rajam constituency
-
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్‌ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సీఎం జగన్ మహిళలకు న్యాయం చేశారు..
-
రాజాంలో నేడు సామాజిక సాధికార యాత్ర
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది. సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం, కోనసీమ జిల్లాలో జరుగనుంది. విజయనగరంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అలాగే, కోనసీమ జిల్లా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. విజయ నగరం రాజాంలో బస్సుయాత్ర ఇలా.. ►విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►ఉదయం 11:30 గంటలకు బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న వైఎస్సార్సీపీ నేతలు ►మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►మధ్యాహ్నం 12.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభం ►భోజన విరామం అనంతరం పాలకొండ రోడ్డులోని జెజె ఇన్నోటెల్ వరకు ర్యాలీ, బస్సు యాత్ర. ►మధ్యాహ్నం మూడు గంటలకు రాజాంలో బహిరంగ సభ. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇలా.. ►కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం ఒంటి గంటకు రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభం ►ఎనిమిది కిలోమీటర్లు జరుగనున్న బస్సు యాత్ర ►సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్లో బహిరంగ సభ -
పొంగిపొర్లుతున్న భూగర్భ జలాలు
పాతాళగంగ పొంగిపొర్లుతోంది. నేలబావుల నుంచి బోరు బావుల వరకూ దేన్ని పరిశీలించిన నీరు ఉబికివస్తోంది. గతంలో కంటే భూజగర్భ జలాలు బాగా పెరిగాయి. మండువేసవిలో కూడా సాధారణ పరిస్థితి ఉండడం విశేషం. రాజాం నియోజకవర్గం వ్యాప్తంగా పరిస్థితి మరీ అనుకూలంగా ఉంది. మడ్డువలస జలాశయం ఉన్నందున ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని సంబంధిత అధికారులు అంచనా వేశారు. రాజాం: జిల్లాలో కొన్ని మండలాలు మినహా మిగిలిన చోట్ల భూగర్భ జలాలు బాగున్నాయి. రాజాం నియోజకవర్గం పరిధి సంతకవిటి మండలంలో 1.52 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నాయి. మండువేసవిలోనే ఇలా ఉండగా. వర్షాకాలంలో మరింత మీదకు వచ్చే అవకాశం ఉంది. రాజాంలో 1.72 మీటర్లలో, రేగిడిలో 2.31, వంగరలో రెండు, ఎల్‌ఎన్‌పేట మండలంలో 1.89, సరుబుజ్జిలిలో 1.84, జలుమూరులో 2.82, హిరమండలంలో 2.34, గార మండలంలో 2.34 మీటర్ల లోతులోనే భూ గర్భజలాలు తొణికిసలాడుతున్నాయి. ఈప్రాంతాల్లో బోర్లు తక్కువలోతులో వేస్తున్నా నీరుపడుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో సాగునీటి కోసం తక్కువ ఖర్చుతోనే వ్యవసాయ బోర్లు, బావులు, ఇంటి అవసరాలకు బోరింగులను వేయించుకుంటున్నారు. 20 నుంచి 30 మీటర్ల లోతుకు వెళ్లగానే కావాల్సినంత నీరు పడుతోంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో వేసవిలో కూడా సాగునీటి చెరువులు, బావులు జలకళను సంతరించుకున్నాయి. రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద అత్యంత ప్రమాదకరంగా 13.91 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఎచ్చెర్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే పలాస, కంచిలి, సోంపేటలో కూడా భూగర్భ జలాలు కొంతవరకూ అడుగంటాయి. జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే సరాసరిన 7.88 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యమవుతూ సేఫ్ జోన్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సుమారు ఎనిమిది మీటర్లగా ఉండేది. సాగునీటి కాలువలు ఉన్న ప్రాంతాల్లో.. సాగునీటి కాలువలు, నదులు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనుకూలంగా ఉండగా.. పరిశ్రమలు, బీడు భూములు ఉన్న ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గుముఖం పడుతున్నాయి. వీటికి తోడు అనుమతులు లేకుండా ప్రైవేట్ నేలబావులు తవ్వకాలతో కొన్నిచోట్ల నీటి లభ్యత అనుకూలంగా లేదని నేషనల్ గ్రీన్‌కోర్ ఉపాధ్యాయుడు పూజారి హరిప్రసన్న తెలిపారు. -
టీడీపీకి షాక్
సాక్షి, రాజాం: నియోజకవర్గంలో టీడీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. రాజాం నగర పంచాయతీకి సంబంధించి టీడీపీకి కంచుకోట గ్రామమైన పొనుగుటివలస వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరింది. ఈ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత గార గున్నంనాయుడు అనుచర వర్గంతోపాటు అనేక కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. బుధవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గార గున్నంనాయుడు, జల్ల రాములు, శాసపు శ్రీనివాసరావు, శాసపు రమణ, జల్ల త్రినాధరావు, గార చంటిబాబు, ఆబోతులు విశ్వనాధం, వావిలపల్లి వెంకటినాయుడు, వావిలపల్లి రామకృష్ణ, ఉత్తరావల్లి రాము, జల్ల సన్యాశినాయుడు, శాసపు అప్పలనాయుడు, జల్ల తమ్మినాయుడు, ఉత్తరావల్లి నర్శింహులు, జల్ల గణపతి, గిరడ లింగడు, జల్ల శ్రీను, జల్ల సత్యన్నారాయణ, జల్ల సూర్యనారాయణ, జల్ల లకు‡్ష్మంనాయుడు, ఆబోతులు రాంబాబు తదితరులతోపాటు మరికొంతమంది పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువా వేసి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రెడ్డి అప్పలనాయుడు, కార్యదర్శి శాసపు వేణుగోపాలనాయుడు తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీ వీధి నుంచి.. రాజాం నగర పంచాయతీ పరిదిలోని గాంధీవీధీ, శెగిడి వీధికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కొనపల కూర్మారావు, తోట నారాయణరావు, కొత్తలంక రాంబాబు, ఎ. షన్ముఖరావు, కర్రి రాంబాబు, మాధవీలత, సరోజిని, లక్ష్మి, పవన్, దాసరి శ్రీను, ముత్యం, సుధీర్ తదితరులు పార్టీలో చేరారు. వీరికి పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతోపాటు పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, యూత్ కన్వీనర్ వంజరాపు విజయ్‌కుమార్, అధికార ప్రతినిధి ఆసపు సూర్యం, గొర్లె బద్రర్స్‌లు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
ఓట్ల చీలికే టార్గెట్!
సాక్షి, శ్రీకాకుళం: తమ అభ్యర్థుల గెలుపుపై ఆశలు చాలించుకున్న జనసేన పార్టీ వైఎస్సార్సీపీ ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడ వేస్తోంది. జిల్లాలో పటిష్టంగా ఉన్న వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చడం ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పరోక్షంగా మేలు చేకూర్చే కుటిల యత్నానికి పాల్పడుతోంది. ఇప్పటికే జనసేన, టీడీపీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్న ప్రచారానికి జిల్లాలో జనసేన సీట్ల కేటాయించిన తీరు బలం చేకూరుస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏ సామాజికవర్గం వారైతే జనసేన నుంచి కూడా ఆ సామాజికవర్గం వారికే సీట్లు కేటాయించింది. ఇక శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి కూడా అదే వ్యూహాన్ని అమలు చేసింది. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కల్యాణ్‌కు అండగా ఉంటూ, పార్టీ కార్యకలాపాలను నెత్తినేసుకుని మోసిన వారిని కాదని ముక్కు, ముఖం తెలియని వారికి సీట్లు కేటాయించడం చూస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఓట్లను సాధ్యమైనంత వరకు దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. అయితే టీడీపీ అభ్యర్థుల విషయంలో మాత్రం జనసేన ఈ వ్యూహాన్ని అమలు చేయకపోవడం ఇందుకు దర్పణం పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు జనసేన కేటా యించిన అభ్యర్థుల పేర్లను చూసి ఆయా నియోజకవర్గాల ప్రజలే విస్తుపోతున్నారు. అదెలా అంటే..? టెక్కలి వైఎస్సార్సీపీ అభ్యర్థి కాళింగ సామాజికవర్గానికి చెందిన పేరాడ తిలక్ కాగా జనసేన అదే సామాజికవర్గీయుడైన కణితి కిరణ్‌కుమార్‌కు టికెట్టిచ్చింది. ఆమదాలవలసలో వైఎస్సార్సీపీ టికెట్టు తమ్మినేని సీతారామ్ (కాళింగ)కు ఇవ్వగా ఆ నియోజకవర్గంతో సంబంధం లేని కొత్తూరు మండలానికి చెందిన కాళింగ సామాజికవర్గానికి చెందిన పేడాడ రామ్మోహనరావుకు జనసేన టికెట్టిచ్చారు. అలాగే పాతపట్నంలో తూర్పు కాపు కులానికి చెందిన రెడ్డి శాంతి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలవగా జనసేన గేదెల చైతన్య (తూర్పు కాపు)కు కేటాయించింది. రాజాం నియోజకవర్గంలో ఎస్సీ (మాల) కులస్తుడైన కంబాల జోగులు వైఎస్సార్సీపీ అభ్యర్థి కాగా అదే సామాజిక వర్గీయుడైన ముచ్చా శ్రీనివాసరావుకు జనసేన సీటు ఖరారు చేశారు. పాలకొండలో ఎస్టీలో జాతాపు ఉపకులానికి చెందిన విశ్వాసరాయి కళావతికి వైఎస్సార్సీపీ టికెట్టివ్వగా అక్కడ పొత్తులో భాగంగా సీపీఐకి చెందిన (అదే సామాజికవర్గం) డీవీజీ శంకర్రావుకు కేటాయించారు. అలాగే శ్రీకాకుళం లోక్‌సభ స్థానం విషయంలోనూ ఆదే తీరును కనబర్చింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాళింగ కులానికి చెందిన దువ్వాడ శ్రీనుకు టికెట్టు ఇవ్వగా జనసేన కూడా అదే సామాజిక వర్గీయుడైన మెట్టా రామారావుకు ఏరికోరి కేటాయించింది. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు (వెలమ) పోటీ చేస్తుండగా ఆ సామాజికవర్గం వారిని జనసేన బరిలోకి దింపకపోవడం కుట్ర కోణం చెప్పకనే చెబుతోంది. పార్టీకి కష్టపడ్డ వారిని కాదని.. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని కేవలం వైఎస్సార్సీపీ ఓట్ల చీలికే లక్ష్యంగా జనసేన అభ్యర్థులను కేటాయించిన వైనం ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టెక్కలిలో చాన్నాళ్లుగా ఎస్సీ సామాజిక వర్గీయుడైన కె.యాదవ్ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతా ఆయనకే టికెట్టు ఖాయమని అనుకుంటుండగా ఆయనను కాదని ఆకస్మికంగా కాళింగ కులస్తుడైన కిరణ్‌కుమార్‌కు టికెట్టు ఇచ్చారు. రాజాంలో జనసేనలో చాన్నాళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, ప్రజలకు అంతగా పరిచయం లేని, ఇటీవలే పార్టీలో చేరిన ఎం.శ్రీనివాసరావుకు టికెట్టు కేటాయించారు. నరసన్నపేటలో ఇన్నాళ్లూ జనసేన కోసం చేతిచమురు వదల్చుకున్న లుకలాపు రంజిత్‌ను కాదని అసలు సీన్లోనే లేని మెట్టా వైకుంఠానికి అకస్మాత్తుగా టికెట్టు ఖాయం చేశారు. -
రాజాం..రసవత్తరం
రాజాం.. 2009లో ఏర్పడిన నియోజకవర్గం. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. నియోజకవర్గం ఏర్పడిన తొలిసారి వైఎస్సార్ ప్రభంజనం కనిపించగా.. 2014లో వైఎస్సార్సీపీ హవా కనిపించింది. ముచ్చటగా మూడోసారి వైఎస్సార్సీపీ తరఫున కంబాల జోగులు, టీడీపీ తరఫున కోండ్రు మురళీమోహన్ యుద్ధానికి సిద్ధమయ్యారు. అభ్యర్థులిద్దరూ రాజకీయంగా అనుభవం కలిగిన వారు కావడం, ఎత్తుకు పై ఎత్తులు వేయగల సమర్థులు కావడంతో రాజాం రాజకీయం రసవత్తరంగా మారింది. సిటింగ్ ఎమ్మెల్యేగా కంబాల అన్ని వర్గాల ప్రేమను సంపాదించగలిగారు. అయితే ప్రతిభాభారతిని కాదని కోండ్రుకు టికెట్ ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి రేగుతోంది. ఈ జ్వాలలు ఎవరిని బలి చేస్తాయో చూడాలి మరి. ఉణుకూరు నుంచి రాజాంగా.. రాజాం నియోజకవర్గం ఏర్పడకముందు ఇక్కడ ఉణుకూరు నియోజకవర్గం ఉండేది. 1952 నుంచి 2004 వరకూ ఈ నియోజకవర్గం కొనసాగింది. జనరల్ కేటగిరీగా ఉండేది. పాలవలస రాజశేఖరం, కిమిడి కళా వెంకటరావు కుటుంబాల మధ్య ఇక్కడ పోటీ ఉండేది. రాజాం, వంగర మండలాలతో పాటు రేగిడి మండలంలోని 19 పంచాయతీలు గతంలో ఉణుకూరు నియోజకవర్గంలో ఉండేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలతో రాజాం నియోజకవర్గం ఏర్పడింది. ఈ కొత్త నియోజకవర్గంలో రెండు పర్యాయాలు వైఎస్సార్ అభిమానులే విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం తలపడుతున్న కంబాల, కోండ్రులు ఇక్కడ పాత ప్రత్యర్థులే. 2009లో ముఖాముఖి తలపడ్డారు. 2014కు వచ్చే సరికి కోండ్రు తలపడినా అసలు రేసులోనే లేకుండాపోయారు. కావలి, కంబాల మధ్యనే పోటీ జరగ్గా కంబాలకు జనాల అభిమానం దక్కింది. ప్రతిభా భారతికి షాక్.. మహిళలకు ప్రాధాన్యమిస్తామని తరచూ చెప్పే చంద్రబాబు రాజాం నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ప్రతిభాభారతికి షాక్ ఇచ్చారు. దశాబ్ధాలుగా ఇక్కడ టీడీపీని ప్రతిభాభారతి బతికించారు. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన కోండ్రు మురళీమోహన్‌కు టికెట్ ఇచ్చి ప్రతిభాభారతిని పక్కన పెట్టడం ఆమెను విస్మయానికి గురిచేసింది. స్థానిక కార్యకర్తలకు కూడా ఈ నిర్ణయం మింగుడుపడడం లేదు. ప్రతిభాభారతి స్వగ్రామం ఇదే నియోజకవర్గంలోని కావలి కావడం విశేషం. స్థానికతను కూడా పక్కనపెట్టి కోండ్రు టికెట్ కేటాయించడంతో టీడీపీ కార్యకర్తల్లో కూడా ఆందోళన అధికమైంది. జనం మనిషి ‘కంబాల’ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కంబాల జోగులు జనం మనిషిగా గుర్తింపు పొందారు. 2014లో ప్రతిభాభారతిపై విజయ బావుటా ఎగురవేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసినా నిజాయితీగా ఉండి జగన్ వెనుకే నిలబడ్డారు. ఆ నిబద్ధతే ఆయనకు జనానికి మరింత దగ్గర చేసింది. స్థానికంగా వైఎస్సార్ అభిమానులు భారీగా ఉండడం కూడా ఆయనకు కలిసివస్తోంది. మరోవైపు కోండ్రు మురళీమోహన్ స్థానికంగా సత్తా చాటి చాలారోజులైపోయింది. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత అసలు రాజాం ప్రాంతంలో ఆయన కనిపించనేలేదు. హఠాత్తుగా ఎన్నికల సమయంలో ప్రత్యక్షమవడం, టికెట్ కూడా దక్కడం స్థానికులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఆయన రాకతో టీడీపీలో చీలికలు వచ్చాయన్నది బహిరంగ సత్యం. ప్రతిభాభారతి వంటి సీనియర్ నాయకురాలిని కాదని ఆయనకు టికెట్ ఇవ్వడం దారుణమని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ గుర్తులు రాజాంలో ప్రసిద్ధమైన మడ్డువలస ప్రాజెక్టు వంగర మండలంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి హోదాలో డా క్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. 67 కోట్లు మేర Ðవెచ్చించి అభివృద్ధి చేశా రు. గొర్లె శ్రీరాములునాయుడు పేరును ప్రాజెక్ట్‌కు పెట్టారు. నిర్వాసితులకు బకాయి బిల్లులు చెల్లించి ఆదుకున్నారు. అంతేకాకుండా తోటపల్లి కాలువ నీటిని రాజాం ప్రాంతానికి తీసుకొచ్చారు. ఇంకోవైపు 1960లో కట్టిన నారాయణపురం ఆనకట్ట నాగావళి నదిపై సంతకవిటి మండలంలో ఉంది. మడ్డువలస, నారాయణపురం, తోటపల్లి ప్రధాన సాగునీటి వనరులు. ఈ కాలువలు పరిధిలో మొత్తం 50 వేల ఎకరాలు సాగు నియోజకవర్గంలో ఉంది. సుప్రసిద్ధ సీతారాములు ఆలయం సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలో ఉంది. తాండ్ర పాపారాయుని నివాసం రాజాంలో ఉంది. ఇక్కడ ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం ఈ గదిలోనే నడుస్తోంది. రాజాం ప్రస్తుతం విజయగనగరం పార్లమెంట్ పరిధిలో ఉంది. మొత్తం ఓటర్లు :2,09,646 పురుషులు :1,06,663 స్త్రీలు :1,02,950 -
స్మార్ట్ సిటీ ఏదీ బాబు ?
సాక్షి, శ్రీకాకుళం : ‘రాజాం పట్టణాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తాం. పట్టణంలో నివాసముంటున్న ఇల్లులేని పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం. ఏడాది లోగా ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు ఇస్తాం. ఈ స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందంటే ఈ భవనాలపై హెలికాప్టర్ కూడా అవలీలగా దిగుతుంది.’ 2017 జనవరి–6వ తేదీన రాజాంలోని జన్మభూమి మా ఊరులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఇలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్మార్ట్ సిటీ హామీ లబ్ధిదారులను ఊహాలోకంలో విహరించేలా చేసింది. రాజాం పట్టణంలో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ ఇల్లు నిర్మించి అధికారులు ఇవ్వలేదు. రాజాం పట్టణ కేంద్రంలో ఇల్లు వస్తుందనుకుంటే పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలు ప్రారంభించారు. అక్కడ ఫ్లాట్ల నిర్మాణం కూడా నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల క్రితం స్మార్ట్ సిటీలో ఫ్లాట్ల నిమిత్తం డీడీలు తీసి లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నారు. వీటికి సంబంధించి లబ్ధిదారులకు తొలివిడత ఫ్లాట్స్ కేటాయింపు మూడునెలల క్రితం చేపట్టారు. మొత్తం 893 మంది లబ్ధిదారులు తొలివిడతలో డీడీలు తీయగా, వారిలో 90 మందికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించారు. అయితే వారికి ఇంతవరకూ ఫ్లాట్లు అప్పగించలేదు. మొత్తం 1104 ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంది. ఇంతవరకూ ఒక్కటి కూడా పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నత్తనడకన నిర్మాణాలు ఈ ఫ్లాట్ల నిమిత్తం సింగిల్ బెడ్ రూమ్‌కు ముందుగా రూ.500, డబుల్ బెడ్రూంతో పాటు పెద్ద సైజు సింగిల్ బెడ్ రూం నిమిత్తం ముందస్తుగా లబ్ధిదారుడు రూ.50 వేలు నుంచి రూ.ఒక లక్ష డీడీలు తీసి నగరపంచాయతీకి చెల్లించారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు రాయితీ వస్తుండగా, మరో రూ.3 లక్షలు బ్యాంకు లోన్ కూడా మంజూరు చేశారు. ఈమొత్తం నిధులను టెండర్ల రూపంలో ఫ్లాట్ల నిర్మాణానికి టెండర్ పిలవగా విశాఖపట్నానికి చెందిన ఓ సంస్థ ఆ టెండర్‌ను దక్కించుకుంది. పనులు మాత్రం సకాలంలో పూర్తీచేయకపోవడంతో పలువురు లబ్ధిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీనే ఇలా ఉంటే సాధారణ నాయకులు ఇచ్చే హామీ పరిస్థితి ఏమిటని? నమ్మించి మోసం చేసిన ప్రభుత్వానికి ఇప్పుడెలా ఓటు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
ప్రతిభా భారతిపై టీడీపీ నేతల తిరుగుబాటు
సాక్షి, శ్రీకాకుళం : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ప్రతిభా భారతికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోంది. ఆమెపై సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్గా ప్రతిభా భారతిని తొలగించాలంటూ రాజాంలోని ఓ రిసార్ట్‌లో టీడీపీ ఎంపీపీలు, జేడ్పీటీసీలు సమావేశమయ్యారు. ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ప్రతిభా భారతిని తొలగించాలని, ఆమె నిర్వహించే సమావేశాలను బహిష్కరించాలని వారు ఈ భేటీలో తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిభా భారతికి టికెట్ ఇస్తే.. సహాయనిరాకరణ చేస్తామని టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావే తన వర్గాన్ని ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని కళా వర్గీయులు భావిస్తున్నారు. -
కంపించిన రాజాం
రాజాం రూరల్, రేగిడి, సంతకవిటి: దడదడమంటూ చిన్నపాటి శబ్దాలు.. కాళ్ల కింద ఏదో కదిలిన భావన.. ఆ వెంటనే చిన్న ప్రకంపనలు.. రాత్రివేళ సంభవించిన ఈ పరిణామాలతో రాజాం నియోజకవర్గ ప్రజలు తుళ్లిపడ్డారు. కొద్ది క్షణాల్లోనే అవి భూప్రకంపనలని అర్థమైంది. అంతే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరగంట వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలోని రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో శనివారం రాత్రి 8.53 గంటలకు ఒకసారి, 9.21 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. మొదటిసారి 3 సెకెన్లపాటు, రెండోసారి 2 సెకన్లపాటు కంపించింది. రాజాం పట్టణంతో పాటు వస్త్రపురి కాలనీ, కొండంపేట, చీకటిపేట, ఒమ్మి, గడిముడిదాం, జీఎంఆర్‌ఐటీ, బుచ్చెంపేట, రేగిడి మండలంలో బాలకవివలస, మునకలవలస, పనసలవలస, కొర్లవలస, పారంపేట, కాగితాపల్లి, బూరాడ, చినశిర్లాం, పెద్దశిర్లాం తదితర ప్రాంతాల్లోనూ, సంతకవిటి మండలం మోదుగుల పేట, బొద్దూరు, గుళ్లసీతారాంపురం, పొనుగుటివలస, బిళ్లాని, తలతంపర, ఇజ్జిపేట, తదితర గ్రామాల్లో ప్రకంపనలు సంభవించాయి. శబ్దాలు, కదలికలతో నిద్రపోతున్న చిన్నారులు ఏడుస్తూ లేచిపోగా అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న వృద్ధులతోపాటు ఇళ్లలో ఉన్న మహిళలు, పురుషులు పిల్లలను పట్టుకొని బయటకు పరుగులు తీశారు. మొదటిసారి ప్రకంపనలు సంభవించినప్పుడు బయటకు వచ్చేసిన వారు కొద్దిసేపటికి తేరుకొని ఇళ్లలోకి వెళుతుండగానే మళ్లీ 9.21 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించడంతో మరోసారి బయటకు పరుగులు తీశారు. రాత్రి పదిన్నర, పదకొండు గంటల వరకు భయంతో ఆరుబయలు ప్రాంతాల్లోనే కాలక్షేపం చేశారు. అయితే ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరిగినట్లు సమాచారం లేదు. -
నీకు నేను.. నాకు నువ్వు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రిజర్వేషన్ల కారణంగా సొంత నియోజవర్గాలకు దూరమైన మాజీ మంత్రులు కళా వెంకటరావు, కోండ్రు మురళీమోహన్‌లు కాకతాళీయంగానే ఒకరి నియోజకవర్గంలో మరొకరు పోటీ చేయాల్సి వస్తోంది. ఇదే అంశం వీరి మధ్య అనైతిక ఒప్పందానికి బాట వేసింది. మూడు దశాబ్దాల క్రితం రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన కళా వెంకట్రావు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాల్సి వస్తోంది. ఈసారి గెలవడం ద్వారా పూర్వవైభవం సాధించాలన్న ఆయన లక్ష్యం ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదు. స్థానికేతరుడైన కళా ఎచ్చెర్లలో పట్టు సాధించలేకపోతున్నారు. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలు ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించడమే లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఆయనలో గుబులు మొదలైంది. మరోవైపు రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోండ్రు మురళీ పరిస్థితీ అలాగే ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఆయన రాజాం నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చరిష్మాతో గెలిచిన ఆయన పరస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. క్యాడర్ దాదాపుగా జారిపోయింది. వేళ్ల మీద లెక్కించదగ్గ అనుచరులే మిగిలారు. నియోజకవర్గంలోని ఒక్క మండలంలో కూడా ప్రభావం చూపలేని దుస్థితిలో పడిపోయారు. దాంతో జోగీ.. జోగీ రాసుకున్న చందంగా కళా, కోండ్రు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయానికి తెరతీశారు. విశ్వసనీయులైన కొందరు సన్నిహితుల మధ్యవర్తిత్వంతో ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. పరస్పర సహకారం ఆ ఒప్పందం ప్రకారం తన సొంత నియోజకవర్గం ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకు సహకరించేందుకు కోండ్రు మురళీ సమ్మతిం చారు. ప్రధానంగా లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో మిగిలి ఉన్న కొద్దిమంది కోండ్రు అనుచరులు కళాకు అనుకూలంగా పనిచేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రవికిరణ్ ఉన్నప్పటికీ టీడీపీకే పని చేయాలని తన అనుచరులకు కోండ్రు సంకేతాలు ఇచ్చారు. నేనున్నానని భరోసా ఇచ్చి మరీ తెచ్చిన రవికిరణ్కే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారని దీనితో అర్థమవుతోంది. దీనికి ప్రతిగా.. రాజాం నియోజకవర్గంలో ఉన్న కళా వెంకట్రావు బంధువర్గం మొత్తం కోండ్రుకు సహకరిస్తుంది. రేగిడి, రాజాం మండలాల్లోని కళా అనుచరగణం పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి మరీ కోం డ్రుకు అనుకూలంగా పని చేస్తుంది. అంటే రాజాం నియోజకవర్గలో టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా పనిచేస్తారన్న మాట. ఈ మేరకు కళా నుంచి స్పష్టమైన సూచనలు పంపారు. ఇప్పటికే కళా వర్గీయులు ప్రతిభా భారతితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజా మ్యాచ్ పిక్సిం గ్‌తో వారంతా పూర్తిగా ప్రతిభా భారతికి చెయ్యివ్వడం ఖాయమని తేలిపోయింది. జెడ్పీటీసీ ఎన్నికల వరకు ఆమె వెంటే ఉన్న వారంతా ప్రస్తుతం వ్యూహాత్మకంగా తప్పుకుంటున్నారు. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రభావం కనిపిస్తోంది. దాంతో ఎచ్చెర్ల కాంగ్రెస్ అభ్యర్థి రవికిరణ్, రాజాం టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతిలకు గుబులు పట్టుకుంది. కళా, కోండ్రు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు కొత్త కావడంతో రవి కిరణ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. కానీ ప్రతిభా భారతి మాత్రం కళాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల్లో వర్గపోరును సరికొత్త మలుపు తిప్పుతున్నాయి.