పలాస: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ చెప్పారు. పలాస మండలంలోని ఉద్దానం ప్రాంతంలోని వివిధ పంచాయతీల్లో బుధవారం రైతులకు ఆయన రుణవిముక్తి పత్రాలను అందజేశారు. గురుదాసుపురంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సొర్ర చంద్రయ్యకు మందులు నిమిత్తం రూ.3100లు అందజేశారు.
అలాగే అదే గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి గ్రామాల్లో రైతులకు రుణ విముక్తి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, పలాస ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ వంకల కూర్మారావు, టీడీపీ నాయకుడు కుత్తుం లక్ష్మణకుమార్, బొడ్డపాడు సర్పంచ్ తామాడ త్రిలోచనరావు, ఎంపీటీసీ సభ్యుడు మద్దిల రామారావు, ఎంపీడీవో పైల సూర్యనారాయణ, వ్యవసాయ సహాయ సంచాలకులు చల్లా దశరథుడు, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు.
పాఠశాల భవనం ప్రారంభం
మందస: నాతుపురంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన పాఠశాల భవనాన్ని పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనానికి ఆర్‌వీఎం నిధులు నుంచి రూ.5.40 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి తాతారావు, కొర్ల కన్నారావు, డి.తిరుపతిరావు, సిర్ల కృష్ణారావు, జీకే నాయుడు, కోనారి తులసీరావు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Published Wed, Jun 29 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM
Advertisement