో ఒకటి పాడుకుంటూ ఉండటం అనేది స్కూల్ టైమ్ నుంచే ఉండేది. కానీ, ఎప్పుడూ దానిని నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోలేదు. బీఎస్ఎఫ్లో చేరిన తర్వాత అక్కడ మా టీమ్, క్యాంపుల్లో సరదాగా పాడుతుండేవాడిని. నెలకు ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో అన్నీ హిందీ పాటలు పాడేవాడిని. అక్కడున్నవారందరికీ హిందీ తెలుసు కాబట్టి, అవే పాటలు పాడేవాడిని. మా తోటి జవాన్లే కాదు ఆఫీసర్స్ కూడా చాలా ప్రోత్సహించేవారు. డ్యూటీలో ఉన్నా లేకున్నా పాటలు పాడటం మాత్రం ఆగేది కాదు. ఇక మా ఊరికి వచ్చినప్పడు పెళ్లిళ్లు వంటి వేడుకల సందర్భాల్లోనూ నా గాన కచేరీ ఉండేది. ఖాళీ సమయంలో డిజిటల్ మీడియాని ఫాలో అవుతుంటాను. అలా, హైదరాబాద్‌లోని ఓ టీవీ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రకటన చూసి, అప్లై చేసుకున్నాను. వేల మందిలో నాకు అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మా అధికారులకు చెబితే వాళ్లూ వెంటనే ఓకే చేశారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, గాన గంధర్వుడు బాలుగారి మైక్‌ను కానుకగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. కష్టపడుతూ.. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం. నా చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో మా అమ్మ చాలా కష్టాలు పడింది. మమ్మల్ని హాస్టల్లో ఉంచి, తెలిసినవారి ద్వారా ఢిల్లీ వెళ్లి, పనులు చేసి, మాకు డబ్బు పంపేది. ఇప్పుడు అమ్మ ఊళ్లో వ్యవసాయం పనులు చేస్తుంది. అన్నయ్య సొంతగా బేకరీ నడిపిస్తున్నాడు. అక్క గ్రామవాలంటీర్గా చేస్తోంది. మాకు కష్టం విలువ తెలుసు, స్వయంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తూనే వచ్చాం. ఆ కష్టంలో నుంచే ఈ పాట పుట్టుకు వచ్చిందనుకుంటాను. ఎక్కడ ఉన్నా కళ రాణిస్తుందనడానికి నేనే ఉదాహరణ అనిపిస్తుంటుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని సింగర్‌గా రాణించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశాడు ఈ జవాన్. – నిర్మలారెడ్డి -
మాజీ ఎంపీ కణితి విశ్వనాథం కన్నుమూత
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం (91) శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలాసలోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో కణితి కూడా ఒకరు. ఈయన 1932 జూలై 1న నందిగాం మండలం హరిదాసుపురంలో జన్మించారు. వైద్యుడిగా, విద్యావేత్తగా పేరు గడించారు. తర్వాత రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1989, 1991లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2014 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. 1989లో ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు. చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా? -
కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే!
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు ఏ నాయకుడి కంటా పడలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు, మనుషులు లేక వారి జ్ఞాపకాలుగా మిగిలిన ఇళ్లు.. ఏవీ ప్రజా ప్రతినిధుల కరకు గుండెలను కరిగించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. అలాంటి ఆపత్కాలంలో వచ్చాడొక నాయకుడు. వైద్యం కోసం విశాఖ వెళ్లే రోగుల చెంతకు డయాలసిస్ యూనిట్లు రప్పించాడు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు చేతిలో నెలకు రూ.10 వేలు పెడుతున్నాడు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానంకు తీసుకువస్తున్నాడు. అతడే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రి, ఉద్దానం ప్రాజెక్టు ఆయన చిత్తశుద్ధికి సజీవ సాక్ష్యాలు. సాక్షి, శ్రీకాకుళం: ఉద్దానం ఊపిరి పీల్చుకుంటోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండడంతో మృత్యుకౌగిట నుంచి విడుదలవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందిస్తోంది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. ఇవి త్వరలోనే పూర్తి కానున్నాయి. పాదయాత్రలో చూసి.. పాదయాత్రలో కిడ్నీ వ్యాధి బాధితుల బాధలను వైఎస్ జగన్ దగ్గరుండి చూశారు. ప్రతిపక్ష నేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి.. తన కార్యాచరణను అప్పుడే స్పష్టంగా ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ఉపరితల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. బాబుదంతా బడాయే.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన భాగస్వామి పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు. తిత్లీ సమయంలో గోడు చెప్పుకుందామని వెళ్లిన వారిపై చంద్రబాబు మండిపడ్డారు కూడా. 2019 ఎన్నికల ప్రచారానికి సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఒక్క కిడ్నీ వ్యాధి బాధితుడికి కూడా భరోసా ఇవ్వలేకపోయారు. మరోవైపు పవన్ కల్యాణ్ పెద్ద ఎత్తున ఉద్దానం సమస్య పరిష్కరించేశానని ప్రచారం చేసుకున్నారు తప్ప.. చేసిన పని ఒక్కటీ లేదు. తన మిత్రపక్షం అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. కిడ్నీ రీసెర్చ్‌సెంటర్ పరిశీలనలో మ్యాప్ చూస్తున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బతుకుతా అనుకోలేదు.. అంతా జగనన్న దయే! నా పేరు సుగ్గు లక్ష్మీ. ఇచ్ఛాపురం మండలం మారుమూల ప్రాంతం సన్యాసిపుట్టుగ గ్రామం మాది. నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10వేలు పింఛన్ వస్తోంది. అంతే కాదు నన్ను డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. కలలో కూడా అనుకోలేదు నేను ఇప్పటి వరకు బతుకుతానని, అంతా జగనన్న దయే! వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ►కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పింఛన్‌ను రూ.3500 నుంచి రూ.10వేలకు పెంచారు. 5పైబడి సీరం క్రియేటినిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ►ఉపరితల తాగునీరు అందించేందుకు రూ.700 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో గల 827 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ►వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా మంజూరు చేశారు. మార్చిలో వీటిని ప్రారంభించనున్నారు. ►టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషీన్లతో 68పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట, కవిటిలో పడకలు పెంచారు. హరిపురంలో పది పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ►ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10పడకలు, బారువ సీహెచ్‌సీలో 10పడకలతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కొత్తగా ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సరీ్వసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అవి జిల్లాకొచ్చాయి. కవిటి, సోంపేట సీహెచ్‌సీల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో యూనిట్లో ఏడేసి పడకలు ఉంటాయి. ►టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. ►కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ►టీడీపీ హయాంలో జిల్లాలో నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి అక్కడి రోగులకు వైద్యం అందిస్తున్నారు. రూ. 10వేలు పింఛన్ అందుకుంటున్నాం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10వేలు పింఛన్ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో డయాలసిస్ చేసుకోవడానికి స్థానికంగా సరిపోయిన బెడ్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్ కూడా సకాలంలో చేసుకుంటున్నాం. – మర్రిపాటి తులసీదాస్, డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం ఆదుకున్న జగనన్న ప్రభుత్వం పూర్తిగా చితికిపోయిన కిడ్నీ బాధితుల్ని జగనన్న ప్రభు త్వం వచ్చాక ఆదుకుంది. ఉద్దానం పర్యటన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా మా సమస్యల మీద దృష్టిపెట్టారు. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. – లండ శంకరరావు, కిడ్నీ డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం గ్రామం, కంచిలి మండలం ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు.. డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ రోగులకు అవసరమైన అన్ని మందులను, ఇంజెక్షన్లను ఉచితంగానే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం లాంటి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండానే డయాలసిస్ చేయించుకుంటున్నాం. – అందాల రత్నాలు, డయాలసిస్ రోగి, లోహరిబంద గ్రామం, -
మార్చికల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సాక్షి, విశాఖపట్నం: వచ్చే మార్చి నాటికి శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అందుబాటులోకి తెస్తున్నామని.. ఇక్కడి ఉద్దానంతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరుల్లోని కిడ్నీ తీవ్రతను తగ్గించే చర్యలు కూడా ఇప్పటికే చేపట్టామని.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపీ), ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలు కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. విశాఖలో మూడ్రోజులుగా జరుగుతున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఒప్పందం జరిగితే ప్రవాస భారతీయ వైద్య ప్రముఖుల సేవలను రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య విద్యాలయాలు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వైద్య రంగ నిపుణుల సూచనలు, సలహాలను ప్రభుత్వం తీసుకుని వాటి ఆచరణకు కృషిచేస్తుందని చెప్పారు. విదేశీ వైద్య ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ప్రధాన వైద్యశాలల్లో అత్యవసర చికిత్సలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని కోరినట్లు తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన మన వైద్యులు వారి అనుభవాలను మన రాష్ట్ర వైద్య విధానంలో మార్పుల కోసం సహకరించాలని కోరారు. అంకాలజీ విభాగాల బలోపేతం అలాగే, రాష్ట్రంలోని ఏడు పురాతన వైద్య కళాశాలల్లో అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సదుపాయాలతో పాటు రేడియోథెరపీ, సర్జికల్, మెడికల్ అంకాలజీ విభాగాలను బలోపేతం చేసే అంశం ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని కృష్ణబాబు వెల్లడించారు. ఈ సదస్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్, ‘ఆపీ’ ఇండియా ప్రతినిధులు డాక్టర్ టి.రవిరాజు, రవి కొల్లి, ‘ఆపీ’ అమెరికా కోఆర్డినేటర్ ప్రసాద్ చలసాని, భారత సంతతి అమెరికా వైద్యులు, దేశంలోని పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. అంతకుముందు.. డాక్టర్ రవిరాజు ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రసాద్ చలసానికి ప్రదానం చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తోందని కృష్ణబాబు చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆరోగ్య పథకాలు, సేవలను అమలుచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు, ప్రతి జిల్లాలో ఒక క్యాథ్‌ల్యాబ్‌ను గిరిజన ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేసిన 2,225 ఆస్పత్రుల ద్వారా 3,255 రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క క్యాన్సర్‌కే ఏటా రూ.400 కోట్లు వెచ్చిస్తోందన్నారు. -
Seediri Appalaraju: కన్నీరు తుడిచి.. కష్టాన్ని తొలగించి
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగింది. రెల్లివీధికి చెందిన పద్మ అనే ఇల్లు లేని ఓ మహిళ మంత్రి ముందు కన్నీరుమున్నీరై తన వేదన తెలుపుకున్నారు. తనకు ఇల్లు లేదని, కర్రలపై పరదాలు కప్పుకుని తల దాచుకుంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నిసార్లు ఇంటి కోసం దర ఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతోందని చెప్పారు. దీంతో మంత్రి ఆ గుడిసెలోనే కూర్చుని ఆమెను ఓదార్చి అధికారులతో మాట్లాడారు. అన్ని పథకాలపై ఆమె ఇంటి పేరుకు బదులు లబ్ధిదారు(హోల్టర్) అని తప్పుగా ముద్రితమవ్వడంతో పథకాలు అందకుండాపోతున్నాయని గుర్తించారు. ఇలాంటి చిన్న తప్పులు కూడా కనిపెట్టలేకపోతున్నారని మంత్రి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూదికొండలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే తప్పిదాన్ని సరిచేసి ఈమెకు ఇంటిని మంజూరు చేయాలని కమిషనర్ రాజగోపాలరావును ఆదేశించారు. (క్లిక్ చేయండి: గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు) -
Palasa: లక్ష్మీపురంలో ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి
పలాస: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం.. పలాస మండలంలోని ఓ చిన్న గ్రామం. జాతీయ రహదారికి అతి సమీపంలోని పచ్చని పొలాల మధ్య కొలువుదీరి ఉంటుందీ ఊరు. 356 గడపలు ఉన్న ఈ పల్లెకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిస్తాడు. అందులో అధిక శాతం మంది ఉపాధ్యాయులే. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా ఈ ఊరి వారు చక్కగా రాణించారు. ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు ఒకసారి ఎమ్మెల్యేగా, సమితి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఊరిలో 90 శాతం మంది అక్షరాస్యులు కావడం గమనార్హం. కేవలం అక్షరాస్యులుగానే కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉన్నత ఉద్యోగాలు సాధించడం విశేషం. ఒకరికి మించి ఒకరు ఉపాధ్యాయ రంగంలో అత్యధిక శాతం ఉద్యోగులు కాగా గ్రూప్ వన్ అధికారులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఎన్ఆర్ఐలు, ఆర్మీలోనూ ఈ ఊరి వారు ఉద్యోగులుగా ఉన్నారు. ఆర్డీవో స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ గ్రామంలో మొత్తం 1213 మంది జనాభా ఉన్నారు. 356 ఇళ్లు ఉన్నాయి. గ్రామంలో అన్నీ పక్కా భవనాలతో అన్ని వీధుల్లో కూడా సిమెంటు రోడ్లతో ఊరిని చూడచక్కగా తీర్చిదిద్దుకున్నారు. గతమెంతో ఘనం.. ఈ గ్రామానికి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. పలాస మండలం తర్లాకోట జమిందారీ పాలనలో ఈ గ్రామంలోనే మస్తాదారు ఉండేవాడు. భూమి శిస్తు వసూలు చేసి జమిందారుకు ఇచ్చేవాడు. ఇక్కడ మస్తాదారు ఉండటంతో తరచుగా తర్లాకోట జమీందారు వచ్చి వెళ్తుండేవాడని గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్లు చెబుతున్నారు. అలా రాకపోకలు ఎక్కువగా సాగడంతో ఈ గ్రామంలోనే జమీందారు క్యాంపు కోర్టు కూడా నిర్వహించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ముందుగా సవర లక్ష్మయ్య అనే గిరిజన కుటుంబం ఉండేదని, అతని పేరు వల్లనే లక్ష్మీపురం అని నామకరణం చెందిందని ఇక్కడి వారు చెబుతుంటారు. ఈ గ్రామంలోని దువ్వాడ వంశానికి చెందిన ఒక ధనిక రైతు కుటుంబంతో తర్లాకోట జమీందారుకు మిత్తరికం కూడా ఉండేదని, తర్లాకోట జమీన్లో లక్ష్మీపురం గ్రామానికి ఈ విధంగా ఒక ప్రత్యేకత ఉండేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. మా ఇంటిలో ఇద్దరం ఉద్యోగస్తులమే మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. సుమారు 10 ఎకరా లు ఉంది. అయినా మా కుటుంబంలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నేను ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశాను. మా అన్నయ్య సత్యనారాయణ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేనే స్వయంగా వ్యవసాయం చేస్తున్నాను. – బమ్మిడి వాసుదేవరావు, రిటైర్డ్ టీచర్, లక్ష్మీపురం,పలాస మండలం ఉపాధ్యాయుల ఊరు మా గ్రామంలో అత్యధిక స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారు. నేను కూడా ఉపాధ్యాయ కొలువు సంపాదించేవాడిని. ముందుగా వేరే రంగంలో స్థిర పడిపోవడం వల్ల అటువైపు వెళ్ల లేకపోయాను. ఇప్పుడు జనరేషన్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలవైపే మక్కువ చూపుతున్నారు. పోటీ పడి చదువుతున్నారు. వ్యవసాయ భూములు ఉన్నా ఉద్యోగాలే చేస్తున్నారు. మా గ్రామంలో ఇంటికి ఒకరు, ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు. – అల్లు రమణ, ఎంఏబీపీఈడీ, లక్ష్మీపురం, పలాస మండలం స్వయం కృషితోనే ఉద్యోగాలు మా గ్రామంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారంటే దానికి కారణం స్వయం కృషి, పట్టుదల, పోటీ తత్వం ప్రధాన కారణం. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అన్ని రంగాల్లో కూడా మా గ్రామానికి చెందిన వారు ఉన్నారు. నేను కూడా ముందుగా గ్రూప్ వన్‌కి ఎంపికయ్యాను. అడిషనల్ ఎస్పీగా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నాను. క్రమ శిక్షణతో విద్యను అభ్యసిస్తే ప్రభుత్వ ఉద్యోగం చాలా సులభంగా వస్తుందని మా గ్రామమే దానికి ఒక ఉదాహరణ. – బమ్మిడి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్) విశాఖ -
ఆ టాక్ నిజమేనా..?.. డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా?
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు అక్కడ అనేకసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవలందించారు. అయితే ఆయన వారసులు పెద్దాయన పరువు తీసేసారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఆ వారసుల్ని అందలం ఎక్కించినా పాత గుణం మానడం లేదట. అందుకే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను మార్చేయాలనుకుంటున్నారట చంద్రబాబు. చదవండి: ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చ రచ్చ.. వెన్నుపోటుకు సిద్ధంగా ఆ వర్గాలు శ్రీకాకుళం జిల్లాలో సర్దార్ గౌతు లచ్చన్నకు ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి. ఆయన కుమారుడు గౌతు శివాజీ, మనుమరాలు గౌతు శిరీష.. ఇప్పుడు లచ్చన్న ఇమేజ్‌కు ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి నియోజకవర్గంలో ఆమె సాగించిన పెత్తనాన్ని చూసిన ప్రజలు 2019లో ఘోరంగా ఓడించారు. ఎన్నికల్లో ఓడినా ఆమె వెనకటి గుణం మారలేదని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. తమ్ముళ్ల నుంచి ఒత్తిడి మొదలయ్యే సరికి చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక పలాసలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఏడువందల కోట్ల రూపాయిలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, వంశధార నది నుండి పైపు లైన్ ల ద్వారా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్‌ను ఇంటింటికి అందిస్తున్నారు. కిడ్నీ రోగులకు నెలకు పదివేలు పెన్షన్ ఇవ్వడం వంటి అత్యంత కీలకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన 9 సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. దీంతో ఉద్దానం పల్లెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరి మనస్సుల్లో అభిమానాన్ని నింపుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో ఇతర పార్టీల గురించి ఇక్కడి ప్రజలు అలోచించే పరిస్థితి లేదు. టీడీపీ ఇమేజ్ అక్కడ రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. దీనికి తోడు బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజును గౌతు శిరీష తరుచూ బాడీ షేమింగ్ చేయడం.. ఆయన నిర్వహిస్తున్న శాఖ పేరుతో అవమానకరంగా మాట్లాడటం పలాస ప్రజలకు నచ్చడం లేదు. మంత్రి అప్పలరాజు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని శిరీష ఇటీవల రచ్చరచ్చ చేశారు. భూ అక్రమణలపై విచారణ చేపట్టడంతో.. టీడీపీ దొంగల భూ అక్రమణలు బయటపడ్డాయి. మంత్రి మీద చేసిన ఆరోపణలు టీడీపీకి కలిసి రాకపోగా ఆ పార్టీనే మరింత నష్టపరిచింది. ఈ విషయమై పలాస నుండి ఒక టీం.. శిరీష వ్యవహరంపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాసారు. ఈ పరిణామాలతో చంద్రబాబు.. శిరీషను మార్చాలనే నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నుండి ఒక వైద్యుడిని, మరో ప్రముఖ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిని పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో గౌతు శివాజీ డ్యామేజి కంట్రోల్‌కు దిగారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె కాదు, తానే పోటీ చేస్తానని కేడర్‌కు చెప్తున్నారట. జరిగిందేదో జరిగిపోయింది, నేనే పోటీ చేస్తాను అని చంద్రబాబుకు కూడా చెప్పుకున్నట్టు సమాచారం. అయితే గౌతు శివాజీ పోటీ చేసినా, కుమార్తె శిరీష హావా కొనసాగుతుందని... ఇక మాకు వీళ్ల సేవలు చాలని తమ్ముళ్లు అనుకుంటున్నారట. -
అవసరమైతే రక్తం చిందిస్తాం
కాశీబుగ్గ: విశాఖ పరిపాలన రాజధానిని సాధించుకోవడానికి, అమరావతి పాదయాత్రను ఆపడానికి ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే రక్తమైనా చిందిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ పలాస జేఏసీ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో శనివారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఆ ప్రాంతంలో భవనాలు, రోడ్లు, పార్కులు అన్నీ గ్రాఫిక్స్‌లో మాత్రమే చూపించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతేనని, వారి మనుషులకు భూములిచ్చి బహుజనులను దూరం పెట్టారని విమర్శించారు. -
శ్రీకాకుళం : పలాసలో ఉద్రిక్తత
-
పలాసలో హై టెన్షన్.. లోకేష్ ఓవరాక్షన్!
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపును టీడీపీ అడ్డుకుంది. దీంతో, టీడీపీ వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం ముట్టడికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కాగా, వైఎస్సార్సీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు సహా పార్టీ శ్రేణులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ నేతల ఆక్రమణలను తొలగిస్తుంటే.. పేదల ఇళ్లను తొలగిస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు కొండలు, చెరువులను కూడా వదిలిపెట్టలేదు. టీడీపీ నేతల చెరలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాము’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. పలాస ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వైఎస్సార్సీసీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. శ్రీకాకుళం కొత్తరోడ్ వద్ద టీడీపీ నేత నారా లోకేష్ ఓవరాక్షన్ చేశారు. పలాస వెళ్లేందుకు లోకేష్ ప్రయత్నించారు. ఈ క్రమంలో లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో లోకేష్.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, రణస్థలం పోలీస్ స్టేషన్‌కు లోకేష్‌ను తరలించారు. ఇది కూడా చదవండి: ఓటమి భయంతోనే ఉన్మాదపు కూతలు -
టీడీపీ నాయకుల బండారం బట్టబయలు.. కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని..
కాశీబుగ్గ (శ్రీకాకుళం): అధికారుల సాక్షిగా టీడీపీ నాయకుల బండారం బయటపడింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు గురువారం చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో పచ్చనేతలే ఆక్రమణదారులని తేలింది. టీడీపీ నాయకులు పెంట ఉదయ్‌శంకర్, లొడగల కామేష్ దాదాపు 8 ఎకరాలకుపైగా భూమిని ఆక్రమించినట్లు స్పష్టమైంది. పలాస ఆర్డీఓ సీతారామమూర్తి, తహశీల్దార్ మధుసూదనరావు, సర్వేయర్లు ఇతర రెవెన్యూ సిబ్బంది గురువారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పద్మనాభపురం, పెంటిబద్ర, సూదికొండ, నెమలికొండ, ఉదయపురం ప్రాంతాల్లో పర్యటించారు. పెంటిబద్ర గిరిజన గ్రామంలో రికార్డులు, భూమిని పరిశీలించగా సర్వే నంబర్ 311/ఎ మంగబంద (చెరువు)లో 04.85 ఎకరాలు భూమి, సర్వే నంబర్ 314/08 గజాలు గుమ్మి, 00.96 ఎకరాలు భూమి, పద్మనాభపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 365/05లో 02.31 ఎకరాల కాలువ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకుంటాం.. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని, త్వరలోనే భూములను స్వాధీ నం చేసుకుంటామని పలాస ఆర్డీఓ సీతారామమూర్తి స్పష్టం చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆక్రమణలపై హైకోర్టులో పిల్ వేసిన సందర్భంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని తమను ఆదేశించిందన్నారు. స్థానికంగా ఎలాంటి ఆక్రమణలు జరగడానికి అవకాశం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. జగనన్న భూరక్షణ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల స్వాధీనం నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. మున్సిపాలిటీలోని 27 గ్రామాల్లో ఆక్రమణలను గుర్తించామని, వాటిని తొలగిస్తామని చెప్పారు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారు, దాని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చి ప్రభుత్వ భూమిని కాపాడుకుంటామని తెలిపారు. ఆయనతో పాటు పలాస తహసీల్దార్ లంబాల మధుసూదన్, సర్వేయర్ గిరికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, వీఆర్ఓ ఖగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న టీడీపీ మద్దతుదారులు ఉద్రిక్తత.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉదయపురం చెరువు వద్ద ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించేందుకు అధికారులు గురువారం సాయంత్రం సిద్ధమయ్యారు. అధికారుల రాకతో ఉదయపురం సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన గురిటి సూర్యనారాయణకు చెందిన కొన్ని నిర్మాణాలు చెరువులో ఉన్నాయని ఆర్డీఓ గుర్తించగా వాటిని తొలగించేందుకు జేసీబీతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే గురిటి సూర్యనారాయణ బంధువులు, మద్దతుదారులు వందల సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. తహసీల్దార్‌ను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. కాశీబుగ్గ పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. -
పాతికేళ్ల అనుబంధానికి తెర
పలాస: రెండు దశాబ్దాలుగా పలాస కేంద్రంగా ఉన్న పలాస గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ డివిజన్ కేంద్రం ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో అనకాపల్లికి తరలి వెళ్లిపోయింది. దీని పరిధిలోని ప్రాజెక్టులను శ్రీకాకుళం డివిజన్లో విలీనం చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఈఈతో సహా మొత్తం 28 ఏఈలు, డీఈలు, ఇతర సిబ్బంది కూడా బదిలీ అయ్యారు. దీంతో సుమారు 25 ఏళ్ల అనుబంధానికి తెరపడినట్లయ్యింది. ఈ మేరకు అమరావతి ఇంజినీరింగ్ చీఫ్ నుంచి ఈ నెల 6న ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. విభజనే కారణం.. పలాస డివిజన్ కేంద్రం 1997లో ఏర్పాటైంది. దీని పరిధిలో నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలోని మొత్తం 20 మండలాలు ఉన్నాయి. ప్రధానమైన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుతో పాటు సుమారు 807 గ్రామాలు ఈ కేంద్రం పరిధిలో ఉన్నాయి. ఉద్దాన ప్రాంత ప్రజలకు శుద్ధజలం అందించేందుకు సుమారు రూ.700 కోట్ల భారీ ఖర్చుతో మెగా ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. డీపీ, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్‌ల ద్వారా మరో 2వేల గ్రామాలకు నీరు సరఫరా అవుతోంది. సీపీడబ్ల్యూఎస్ పథకాలు మరో 25 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ శ్రీకాకుళం డివిజన్ కేంద్రం పరిధిలోకి వెళ్లాయి. శ్రీకాకుళం డివిజన్ కేంద్రలో 18 మండలాలు ఉండేవి. అందులో పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమయ్యాయి. రాజాం నియోజకవర్గంలోని రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి మండలాలు విజయనగరం జిల్లాలో విలీనమయ్యాయి. దీంతో 38 మండలాలతో ఉన్న ఈ రెండు డివిజన్ కేంద్రాలకు బదులు ప్రస్తుతం 30 మండలాలతో కేవలం శ్రీకాకుళం డివిజన్ కేంద్రంగానే ఉండబోతుందని ప్రస్తుత శ్రీకాకుళం ఈఈ రామకృష్ణ చెప్పారు. ప్రస్తుతం పలాసలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను జిల్లా పరిషత్‌కు బదిలీ చేశారు. ఈఈతో పాటు ఆరుగురు ఇంజినీర్లను అనకాపల్లికి బదిలీ చేశారు. మిగతా వారిని ఎస్సీ ఆఫీసుకు సరెండర్ చేశారు. పలాసలో ఉన్న ప్రస్తుత డివిజన్ కేంద్రం గతంలో ఉద్దానం ప్రాజెక్టు పరిధిలో ఉండేది. ఇక్కడి నుంచే ఉద్దానం ప్రాజెక్టు అధికారులు విధులు నిర్వర్తించేవారు. మళ్లీ వారి చేతుల్లోకి ఈ కార్యాలయం వెళ్లబోతుందని ఇక్కడ తాత్కాలికంగా పనిచేస్తున్న ఈఈ పి.పి సూర్యనారాయణ చెప్పారు. -
చరిత్రలో ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యం సీదిరి అప్పలరాజు సొంతం
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి సీదిరి అప్పలరాజు చరిత్ర సృష్టించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను మంత్రిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.సమర్థమైన పనితీరు, చక్కటి వాగ్ధాటి ఆయనకు కలిసొచ్చాయి. పలాస నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యత సంతరించకుంది. అంతా అనూహ్యమే సీదిరి రాజకీయ ప్రవేశమే అనుహ్యం. వైద్యవృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కిడ్నీ రోగుల బాధలు తెలుసుకునేందుకు కవిటి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి, ఆ తర్వాత పలాస నియోజకవర్గకర్తగా నియమితులై రాజకీయాల్లో దూసుకుపోయారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పాతుకుపోయి ఉన్న నేతల పునాదులు కదిల్చారు. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల అధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీ సాధించారు. నేపథ్యం.. పేరు: డాక్టర్ సీదిరి అప్పలరాజు నియోజకవర్గం: పలాస స్వస్థలం: దేవునల్తాడ తల్లిదండ్రులు: దాలమ్మ, నీలయ్య (లేటు) పుట్టినతేదీ: ఫిబ్రవరి 22, 1980 విద్యార్హతలు: ఎండీ జనరల్, ఎంఈడీ సతీమణి: శ్రీదేవి సంతానం: కుమారులు ఆర్నవ్ వర్మ, ఆరవ్ వర్మ జిల్లా: శ్రీకాకుళం రాజకీయ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి చిన్నవయసులో 26 ఏళ్లకే విశాఖపట్నం లోని కేజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2007 డిసెంబర్ 14న పలాస–కాశీబుగ్గ పట్టణంలో సేఫ్ హాస్పిటల్ స్థాపించి వైద్యుడిగా కొనసాగుతూ దాదాపు 12 సంవత్సరాల పాటు వైద్యునిగా సేవలు అందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు 2017 ఏప్రిల్ 19న వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన గౌతు కుటుంబంపై విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. జూలై 22, 2020న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక) -
పలాస అమ్మాయి జాక్‌పాట్.. రూ.44లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
సాక్షి, విశాఖపట్నం: బీటెక్ చదువుతుండగానే ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను చేజెక్కించుకుందో విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సింహాచలం, సుభాసితిల కుమార్తె కొంచాడ స్నేహకిరణ్ అనే విద్యార్థిని విశాఖపట్నంలోని అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ కళాశాలలో అమెజాన్ సంస్థ 2021 డిసెంబర్లో క్యాంపస్ సెలక్షన్ నిర్వహించింది. అందులో స్నేహకిరణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.44 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. ఇదిలా ఉండగా, విద్యార్థిని తండ్రి జీడిపప్పు పరిశ్రమలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని స్నేహకిరణ్ నిరూపించింది. కూతురు సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు) -
దేవుడు భూమిని మింగేస్తున్నారు..కాపాడండి
పలాసలో భూముల రేట్లతో పాటు భూదందాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డులు మార్చేసి విలువైన భూములు కొట్టేయడానికి కొందరు మాస్టర్ ప్లాన్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ క్షుద్ర ప్రయత్నాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను కాజేయడానికి చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో భూ బకాసురుల ఆకలికి దేవుడి భూములు స్వాహా అయిపోయే లా ఉన్నాయి. బృందావన స్వామి, మదనమోహన స్వామి, వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి ఆలయాలకు చెందిన దాదాపు రూ.వెయ్యి కోట్ల వి లువైన భూములపై కొందరి కన్ను పడింది. ఇప్ప టికే ఈ ఆలయాలకు సంబంధించిన కొన్ని భూ ములు ప్రైవేటు వ్యక్తుల పేరున అడంగల్లోకి ఎక్కిపోయాయి. కొన్నేళ్ల కిందటే ఇక్కడ రికార్డుల మా ర్పిడి జరిగిపోయింది. టీడీపీలో కీలక నేతలు సూ త్రధారులుగా వ్యవహరించారు. అధికారులు, అక్రమార్కులు కుమ్మక్కై దేవాలయ భూములు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ఏ మాత్రం అలసత్వం వ హించినా దాదాపు 25ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తుల పరమవుతాయి. భూ దోపిడీ.. పలాసలో భూదందాలకు అంతులేకుండా పోయింది. దీనిపై ‘సాక్షి’ కథనాలను కూడా ప్రచురించింది. వీటిని శోధించే పనిలో ఉండగా దేవాలయాల భూ ముల కొట్టేసే పన్నాగం వెలుగు చూసింది. ఇక్కడ బృందావన స్వామి, మదనమోహనస్వామి, వేణుగోపాలస్వామి, జగన్నాథస్వామి దేవాలయాలకు సంబంధించిన 24.58 ఎకరాల భూములు ఉన్నా యి. పట్టణం నడిబొడ్డున, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదు రుగా ఇవి ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలకు పు రోహిత ఇనాం భూములుగా ఉన్న వాటిని వ్యూహాత్మకంగా ప్రైవేటు వ్యక్తుల పేరున అడంగల్లోకి ఎక్కించేశారు. కొందరు అధికారులు వత్తాసు పలకడంతో కొన్నింటికి డిజిటల్ సిగ్నేచర్ కూడా అయిపోయింది. మరికొన్నింటికీ డిజిటల్ సిగ్నేచర్‌లో పెండింగ్‌లో పెట్టి ఉంచారు. మళ్లీ అధికారంలోకి వస్తే కొట్టేయవచ్చని ఎన్నికల ముందు పావులు కదిపారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో వారి ఆట లు సాగలేదు. చాలావరకు డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే, వాటినే పట్టుకుని ప్రస్తుతం కూడా లావాదేవీలు సాగిపోతున్నాయి. వందలకోట్లరూపాయల విలువైన భూములను దర్జాగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులేం చేస్తున్నారు..? దేవాలయాల భూములు అధికారుల కళ్ల ముందే ప్రైవేటు వ్యక్తుల పేరున రికార్డుల్లోకి ఎక్కిపోయా యి. వారసత్వం, డీ పట్టా భూముల కింద కొన్ని, కొనుగోలు కింద మరికొన్ని భూములు ప్రైవేటు వ్య క్తుల పేరున అడంగల్‌లో నమోదయ్యాయి. ఇంత జరిగినా అధికారులు చోద్యం చూడడం తప్ప ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి పురోహిత ఇనాం భూములు వారసత్వం కింద వ చ్చే అవకాశం లేదు. అలాగే, దేవాలయాల భూ ములను డీ పట్టాల కింద ఇవ్వడానికి లేదు. దేవాలయాల భూములకొనుగోలు కూడా నిషేధం. కానీ ఇక్కడ నిబంధనలన్నీ నీరుగారిపోయాయి. పక్కా గా రికార్డుల్లో వారసత్వం, కొనుగోలు, డీ పట్టా కింద ప్రైవేటు వ్యక్తుల పేరిట రాసేశారు. నిషేధిత భూ ముల జాబితాలో ఉన్న సర్వే నంబర్లపైన కూడా లావాదేవీలు జరిగిపోయాయి. ఇప్పుడవి చైన్ సిస్టమ్‌లా చేతులు మారిపోతున్నాయి. అనధికారికంగా వందల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు మేలుకోకుంటే దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు దేవుడికి కాకుండాపోతాయి. -
వలంటీర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి వలంటీర్ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వలంటీర్ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు. -
టీకాతో వలంటీర్ లలిత మృతి
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో ఈ ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ చెప్పారు. లలితతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. సాక్షి, పలాస/కాశీబుగ్గ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితకు ఆ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందారు. మృతురాలికి భర్తతో పాటు ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. పలాస తహసీల్దార్ మధుసూదనరావు, కాశీబుగ్గ సీఐ శంకరరావు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్ తదితరులు లలిత మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి గల కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ చెప్పారు. లలిత మృతిచెందడంతో ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మిగతా వలంటీర్లు, వీఆర్వో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు పలాస పీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. మృతురాలి కుటుంబానికి మంత్రి భరోసా ఇదిలా ఉండగా వలంటీర్ మృతి వార్త తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడే తక్షణ సాయం కింద రూ.2 లక్షలు ప్రకటించారు. అప్పటికే నీరసించిపోయింది.. టీకా వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిందని చెప్పింది. మెడికల్ సిబ్బందికి తెలియజేస్తే పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పారు. అయితే లక్షణాలు అలాగే ఉంటాయిలే అనుకుని టాబ్లెట్ కూడా వేసుకోలేదు. తర్వాత రోజు కూడా జ్వరం తగ్గకపోవడంతో టాబ్లెట్ వేశాం. కానీ అప్పటికే పూర్తిగా నీరసం అయిపోయింది. తెల్లారేసరికి ఇలా జరిగింది. మా పాపకు ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవు. కేవలం వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే చనిపోయింది. – పి.పార్వతి, మృతి చెందిన వలంటీర్ తల్లి -
హోంమంత్రినౌతా.. ఎవర్నీ వదలను : అచ్చెన్నాయుడు
సాక్షి, శ్రీకాకుళం : ‘ఏయ్ ఎవర్నువ్.. ఎలా అరెస్ట్ చేస్తావ్.. ఏమనుకుంటున్నావ్.. ఎవర్నీ వదల్ను.. మళ్లీ అధికారంలోకి వచ్చాక నేనే హోంమంత్రినౌతా.. అందర్నీ గుర్తు పెట్టుకుంటా.. సంగతి తేలుస్తా’ ఏయ్.. ఎక్స్టాలు చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు? నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? యూస్‌లెస్ ఫెలో’ పలుమార్లు ఎమ్మెల్యే.. ఓ సారి మంత్రి.. ఓ పారీ్టకి రాష్ట్ర అధ్యక్ష పదవి.. ఇంకా సీనియర్ రాజకీయనాయకుడన్న పేరు.. ఇన్ని భుజకీర్తులున్న ఓ వ్యక్తి మాటతీరిది. నోటి దురుసిది. ఇదేదో ఒకటి రెండు సంఘటనలకే పరిమితమైంది కాదని.. ఆ ప్రముఖుడు నోరు విప్పితే ఈ హుంకారాలే అహంకారపూరిత వ్యాఖ్యానాలే ప్రవాహంలా దూసుకొస్తాయని తెలుగు నేల నలుచెరుగులా ఏనాడో విదితమైంది. అయితే రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ నోరు పారేసుకుంటూనే ఉన్న తీరు ఎన్నేళ్లయినా మారదని ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. అందలమెక్కిన కాలంలో చెలాయించిన జులుం అధికారులకు, ఉద్యోగులకే కాదు.. సామాన్యులకు సైతం పీడకలలా వెంటాడుతునే ఉంది. రాజకీయం బలానికి దౌర్జనం తోడై.. అడ్డొచ్చేదెవరన్న దూకుడు కారణంగా ఎందరో ఎన్ని ఇక్కట్లు పడ్డారో బాధితులకే కాదు.. ప్రజలకు కళ్లెదుటూ కదలాడుతూనే ఉంది. అధికారం చేజారిన తరువాత కూడా అదే ధోరణి కొనసాగుతూ ఉంటే విస్తుపోవడం కూడా జనం వంతవుతూనే ఉంది. ఓ అభ్యరి్థని బెదిరించిన కేసులో మంగళవారం అరెస్టయిన వేళ.. ఆ నేత తీరు అందరినీ నిర్ఘాంత పరిచింది. ఇంత చెప్పాక.. ఈ ఘననేత అచ్చెన్నాయుడని వేరే చెప్పాల్సిన పనేముంది? తప్పుల మీద తప్పులు చేయడం.. విచారణ కోసం అరెస్టు చేస్తే చేసిన ఆ తప్పుల్ని వదిలేసి అరెస్టులను పెద్దదిగా చూపించడం అచ్చెన్నాయుడుకు అలవాటుగా మారిపోయింది. దశాబ్దాలుగా ఊరిలో నియంతృత్వం సాగిస్తున్నా.. ఇన్నాళ్లూ చెల్లింది. ఇప్పుడు కొత్త గొంతులు ఆయనకు వ్యతిరేకంగా వినిపిస్తుండడంతో అచ్చెన్నలో అసహనం పెరిగిపోతోంది. ఈఎస్ఐలో రూ.150కోట్ల మేర కుంభకోణం చేసి విచారణలో బయటపడి అరెస్టయితే.. అది కక్ష సాధింపు అంటూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. తాజాగా నిమ్మాడలో సర్పంచ్ పదవి కోసం తన కుటుంబీకులకు ప్రత్యరి్థగా పోటీ చేస్తున్న కింజరాపు అప్పన్నను బెదిరించి, దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఏ3గా అరెస్టు అయ్యారు. ఈ విషయంలో కూడా వైఎస్సార్సీపీ టార్గెట్ చేసిందని గగ్గోలు పెట్టడం జిల్లా ప్రజానీకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సర్పంచ్ అభ్యరి్థపై దాడులకు దిగి నానా యాగీ చే సిన ఘటనలను మర్చిపోయి, కేవలం అరెస్టులను మాత్రం హైలెట్ చేయాలని చూడడం ఆయన అరాచక వైఖరికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తప్పంతా తన వైపే ఉంచుకుని ‘అధికారంలోకి వచ్చాక హోం మినిస్టరై నన్ను అరెస్టు చేసిన పోలీసులను వదిలి పెట్టనంటూ చిందులేయడం మరింత విస్మయపరుస్తోంది. అంతా అరాచకీయమే.. అచ్చెన్నాయుడు రాజకీయ జీవితం అంతా బెదిరింపులు, దౌర్జ న్యాల మయమే. జిల్లాలో ముఖ్యంగా నిమ్మాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ ఒక్కర్ని కదిపినా అచ్చెన్న తీరును ఇట్టే చెబుతా రు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నించేవాళ్లపై విరుచుకుపడటం, అడ్డు తగిలిన వాళ్లను తొలగించుకోవడం అచ్చెన్నాయు డి తరహా రాజకీయం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అండగా ఉండటంతో అడిగేవాడు లేకుండా పోయారు. అడ్డొచ్చిన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావాల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పా ల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. ఇప్పుడవన్నీ బయటికొస్తున్నాయి. చేసిన తప్పులకు అచ్చెన్నాయుడు అరెస్టువుతుంటే అదేదో అధికార పక్షం కక్ష సాధింపు అంటూ గగ్గోలు పెట్టడం, పోలీసు అధికారులపై చిందులేయ డం చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అచ్చెన్నపై అనేక కేసులు ఈఎస్ఐ కుంభకోణంలో అనేక కేçసులు ఎదుర్కొన్నారు. క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నిమ్మాడలో తనకు ప్రత్యరి్థగా నామినేషన్ వేసిన కింజరాపు అప్పన్నకు ఫోన్లో చేసిన బెదిరింపులు, వారి్నంగ్లు, నేరుగా జరిపిన దౌర్జన్యం, దాడుల ఘటనలో మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ఆయన సోదరుడు హరిప్రసాద్, సోదరుడి కుమారుడు సురే‹Ùతో పాటు వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితుడు అప్పన్న కోట»ొమ్మాళి ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149 ఐపీసీ అలాగే సెక్షన్ 123 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ దీ ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1995 కింద కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఏ1గా కింజరాపు హరిప్రసాద్, ఏ2గా కింజరాపు సురేష్, ఏ3గా కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం అచ్చెన్నాయుడును అరెస్టు చేసి కోర్టుకు తరలించడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఏ1,ఏ2గా ఉన్న హరిప్రసాద్, సురేష్ పరారీలో ఉన్నారు. అభ్యరి్థని బెదిరించడం వల్లనే ఈ కేసులన్నీ నమోదయ్యాయి. ఆడియో, వీడియోల ఆధారాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలతో పోలీసులు అరెస్టు చేస్తే.. పోలీసు అధికారులపైనే అచ్చెన్న చిందులేశారు. అనుచరులదీ అదే దారి.. అచ్చెన్న అనుచరులు కూడా ఈ తరహా రాజకీయ వ్యూహాలనే అనుసరిస్తున్నట్టున్నారు. ఆ మధ్య బుద్ధుడి విగ్రహం మణికట్టు చేయి ఎప్పుడో విరిగిపోతే దాన్ని రాజకీయం చేసి మత విద్వేషాలు రెచ్చగొడతామని యతి్నంచి దొరికిపోయారు. దీంట్లో తెరవెనక అచ్చెన్నా యుడు పాత్ర ఉందనేది ఆరోపణ. మొన్నటికి మొన్న సంత»ొమ్మాళి మండలం పాలేశ్వరపురం ఆలయంలో ని పాత నంది విగ్రహాన్ని టీడీపీ నేతలు పట్టపగలే తరలించి, నడిరోడ్డుపై ఉన్న సిమెంట్ దిమ్మపై ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిష్టించి అపచారానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాల పుటేజీతో అడ్డంగా దొరికిపోయి కూడా ఎదురుదాడికి దిగారు. దీంట్లో కూడా అచ్చెన్న పాత్ర ఉందన్న వాదనలు ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే విగ్రహం తరలిస్తే తప్పేంటి అంటూ ఓ వింతైన వాదన కూడా చేశారు. ప్రతి దాంట్లో వారే భాగస్వామ్యులై, ఆ పై అడ్డంగా దొరికిపోయి, అరెస్టులవుతుంటే అదంతా కక్ష సాధింపు అంటూ జనాన్ని ఏమార్చే వైఖరి ప్రజలకు అర్థమై పెదవి విరుస్తున్నారు. -
మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై
సాక్షి, శ్రీకాకుళం: ‘దైవం మనుష్య రూపేణా’.. అనే నానుడిని ఓ మహిళ పోలీస్ అధికారిణి అక్షరాలా రుజువు చేసింది. ముక్కు, ముఖం తెలియని ఓ మృతదేహాన్ని తన భుజాల మీద మోసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. పోలీసు అధికారిణి చేసిన పని.. ఏ ఆపద వచ్చినా పోలీసులు ముందుంటారనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆవిష్కృతమైంది. వివరాలు.. పలాసలోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష.. తానే స్వయంగా మృతదేహాన్ని మోసుకుని లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు ఆప్పజెప్పారు. కాగా శిరీషా చూపిన తెగువను పోలీసు అధికారులు అభినందిస్తున్నారు. చదవండి: మా మంచి సారు.. నరేంద్ర..! -
నంది విగ్రహం కేసు: విచారణకు అచ్చెన్న
సాక్షి, శ్రీకాకుళం : పలాసలోని సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం తరలింపు కేసులో డీఎస్పీ విచారణకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ముందుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లిన అచ్చెన్నాయుడు ఆ తరువాత కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కాశిబుగ్గ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శివరామిరెడ్డి అచ్చెన్నాయుడిని విచారిస్తున్నారు. అచ్చెన్నాయుడికి మద్ధతుగా టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తాము కూడా స్టేషన్లోకి వెళ్తామంటూ పోలీసు అధికారులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తన వెంట ఎవరూ రావొద్దని.. ఏదైనా జరిగితే రమ్మని టీడీపీ నేతలను అచ్చెన్నాయుడు కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై పోలీసుల విచారణ పూర్తి అయ్యింది. కాశిబుగ్గ పోలీసు స్టేషన్లో కొద్దిసేపు అచ్చెన్నాయును డీఎస్పీ శివరామిరెడ్డి విచారించారు. సంతబొమ్మాళి పాలేశ్వర స్వామీ నంది విగ్రహం తరలింపు కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలపై అచ్చెన్నాయుడిని పోలీసులు విచారించగా.. కాశిబుగ్గ పోలీసు స్టేషన్ నుంచి తిరిగి పలాస టీడీపీ కార్యాలయానికి ఆయన వెళ్లిపోయారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. జార్ఖండ్ నుంచి విశాఖపట్నం నుంచి బొలెరో వాహనం వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, తొమ్మది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు అంబులెన్స్‌లలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన మరో యువకుడిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు. మరో తొమ్మిది మంది పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మెరుపు వేగంతో బైక్.. ఇద్దరు మృతి) -
సీఐ సస్పెన్షన్‌పై టీడీపీ విషప్రచారం
సాక్షి, శ్రీకాకుళం: పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో మంగళవారం గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇద్దరిని మందలించి పంపడానికి పోలీసులు ప్రయత్నించారు. వారిని మందలించే క్రమంలో సీఐ వేణుగోపాల్ అదుపుతప్పి జగన్ అనే దళితుడిని బూటుకాలితో తన్నారు. దీనిని కొందరు వ్యక్తులు ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో డీజీపీ కార్యాలయానికి ఈ సమాచారం చేరడంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. మంగళవాం రాత్రే సీఐని సస్పెండ్ చేయాల్సిందిగా డీఐజీకి డీజీపీ ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తామే ఏదో ఈ ఘటనను బయటకు తీసినట్లుగా టీడీపీ ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వంపై విషప్రచారానికి పూనుకోవడం గమనార్హం. (సీఐ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు) ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను: ధర్మాన శ్రీకాకుళం జిల్లాలో దళితుడిపై జరిగిన దాడి గురించి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సీఐ దాడికి దిగడం బాధాకరం. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యుడైన సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చాము. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చాం. దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని మంత్రి ధర్మాన తెలిపారు. -
సీఐ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జగన్ అనే దళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నారు. ఈ ఘటన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని ఏపీ డీజీపీ కార్యాలయం సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం విశాఖపట్నం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాలన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
చెప్పిన కూర వండలేదని..
కాశీబుగ్గ: డబ్బై ఏడేళ్ల వయసు.. ఎన్నో కష్టాలు చూసి ఉంటారు. మరెన్నో అనుభవాలు మూటగట్టుకుని ఉంటారు. ఏడు దశాబ్దాల జీవితంలో ఎనలేని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. కానీ క్షణికావేశం ముందు ఆ అనుభవం ఎందుకూ కొరగాకుండా పోయింది. ఇంట్లో తాను అడిగిన కూర వండలేదని ఓ వృద్ధుడు ప్రాణం తీసుకున్నారు. పలాసలో గురువారం జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. మరోవైపు కరోనా కారణంగా కంటైన్మెంట్ జోన్లలో ఉంటూ బయటకు వెళ్లలేకపోతున్న కొందరి మానసిక స్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పలాస 18వ వార్డు పరిధిలోని అన్నపూర్ణ వీధికి చెందిన బెల్లాల ఆంజనేయులు (77) గురువారం ఉదయం నేలబావిలో దూకి మరణించారు. గురువారం పప్పు వండాలని ఆంజనేయులు ఇంట్లో భార్య నాగరత్నంకు చెప్పారు. అయితే ఆమె వండకపోవడంతో కోపోద్రిక్తుడై క్షణికావేశంలో సమీపంలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి కుమారుడు ఉన్నాడు. కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు సంఘట నా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్యతో తగాదా పడి ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..
బంధాలు, ప్రేమానుబంధాలు.. కరోనా దెబ్బకు పటాపంచలవుతున్నాయి. ఊహించని రీతిలో వచ్చి పడ్డ ఈ మహమ్మారి మనుషుల మధ్య గోడలు కట్టేస్తోంది. ఎవరినీ ఏమీ అనలేం.. కనీసం మిగిలున్నవారైనా క్షేమంగా ఉండాలి కదా.. పలాస–కాశీబుగ్గలో శుక్రవారం జరిగిన ఓ అరుదైన ఘటన గుండెను కదిలించేలా ఉంది. శ్మశానానికి తరలిస్తుండగా కరోనా ట్రూనాట్ పాజిటివ్ వచ్చిందని తెలిసి మృతదేహాన్ని బంధువులు వదిలేయగా... మున్సిపల్ సిబ్బంది జేసీబీతో తరలించడం వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్... పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను సస్పెండ్ చేశారు. కాశీబుగ్గ: మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం సమీపాన శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీలో వీధుల గుండా తరలిస్తున్న వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుడిది 13మంది కుటుంబ సభ్యులు గల ఉమ్మడి కుటుంబం. హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు, కోడలు ఇటీవల రైలులో ఇంటికి చేరుకున్నారు. అధికారులు వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వేరే ఇంట్లో ఉండే అవకాశం లేక ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ కలిసే జీవనం సాగించారు. హుటాహుటిన చేరుకున్న కలెక్టర్ ఈ ఘటన గురించి సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్ జె.నివాస్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో అధికంగా కరోనా అనుమానిత కేసుల నమోదు, వరుస మరణాలపై ఆరా తీశారు. మృతదేహం తరలింపు విధానంపై పలాస తహసీల్దారు మధుసూదన్, మున్సిపల్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో సమగ్రంగా దర్యాప్తు జరిపి అమానవీయ ఘటనకు బాధ్యులను చేస్తూ పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను సస్పెండ్ చేశారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఉదయపురం, కాశీబుగ్గలలో పర్యటించి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణంలో సమీక్షించారు. కరోనా కట్టడికి మరి న్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంఅండ్‌హెచ్‌ఓ చెంచయ్య వచ్చారు. ఆర్డీఓ కిషోర్ కుమార్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఒ డాక్టర్ లీల, ఎంపీడీఓ రమేష్‌నాయుడు, డాక్టర్ జోగి గౌతమ్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల నమూనాల సేకరణ మృతుడికి పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులందరి నుంచి నమూనాలు సేకరించి, పరీక్షకు పంపారు. కాంటాక్ట్స్ గుర్తించేపనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంతి తన సిబ్బందితో పన్నెండు మంది కుటుంబ సభ్యుల శాంపిల్స్ సేకరించారు. కరోనా లక్షణాలతో వృద్ధురాలి మృతి! సోంపేట: పట్టణంలోని కోర్టుపేట వీధిలో కరోనా లక్షణాలతో గురువారం రాత్రి వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జేసీ కె.శ్రీనివాసులు స్థానిక అధికారులతో కలసి కోర్టుపేట వీధిని శుక్ర వారం పరిశీలించారు. ఈ వీధిని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. కాకినాడ రిపోర్టు రావల్సి ఉందని వైద్య సిబ్బంది తెలియజేశారు. కోర్టు పేట వీధివారు కంటైన్మెంట్ నిబంధనలు పాటించి స్థానిక అధికారులకు సహకరించాలని స్థానికులను జేసీ కోరారు. కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రత్యేకాధికారి కె.శ్రీనివాసరావు, తహసీల్దార్ సదాశివుని గురుప్రసాద్, ఉప తహసీల్దార్ బి.అప్పలస్వామి, ఈవో జ్యోతిరెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. మృతుల పట్ల మానవత చూపండి కరోనా సమయంలో సంభవించే మరణాల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ నివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పలాసలో శుక్రవారం జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరమన్నా రు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టపైన విధానాలు పాటించాలన్నారు. సందేహాలుంటే పై అధికారులను సంప్రదించాలని తహసీల్దార్లు, ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. కోవిడ్ మరణాలకు సంబంధిత ప్రొ టోకాల్ కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. -
పలాసలో బుక్‌చేస్తే.. ఢిల్లీలో గుర్తించారు
సాక్షి, శ్రీకాకుళం: లాక్డౌన్ వేళ రైల్వే టికెట్లను క్యాష్ చేసుకోవాలని అడ్డదారిలో వెళ్లిన ఓ వ్యక్తి కటకటాలపాలైన సంఘటన పలాసలో చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ–టికెట్లు విక్రయిస్తున్న సెల్‌ఫోన్ విక్రయదారుడ్ని రైల్వే పోలీసులు అరెస్టు చేసి షాపును సీజ్ చేశారు. పలాస ఆర్పీఎఫ్ ఓసీ కె.కె.సాహు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వే మార్కెట్ పాత జాతీయ రహదారి రోడ్డులో చందన కమ్యూనికేషన్ పేరుతో సకలాబత్తుల గిరీష్‌కుమార్ అనే వ్యక్తి సెల్‌రీచార్జ్‌తో పాటు రైల్వే టికెట్లు ఆన్లైన్లో విక్రయిస్తుంటాడు. ప్రస్తుతం కోవిడ్–19 సందర్భంగా రైల్వేశాఖ శ్రామిక రైళ్లను నడుపుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో గిరీష్‌కుమార్ ఈ–టికెట్లను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది. మొత్తం 13 టికెట్లును ఆన్లైన్లో తీసుకున్నట్లు రైల్వేశాఖ ఐఆర్సీటీసీ అధికారులు ఢిల్లీలో గుర్తించి ఖుర్దారోడ్ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఓసీ కె.కె.సాహు తన సిబ్బందితో సహా రంగంలోకి దిగి గురువారం షాపును తనిఖీ చేయగా వాస్తవమని తేలింది. చదవండి: చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్ రైల్వే నిబంధనల ప్రకారం ఇతరులు రైల్వే టిక్కెట్లు అమ్మకూడదు. ఒక వ్యక్తి తన పాస్వర్డ్ వినియోగించి తన అవసరాలకు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. పెద్ద నగరాల్లో రైల్వేశాఖ అనుమతులతో నిబంధనలకు లోబడి టిక్కెట్లు విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒకే పాస్‌వర్డ్‌తో టికెట్లు కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. గత ఏడాది ఆగస్టులో ఇదే సెంటరుపై రైల్వేశాఖ దాడి చేసి కేసును నమోదు చేసింది. మళ్లీ అదే సంఘటన పునరావృతం కావడంతో రైల్వే అధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఆయన్ను అరెస్టు చేయడంతో పాటు షాపును సైతం సీజ్ చేశారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: దొంగ చేతివాటం: ఏకంగా ఆర్టీసీ బస్సునే.. -
పలాసలో దారుణం: టాయిలెట్లో మృతదేహం
సాక్షి, కాశీబుగ్గ: పలాసలో కలకలం రేగింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని టాయిలెట్లో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో పట్టణంలో భయాందోళనలు అలముకున్నాయి. మృతుడిని కవిటికి చెందిన పల్లి సాంబమూర్తి(40)గా పోలీసులు గుర్తించారు. పలాసలోనే చాలాకాలంగా చిన్న చి న్న పనులు చేసుకుంటూ అతడు కుటుంబానికి దూరంగా జీవనం సాగిస్తున్నాడు. మృతదేహం పడి ఉన్న తీరు, శరీరంపై గాయాలు, కాంప్లెక్స్ పరిసరాల్లోని ఆనవాళ్లను బట్టి అతడిని పాశవికంగా హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కలాసీలు గుర్తించారు.. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం కొందరు కలాసీలు టాయిలెట్‌కు వెళ్లగా.. ఒక గది లో మృతదేహం కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీసి ఆ సమీపంలో ఉన్న పోలీసులకు విషయం చెప్పారు. వారు ఎస్ఐ మధుకు సమాచారం అందించడంతో ఆయన సీఐ వేణుగోపాలరావు, క్రైమ్‌టీమ్‌లను సంప్రదించి అంతా కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. కొందరు ప్రైవేటు కూలీలతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం రక్తపు మడుగులో ఉండడం, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అడుగడుగునా.. కాంప్లెక్స్‌లో శవం బయట పడిందన్న విషయం తెలిసి పలాస–కాశీబుగ్గ వాసులు ఆందోళనకు గురయ్యారు. మృతదేహం పడి ఉన్న తీరు, అతడి శరీరంపై గాయాలు పరిశీలనగా చూస్తే తీవ్ర పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న పాన్‌షాప్ తలుపులకు, కింది గచ్చుభాగానికి రక్త పు మరకలు అంటి ఉన్నాయి. చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉండగా.. కాంప్లెక్స్‌లో బస్ పాసులిచ్చే ద్వారం వద్దకు వ్యక్తిని ఈడ్చుకువెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని పోలీసులు చూసే సరికి.. పురుషాంగంతో పాటు ఆపైభాగం, కింది భాగాల్లో తీవ్రమైన గాయాలు కనిపించాయి. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమా ర్టం జరిగితే మరిన్ని విషయాలు బయటపడతా యని చెబుతున్నారు. దర్యాప్తులోనే.. ఈ సంఘటనపై కాశీబుగ్గ పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మృతుడు కవిటికి చెందిన పల్లి ఫకీరు(లేటు) తల్లి జోగమ్మల చిన్న కుమారుడని, వివాహం కాలేదని తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎదురుగానే సీసీ కెమెరాలు.. మృతదేహం లభ్యమైన స్థలానికి కాసింత దూరంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల్లో దృశ్యాలు, వీడియోలు ఉంటా యని పోలీసులు భావిస్తున్నారు. రక్తపు మరకలు ఉన్న కాంప్లెక్స్ నీటి కుళాయికి ఎదురుగా కూడా ఓ సీసీ కెమెరా ఉంది. మృతుడి జేబులో ఉన్న కాగితాల ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు. -
మేకింగ్ ఆఫ్ పలాస 1978
-
సీపీఐ(ఎంఎల్) సీనియర్ నాయకురాలు మృతి
సాక్షి, శ్రీకాకుళం: సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకురాలు కామ్రేడ్ జయమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. 70 ఏళ్లుగా గిరిజన సాయుధ పోరాటంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 35 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అనంతరం 1995లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జనజీవనానికే మొగ్గు చూపారు. -
భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని..
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ప్రేమను జీవితాంతం కొనసాగించలేకపోయారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. పలాస పొందర వీధిలోని పొందర కులానికి చెందిన పొందర తేజేశ్వరరావు, ఉదయపురంలోని చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మౌనికలు ఇరు కుటుంబాలను ఎదురించి మరీ నాలుగేళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. పలాస జీడిపిక్క బొమ్మకు సమీపాన కేటీ రోడ్డుకు ఆనుకుని ఉ న్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి కాపురం నాలుగేళ్లు సజావుగానే సాగింది. ఈ దంపతులు ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఆదివారం రాత్రి దంపతులు సినిమాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ మౌనిక ప్రాణాలు కోల్పోయింది. సెల్‌ఫోన్ తగిలి చనిపోయిందని, భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని స్థానికంగా రకరకాలు మాట్లాడుకుంటున్నారు. భర్త కూడా ఇలాగే చెబుతున్నారు. ఆదివారం రాత్రి సంఘటన జరిగితే సోమవారం ఉదయం పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించంతో సీఐ వేణుగోపాలరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తర్వాతే వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి బంధువులు ‘కులాంతర వివాహం చేసుకున్నప్పుడే మా అమ్మాయిచనిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమీ చనిపోలేదు’ అని మాట్లాడడం గమనార్హం. -
క్షణికావేశం... మిగిల్చిన విషాదం
పలాస: చిన్న విషయమై తలెత్తిన గొడవ ఇద్దరి వ్యక్తుల మధ్య కొట్లాటకు దారి తీసింది. ఆపై క్షణికావేశం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. తెల్లారేసరికి ఒకరి ముఖం ఒకరు చూసుకుని, కలిసిమెలసి ఉండాల్సిన చోట విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన కుత్తుం జానకీరావు(63) గురువారం ఉదయం మృతి చెందా డు. గ్రామానికి బత్తిన దమయంతమ్మ తోటలో ఒక పనస చెట్టు ఉంది. అది గతేడాది తిత్లీ తుపానుకు పూర్తిగా విరిగిపోయింది. మరలా ఆ చెట్టుకు చిగుర్లు తొడిగి చిన్న కొమ్మలు ఏర్పడ్డాయి. అండమానులో ఉంటున్న ఈమెకు మృతుడు జానకీరావు పనస చెట్టు కొమ్మలను మేకల కోసం కోసుకుంటానని కోరాడు. అందుకామె సరేనంది. దీంతో గురువారం ఉదయం పనస చెట్టు వద్దకు వెళ్లి కొమ్మలు కోస్తున్నాడు. ఇదేక్రమంలో అదే గ్రామానికి చెందిన సైని నారాయణ వెళ్లి ప్రశ్నించాడు. దమయంతమ్మ కోసుకోమని చెప్పిందని అంటుండగానే... కోప్రోదిక్తుడైన నారాయణ ఆ చెట్టును తనకిచ్చిందని చేతితో పిడిగుద్దులు గుద్దాడు. ఆ ధాటికి తట్టుకోలేక ఆయన నేలపై పడిపోయాడు. అంతటి ఆగకుండా తన కాలితో గుండెపై తన్నాడు. వీరువురి కొట్లాటను గమనించిన గ్రామస్తులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. వెంటనే జానకీరావును ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిగా నీరు తాగిన తర్వాత వాంతులు చేశాడు. స్థానిక ఆర్ఎంపీకి చూపించగా బీపీ తగ్గిందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఆ మేరకు ఆటోలో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడ్నుంచి పలాస ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు. మృతుడికి భార్య సరస్వతి, కుమార్తెలు చంద్రకళ(35), శాంతి(30), కుమారుడు గౌతమ్(25) ఉన్నారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ సీఐ ఆర్ వేణుగోపాల్ తెలిపారు. -
విధి చేతిలో ఓడిన సైనికుడు
అనునిత్యం ఫిరంగుల మోతలతో దద్దరిల్లే దేశ సరిహద్దులో విధి నిర్వహణకు ఏనాడూ అధైర్యపడలేదు. శత్రువుల భీకర దాడులను ధీటుగా తిప్పికొట్టాడు. విధి చేతిలో మాత్రం ఓడిపోయాడు ఆ సైనికుడు. యుద్ధమంటే ఉప్పొంగే గుండె ధైర్యం క్యాన్సర్ మహమ్మారి ముందు చిన్నబోయింది. రణరంగంలో కీలుగుర్రంలా దూసుకుపోయే అతడి కాళ్లను బంధించి అణువణువునా మింగేసింది. బోన్ క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన బొడ్డపాడు గ్రామానికి చెందిన జవాను పాపారావుకు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సాక్షి, పలాస(శ్రీకాకుళం) : మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన వీర జవాను బుడత పాపారావు(38) పేద రైతు కుటుంబంలో పుట్టి దేశ సైనికునిగా సేవలందించడానికి సైన్యంలో చేరాడు. జవాను నుంచి నాయక్ స్థాయికి ఎదిగాడు. తన బెటాలియన్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భోపాల్‌లో నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో పుణెలోని సైనిక ఆస్పత్రిలో చేరాడు. అక్కడ మెరుగైన వైద్య సేవలంది మళ్లీ కోలుకుని సైన్యంలో చేరి విధులు నిర్వహిస్తాడని అందరూ ఆశించారు. అయితే విధి వక్రీకరించింది. ఆయనకు బోన్ క్యాన్సరు ఉందని అక్కడ వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ అన్ని ప్రయత్నాలు చేసి వైద్య సేవలందించినా ఫలితం లేకపోయింది. మృత్యువుతో పోరాడుతూ ఈ నెల 24న ఉదయం 9 గంటలకు మృతి చెందాడు. తమ ఒక్కగానొక్క కుమారుడు జవాను నుంచి నాయక్ హోదాకు ఎదిగాడని ఎంతగానో ఆనందించిన అతడి తల్లిదండ్రులు పార్వతి, మోహనరావు ఈ విషయం తెలుసుకుని జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం తమ స్వగ్రామానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య ఉష, కుమారుడు యువరాజు(9), కుమార్తె (6) ఉషిత శోకతప్త హృదయాలతో విలపించారు. వీరిని ఓదార్చడానికి ప్రయత్నించిన గ్రామస్తులు, బంధువులు కూడా కన్నీళ్లు పెట్టారు. అనంతరం సహచర సైనికులు సైనిక వందనం చేసి మృతదేహంపై జాతీయ జెండా కప్పి అంతిమ యాత్ర చేపట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పలాస ఆస్పత్రి.. రిమ్స్‌కు అనుసంధానం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పలాసలో ఏర్పాటు చేయనున్న 20 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లను శ్రీకాకుళంలోని రిమ్స్ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకు వస్తున్నట్టు జీఓలో పేర్కొన్నారు. రూ. 50 కోట్ల ఖర్చుతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లను పలాసలో ఏర్పాటు చేయనున్న విషయం పాఠకులకు తెలిసిందే. వైద్య విద్యార్థులు, రోగులకు ఉపయోగకరం ఇక్కడ పనిచేసేందుకు ఐదు రెగ్యులర్ పోస్టులు, 100 పోస్టులు కాంట్రాక్టు విధానంపైన, 60 పోస్టులు ఔట్ సోర్సింగ్ విధానంపైన భర్తీ చేసేందుకు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రిమ్స్‌కు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనుసంధానం చేయడం వల్ల ఇక్కడి వైద్య విద్యార్థులకు, పలాస సూపర్ స్పెషాలిటీలోని రోగులకు ఎంతో ఉపయోగం కానుంది. వైద్య విద్యార్థులు రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి పలు విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిమ్స్‌లోని వైద్యులు, వైద్య విద్యార్థులు సూపర్ స్పెషాలిటీలోని రోగులకు వైద్య సేవలు అందించేందుకు కూడా వీలు కలుగుతుంది. జిల్లాలోని పలు కమ్యూనిటీ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా వైద్య విధాన పరిషత్‌కే అప్పగిస్తారని పలువురు భావించారు. అయితే ప్రభుత్వం రిమ్స్‌కు అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో వలె కాకుండా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కావాల్సిన పోస్టులను కూడా మంజూరు చేయడం పట్ల అన్ని వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నియమించనున్న ఉద్యోగులకు ఏటా రూ.8.93 కోట్లు జీతాల కోసం వెచ్చించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు ప్రతిపక్ష నాయకుని హోదాలో జిల్లాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటించినపుడు ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారి కష్టాలతో పాటు వారి కుటుంబాలు పడుతున్న అవస్థలను నేరుగా తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పలాసకు మంజూరు చేస్తూ ఇటీవలే శంకుస్థాపన సైతం పూర్తి చేశారు. అదే విధంగా కిడ్నీ రోగులకు మనోధైర్యం కల్పించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఉద్దానం ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విధి విధానాలు తెలియాల్సి ఉంది రిమ్స్ ఆస్పత్రికి పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం విషయం తెలుసుకున్నాను. ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి తమకు ఇంకా అందకపోయినా ఆదేశాలను చదివాను. అయితే ఈ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలు ఇంకా తెలియాల్సి ఉంది. రిమ్స్‌కు మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం చేయడం ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ కృష్ణవేణి, రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
రిమ్స్ నియంత్రణలోకి ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం
సాక్షి, అమరావతి/ శ్రీకాకుళం : పలాసలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెండు వందల పడకల ఆసుపత్రితో పాటు, కిడ్నీ పరిశోధనా కేంద్రాలను శ్రీకాకుళం రిమ్స్ నియంత్రణ పరిధిలోకి తీసుకుని వస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవోను జారీ చేసింది. -
పల్లెటూరి వాళ్లం కదా! అభిమానాలు ఎక్కువ..
చీరలకు గంజి పెట్టి, ఆరేస్తూ, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, మనసు హాయిగా ఉండటం కోసం కూనిరాగాలు తీస్తున్న బేబీని సెల్‌ఫోనులో బంధించి, సోషల్ మీడియాలో ఉంచితే, ఆ వీడియో బేబీని త్రసీమకు పరిచయం చేసింది. సింగర్ రఘు కుంచె ఆ పల్లెకోయిల మీద లక్ష్మీభూపాలతో ఒక పాట రాయించి, ఆ పాటను చిత్రీకరించి యూట్యూబ్‌లో ఉంచారు. ఆ పాటకు పాతిక లక్షలకు పైగా వ్యూస్ చ్చాయి. ఇప్పుడు ‘పలాస’ చిత్రంతో తొలిసారిగా నేపథ్యగాయనిగా గళం విప్పిన ఈ పల్లె కోయిల పసల బేబీ మదిలోని రాగాలివి. ‘పలాస’ సినిమా కోసం బాలు గారితో గొంతు కలిపే అవకాశం రావడం నాకు దొరికిన అదృష్టం. పెద్ద పండుగ. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ అదృష్టం దక్కుతుంది. ఈ పాట ముందర నాతో విడిగా పాడించారు. నేను పాడుతున్నప్పుడు నాతో బాలుగారు పాడుతున్న విషయం నాకు తెలియదు. ట్రాక్ కోసం నేను రఘుగారు కలిసి పాడాం. బాలుగారితో నేను పాడుతున్నానని చెప్పడానికి రఘు గారు సంశయించారు. పాట పూర్తయిపోయింది. ఆయన దగ్గరకువెళ్లి ఈ పాట వినిపించగానే, నా గొంతు విని ‘ఎవరు పాడారు?’ అని ఆయన అడిగారట. రఘుగారు నా పేరు చెప్పారట. ప్రొఫెషనల్‌గా పాడానని బాలుగారు దీవించారట. పల్లెపాటల అమ్మాయితో పాడటం తనకు సంతోషంగా ఉందని కూడా బాలుగారు అన్నారట. చదువు, సంధ్య, సంగీత జ్ఞానం లేని నాకు బాలుగారితో పాడే వరం లభించింది. ఇందుకు ముందుగా నేను కోటి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. శత ‘కోటి’ వందనాలు ‘మట్టిమనిషినండి నేను’.. అనే పాటనే లక్ష్మీభూపాలగారితో రాయించి, రఘు కుంచెగారు ట్యూన్ చేసి, నా మీద షూటింగ్ చేసి నాతో పాడించి, నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయనకు శతకోటి దనాలు. పాటకు నన్ను అంటు కట్టారు. నన్నొక మొక్కలా నాటి, నీళ్లు పోసినందుకు ఆయన ఋణం తీర్చుకోలేను. ఇటీవలే ‘రాణు మోండల్’ అనే బెంగాలీ యాచకురాలు రైల్వే ప్లాట్ ఫామ్ మీద పాడిన షోర్ చిత్రంలోని ‘ఏక్ ప్యార్ క నగ్మా హై’ పాటతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. నాకూ అవకాశాలు వస్తే్త మరింత బాగా పాడి, మరింతమందికి చేరువ కావాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక విషయం. కోటిగారు నన్ను హైదరాబాద్ రప్పించి, పెద్దపెద్దవాళ్లందరికీ నన్ను పరిచయం చేశారు. అంతవరకు నాకు హైదరాబాద్ అంటేనే తెలియదు. ఇక్కడితో ఆగకుండా నన్ను దుబాయ్ కూడా తీసుకువెళ్లారు. విమానం ఎలా ఎక్కాలో కూడా నాకు తెలియదు. అక్కడ కదిలే మెట్లు ఎక్కుతున్నప్పుడు నేను పడిపోతుంటే, ఆయన చెయ్యి ఇచ్చి నాకు అండగా నిలిచారు. పల్లెటూరి వాళ్లం కదా! మాకు అభిమానాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా మాట్లాడకపోయినా కూడా చాలా బాధ పడతాం. కోటిగారు నాకు ఎన్నో పాటలు పంపుతున్నారు, నేను పాడి వాటిని ఆయనకు పంపితే, ఆయన తప్పులు సరిచేస్తున్నారు. ఇప్పుడు మరింత బాగా పాడేందుకు ప్రయత్నిస్తున్నాను. రాసుకుని సాధన చేస్తున్నాను ఎవరు ఏ పాట అడిగితే ఆ పాట బాగా సాధన చేసి వేదికల మీద పాడుతున్నాను. కోటిగారి సలహా మీద తెలుగు బాగా చదవగలుగుతున్నాను. ప్రతి పాట రాసుకుని చదువుతూ పాడుతున్నాను. నేను వందేళ్లు బతక్కపోయినా పరవాలేదు, ఒక మంచి పాట పాడి నాలోని గాయకురాలిని చిరస్మరణీయం చేయాలన్నదే నా కోరిక. ‘తీపి రాగాల తోటి మా ఊరు దాటి మీ కోసమొచ్చాను. యాతమేసి తోడాను నాలో ఉన్న రాగాలను’ నన్ను సినిమా పరిశ్రమ అక్కున చేర్చుకుని, నా చేత ఇంకా ఇంకా తోడించమని అర్థిస్తున్నాను. అందరూ ప్రోత్సహించాలి... బేబీ గాత్రంలో పలికే గమకాల వల్ల ఆవిడ ఏ పాట పాడినా చక్కగా ఉంటోంది. అది దేవుడు ఇచ్చిన వరం. రఘు కుంచె పాడించిన మొదటి పాట బాగా హిట్ అయింది. ఆవిడను సినీ పరిశ్రమలోని సంగీత దర్శకులు పాడించి, ప్రోత్సహించి పెద్ద స్థాయికి తీసుకురావాలన్నదే నా కోరిక. ఆవిడ చదువుకోలేదు, చిన్నతనం నుంచి పాటలు పాడిన జ్ఞానమే ఆవిడను ఈ స్థాయికి తీసుకు వచ్చింది. ఆవిడకు నేను అక్షరాభ్యాసం చేశాను. ఒక టీచర్ ని పెట్టి అక్షరాలు నేర్పిస్తున్నాను. నాన్నగారి (సాలూరి రాజేశ్వరరావు) పాటల లింకులు పంపిస్తుంటే అన్నీ బాగా నేర్చుకుని పాడుతున్నారు. దోషాలు ఉంటే సరిచేస్తున్నాను. బాగా సాధన చేసి వేదికల మీద పాడుతున్నారు. – కోటి, సంగీత దర్శకులు – వైజయంతి పురాణపండ -
కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఆసుపత్రి
-
తిత్లీ తుపాను బాధితుల సహాయం రెట్టింపు
-
తిత్లీ తుపాను బాధితులకు ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి : తిత్లీ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 30న పలాసలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ పరిహారాన్ని భారీగా పెంచారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టం వాటిల్లిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచింది. నష్టం వాటిల్లిన జీడిమామిడి చెట్లకు హెక్టారుకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. తాజాగా పెంచిన పరిహారాన్ని అందించడానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. లక్షలాది కొబ్బరి చెట్లు, వేలాది హెక్టార్లలో జీడిమామిడి తోటలు నేల కూలాయి. ఏళ్లుగా పెంచుకున్న తోటలు నాశనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం తిత్లీ తుపాను సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏ మూలకూ సరిపోని విధంగా నేలకూలిన కొబ్బరి చెట్టుకు రూ.1500, పూర్తిగా నష్టం వాటిల్లిన జీడిమామిడి తోటకు ఒక హెక్టారుకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీపీ నేతల జోక్యం వల్ల లబ్ధిదారుల జాబితాలో తోటలు నష్టపోయిన రైతుల పేర్లు గల్లంతయ్యాయి. లబ్ధిదారుల జాబితాలో సింహభాగం టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లే కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విన్నవించుకున్నారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతామని, అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని అప్పట్లో వైఎస్ జగన్ పలాస సభలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిత్లీ తుపాను బాధిత రైతులకు పరిహారాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఉద్ధానం సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం సిబ్బందిని నియమించనుంది. వైద్యుడు, సిబ్బందిని మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్రాతిపదికన 5 పోస్టులు, కాంట్రాక్ బేసిస్ కింద 98, సర్వీస్ ఔట్‌సోర్స్ కింద60 పోస్టులను మంజూరు చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాకముందే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా రూ.10 వేలు కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచే కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో పర్యటించారు. కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్ జగన్ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. అంతే కాకుండా ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇపుడు రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఉద్దాన సమస్యపై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పాలిట దేవుడయ్యారని ప్రశంసిస్తున్నారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం
శ్రీకాకుళం : జిల్లాలోని పలాసలో దారుణం చేటుచేసుకుంది. వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ తల్లీ, బిడ్డ మృత్యువాత పడ్డారు. ఈ విషాదకరమైన సంఘటన శివదుర్గ విష్ణు ప్రియ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జరిగింది. ఆదివారం బైనపల్లి రేవతి (24) అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో.. ఆమె కుటుంబసభ్యులు కాన్పు కోసమని స్థానిక ప్రైవేటు అస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తల్లీ, బిడ్డ మృతి చెందారు. కాగా, ఆస్పత్రిలోని వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే రేవతి మృతిచెందారని ఆమె భర్త నరేశ్ ఆరోపించారు. డాక్టర్ గాయత్రికి వైద్యురాలిగా కనీస అర్హత కూడా లేదని.. ఆమె భర్త డాక్టర్ రాజ్‌కుమార్ నీడన మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. హాస్పిటల్లో చేరిన మహిళల వద్ద నుంచి లక్షల రూపాయాలు వసూలు చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫలించిన ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): వారంరోజులుగా మూతవేసిన జీడి పరిశ్రమలను తెరవాలని, తక్షణమే పనులకు హాజరుకావాలని పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు. 12 శాతం కార్మికులకు పెంచాల్సిన వేతన ఒప్పందం అమలు చేయకుండా పరిశ్రమ యజమానులు కాలయాపన చేస్తుండడంతో పరిశ్రమలు మూతబడిన విషయం తెలిసిందే. మంగళవారం పరిశ్రమల యజమానులకు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి తన స్వగృహామంలో మాట్లాడారు. రెండేళ్లకు ఒక్కసారి కుదుర్చుకునే వేతన ఒప్పందం ప్రకారం యజమానులు అమలు చేయకపోవడంతో మూకుమ్మడిగా బంద్ పాటించామని కార్మికులు ఎమ్మెల్యేకు వివరించారు. యాజమాన్యం మొండి వైఖిరి తగదని ఒప్పందం ప్రకారం 12 శాతం వేతనాలు పెంచాలని విన్నవించారు. పరిశ్రమల యజమానులు మాట్లాడుతూ తిత్లీ తుపాను సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆర్థికంగా చితికిపోవడంతో తగిన గడువు కావాలని కోరారు. కార్మికులకు, పరిశ్రమ యజమానులకు ఎమ్మెల్యే నచ్చజెప్పి ప్రస్తుతం పరిశ్రమలు తెరవాలని, ప్రొససింగ్‌కు ఆటంకం కలగకుండా కార్మికులు సైతం పనులకు హాజరుకావాలని ఆదేశించారు. వారం రోజులపాటు ఆలోచించి కార్మికుల డిమాండ్ ప్రకారం యాజమాన్యంతో ఆ ఒప్పందానికి సంతకాలు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, శాశనాపురి శ్రీనివాస్, యరుకోలు సుధాకర్, కాష్యూ లేబర్ ఆసోసియేషన్(కార్మికులు) అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, సభ్యులు కోనారి రాము, పెంట అసిరినాయుడు, గోరుశెట్టి అమ్మన్న, వంకల రామయ్య, బొమ్మాళి తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు పాటించిన యజమానులు, కార్మికులు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో, పరిసర ప్రాంత పల్లెల్లో ఉన్న 300లకు పైగా జీడి పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల యజమానులు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చల అనంతరం పరిశ్రమలు తెరుచుకున్నాయి. వేతన ఒప్పందానికి వారం రోజులు గడువు ఇచ్చినప్పటికీ.. ముందుగానే పరిశ్రమలు తెరవాలని యజమానులకు, పనుల్లోకి హాజరుకావాలని కార్మికులకు ఎమ్మెల్యే చెప్పడంతో అందరూ వారి పనుల్లోకి హాజరయ్యారు. బుధవారం ఉదయం నుంచి కటింగ్ మిషన్ కార్మికులు హాజరుకానున్నారు. -
ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు
‘‘ముంబైలో మాఫియా ఒకలా, విజయవాడలో మరోలా ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. అది ఎలా ఉంటుందన్నది ‘పలాస’లో కొత్తగా ఉంటుంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. రక్షిత్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు ప్రతిదర్శకుడు ఒక్కో జానర్లో సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ లుక్‌లో కొత్త సబ్జెక్ట్‌తో తీసిన ‘పలాస’ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో లుక్ బాగున్నాయి. తమ్మారెడ్డిగారు ఇలాంటి సినిమాలకు అండగా నిలబడటం çహ్యాపీ’’ అన్నారు. ‘‘తెలుగు కథ వైజాగ్ దాటి ముందుకుపోలేదు. పలాస ప్రాంతం నేపథ్యంలో రాసుకున్న ఈ కథను ప్రసాద్, తమ్మారెడ్డిలకు చెప్పాను. వాళ్లు ముందుకు రావడంతోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాను. 40 యేళ్లపాటు సాగే కథను 40 రోజుల్లో తీయడం మా టీమ్ సహకారం వల్లే సాధ్యం అయింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘ఇందులో క్రూరమైన పాత్ర చేశాను’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె. ‘‘రెండు నెలల పాటు పలాసలో షూటింగ్ చేశాం. ‘గాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ లాంటి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు రక్షిత్. నక్షత్ర, రచయిత నాగేంద్ర, కెమెరామెన్ విన్సెంట్ అరుల్, వెంకట సిద్ధారెడ్డి మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎ.ఆర్ బెల్లన్న. -
కంచుకోటలో సీదిరి విజయభేరి
సాక్షి, పలాస (శ్రీకాకుళం): టీడీపీ కంచుకోట బద్దలైంది. వారసత్వ రాజకీయాలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం తర్వాత అత్యంత రాజకీయ చైతన్యం గల పలాస నియోజకవర్గం ప్రజలు ఈ ఎన్నికల్లో తమ చైతన్యాన్ని సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి రుచిచూపించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజును 16001 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో పలాసతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ఫ్యాన్’ గాలి జోరుగా వీయడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పూండి, పలాస, మందస, ఎమ్మెల్యే స్వగ్రామం దేవునల్తాడల్లో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. లాభించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. పలాస ఎమ్మెల్యేగా గౌతు శివాజీ ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదు. దీనిని కూడా నిశితంగా ఇక్కడి ప్రజలు గమనించారు. ఆరు నెలల క్రితం వచ్చిన తిత్లీ తుపానులో నష్టపోయిన రైతులకు సరైన న్యాయం జరగలేదు. పరిహారం అర్హులకు అందలేదు. గ్రామాల్లో రాజ్యాంగేతర శక్తులుగా చంద్రబాబు పెంచి పోషించిన జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే అరకొర నష్టపరిహారం పంపిణీ జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులకే ముట్టజెప్పారు. పలాస నియోజకవర్గంలోనే ఉద్దానం ప్రాంతంగా చెప్పుకున్న వజ్రపుకొత్తూరు, మందస, పలాస, మండలాల్లోని రైతులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నది ఓట్ల లెక్కింపు సరళి తెలియజేస్తుంది. ఇదిలా ఉండగా, గౌతు శ్యామసుందరశివాజీ తన కుమార్తె శిరీషను తన రాజకీయ వారసురాలిగా నిలబెట్టడాన్ని కూడా ఇక్కడ ఓటర్లు సమ్మతించలేదు. దీనికి తోడు శిరీష భర్త వెంకన్న చౌదరి తన మామ శివాజీని అడ్డంపెట్టుకుని చేసిన ఆర్థిక అరాచకాలను ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఏకపక్షంగా ఓట్లు.. ఎన్నికలకు కొద్ది నెలల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఈ ప్రాంతంలో జరగడం, ఆయన ఇచ్చిన హామీలు ప్రజల హృదయాలను తాకాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రకు ఎంత ఆదరణ లభించిందో జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు అంతే స్థాయిలో ఆదరణ వచ్చింది. వైఎస్సార్ సంక్షేమ పథకాలను మరువలేని ప్రజలు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే లభిస్తాయన్న గంపెడు ఆశలతో ప్రజలు భావోద్వేగానికి లోనై ఏకపక్షంగా ఓటు వేసినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బోసిపోయిన టీడీపీ కార్యాలయం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఓ పక్క ఓట్లు లెక్కింపు కార్యక్రమం జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది. ఒకప్పుడు పలాసలోని టీడీపీ కార్యాలయం కళకళలాడుతుండేది. ఎన్నికల లెక్కింపు వేళ గురువారం కార్యాలయం బోసిపోయింది. పైగా ఇటీవలే ఆ కార్యాలయానికి ఏసీ అమర్చిన నేతలు ప్రస్తుతం ఓటమి పాలవడంతో కార్యాలయం ముఖం చూడని పిరిస్థతి ఎదురైంది. ఎమ్మెల్యేగా డిక్లరేషన్ పొందిన సీదిరి పలాస వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా డాక్టర్ సీదిరి అప్పలరాజుకు అత్యధిక ఓటు మెజారిటీ రావడంతో పలాస ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.అనితాదేవి గురువారం సాయంత్రం డిక్లరేషన్ పత్రం అందజేశారు. అప్పలరాజు, సతీమణి శ్రీదేవిలు రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధ్రువపత్రం అందుకున్నారు. -
ఒకరు పోతేగానీ మరొకరికి సేవలుండవు..!
ఒకరు బతకాలంటే మరొకరు కన్నుమూయాలా..? ఒకరి ఊపిరి నిలపాలంటే మరొకరి ఉసురు ఆగిపోవాలా..? జిల్లాలోని కిడ్నీవ్యాధిగ్రస్తులు ఇలా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి స్థానం ఖాళీ అయితే గానీ మరొకరికి డయాలసిస్ అందని కఠిన స్థితిలో ఉన్నారు. చాలా మంది ఇక్కడ కొన ఊపిరితో డయాలసిస్ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రమాణాలు చేయడం, ప్రకటనలు ఇవ్వడం తప్ప సేవలు మర్చిపోయిన సర్కారు తీరుతో వీరు విసిగిపోయారు. జనం ప్రాణాలు కాపాడలేని అసమర్థ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గ : ఇటీవల పలాస మండలంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన ఒక కిడ్నీవ్యాధిగ్రస్తుడు మరణించాడు. ఆ విషయం తెలుసుకున్న సుమారు ఆరుగురు రోగులు ఆస్పత్రి వారిని సంప్రదించారు. తాము విశాఖ, శ్రీకాకుళం వెళ్లలేమని, పలాసలో డయాలసిస్ అయ్యేలా అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా డయాలసిస్ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు ఇంకా వందలాదిగా ఉన్నారు. ఉద్దానం కిడ్నీవ్యాధిగ్రస్తులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కిడ్నీవ్యాధి సోకిన వారిలో అధికంగా డయాలసిస్ చివరి దశలో ఉన్న వారు ఇక బతుకుపై ఆశలు వదిలేసుకుంటారు. కానీ వీరి వెనుక డయాలసిస్ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం అంతకంటే నరకం అనుభవిస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒకరు చనిపోతే గానీ తమకు సేవలు అందని దౌర్భాగ్య పరిస్థితిని తలచుకుని కుమిలిపోతున్నారు. ప్రభుత్వం కపట ప్రేమ రెండున్నర దశాబ్దాలుగా ఉద్దానం, తీర ప్రాంతాల ప్రజలను వణికిస్తున్న కిడ్నీ భూతంతో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికీ వీరి కోసం ప్రభుత్వం ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపలేదు. జిల్లాలో 7 ఉద్దాన తీర ప్రాంతంలో సుమారు 20 వేల మంది ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే వారిలో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 80 మంది రోగులు మాత్రమే డయాలసిస్ చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో విఫలమైందో ఊహించుకోవచ్చు. కొందరికే అవకాశం.. ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్ కేంద్రాల్లో సదుపాయాలు లేక, ఉచిత మందులు అందక, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలాస డయాలసిస్ కేంద్రంలో కేవలం డయాలసిస్ మిషన్లు (హెచ్డి) 9 ఉండగా వీటిలో 7 పాజిటివ్, 2 నెగిటివ్ మిషన్లు ఉన్నాయి. దీనిలో 80 మంది రోగులకు రోజుకు 3 షిఫ్ట్‌లలో 27 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మరో ఇద్దరు రావాల్సి ఉంది. మిగిలిన రోగులు డయాలసిస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సుదూర ప్రాంతాల్లో గల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రకటనలకే పరిమితమా..? జిల్లాకు వచ్చిన ప్రతిసారీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అది చేస్తాం. ఇది చేస్తాం అని గొప్పలు చెబుతున్న ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు వాటిని నెరవేర్చడంలో మాత్రం విఫలం అవుతున్నారు. రోగులకు ఉచిత మందులు అందిస్తానని, డయాలసిస్ కేంద్రాలను పెంచుతానని, వారికి పింఛన్లు అందిస్తానని అనేక హామీలిచ్చి వెళ్లిపోయారే తప్ప వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం నెఫ్రాలజిస్టు నియామకం చేపట్టకపోవడంతో డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాల పరిధిలో 20వేలమందికిపైగా అన్నిరకాల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, ఇచ్ఛాపురం, సొంపేట, కంచిలితో మొత్తం ఏడు మండలాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో డయాలసిస్ కేంద్రాల్లో పాలకొండలో 50 మంది రోగులు, శ్రీకాకుళం రిమ్స్‌లో 125 మంది, టెక్కలి 72 మంది, పలాసలో 80మంది, సొంపేటలో 100 మంది, కవిటి, 50 మంది రోగులు డయాలసిస్ పొందుతున్నారు. ప్రతి సెంటర్ వద్ద సుమారు ఐదు నుంచి పదికిపైగా కిడ్నీ రోగులు వెయిటింగ్లో ఉన్నారు. ఇందులో ఎవరైనా చనిపోతే మిగిలిన వెయింట్‌లో ఉన్నవారికి అవకాశం కలుగుతుంది. పలాసలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు తిత్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి కీడ్నీ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలాల పరిధి అక్కుపల్లిలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో అధికంగా కిడ్నీరోగులు గుణుపల్లి, బాతుపురం, బైపల్లి, యుఆర్కే పురం, అక్కుపల్లి గ్రామాల ప్రజలు అక్కుపల్లిలో ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతవరకు జరగలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన పింఛన్లు కేవలం 225 మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలిన వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పలాసలో నామమాత్రపు సేవలు పలాస సామాజిక ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో అరకొర సేవలు అందుతున్నాయి. నాలుగు షిఫ్టులలో జరుగుతున్న డయాలసిస్ సేవలు కొందరికే పరిమితమయ్యాయి. 8 మంచాలపై జరుగుతున్న డయాలసిస్ కోసం మూడు షిఫ్టుల్లో రోజుకు 24 మందికి మాత్రమే జరుగుతుంది. పలాస నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉద్దాన కిడ్నీ రోగులు 700 మందికిపైగా డయాలసిస్ జరుపుకుంటున్నారు. అత్యవసరమైన వారు విశాఖ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు పెడుతున్నారు. మా సొంతగ్రామం గొల్లమాకన్నపల్లిలో ఇప్పటివరకు 50 మందికిపైగా చనిపోయారు. ఇంకా చాలామంది రోగులకు సేవలు అందడంలేదు. – రాపాక అప్పలస్వామి, కిడ్నీ రోగి, గొల్ల మాకన్నపల్లి, పలాస మండలం అత్యవసర పరిస్థితి ప్రకటించాలి.. ప్రస్తుతం ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీరోగుల మరణాలను నమోదు చేసి తక్షణమే అత్యవస మెడికల్ ప్రకటించి అందరిని ఆదుకోవాలి. ఉచిత మందులు, డయాలసిస్ పూర్తి సేవలు, రవాణా ఖర్చులు అందించాలి. ఆర్టీసీ బస్సుపాసులు ఇస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలకు ఆర్టీసీ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – పత్తిరి దశరథ,కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేస్తోంది గానీ పనులు చేయడం లేదు. చివరి దశలో మరణానికి సిద్ధంగా ఉన్నవారికి పింఛన్లు ప్రకటించారు. మేమంతా వారి తరఫున అడుగుతున్నాం. సీరం క్రియాటిన్ తగ్గుదల ప్రారంభం నుంచి పింఛన్ అందిస్తే కాస్త అయినా మేలు జరుగుతుంది. ప్రస్తుతం సౌకర్యాలు లేకుండా డయాలసిస్ నడుపుతున్నారు. ప్రత్యేకమైన గ్రూపుల వారు విశాఖ వెళ్లాల్సి వస్తోంది. ఇకనైనా వారిపై శ్రద్ధ చూపాలి. – సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ సీపీ పలాస ఎమ్మెల్యే అభ్యర్థి -
పలాసలో వెంకన్న రౌడీయిజం
సాక్షి, పలాస/కాశీబుగ్గ: ప్రశాంతతకు మారుపేరు పలాస. అటువంటి ప్రాంతంలో అయిదేళ్లుగా అశాంతి నెలకొంది. ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి ఇక్కడకు అల్లుడిగా వచ్చి అరాచకాలు సృష్టిస్తున్నారు. వివాదాస్పదమైన భూ సమస్యల సెటిల్మెంట్లు చేయడం, అవసరమైతే వాటిని తానే సొంతం చేసుకోవడానికి యత్నించడం వంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ఇది పలాస తాజా మాజీ ఎమ్మెల్యే అల్లుడు వెంకన్నచౌదరి రౌడీయిజం. పలాస పట్టణం ఈయన సామ్రాజ్యానికి అడ్డాగా మారడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వినకపోతే తనదైన శైలిలో బెదిరింపులు, మామ అండదండలతో అప్పటి పోలీసు అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని మితిమీరిన అరాచకాలకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలపైన కూడా ఇతని సహచరులు దాడులకు తెగబడ్డారు. కాశీబుగ్గలో ఒక స్వీట్ షాపులో పనిచేస్తున్న బ్రాహ్మతర్లా గ్రామానికి చెందిన వైశ్య కులానికి చెందిన పేద యువకుడిని చితకబాదారు. ఫలితంగా ఆయన అవమాన భారంతో దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. అతని మృతిపైన కూడా బోలెడు అనుమానాలు ఏర్పడ్డాయి. అతని కుటుంబానికి న్యాయం చేయాలని వైశ్య సంఘం ఆధ్వర్యంలో కాశీబుగ్గలో ధర్నాకు దిగిన విషయం విదితమే. అదేవిధంగా చినబాడాంలోని ఒక పెట్రోలు బంకును సమస్యల్లోకి నెట్టి తనకు అనుకూలంగా మలుచుకుని చివరకి తన అనుయాయులతో నడిపిస్తున్నాడు. పలాసలో జీడి వ్యాపారులను బెదిరించి చివరకి కిలో జీడి పప్పునకు రూ.10 కమీషను వసూలు చేశాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. సోంపేటలో రెండు వైశ్య కుటుంబాల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరిస్తానని తలదూర్చి ఒకరికి కొమ్ముకాయడంతో సమస్య జఠిలమైంది. అన్యాయానికి గురైన వ్యక్తి పలాసలో ప్రాణహాని ఉందని గోడపత్రికలు అతికించడం గమనార్హం. అప్పట్లో గోడపత్రికల్లో ఎమ్మెల్యే అల్లుడు వెంకన్న పేరు ఉండటంతో కలకలం రేపింది. ఎన్నికల కోడ్ విడుదల అనంతరం పలాస ఎన్నికల అధికారి అనితాదేవిపై కార్యకర్తలతో కలిసి విరుచుపడ్డాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ ఎస్ఐ రాజేంద్రప్రసాద్పైనా, మందసలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏడీ నాగరాజు బృందంపైనా దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీషాను గెలిపిస్తే, ఈమె భర్త, ఎమ్మెల్యే అల్లుడు వెంకన్నచౌదరి ఆగడాలు పెచ్చుమీరుతాయని ప్రజలంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మందసలో ఎమ్మెల్యే అల్లుడి వీరంగం మందస: పట్టణంలోని వాహనాలు తనిఖీ చేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులపై పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ అల్లుడు వెంకన్నచౌదరి దౌర్జన్యానికి దిగాడు. ఈ మేరకు దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్నారని టీం లీడర్ కే నాగరాజు ఎస్ఐ వీ నాగరాజుకు మంగళవారం రాత్రి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు. మందస మండలానికి ఎన్నికల వాహనాలు తనిఖీ (ఫ్లయింగ్ స్క్వాడ్) అధికారులు పలాస వెటర్నరీ ఏడీ కే నాగరాజు, మందస పోలీసు హెచ్‌సీ సీహెచ్ రమణ, వీడియో గ్రాఫర్ నల్ల కార్తీక్ మందసలోని కొత్తవీధిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ కారు రావడంతో తనిఖీ నిర్వహించారు. కారులో 30 డమ్మీ ఈవీఎంలున్నాయని, వీటికి సంబంధించిన పత్రాలు చూపించాలని తనిఖీ అధికారి నాగరాజు కోరారు. కారులో ఉన్న వెంకన్నచౌదరి గుర్తింపు కార్డు అడిగి ‘మీరెవరూ నన్ను అడగడానికి’ అంటూ వారిపై దౌర్జన్యం చేశాడు. ఈలోగా టీడీపీ కార్యకర్తలు వీడియోగ్రాఫర్ నల్ల కార్తీక్ చేతిలో వీడియో కెమెరాను లాక్కోని గాయపరిచారు. వీరి దౌర్జన్యంపై పలాస ఆర్వోకు, మందస సీఐ తిరుపతిరావుకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో అధికారులను టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషా భర్త వెంకన్నచౌదరి, కార్యకర్తలు దాడి చేశారన్న సమాచారం సంచలనం సృష్టించింది. ఎన్నికలు రెండు రోజులుండగా, ఇటువంటి ఘటనతో ఓటర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. బాధిత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి దళితుడు కావడంతో ఈ సంఘటనను దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
ఎన్నికల అధికారిపై చేయిచేసుకున్న టీడీపీ అభ్యర్థి భర్త
-
అధికారిపై చేయిచేసుకున్న టీడీపీ అభ్యర్థి భర్త
శ్రీకాకుళం: పలాసలో ఎన్నికల నిఘా అధికారి డాక్టర్ నాగరాజుపై పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరీ దౌర్జన్యం చేశారు. అనుమతి లేని డమ్మీ ఈవీఎంలతో మందస వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్‌కి వెంకన్న చౌదరీ పట్టుబడ్డారు. దీంతో ఈవీఎంలను స్వాధీనం చేసుకునేందుకు నిఘా అధికారి డాక్టర్ నాగరాజు ప్రయత్నించగా వెంకన్న చౌదరీ దుర్భాషలాడారు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోతూ వెంకన్న, నాగరాజుపై చేయి చేసుకున్నారు. దిక్కున్న చోట ఫిర్యాదు చేసుకో అని బండబూతులు తిట్టారు. అనంతరం వాహనంతో పరారయ్యారు. వెంకన్న చౌదరీ మాటలతో డాక్టర్ నాగరాజు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. -
అభివృద్ధి పథంలో నడిపిస్తా
సాక్షి, పలాస (శ్రీకాకుళం): నియోజకవర్గానికి భౌగోళికంగా విశిష్టత ఉంది. జీడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి జీడి పప్పు ప్రపంచ నలుమూలలకు ఎగుమతి అవుతోంది. తీర ప్రాంతంతో పాటు సువిశాల అటవీ ప్రాంతం ఉంది. వాణజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్తోంది. అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. అయినా వెనుకబడి ఉంది. తాగు, సాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్లుగా ఒకే కుటుంబ పాలనలో ఉండడంతో అభివృద్ధి కుంటుపడింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని యువ వైద్యుడు ముందుకు వచ్చాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. సాక్షితో ఆయన మనోగతాన్ని పంచుకున్నారు. సాక్షి: నియోజకవర్గం ప్రజలతో ఎలా మమేకమయ్యారు? అప్పలరాజు: నేను ఈ నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం దేవునల్లాడలో జన్మించాను. ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశాను. వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత పలాసలోనే ప్రాక్టీసు పెట్టాను. పదేళ్లగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. వైద్యునిగా ప్రజల కష్టాను అతి దగ్గర నుంచి చూసిన వాడిని. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే వాడిని. ప్రజలతో మమేకమయ్యాను. సాక్షి: నియోజకవర్గంలోని మీరు గుర్తించిన సమస్యలేమిటి? అప్పలరాజు: నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి గత పాలకులు చర్యలు తీసుకోలేదు. పలాసలో ప్రజలకు ప్రభుత్వ విద్య, వైద్యం అందడం లేదు. కనీసం ప్రభుత్వం డిగ్రీ కళాశాల లేదు. రైతులకు సాగునీరు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఉద్దానంలో ఎక్కువగా ఉద్యాన పంటలు పండుతాయి. వారికి రైతు బజారు అవసరం ఉంది. కాశీబుగ్గలో ప్లైఓవరు బ్రిడ్జి పెండింగ్‌లో ఉంది. జీడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది. మత్స్యకారలకు జెట్టీలు, ఫిషింగ్ హార్బరు నిర్మాణం, పరిశ్రమల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి. గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలి. అప్పుడే వారికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. సాక్షి: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు? అప్పలరాజు: మనస్సు ఉంటే మార్గం లేకుండా ఉండదు. ప్రభుత్వం నుంచి ఎలాగైనా వీటిని సాధించి పెడతాను. ఇక్కడి సమస్యలన్నింటినీ జగన్మోహన్రెడ్డికి నివేదించాను. తన పాదయాత్రంలో కూడా ఆయన స్వయంగా తెలుసుకున్నారు. పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తాం. సాక్షి: టీడీపీ పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు మీరు ఎలా న్యాయం చేస్తారు? అప్పలరాజు: రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతాము. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఇప్పటికే జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహాలు ఏమిటి? అప్పలరాజు: కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. మాటమార్చని, మడం తిప్పని వైఎస్.రాజశేఖరరెడ్డి వలె ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిని కూడా ప్రజలు అదే స్థాయిలో ఆదరిస్తున్నారు. ఇవే మా విజయానికి సోపానాలు. అంతేకాకుండా గౌతు కుటుంబ పాలనపై ప్రజలు విసిగు చెందిఉన్నారు. అది మాకు ప్లస్ అవుతుంది. ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారు. వైఎస్సార్ స్వర్ణపాలన రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. -
నియంతృత్వ పాలనకు గుడ్‌బై
సాక్షి, పలాస (శ్రీకాకుళం): పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముఖ్యమైన నాయకులంతా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. కుటుంబ పాలన ఇంకెన్నాళ్లంటూ కార్యకర్తలు సైతం పార్టీని వీడుతుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు ఓటమి భయం వెంటాడుతోంది. గతంలో శివాజీ మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు మేలు చేయకపోయినా అంతగా సమస్యలు ఉండేవి కావని, ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు తయారయ్యారని సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఎవరి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నామని లోలోపన మదనపడుతున్నారు. శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతని అల్లుడు వెంకన్న చౌదరి చక్రం తిప్పడం, అతనికి వ్యాపార దృక్పథం తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు శిరీష ఎమ్మెల్యే అయితే పలాసలో ఉండరు సరికదా వెంకన్న వల్ల మరింతగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయని, ఇప్పటికే అతని వల్ల అవస్థలు పడిన ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుకు, ఎమ్మెల్యేకు మధ్య ఆది నుంచి కోల్డ్ వార్ జరిగి చివరకి పూర్ణచంద్రరావు పార్టీని విడిచిపెట్ట వలసి వచ్చింది. తోటి కౌన్సిలర్లతో కలసి పార్టీకి గుడ్‌బై చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలం జెడ్పీటీసీ ఉప్పరపల్లి నీలవేణి భర్త ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ కూడా ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. శిరీష అభ్యర్థిత్వాన్ని, వెంకన్న చౌదరి పెత్తనాన్ని నిరసిస్తూ వజ్రపుకొత్తూరు మండలంలో బలమైన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఆ పార్టీకి దూరమైంది. మందస మండలం ఎంపీపీ కొర్ల కవిత భర్త కొర్ల కన్నారావు కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. వెంకన్నచౌదరి పెట్టిన ఇబ్బందుల వల్లే బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కన్నారావు పార్టీని వీడవలసి వచ్చిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వీరితో పాటు మందస మాజీ జెడ్పీటీసీ అందాల శేషగిరి, వజ్రపుకొత్తూరు మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్య, పలాస మాజీ జెడ్పీటీసీ వరిశ హరిప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. ప్రస్తుతం హరిప్రసాద్, అందాల శేషగరి, ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. నాయకులతో పాటు ముఖ్యమైన కార్యకర్తలంతా పార్టీకి దూరమవుతుండటంతో గౌతు కుటుంబా నికి ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో డబ్బులు ఎరజూ పుతూ అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. పలాస నియోజవర్గానికి గౌతు శిరీష స్థానికేతరం ఇక్కడి ప్రజల నుంచి స్పందన కరవవుతోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో తగిన ఆదరణ ఉండటంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి డాక్టరు సీదిరి అప్పలరాజు బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గౌతు కుటుంబానికి ముచ్చెమట్లు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదుకునేవారినే ఆదరించండి పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లా స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం వైఎస్సార్సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎంపీగా దువ్వాడ శ్రీను, పలాస అభ్యర్థిగా డాక్టర్ సీదిరి అప్పలరాజులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలాస అసోషియేషన్ అధ్యక్షుడు మన్నేళ శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. – కాశీబుగ్గ వెంకన్న వేధింపులే కారణం పార్టీని వీడడానికి ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి వేధింపులే ప్రధాన కారణం. పార్టీలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వలేదు. రాజకీయంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టారు. శివాజీ దృష్టికి తీసుకొని వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే పార్టీలో ఉండలేక బయటకు రావాల్సి వచ్చింది. – కొర్ల కవిత, మాజీ ఎంపీపీ, మందస అభివృద్ధిని పట్టించుకోలేదు వజ్రపుకొత్తూరు మండలంలో ఎంతో అభివృద్ధి చేయాలని ఆశించాం. ఆశలన్నీ అడియాశలయ్యాయి. నామమాత్రంగానే జెడ్పీటీసీగా ఉండాల్సి వచ్చింది. అధికారాలన్నీ శివాజీ, ఆయన అల్లుడు వెంకన్న చేతిలో పెట్టుకున్నారు. రాకాసి గెడ్డ వంతెన నిర్మాణం చేయాలని కోరాను. పూండి మార్కెటును అభివృద్ధి చేయాలని చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మత్స్యకా రులకు ఎమ్మెల్యే టికెట్ గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ ఇస్తామన్నారు. ఇది కూడా నెరవేరలేదు. అం దుకే మత్స్యకారుల సామాజకవర్గానికి చెందిన డాక్టరు సీదిరి అప్పలరాజుకు మద్దతు ఇస్తున్నాం. – ఉప్పరపల్లి ఉదయకుమార్ (జెడ్పీటీసీ నీలవేణి భర్త), వజ్రపుకొత్తూరు అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు శివాజీ కుటుంబానికి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు. వారికి అదొక రాజకీయ సూత్రం. అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే వాటి వల్ల నాలాంటివాళ్లకు ప్రజాదరణ ఎక్కడ వచ్చేస్తుందోనన్న భయం వాళ్లది. అన్నీ అధికారాలు వారి వద్దనే ఉంచుకొని మిగిలిన వారిని ఆటబొమ్మల్లా చేసుకుంటారు. వారికి ఎవరూ పోటీ కాకూడదు. ముఖ్యంగా వెంకన్న చౌదరి వేధింపులు చాలా ఎక్కువ. – కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్ చైర్మన్, పలాస కాశీబుగ్గ -
టీడీపీ పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదు
-
పలాస ఎవరికి దక్కునో...?
దశాబ్దాలుగా వస్తున్న కుటుంబ రాజకీయ పాలన పలాస నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకోలేకపోతోంది. 2009 ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్న గౌతు శ్యామ సుందర శివాజీ.. ఈ సారి తన వారసురాలిగా కుమార్తె శిరీషను ఎన్నికల బరిలో దింపారు. సామాన్య కుటుంబానికి చెందిన వైద్యుడిపై పోటీ పడుతున్న కుటుంబ పాలనకు మరోసారి చెక్ పడక తప్పదన్న అభిప్రాయాలు నియోజక వర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. సాక్షి, కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలో ఎప్పటినుంచో మార్పును కోరుకుంటున్న ప్రజలు 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తిరిగి ఇప్పుడు అధికార పార్టీని, గౌతు కుటుంబాన్ని ఎదిరించి ప్రజాసమస్యలపై నిలబడే నవయువకుడు, వైద్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పలాస నియోజకవర్గ తీరు తెన్నులపై సాక్షి ప్రత్యేక కథనం. నియోజకవర్గం పుట్టుక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2009వ సంవత్సరంలో పలాస నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నప్పటికీ కాశీబుగ్గ పట్టణం, వజ్రపుకొత్తూరు మండలం, టెక్కలి నియోజకవర్గంలో ఉండేవి. పలాస పట్టణం, మందస మండలం సోంపేట నియోజకవర్గంలో ఉండేవి. జీడిపరిశ్రమలు, కార్మికులు ఈ ప్రాంతంలో ఒక్కసారిగా అభివృద్ధి చెందడంతో రెండు పట్టణాలు జిల్లా కేంద్రంతో పోటీ పడుతున్న సమయంలో పలాస నూతన నియోజకవర్గంగా మారింది. మొదటి ఎమ్మెల్యేగా జుత్తు జగన్నాయకులు 2009 ఎన్నికల్లో గౌతు శ్యాంసుందర శివాజీపై గెలుపొందారు. అనంతరం వజ్జ బాబూరావుపై 2014లో శివాజీ గెలుపొందారు. ప్రస్తుతం వజ్జబాబూరావు తన అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి శివాజీ పంచనే చేరారు. ఇప్పుడు శివాజీకి వయసు మీదపడడంతో తన తండ్రి నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవిని మనుమరాలు శిరీషకు అప్పగించేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రత్యేకత ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పలాసకు టూరిస్టు శాఖ ‘వైట్ గోల్డ్’ సిటీగా నామకరణం పేరుపెట్టింది. పలాస నియోజకవర్గంలో సుమారు 45 కిలోమీటర్లుగల జాతీయ రహదారి, పలాస వంటి పెద్ద రైల్వేస్టేషన్‌తో పాటు పూండి, మందస, సున్నాదేవి వంటి స్టేషన్లతో రైలుమార్గం ఉంది. వజ్రపుకొత్తూరు మండలం సముద్ర తీర ప్రాంతంలో టూరిజంతో పాటు, 32వేల మందికి పైగా మత్స్యకారులకు జీవనాధారమైన చేపలవేటకు అవకాశం ఉంది. మందస మండలంలో అతి ఎత్తైన మహేంద్రగిరి పర్వతాలు ఉన్నాయి. 26 వేల మందికి పైగా గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పలాసతో పాటు మూడు మండలాలను కలుపుకుని ఉద్దాన ప్రాంతం ఉంది. కొబ్బరి, జీడిమామిడి, మునగ, దుంపలు, మామిడి, ఇలా ఉద్యానపంటలు ఇక్కడ అనేకం. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 20 వేలమంది పైగా వలస వచ్చి స్థిరపడిన జీడికార్మికులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన 300కుపైగా జీడి పరిశ్రమలు నియోజకవర్గంలో విరాజిల్లుతున్నాయి. మామ పాలనలో అల్లుడి హవా నియోజకవర్గంలో గౌతు శ్యాంసుందర శివాజీ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాలన కొనసాగించినప్పటికీ ఆయన అల్లుడి హవా ఎక్కువైంది. మామ ఎమ్మెల్యే అయినా ఎవరి పనులనైనా అల్లుడు గారే చేసి పెడతారు. జీడి, రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు అల్లుడికి కమీషన్ లేనిదే పనులు పూర్తికావు. అనేక మంది వీరిద్దరి పరిస్థితిని గమనిస్తున్నారు. నేరస్తులను వెంట వేసుకుని మూడు మండలాల పరిధిలో భయాందోళనలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఆఫ్‌షోర్ నిర్మాణానికి ఎమ్మెల్యేకు ఉన్న పెట్రోల్ బంకు నుంచి డీజిల్ కొనుగోలు చేయాలని అల్లుడు ఒప్పందాలు చేయించుకున్నాడు. అల్లుడి పోరు ఇంతంత కాదయా అంటూ పరిసర ప్రాంతాల్లో కోడై కూస్తున్నారు. తిత్లీ పరిహారం దోపిడీ తిత్లీ తుఫాన్ అధికార జన్మభూమి కమిటీలకు అక్కరకు వచ్చింది. గత ఏడాది అక్టోబరు 11న సంభవించిన తుఫాన్లో నష్టపోయిన వారిలో.. జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన వారికి మాత్రమే పరిహారం అందింది. నిజమైన లబ్ధిదారులకు అందకపోవడంతో అవేదన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావతో ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలైన అనేక మందికి పరిహారం అందివ్వకపోవడంతో వారంతా అనాథలుగా మిగిలారు. పలాస నియోజకవర్గంలో 60 ఏళ్ల గౌతు కుటుంబ పాలన కంటే పదేళ్ల వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే అభివృద్ధి చెందిందని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. నియోజకవర్గంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు వైఎస్ హయాంలో శంకుస్థాపన చేసి రూ.127కోట్లతో 26వేల హెక్టార్లకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. అనంతరం వచ్చిన ప్రçభుత్వాలు చేయలేకపోయాయి. ముఖ్యంగా పలాస–కాశీబుగ్గలో రోడ్డు విస్తరణ, మున్సిపల్ కార్యాలయం నిర్మాణం, బెండిగేటు, నువ్వలరేవు, పొత్తంగా వంటి అతి పెద్ద బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యాయంటే దివంగత వైఎస్ చలవేనని నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు. మున్సిపాలిటీకి తాగునీరు, ఈ ప్రాంతంలో ఉన్న బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చడం, ఇతర కూలాల వర్గీకరణ వైఎస్ హయాంలోనే జరిగింది. అలాగే మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలలో మరదరాజపురం, బెండి వంతెనలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణాలను వైఎస్ పాలనా కాలంలోనే అధికంగా చేశారు. పరిష్కారం కాని సమస్యలు ఉద్దానంలో ఉన్న 7మండలాల్లో కిడ్నీ మహమ్మరి బారిన పడిన మూడు మండలాలు పలాస నియోజకవర్గంలో ఉండడం దురదృష్టకరం. ప్రతి వారం కనీసం ఇద్దరు వ్యక్తులు కిడ్నీ సమస్యతో మరణిస్తున్నారు. వేలాది మంది కిడ్నీ రోగులు ఉండగా కేవలం 223మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి డయాలసిస్ కేంద్రం పెట్టి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పలాస ప్రభుత్వ ఆస్పత్రిని 200 పడకలకు విస్తరించలేక విడిచి పెట్టేశారు. ఆస్పత్రిలోని మేల్వార్డునే డయాలసిస్ సెంటర్‌గా మార్చివేశారు. ప్రభుత్వ డిగ్రీకళాశాలను స్థానిక అధికార పార్టీ నేతలు చేతులారా వదులుకున్నారు. కాశీబుగ్గ వంతెన పూర్తి చేయలేక చేతులెత్తేశారు. హుద్‌హుద్ ఇళ్లు, ఏహెచ్‌పీ ఇళ్ల పంపిణీ చేయలేక విడిచిపెట్టేశారు. జంట పట్టణాలకు తాగునీరు, వజ్రపుకొత్తూరు మండలానికి వంశధార నీరు అందించలేకపోయారు. మొత్తం ఓటర్లు : 1,91,562 పురుషులు : 94827 ్రïస్తీలు : 96699 ఇతరులు : 36 మండలాలు: మందస, పలాస, వజ్రపుకొత్తూరు మున్సిపాలిటీ : పలాస–కాశీబుగ్గ పోలింగ్ కేంద్రాలు : 278 సమస్యాత్మక కేంద్రాలు : 37 -
డబ్బులు పంచుతూ దొరికిపోయిన కానిస్టేబుళ్లు
-
ఇక లాభం లేదు.. పోలీసులనే దించుదాం..!
సాక్షి, శ్రీకాకుళం : ఎన్ని అక్రమాలు, అరాచకాలు చేసైనా, చివరికి ప్రజలు ఛీకొట్టినా సరే అధికారం మాత్రం దక్కాలనే తీరుగా టీడీపీ వ్యవహరిస్తోంది. కరెన్సీ కట్టలతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం నిఘా నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పోలీసులనే రంగంలోకి దించారు పచ్చ నేతలు. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తరపున పోలీసులు డబ్బులు పంచుతున్న వ్యవహారం బయటపడింది. వజ్రపుకొత్తూరుకు చెందిన పోలీసులు టీడీపీ నేతలతో కలిసి ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియా కంటబడ్డారు. జిల్లా పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను హెడ్ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చింది. అయినా పరిస్థితుల్లో ఏ మార్పు కానరావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అడుగడుగునా నిబంధనలకు పాతరేస్తున్న టీడీపీ ప్రభుత్వం.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను కూడా తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ హైకోర్టులో సవాల్ చేసింది. (చదవండి : ఎన్నికల ప్రచారంలో..‘గౌతు’కు షాక్...!) -
పలాస ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్
-
భావోద్వేగానికి లోనైన దువ్వాడ శ్రీనివాస్
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : ఎన్నికల నేపథ్యంలో పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తినైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. పలాస సభలో దువ్వాడ మాట్లాడుతూ.. ‘18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మంత్రి అచ్చెన్నాయుడు నా వ్యాపారాలను అష్ట దిగ్బంధనం చేశారు. ఆర్థికంగా బాగా చితికి పోయా. అయినప్పటికీ నాపై నమ్మకం ఉంచి వైఎస్ జగన్ నాకు తోడుగా నిలబడ్డారు. నాలాంటి సామాన్యుడికి అవకాశం ఇచ్చిన ఆయనకు జన్మజన్మలకు ఆయనకు రుణపడి ఉంటా’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.(2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : వైఎస్ జగన్) కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తాం, ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పలాస నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి.. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
మీ అందరికి అండగా నేనున్నాను
-
2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : వైఎస్ జగన్
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడి పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తామని, ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ.. పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. మీ అందరికి భరోసా ఇచ్చి చెబుతున్నా.. నేను ఉన్నాను. జీఎస్టీలా టీడీపీ ట్యాక్స్.. రాష్ట్రంలో,దేశంలో జీఎస్టీ ట్యాక్స్ విన్నామన్నా.. కానీ ఈ పలాసలో టీఎస్టీ అంటూ తెలుగుదేశం వేస్తున్న ట్యాక్స్ గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. ఇక్కడి ఎమ్మెల్యే అల్లుడి దోపిడి గురించి చెప్పిన మాటలు విన్నాను. వ్యాపారులపై దాడులు, అధికారులపై వేధింపులు నేను విన్నాను. భావనంపాడు పోర్టులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీరు చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. తిత్లీ తుఫాను పరిహారం అందలేదని చెప్పిన మాటలు విన్నా. ఆ రోజు మీకు భరోసా ఇస్తూ నేను చెప్పిన మాటలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులకు పరిహారంగా కొబ్బరి చెట్టుకు రూ.3వేలు, హెక్టార్ జీడీ తోటకు రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తాం. కిడ్నీ బాధితుల సమస్యలను చూశాను. వారి గాథలను విన్నాను. కిడ్నీ వ్యాధుల రావాడానికి కారణం తాగే మంచి నీరని తెలిసి కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని చూశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోగా 200 పడకల ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తాం. కాలువల ద్వారా సాగు, తాగు నీరు అందిస్తాం. నిన్నటి కంటే ఈ రోజు బాగున్నామా? మరో 20 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. నిన్నటి కంటే ఈ రోజు బాగుంటే అభివృద్ధి అంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో నిన్నటి కంటే ఈ రోజు బాగున్నామా? రైతుల రుణమాఫీలు చేశారా? సున్నా వడ్డీలు వచ్చాయా? గిట్టుబాటు ధరలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా? అదే అక్కాచెల్లేమ్మలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా? నిరుద్యోగ యువకులకు రూ.2 వేల భృతి అన్నారు.. ప్రతి ఇంటికి రూ.1 లక్ష 20 వేలు బాకీ పడ్డారా? లేదా? బెల్ట్ షాప్‌ల రద్దు అన్నారు.. మరీ మీ గ్రామాల్లో మందు దొరుకుతుందా? లేదా? ఒక్కసారి ఆలోచించి చంద్రబాబు పాలన చూడమని కోరుతున్నా. బాబు పాలనలో మీరంతా సంతోషంగా ఉన్నారా? అని అడుగుతున్నా. మీ పిల్లల చదువులు, వారిని చదివించేందుకు డబ్బులు ఉన్నాయా? ఆస్తులు అమ్ముకోకుండా చదవించగలరా? కేజీ నుంచి పీజీ దాకా ఉచితమన్నారు.. ఈ రోజు ఆ రకంగా జరుగుతుందా? చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అక్కచెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్లను అడుగుతున్నా. అమరావతి వెళ్తున్నారా? అమరావతిలో ఉద్యోగులన్నాయా? ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరుకు వెళ్తున్నారా? ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈ రోజు నేను చెబుతున్నా జాబు రావాలంటే బాబు పోవాలి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఆరోజు లెక్కలు ప్రకారం లక్ష 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ నాటి నుంచి మన రాష్ట్ర యువత ఆ ఉద్యోగాల కోసం కోచింగ్‌లు తీసుకుంటూ డబ్బులు ఖర్చుపెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఖాళీలున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఏటా 10వ తరగతి పాస్ అయ్యేవారు 5 లక్షల మంది. 4 లక్షల మంది ఇంటర్ పాస్ అవుతున్నారు. లక్షా 80వేల మంది డిగ్రీ పాసై వస్తున్నారు. లక్షా 10 వేల మంది పీజీ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వీరందరికి ఉద్యోగాలు కల్పించేలా కార్యచరణ రూపొందిస్తాం. ప్రత్యేక హోదా వస్తేనే .. రాష్ట్రంలో ఒక కోటి డెబ్బై లక్షల ఇళ్లు ఉంటే.. నిరుద్యోగ భృతి కింది ప్రతి ఇంటికి నెలకు రెండు వేలు ఇస్తామన్నారు. ఆ డబ్బులు దేవుడెరుగు.. కాస్తో కూస్తో ఉద్యోగాలు వస్తాయనుకున్న ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారు. ప్రత్యేకహోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ట్యాక్స్ మినహాయింపులతో పరిశ్రమలు, ఆసుపత్రులు, హోటళ్లు కట్టడానికి వస్తారు. ఇలాంటి హోదా కోసం కూడా గట్టిగా ప్రయత్నిస్తాం. చదువుల కోసం అప్పులు చేయడం చూశాను. మీ అందరి చల్లని దీవేనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, చదువుల కోసం హామీ ఇస్తున్నాను. ప్రతి తల్లి ..తండ్రికి చెబుతున్నా. ఏ చదువులు చదివించినా.. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తాను. చదువులే కాదు.. ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తాం. అధికారంలో వచ్చిన వెంటనే తొలి పనిగా 2 లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్లు వేస్తాం. వాటి కోసం ఒక క్యాలెండర్ కూడా జారీ చేస్తాం. ఉద్యోగాలు రావడం కోసం చేయబోయే విప్లవాత్మక మార్పు. పరిశ్రమల, పోర్ట్ల్లో ప్రస్తుతం మనకు ఉద్యోగాలు రావడం లేదు. దీన్ని పూర్తిగా మార్చేస్తాను. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా.. శాసనసభలో చట్టం తీసుకొస్తాం. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్‌లు తీసుకునే సర్వీసులు చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులను కాంట్రాక్టులకు ఇస్తున్నారు. వీటిని కేశినేని, జేసీ బ్రదర్స్ నడుపుతున్నారు. వీటన్నిటిని మార్చేస్తాం. ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకే ఇచ్చేలా చేస్తాం. పెట్టుబడుల కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. నామినేషన్ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పిస్తాం. ఊరిలోనే ఉద్యోగం.. గ్రామ సెక్రటరియేట్లతో 10 మందికి ఊరిలోనే ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలోని 50 ఇళ్లకు ఒక వాలింటర్ను పెడ్తాం. వారికి రూ.5వేల గౌరవ వేతనం ఇస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకు ఈ ఉద్యోగం చేయవచ్చు. ఆ గ్రామ వాలంటరీ గ్రామ సెక్రటరీయేట్‌తో అనుసంధానమై పనిచేస్తారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ యాబై ఇళ్లకు డోర్ డెలవరీ చేస్తారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే పరిష్కరిస్తాం. ప్రతి జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌డెవలెప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నవరత్నాల్లో ఇవన్నీ వివరించడం జరిగింది. మన జీవితాలు బాగుపడాలంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లాలి. కానీ చంద్రబాబు పాలనలో మోసాలు, కుట్రలు, హత్యలు చూస్తున్నాం. వీళ్లే హత్యలు చేస్తారు.. వీళ్లే విచారణ చేస్తారు. వక్రీకరించడానికి వీళ్ల మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనపై ఎన్నికలు రావడం లేదు. హత్యారాజకీయాలతో వస్తున్నారు. రాబోయే రోజుల్లో మూటలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. ఓటుకు మూడు వేలు ఇస్తాడు. మీ అందరికి చెప్పేది ఒక్కటే గ్రామాల్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు.. అన్నను సీఎంను చేసుకుందామని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని వివరించండి. అన్న సీఎం అయితే మన బతుకులు బాగుపడ్తాయని వివరించండి. పలాస నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కిడ్నీ మరణాలు కలిచివేశాయి
సాక్షి, కాశీబుగ్గ: చేతినిండా సంపాదన, వైద్యునిగా రోగుల్లో మంచి గుర్తిం పు.. కానీ ఇవేవీ ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. సొంత ప్రాంతంలో ఏళ్ల తరబడి ఏడుపులు వినిపిస్తుంటే ఇ సుమంతైనా పట్టించుకోని నాయకుల తీరు ఆశ్చర్యం కలిగించింది. ఆ రోదనలే తనను రాజకీయాల వైపు నడిపించాయని ఆయన చెబుతున్నారు వైఎస్సార్సీపీ తరఫున పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీదిరి అప్పలరాజు ‘సాక్షి’తో ఇలా మాట్లాడారు. సాక్షి : వైద్యునిగా పేరు సంపాదించారు. మరి రాజకీయాలకు ఎందుకొచ్చారు? సీదిరి : వాస్తవానికి రాజకీయాలే నన్ను తీసుకువచ్చాయని చెప్పాలి. నేను ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎండి జనరల్ మెడిసిన్ పూర్తి చేసి కేజిహెచ్లో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు అక్కడకు వచ్చేవారు. ఇంత మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించేది. వారి ఏడుపులే నన్ను రాజకీయాల వైపు వెళ్లేలా చేశాయి. వారికేదైనా సేవ చేయాలనే ఇటువైపు అడుగులు వేశాను. సాక్షి : వైఎస్సార్సీపీలోనే చేరడానికి కారణం? సీదిరి: పూటకోమాట చెప్పే చంద్రబాబు వంటి నాయకుడిని నమ్మలేను. వైఎ స్సార్ కొడుకై ఉండి కూడా సొంతంగా గుర్తింపు తెచ్చుకుని, జనం కోసం కష్టపడుతున్న జగన్ తీరు నాకు నచ్చింది. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. సాక్షి : పలాసకు ఏమేం అవసరమనుంటున్నారు? సీదిరి: కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్ సెం టర్, ఆఫ్‌షోర్ పూర్తి చేసి నీరి వ్వడం, పలాస –కాశీబుగ్గ జంట పట్టణాలకు డిగ్రీ కళాశాల, అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడం, మినీ స్టేడియం, రైతు బజారు, మత్స్యకారులకు జెట్టీలు నిర్మించడం, గిరిజనులను ఐటీడీఏలో చేర్చ డం, అర్హులైన తిత్లీ బాధితులకు పరి హారం, రోడ్ల విస్తరణ, 200 పడకల ఆస్పత్రి, బ్లడ్‌బ్యాంక్, జీడి కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయడం, వ్యాపారులకు మరో ఇండస్ట్రియల్ ప్రాంతం, పలాస రైల్వేస్టేషన్‌ను విశాఖ జోన్లో కలపడం నేను అనుకుంటున్న పనుల్లో ముఖ్యమైనవి. ము ప్పై ఏళ్లుగా ఇవన్నీ కలగానే మిగిలిపోయాయి. ఇంకా గ్రామా ల వారీ ప్రణాళికలు కూడా ఉన్నాయి. సాక్షి : ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సీదిరి: నేను చేపల వేట చేసుకుని బతికే ఓ సామాన్య కుటుంబంలో పుట్టాను. కష్టపడి చదివి డాక్టరయ్యాను. వృత్తితో బాగానే ఉన్నా ను. కానీ నా ప్రజల సమస్యలు కళ్లారా చూశా ను. వారి కోసమే కొండను ఢీకొట్టబోతున్నా ను. రెండేళ్లుగా ప్రజా పోరాటాలు చేశాను. జనాలందరికీ దగ్గరయ్యాను. వారి ప్రేమతో అసెంబ్లీకి వెళ్తే నా ప్రాంత ప్రజల గొంతుకనవుతాను. -
ఊరొక చోట.. ఓటు మరో చోట
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఇప్పుడు జిల్లాలోని పలాస నియోజకవర్గం మందస మండలంలో అలాంటి సిత్రమే చోటు చేసుకుంది. ఒక ఊరి వారి ఓట్లు మరో ఊరిలో, ఆ ఊరి ఓట్లు ఈ ఊళ్లోను వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అధికారులకు ముందు చూపు లేకపోవడం, ఆయా గ్రామస్తుల అవగాహనా రాహిత్యం ఇందుకు కారణమయింది. మందస మండలంలోని నల్లబొడ్లూరు (పోలింగ్ బూత్ నంబరు 197), బహడపల్లి (బూత్ నంబరు 196) గ్రామాలున్నాయి. బహడపల్లిలో ఓటర్లు 2,373 నుంచి 2,599కి పెరిగారు. దీంతో మూడో పోలింగ్ బూత్ (198)ను నల్లబొడ్లూరులో ఏర్పాటు చేశారు. అలాగే నల్లబొడ్లూరులో 534 మంది ఓటర్లు పెరిగారు. నల్లబొడ్లూరులో పెరిగిన ఓటర్లను బహడపల్లి పోలింగ్ బూత్‌కు, బహడపల్లిలో పెరిగిన ఓటర్లను నల్లబొడ్లూరు పోలింగ్ బూత్‌కు కేటాయించారు. దీని వల్ల ఈ ఓటర్లు తమ గ్రామంలో పోలింగ్ బూత్లున్నా వేరే గ్రామానికి వెళ్లి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పడు ఆ రెండు గ్రామాల ఓటర్లను అయోమయంలోకి నెట్టింది. దీనిపై ఆలస్యంగా మేల్కొన్న రాజకీయ నాయకులు అధికారుల వద్దకు పరుగులు తీశారు. ఏ గ్రామంలో ఓటర్లను ఆ గ్రామంలోనే ఓట్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు మార్పు చేయడం కుదరదని తేల్చి చెప్పేశారు. దీంతో వచ్చే నెల 11న జరిగే ఎన్నికల్లో వీరు పొరుగూళ్లకు వెళ్లి ఓటేయక తప్పదన్న మాట! కలెక్టరేట్లో తప్పిదమే.. పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఓటర్లను ఆయా బూత్‌లకు కేటాయించే సమయంలో తమను కలెక్టరేట్ అధికారులు సంప్రదించలేదని స్థానిక రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. తమతో సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వీరంటున్నారు. విషయం తెలిశాక 8–ఎ ఫారాలను సమర్పించినా నిబంధనలు అంగీకరించవంటూ తిరస్కరించారని, ఈ ఇబ్బందిని ఈ రెండు గ్రామాల ప్రజలకు తెలియజేశామని వీరు చెబుతున్నారు. దీనిపై మందస తహసీల్దారు కొండలరావును సాక్షి వివరణ కోరగా ఇప్పట్లో బూత్‌లు మార్చడం వీలు కాదని, ఆయా ఓటర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. -
పలాసలో ఎమ్మెల్యే రోజా రోడ్ షో
-
పొత్తుకోసం బాబు కాళ్లావేళ్లాపడ్డారు: అమిత్‌షా
-
పొత్తుకోసం బాబు కాళ్లావేళ్లాపడ్డారు: అమిత్‌షా
సాక్షి, పలాస(శ్రీకాకుళం): మోస పూరిత రాజకీయాలు చేసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు యుటర్న్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం పలాసలో బీజేపీ ప్రజాచైతన్య బస్సు యాత్రను ప్రారంభించిన అమిత్‌షా.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని తెలిసే కాళ్లావేళ్లాపడి మరీ పొత్తు కొసం చంద్రబాబు వెంపర్లాడారని తెలిపారు. తెలుగు ప్రజల కోసం దివంగత నేత ఎన్టీఆర్ పార్టీ పెడితే కాంగ్రెస్‌తో జతకట్టి టీడీపీని బాబు వంచన చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆరోపించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పదేళ్లు సమయం ఉన్నప్పటికీ ఐదేళ్లలోనే అన్నీ ఇచ్చామన్నారు. విభజన చట్టంలో లేని విద్యాసంస్థలు కూడా ఏపీకి ఇచ్చామన్నారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి తప్పుకున్నాక మోదీ సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత.. మళ్లీ చంద్రబాబు ఎన్డీయేవైపు వచ్చేందుకు ప్రయత్నిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. -
అమిత్ షా పర్యటన.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, పలాస(శ్రీకాకుళం): బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం పలాస పర్యటన తీవ్ర ఉద్రిక్తత, నిరసనల మధ్య కొనసాగుతోంది. అమిత్ షా పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపై భైఠాయించి నిరసనలు తెలిపారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో తమ నేతల అరెస్టులకు నిరసనగా టీడీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ‘గో బ్యాక్ అమిత్ షా’ అంటూ నినాదాలు చేశారు. షా పర్యటనను అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్మ విరుద్దమని, అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగటంపై ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ బస్సు యాత్ర కేంద్రం అమలు చేస్తున్న 126 సంక్షేమ పథకాలపై దేశవ్యాప్త ప్రచారంతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా నిర్వహించే బస్సు యాత్ర ఫిబ్రవరి 4 (సోమవారం)న శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందజేస్తోన్న సాయంతోపాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో బస్సు యాత్రను చేపట్టినట్టు బీజేపీ పేర్కొంది. -
అమిత్ షా రాకను అడుకునేందుకు టీడీపీ నేతలు ఆందోళనలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన జీడిపిక్కల కార్మికులు
-
ముగిసిన 334వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
పలాస బహిరంగ సభలో అశేష జనవాహిని
-
శవాలమీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు : వైఎస్ జగన్
-
‘శవాలమీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు’
సాక్షి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తుపాను కారణంగా రూ.3450కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాసి, కేవలం 500 కోట్లు మాత్రమే బాధితులకు చెల్లించారని జగన్ వెల్లడించారు. తుపాను కారణంగా నష్టపోయిన పోయిన వారికి చంద్రబాబు చెక్కులు ఇచ్చారుకానీ ఆ చెక్కుల్లో డబ్బులు మాత్రం ఇంతవరకు వెయ్యలేదని విమర్శించారు. బాధితులకు వచ్చే నష్టపరిహారం కూడా దోచుకుంటున్నారని, శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా చంద్రబాబు తీరు ఉందని జగన్ వ్యాఖ్యానించారు. తుపానులో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రజాసంకల్పయాత్ర 333వ రోజు పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ‘‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులను ఆదుకుంటాం. తుపానులో కొబ్బరిచెట్లు కోల్పోయిన రైతుకు ప్రతీ చెట్టుకు 3000 చొప్పున చెల్లిస్తాం. ఇళ్లు కోల్పోయినవారికి కొత్త ఇళ్లు కట్టిస్తాం. పలాస జీడిపప్పుకు ఎంతో ప్రసిద్ధిచెందినది. కానీ టీడీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ట్యాక్స్ ఫేమస్‌గా తయారైంది. పలాస ఎమ్మెల్యే అల్లుడి గిల్లుడును తట్టుకోలేకపోతున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. ఆయన పేరు వెంకన్న చౌదరి. ఇక్కడ ఏం చేయాలన్నా ఆయనకు ట్యాక్స్ కట్టి చేయాలి. ఇక్కడి ప్రజల ఎక్కువగా జీడిపప్పు పంటపై ఆధారపడి ఉన్నారు. వాటిపై కూడా జీఎస్టీ పేరుతో దోపిడీ చేస్తున్నారు’’ అని అన్నారు. ‘‘బయట మార్కెట్లో కేజీ జీడిపప్పు 600కు తక్కువగా ఉంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం 1100 ఉంటుంది. దళారీ వ్యవస్థను అడ్డుకోవాల్సిన సీఎంయే పెద్ద దళారీగా తయారైయ్యారు. ఈప్రాంతంలో వైఎస్సార్ హయాంలో 35వేలకు పైగా ఇళ్లను నిర్మించారు. కానీ నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్కటైనా కట్టించారా. పలాస, ఇచ్చాపురం, టెక్కలి ప్రాతంలో కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికోసం గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలుచేయలేదు. డయాలసిస్ సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో పునాదిరాయి కూడా పడలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్‌ను, కిడ్నీ రిసెర్చ్ హాస్పిటల్‌ను రెండువందల పడకల గదులతో ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుకు తోడు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కూడా కిడ్నీ బాధితుల కోసం ఇక్కడికి వస్తాడు. కానీ చేసేందేమీ లేదు. బాబుకు కష్టం వచ్చినపుడల్లా ఆయన పార్టనర్ వస్తాడు’’ అని జగన్ విమర్శించారు. కేసీఆర్ ప్రకటన ఆహ్వానించాలి.. ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రం అయినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా అన్నారు. ఆయన ప్రకటనను ఆహ్వానించాల్సింది పోయి దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మనకున్న ఎంపీలకు తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా తోడైతే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురాచ్చు’’ అని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన నవ్వులరేవు గ్రామ మత్స్యకారులు
-
పలాస శ్రీకాకళం జిల్లా వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన భవనపాడు పోర్టు నిర్వాసితులు
-
పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
ఊపిరాగిన ఉద్దానం!
ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం ఊపిరాగింది. 30 ఏళ్లుగా చెట్టుతో పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా నేలమట్టమైంది. కూకటివేళ్లతో కూలిపోయిన జీడి, కొబ్బరి చెట్ల వద్దే రైతన్న గుండె పగిలేలా రోదిస్తున్నాడు. బిక్కచచ్చి బావురుమంటున్నాడు. ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ‘చెట్లు కాదు.. మా ప్రాణాలే పోయాయి’ అంటూ పల్లె జనం ఘొల్లుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో ఏ ఊరుకెళ్ళినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక్క చెట్టయినా కన్పించని దారుణమైన విషాదం నుంచి రైతన్న కోలుకోవడం లేదు. తాతలనాడు వేసుకున్న చెట్లు.. పసిపిల్లల్లా పెంచుకున్న వనాలను గుండె చెదిరిన రైతన్న గుర్తుచేసుకుంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఉపాధి పోయి ఊళ్లొదిలే పరిస్థితిని చూస్తూ కుమిలిపోతున్నాడు. (అన్నమోరామ‘చంద్రా’!) గుండె పగిలే దుఃఖం వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని పూడి, రెయ్యిపాడు, ఆర్ఎం పురంతో పాటు అన్ని గ్రామాల్లోనూ 90 శాతానికిపైగా జీడి, కొబ్బరి తోటలే ఉన్నాయి. రైతులు, రైతు కూలీలకు ఇవే జీవనాధారం. ఎన్నో ఏళ్లుగా వాళ్లకు వలసలు అంటే ఏంటో తెలీదు. తిత్లీ తుపాను దెబ్బకు ఒక్క చెట్టూ మిగల్లేదు. రెయ్యిపాడుకు చెందిన ఎం. తిరుపతిరావు ఐదెకరాల్లో జీడి, కొబ్బరి సాగుచేస్తున్నాడు. తండ్రి కాలంలో వేసిన చెట్లు నెలకు రూ.30వేల ఆదాయమిస్తున్నాయని చెప్పాడు. ‘ఐదెకరాలూ కొట్టుకుపోయిందయ్యా.. ఏం చెయ్యాలి’.. అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తిరుపతిరావును ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదని ఆయన బంధువు వెంకటరమణ తెలిపాడు. ‘ఆయనేం చేసుకుంటాడో? ఏమవుతాడో?’ అని ఇంటిల్లిపాదీ కుమిలిపోతున్నారని చెప్పాడు. మద్దెల హరినారాయణ అక్కడ జీడి పరిశ్రమ నడుపుతున్నాడు. అతనూ ఓ రైతే. అతన్ని కదిలించినా ఆవేదన తన్నుకొచ్చింది. ‘ఒక్కో చెట్టూ లక్షలు చేస్తుంది. మళ్లీ అంత చెట్టు కావాలంటే ఏళ్లు పడుతుంది. మాకా ఓపిక లేదు.. అంత శక్తీ లేదు. మా నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఒక్కో వ్యక్తికీ రూ.20 లక్షలిచ్చినా కోలుకోలేం’ అని బావురుమన్నాడు. ప్రతీ రైతన్నదీ ఇదే ఆవేదన. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆదుకోకపోతే ఆత్మహత్యలే.. నిన్నటిదాకా ఈ ప్రాంతంలో ఆకాశాన్ని తాకి, పచ్చగా రెపరెపలాడిన కొబ్బరి చెట్లు.. ఏపుగా ఎదిగిన జీడి చెట్లు తిత్లీ దెబ్బకు పూర్తిగా నేల కొరిగాయి. కూలిన చెట్లను రంపంతో ముక్కలుగా కోస్తుంటే అక్కడ రైతన్న వేదన హృదయ విదారకంగా ఉంది. ఊళ్లకు ఊళ్లే ఎడారిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ మొక్కనాటి, పెంచి పెద్దచెయ్యాలనుకుంటున్నారు. కానీ, వారికి సాయం కావాలి. మళ్లీ ఉద్యానవనం పెంచడానికి ప్రభుత్వం కనీసం ఆరేళ్ల పాటు సాయం చేస్తే తప్ప కోలుకోలేమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. రైతును ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమయ్యే దుస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కరూ పలకరించలేదు మా గుండెలు మండిపోతున్నాయి. హుద్‌హుద్ తుపాను వస్తే విశాఖను ఆదుకున్నారట. ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు. ఇక్కడికి రావాలి. రైతు కష్టాన్ని చూడాలి. నిజాయితీగా ఆదుకునే ఆలోచన చేయాలి. మేం సర్వనాశనమయ్యాం. ఒక్కరూ రాలేదు. పిల్లల్లా పెంచుకున్న చెట్లు కూలిపోయాయి. రోడ్డున పడ్డాం. ఓదార్చే దిక్కేలేదు. – మద్దెల పాపయ్య, రెయ్యిపాడు, జీడి, కొబ్బరి రైతు అధికారులు ఎవరూ రావడంలేదు రైతుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రెండు రోజులుగా అదేదీ కన్పించడం లేదు. అధికారులు అస్సలు రావడంలేదు. కూలిన చెట్లను రైతులే తొలగించుకుంటున్నారు. కానీ, అన్ని సహాయ చర్యలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను పంపితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. లేకపోతే ఉద్దానం ఆవేశం ఏంటో ప్రభుత్వం చూస్తుంది. – సాంబమూర్తి, సీపీఎం మండల నాయకుడు, వజ్రపుకొత్తూరు -
రైల్వే ట్రాక్‌పై తల లేని మొండెం
కాశీబుగ్గ : పలాస మండలంలో కొబ్బరిచెట్లూరు గ్రామానికి సమీపంలో ఉన్న రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. పలాస రైల్వేస్టేషన్‌కు కూత వేటుదూరంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహం వద్ద మృతుడు తల లేకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. పరిసర ప్రాంతాలలో రైల్వే జీఆర్పీ సిబ్బంది వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇతడు రైలు నుంచి జారిపడ్డాడ, ఆత్మహత్య చేసుకున్నాడ, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది అంతుపట్టడం లేదు. మృతుడికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని, చామన్‌ఛాయ రంగు కలిగి, 5.2 అడుగుల ఎత్తు ఉంటాడని రైల్వే పరిశోధన అధికారి కె.కోధండరావు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పలాస రైల్వే స్టేషన్‌ను సంప్రదించాలని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు జీఆర్పీ రైల్వే స్టేషన్ 08945 241013 నంబరుకు సంప్రదించాలన్నారు. నౌపడ ఆర్ఎస్ వద్ద... టెక్కలి రూరల్ : మండలంలోని నౌపడ ఆర్ఎస్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ హెచ్‌సీ కోదండరావు తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం వేకువజామున రైల్వేట్రాక్ పక్కన ఒక మృతదేహం పడివుందనే సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 ఉంటుందని, అతనిచేతికి గోల్డ్ ఉంగరం, గీతల తెలుపురంగు షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఇతడి తల పూర్తిగా నుజ్జు అవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండిఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంతవరకు మృతదేహానికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వైభవంగా పైడితల్లి జాతర ప్రారంభం
రాజాం సిటీ/రూరల్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ మేనేజర్ కే సర్వేశ్వరరావు తెల్లవారుజామున మొదటి పూజ చేసి యాత్రను ప్రారంభించారు. ఏటా మాదిరిగానే హుండీని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్టా విశాలగుప్తా కుమారుడు కల్యాణ్‌చక్రవర్తి, టిక్కెట్ కౌంటర్‌ను రాజాం మాజీ సర్పంచ్ చెలికాని రామారావు భార్య వేదలక్ష్మి ప్రారంభించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన జాతర సాయంత్రానికి ఊపందుకుంది. ఆలయం నుంచి ప్రధాన రహదారిపై కిలోమీటరు పొడువునా భక్తుల రద్దీ నెలకొంది. వీరు అధికంగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్, సర్కస్‌లు, రంగులరాట్నాలు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు వివిధ ఆటవస్తువుల షాపులు, గృహోపకరణ అలంకరణ సామగ్రి, తదితర షాపులు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా రాజాం సీఐ ఎన్ వేణుగోపాలరావు, పోలీసులు, కమ్యూనిటీ పోలీసులు, భారత్ స్క్వౌట్స్ అండ్ గైడ్స్ భద్రత ఏర్పాట్లు నడుమ తొలిరోజు జాతర ప్రశాంతంగా సాగింది. ఆలయ ఆవరణలో వినోద కార్యక్రమాలు ఎల్లమ్మ జాతర పోటెత్తిన భక్తులు పలాస/మందస: పలాస జామియాత్రకు భక్తులు పోటెత్తారు. కాశీబుగ్గ శ్రీనివాస కూడలి నుంచి పలాస ఇందిరమ్మ విగ్రహం వరకు రద్దీగా మారింది. మందస మండలంలో గోపాలపురం–శ్రీనివాసపురంలో ఎల్లమ్మతల్లి జాతరకు సోంపేట–మందస మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కేటీ రోడ్డులో భక్తుల రద్దీ ఆకట్టుకున్న సైకత శిల్పం కవిటి: స్థానిక ఎల్లమ్మ ఆలయంలో కవిటికి చెందిన యువకుడు గిరీష్ బెహరా జామి ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పాన్ని వేశాడు. దీన్ని చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగారు. గిరీష్ కుమార్ బెహరా వేసిన ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పం -
పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత
► పూర్ణ చంద్రరావు సహా 11 మంది అరెస్టు ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీకి చెందిన కోత పూర్ణ చంద్రరావు జూదమాడుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో సహా 11 మందిని నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట మండలంలోని బారువ రీసార్ట్స్లో పూర్ణచంద్రరావుతో సహా మరికొంతమంది జూదమాడుతుండగా దాడి చేసి అరెస్టు చేసినట్టు సోంపేట ఇన్చార్జి సీఐ సన్యాసి నాయుడు వెల్లడించారు. బారువ రీసార్ట్స్లో పేకాటాడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు తో పాటు కాశీబుగ్గకు చెందిన బి.మధు, ఎస్.మోహనరావు, గణేష్ మహాంతి, బి.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, పలాసకు చెందిన బి.బల్లయ్య, పి.ముకుందరావు, కంచిలికి చెందిన వి.శ్రీనివాసరావు, డి.రవికుమార్, కె.శేఖర్, మందసకు చెందిన ఎం.ఉదయ్ కుమార్‌లను అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్ పరిహారం
మందస(పలాస) :హుద్‌హుద్ తుఫాన్ నష్టపరిహారం కింద జిల్లాలోని రైతులకు రూ.96 కోట్లను అందజేసినట్టు జిల్లా రిలీఫ్ అకౌంట్స్ సహాయ ఆడిట్ అధికారి ఎం.స్వాతి తెలిపారు. మందస మండలానికి సంబంధించిన హుద్‌హుద్ పరిహారం నిధుల పంపిణీ వ్యవహారంపై మంగళవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయానికి రూ.86 కోట్లు, ఉద్యానవనానికి సంబంధించి రూ.10 కోట్లను రైతులకు ఇప్పటికే అందజేశామన్నారు. మందస మండలంలో 38 పంచాయతీల్లోని 147 మంది రైతులకు రూ.2.5 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఈ నిధులు రైతులకు చేరాయా.. అక్రమాలు జరిగాయా.. అనే అంశాలపై ఆడిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు ఆడిట్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమెతో పాటు మందస ఏఎస్ఓ బి.భోగేశ్వరరావు, వీఆర్వోలు నల్ల వైకుంఠరావు, రవీంద్రనాథ్ పట్నాయక్‌లు రికార్డులను పరిశీలించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
► పొలం గట్టుపై లభించిన మృతదేహం ► గుట్టుగా దహనం చేసేందుకు యత్నం ► అడ్డుకున్న పోలీసులు కాశీబుగ్గ : పలాస మండలం సమస్యాత్మక గ్రామం పెదంచలలో శనివారం అనుమానాస్పద స్థితిలో సంజీవి గురుమూర్తి(38) అనే వ్యక్తి మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని దహనం చేసేందుకు గురుమూర్తి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న కాశీబు గ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్సై కేవీ సురేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు సంజీవి గురుమూర్తి.. భార్యాపిల్లలతో పెదంచల గ్రామంలో నివసిస్తున్నాడు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఖాళీ సమయంలో కులవృత్తిలో భాగంగా గానుగును ఆడిస్తుంటాడు. శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన గురుమూర్తి.. ఎంతసేపటికీ ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా.. పొలం గట్టుపై అచేతనంగా పడి ఉండడాన్ని గమనించారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. మృతదేహాన్ని ఇంటికి తరలించి, గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆ తతంగాన్ని అడ్డుకున్నారు. గురుమూర్తి మెడపై తువ్వాలుతో గట్టిగా బిగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. తలపై రక్తంతో గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొలం గట్టుపై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో గురుమూర్తి ఏ విధంగా మృతి చెందాడనే విషయాన్ని చెప్పగలమని సీఐ స్థానిక విలేకరులకు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా.. గురుమూర్తి మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం భార్య అరుణతో అతను గొడవ పడినట్లు తెలుస్తోంది. అతను మృతి చెందిన సమయంలో భార్య అరుణ తన కన్న వారింట్లో ఉన్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం జరిగిన భార్యభర్తల గొడవల్లో గురుమూర్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
పలాసలో భారీగా ఐటీ దాడులు
పలాస(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదాయ పన్ను శాఖ పెద్ద ఎత్తున సోదాలు సాగిస్తున్నారు. విశాఖ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన 82 మంది ఐటీ అధికారులు 18 బృందాలుగా విడిపోయి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, జీడిపప్పు పరిశ్రమల్లో సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాల్లో ఏమేరకు అక్రమ ఆస్తులు గుర్తించారనేది వెల్లడి కాలేదు. సాయంత్రం ఐటీ కమిషనర్ వచ్చేదాకా వివరాలు వెల్లడించబోమని అధికారులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పలాస : పలాస మెయిన్‌రోడ్డులో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక సంజీవ్‌నగర్‌కు చెందిన సరస్వతి బెహర(26) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. పలాసకు చెందిన నౌగాపు సోమేశ్వరరావు ఇటీవల సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. కారుకు పలాసలోని అన్నపూర్ణ ఆశ్రమం వీధిలో ఉన్న బడ్డిపోలమ్మ ఆలయం వద్ద శనివారం పూజలు చేయించాడు. అనంతరం ఇంటికి కారులో డ్రైవ్ చేస్తూ వస్తూ ఎదురుగా వస్తున్న జీడి కార్మికురాలు సరస్వతిని ఢీకొన్నాడు. సరస్వతి గుండెకు బలమైన దెబ్బ తగిలి కింది పడిపోయి అపస్మారక స్థితికి వెళ్లింది. స్థానికులు వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త గోపాల బెహర, కుమార్తె శ్రావణి(10), కుమారుడు సంతోష్(5) ఉన్నారు. భర్త గోపాల్ టిఫిన్ దుకాణంలో పని చేస్తున్నాడు. పసి పిల్లలను చూసి స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యూరు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్ఐ కె.వి.సురేషకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంఘటనకు కారణమైన డ్రైవర్ సోమేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పలాస: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ చెప్పారు. పలాస మండలంలోని ఉద్దానం ప్రాంతంలోని వివిధ పంచాయతీల్లో బుధవారం రైతులకు ఆయన రుణవిముక్తి పత్రాలను అందజేశారు. గురుదాసుపురంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సొర్ర చంద్రయ్యకు మందులు నిమిత్తం రూ.3100లు అందజేశారు. అలాగే అదే గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి గ్రామాల్లో రైతులకు రుణ విముక్తి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, పలాస ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ వంకల కూర్మారావు, టీడీపీ నాయకుడు కుత్తుం లక్ష్మణకుమార్, బొడ్డపాడు సర్పంచ్ తామాడ త్రిలోచనరావు, ఎంపీటీసీ సభ్యుడు మద్దిల రామారావు, ఎంపీడీవో పైల సూర్యనారాయణ, వ్యవసాయ సహాయ సంచాలకులు చల్లా దశరథుడు, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు. పాఠశాల భవనం ప్రారంభం మందస: నాతుపురంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన పాఠశాల భవనాన్ని పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనానికి ఆర్వీఎం నిధులు నుంచి రూ.5.40 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి తాతారావు, కొర్ల కన్నారావు, డి.తిరుపతిరావు, సిర్ల కృష్ణారావు, జీకే నాయుడు, కోనారి తులసీరావు పాల్గొన్నారు. -
రైలుపట్టాలపై కూలిన ప్రహరీ
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై రక్షణ గోడ కూలి పడింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ బాగా నానడంతో సోమవారం అర్థరాత్రి ఆ గోడ దాదాపు 400 మీటర్ల మేర కూలి పట్టాలపై పడింది. దీంతో అధికారులు ఆ ప్లాట్‌ఫాంపైకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గూడ్స్ రైళ్లు మాత్రమే ఆ ప్లాట్‌ఫాంపైకి వస్తాయి. -
న్యాయం కోసం సెల్‌టవర్ ఎక్కిన ఆటోడ్రై వర్
పలాస రూరల్ : గురుదాసుపురం పంచాయతీ సాయినగర్‌కు చెందిన ఆటోడ్రై వర్ సొర్ర భీమారావు గురువారం రంగోయిలో సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు అధికారులు అన్యాయం చేశారని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. న్యాయం చేయూలని డిమాండ్ చేశాడు. రెవెన్యూ శాఖాధికారులు అన్యాయం చే శారని ఆరోపించాడు. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు దిగొచ్చి బాధితుడికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో సెల్‌టవర్ నుంచి దిగాడు. వివరాలు...భీమారావు కొన్నాళ్లుగా అండమాన్ వలసపోరుు అతని చెల్లెలు వై.కాంతమ్మకు తన భూమి వ్యవహారాలను చూడమని చెప్పగా ఆమె తన పేరు మీద పట్టాలు రారుుంచుకొని స్వాధీనపరుచుకుంది. దీంతో ఆయన కోర్టులో కేసు వేశాడు. కోర్టు తీర్పు ఇటీవల చెల్లెలుకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు జరిగారుు. న్యాయం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి చివరకు గురువారం రంగోరుులోని సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఆత్మహత్యకు ప్రయత్నించగా భార్య తన భర్తను రక్షించాలని, న్యాయం చేయూలని విలపించింది. సంఘటనా స్థలానికి కాశీబుగ్గ ఎస్ఐ బి.శ్రీరామమూర్తి తన సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది చేరుకొని బాధితునికి సెల్‌ఫోన్ ద్వారా నచ్చజెప్పినా వినలేదు. ఆర్డీవో వస్తే తప్ప దిగనని మొండికేశాడు. మందస తహశీల్దార్ శివబ్రహ్మానందం, ఆర్ఐ శివాజీపట్నాయక్ అక్కడకు చేరుకొని బతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోరుుంది. టెక్కలి ఆర్డీవో ఎం.విశ్వేశ్వరరావు, కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని సెల్‌ఫోన్ ద్వారా న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. జరిగిన విషయూన్ని ఆర్డీవోకు వివరించాడు. ఆర్డీవో సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకొని బాధితునికి 1.50 ఎకరాలు, అతని చెల్లెలకు 50 సెంట్లు భూమి అప్పగిస్తామని సంతకాలు చేశారు. వారితో పాటు కాశీబుగ్గ సీఐ వై.రామకష్ణ పలాస ఆర్ఐ రవి ఉన్నారు. బాధితుడిని ఆర్డీవో కార్యాలయూనికి శుక్రవారం రావాలని సూచించారు. అధికారులు తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో చెప్పారు. సెల్‌టవర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. -
మృత్యుసాగరం
‘కుంకుమసాగరం’ మృత్యుకుహరంగా మారింది. గత ఏడాది హోలీ వేడుక రోజు పలాస రైల్వే కాలనీకి చెందిన రాపాక వికాస్ అనే విద్యార్థిని మింగేసింది. తాజాగా.. ఇద్దరు చిన్నారుల పాలిట కూడా ఇదే మృత్యుకుహరంగా మారింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. గ్రామంలో అంతులేని విషాదం నింపింది. పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సూదికొండ కాలనీకి చెందిన వడ్డి కార్తీక్ (9), కోతి మహేంద్ర(10) సూదికొండ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు అదే గ్రామానికి చెందిన సింహాద్రి, ఇంద్ర అనే ఇద్దరు సహచరులతో కలిసి గురువారం మధ్యాహ్నం పాఠశాల విడిచిపెట్టిన తరువాత తమ తల్లిదండ్రులు పనిచేస్తున్న పలాస పారిశ్రామికవాడలోని జీడి పరిశ్రమవద్దకు వెళ్లారు. అక్కడ వారి తల్లిదండ్రులను కలిశారు. ఇక్కడే ఆడుకోమని తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పి బయటకు పంపించేశారు. మృత్యువు పొంచి ఉందన్న విషయం తెలియని ఆ చిన్నారులు.. అలవాటు ప్రకారం సమీపంలోని కుంకుమసాగరం చెరువు వద్దకు స్నానాల కోసం వెళ్లారు. స్నేహితుల కళ్లముందే... వడ్డి కార్తీక్, కోతి మహేంద్రతోపాటు సింహాద్రి, ఇంద్ర స్నానాలకని చెరువులో దిగారు. కార్తీక్, మహేంద్ర ఉన్నట్టుండి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఈ హఠాత్పరిణామానికి సింహాద్రి, ఇంద్ర బెంబేలెత్తిపోయి... పరుగుపరుగున వెళ్లి ఇటుకబట్టీలు వద్ద కార్మికులకు తెలిపారు. వారు వెంటనే వచ్చి చెరువులో దిగి ఇద్దరు చిన్నారులను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిం ది. అప్పటికే మృతి చెందినట్టు గుర్తిం చారు. పారిశ్రామికవాడలోని చిన్నారుల కుటుంబీకులకు విషయం తెలియజేయగా వారు హతాశులయ్యారు. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ కనిపించిన పిల్లలు అప్పడే విగతజీవులుగా మారారన్న విషయాన్ని జీర్ణించుకోలేక పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకుని, బోరున రోదిస్తూ కుప్పకూలిపోయారు. వంశాంకురం పోయింది వడ్డి కార్తీక్ తండ్రి బాబూరావు వికలాంగుడు. స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్నాడు. కార్తీక్ తల్లి పార్వతి పారిశ్రామికవాడలో జీడి కార్మికురాలిగా పనిచేస్తోంది. బాబూరావు పార్వతిలకు కార్తీక్ ఒక్కడే కుమారుడు. దీంతో తన వంశాంకురాన్ని కోల్పోయామని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. కోతి మహేంద్ర తండ్రి శ్రీనివాసరావు, తల్లి ఆదిలక్ష్మి కూడా జీడి పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కోతి మహేంద్రకు ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు కె.వి. సురేష్‌కుమార్, బి.శ్రీరామ్మూర్తి వెంటనే సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. గతంలోనూ.... గత ఏడాది హోలీ సందర్భంగా పలాస రైల్వేకాలనీకి చెందిన కొంతమంది యువకులు కూడా ఇలాగే స్నానాలకని కుంకుమసాగరం వద్దకు వెళ్లారు. అప్పట్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన రాపాక వికాస్ అనే విద్యార్థి ఇదే కుంకుమసాగరంలో పడి మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం పలాస మండలం బొడ్డపాడులో జగ్గోరుబంద చెరువులో స్నానాలు చేస్తుండగా ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువుల లోతు పెంచడంతో లోతు ఎంత ఉందనేది తెలియక దిగిన వ్యక్తులు ఈత రాక ఈ విధంగా మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కుంకుమసాగరంలో కూడా చెరువు అభివృద్ధి పేరుతో పొక్లెయిన్‌తో పనులు చేపట్టారు. ఇష్టానుసారంగా పెద్ద పెద్ద గోతులు చేస్తున్నారని, పద్ధతి ప్రకారం తవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు తవ్వకాలపై అధికారులు ఓ కన్నేసి తగిన నిబంధనలు విధించాలనేది ప్రజలు కోరుతున్నారు. -
లాడ్జీలో విద్యార్థి ఆత్మహత్య
పలాస: మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కొత్తూరు మండలం కురుడు గ్రామానికి చెందిన అగతముడి శంకరరావు(16) పాతపట్నంలోని నాయుడు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శంకరరావు ఓ అమ్మాయిని ఏదో అన్నాడని అతడిని ఇద్దరు యువకులు కొట్టడంతో మనస్థాపం చెందాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కాశీబుగ్గలోని ఓ లాడ్జిలో ఓ రూము తీసుకున్నాడు. రెండురోజులుగా రూము నుంచి శంకరరావు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది పరిశీలించింది. దుర్వాసన వస్తుండడంతో తలుపులు తీసి చూడగా రూములోని ఫ్యానుకు శంకరరావు ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించారు. విద్యార్థి బతికి ఉంటాడనే ఆశతో లాడ్జి సిబ్బంది కిందకు దించారు. అయితే మృతి చెందడంతో విషయాన్ని కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శంకరరావు బంధువులకు సమాచారం అందించారు. శంకరరావు తండ్రి సారంగధరరావు బంధువులతో కలిసి లాడ్జికి చేరుకొని కొడుకు మృతదేహం చూసి బోరున విలపించారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్‌కుమార్ చెప్పారు. -
జీడి పరిశ్రమల బంద్
పలాస: ప్రభుత్వ విధానాలపై జీడి పరిశ్రమల యాజమాన్యాలు భగ్గుమన్నాయి. విదేశీ జీడిపిక్కల దిగుమతిపై పన్ను విధింపులకు నిరసనగా పరిశ్రమలను మంగళవారం మూసివేశాయి. పారిశ్రామిక వాడలో మొత్తం 40 పరిశ్రమలు బంద్ పాటించాయి. దీంతో వందలాది మంది కార్మికులకు పని కరువైంది. విదేశీ జీడి పిక్కలపై దిగుమంతి సుంకం 9.35 శాతం విధించడం వల్ల ఏడాదికి సుమారు రూ. 100కోట్లు పన్ను భారం పడుతుందని జీడి పప్పు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు తెలిపారు. దీనిని తక్షణమే తగ్గించాలని కోరారు. పలాస పరిసర ప్రాంతాల్లోని సుమారు 300 జీడి పరిశ్రమలకు స్వదేశీ పిక్కలు సరపోవడం లేదన్నారు. విదేశీ పిక్కలు పప్పును స్వదేశీ మార్కెట్లోనే విక్రయిస్తున్నందున పన్ను పోటు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. పన్నులు తగ్గించకుంటే చాలా పరిశ్రమలు మూతపడడం ఖాయమని అభిప్రాయపడ్డారు. జీడి పప్పు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి తూములు శ్రీనివాసరావు, కోశాధికారి శాసనపురి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పన్ను రాయితీ ఇవ్వాలి పలాస జీడి పరిశ్రమలకు 75 శాతం విదేశీ జీడిపిక్కలు దిగుమతి అవుతున్నాయి. 9.35 శాతం దిగుమతి సుంకం విధించడం వల్ల ఏడాదికి రూ.100 కోట్ల పన్ను భారం పడుతుంది. ఇప్పటికే పరిశ్రమలు ముడిసరుకు లేక మూతపడుతున్నాయి. పన్నురాయితీ ఇవ్వకపోతే మొత్తం పరిశ్రమలు మూతపడే దుస్థితి ఏర్పడుతుంది. -పి.చంటి, వేదమాత కాష్యూ ఇండస్ట్రీ యజమాని, పలాస పారిశ్రామికవాడ జీవనోపాధికి ఇబ్బంది మా కుటుంబంతో సహా జీడి పరిశ్రమల్లో పనిచేయడానికి వలస వచ్చాం. జీడి పరిశ్రమలు తప్ప మరో ఉపాధి మార్గంలేదు. పరిశ్రమలు మూతపడడంతో జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోంది. -గసియా గౌరంగో, సరియాపల్లి, జీడి కార్మికుడు -
కాపాడుతున్నా వద్దన్నాడు!
పలాసలో బావిలో పడి వ్యక్తి ఆత్మహత్య అందరూ చూస్తుండగానే అఘాయిత్యం ఇంకా బావిలోనే మృతదేహం మృతుడు పురుషోత్తపురంవాసి? పలాస: పలాసలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి బావిలో దూకేశాడు. అతడిని కాపాడాలని స్థానికులు ప్రయత్నించినా తిరస్కరించి.. మృతువు ఒడికి చేరాడు. వివరాలివీ... పలాస ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మంచినీళ్ల బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు బావిలో నీళ్లు తోడే బకెట్‌ను అతడికి అందించే ప్రయత్నం చేసినా దాన్ని పట్టుకోలేదు. మృతుడు ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. పలాస పురుషోత్తపురం గ్రామానికి చెందిన వ్యక్తి అని కొందరు చెబుతున్నారు. పర్లాకిమిడి నుంచి వలస వచ్చి పలాసలో స్థిరపడ్డాడని, అతనికి ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని అంటున్నారు. కొంతకాలగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు, జబ్బు తగ్గకపోవడంతో మనస్థాపానికి గురై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చి బావిలో దూకేశాడని చెబుతున్నారు. పలాస అగ్ని మాపక సిబ్బంది అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఫిర్యాదు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. కాశీబుగ్గ పోలీసులు కూడా అక్కడకు వెళ్లారు. ఇంకా ఫిర్యాదు రాలేదని కాశీబుగ్గ ఎస్ఐ కె.వి సురేష్ చెప్పారు. బావిలో నీరు ఎక్కువగా ఉందని, కిందిభాగంలో బురద ఉందని చెప్పారు. మృత దేహంపైకి తేలలేదని అందు వల్లే దాన్ని తీయలే కపోయామన్నారు. గురువారం బావిలో నుంచి మృత దేహాన్ని తీసిన తర్వాతనే ఆ వ్యక్తి ఎవరన్నది తెలుస్తుందన్నారు. ఈ సంఘటన తెలియడంతో పలాస ప్రజలంతా పెద్ద ఎత్తున బావి వద్దకు వెళ్లి చూశారు. -
ఐదేళ్ల బాలికపై అత్యాచారం
పలాస (శ్రీకాకుళం) : పలాసలో అమానుషం జరిగింది. ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మున్సిపాలిటీ 2వ వార్డులోగురువారం చోటుచేసుకుంది. నిందితుడు వజ్రపుకొత్తూరుకి చెందిన ధర్మారావుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డుప్రమాదం: భార్య మృతి,భర్తకు గాయాలు
పలాస (శ్రీకాకుళం) : వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం.. ముందు వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఆగడంతో దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మహిళ మృతిచెందగా.. ఆమె భర్త సహా ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొబ్బరిచెట్లూరు సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. మొగిలిపాడు నుంచి బైక్ పై పూజానగరం వెళ్తున్న దంపతులు కొబ్బరిచెట్లూరు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా రోడ్డుపైన ఆగిపోవడంతో.. దాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుధ (35) అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు పిల్లలతోపాటు భర్తకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిపప్పు గోదాములో భారీ అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద జీడిపప్పు గోదాములో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యువశంకర్ ట్రేడర్స్‌కు చెందిన గోదాములో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం 7 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 2వేల బస్తాల జీడిపప్పు తగలబడి పోయిందని గోడౌన్ నిర్వహాకులు తెలిపారు. -
12 అడుగుల కింగ్‌కోబ్రా కలకలం
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్ననీలావతి రైల్వేగేటు సమీపంలో 12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి రైల్వేగేట్ క్యాబిన్ లోకి దూరిన ఈ నల్లతాచు.. రాత్రంతా బుసలు కొట్టి గేట్‌మన్ ప్రసాద్ ను భయాందోళనకు గురిచేంది. మంగళవారం తెల్లవారిన తర్వాన సమాచారం తెలుసుకున్న నీలావతి గ్రామస్తులు రైల్వే గేట్ వద్దకు చేరుకుని భయంకర సర్పాన్ని చంపేశారు. 12 అడుగుల పొడవు ఉన్న ఈ కింగ్ కోబ్రా అరుదైన పాముగా గుర్తించారు. గత ఏడాది కూడా ఇలాంటి పామే ఒకటి కనిపించిందని గ్రామస్తులు చెప్పారు. -
చెట్టుకింద... కట్టు ‘బడి’
చినరాజాం కాలనీ వాసుల వినూత్న నిరసన ‘మాగ్రామంలో పాఠశాలను మూసేయొద్దు’ అని ఎంతగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆలకించకపోవడంతో ఆగ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. చెట్టుకిందే బడి నిర్వహిస్తూ సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో గల చినరాజాంకాలనీ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తక్కువ మంది పిల్లలు ఉన్నారనే నెపంతో ప్రభుత్వం ఇటీవల మూసివేసింది. పాఠశాలను మూసివేయడం సరికాదని గ్రామస్తులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆ గ్రామానికి దూరంగా ఉన్న వజ్రపుకొత్తూరు మండలం బరంపురం కాలనీ పాఠశాలలో దీనిని విలీనం చేసింది. తమ గ్రామం నుంచి పిల్లలు రోడ్డుపై అంతదూరం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని, మా పాఠశాల మాకు కావాలి అని గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామంలో ఉన్న విద్యాధికులు ఒక చెట్టుకిందనే బడి నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈపరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. - పలాస -
ఎర్రచెరువులో మహిళ మృతదేహం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని ఎర్రచెరువులో గురువారం గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎర్రచెరువు వద్దకు చేరుకుని మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ వయస్సు 40 - 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మహిళ మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య లేక ఆత్మహత్య అనేది పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌కు జీడి వ్యాపారుల పంచాయితీ
పలాస: పలాస జీడి వ్యాపారుల సమస్య చివరికి హైదరాబాద్‌కు చేరింది. పలాస కాష్యూ మ్యానిఫేక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లా శ్రీనివాసరావు, మల్లా సురేష్‌కుమార్‌లు స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషతో పాటు శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెళ్లి అక్కడ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఛాంబర్లో జిల్లా వాణిజ్య పన్ను ల శాఖ కమిషనర్ శ్యామలరావు, విజయనగరం డీసీ శ్రీనివాసరావు తదితరులు సమావేశమై పలాస జీడిపరిశ్రమదారుల పన్ను చెల్లింపు విషయంలో చర్చ లు జరిపారు. మూడు నెలలుగా పలాస జీడిపరిశ్రమదారుల ఇళ్లపై వాణిజ్య పన్నుల శాఖాధికారులు దాడు లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ రోజు టీడీపీ నేత శిరీష సమక్షంలో వ్యాపారులు, కార్యకర్తలు వాణి జ్య పన్నుల శాఖాధికారులను అడ్డుకొని తిరిగి పంపించారు. ఆ తరువాత కలెక్టర్ సమక్షంలో కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు సమస్య వెళ్లింది. మంత్రి సమక్షంలో రాష్ట్ర కమిషనర్‌కు పలాస జీడి వ్యాపార ప్రతినిధులు జరిగిన విషయాన్ని చెప్పారు. మంత్రితో పాటు కమిషనర్ కూడా సానుకూలంతా స్పందించారని తెలిసింది. త్వరలోనే జీడి వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు పీసీఎంఎ అధ్యక్ష కార్యదర్శులు మల్లా శ్రీనివాసరావు, సురేష్‌కుమార్ చెప్పారు. పీసీఎంఎ గౌరవధ్యక్షులు బెల్లాల నారాయణరావు, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, పలాస కాష్యూ లేబరు యూనియన్ కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి తదితరులు చ ర్చల్లో పాల్గొన్నారు. -
కొలిక్కివచ్చిన కంబిరిగాం భూ వివాదం
పలాస: కంబిరిగాం భూ సమస్య కొలిక్కివచ్చింది. 150 ఏళ్లుగా రైతులకు, కంబిరిగాం భూ స్వామి పరశురాం చౌదరి కుటుంబ సభ్యుల మధ్య నలుగుతున్న వివాదానికి హైకోర్టు చెక్ చెప్పింది. చౌదరి కుటుంబ సభ్యులు వేసిన స్టేను రద్దుచేస్తూ ఇనాం యాక్టు 10(ఎ) కింద రైతులకు రెండు భాగాలు, భూస్వామికి ఒక భాగం భూమిని కేటాయించి పట్టాలు మంజూరు చేయాలంటూ ఏప్రిల్ 28న తీర్పు వెలువరించింది. దీంతో సుమారు 317 ఎకరాలను రైతులకు పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలాస మండలం కంబిరిగాం రెవెన్యూ పరిధిలోని భూములను జేసీ-1 వివేక్‌యాదవ్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి రైతులను పిలిపించి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎంత మంది రైతులు సాగు చేస్తున్నారో ఎంత భూమి ఉందని అనేది మరోసారి సర్వే చేయించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేసి ఎవరి వాటాకు చెందిన భూమిని వారికి కొద్దిరోజుల్లోనే అప్పజెపుదామని వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు పాడి నారాయణ, పాడి సూర్యనారాయణ, కనగల ఫల్గుణరావు తదితరులు మాట్లాడుతూ న్యాయమూర్తులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. తాతముత్తాతల నుంచి నేటి వరకు సుమారు 150 ఏళ్ల పాటు ఈ భూములను నమ్ముకొని అనేక కష్టాలు అనుభవించామని వాపోయారు. సుదీర్ఘకాలంగా 33 కేసులు అనుభవించామని, ఒక్క ఆదివారం తప్ప మిగతా నెలలో అన్ని రోజులు కూడా కోర్టుల చుట్టూ తిరిగామన్నారు. సర్వే నంబరు 1 నుంచి 57 వరకు గల భూములను ముట్టితే ఓ కేసు, చేపలు పడితే మరోకేసు, రాలిన మామిడికాయ తీస్తే ఇంకో కేసు ఇలా ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా సోంపేట, శ్రీకాకుళం, పలాస కోర్టులు చుట్టూ పక్షుల్లా తిరిగామంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు కార్చారు. న్యాయమూర్తులు దయతలచి తమపై ఉన్న క్రిమినల్ కేసులన్నీ రద్దు చేశారని, ఇప్పుడు భూమి కూడా ఇనాంయాక్టు కింద తమకు దాఖలు పర్చాలని చెప్పడం చాలా సంతోషకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చేతులెత్తి జోడించారు. దీనికి జేసీ వివేక్‌యాదవ్ స్పందిస్తూ ఇది చాలా మంచి తీర్పు అని, భూస్వామికి కూడా ఒక భాగం దక్కుతుందని, ఇరువర్గాలు కూడా రాజీపడి పరస్పరం సహకారంతో శాంతియుతంగా గ్రామంలో సహజీవనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ వివేక్‌యాదవ్‌తో పాటు ఆర్డ్వీవో ఎం.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ గన్నవరపు సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ బి.పాపారావు, సర్వేయర్లు ఉన్నారు. 150 ఏళ్లుగా... కంబిరిగాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1 నుంచి 57 వరకు గల సర్వే నంబర్లలో 317.71 ఎకరాల భూమి ఉంది. ఇందులో పల్లం 216.67 ఎకరాలు కాగా, మెట్టు 37.63 ఎకరాలు, పోరంపోగు 63.41 ఎకరాలు. ఈ భూములను 1843 నుంచి కంబిరిగాం, కేదారిపురం, ఈదురాపల్లి రైతులు సాగు చేస్తున్నారు. ఇవే భూములపై 1915లో ఒడిశా చత్రపూర్ కోర్టులో భూస్వామి పరశురాంచౌదరి కుటుంబానికి, తర్లాకోట, పర్లాఖిమిడి రాజుల కు మధ్య కేసు నడిచింది. ఈ భూమిని బరంపురం బ్రాహ్మణులకు ఇనాం కింద తర్లాకోట, పర్లాఖిమిడి రాజులు దాఖలు పరచగా, వారి నుంచి పరశురాంచౌదరి కుటుంబీకులు సొం తం చేసుకున్నట్టు అప్పటి చరిత్ర చెబుతోంది. 1976లో భూ సంస్కరణల చట్టం ప్రకారం ఈ భూమి సాగుచేసిన రైతులకు దక్కాలి. అయితే, దీనిని పరశురాంచౌదరి కుటుంబీకులు అడ్డంపడ్డారు. ఎన్ని కేసులు పెడుతున్నా 1843 నుంచి నేటి వరకు ఆ భూములను సాగు చేస్తున్నది కేదారిపురం, ఈదురాపల్లి రైతులే. 1980లో ప్రభుత్వం రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో పరశురాం కుటుంబీకులు హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. 1984లో 90 మంది రైతులకు అనుకూలంగా కమిషనర్ ఆఫ్ లాండ్ రెవెన్యూ తీర్పు చెప్పింది. 1999లో సర్వే చేసి ప్రభుత్వం గజిట్ పబ్లికేషన్ కూడా చేపట్టింది. ఈ సర్వే పనికిరాదని పరశురాం కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 122 మంది రైతులు థర్డ్‌పార్టీగా చేరి హైకోర్టుకు వెళ్లారు. దీంతో 1999లో హైకోర్టు తీర్పు చెబుతూ 12 వారాల్లో ఈ భూములను సర్వే చేసి హక్కు కల్పించాలని ఆదేశించింది. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అండతో రైతులు సాగుకు ఉపక్రమించినా పోలీసుల అండతో భూ స్వామి పరశురాంచౌదరి కుటుంబీకులు సాగును అడ్డుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో అధికారులు దిగి వచ్చారు. జేసీ-1 వివేక్‌యాదవ్ ఇచ్చిన భరోసాతో రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. భూ పోరాటానికి ఒక పరిష్కారం లభిస్తుందని, ఇనాం యాక్టు కింద ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని ఇటు అధికారులు, అటు ప్రజలు ఆశిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో 8మంది చిన్నారులకు గాయాలు
పలాస : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ గురుకుల విద్యాలయానికి చెందిన 8 మంది ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన తరువాత వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామానికి చెందిన విద్యార్థులు ఆటోలో తమ స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. అయితే మున్సిపాలిటీ పరిధిలోని తాళభద్ర రైల్వేగేటు సమీపంలో ఎదురుగా వచ్చిన వాటర్ క్యాన్ల వ్యాన్ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కాశీబుగ్గలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అస్తమించిన అరుణోదయం
పలాస: పిల్లాడి చదువుకు అందివస్తుందని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు.... పిల్ల పెళ్లి చేద్దామన్న ఆశతో ఓ చిరుద్యోగి... వ్యాపారానికి పెట్టుబడిగా ఉంటుందని ఓ బడ్డీకొట్టు నిర్వాహకుడు... ఇంటికి ఫర్నిచర్ చేయించుకుందామని గుట్టుగా సంసారం చేసుకునే ఓ మహిళ... ఇలా ఎంతోమంది మళ్లీ చిట్స్ వలలో పడ్డారు. చీటింగ్‌కు బలైపోయారు. కాశీబుగ్గలో కోట్లలో టర్నోవర్ చేస్తున్న అరుణోదయ చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ ఇక మూతపడక తప్పదని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 25కోట్ల రూపాయలు బకాయిపడిన ఆ సంస్థ యజమాని ఇప్పుడు పత్తాలేకుండా పోయాడు. చేసేది లేక బాధితులంతా ఈ రోజు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ భాస్కర కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న అరుణోదయ చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ యజమాని సంపతిరావు వెంకటగోవిందరావు సుమారు 500 మంది ఖాతాదారులకు సుమారు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. 6 నెలల నుంచి ఖాతాదారులు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా చెల్లించడం లేదు. సుమారు 100 మంది ఖాతాదారులు ఫైనాన్స్ సంస్థ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు డి.లక్ష్మణరావు అనే ఖాతాదారుడు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేశారు. 20 ఏళ్లుగా కాశీబుగ్గ, టెక్కలి కేంద్రంగా నడిచిన ఈ సంస్థ కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించింది. సంస్థ యజమాని ఆ మొత్తాలను స్థిరాస్తి వ్యాపారాలపై పెట్టడంతో తీవ్రంగా నష్టపోయారు. చీటీ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయారు. అప్పుల బాధ తట్టుకోలేక గత ఏడాది ఆత్మహత్యకు యత్నించాడు. చివరికి సుదీర్ఘకాలం చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. ఇటీవల ఖాతాదారులు అతని కోసం కలవడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ రావడం, కొంతమందికి చిన్నమొత్తాలు చెల్లించి పెద్ద మొత్తాలను చెల్లించకపోవడంతో అందులోని ఖాతాదారులు చివరికి కార్యాలయం వద్ద కాపుకాశారు. ఫలితం లేకపోవడంతో గురువారం పలాసకు చెందిన సున్నపు కేశవరావు, టెక్కలికి చెందిన బి.క్రిష్ణవేణి, కొత్తఅగ్రహారానికి చెందిన బి.సత్యవతి, కాశీబుగ్గకు చెందిన బమ్మిడి పోలినాయుడు, పలాసకు చెందిన పి.కె.శ్రీను, పట్నాయక్, భీమారావు, గంధం కామేష్ తదితరులు ఫైనాన్స్ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీబుగ్గలోనే సుమారు 150 మందికి రూ.8కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఇదిగో అదిగో అంటూ కాలం దాటిస్తున్నారే తప్ప డబ్బులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. పైగా ఇప్పుడు ఆయన ఐపీ పెట్టేయత్నంలో ఉన్నట్టు తెలియడంతో రోటరీనగర్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ను ఎస్బీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రూ.45 లక్షలు తమ బ్యాంకుకు ఇవ్వాలని, అందుకే ఈ భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
తప్పతాగి పాఠశాలకు..
పలాస రూరల్: భావిభారత పౌరులను దిద్దవలసిన ఓ ప్రధాన ఉపాధ్యాయుడు తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో పాఠశాలలో వీరంగం సృష్టించి చివరికి సస్పెండ్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే...గరుడుఖండి పంచాయతీ పాత జగదేవుపురం ప్రాథమిక పాఠశాలలో దాసరి రామారావు ఆరేళ్లుగా ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. రోజూ తప్పతాగి పాఠశాలకు వస్తున్నాడు. తరగతి గదిలోనే మద్యం మత్తులో జోగుతుండడం నిత్య కృతమయింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖాధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రామారావు రాజకీయ పలుకుబడి చూపించి కుటుంబ సభ్యులతో అధికారుల కాళ్లవేళ్లా పడి బతిమాలి అధికారుల చర్యల నుంచి తప్పించుకుంటున్నాడు. గతంలో ఇలా పలుమార్లు జరిగింది. శనివారం కూడా తాగి వచ్చి తరగతి గతిలో వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఎంఈవో సుడియా సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వచ్చి పరిశీలించిన ఎంఈవో పరిస్థితిని డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుకునేవారని.. రామారావు చేష్టలతో సగం మంది విద్యార్థులు బడి మానేశారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో చదివించే స్థోమతలేక ప్రభుత్వ బడికి తమ పిల్లలను పంపుతున్నాం.. ఓ హెచ్ఎం ఇలా తాగి వచ్చి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు.. ఎలా బాగుపడతారని అని పశ్నిస్తున్నారు. -
సామాజిక న్యాయం..బీజేపీ లక్ష్యం
పలాస: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి జీఆర్ రవీంద్రరాజు అన్నారు. కాశీబుగ్గ టీకేఆర్ కల్యాణ మండపంలో మహాసంపర్క అభియాన్ కార్యశాల వర్క్‌షాపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు అధ్యక్షతన శనివారం జరిగింది. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలు, మండలాల నుంచి పాల్గొన్న ముఖ్య కార్తకర్తలు, ప్రముఖలనుద్దేశించి రవీంద్రరాజు మాట్లాడారు. కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసి గ్రామాల్లో, పట్టణాల్లో పార్టీని బ లోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశప్రయోజనం, తర్వాత పార్టీ ప్రయోజనం, చివరిగా తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు చేసిన త్యాగాలు, కృషి గురించి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పి.వేణుగోపాలం, రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, జిల్లా ఇన్చార్జి పీవీఎన్ మాధవ్, జిల్లా సంపర్క ప్రముఖ్ డాక్టర్ కణితి విశ్వనాథం, జిల్లా సహ సంపర్క రౌతు చిరంజీవరావు, జిల్లా సభ్యత్వ సహ ప్రముఖ్ సంపతిరావు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటరావు, రాష్ట్ర మహిళామోర్చ ప్రధాన కార్యదర్శి జి.భాగ్యలక్ష్మి, పార్లమెంటరీ ఇన్చార్జి అట్టాడ రవిబాబు, కన్వీనర్ ప్రధాన మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో పెళ్లిళ్ల పేరయ్య !
పలాస: పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తి అనేక ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే... వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామానికి చెందిన సంగారు గణేష్(25) పెళ్లిళ్ల పేరుతో బాధితుల నుంచి వేలాది రూపాయలు దోచుకుంటున్నాడు. తాను మిలటరీ మెడికల్ విభాగంలో హవల్ధార్నని, పెళ్లి సంబంధాలు చూస్తానని నమ్మబలుకుతూ వారి నుంచి వేలాది రూపాయలు తీసుకొని ఉడాయిస్తుంటాడు. ఇదే విధంగా హైదరాబాదు, బహాడపల్లి, పెనుకొండ, పి.ఎం.పురం ప్రాంతాల్లో పెళ్లి సంబంధాలు కుదుర్చుతానని హామీ ఇచ్చి సొమ్ముకాజేశాడు. గణేష్‌ను అనుమానించిన కొంతమంది స్థానికులు పెళ్లి సంబంధం ఉందని రమ్మని కోరగా ఆయన శనివారం మధ్యాహ్నం సూదికొండ కాలనీ సమీపంలో ఉంటున్న పోతనపల్లి గిరిధర్ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆయన వంచనకు గురైన బాధిత యువకులు గణేష్‌ను అదుపులోకి తీసుకొని కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై గణేష్ మాట్లాడుతూ పెళ్లిళ్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను కాశీబుగ్గ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నానని, విలాసాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. బాధితులు దేవేంద్రతో పాటు మరికొంతమంది లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ వద్ద ప్రస్తావించగా పెనుకొండ ప్రాంతంలో ఉంటున్న ఒక అమ్మాయి నుంచి రూ. 30 వేలు గణేష్ తీసుకున్నాడని చెబుతున్నాడని, ఆదివారం బాధితురాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆమె పేరు కుసుమ
పైశాచిక భర్త! కట్నం దండిగా ఇచ్చినా అత్తవారింట ఆరళ్లు శాశ్వతంగా వదిలించుకోవాలని గదిలో నిర్బంధం పోలీసుల సాయంతో బయటపడ్డ గృహిణి పలాస: ఆమె పేరు కుసుమ. కానీ వివాహమయ్యాక వసివాడింది. అత్తవారి ఆరళ్లతో అల్లాడిపోయింది. చివరకు భర్త తనను గదిలో నిర్బంధించంతో విషయం పోలీసులకు తెలిసింది. ఇదంతా ఏదో అనాగరిక సమాజంలో జరిగిందనుకుటే పొరపాటే. విదేశంలో ఉద్యోగంచేస్తూ... దండిగా కట్నం పుచ్చుకుని... ఇప్పుడు వదిలించుకునేందుకు జరుగుతున్న చిత్రహింసల్లో భాగమే. పోలీసులు ఆమెను విడిపించగా తాను ఇన్నాళ్లు ఎదుర్కొంటున్నబాధలను ఆమె కన్నీటితో పోలీసులకు, విలేకరులకు తెలిపింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ కె.టి.రోడ్డులో విశ్వజ్యోతి మెడికల్ స్టోర్ యజమాని శాశనపురి విశ్వేశ్వరరావు కుమార్తె కుసుమను తాళ్ళబద్ర వద్ద గల రైస్ మిల్లు యజమాని తంగుడు భాస్కరరావు కుమారుడు కృష్ణచైతన్యకిచ్చి 2012 ఫిబ్రవరి నెలలో పెళ్లి జరిపించారు. వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు కట్నంగా ఇవ్వడమేగాకుండా, పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు లాంఛనంగా ఇచ్చినట్టు కుసుమ తల్లిదండ్రులు చెబుతున్నారు. వివాహమైన కొద్ది రోజులకే కృష్ణచైతన్య నారాయణదొర కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న అత్తవారింట ఆమెను విడిచిపెట్టి ఉద్యోగ రీత్యా లండన్ వెళ్ళిపోయాడు. వివాహం చేసుకుని తనతో తీసుకెళ్ళకుండా విడిచిపెట్టి వెళ్లడంపై ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను లండన్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. తనకున్న వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని కొద్ది రోజుల్లోనే తిరిగి కాశీబుగ్గ తీసుకొచ్చి తన తల్లిదండ్రులవద్ద దింపేసి వెళ్లిపోయాడు. ఇక అత్తమామలూ తనకు సూటిపోటి మాటలతో మనిసిక క్షభకు గురిచేశాడు. ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆలోచనతో ఇప్పటి వరకు భరిస్తే. ఇటీవల తమ్ముడి వివాహానికి వచ్చిన కృష్ణచైతన్య తల్లిదండ్రులతో కలసి హింసించాడు. భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టాడు. దీనిపై కాశీబుగ్గ పోలీసుల వద్ద, కుల పెద్దలకు ఫిర్యాదు చేయగా తన భర్తతో పాటు అత్తమామలకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికి వారిలో మార్పు రాలేదు. చివరకు ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో మంగళవాం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటిలో బంధించి బయట తాళం వేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చి ఆమె పరిస్థితి చూసి మహిళా సంఘాలకు తెలియజేయగా వారు వచ్చేసరికి కుసుమ అత్తమామలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కాశీబుగ్గ పోలీసులకు విషయం తెలియజేయడంతో ఎస్ఐ ఆర్.వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో పెట్టి నిర్బంధించడం చట్టరీత్యా నేరమని, తలుపులు తీయాలని కుసుమ మామ భాస్కరరావును ఎస్ఐ హెచ్చరించడంతో వెంటనే వచ్చి తలుపులు తీశారు. గది నుంచి బయటకు వచ్చిన కుసుమ తన తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తన కుమార్తెకు న్యాయం చేయాలని కుసుమ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తన కుమార్తె సంతోషంగా జీవిస్తుందనే ఆశతో ఎన్ఆర్ఐ సంబంధం చేశామని, పెద్దగా చదువులేదనే కుంటి సాకుతో తన కుమార్తెను వదిలించుకోవడానికి చూస్తున్నారని తెలిపారు. -
సంక్షోభంలో పలాస జీడి పరిశ్రమలు
సాక్షి, పలాస: జీడిపప్పు ఉత్పత్తిలో జాతీయస్థాయి గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పరిశ్రమలు నేడు సంక్షోభంలో పడ్డాయి. వేతనాల కోసం కార్మికులు రోడ్డున పడ్డారు. వారి సమ్మెతో జీడి పరిశ్రమ లు పూర్తిగా మూతపడ్డాయి. ఉగాది నుంచి కొత్త జీడిపప్పు ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఓ పక్క ముడిసరుకు కొరత, మరోపక్క కార్మికుల ఆందోళన, రాష్ట్ర విడిపోవడం తదితర కారణాల వల్ల ఒకప్పుడు కళకళలాడిన జీడి పరిశ్రమ నేడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. వారం రోజులుగా పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. జిల్లాలోని ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. సుమారు ఐదు లక్షల క్వింటాళ్ల జీడిగింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పంట, పరిశ్రమలే ఉద్దానం ప్రజల జీవనాధారం. పంట ఇలా వచ్చింది... 16వ శతాబ్దంలో తీరప్రాంతం కోతకు గురి కాకుండా పోర్చుగీసు వారు జీడి మొక్కలు నాటడం ప్రారంభించారు. వీటి నుంచి వచ్చే జీడిగింజలు మొదట్లో పశుపక్ష్యాదులకు ఆహారంగా ఉండేవి. తరువాత కాలంలో ఇక్కడి ప్రజలు జీడిగింజలను కాల్చి అందులోని పప్పును తినడం ప్రారంభించారు. సుమారు 7 దశాబ్దాల క్రితం జీడి పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. 1945 నుంచి పలాస కేంద్రంగా జీడిపిక్కల కొనుగోలు ప్రారంభమైంది. అప్పటి వరకు ఇక్కడ రైతులకు వాటి విలువేంటో తెలియలేదు. రాష్ట్రంలో జీడి ఉత్పత్తికి కేంద్రమైన మోరి ప్రాంతం నుంచి వ్యాపారులు పలాసకు వచ్చి జీడిగింజల కొనుగోలు చేపట్టారు. ఆ తరువాత వేటపాలెం ప్రాంతానికి చెందిన వ్యాపారి రాధాకృష్ణ పలాసలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేశారు. అప్పటికే పలాసకు చెందిన మల్లా జనార్దన అనే వ్యాపారి పెన ంపై జీడి గింజలను కాల్చి పప్పు తీసి మార్కెట్లో విక్రయించేవారు. ఆ విధంగా ప్రారంభమైన జీడి పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగింది. 1986 నాటికి రోస్టింగ్ విధానంతో నడిచే 30 పరిశ్రమలు ఉండగా, నేడు వాటి సంఖ్య పలాసతో పాటు పరిసర ప్రాంతాల్లో కలిపి 250కి పెరిగింది. ఇక్కడ తయారైన జీడిపప్పును దేశంలోని ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముడిసరుకు కొరత జీడి పరిశ్రమలకు అవసరమైనంత ముడిసరుకు స్థానికంగా అందడంలేదు. ఏడాదికి 10.80 లక్షల టన్నుల జీడి గింజలు అవసరం కాగా అంత దిగుబడి లేకపోవడంతో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన 35 దేశాల నుంచి జీడిపిక్కలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 22 కిలోల జీడిపప్పు దిగుబడి వచ్చే 80 కిలోల జీడిగింజల బస్తా ప్రస్తుతం మార్కెట్లో రూ.7,200 పలుకుతోంది. గ్రేడింగ్‌ను బట్టి పలాసలో 16 రకాల జీడిపప్పు ఉత్పత్తి అవుతోంది. ఈ పరిశ్రమ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ పరిశ్రమలు, కార్మికుల స్థితిగతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తరువాత పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విజయవాడ దాటి హైదరాబాదు వెళ్లాలంటే పన్ను పోటు పెరిగింది. అలాగే తిరుపతి, ఇతర దేవస్థానాలు పలాస జీడిపప్పు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రముఖ దేవస్థానాలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి పప్పు కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు ఇక్కడి పరిశ్రమలకు రాయితీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు, కనీస వేతనాలు కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. ఫలితంగా యాజమాన్యాలు, కార్మికుల మధ్య వేతన ఒప్పందాల విషయంలో ప్రతిసారీ వివాదాలు తలెత్తి పరిశ్రమలు మూత పడుతున్నాయి. ముడిసరుకు అందడం లేదు పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు అందడం లేదు. దిగుబడి తగ్గిపోయింది. ఈసరికే జీడి పంట రైతుల చేతికి అందాల్సి ఉండగా అందలేదు. ప్రస్తుతం ఇతర దేశాల పిక్కలపైనే ఆధారపడి ఉన్నాం. ప్రభుత్వం రాయితీలు కల్పించి పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలి. - మల్లా శ్రీనివాసరావు, పీసీఎంఏ అధ్యక్షుడు, పలాస కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి పరిశ్రమల్లో కార్మికులకు సదుపాయాలు కల్పించాలి. పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతన చట్టాలను అమలు చేయాలి. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. - బొంపల్లి సింహాచలం, జీడి కార్మిక సంఘం అధ్యక్షుడు, పలాస -
9 గంటల విద్యుత్ ఇవ్వాలి
పలాస : పలాస నుంచి సోంపేట వెళుతున్న ఆర్టీసీ బస్సులో సోమవారం గుర్తు తెలియని మహిళ (48) మృతి చెందింది. పలాస పారిశ్రామికవాడ సమీపంలో బస్సు వెళ్లేసరికి ఆమె మృతి చెందినట్లు తోటి ప్రయాణికులు గుర్తించారు. కాశీబుగ్గ పోలీసుల కథనం ప్రకారం... కాశీబుగ్గ పాత బస్టాండ్ వద్ద ఓ మహిళ బస్సు ఎక్కి హరిపురం వరకు టిక్కెట్ తీసుకుంది. టిక్కెట్ తీసుకునే సమయంలో ఆమె ఆరోగ్యంగానే కనిపించిందని హరిపురం వరకు వెళుతున్నానని చెబుతూ డబ్బులు కూడా ఇచ్చిందని ఆర్టీసీ కండక్టర్ ఎస్.వి. రమణ తెలిపారు. పలాస పారిశ్రామికవాడ వద్దకు వెళ్లేసరికి ముందుగా ఆమె చేతులు ఎత్తుతూ పిట్స్ రోగిలా ఏదో చెప్పబోయిందని, కొద్దిక్షణాల్లోనే మృతి చెందిందని ప్రయాణికుల సమాచారం. స్పృహ కోల్పోవడంతో బస్సును ఆపి డ్రైవర్ ఎస్.జోగారావు, కండక్టర్ ఎస్వి రమణ 108కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కిందకు దిగి వేర్వేరు బస్సుల్లో వెళ్లిపోయారు. కండక్టర్, డ్రైవర్ కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి వయసు సుమారు 48 ఏళ్లుంటుందని, అయితే ఆమె వద్ద ఆమెకు సంబంధించిన చిరునామా, ఇతర వ్యక్తిగత విషయాలు ఏమీ లభించలేదని సీఐ తెలిపారు. వడదెబ్బ వల్లగానీ, గుండెపోటు వల్ల గానీ ఆమె మృతి చెంది ఉంటుందని సీఐ అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పాలన
పలాస: కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పరిపాలనను తెలుగుదేశం ప్రభుత్వం అప్పగించిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యు) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రామకృష్ణ అన్నారు. అందులో భాగమే కార్పొరేట్ దిగ్గజం, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ నేడు మంత్రి అయ్యారని ఆరోపించారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా విద్యా సదస్సు ఆదివారం జరిగింది. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు డి.మల్లిక అధ్యక్షతన జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏజెంటని విమర్శించారు. తొమ్మిదేళ్లు అధికారంలో, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడంతోపాటు నేడు మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆయన ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్నారని మండిపడ్డారు. డీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు కోత ధర్మారావు మాట్లాడుతూ దేశంలో 25 శాతం మందికి మాత్రమే ప్రభుత్వం ప్రకటించినట్టు 2,400 కేలరీల శక్తి భోజనం లభిస్తోందన్నారు. చాలామంది అత్యంత దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తూ విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నారన్నారు. పలాస ప్రభుత్వ జూనియన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజగోపాలరావు మాట్లాడుతూ ఉద్యమాలు చట్ట పరిధిలో ఉండాలని, అందుకు నాయకత్వం కూడా అవసరమని చెప్పారు. అలాంటి ఉద్యమ సంస్థయే పీడీఎస్‌యూ అని విద్యార్థులంతా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి శాంతియుతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డి.మల్లిక మాట్లాడుతూ చాలీచాలని మెస్ చార్జీలతో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవడాని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీడీఎస్యు అంటే ధర్నాలు, ఆందోళనలే కాదని, సామాజిక స్పృహ కలిగి మంచి యువతీ, యువకులుగా తయారు కావాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు ఎస్.పెంటయ్య, రమేష్, వంకల మాధవరావు, గోపిప్రవీణ్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం విద్యార్థులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. -
ప్రాణం తీసిన డబ్బుల గొడవ
మూడు నెలల్లో కూతురు పెళ్లి జరగనుండడంతో ఆ ఇల్లాలు ఫైనాన్స్ వ్యాపారి వద్ద చీటీ వేసింది. పెళ్లి అవసరాలకు డబ్బు కావాలని ఆ వ్యాపారి వద్దకు వెళ్తే.. తీరా లేవు పొమ్మన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తే.. చెబితే భయమా? ఫిర్యాదు చేసుకుంటే చేసుకో.. అంటూ తెగేసి చెప్పాడు. పైగా తానూ వస్తానంటూ ఆమెను తన ద్విచక్రవాహనంపైనే ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు. అలా వెళ్తుండగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో ఏమైందో ఏమో ఆమె బండి నుంచి జారిపడిపోయింది. ‘ఆమె పోతే డబ్బులు ఇవ్వనవసరం లేద’నుకున్నాడో ఏమో.. రోడ్డుపైనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి పోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్చినా ఫలితంలేకపోయింది. చివరికి ప్రాణం పోయింది. పలాస: కాశీబుగ్గ మహారాణిపేటకు చెందిన బీమా రూపావతి(45) ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి గురువారం మృతి చెందారు. ఫైనాన్స్ వ్యాపారి ప్రకాశరావుతో స్కూటీపై వెళ్తుండగా బండిపై నుంచి జారిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కథనం ప్రకారం... మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమార్తె సంతోషిణి(19)కి ఇటీవల వివాహం నిశ్చయమైంది. జనవరి 26న పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా డబ్బు అవసరం కావడం తో తనకుమార్తె సంతోషిణి, కుమారుడు సంతోష్‌తో కలిసి చినబాడాంలోని ప్రకాశరావు ఫైనాన్స్ కార్యాలయానికి ఉదయం 9.30 గంటలకు వెళ్లింది. ప్రకాశరావు వద్ద చీటీ కట్టిన సొమ్ము ఉండడంతో అందులో నుంచి రూ.50 వేలు కావాలని కోరారు ప్రస్తుతం డబ్బులు లేవని ప్రకాశరావు చెప్పడంతో రూపావతి, ప్రకాశరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పగా, తాను కూడా వస్తాను పదా అం టూ తన స్కూటీపై తీసుకుని వెళ్లాడు. అయితే స్కూటీని కాశీబుగ్గ వైపు కాకుండా దారిమళ్లించి బెండి రైల్వేగేటు వైపు తీసుకెళ్తుండగా, ఇలా వెళ్తున్నావేంటి అంటూ బండిమీద ఆమె గొడవ చేశారు. బం డి అలా వెళ్తుండగా గరుడఖండి, సరియాపల్లి గ్రా మాల మధ్య జాతీయ రహదారికి సమీపంలో రూపావతి జారిపడిపోయారు. దీంతో ఆమె తలకు బల మైన గాయాలు తగిలాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న రూపావతిని ప్రకాశరావు పట్టించుకోకుండా అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ విషయం కుటుంబీకులకు తెలియడంతో రూపావతిని పలాస ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె మృతి చెందారు. కుమార్తె సంతోషిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పా రు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రైళ్ల రద్దుతో ప్రయూణికుల అవస్థలు
పలాస: హుదూద్ పెను తుపాను ప్రభావంతో ఈస్ట్‌కోస్టు రైల్వేశాఖ అధికారులు పలురైళ్లు రద్దు చేశారు. దీం తో ప్రయూణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పలాస రైల్వేస్టేషన్లో ప్రయాణికుల నుంచి రావాలసిన ఆదాయానికి భారీ గండి ఏర్పడింది. ప్రయాణికుల నుంచి రోజుకి రూ.3 లక్షలు ఆదాయం లభించేది. రెండు రోజుల్లో సుమారు రూ.6 లక్షలు నష్టం జరిగిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ట్రైల్ బేసిడ్‌గా పాసింజరు రైళ్లను అధికారులు నడిపారు. పలాస రైల్వేస్టేషన్‌కు రావాల్సిన చెన్నై-హౌరా మెయిల్, బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి, యశ్వంత్‌పూర్-హౌరా, కొచ్చి-గౌహతి, హౌరా-సికింద్రాబాదు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, దిబ్రుగర్-కన్యాకుమారి, సికింద్రాబాదు-భువనే శ్వర్, త్రివేండ్ర-గౌహతి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు డైవర్ట్ చేశారు. పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఇదిలా ఉండగా హుదూద్ తుపాను ప్రభావం తీవ్రత తగ్గడంతో సోమవారం సాయంత్రం పలాస రైల్వేస్టేషన్‌కు పలు రైళ్ల రాకపోకలను ప్రారంభించాయి. భువనేశ్వర్ నుంచి విశాఖ పాసింజరు రైలును సోమవారం సాయంత్రం 6 గంటలకు ట్రయల్న్‌గ్రా నడిపించారు. అలాగే భువనేశ్వర్-పలాస ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.30 గంటలకు పలాస రాగా, సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌కు తిరిగి వెళ్లింది. భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వయా విజయనగరం, రాయపూర్ మీదుగా వెళ్లింది. కొవ్వొత్తుల వెలుగులో రైల్వేసిబ్బంది సేవలు ఆమదాలవలస: శ్రీకాకుళంరోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించే రైళ్లు రద్దవ్వడంతో ప్రయూణికులు ఇబ్బంది పడ్డారు. అరుుతే ముందస్తుగా రిజర్వేషన్లు చేయించుకొన్న ప్రయాణికులు ఆ రిజర్వేషన్లు రద్దు చేసుకునేందుకు వారి సౌకర్యార్ధం రైల్వే బుకింగ్ కౌంటర్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ నడిపించేందుకు విద్యుత్ సేవలు లేకపోవడంతో కంప్యూటర్లు పని చేయకపోవడంతో మ్యాన్యువల్‌గా సేవలు అందించేందుకు కౌంటర్లో రైల్వేసిబ్బంది కొవ్వొత్తివెలుగులో పనిచేస్తూ సేవలు అందించారు. పలాస వరకు నడిచిన రెండు రైళ్లు ఇచ్ఛాపురం: రైల్వే అధికారులు సోమవారం భువనేశ్వర్ నుంచి పలాస వరకు రెండు రైళ్లను నడిపారు. భువనేశ్వర్ - విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్యాసింజర్‌గా మార్చి భువనేశ్వర్- పలాస మధ్య నడిపారు. ఉదయం పదిన్నర గంటలకు రైలు ఇచ్ఛాపురం చేరుకుంది. పలాస- పూరి మధ్య మరో రైలును కూడా ప్యాసింజర్‌గా నడిపారు. దీంతో పలాస వరకు ప్రయాణం చేసే వారి ఇబ్బందులు కొంతమేరకు తగ్గాయి. పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు ఎప్పటి నుంచి సాగుతాయో ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల రావలసి ఉందని స్థానిక స్టేషన్ మేనేజర్ కె.డి.పట్నాయక్ చెప్పారు. -
సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు
పలాస: ఈనెల 10న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనుండడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పలాస ప్రభుత్వ జూని యర్ కళాశాల క్రీడా మైదానంలో జన్మభూమి గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏఎస్ ఖాన్, ఇతర అధికారులు పరి శీలించారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ గ్రౌండ్లో హెలీప్యాడ్ ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు కాశీబుగ్గ కేటీ రోడ్డు మీదుగా రోడ్డు మార్గంలో పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతారు. మొగిలిపాడు బ్రిడ్జి వద్ద వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.దేవప్రసాద్, ఐటీడీఏ పీవో ఎన్.సత్యనారాయణ, మెప్మా పీడీ ఎం.సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకాధికారి జె.మోహన్‌రావు, జిల్లా రవాణ శాఖాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఈవో ఎస్.అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. లోపాలుండకూడదు ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో అధికారులు నిర్వహించాల్సిన విధివిధానాల గూర్చి వివరించారు. స్టాల్స్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ శాఖల వారీగా వేర్వేరుగా ఉండాలన్నారు. ఉదయం 6 గం టలకే అధికారులందరు అక్కడకు హాజ రుకావాలని, వారి వారి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.రామిరెడ్డి మాట్లాడుతూ జనధనయోజన పథకం గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎస్వో ఆనంద్‌కుమార్, డీఎంహెచ్‌వో ఆర్.గీతాంజలి, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారిణి ఎం.సునీల పాల్గొన్నారు. సారవకోటలో ఏర్పాట్ల పరిశీలన సారవకోట రూరల్(జలుమూరు): మండలంలోని చల్లవానిపేటలో ఈ నెల 10న జన్మభూమి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానుండడంతో మంగళవారం కలెక్టర్ గౌర్ ఉప్పల్ స్థల పరిశీలన చేశారు. తిలారు రైల్వే గేటు సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు, చల్లవానిపేట గ్రామంలోని శివాలయం సమీపంలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సమావేశ నిర్వహణ, వాహనాలు నిలిపేందుకు, ఇతర వసతులను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా 11 స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. తిలారు నుంచి చల్లవానిపేట గ్రామానికి మధ్యలో రాణ సమీపంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ తనుజారాణి, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, డీపీఆర్వో రమేష్, ఆత్మా పీడీ రామారావు, ఆర్అండ్బీ ఈఈ రమేష్, స్ధానిక ఎంపీడీఓ వాసుదేవరావు, తహశీల్దార్ ఉమామహేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పారదర్శకతకు పాతర.. పింఛన్ల జాతర
పలాస: కమిటీల నిండా అధికార పార్టీ నేతలు.. వారి ఇళ్లలోనే జాబితాల పరిశీలనలు.. సవాలక్ష కొర్రీలు.. ఇవన్నీ చూస్తున్న పింఛనుదారులకు బెంగ పట్టుకుంది. అర్హులకు పింఛన్లు అందుతాయో లేదో.. తుది జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనన్న ఆందోళన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్లో నెలకొంది. వీరందరికీ ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తాలను పెంచుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి ముందు ప్రస్తుత లబ్ధిదారుల్లో చాలామంది అనర్హులు ఉన్నారంటూ ప్రత్యేక కమిటీలు వేసి గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తోంది. రాజకీయ ప్రాబల్యంతో ఏర్పాటైన ఈ కమిటీల సర్వేపై మొదటి నుంచీ అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ మంగళవారం జిల్లావ్యాప్తంగా సర్వే జరుగుతున్న తీరును పరిశీలించినప్పుడు లబ్ధిదారుల ఆందోళన నిజమేనని తేలింది. ఎన్నికల్లో ఓడిన వారికి కమిటీల్లో చోటు కీలకమైన సర్వే నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కమిటీల్లో తెలుగుదేశం కార్యకర్తలను సభ్యులుగా నియమించారు. అందులోనూ పంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజల తిరస్కరణకు గురైన వ్యక్తులను నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రె స్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్న చోట అడ్డగోలుగా జరిపిన ఈ నియామకాల వల్ల తమకు ఓట్లు వేయని లబ్ధిదారుల పేర్లను ఏదో ఒక సాకుతో తొలగించేందుకు అవకాశమిచ్చినట్లేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కమిటీల్లో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు ఉండాలి. గ్రామ పంచాయితీ కమిటీలో సర్పంచి, ఎంపీటీసీ, సెక్రటరీతో పాటు ఒక ఎస్సీ లేక ఎస్టీ, ఇద్దరు సామాజిక కార్యకర్తలను నియమించాలి. మెజారిటీ కమిటీల్లో ఈ పద్ధతి పాటించనేలేదు. ప్రహసనంగా పరిశీలన కమిటీల పరిశీలన కూడా ప్రహసనంగా సాగింది. ఈ నెల 18 నుంచి 23(మంగళవారం) వరకు ప్రస్తుత పింఛనుదారుల అర్హతల పరిశీలనతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి అర్హతలను పరిశీలించాల్సి ఉంది. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని రకాలు కలుపుకొని 2,61, 871 మంది పింఛనుదారులు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరెడ్డి హయాం నుంచీ వీరిలో చాలామంది ఫించన్లు అందుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయాల్సింది పోయి బోల్డన్ని షరతులు పెట్టి పాతవారిని తొలగిం చేందుకు ప్రయత్నిస్తోందని లబ్ధిదారులు విమర్శస్తున్నారు. పరిశీలన పేరిట వృద్ధులు, వికలాంగులను టీడీపీ నాయకులు తమ ఇళ్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహిస్తున్నా.. పరిశీలన పేరిట గంటల తరబడి వృద్ధులను ఎండలో నిలబెట్టేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దే సభలు జరుగుతున్నాయి. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ ఇంటి వద్దే మంగళవారం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం జరిగింది. కమిటీలో కీలకమైన మున్సిపల్ కమిషనర్ లేకుండానే ఈ కార్యక్రమం జరగడం విశేషం. ఎక్కడ కూడా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయడం లేదు. కొంతమందికి పరిశీలన జరుగుతున్న విషయమే తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న పింఛన్లు కొనసాగుతాయో లేదో.. కొత్తవి వస్తాయో రాదో తెలియక పేదలు ఆందోళన చెందుతున్నారు. అర్హులందరికీ పింఛన్లు అర్హులందరికీ పింఛన్లు అందుతాయి. వారిని గుర్తించేందుకే క్షేత్ర స్థాయిలో కమిటీలు వేశాం. గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అంతా పారదర్శకంగా జరుగుతుంది. నిబంధనల మేరకే ఎంపిక కమిటీలను వేశాం. ఇందులో ఎటువంటి లోపాలు లేవు. -తనూజారాణి, ప్రాజెక్ట్ డెరైక్టర్, డీఆర్డీఏ తప్పులు జరిగితే అధికారులదే బాధ్యత ఫించన్ల సర్వేలో కమిటీల పాత్ర నామమాత్రమే. అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు. తప్పులు జరిగితే అధికారులే బాధ్యత వహిస్తారు. ఈ విషయాన్ని టెలీకాన్ఫరెన్సులోనే సీఎం స్పష్టం చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే వారికే నష్టం. -జి.ఎస్.ఎస్. శివాజీ, పలాస ఎమ్మెల్యే -
పలాస ‘రెవెన్యూ’పై ఏసీబీ ఆరా!
పలాస: తహశీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ అధికారుల అవినీతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏం జరుగుతుందోనని కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ‘ఆహా... ఏమి కృప’ శీర్షికన ఫిబ్రవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధి నర్సిపురంలోని సర్వే నంబరు 187లో 5.78, సర్వే నంబరు 188లో 3.89 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 9.67 ఎకరాల ఈ స్థలంలో 620 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి అధికారులు లేఅవుట్లు వేశారు. 2003లో లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చారే గానీ లబ్ధిదారులకు స్థలాలు చూపించలేదు. దీంతో ఎమ్మెల్యే, తహశీల్దార్ కార్యాలయం అధికారులు మారినప్పుడు ఈ స్థలంలోనే మరికొందరికి పట్టాలు పుట్టుకొచ్చాయి. ఇది అవినీతి అధికారులకు కాసుల పంట కురిపించింది. సార్వత్రిక ఎన్నికల ముందు బదిలీ అయిన అప్పటి తహశీల్దార్ ఎల్.పార్వతీశ్వరరావు కూడా సుమారు 100 మందికి పట్టాలు ఇచ్చారని, రూ.కోటి చేతులు మారుంటాయన్న ఆరోపణలు వినిపించాయి. అప్పటి కేంద్ర మంత్రి కృపారాణి ఆశీస్సులతో పార్టీ కార్యకర్తలకు పట్టాలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సూదికొండ, నెమలినారాయణపురం, ఇంగిలిగాం, పెంటిభద్ర, తర్లాకోట తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి వెళ్లాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారుల నుంచి డీ పట్టాలు పొందిన అనంతరం వాటిని పక్క జిరాయితీ సర్వే నంబర్లు వేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర వాటికి వినియోగిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాలా పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ విధంగా పలాస-కాశీబుగ్గ పట్టణంలో ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. వాగులు, వంకలు ఇప్పటికే పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. వీటిపై పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు పలాస తహశీల్దార్ కార్యాలయంపై దృష్టి సారించినట్లు సమాచారం. తహశీల్దార్ కార్యాలయంలో దిగువ స్థాయి సిబ్బంది చెప్పిందే వేదంగా పనులు జరుగుతున్నట్టు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టిసారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
తక్షణమే రుణమాఫీ అమలుచేయాలి
పలాస : టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనట్లు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. పలాసలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పైల చంద్రమ్మ అధ్యక్షతన జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వి.మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీని అమలు చేసి కొత్త రుణాలను అందజేయాలన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోందని, వ్యవసాయ పెట్టుబడులకు, పరికరాలకు రుణాలు అవసరమన్నారు. జిల్లా రైతాంగానికి 70 వేల క్వింటాళ్ల వరివిత్తనాలు అవసరమని, 49 వేల క్వింటాళ్లే అవసరమని అధికారులు ప్రకటించారన్నారు. రైతులకు అవసరమైన అన్ని విత్తనాలను అందజేయాలని, బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, రాపాక మాధవరావు, ఎస్.సోమేశ్వరరావు, ఎం.తాతారావు, కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
జీడి పరిశ్రమపై విజి‘లెన్స్’
పలాస, న్యూస్‌లైన్ : ఉన్నట్టుండి ఒక్కసారిగా తమపై విజి‘లెన్స్’ పడటం.. దాడులు చేసి పెద్ద మొత్తంలో జీడిపప్పు నిల్వలు స్వాధీనం చేసుకోవడంతో పలాస జీడి పరిశ్రమ ఉలిక్కిపడింది. దాడుల భయంతో చాలా ఫ్యాక్టరీలు, షాపులు మూతపడ్డాయి. సోమవారం ఉదయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీడి పరిశ్రమల కేంద్రమైన పలాసలో దాడులు, సోదాలు జరిపారు. రికార్డుల్లో చూపకుండా నిల్వ చేసిన సుమారు కోటి రూపాయల విలువైన జీడిపప్పును స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరు యజమానులపై కేసులు నమోదు చేశారు. దాడుల విషయం తెలిసి పలువురు వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. స్థానిక పారిశ్రామికవాడతోపాటు పట్టణంలోని పలు ఫ్యాక్టరీల పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి రికార్డులు, నిల్వలు పరిశీలించారు. రికార్డుల్లో చూపిన లెక్కకు.. వాస్తవంగా ఉన్న నిల్వలకు తేడా ఉన్న రెండు సంస్థలపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాసనగర్‌లోని గణేష్ కాష్యూ ఇండస్ట్రీలో రికార్డుల్లో చూపకుండా నిల్వ చేసిన రూ.57,44,987 విలువైన పప్పును స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమ యజమాని బెల్లాల సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. అలాగే సీతారామనగర్లోని కన్నన్ కాష్యూ ఇండస్ట్రీపై కూడా ఏకకాలంలో దాడులు చేసి అక్కడ నిల్వ ఉన్న సుమారు రూ.40 లక్షల విలువైన జీడిపప్పును పట్టుకున్నారు. పరిశ్రమ యజమాని మల్లా కాంతారావు నుంచి వివరణ తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ సీహెచ్ ఉమాకాంత్, ఇన్ స్పెక్టర్ ఎల్.రాధమ్మ, డీసీటీవో ఎ.రఘురాం, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణరావు, రామ్మోహన్రావు, బాబూరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్ఐ రాాధమ్మ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ గణేష్ కాష్యూ ఇండస్ట్రీకి సంబంధించిన నిల్వ ఉన్న పప్పును పరిశీలించామన్నారు. దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవన్నారు. యజమాని బెల్లాల సత్యనారాయణను ప్రశ్నించగా ఇన్స్పెక్షన్ కోసం రికార్డులను పంపించామని త్వరలోనే వాటిని అప్పగిస్తామని చెప్పారన్నారు. సరైన రికార్డులు లేనట్లయితే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తామన్నారు. -
మీకో నమస్కారం.. మరి రావద్దు!
పలాస : ‘పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన పాపం మూటకట్టుకుంది.. దీనివల్ల మేం ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం.. కార్యకర్తలు కూడా సహకరించటం లేదు.. ఈ పరిస్థితుల్లో పోలింగ్ ఏజెంట్లను పెట్టమంటున్నారు.. మా వల్ల కాదు.. దీనికోసమైతే మీరు మళ్లీ రావద్దు.. మీకో నమస్కారం..’ అని పలాస-కాశీబుగ్గ పట్టణ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి స్పష్టం చేశారు. ఊహించని చేదు అనుభవం ఎదురుకావటం తో ఆమె కంగుతిన్నారు. కళతప్పిన ముఖంతో వెనుదిరిగారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజులే సమయం ఉండటంతో కృపారాణి, ఆమె భర్త కిల్లి రామ్మోహనరావు, పలాస నియోజకవర్గ అభ్యర్థి వంక నాగేశ్వరరావులు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్ని లక్ష్మి నివాసానికి వెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పార్టీ ఏజెంట్లను నియమించాలని లక్ష్మి, ఆమె భర్త దుర్గాప్రసాద్‌లను కృపారాణి కోరారు. బూత్ ఖర్చులు తాను భరిస్తానని చెప్పారు. కనీసం ఏజెంట్లను పెట్టుకోకపోతే పరువుపోతుందని వాపోయారు. దీనిపై దుర్గాప్రసాద్ ఘాటుగా స్పందిస్తూ, మున్సిపాలిటీ లో ఇప్పటివరకు ప్రచారమే చేయలేకపోయామని.. ఇప్పటికిప్పుడు ఏజెంట్లను పెట్టమంటే ఎలాగని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న కృపారాణి ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లిపోయారు. తర్వాత వంక నాగేశ్వరరావు తన ముఖ్య అనుచరుడిని ప్రత్యేకంగా పంపి రాయబారం నడిపినా ప్రయోజనం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను నియమించుకోలేని దయనీయ పరిస్థితి ఒక్క మున్సిపాలిటీకే పరిమితం కాలేదు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
ఒరేయ్! నా ఓటు వైఎస్సార్ సీపీకే!
ఉదయం 9 గంటలైంది. రామాపురంలో ప్రచారాలు హోరెత్తారుు. నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు ఇంటింటి ప్రచారం చేశారు. పార్టీలపై విమర్శలు గుప్పించారు. నాయకుల ప్రసంగాలను మంచంపై సేద తీరుతూ విన్న రామన్న అనే వృద్ధుడు, తన మనవడు గోపికి మధ్య సంభాషణ ఇలా సాగింది... రామన్న: ఒరేయ్ మనవుడా మైకుల గోల పడలేకపోతున్నానురా. ఎవరేమిటి..! గోపి: వచ్చేనెల 7న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు తాతా...అన్ని పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రామన్న: ఇంటింటి ప్రచారమా అంటూ ఆశ్చర్యపోయూడు. అప్పట్లో విమానం మీద దగ్గరగా వచ్చి కరప్రతాలు జల్లేవారు. వాటిని చూసి ఊర్లో ఉన్న పెద్దలు ఎవరికి ఓటేయమని చెబితే వారికే వేసేవారం. మైకుల గోల ఉండేది కాదు. గోపి: ఇప్పడు కాలం మారింది తాతా... అంతా హైటెక్ ప్రచారాలు చేస్తున్నారు? రామన్న: ఏమి ప్రచారాలో ఏమో... డబ్బులు, మద్యంతో ఓటర్లకు గాలం వేస్తున్నారట. అన్నిపార్టీల వారు ఒకరిపై ఒకరు బురద జల్లుతున్నారు. చెడ్డోలు కూడా మంచోళ్లులా ప్రచారం చేసేస్తున్నారు... గోపి: తాతా ఎవరికి మద్దతిస్తావు..? రామన్న: ఇంకెవరికిస్తాంరా... ఇందిరమ్మ, ఎన్టీఆర్‌లా పాలించిన మహానుబావుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డే. పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు. ఎన్నో పథకాలు ఇచ్చి ప్రజలకు మేలు చేశాడు. ఆ మహానుబావుడు తనయుడు జగన్మోహన్రెడ్డి పెట్టిన వైఎస్సా ర్ సీపీకే మద్దతిస్తాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాను. -న్యూస్‌లైన్, పలాస -
‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేయం
పలాస,న్యూస్‌లైన్: స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాశీబుగ్గ మహాత్మగాంధీ విగ్రహం కూడలి వద్ద సోమవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉండాలంటే చట్ట సభలైన శాసనసభ, పార్లమెంటులో మన ప్రాతినిధ్యం ఉండాలని, ఆ లక్ష్యంతోనే తమ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ మొదట లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు పూర్తి మద్దతు పలికిందన్నారు. బీజేపీ కూడా లేఖ ఇచ్చిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో విభజనకు సహకరించిన వారికి ఓటు వేస్తారా? సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారికి ఓటు వేస్తారా... తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జిల్లాతో తన తండ్రి అమరనాథరెడ్డికి మంచి సంబంధాలున్నాయన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టింది ఎన్నికల తరువాత కాంగ్రెసులో కలిసి పోవడానికి కాదన్నారు. పలాసకు ఒక ప్రత్యేకత ఉందని, అందుకే ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుంచే పారంభిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, ఎమ్మెల్యే కొర్ల భారతి, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, వైశ్యరాజు రాజు, సీనియర్ న్యాయవాది పైల రాజరత్నంనాయుడు పాల్గొన్నారు. విభజన కోరిన పార్టీలను గెలిపించొద్దు శ్రీకాకుళం సిటీ:రాష్ట్ర విభజనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించచవద్దని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలిలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలుగు ప్రజలకు విభజన నిర్ణయంతో జరిగిన అవమానాన్ని భరించలేక సుప్రీం కోర్టులో పిటీషన్ వేసామని, రెండు వారాల్లో విభజనను నిలిపివేసేలా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై ఒక్క మాటైనా మాట్లాడకుండా, ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని అనడం హాస్యాస్పదమన్నారు. మాజీ ఎంపీ కణితి విశ్వనాథం మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసిన నిజమైన నేత కిరణ్ అన్నారు. నిరాశా కిరణం..! కొత్త రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జిల్లా పర్యటనకు వచ్చిన కిరణ్ రెడ్డికి సోమవారం చేదు అనుభవాలే మిగిలాయి. ముందుగా పలసలో మొదలు పెట్టిన రోడ్‌షోకు పెద్దగా జనం లేకపోవడంతో సాయంత్రం వరకు స్థానిక నేత జీవితేశ్వరరావు ఇంట్లో ఉండిపోయిన కిరణ్, ఆ తర్వాత కొద్ది పాటి జనం నడుమే రోడ్‌షో నిర్వహించి, అక్కడి నుంచి హైవే మీదుగా పెద్దపాడు, రామలక్ష్మణ కూడలి, సూర్యామహల్ మీదుగా ఏడుర్లో కూడలికి చేరకున్నారు. అయితే శ్రీకాకుళంలో కూడా ఊహించిన మేరకు జనం రాకపోవడంతో కిరణ్ కాస్తా నిరాశా కిరణ్‌గా కన్పించారు. పలుమార్లు జైసమైక్యాంధ్రా అంటూ నినాదాలు చెయ్యమంటూ జనానికి చెప్పినప్పటికీ, స్పందన లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. శ్యామలరావుకు నివాళి ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి చిగిలిపల్లి శ్యామలరావుకు కిరణ్ నివాళులర్పించారు. బలగ సమీపంలోని శ్యామరావు నివాసానికి వెళ్లిన కిరణ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్యామలరావు మంచి రాజకీయ వేత్త అని కొనియాడారు. -
వాహనాలెక్కని జనం!
పలాస,న్యూస్‌లైన్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్ షో కార్యక్రమానికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు జనం ఎక్కలేదు. రోడ్ షో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పలాస లక్ష్మీపురం టోల్‌గేటుకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుకోవాల్సి ఉంది. ఆ సందర్భంగా వాహనాలతో పెద్ద ర్యాలీతో స్వాగతం పలకాలని మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం ఇంట్లో కార్యకర్తల సమావేశమై నిర్ణయించారు. జన సమీకరణకు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలను రోడ్‌షో కార్యక్రమానికి తీసుకురావడం కోసం 50 టాటా మ్యాజిక్ వాహనాలను అద్దెకు తీసుకున్నారు. వీటిని ఉదయమే పలాస రైల్వే గ్రౌండ్లో సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత గ్రామాలకు పంపించారు. అయితే వెళ్లిన వాహనాలు ఖాళీగా తిరిగిరావడంతో వీటిలో 30 వాహనాలను రద్దు చేశారు. వీటిని రద్దు చేయడంతో వాహన డ్రైవర్లు తమకు అద్దెలు చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేశారు. మిగతా 20 వాహనాలు పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లినప్పటికీ వాహనాల్లో ఇద్దరు, ముగ్గురు తప్పా ఎక్కువ రాలేదు. మందస మండలం వీరగున్నమ్మపురం, కుంటికోట గ్రామాలకు వెళ్లిన వాహనాలను అక్కడివారు ఖాళీగా పంపించేశారు. -
నేడు పలాసలో కిరణ్ రోడ్డు షో
పలాస,న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం పలాసలో రోడ్డు షో నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ పర్యటన షెడ్యూల్ వి వరించారు. మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళం జిల్లా సరిహద్దు గ్రామమైన పైడి భీమవరం వద్దకు కిరణ్ చేరుకుంటారు. అక్కడ నుంచి శ్రీకాకుళం, నరసన్నపేటలో కొద్ది నిమిషాలు ఉండి నేరుగా పలాస మండలం లక్ష్మీపు రం టోల్‌గేటు వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మోటారు వాహనాల ర్యాలీతో పలాస కోసంగిపురం కూడలి వద్దకు 4.30 గంటలకు కాశీబుగ్గ బస్టాండు వద్ద గల మహాత్మగాంధీ విగ్రహం వద్దకు చేరుకొని ప్రచార రథంపై నుంచి ప్రసంగిస్తారు. అనంతరం శ్రీకాకుళం వైఎస్ఆర్ రోడ్ల కూడలి వద్దకు రాత్రి 7.30 గంట లకు చేరుకొని అక్కడ రోడ్డు షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి కిరణ్ ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం పది గంటలకు ఆమదాలవలస రోడ్డు షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ మంత్రి సిగిలిపల్లి శ్యామలరావు కుటుం బాన్ని పరామర్శిస్తారన్నారు. సమావేశంలో సీనియర్ న్యాయవాది పైల రాజరత్నంనాయుడు, డాక్టరు దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావ పాల్గొన్నారు. -
మేడమ్.. కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదు
పలాస, న్యూస్‌లైన్ : ‘నమ్ముకున్నవారు నట్టేట ముంచారు.. కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఉన్న కొద్దిమంది పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకురావడం లేదు. పార్టీ పరిస్థితి బాగోలేదు.. చాలా కష్టంగా ఉంది.. నామినేషన్లు వేయడానికి ఒక్కరోజే సమయముంది.. ఏం చేయమంటారు..’ అని కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న కేంద్ర మంత్రి సమావేశంలో కొద్దిసేపు మాత్రమే ఉండి.. కొన్ని సూచనలిచ్చి వెళ్లిపోయారు. కాశీబుగ్గలోని మున్సిపల్ మాజీ చైరపర్సన్ కోట్ని లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కార్యాలయంలో గురువారం ఉదయం, సాయంత్రం కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఉదయం జరిగిన సమావేశానికి హాజరైన మంత్రి కృపారాణి మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు తీవ్ర నిస్సహాయత వ్యక్తం చేశారు. మొన్నటివరకు కేంద్రమంత్రి వెంట తిరిగిన పలువురు మాజీ కౌన్సిలర్లు ముఖం చాటేయ గా కర్రి మాధవరావు, అట్టాడ మాధవరావు, రేగి గవరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ మూడవ వార్డులో రేగి గవరయ్యను పోటీకి పెడతామని, ఆయనకు మద్దతు ఇవ్వాలని కర్రి మాధవరావును కోరారు. అందుకు ఆయన ససేమిరా అనటంతో కంగుతిన్నారు. ఈసారి వార్డు రిజర్వేషన్ తనకు వర్తించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మీసాల సురేష్‌కు మద్దతు ఇస్తానని మాధవరావు స్పష్టం చేశారు. గతంలో ఆయన తనకు మద్దతు ఇచ్చారని, ఈసారి ఆయనకు మద్దతి స్తానని మాటిచ్చానని, ఇచ్చిన మాట తప్పలేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పోటీ చేయలేమని అట్టాడ మాధవరావు, రేగి గవరయ్య చెప్పినట్టు తెలిసింది. దీంతో అన్ని వార్డులకు పోటీ చేయాలని, పాతవారు లేకపోతే కొత్తవారిని ప్రోత్సహించి శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కృపారాణి నిష్ర్కమించారు. సమావేశం లో మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, హనుమంతు వెంకట రావు, వంక నాగేశ్వరరావు, కోట్ని దుర్గాప్రసాద్, పుక్కళ్ల గురయ్యనాయుడు, తిమడాన కృష్ణారావు, ఉర్నాన అప్పలరాజు తదితరులు పాల్గొన్నా రు. సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు డోల జగన్ సమక్షంలో సమావేశమైన నేతలు పరిస్థితి ఆశాజనకంగా లేదన్న అంచనాకు వచ్చినట్టు తెలిసింది. కనీసం పార్టీ పరువు దక్కించుకోవటానికైనా అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. -
చాప చుట్టేశారు..!
పలాస, న్యూస్‌లైన్ :పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాపచుట్టే పరిస్థితికి వచ్చింది. పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు కూడా వైఎస్సార్సీపీ, టీడీపీలో చేరుతున్నారు. పార్టీని నిలబెట్టేందుకు కేంద్రమంత్రి డాక్టరు కిల్లి కృపారాణి చేసిన మంతనాలు పారడంలేదు. ఆమెకు అత్యంత సన్నిహితంగా నిన్నటి వరకు ఉన్నటువంటి 16వ వార్డు మాజీ కౌన్సిలరు గోళ్ల చంద్రరావు సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. ఇదివరకే 14వ వార్డు కౌన్సిలర్ రోణంకి శాంతికుమారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయూరు. ఇటీవల వరుసగా 5 సార్లు పలాస పట్టణానికి కృపారాణి వచ్చి పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లతో సమావేశాలు జరిపారు. మున్సిపాలిటీలో చుట్టరికాలు చేస్తూ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పార్టీకి అండగా నిలవమని ప్రాథేయపడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆమె పాచికలు పనిచేయడం లేదు. విభజన వాద కాంగ్రెస్ పార్టీలో ఉండలేమంటూ మొన్నటి వరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన మున్సిపల్ మాజీ వైస్ చైరపర్సన్ నాగరాణి పాత్రో, మాజీ కౌన్సిలర్ గుజ్జు జోగారావు, కాంట్రాక్టరు మీసాల సురేష్ వంటి వారు వైఎస్సార్ సీపీలో చేరిపోయూరు. మున్సిపల్ మాజీ చైరపర్సన్ లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కూడా ఊగిసలాడే పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న హనుమంతు వెంకటరావు మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతున్నారు. ఇటీవల వెంకటరావు ఇంటిలో కృపారాణి నిర్వహించిన సమావేశానికి హాజరైన మాజీ కౌన్సిలర్లు ఇప్పుడు వారికి దూరంగా ఉండడమే దీనికి నిదర్శనం. 11వ వార్డు మాజీ కౌన్సిలర్ మల్లా కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని తన అనుచరుల వద్ద అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఏ పార్టీ త రఫున బరిలో దిగేది త్వరలో వెల్లడిస్తానని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, తన సోదరుడు మల్లా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభర్థిగా ఎంపిక చేస్తుందనే ఆశతో ఉండేవారు. ఇప్పు డు అవకాశం రాకపోవడంతో ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందేహంతో ఉన్నట్టు సమాచారం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఈ సారి కాంగ్రె స్ తరఫున పోటీచేసి ఓడిపోవడం కంటే స్వతంత్రులుగా పోటీచేసి, గెలిచిన తరువాత అధికారంలోకి వచ్చే పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో కొందరు బలమైన అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. మున్సిపాలిటీలో ఈ సారి కాంగ్రెస్ తరఫున బరిలో దిగేం దుకు అభ్యర్థులు ముఖం చాటేయడంతో కృపారాణికి మిం గుడు పడడంలేదని సమాచారం. -
ఆహా.. ఏమి కృప!
పలాస మున్సిపాలిటీలో ఇళ్ల పట్టాల కుంభకోణం 2003 అప్పటి పలాస ఎమ్మెల్యే రేవతీపతి మున్సిపాలిటీ పరిధిలోని నర్సిపురంలో 620 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2004 అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర అదే నర్సిపురం పేదలకు పట్టాలు ప్రసాదించారు. 2012 తహశీల్దార్‌గా వచ్చిన పార్వతీశ్వరరావు పాత వారి పట్టాలు రద్దు చేసి కొత్తవారికి ఇస్తామని ప్రకటించారు. 2 నెలల క్రితం: కేంద్రమంత్రి కృపారాణి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. .. ఏమిటీ?.. నర్సిపురం పేదలపై ఇంత మంది ప్రేమ కురిపించారా?!.. అలా అయితే అక్కడ స్థలాలు లేని పేదలంటూ ఉండరని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. స్థలం ఒకటే.. లబ్ధిదారులే మారారు. నేతలు, అధికారులు మారినప్పుడల్లా జాబితాలు మారిపోయాయి. ఒకే స్థలంలో ఇద్దరు ముగ్గురికి పట్టాలు ఇచ్చేయడంతో వారు కొట్టుకునే పరిస్థితి దాపురించింది. పలాస, న్యూస్‌లైన్: తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు.. నేతలు, అధికారులు కలిసి పేదల ఆశలతో ఆడుకున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పదో వార్డు పరిధిలోని నర్సిపురంలో ఒకే స్థలంలో వందల మందికి మళ్లీ మళ్లీ పట్టాలు ఇచ్చి వారిలో వారు తన్నుకునే పరిస్థితి కల్పించి.. చోద్యం చూస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ పట్టాల ప్రహాసనం అటు తిరిగి.. ఇటు తిరిగి కేంద్ర మంత్రి కృపారాణి జోక్యంతో కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లోకి వెళ్లిపోయింది. తమ నాయకులు సూచించిన వారికే పట్టాలు ఇవ్వాలని సాక్షాత్తు కేంద్రమంత్రే అధికారులను ఆదేశించారు. ఇంకేముంది రొట్టె విరగి నేతిలో పడిందని స్థానిక నాయకులు, అధికారులు సంబరపడ్డారు. పేదల నుంచి వేలకు వేలు దండుకొని పట్టాలు ఇచ్చేశారు. దీంతో పాత, కొత్త లబ్ధిదారులు పట్టాలు చేత పట్టుకొని, తమ స్థలాల వద్ద పడిగాపులు పడుతున్నారు. స్థలం తమదంటే తమదని ఘర్షణలకు దిగుతున్నారు. ఫలితంగా గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతం ఘర్షణలు, వాగ్వాదాలకు నిలయంగా మారింది. బలమున్న వారు ఇష్టారాజ్యంగా పునాదులు వేస్తుంటే.. బలహీనులు లబోదిబోమంటున్నారు. అసలు విషయమేటంటే.. పదో వార్డు నర్సిపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 187లో 5.78 ఎకరాలు, సర్వే నెంబరు 188లో 3.89 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. మొత్తం 9.67 ఎకరాల ఈ స్థలంలో 620 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి అధికారులు లే అవుట్ వేశారు. ఆ మేరకు 2003లో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ రేవతిపతి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత 2004లో ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతు అప్పయ్యదొర కూడా అదే స్థలంలో మళ్లీ పట్టాలు పంపిణీ చేశారు. కాగా ఆ స్థలంలో ఇప్పటి వరకు ఎనిమిది కుటుంబాలే ఇళ్లు కట్టుకొని ఉంటున్నాయి. పట్టాలు ఇచ్చినా అధికారులు స్థలాలు చూపకపోవడం వల్లే ఇళ్లు కట్టుకోలేకపోయామని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం పలాస తహశీల్దారుగా వచ్చిన ఎల్.పార్వతీశ్వరరావు స్థలాలు చూపాల్సిన బాధ్యతను విస్మరించి ఇళ్లు కట్టుకోనందున పాత పట్టాలు రద్దు చేసి కొత్త వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు చర్యలు ప్రారంభించారు. కేంద్రమంత్రి జోక్యంతో మారిన సీను ఈ వ్యవహారం ఇంకా నలుగుతుండగానే.. సుమారు రెండు నెలల క్రితం పలాస పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కృపారాణికి ఈ విషయం తెలిసింది. ఎన్నికల ముందు ఈ పట్టాల పంపిణీని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. అధికారులను పిలిచి తమ నాయకులు ఇచ్చే జాబితాల ప్రకారం పట్టాలు మంజూరు చేయాలని హుకుం జారీచేశారు.ఇంకేముంది.. మాజీమున్సిపల్ కౌన్సిలర్లు, అధి కారులు కుమ్మక్కయ్యారు. పట్టాలను అమ్ముకున్నారు. స్థలానికి రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసి నచ్చినవారిని లబ్ధిదారులజాబితాలో చేర్చేశారు. ఇలా సుమా రు రూ. కోటి వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. అక్కడంతా గందరగోళం మూడు నాలుగుసార్లు పట్టాలు పంపిణీ చేయడంతో అసలు పట్టాదారులెవరో.. ఎవరి స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా పాత, కొత్త లబ్ధిదారులు ఆ స్థలం వద్దకు తరలివచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నించడం, దాన్ని కొందరు అడ్డుకోవడం వంటి సంఘటనలతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కనీసం చిన్న రోడ్డుకు కూడా స్థలం విడిచిపెట్టకుండా ఎవరికి వారు నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నర్సిపురం గ్రామానికి చెందిన ఎందరో ఇళ్లు లేని పేదలు, పలాస రైల్వే కాలనీలో గుడిసెల్లో ఉండి నిర్వాసితులైన వందలాది కుటుంబాలు తమ పాత పట్టాలు పట్టుకొని వచ్చినా స్థలం దొరక్క భోరున విలపిస్తున్నారు. కొంతమంది తమ స్థలాలు వద్ద పునాదులు తవ్వుతుంటే నేతల పేర్లు చెప్పి కొందరు బెదిరించి, పంపేస్తున్నారు. ఇదంతా మంత్రి కృపారాణి పుణ్యమేనని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. రోడ్డు ఆక్రమణ పదేళ్ల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉంటున్న బచ్చల చంద్రావతి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ సొంత డబ్బులతో రోడ్డు వేయించానని, ఇప్పుడు ఆ రోడ్డును కూడా ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట ట్రాక్టర్లతో మెటీరియల్ తీసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని కూడా విరగ్గొట్టేశారని, తమ ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇదేమిటని అడిగితే కొట్టడానికి వస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని అక్కడ నివాసం ఉంటున్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అర్హులమైనా పట్టా ఇవ్వలేదు రైల్వేకాలనీలో జూబిడీలో ఉండేవారం. దాన్ని రైల్వే అధికారులు ఖాళీ చేయమన్నారు. దాంతో అద్దె ఇంట్లో చేరాం. నెలకు రూ.2 వేల అద్దె చెల్లించుకోలేక ఇబ్బంది పడుతున్నాం. నా భర్త టీవీ మెకానిక్. స్థలం ఇప్పించమని మంత్రి కృపారాణి దగ్గరకి పదిసార్లు వెళ్లాం. కలెక్టర్‌నూ కలిశాం. ఎవరెవరికో పట్టాలు ఇచ్చారు గానీ మాకు ఇవ్వలేదు. -ఆర్.భారతి, నర్సిపురం పట్టా ఉంది.. స్థలం లేదు నా భర్త వికలాంగుడు. నేను సిమెంటు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మాకు ఇల్లు కట్టుకోవడానికి పదేళ్ల క్రితం స్థలం ఇచ్చారు. పునాదులు వేద్దామని అక్కడికి వెళితే 10 మంది వచ్చి అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరు ‘ఇది మా స్థలం’ అని గొడవ పెడుతున్నారు. దాంతో రాత్రీపగలు మిగతా పనులు మానేసి స్థలం వద్దే ఉంటున్నాను. -బమ్మిడి సరస్వతి, నర్సిపురం -
నిరసన వెల్లువ
పలాస, న్యూస్‌లైన్:రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెస్టుపై నిరసన వెల్లువెత్తింది. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్నా, రాస్తారోకోలు చేశారు. అరెస్టును ఖండిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. కాశీబుగ్గలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. సమైక్య నినాదాలు వినిపించారు. కృపారాణితో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా నినదించారు. సమైక్యాంధ్ర దోషులకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలాస కాశీబుగ్గ మున్సిపల్ కన్వీనర్ బళ్ల గిరిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డబ్బీరు భవానీశంకర్, యవ్వారి మోహన్‌రావు, తంగుడు సత్యం, తాళాసు ప్రదీప్‌కుమార్, కొల్లి జోగారావు, తమ్మినేని కూర్మారావు, బైపల్లి తిరుపతిరావు, కురాగౌడ, కూన శాంతారావు, మామిడి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో జరిగిన ధర్నాలో పార్టీ నాయకులు జి.జగన్మోహనరావు, రేగాన మోహనరావు, వి.చిరంజీవులు, కె.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే, రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కరిమజ్జి బాస్కరరావు,ఆబోతుల జగన్నాథంనాయుడు, దన్నాన అప్పలనాయుడు, పిల్లల ఆనంద్ పాల్గొన్నారు. రాజాం వైఎస్సార్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు, పార్టీ నాయుకులు బల్లా అచ్చిబాబు, పిట్టా జగదీష్, రూపిటి చిన్నప్పలనాయుడు, శాసపు జగన్‌లు పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణ శివారులోని పాలకొండ-శ్రీకాకుళం రోడ్డుపై తమ్మినేని వాణీసీతారాం, పార్టీ నాయకులు బైఠాయించి ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బెండి గోవిందరావు, ధవళ అప్పలనాయుడు, దుంపల శ్యామలరావు, ఎండా విశ్వనాథం, కె.రమణ, బొడ్డేపల్లి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జీడిగింజల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా పలాస ఇండస్ట్రీయల్ ఏరియాలోని జీడిగింజల నుంచి నూనె తీసే కర్మాగారంలో మంగళవారం భారీ అగ్రిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. -
ఫ్లై ఓవర్ నిర్మించే వరకు పోరాటం
పలాస రూరల్, న్యూస్‌లైన్: కంబిరిగాం జంక్షన్ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించేవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం అన్నారు. పలాస మండలం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కంబిరిగాం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంబిరిగాం జంక్షన్‌కు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని, వందలాది మంది గాయాల పాలవుతున్నారన్నారు. దీనిపై జిల్లాలోని హైవే అథారిటీ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ డెరైక్టర్‌తో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబిరిగాం జంక్షన్లో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను సుమారు వంద మీటర్ల వెడల్పు చొప్పున తొలగించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వాటిని తొలగించకపోతే తామే తొలగిస్తామన్నారు. కంబిరిగాం జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు చేయాలని, సోలార్ వీధి దీపాలు వేయాలని డిమాండ్ చేశారు. నిలిచిన వాహనాలు ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వారితో పాటు పరిసర గ్రామాల ప్రజలు వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. పలువురు ప్రయాణికులు కూడా వారికి మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో లారీలు,పలు వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లై ఓవర్ నిర్మించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, వైశ్యరాజు రాజు, బమ్మిడి కృష్ణారావు, కె.పి.నాయుడు, లంబాడ మోహనరావు, పాడి సూర్యనారయణ, కె.కృష్టారావు, పాడి భీమారావు, అర్జున్, వాసు, కారువాడు, పాడి ఫల్గుణ రావు తదితరులు పాల్గొన్నారు.