Rajam Assembly Constituency
-
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కనీవినీ ఎరుగని అభివృద్ధి: ఎమ్మెల్యే కంబాల జోగులు
రాజాం నియోజకవర్గంలో ఎన్నడూ చూడని విధంగా సామాజిక, సంక్షేమ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. నియోజకవర్గంలో నవరత్నాల పేరుతో డీబీటీ కింద అర్హులకు రూ.1176 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.204 కోట్ల ఆర్థిక ప్రయోజనం వెనుకబడిన వర్గాలకు కలిగిందన్నారు. 85 సచివాలయ భవనాల నిర్మాణాలకు రూ.33.70 కోట్లు, 86 ఆర్బీకే భవనాలకు రూ.17.66 కోట్లు, విలేజ్ క్లినిక్ల నిర్మాణానికి మరో రూ.17.66 కోట్లు, బల్క్ మిల్క్ కేంద్రాలకు రూ. 3.47 కోట్లు, లైబ్రరీలకు రూ.3.84 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మించిందని, తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తోంద న్నారు. రాజాం రహదారి విస్తరణ పనులు గతంలో రూ.10 కోట్ల వ్యయంతో పూర్తిచేయగా, తాజాగా మరో రూ. 20 కోట్ల ఖర్చుతో పనులు జరుగుతున్నాయని వివరించారు. నియోజకవర్గంలో పదివేల పక్కా ఇళ్లు, 3,200 ఇళ్ల స్థలాలు ఇచ్చామని వివరించారు. నియోజకవర్గం మొత్తంపై జల్జీవన్మిషన్ కింద రూ.133.97 కోట్ల ఖర్చుతో ఇంటింటికీ కుళాయిలు వేస్తున్నట్టు వెల్లడించారు. -
బస్సు యాత్ర సాగిందిలా..
రాజాం: ఎటు చూసినా జనమే.. అందరి ముఖాల్లో ఆనందమే. ఆటోలు, టాటా మ్యాజిక్ వ్యాన్లు, బొలేరాలు, ట్రాక్టర్లు, కార్లు, బైక్లు ఇలా.. అందుబాటులో ఉన్న వాహనాలపై కొందరు... నడకదారిలో మరికొందరు.. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల నుంచి వేల సంఖ్యలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రజా ప్రతినిధులు రాజాం పట్టణానికి చేరుకున్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో భాగస్వాములయ్యారు. జగన్మోహన్రెడ్డి సర్కారు వెనుకబడిన వర్గాలకు చేసిన మేలును పాలకులు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినదించారు. బడుగుల జీవితాలను సాధికార వసంతాలతో నింపి, భవిష్యత్తుకు వారధి వేసిన నవ నిర్మాణ ధీరోదాత్తుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అంటూ కొనియాడారు. ప్రజాచైతన్యంతో రాజాంలో సామాజిక రాజసం ప్రతిబింబించింది. బస్సు యాత్ర సాగిందిలా.. రాజాం మండలం బొద్దాం గ్రామంలో తొలుత గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పాలకులు ప్రారంభించారు. ప్రెస్మీట్ నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు రాజాం పట్టణానికి బస్సుయాత్ర చేరింది. అంబేడ్కర్ జంక్షన్ వద్ద జేజే ఇనోటెల్ వద్ద బారీ బహిరంగ సభ నిర్వహించారు. సభాప్రాంగణమంతా వైఎస్సార్సీపీ జెండాలతో కళకళలాడింది. సుమారు కిలోమీటరు మేర పాదయాత్రగా వచ్చిన పాలకులకు తప్పెటగుళ్లు, డప్పువాయిద్యాలు, కోలాటాప్రదర్శనలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి చినఅప్పలనాయుడు, నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు పేరాడ తిలక్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, శిష్టకరణాల కార్పొరేషన్ చైర్మన్ అనూషా పట్నాయక్, దాసరి కార్పొరేషన్ చైర్పర్సన్ రంగుముద్రి రమాదేవి, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, డాక్టర్ తలే రాజేష్, ఎస్సీ సెల్ జోనల్ ఇన్చార్జి కంబాల సందీప్, వైఎస్సార్ సీపీ రాజాం కన్వీనర్లు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, వైస్ ఎంపీపీ నక్క వర్షిణి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది. సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం, కోనసీమ జిల్లాలో జరుగనుంది. విజయనగరంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అలాగే, కోనసీమ జిల్లా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. విజయ నగరం రాజాంలో బస్సుయాత్ర ఇలా.. ►విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►ఉదయం 11:30 గంటలకు బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న వైఎస్సార్సీపీ నేతలు ►మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►మధ్యాహ్నం 12.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభం ►భోజన విరామం అనంతరం పాలకొండ రోడ్డులోని జెజె ఇన్నోటెల్ వరకు ర్యాలీ, బస్సు యాత్ర. ►మధ్యాహ్నం మూడు గంటలకు రాజాంలో బహిరంగ సభ. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇలా.. ►కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం ఒంటి గంటకు రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభం ►ఎనిమిది కిలోమీటర్లు జరుగనున్న బస్సు యాత్ర ►సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్లో బహిరంగ సభ -
నేడు రాజాం, కొత్తపేట నియోజకవర్గాల్లో యాత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలకు ప్రభంజనంలా కదలి వస్తున్నారు.అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర రెండో దశ బుధవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బుధవారం యాత్ర జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదలి రావడంతో మూడు నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతమైంది. సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు–పవన్ చేసిన మోసాలను నేతలు సభల్లో వివరిస్తున్నప్పుడు ‘ఆపు బాబూ నాటకం.. జగనే మా నమ్మకం’ అంటూ ప్రజలు ప్రతిస్పందించారు. కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే వైఎస్ జగన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేతలు పిలుపునిచ్చినప్పుడు.. ‘జగనే కావాలి.. జగనే రావాలి’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తు నినదించారు. గురువారం విజయనగరం జిల్లా రాజాం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.