‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ | Sakshi
Sakshi News home page

‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’

Published Thu, Oct 26 2023 10:45 AM

Ysrcp Samajika Sadhikara Bus Yatra Oct 26th Updates - Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం నుంచి వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. గురువారం.. ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కల్యాణి పాల్గొన్నారు.

‘‘గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్‌. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయని వారికి సంక్షేమ  పథకాలు అందించాం. సీఎం జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతీ నాయకుడూ, కార్యకర్త పనిచేస్తున్నారు, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.


 

Advertisement
 
Advertisement
 
Advertisement