వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం.. ముందు వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఆగడంతో దాన్ని ఢీకొట్టింది.
పలాస (శ్రీకాకుళం) : వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం.. ముందు వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఆగడంతో దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మహిళ మృతిచెందగా.. ఆమె భర్త సహా ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొబ్బరిచెట్లూరు సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.
మొగిలిపాడు నుంచి బైక్ పై పూజానగరం వెళ్తున్న దంపతులు కొబ్బరిచెట్లూరు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా రోడ్డుపైన ఆగిపోవడంతో.. దాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుధ (35) అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు పిల్లలతోపాటు భర్తకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.