రాజాం: ఎటు చూసినా జనమే.. అందరి ముఖాల్లో ఆనందమే. ఆటోలు, టాటా మ్యాజిక్ వ్యాన్‌లు, బొలేరాలు, ట్రాక్టర్లు, కార్లు, బైక్‌లు ఇలా.. అందుబాటులో ఉన్న వాహనాలపై కొందరు... నడకదారిలో మరికొందరు.. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల నుంచి వేల సంఖ్యలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజా ప్రతినిధులు రాజాం పట్టణానికి చేరుకున్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో భాగస్వాములయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వెనుకబడిన వర్గాలకు చేసిన మేలును పాలకులు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినదించారు. బడుగుల జీవితాలను సాధికార వసంతాలతో నింపి, భవిష్యత్తుకు వారధి వేసిన నవ నిర్మాణ ధీరోదాత్తుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అంటూ కొనియాడారు. ప్రజాచైతన్యంతో రాజాంలో సామాజిక రాజసం ప్రతిబింబించింది.
బస్సు యాత్ర సాగిందిలా..
రాజాం మండలం బొద్దాం గ్రామంలో తొలుత గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పాలకులు ప్రారంభించారు. ప్రెస్‌మీట్ నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు రాజాం పట్టణానికి బస్సుయాత్ర చేరింది. అంబేడ్కర్ జంక్షన్ వద్ద జేజే ఇనోటెల్ వద్ద బారీ బహిరంగ సభ నిర్వహించారు. సభాప్రాంగణమంతా వైఎస్సార్‌సీపీ జెండాలతో కళకళలాడింది. సుమారు కిలోమీటరు మేర పాదయాత్రగా వచ్చిన పాలకులకు తప్పెటగుళ్లు, డప్పువాయిద్యాలు, కోలాటాప్రదర్శనలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి చినఅప్పలనాయుడు, నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు పేరాడ తిలక్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, శిష్టకరణాల కార్పొరేషన్ చైర్మన్ అనూషా పట్నాయక్, దాసరి కార్పొరేషన్ చైర్‌పర్సన్ రంగుముద్రి రమాదేవి, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, డాక్టర్ తలే రాజేష్, ఎస్సీ సెల్ జోనల్ ఇన్‌చార్జి కంబాల సందీప్, వైఎస్సార్ సీపీ రాజాం కన్వీనర్లు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, వైస్ ఎంపీపీ నక్క వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment