
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది. సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం, కోనసీమ జిల్లాలో జరుగనుంది. విజయనగరంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అలాగే, కోనసీమ జిల్లా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది.
విజయ నగరం రాజాంలో బస్సుయాత్ర ఇలా..
►విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర
►ఉదయం 11:30 గంటలకు బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
►మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్‌సీపీ నేతల ప్రెస్ మీట్
►మధ్యాహ్నం 12.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభం
►భోజన విరామం అనంతరం పాలకొండ రోడ్డులోని జెజె ఇన్నోటెల్ వరకు ర్యాలీ, బస్సు యాత్ర.
►మధ్యాహ్నం మూడు గంటలకు రాజాంలో బహిరంగ సభ.
కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇలా..
►కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
►మధ్యాహ్నం ఒంటి గంటకు రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం
►మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభం
►ఎనిమిది కిలోమీటర్లు జరుగనున్న బస్సు యాత్ర
►సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్‌లో బహిరంగ సభ
Comments
Please login to add a commentAdd a comment