టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి శిక్షణ కోర్సులు | - | Sakshi
Sakshi News home page

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి శిక్షణ కోర్సులు

Published Sun, Jan 28 2024 12:36 AM | Last Updated on Sat, Feb 3 2024 5:15 PM

శివానీలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టిక్కెట్లు పరిశీలిస్తున్న సిబ్బంది   - Sakshi

శివానీలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టిక్కెట్లు పరిశీలిస్తున్న సిబ్బంది

టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి పి.బి.సాయిశ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో కొత్తగా ‘కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ డొమె స్టిక్‌ నాన్‌ వాయిస్‌ కంప్యూటర్‌’ కోర్సులో ఉచి త శిక్షణ అందజేయనున్నట్లు ఆమె వెల్లడించా రు. ఆసక్తి కలిగిన యువతీ, యువకులు ఈ నెల 31లోగా వారి సర్టిఫికెట్లు, పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరుకావాలని వారు వెల్లడించా రు. మరిన్ని వివరాలకు 9493290012 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

జేఈఈ మెయిన్స్‌ ప్రారంభం

ఎచ్చెర్ల క్యాంపస్‌: జాతీయ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ పరీక్షలు ఎచ్చెర్ల వెంకటేశ్వర, చిలకపాలెం శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ల కేంద్రాల్లో శనివా రం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల వెంకటేశ్వర కళాశాలల్లో మొదటి షిఫ్ట్‌లో 100కి 98, రెండో షిఫ్ట్‌లో 100కి 99 మంది హాజరయ్యా రు. శివానీలో మొదటి షిఫ్ట్‌కు 100కి 96, రెండు షిఫ్ట్‌లో 100కి 100 మంది హాజరయ్యారు. పరీక్షలు నిర్వహణను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది.

వాన కృష్ణచంద్‌కు అభినందన

శ్రీకాకుళం రూరల్‌: జిల్లా ఫ్యామిలీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఇటీవల రాష్ట్ర టెన్యూర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ ఉపాధ్యక్షునిగా ఎన్నికై న వాన కృష్ణచంద్‌ను రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం పెదపాడులోని క్యాంప్‌ కార్యాలయంలో అభినందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి కృష్ణచంద్‌ అని, ప్రజలకు మంచి సేవలందిస్తూ మరిన్ని పదవులు అధిరోహించా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తూర్పుకాపు సంక్షేమ సంఘ నాయకులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఇద్దరు ఎంపిక

శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్కూల్‌గేమ్స్‌ అండర్‌–17 సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో శ్రీకాకుళంలోని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజ్‌కు చెందిన పి.శివరామకృష్ణ, జెడ్పీహెచ్‌స్కూల్‌ మందసకు చెంది న ఎం.మణికంఠ ఉన్నారు. ఈ పోటీలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఔరంగబాద్‌ వేదికగా జరగనున్నాయి. జాతీ య పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు శనివా రం తన చాంబర్‌లో అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వాన కృష్ణచంద్‌ను అభినందిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు  1
1/2

వాన కృష్ణచంద్‌ను అభినందిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో డీఈఓ వెంకటేశ్వరరావు, పీడీలు  2
2/2

జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో డీఈఓ వెంకటేశ్వరరావు, పీడీలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement