పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత | tdp Municipal Chairman Among 11 Arrested For Playing Cards | Sakshi
Sakshi News home page

పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత

Jul 5 2017 12:20 PM | Updated on Oct 16 2018 6:15 PM

పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత - Sakshi

పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత

జూదమాడుతున్న శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్‌ చైర్మన్‌, కోత పూర్ణ చంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు.

► పూర్ణ చంద్రరావు సహా 11 మంది అరెస్టు

ఇచ్ఛాపురం:  శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్‌ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీకి చెందిన కోత పూర్ణ చంద్రరావు జూదమాడుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో సహా 11 మందిని నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట మండలంలోని బారువ రీసార్ట్స్‌లో పూర్ణచంద్రరావుతో సహా మరికొంతమంది జూదమాడుతుండగా దాడి చేసి అరెస్టు చేసినట్టు సోంపేట ఇన్‌చార్జి సీఐ సన్యాసి నాయుడు వెల్లడించారు. బారువ రీసార్ట్స్‌లో పేకాటాడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో పలాస మున్సిపల్‌ చైర్మన్‌  కోత పూర్ణచంద్రరావు తో పాటు కాశీబుగ్గకు చెందిన బి.మధు, ఎస్‌.మోహనరావు, గణేష్‌ మహాంతి, బి.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, పలాసకు చెందిన బి.బల్లయ్య, పి.ముకుందరావు, కంచిలికి చెందిన వి.శ్రీనివాసరావు, డి.రవికుమార్, కె.శేఖర్, మందసకు చెందిన  ఎం.ఉదయ్‌ కుమార్‌లను అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement