
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(మంగళవారం) 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో బస్సుయాత్ర కొనసాగనుంది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగనుంది.
పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యేబొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు శివయ్య స్థూపం సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస ఆంజనేయస్వామి కళ్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం గం. 1:30ని.లకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని గేటు పాఠశాలలో నాడు-నేడును పార్టీ నేతల పరిశీలించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగురోడ్ల సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment