
నిరుపేదతో పాకలో కూర్చున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగింది. రెల్లివీధికి చెందిన పద్మ అనే ఇల్లు లేని ఓ మహిళ మంత్రి ముందు కన్నీరుమున్నీరై తన వేదన తెలుపుకున్నారు. తనకు ఇల్లు లేదని, కర్రలపై పరదాలు కప్పుకుని తల దాచుకుంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నిసార్లు ఇంటి కోసం దర ఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతోందని చెప్పారు.
దీంతో మంత్రి ఆ గుడిసెలోనే కూర్చుని ఆమెను ఓదార్చి అధికారులతో మాట్లాడారు. అన్ని పథకాలపై ఆమె ఇంటి పేరుకు బదులు లబ్ధిదారు(హోల్టర్) అని తప్పుగా ముద్రితమవ్వడంతో పథకాలు అందకుండాపోతున్నాయని గుర్తించారు.
ఇలాంటి చిన్న తప్పులు కూడా కనిపెట్టలేకపోతున్నారని మంత్రి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూదికొండలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే తప్పిదాన్ని సరిచేసి ఈమెకు ఇంటిని మంజూరు చేయాలని కమిషనర్ రాజగోపాలరావును ఆదేశించారు. (క్లిక్ చేయండి: గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు)
Comments
Please login to add a commentAdd a comment