Srikakulam Elections
-
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి శిక్షణ కోర్సులు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల స్కిల్ హబ్ సెంటర్లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ ఎస్ఎస్డీసీ జిల్లా అధికారి పి.బి.సాయిశ్రీనివాస్, ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్కిల్ హబ్ సెంటర్లో కొత్తగా ‘కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమె స్టిక్ నాన్ వాయిస్ కంప్యూటర్’ కోర్సులో ఉచి త శిక్షణ అందజేయనున్నట్లు ఆమె వెల్లడించా రు. ఆసక్తి కలిగిన యువతీ, యువకులు ఈ నెల 31లోగా వారి సర్టిఫికెట్లు, పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని వారు వెల్లడించా రు. మరిన్ని వివరాలకు 9493290012 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. జేఈఈ మెయిన్స్ ప్రారంభం ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ పరీక్షలు ఎచ్చెర్ల వెంకటేశ్వర, చిలకపాలెం శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజ్‌ల కేంద్రాల్లో శనివా రం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల వెంకటేశ్వర కళాశాలల్లో మొదటి షిఫ్ట్‌లో 100కి 98, రెండో షిఫ్ట్‌లో 100కి 99 మంది హాజరయ్యా రు. శివానీలో మొదటి షిఫ్ట్‌కు 100కి 96, రెండు షిఫ్ట్‌లో 100కి 100 మంది హాజరయ్యారు. పరీక్షలు నిర్వహణను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. వాన కృష్ణచంద్‌కు అభినందన శ్రీకాకుళం రూరల్: జిల్లా ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇటీవల రాష్ట్ర టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉపాధ్యక్షునిగా ఎన్నికై న వాన కృష్ణచంద్‌ను రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం పెదపాడులోని క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి కృష్ణచంద్ అని, ప్రజలకు మంచి సేవలందిస్తూ మరిన్ని పదవులు అధిరోహించా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తూర్పుకాపు సంక్షేమ సంఘ నాయకులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్కూల్‌గేమ్స్ అండర్–17 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో శ్రీకాకుళంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్‌కు చెందిన పి.శివరామకృష్ణ, జెడ్పీహెచ్‌స్కూల్ మందసకు చెంది న ఎం.మణికంఠ ఉన్నారు. ఈ పోటీలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఔరంగబాద్ వేదికగా జరగనున్నాయి. జాతీ య పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు శనివా రం తన చాంబర్లో అభినందించారు. -
వైఎస్సార్సీపీలోకి పలువురి చేరిక
సోంపేట: వైఎస్సార్పీపీలో చేరికలు జోరందుకుంటున్నాయి. సోంపేట మండలంలోని తాళబద్ర, సిరిమామిడి పంచాయతీల్లో పలువురు టీడీపీ నాయకులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ ఎమ్మె ల్యే పిరియా సాయిరాజ్ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి మన్మధరావు, కొడా రవి, దున్న ఈశ్వరరావు, గోవింద్, మేఘనాథంతో పాటు మరో పది కుటుంబాలు పార్టీలో చేరా యి. తాళభద్ర పంచాయతీ రాణిగాం గ్రామంలో మడ్డు సుందరరావు, కర్రినేని భీమ్‌రాం, పున్నేడుతో పాటు గా మరో 8 కుటుంబాల సభ్యులు పార్టీలో చేరారు. వారికి పార్టీ సమన్వయకర్త పిరియా విజ య, పిరియా సాయిరాజ్‌లు పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సోంపేట, కంచిలి ఎంపీపీలు డాక్టర్ నిమ్మన దాస్, పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శిలగాన భాస్కరరావు, జేసీఎస్ కన్వీనర్ బుద్ధాన శ్రీకృష్ణ, సర్పంచ్ ఉగ్రపల్లి శారద, బైపల్లి ఈశ్వరి, ఉగ్రపల్లి తిరుపతిరావు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి జనసేన వీర మహిళ కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన జనసేన నాయకురాలు సుజాత పండా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె గత ఎనిమిదేళ్లుగా జనసేనలో ఉన్నారు. శుక్రవారం ఆమెను మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆమెతోపాటు భర్త శ్రీనివాసరావు సైతం కండువా వేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గిరిబాబు, వైస్ చైర్మన్లు బోర కృష్ణారావు, మీసాల సురేష్‌బాబు, ప్రభుత్వ విప్ శంకర్‌పండా, సీహెచ్‌సీ చైర్మన్ డబ్బీరు భవానీశంకర్, వాణిజ్య విభాగ చైర్మన్ బెల్లాల శ్రీనివాసరావు, గౌరీ త్యాడి, బళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? నీకిక్కడేం పని? నువ్వు ఇన్చార్జివా? ఇన్చార్జి లేకుండా కార్యక్రమం ఏంటి? వేషాలు వేయకండి. తమాషా చేస్తున్నారా.. ఎక్కువ చేస్తే తరిమి తరిమి కొడతాం.’ ఇదీ శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ నాయకుల భాష. శ్రీకాకుళం నగరంలోని టీడీపీలోని రెండు గ్రూపులు పాలకొండ రోడ్డుపై న్యూసెన్స్ చేశాయి. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తోసుకుని నువ్వెంతంటే నువ్వెంత అని ఘర్షణ పడ్డారు. నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న గొండు శంకర్‌పై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరులు దాడికి దిగారు. బలవంతంగా తోసేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. గంటకు పైగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఐదేళ్లుగా వర్గపోరు.. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపునకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నాయకత్వం వహించగా, మరో గ్రూపునకు రూరల్ నాయకుడు గొండు శంకర్ నేతృత్వం వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఐదేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. పలుమార్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పోలీసు స్టేషన్ల వరకు వెళ్లారు. తాజాగా శ్రీకాకుళం కేంద్రంగా మరోసారి రోడ్డెక్కారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకుండా ఇద్దర్ని రెచ్చగొడుతోంది. టికెట్ తమకే అంటూ ఇద్దరూ ఆశతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. నడిరోడ్డుపైనే వీరంగం.. ఈక్రమంలో బుధవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని రెల్లివీధిలో గొండు శంకర్ తన వర్గీయులతో కలిసి ఇంటింటికీ శంకరన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి అనుచరులైన పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటే‹Ù, వార్డు ఇన్‌ఛార్జిలు కళ్యాణి వెంకటరావు, జలగడుగుల జగన్, కవ్వాడి సుశీల తదితరులు అక్కడికొచ్చి గొండు శంకర్‌ను అడ్డుకున్నారు. అతను పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో గుండ లక్ష్మీదేవీ వర్గీయులు రెచ్చిపోయారు. గొండు శంకర్‌ను అక్కడి నుంచి నెట్టేశారు. ఆయన అనుచరులను తోసేశారు. ఈ తోపులాట ప్రధాన రహదారిపైకి వచ్చేసింది. ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఇరు వర్గాల వీరంగంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారంలో లేనప్పుడు వీరింత అలజడి సృష్టిస్తున్నారంటే.. ఒకవేళ అధికారమిస్తే ఇంకెంత రెచ్చిపోతారోనని స్థానికులు చర్చించుకున్నారు. -
లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడుపై వేటు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిస్థితే అందుకు ఉదాహరణ. పార్టీ లేదు.. బొక్కా లేదు అని, ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి అని ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు రాష్ట్ర అధ్యక్షుడే అయినా జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న వారు కనీసం ఆయనను సంప్రదించడం లేదు. పైగా అచ్చెన్న పేరు చెప్పుకుని అధిష్టానం వద్దకు వెళ్తే సీటు గల్లంతే అన్న నిర్ణయానికి వచ్చేశారు. మరీ ముఖ్యంగా లోకేష్ ‘అచ్చెన్న అనుచరుడు’ అని ముద్ర ఉన్న వారిని ప్రత్యేకంగా గమనిస్తున్నారని, దీనిపై ఆరా తీసే బాధ్యతను కూడా కళా వెంకటరావు తదితర నేతలకు అప్పగించారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారు అచ్చెన్న ప్రమేయం లేకుండా లోకేష్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నారు. చేటు తెచ్చిన మాట.. లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఇటీవల చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదంటూ ఫోన్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు...తనకు సమకాలీనులైన నాయకుల వద్ద లోకేష్‌పై మాట్లాడిన తీరు.. అన్నీ కలిపి ఇప్పుడు ఆయనపై గట్టిగానే ప్రభావం చూపిస్తున్నాయి. పార్టీని, తనను బదనాం చేసిన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు అచ్చెన్నాయుడుపై వేటేస్తే పార్టీకి ఇబ్బంది అని వేచి చూస్తూనే.. వ్యక్తిగతంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీలో అచ్చెన్నాయుడు మాటకు విలువ లేకుండా చేయడంతో పాటు ఆయన అనుచరులుగా పార్టీ టిక్కెట్ ఆశించే వారికి మొండి చేయి చూపే విధంగా లోకేష్ పావులు కదుపుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో అచ్చెన్న పేరు చెప్పుకుని టిక్కెట్ అడిగేందుకు ఆశావహులు సాహసించలేకపోతున్నారు. వాస్తవంగా ఈ సారి ఎన్నికల్లో పాతపట్నం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో టీడీపీలో నెలకున్న అంతర్గత విభేదాల కారణంగా సీట్ల కేటాయింపు విషయంలో నిర్ణయా లు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షు డి హోదాలో అచ్చెన్నాయుడును వెంటబెట్టుకుని అధిష్టానం వద్ద ప్రయత్నాలు సాగించాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టిక్కెట్ కోసం అచ్చెన్నాయుడు వ్యతిరేక వర్గంగా నిలిచిన లోకేష్ అనుచరులతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కళా వెంకటరావుతో టచ్‌లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత కూన రవికుమార్ ద్వారా యత్నాలు సాగిస్తున్నారు.. వీరిద్దరూ లోకేష్ తో బాగా టచ్‌లో ఉన్నారు. చెప్పాలంటే అచ్చెన్నకు పోటీగా లోకేషే వీరిని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో ఏం జరిగినా లోకేష్‌కు ఇట్టే సమాచారం ఇస్తున్నారు. అచ్చెన్నతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న నేతలెవరో చెప్పే బాధ్యతను తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనికంతటికీ తిరుపతి లోకసభ ఉప ఎన్నికల సమయంలో లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే కారణమని చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చెప్పిన మనషులకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని, కాస్తో కూస్తో ఎంపీ రామ్మోహన్నాయుడు చెప్పినోళ్లకై నా ప్రాధాన్యత ఇస్తారేమో గాని అచ్చెన్నాయుడు సిఫా ర్సు చేసే వ్యక్తులకు ఛాన్సే లేదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దీంతో అచ్చెన్నాయుడుతో కలిసి వెళ్లడానికి, ఆయన సిఫార్సులతో టిక్కెట్ కోసం ప్రయత్నించడానికి జిల్లాలోనే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల తర్వాత అచ్చెన్నను పూర్తిగా అణగదొక్కడానికి లోకేష్ ప్రణాళిక సిద్ధం చేశారని పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది. -
పాలకొండ టికెట్ జనసేనకే..!
పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం టీడీపీలో టికెట్ ఎవరికి ఇస్తారో తెలియని గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ గ్రూపుల గోలతో తరచూ రచ్చకెక్కుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. పాలకొండ టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వర్గ పోరు గతేడాది జూలై 12న చంద్రబాబు చేపట్టిన బస్సుయాత్రలో బహిర్గతమైంది. బస్సు యాత్రకు వచ్చిన చంద్రబాబు వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్లో బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ప్రకటిస్తారని అతని వర్గీయులు ఆశించారు. అయితే చంద్రబాబు కనీసం జయకృష్ణ పేరు ప్రస్తావించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో నియోజకవర్గంలో ఉన్న నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి వర్గీయులు చాపకింద నీరులా ఒకరిపై ఒకరి కత్తులు దూసుకుంటున్నారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీలో వీరు వర్గపోరుకు బీజం పోస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్గ పోరుకు టీడీపీ అధిష్టానం చెక్ పెట్టేందుకు ఇక్కడ ప్రత్యామ్నాయంగా జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. తమ అభ్యర్థులకు వ్యతిరేకత ఉన్నచోట జనసేనకు టికెట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు టీడీపీ నాయకులే చెబుతుండడం గమనార్హం. ఇక్కడ జనసేనకే టికెట్ ఇస్తే ఇన్నాళ్లు టీడీపీని నమ్ముకున్న నిమ్మక జయకృష్ణకు నిరాశ తప్పదని, భూధేవికి భంగపాటే మిగులుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏది ఏమైనా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుపు తథ్యమని, ఈమె హ్యట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమె హయాంలోనే పాలకొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫోన్ కాల్స్ కలకలం పాలకొండ టీడీపీ టికెట్ ఎవరికిస్తే బాగుంటుందని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాయిస్‌తో వచ్చిన ఫోన్ కాల్స్ టీడీపీలో కలకలం రేపాయి. ఇవి బోగస్ ఫోన్స్ కాల్స్ అని టీడీపీలో ఓ వర్గం కొట్టిపడేసింది. ఇదిలా ఉండగా 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇందులో 2004, 2009లో మాజీ ఎమ్మెల్యే దివంగత నిమ్మక గోపాలరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 2014, 2019లలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిపై గోపాలరావు తనయుడు జయకృష్ణ టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఇక 2024లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుస్తుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. -
ఆయనకు టికెట్ ఇస్తే నేనే ఓడిస్తా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ నాలుగు స్తంభాలాట ఆడుతోంది. తనకు టికెట్ ఖాయమైపోయిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రచారం చేస్తుండగా.. ఆయనకు టికెట్ ఇస్తే తానే ఓడిస్తానని మామిడి గోవిందరావు హెచ్చరిస్తున్నారు. ఈ గొడవతోనే ఆ పార్టీకి తలనోప్పి కడుతుంటే ఆ పార్టీ పాత నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు తాజాగా తెరపైకి వచ్చి తానూ ఇండిపెండెంట్‌గా అయినా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఈ జంఝాటం మధ్య జనసేన ఇన్చార్జి గేదెల చైతన్య తనకు కూడా సీటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులతో పాతపట్నంలో టీడీపీ రాజకీయం పతనావస్థకు చేరుకుంది. బలంగా వైఎస్సార్సీపీ.. పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1200కోట్లకు పైగా సంక్షేమ పథకా లు, రూ.800కోట్లకు పైగా నాన్ డీబీటీ పథకాలు అందించడంతో పాటు రూ. వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దానికి తోడు వంశధార నిర్వాసితులందరికీ చక్కగా పరిహారం అందజేసింది. దీంతో వైఎస్సార్సీపీ చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన తమలో తాము కొట్టుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే పని పెట్టుకున్నాయి. కానీ సమన్వయంలోపం కారణంగా ఆ పని కూడా చేయలేక చతికిలపడుతున్నారు. అంతటా అయోమయం.. టీడీపీకి అలవాటైన డబుల్ గేమ్ పాతపట్నంలో వికటించే పరిస్థితి కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమ ణ పార్టీ ఫిరాయించి టీడీపీకి వెళ్లడంతో ఆ పారీ్టలో ముసలం పుట్టింది. ఆయన అప్పటికే వంశధార నిర్వాసితుల పరిహారం, ఇసుక, ఇతరత్రా ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోట్ల రూపాయల కోసమే కలమట పార్టీ మారారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కలమట ఘోరంగా ఓడిపోయారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఇస్తే ఓడించి తీరుమతామని మరో నేత మామిడి గోవిందరావు అండ్ కో బాహాటంగానే చెబుతోంది. కాకపోతే, కలమట వల్ల ఎంత లబ్ధిపొందారో.. ఏ రకంగా ప్రయోజనం కలిగిందో తెలీదు గానీ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఫ్యామిలీ మాత్రం కలమటకు అండగా నిలుస్తోంది. వారి అండదండలే తనకు ఆశీస్సులని, అవే సీటు తెచ్చి పెడతాయని కలమట కొండంత ఆశతో ఉన్నారు. అందుకు తగ్గ సంకేతాలు వస్తున్నాయి. మామిడి గోవిందరావు తనకు పోటీ ఏంటని, వాడుకుని వదిలేస్తామని కలమట బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. టిక్కెట్ ఇవ్వకుంటే.. టీడీపీలో మరో కీలక నేతగా ఎదిగిన మామిడి గోవిందరావు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి సీటు తనకే వస్తుందని చెబుతున్నారు. తర చూ చంద్రబాబును, లోకేష్ ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతి సారి రూ. లక్షల్లో పార్టీకి చదివించుకుంటున్నారు. ఇలా ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. కాకపోతే, ఆయన ఆశలను కింజరాపు ఫ్యామిలీ అడియాశలు చేస్తోంది. మామిడి గోవింద్‌ను వాడుకుంటామని, ఖర్చు పెట్టిస్తామని, అంతమాత్రాన టిక్కెట్ ఇచ్చేస్తామా అని ఒకానొక సందర్భంలో అచ్చెన్నాయుడు బహిరంగంగా చెప్పేశారు. అయినప్పటికీ మామిడి.. లోకేష్ తదితరులకు టచ్‌లోకి వెళ్లి, కింజరాపు ఫ్యామిలీ వ్యతిరేక గ్రూపులో రాజకీయాలు నెరుపుతున్నారు. కానీ ఈయనకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదు. ఒకవేళ తనకు కాకుండా కలమటకు టిక్కెట్ ఇస్తే నియోజకవర్గమంతా తిరిగి ఓడిస్తానని చెప్పకనే చెబుతున్నారు. కాకపోతే ఇటీవల ఆయనలో స్పీడు తగ్గింది. కార్లు ఇచ్చి డబ్బులిచ్చి తిప్పించడం వంటి పనులు కూడా తగ్గించేశారు. కలవరం.. ఇదంతా ఓ వైపు సాగుతుండగా.. ఒకప్పుడు టీడీపీలో కొనసాగి, తర్వాత స్తబ్దతగా ఉన్న సిరిపురంతేజేశ్వరరావు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడిది టీడీపీని కలవరపెడుతోంది. మరో మిత్రపక్షమైన జనసేన పరిస్థితి మరోలా ఉంది. తమకే టిక్కెట్ వస్తుందని ఆశపడుతూనే కలమటతో కలిసి పనిచేయలేమంటూ తమ వైఖరి ద్వారా తెలియజే స్తోంది. ఆ పార్టీ ఇన్చార్జి గేదెల చైతన్య తొలుత కొన్ని సార్లు కలమట వెంకటరమణతో కలిసి వేదిక లు పంచుకున్నా ఆ తర్వాత దూరం పాటిస్తున్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో కలిసి పనిచేయలేమని జనసేన కేడర్ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. -
సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా లావేరు సాక్షి విలేకరి గురిజా దామోదరరావు మృతి బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తన పెదనాన్న గొర్లె శ్రీరాములునాయుడుకు, దామోదరరావు తండ్రి తవిటయ్యతో మంచి అనుబంధం ఉందని, దామోదర్ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా టీడీపీ నేతలు కళా వెంకటరావు, చంద్రబాబు స్పందించిన తీరు శవాలపై రాజకీయం చేసేలా ఉందని విమర్శించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, దామోదర్ నాలుగు నెలలు ఎవరితో ఎక్కువ మాట్లాడారో కాల్స్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. దామోదర్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ కళా వెంకటరావు రాజకీయ లబ్ధి కోసమే దామోదర్ మృతిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కిందట కళా వెంకటరావు తన తమ్ముడినే చంపేశాడని కుటుంబ సభ్యులే కేసు పెట్టారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వేధించారంటూ వంగర ఎస్ఐ, కళాతో పాటు ఆయన పీఏపైనా కేసు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు లావేటిపాలెం వైఎస్సార్సీపీ నేతలు, మృతుడి బంధువులైన లావేరు ఎంపీటీసీ ఇనపకుర్తి సతీష్, ఇనపకుర్తి చంద్రశేఖర్, సగరం విశ్వనాథం మాట్లాడుతూ దామోదర్ ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. టీడీపీ నేత జగ్గన్న దొరకు దామోదర్ రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు దామోదర్ చెప్పాడని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపిపై ఆరోపణలు చేస్తున్నారని, సూసైడ్ లెటర్ కూడా టీడీపీ వాళ్లు పెట్టించి ఉంటారని ఆరోపించారు. -
‘ఏపీ ప్రజల ఆకాంక్షలు సీఎం జగన్ నెరవేర్చారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. పాతపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో వైస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, వి.కళావతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజల ఆకాంక్షలు తీర్చారు. వంశధార నిర్వాసితులకు 216 కోట్లు అదనపు పరిహారం ఇచ్చారు. హిర మండలం వద్ద 176 కోట్ల తో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. పాడు పడిన పాఠశాలలు బాగు చేసి మంచి బడులు గా తీర్చి దిద్దారు. కొత్తూరు లో 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం కిడ్నీ రోగులకు నెఫ్రాలజిస్టులను కనీసం నియమించ లేకపోయింది. జగనన్న ఏకంగా కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ నిర్మించారు’’ అని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండి.. జన్మభూమి కమిటీల ద్వారా గత ప్రభుత్వం ప్రజల సొమ్ము దోపిడీ చేసిది. అవినీతి లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2లక్షల 45 వేల కోట్ల రూపాయిలు ప్రజల ఖాతా ల్లో జమ చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. సంక్షేమ పథకాలు గౌరవంగా ఇస్తున్న విషయం గమనించండి. చంద్ర బాబు అభివృద్ధి లేదంటున్నాడు. ప్రతి గ్రామంలో సచివాలయం, ఆరోగ్య కేంద్రం నిర్మించడం అభివృద్ధి కాదా?. ప్రజల అవసరాలు వైద్యం, విద్య, ఉపాధి కల్పించకుండా రోడ్డులు వేస్తే అభివృద్ధి జరిగినట్టా?. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు అవే ఇస్తానంటున్నాడు. మూడు సార్లు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. ఏమి చేశారు?. వైస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో సంస్కరణలు తెచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేసింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే పేదలు కోటీశ్వర్లు అయ్యారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే పనులు చేసింది ఈ ప్రభుత్వం -మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారు.. సీఎం జగన్ నాలుగున్నరేళ్లు పాలనలో ఎంతో మార్పు తెచ్చారు. సచివాలయాల ద్వారా అవినీతి లేకుండా పథకాలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో ఏమి చేశామో సచివాలయం వద్ద దాపరికం లేకుండా ధైర్యంగా బోర్డు పెట్టాం. ఈ బోర్డుల్లో ఎక్కడైనా అబద్ధం ఉంటే నిలదీయండి. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయడం తప్పు అని చంద్రబాబు అంటున్నాడు. అప్పట్లో చంద్రబాబు అలీబాబా 40 దొంగల్లా దోచుకొని ప్రజల సొమ్ము తిన్నారు. పేద పిల్లాడికి మంచి యూనిఫార్మ్, స్కూల్ బ్యాగ్, బూట్లు కొని ఇస్తే తప్పా. తమ బిడ్డ నీట్‌గా తయారై స్కూల్‌కి వెళ్తుంటే తల్లి కళ్లల్లో సంతోషం చూడటం అభివృద్ధి కాదా? -స్పీకర్ తమ్మినేని సీతారాం -
పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభానికి 12న సీఎం జగన్
కాశీబుగ్గ: పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభించేందుకు డిసెంబర్ 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలాస రానున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను బుధవారం ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి సందర్శించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజాసంఘాలు, వామపక్షాలతో కలిసి కిడ్నీ బాధితుల పక్షాన గళం వినిపించామని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రాలు కార్యరూపం దాల్చాయని చెప్పారు. రూ.700 కోట్లతో మంచినీటి పథకం సైతం నిర్మించినట్టు తెలిపారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం జగన్ డిసెంబర్ 12న పలాస వస్తున్నారని చెప్పారు. అన్నిరకాల వైద్యసేవలూ పొందేలా.. పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ ఆస్పత్రి కేవలం కిడ్నీ వ్యాధిగ్రస్తులకేననే అపోహ ఉందని మంత్రి అప్పలరాజు అన్నారు. కానీ.. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, న్యూరాలజీ, పల్మనాలజీ, ఆడియోగ్రఫీ, ఐసీయూ వంటి అత్యవసర వైద్యసేవలు 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అత్యవసర వైద్యం అవసరమున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందవచ్చన్నారు. డయాలసిస్ యూనిట్లో 40 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు షిఫ్ట్‌లలో రోజుకు 120 నుంచి 200 మందికి రోజుకు డయాలసిస్ చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఆయన వెంట మహేంద్ర రైతు కూలీ సంఘం, ఉద్దాన రైతు కూలీ సంఘం, జీడి రైతు సంఘం, యూటీఎఫ్, యూవీవీ సేవా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, పలాస యూత్ అసోసియేషన్, శ్రీవివేకానంద సేవాసమితి, గ్రీన్ ఆర్మీ అసోసియేషన్, సీపీఐ ప్రతినిధులు ఉన్నారు. -
పాలకొండలో సామాజిక జైత్రయాత్ర
-
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్‌ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది. సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం, కోనసీమ జిల్లాలో జరుగనుంది. విజయనగరంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అలాగే, కోనసీమ జిల్లా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. విజయ నగరం రాజాంలో బస్సుయాత్ర ఇలా.. ►విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►ఉదయం 11:30 గంటలకు బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న వైఎస్సార్సీపీ నేతలు ►మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►మధ్యాహ్నం 12.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభం ►భోజన విరామం అనంతరం పాలకొండ రోడ్డులోని జెజె ఇన్నోటెల్ వరకు ర్యాలీ, బస్సు యాత్ర. ►మధ్యాహ్నం మూడు గంటలకు రాజాంలో బహిరంగ సభ. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇలా.. ►కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం ఒంటి గంటకు రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభం ►ఎనిమిది కిలోమీటర్లు జరుగనున్న బస్సు యాత్ర ►సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్లో బహిరంగ సభ -
సామాజిక సాధికార బస్సుయాత్ర.. 10వ రోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(మంగళవారం) 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో బస్సుయాత్ర కొనసాగనుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగనుంది. పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యేబొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు శివయ్య స్థూపం సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస ఆంజనేయస్వామి కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం గం. 1:30ని.లకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని గేటు పాఠశాలలో నాడు-నేడును పార్టీ నేతల పరిశీలించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగురోడ్ల సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
‘సీఎం జగన్‌ది ఆదర్శవంతమైన పాలన’
సాక్షి, పలాస(శ్రీకాకుళం జిల్లా): వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎనిమిదో రోజు ఆదివారం పలాసలో నిర్వహించిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు ప్రజలు భారీ స్థాయిలో సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా పలాసలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. జనం భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, ఎంఎల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇన్నాళ్ళూ ఉద్దానం ప్రాంతం వెనుక బడింది. జగన్ సీఎం అయ్యాక రూ. 75 కోట్ల తో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టాము. 7వందల కోట్ల రూపాయలతో వంశధార తాగునీరు తెచ్చాము. వలసల నివారణకు మూల పేట పోర్ట్ నిర్మాణం చేపట్టాం. వంశధార ఎడమ కాలవకి నీరు రావడం లేదు. అందుకే ఈ ప్రాంతానికి ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ గతంలో చిన్న చిన్న సమస్యలకు జనం ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు ప్రజా సమస్యలు మేమే పరిష్కరిస్తున్నాం. కిడ్నీ రోగుల సమస్యలు తీర్చడానికి వంశధార ప్రాజెక్ట్ తాగు నీరు అందించాలని అనుకుని ఈ ప్రభుత్వం కాలం లోనే అనుకుని, ఈ ప్రభుత్వకాలంలోనే పూర్తి చేస్తాం. గ్రామ స్థాయిలో అవినీతి తగ్గించాము. ప్రధాన మంత్రులు సైతం అవినీతిని ఆపలేకపోయారు. సీఎం జగన్ అవినీతిని రూపు మార్చగలిగారు. పరిపాలన లో గొప్ప గొప్ప సంస్కరణలు తెచ్చాము. జగన్ అమలు చేస్తున్న పథకాల వంటి వాటి పై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెంచాలని జగన్ ఆలోచన. మన రాష్ట్రం లో తీసుకొచ్చిన మార్పులు ఓట్ల కోసం కాదు. పిల్లలకు చదువు చెప్పడం ఓట్ల కోసం కాదు. విద్యా ద్వారా పేదరికం తొలగించే పని. ఇది ఆదర్శవంతమైన పాలన’ అని పేర్కొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తే ప్రతిపక్షానికి నష్టం ఏమిటి?. విద్యార్థులకి ఇస్తున్న విద్యా కానుక, పౌష్టికాహారం, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నారు. ఈ సృష్టి లో ఇద్దరే ఇద్దరు మామలు. ఒకటి చందమామ, రెండు జగన్ మామ. చదువు పేదవాడి జీవనాన్ని మార్చుతుంది. పేదవాడి ఆరోగ్యం నయం చేసిన ఘనత సీఎం జగన్‌ది. వైద్య రంగం లో సమూలమైన మార్పులు తెచ్చాం’ అని పేర్కొన్నారు. -
‘ఏపీ ప్రయోజనాలు కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా టెక్కలిలో కృష్ణదాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. అండగా జగనన్న ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’’ అని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. చదవండి: ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి’ -
సామాజిక సాధికార బస్సు యాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: నేడు ఎనిమిదో రోజు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార యాత్ర జరుగనుంది. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో యాత్ర ముందుకు సాగుతుంది. సామాజిక సాధికార యాత్రలో పలువురు వైస్సార్సీపీ నేతలు పాల్గొననున్నారు. పలాసలో యాత్ర రూట్ మ్యాప్: ⏰ఉదయం 10:15 గంటలకు: శ్రీకాకుళం నుండి బయలుదేరి టెక్కలి చేరుకుంటుంది. ⏰ ఉదయం 11:00 గంటలకు: ఎస్ కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్. ⏰మధ్యాహ్నం 12:00 గంటలకు: టెక్కలి నుండి బయలుదేరి పలాస వరకు బస్సు యాత్ర సాగుతుంది. ⏰మధ్యాహ్నం 1గంటకు: పవర్ గ్రిడ్ అతిథి గృహం (రామకృష్ణాపురం) పలాసకు చేరుకోవడం, భోజన కార్యక్రమం. ⏰ మధ్యాహ్నం 2 గంటలకు: పవర్ గ్రిడ్ గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమవుతుంది. ⏰ మధ్యాహ్నం 2:15 గంటలకు: కోసంగిపురం జంక్షన్‌కు చేరుకుంటుంది. ⏰ మధ్యాహ్నం 2:30 గంటలకు: 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & ఆసుపత్రికి చేరుకోవడం (అభివృద్ధి కార్యాచరణ సందర్శన) ⏰ మధ్యాహ్నం 2:45 గంటలకు: కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నుండి ప్రారంభమై వైఎస్సార్ స్క్వేర్ కాశీబుగ్గ వరకు సాగుతుంది. ⏰ మధ్యాహ్నం 3.00 గంటలకు: కాశీబుగ్గ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సామాజిక సాధికర యాత్ర సభా వేదిక వద్దకు చేరుకుంటుంది. -
‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం నుంచి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. గురువారం.. ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కల్యాణి పాల్గొన్నారు. ‘‘గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించాం. కేబినెట్లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్. వైఎస్సార్సీపీకి ఓటు వేయని వారికి సంక్షేమ పథకాలు అందించాం. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతీ నాయకుడూ, కార్యకర్త పనిచేస్తున్నారు, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.