సాక్షి, తాడేపల్లి: నేడు ఎనిమిదో రోజు వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార యాత్ర జరుగనుంది. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో యాత్ర ముందుకు సాగుతుంది. సామాజిక సాధికార యాత్రలో పలువురు వైస్సార్‌సీపీ నేతలు పాల్గొననున్నారు.
పలాసలో యాత్ర రూట్ మ్యాప్:
⏰ఉదయం 10:15 గంటలకు: శ్రీకాకుళం నుండి బయలుదేరి టెక్కలి చేరుకుంటుంది.
⏰ ఉదయం 11:00 గంటలకు: ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ప్రెస్ మీట్.
⏰మధ్యాహ్నం 12:00 గంటలకు: టెక్కలి నుండి బయలుదేరి పలాస వరకు బస్సు యాత్ర సాగుతుంది.
⏰మధ్యాహ్నం 1గంటకు: పవర్ గ్రిడ్ అతిథి గృహం (రామకృష్ణాపురం) పలాసకు చేరుకోవడం, భోజన కార్యక్రమం.
⏰ మధ్యాహ్నం 2 గంటలకు: పవర్ గ్రిడ్ గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమవుతుంది.
⏰ మధ్యాహ్నం 2:15 గంటలకు: కోసంగిపురం జంక్షన్‌కు చేరుకుంటుంది.
⏰ మధ్యాహ్నం 2:30 గంటలకు: 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & ఆసుపత్రికి చేరుకోవడం (అభివృద్ధి కార్యాచరణ సందర్శన)
⏰ మధ్యాహ్నం 2:45 గంటలకు: కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నుండి ప్రారంభమై వైఎస్సార్ స్క్వేర్ కాశీబుగ్గ వరకు సాగుతుంది.
⏰ మధ్యాహ్నం 3.00 గంటలకు: కాశీబుగ్గ వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సామాజిక సాధికర యాత్ర సభా వేదిక వద్దకు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment