వైఎస్సార్‌సీపీలోకి పలువురి చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి పలువురి చేరిక

Published Sat, Jan 27 2024 1:16 AM | Last Updated on Sat, Feb 3 2024 5:21 PM

- - Sakshi

సోంపేట: వైఎస్సార్‌పీపీలో చేరికలు జోరందుకుంటున్నాయి. సోంపేట మండలంలోని తాళబద్ర, సిరిమామిడి పంచాయతీల్లో పలువురు టీడీపీ నాయకులు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మాజీ ఎమ్మె ల్యే పిరియా సాయిరాజ్‌ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి మన్మధరావు, కొడా రవి, దున్న ఈశ్వరరావు, గోవింద్‌, మేఘనాథంతో పాటు మరో పది కుటుంబాలు పార్టీలో చేరా యి.

తాళభద్ర పంచాయతీ రాణిగాం గ్రామంలో మడ్డు సుందరరావు, కర్రినేని భీమ్‌రాం, పున్నేడుతో పాటు గా మరో 8 కుటుంబాల సభ్యులు పార్టీలో చేరారు. వారికి పార్టీ సమన్వయకర్త పిరియా విజ య, పిరియా సాయిరాజ్‌లు పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సోంపేట, కంచిలి ఎంపీపీలు డాక్టర్‌ నిమ్మన దాస్‌, పైల దేవదాస్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శిలగాన భాస్కరరావు, జేసీఎస్‌ కన్వీనర్‌ బుద్ధాన శ్రీకృష్ణ, సర్పంచ్‌ ఉగ్రపల్లి శారద, బైపల్లి ఈశ్వరి, ఉగ్రపల్లి తిరుపతిరావు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలోకి జనసేన వీర మహిళ
కాశీబుగ్గ:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన జనసేన నాయకురాలు సుజాత పండా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె గత ఎనిమిదేళ్లుగా జనసేనలో ఉన్నారు. శుక్రవారం ఆమెను మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆమెతోపాటు భర్త శ్రీనివాసరావు సైతం కండువా వేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గిరిబాబు, వైస్‌ చైర్మన్‌లు బోర కృష్ణారావు, మీసాల సురేష్‌బాబు, ప్రభుత్వ విప్‌ శంకర్‌పండా, సీహెచ్‌సీ చైర్మన్‌ డబ్బీరు భవానీశంకర్‌, వాణిజ్య విభాగ చైర్మన్‌ బెల్లాల శ్రీనివాసరావు, గౌరీ త్యాడి, బళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాణిగాంలో పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానిస్తున్న పిరియా విజయ1
1/2

రాణిగాంలో పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానిస్తున్న పిరియా విజయ

మంత్రి అప్పలరాజు సమక్షంలో చేరిన జనసేన వీరమహిళ సుజాత పండా 2
2/2

మంత్రి అప్పలరాజు సమక్షంలో చేరిన జనసేన వీరమహిళ సుజాత పండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement