play cards
-
అటవీ ప్రాంతంలో పేకాట..
నెల్లూరు(క్రైమ్): ఓ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేసి వారినుంచి రూ.10,45,500 స్వాధీనం చేసుకున్న ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) జేడీ కె.శ్రీలక్ష్మి మంగళవారం వివరాలను వెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం అటవీ ప్రాంతంలో పేకాట సాగుతోందన్న సమాచారం సెబ్ కమిషనర్ వినీత్‌బ్రిజ్‌లాల్, జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావుకు అందింది. వారి ఆదేశాల మేరకు జేడీ, నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఈబీ (సెబ్) బృందం, బుచ్చిరెడ్డిపాళెం సీఐ సీహెచ్ కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఈ నెల 20వ తేదీన పేకాట కేంద్రంపై దాడులు చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన హరిబాబు, పి.జవహర్‌ఖాన్, షేక్ జమాల్, పి.కొండయ్య, జి.బాబు, పి.సత్తిబాబు, జి.గుర్రప్ప, కె.వెంకట్రావు, గుంటూరుకు చెందిన కె.హనుమంతరావు, ఎం.తులసీకృష్ణ, ఒ.రాంబాబు, విజయవాడకు చెందిన షేక్ మౌలాలీ, డి.వరప్రసాద్, వి.సంజీవ్, పి.అర్జున్, ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్ పిచ్చయ్య, కె.శ్రీను, ప్రొద్దుటూరుకు చెందిన వై.మల్లికార్జునను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,45,500, 16 సెల్ఫోన్లు, తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై త్వరలో సస్పెక్టెడ్ షీట్లు తెరవనున్నట్లు జేడీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పేకాట కేంద్రంపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసిన సెబ్, పోలీసులను జేడీ శ్రీలక్ష్మి అభినందించారు. సెబ్ జేడీ టీమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
రండి..పేకాట ఆడుకోండి!
కోరుట్ల(జగిత్యాల జిల్లా): ‘రండి మా దగ్గర నిశ్చింతగా పేకాట ఆడుకోండి. విమాన చార్జీలు మేమే ఇస్తాం. హైక్లాస్ భోజన వసతి కల్పిస్తాం. 3 రోజుల పాటు మా దగ్గర హాయిగా పేకాట ఆడుకుంటూ ఉండొచ్చు. కేవలం రూ. 25–50 వేలు తెచ్చుకోండి’.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పేకాట రాయుళ్లకు పొరుగు రాష్ట్రాల క్లబ్‌లు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఈ ప్రాంతం నుంచి పేకాటరాయుళ్లను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు ఏకంగా కమీషన్ ఏజెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సాగని ఆటలు! ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 3 జిల్లాల్లో పోలీసులు నిత్యం పదుల సంఖ్యలో పేకాటరాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. లక్షల్లో నగదు స్వాధీనం చేసుకుంటూ 10 నుంచి 20కి మించి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో స్థానికంగా పేకాట ఆడేందుకు పేకాటరాయుళ్లు సుతరామూ ఇష్టపడటం లేదు. మూడు ముక్కలాటకు అలవాటుపడ్డ కొందరు తమ అడ్డాలను గ్రామశివారుల్లోని అటవీ ప్రాంతాలు, మామిడి తోటలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆ స్థావరాలనూ కనిపెట్టి దాడులు చేస్తుండటంతో స్థానికంగా పేకాట ఆడి కేసులు పాలుకావడం కన్నా.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి పేకాటరాయుళ్లు మొగ్గుచూపుతున్నారు. కమీషన్ ఏజెంట్ల హవా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు మహారాష్ట్రలోని పేకాట క్లబ్‌ల కన్నా కర్ణాటకలోని క్లబ్‌లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న క్లబ్‌లకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి నిత్యం 350–500 మంది పేకాట ఆడేందుకు వెళ్తున్న ట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాలోని కీలక పట్టణాల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన క్లబ్‌ల నిర్వాహకులు కమీషన్లు ఇస్తూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పేకాట ఆడేందుకు ఒకరిని బెంగళూరుకు తీసుకెళ్తే రూ.1000 నుంచి రూ.2,500 కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే వారిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్లడానికి కొందరు అద్దెకార్ల డ్రైవర్లు ఉండటం.. వీరికి ఎంతో కొంత కమీషన్ ముట్టడం విశేషం. ఆట తప్ప అంతా ఫ్రీ పేకాటరాయుళ్లను బెంగళూరుకు తరలించే కమీషన్ ఏజెంట్లు పేకాటరాయుళ్లను హైదరాబాద్ వరకు కార్లలో ఫ్రీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి విమాన టికెట్లు బుక్‌చేసి బెంగళూరుకు పంపుతున్నారు. కొందరు ఏజెంట్లు పేకాటరాయుళ్లతోపాటే ఉండి బెంగళూరులోని పేకాట క్లబ్‌లకు తీసుకెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు బెంగళూరులోని హైక్లాస్ లాడ్జీల్లో వసతి, ఖరీదైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి క్లబ్‌లలో ఉన్న హాలులో పది నుంచి పన్నెండు టేబుళ్లు ఏర్పాటు చేసి రమ్మీ, త్రీ కార్డ్స్ (మూడు ముక్కలు) ఆడిస్తున్నారు. ఒక్కో ఆటకు రూ.3,000–రూ.5,000 వరకు డబ్బులు పెట్టి ఆడాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్ నుంచి క్లబ్ నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.5 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పేకాట ఆడుతున్న వ్యసనపరులు కొందరు జేబులు గుల్లచేసుకుని వస్తుండటం గమనార్హం. మొత్తంమీద పేకాట వ్యసనం ఇతర రాష్ట్రాల్లోని క్లబ్‌లకు లాభాల పంట పండిస్తోంది. -
జోరుగా మూడుముక్కలాట
జనగామ: మూడు ముక్కలాట జిల్లాలో జోరుగా సాగుతుంది. మామిడి తోటలు, ఫాంహౌజ్‌లను పేకాట స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పేకాటకు అంకితమైపోతున్నారు. సంపాదనంతా తగలేస్తూ కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. రోజుకు రూ. ఐదు లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రం శివారుతో పాటు లింగాలఘనపురం, నర్మెట, బచ్చన్నపేట, రఘునాథపల్లి తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు పేకాట రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఆయా జిల్లాలకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి పేకాటను జోరుగా సాగిస్తు న్నారనే ప్రచారం జరుగుతోంది. రోజుకు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ఫాంహౌజులతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఫారెస్ట్లు, వ్యవసాయ క్షేత్రాలను స్థావరాలుగా మార్చుకుం టున్నారు. ఒక్కో ప్రదేశంలో పది నుంచి ఇరవై మంది సభ్యుల వరకు పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఆదివారంతో పాటు ఇతర సెలవురోజుల్లో ఈ ఆట రెండింతలుగా పెరుగుతుంది. తెల్లవార్లూ... సర్కారు కొలువుకు వెళ్లినట్టుగా రోజు వారీగా పేకాట రాయు ళ్లు ముందుగా ఎంచుకున్న రహస్య ప్రదేశాలకు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి, అవసరమైతే తెల్లవార్లు మూడు ముక్కలు, రమ్మీ ఆడేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. పేకాట ఆడే ప్రదేశంలోకి పోలీసులు వెళ్లే ప్రయత్నం చేస్తే ముందుగానే గుర్తించి సమాచారం అందించేందుకు ప్రైవేట్‌గా రెండంచెల భద్రతను మెయింటేన్ చేస్తుండడం గమనార్హం. కొంత మంది బడా బాబులు ఈ ఆటలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పలువురు వ్యక్తులు పోలీసులు, గ్రామస్తులకు అనుమానం రాకుండా స్థావరాలను మారుçస్తూ పేకాట జోరును కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసులు పేకాట స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా ఆట మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. రోడ్డున పడుతున్న కుటుంబాలు.. సరదా కోసం పేకాటను అలవాటుగా మార్చుకుంటున్న చాలా మంది లక్షలకు లక్షలు పోగొట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. పేకాట మానుకోవాలని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ ఊబిలోకి కొత్తవారిని సైతం ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మూడు ముళ్ల బంధం... ఏడడుగులు నడిచి తన వెంట వచ్చిన భార్య మెడలోని మంగళ సూత్రాలను సైతం తాకట్టు పెట్టేస్తూ.. జల్సా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి... పేకాటలో వడ్డీ వ్యాపారస్తుల హవా కొనసాగుతుంది. ఆటలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు అప్పురూపంలో ఇచ్చేందుకు కొత్త వడ్డీవ్యాపారులు పుట్టుకొస్తున్నారు. కొన్నిచోట్ల భర్తలు భార్య మెడలోని పుస్తుల తాళ్లను సైతం తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. వడ్డీ రూపంలో వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లకుండా సదరు వ్యాపారులు.. నిర్వాహకులు ఆట మధ్యలో వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే చర్చించుకుంటున్నారు. అప్పు తీసుకున్న పాపానికి పేకాట ఆడుతూ రెంటికీ చెడ్డ రేవడిగా మారుతున్నారు. పేకాటపై ఉక్కుపాదం జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నాం. ప్రతి నిత్యం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాం. పేకాట రాయుళ్లపై ఎవరు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. జిల్లాలో ఇటీవల అనేక చోట్ల పేకాటరాయుళ్లను పట్టుకుని కేసులు నమోదు చేసి డబ్బులను కోర్టుకు అప్పగించాం. ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. -
బతుకు మూడు ముక్కలు
సదాశివపేట(సంగారెడ్డి): కాయ్‌రాజా కాయ్ కాస్తేవుంది చూస్తే లేదు, ముడు ముక్కలాట... మూడాసులు తిప్పు, ఒకటికి మూడు రెట్లు.. స్వర్గానికి లే మెట్లు క్షణంలో సగంలో నువ్వు కుబేరుడివి. కనురేప్పపాటులో కుచేలుడివి.. అమాంతం కురిసిన రాత్రి కవితా సంపుటిలో బాల గంగాధర్ తిలక్ జూదం గురించి రాసిన ఓ కవిత, సదాశివపేట పట్టణ మండల పరిధిలో అచ్చు అలాగే ఉంది మరి, ముక్క కలిస్తే అదష్టం తమదేనని ఆశపడుతున్నారు. కానీ అది తిరగబడి చాలా మంది కుచేలులుగా మారుతున్నారు. అప్పుల పాలై వాటిని తీర్చే దారిలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయదారులు, ప్రజాప్రతినిధులు, పరిశ్రమల్లో పరిచేస్తున్న కార్మికులు, వ్యాపారులు, దినసరి కూలీలు పేకాట మత్తులో మునిగిపోయారు. రాములు (పేరు మార్చాం) రోజువారీ కూలీ రెండు రోజులు పనికెళ్తే ఓ ఆరువందల రూపాయలు సంపాదిస్తాడు. కానీ అలా వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలను తీర్చకుండా మూడు ముక్కలాట(పేకాట) ఆడతాడు. సంపాదించిన సోమ్ము ఇలా తగలబెట్టడం.. తిరిగి తెలిసిన వారి వద్ద అప్పులు చేయడమే అతని నిత్యకత్యం అయింది. రోజులు గడుస్తున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి. స్థోమతకు మించి చేసిన అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టుకున్న భార్య పిల్లలు ఇప్పుడు దిక్కులేని వారిగా మిగిలారు. ఇలా సదాశివపేట ప్రాంతంలో పేకాట కారణంగా ముక్కలవుతున్న కుటుంబాల ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ జూదానికి అడ్డుపడడం లేదు. సదాశివపేట ప్రాంతంలో పేకాట సంస్కృతి జడలు విప్పింది. ఎక్కడపడితే అక్కడ ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లు, బహిరంగ ప్రదేశాలు, వాటర్ ప్లాంట్లులో నిత్యం పేకాట కొనసాగుతుంది, పోలీసులకు మాత్రం తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. జూదమే ధ్యాస.. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు యువకులు జూదానికి బానిసవుతున్నారు. పనికేళ్లి కష్టపడి సంపాదించినదంతా ఈ పేకాటలో పోగొట్టుకోవడం వీరికి అలవాటైంది. మద్యం మత్తు ఆపై పేకాట ఆడటం ఇదే ఈ ప్రాంతంలో కొందరి వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు, యువకుల జీవనశైలిగా మారింది. ముఖ్యంగా సదాశివపేట పట్టణ మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్, వివిధ పార్టీ కార్యాలయాలు, వాటర్ప్లాంట్లు, ఫంక్షన్ హాళ్లు, ఇళ్లు కేంద్రాలుగా మారాయి. జూదానికి బానిసైన వారు అన్న నీళ్లు మరచి మరీ గంటల తరబడి పేకాటలో నిమగ్నమౌతూ కుటుంబాలను పట్టించుకోని పరిస్థితి. ఇంతేకాదు పేకాటలో డబ్బుల విషయమై ఘర్షణలు తలెత్తడం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇక్కడ పారిపాటిగా మారింది. నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు.. సదాశివపేట పట్టణంలోని నడిబోడ్డు నుంచి నట్టింటి వరకు ఈ పేకాట సంస్కృతి విస్తరించుకుపోతుంది. సదాశివపేట పట్టణంలోని వివిధ పార్టీ కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లు, ఇళ్లలలో కొందరు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పేకాట అడడం విశేషం, సదాశివపేట పట్టణ మండల పరిధిలోని పార్టీ కార్యాలచయాలు, వ్యవసాయా మార్కెట్, ఫంక్షన్ హళ్లు, ఫాంహౌజ్‌లు, వాటర్ప్లాంటుతో పాటు వెల్టూర్ గ్రామానికి వేళ్లు మార్గంలోగల పాంహౌజ్లు, దర్గాల సమీపంతో పాటు, నివాస గృహాలు, వ్యవసాయ పంటపోలాల్లోని చెట్లకింద, ఫంక్షన్ హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో నిత్యం పేకాట జోరుగా సాగుతుంది. మొక్కుబడిగా దాడులు.. జూదం అడ్డాలు పట్టణ, మండల పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో పోలీసులకు తెలుసు అందువల్లనే పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్న ఎవరిని పట్టుకోలేక పోతున్నారు. ‘‘దాడుల సమయంలో గతంలో మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో పట్టుబడిన జూదరులు పోలీసులకు ఎదురుతిరగడంతో పాటు మీ డీఎస్పీతో మాట్లాడాలా, మీ సీఐతో మాట్లాడాలా అసలు మీకు ఎవరు ఫిర్యాదు చేశారు వారి పేరు చెప్పండి అంటూ ఎదురు తిరగడంతో పోలీసులు వెనుదిరిగి వచ్చాని సంఘటనలు ఉన్నాయి’’. అందువల్ల అధికార పార్టీనేతలు బెదిరింపులు చేయడం వల్ల పోలీసు సిబ్బంది పేకాట విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. దాడులు చేయాగానే ప్రజాప్రతినిధుల ఫోన్లు రావడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోగొట్టుకున్నారు.. సదాశివపేట పట్టణంలోని సబ్‌స్టేషన్ ఎదురుగా గల గల్లిలోని ఓ ఇంట్లో గత రెండు నెలల పాటు ఓ టీఆర్ఎస్ నాయకుని అండదండలతో పాటు కొనసాగిన పేకాటలో పట్టణానికి చేందిన దాదాపు 20 మంది 1లక్ష నుంచి 15 లక్షల వరకు పేకాటాలో పోగొట్టుకున్నట్లు సమాచారం. అక్కడ ప్రతీ రోజు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు నిత్యం పేకాట కొనసాగినట్లు తెలుస్తుంది. ఉదయ నుంచి రాత్రి వరకు మద్యం, మాంసం వంటకాలు చేయించి వడ్డించినట్లు సమాచారం. కళ్లెం వేయరు.. కన్నీరు తుడవరు పేకాట ఆడుతున్న వ్యక్తులు మద్యం తాగడంతోపాటు దాడులు చేసుకుంటుండంతో సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న వేదన వర్ణనాతీతం తమ కుటుంబాలకు చేందినవారే కళ్లేదుట పేకాట ఆడుతుండటం ఇదేమని ప్రశ్నిస్తేంటే ఆటలో ఉన్న వ్యక్తులు బెదిరిస్తున్నారని కన్నీళ్ల పర్యవంతమౌతున్నారు. కొన్ని ఇళ్లల్లో అర్ధరాత్రి వరకు నిత్యం పేకాట అడూండ అదుపూ లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేకాటకు అడ్డుకట్ట వేసి కుటుంబాలు ఛిద్రం కాకుండా చూడాలని ప్రజలు కొరుతున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు.. పట్టణ మండల పరిధిలో పేకాట ఆడితే చట్టపరంగా కేసులు నమోదు చేసి చట్టపరంగ చర్యలు తీసుకుంటాం. పేకాట అడితే ఎంతటి వారినైన వదలబోమని రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులైన సరై వదిలివేసే ప్రసక్తి ఉండదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న స్థావరాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని అదును చూసి దాడిచేసి అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న వారి గురించి ప్రజలేవరైన సమాచార మిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. – సీఐ సురేందర్‌రెడ్డి -
‘నాగేశ్వరరావు’ పేకాట క్లబ్‌పై దాడి
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): కాకినాడ రూరల్ వాకలపూడి మహా లక్ష్మీనగర్‌లో పేకాట క్లబ్‌పై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటి సమీపంలోనే గత కొంతకాలంగా ‘నాగేశ్వర రావు’ పేకాట క్లబ్ నడుస్తోంది. స్థానిక పోలీసులు, అధికార పార్టీ నేతలకు నెలవారీగా మామూళ్లు అందుతుండటంతో పేకాట క్లబ్ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి. ఈ విషయం తెలిసి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ పిఠాపురం సీఐ అప్పారావుతో పేకాట క్లబ్‌పై దాడి చేయించారు. పోలీసులు రాక గమనించి పేకాట క్లబ్ నిర్వాహకుడు నాగేశ్వరరావు పరారయ్యారు. నాగేశ్వర రావుపై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిసింది. సంఘటనాస్థలం నుంచి భారీగా నగదు, కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రూరల్‌తో పాటుగా కాకినాడ సిటీలోనూ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పలు పేకాట క్లబ్‌లు నడుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. -
పేకాట స్థావరంపై దాడి..ఎనిమిది మంది అరెస్ట్
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయక హిల్స్ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.50 వేల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైటెక్ పేకాట ముఠా గుట్టు రట్టు
-
పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత
► పూర్ణ చంద్రరావు సహా 11 మంది అరెస్టు ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీకి చెందిన కోత పూర్ణ చంద్రరావు జూదమాడుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో సహా 11 మందిని నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట మండలంలోని బారువ రీసార్ట్స్లో పూర్ణచంద్రరావుతో సహా మరికొంతమంది జూదమాడుతుండగా దాడి చేసి అరెస్టు చేసినట్టు సోంపేట ఇన్చార్జి సీఐ సన్యాసి నాయుడు వెల్లడించారు. బారువ రీసార్ట్స్లో పేకాటాడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు తో పాటు కాశీబుగ్గకు చెందిన బి.మధు, ఎస్.మోహనరావు, గణేష్ మహాంతి, బి.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, పలాసకు చెందిన బి.బల్లయ్య, పి.ముకుందరావు, కంచిలికి చెందిన వి.శ్రీనివాసరావు, డి.రవికుమార్, కె.శేఖర్, మందసకు చెందిన ఎం.ఉదయ్ కుమార్‌లను అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాయ్ రాజా కాయ్
జిల్లాలో జోరుగా పేకాట గెలుపోటములపై కూడా పందేలు రోజూ చేతులు మారుతున్న భారీ నగదు నిర్వాహకులకు పర్సంటేజీలు దండిగా పోలీసుల అండదండలు! రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో జోరుగా పేకాట సాగుతోంది. గతంలో లాడ్జీలు, ఇళ్లులు అద్దెకు తీసుకుని పేకాట నిర్వహించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో నిర్వాహకులు కొత్త పంథాలు, వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పట్టణ శివారు ప్రాంతాల్లో్ల పేకాట నిర్వహిస్తున్నారు. – సాక్షి, రాజమహేంద్రవరం నిత్యం రాత్రి నుంచి వేకువజామున ఐదు గంటల వరకు పేకాట యథేచ్ఛగా ఆడుతున్నారు. రాజమహేద్రవరంలోని క్వారీ ఏరియా, గాదిరెడ్డి నగర్ల్లో ఓ మాజీ కార్పొరేటర్ పేకాటను నిర్వహిస్తున్నాడు. ఇక్కడ నిత్యం రూ.20 లక్షల వరకు చేతులు మారుతున్నాయి. గెలుపోటములపై కూడా పందేలు కాస్తున్నారు. పేకాట రాయుళ్లకు కావాల్సిన భోజనం, ఇతర అవసరాలు అన్నీ నిర్వాహకులే సమకూరుస్తున్నారు. వీరు ప్రతి ఆటకు వచ్చే మొత్తంపై పర్సంటేజీలు తీసుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించే పేకాట ద్వారా ఓ మాజీ కార్పొరేటర్‌కు రోజుకు రూ.50 వేలు పర్సంటేజీల రూపంలో అందుతున్నట్టు సమాచారం. స్థానికులకు అనుమానం రాకుండా.. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలోని మధురపూడి, దివాన్‌చెరువు, పాలచర్లలో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఒకే వ్యక్తి వీటిని నిర్వహిస్తున్నాడు. రోజుకో చోట చొప్పన పేకాట నిర్వహిస్తూ పోలీసులుకు, స్థానికులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. గోకవరం శివారు ప్రాంతాల్లో జరుగుతున్న పేకాటలో రోజుకు రూ.10 లక్షలు చేతులు మారుతున్నట్టు సమాచారం. జగ్గంపేట నియోజకవర్గం ఏలేశ్వరం కాలువ గట్టును పేకాటరాయుళ్లు తమ స్థావరంగా మార్చుకున్నారు. కోనసీమలో ఏటిగట్లపై.. కోనసీమలో కూడా పేకాట యథేచ్ఛగా సాగిపోతోంది. రావులపాలెం కేంద్రంగా ఏటిగట్లపై గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతోంది. పోలీసులు అడపాదడపా దాడులు చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేస్తున్నారు. రాజకీయ నేతల పలుకుబడితో వారు బయటపడుతున్నారు. బయటి ప్రాంతాల వ్యక్తులూ ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. రాజమహేంద్రవరంలో భారీ స్థాయిలో పందేలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ నిర్వాహకులకు ఆయా ప్రాంతాల పరిధిలోని పోలీసుల అండదండలు దండిగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. మాముళ్ల రూపంలో ప్రతినెలా రూ.3.5 లక్షలు ఆ ప్రాంత స్టేషన్‌కు అందుతున్నట్టు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటాం పేకాట ఆడుతున్నట్టు సమాచారం ఉంది. నిఘా పెడుతున్నాం. నిర్వాహకులు, పేకాట ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తమకు తెలిసిన సమాచారం అందజేయాలి. – బి.రాజకుమారి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ -
పేకాట క్లబ్‌తో జీవితాలు నాశనం
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల టౌన్: పల్నాడు ప్రాంతంలో పేదల జీవితాలతో ఆటలాడుతున్న పేకాట క్లబ్ మూసివేత కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సమాయత్తం అవుతోంది. ఉద్యమానికి మహిళలు మద్దతు పలుకుతున్నారు. క్లబ్ మూసివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. దాచేపల్లిలో పేకాట క్లబ్ జోరుగా సాగుతోందని, ప్రజల జీవితాలను నాశనం చేసే పేకాటకు అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో అర్ధం కావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. అసలే కరువు... వర్షాభావంతో పల్నాడు ప్రాంతంలో కరువు దాపురించింది. ఈ తరుణంలో నిర్వహిస్తున్న పేకాట క్లబ్ ప్రజల పాలిట శాపంగా మారింది. పేకాటలో సర్వం కోల్పోయిన వారు వీధుల పాలవుతున్నారు. కరువు కారణంగా కుటుంబ పోషణే కష్టంగా మారిన తరుణంలో కొందరు వ్యసనపరులు ఆస్తులను అమ్మి ఉన్నది కాస్తా పేకాటలో పెడుతుండడంతో బాధిత కుటుంబ సభ్యుల్లో కలవరం నెలకొంది. రోజూ బంకినీయే రూ.20 లక్షలు.. మాచర్ల, గురజాల నుంచే కాకుండా జిల్లా, పొరుగు రాష్ట్రాల నుంచి పేకాటరాయుళ్లు జూదమాడేందుకు క్లబ్‌కు వస్తున్నారు. జూదంపై నిర్వాహకులకు రోజూ రూ.20 లక్షలు బంకిని వస్తుందంటే పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతలు తమ ప్రయోజనాల కోసం తమ జీవితాలను నాశనం చేస్తున్నారని పేకాట బాధితుల కుటుంబీకులు మండిపడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మూడు ముక్కలాట వంటి జూదాలు ఎక్కడ జరిగినా సత్వరమే స్పందిÆ చే పోలీసులు దాచేపల్లి క్లబ్ గురించి ఎందుకు పట్టించుకోరో అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పేకాటక్లబ్, అక్రమ మైనింగ్‌లపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. క్లబ్ ప్రారంభించిన కొత్తలో అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పోలీసులు వెంటనే మూసివేశారన్నారు. తర్వాత అధికార పార్టీ నేతల వత్తిళ్లకు తలొగ్గి మళ్లీ క్లబ్‌ను తెరిపించారన్నారు. ఈ క్లబ్ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్ నడిపే నేతలకు ఎవరూ అడ్డు చెప్పకపోవడంతో క్యాబరే డాన్సులు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పచ్చని కాపురాల్లో నిప్పులు పోసే క్లబ్‌ను మూసివేయించి కుటుంబాలు చితికిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్లబ్‌ను మూయించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాధిత కుటుంబాల శాపనార్ధాలు, ఉసురుతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మహిళలతో ఉద్యమాన్ని చేపడతానని హెచ్చరించారు. -
అడ్డంగా దొరికారు..గుట్టుగా తప్పించారు!
– పేకాట కేసు తారుమారు – పట్టుబడింది తెలుగు తమ్ముళ్లు – అరెస్టులో చూపింది అనామకులను – పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు – నంద్యాలలో ఘటన నంద్యాల: పేకాడుతూ అడ్డంగా దొరికిన టీడీపీ నేత అనుచరులను కేసు నుంచి పోలీసులు గుట్టుగా తప్పించారు. ఎలాంటి రాజకీయ అండలేని అనామకులపై కేసు నమోదు చేసి.. మీడియా ఎదుట వారిని హాజరు పరిచారు. ఈ ఘటన బుధవారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్బీఐ కాలనీలోని ఎస్ఎస్ అపార్టుమెంట్లో ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. అపార్టుమెంట్ సంస్కతిలో ఉన్న లోపాలను టీడీపీ నేత అనుచరులు అనుకూలంగా మార్చుకున్నారు. ప్లాట్నెం.402లో పేకాట స్థావరాన్ని నెలకొల్పారు. ఇందులో టీడీపీ నేత వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఇతనితో పాటు మరికొందరు టీడీపీ నాయకులు, వ్యాపారులు ప్రతి రోజూ లక్షల రూపాయలతో గంటల తరబడి పేకాడుతున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఈ సమాచారం పోలీసులకు అందడంతో నిఘా వేశారు. దాడి ఇలా... మంగళవారం రాత్రి టూటౌన్ ఇన్చార్జి సీఐ మురళీధర్‌రెడ్డి, సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేశారు. టీడీపీ నేతకు చెందిన ప్రముఖ అనుచరుడు ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే మూడో కంట పడకుండా వెళ్లిపోమ్మని తప్పించినట్లు సమాచారం. తర్వాత టీడీపీ నేత వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు, ఇసుక వ్యాపారి, మాజీ సొసైటీ అధ్యక్షుడుతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీరిని టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే రాత్రి రాత్రికే సీన్ మారింది. పేకాటలో చిక్కిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ నేతకు ఫోన్ చేయడం.. వెంటనే ఆయన పోలీసులపై ఒత్తిడి తేవడం, పోలీసులు వారిని తప్పించి సగర్వంగా బయటకు పంపడం నిమిషాల్లో జరిగిపోయింది. తెలుగు తమ్ముళ్లను తప్పించిన పోలీసులు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఏడుగురి అరెస్ట్... ఎస్ఎస్ అపార్టుమెంట్లో పేకాట స్థావరంపై దాడి చేసి షేక్ జాకీర్ రహమాన్, దూదేకుల మహమ్మద్, పాల నరసింహారెడ్డి, సాలెపల్లి నారాయణరెడ్డి, పగిడాల సుబ్బారావు, పుట్ట నాగరాజు, కె.శివరాజులను అరెస్ట్ చేశామని టూటౌన్ ఇన్చార్జి సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరి నుంచి రూ. 2.77లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ ప్రతాపరెడ్డి, టూటౌన్ ఎస్ఐ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అయితే టీడీపీ నాయకులను ఎవరినీ అరెస్ట్ చేయలేదని మురళీధర్‌రెడ్డి తెలిపారు. -
ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్: ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు గురువారం రాత్రి పోలీసులు రంగంలోకి దిగారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 75 వేల నగదుతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట స్ధావరాలపై దాడి, మహిళల సహా 8మంది అరెస్ట్
హైదరాబాద్ : పేకాట స్ధావరాలపై సైబారాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గత కొంతకాలంగా నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఇష్టానుసారంగా జరుగుతున్న పేకాట స్థావరాలపై నిరంతరంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా మరో అడ్డా గుట్టురట్టయింది. 15 రోజుల క్రితం రామంతాపుర్‌లో ఓ ఇంటిపై ఎస్వోటీ సీఐ పుష్పన్‌కుమార్ అధ్వర్యంలో జరిపిన దాడిలో పురుషులతో పాటు ముగ్గురు మహిళలు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా నిన్నరాతి ఎస్వోటీ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మణికొండలోని ల్యాంకో హిల్స్ ఫ్లాట్‌లో జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిదిమంది ప్రముఖ వ్యక్తులు అడ్డంగా బుక్కయిపోయారు. వీరి వద్ద నుంచి రూ.3.48 లక్షల నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
విభజన జరిగితే నెల్లూరు ఎడారే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సమైక్యాంధ్ర నినాదాలతో నెల్లూరు నగరం హోరెత్తింది. నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం వైపే కదిలాయి. ఉరకలేసిన ఉత్సాహంతో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని గొంతుగొంతూ కలుపుతూ నినాదాలు చేసుకుంటూ జనం తండోపతండాలుగా తరలివచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, కళాకారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లువీళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం సింహాలై గర్జించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన జన సందోహం ఒక్కో మార్గం నుంచి ప్రదర్శనగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి పోటెత్తింది. సమైక్య సింహగర్జన సభ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది స్వచ్ఛందంగా రావడం కనిపించింది. పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, వీధులు జనంతో కిటకిటలాటాయి. ఎటువైపు చూసినా జనంతో నిండిపోయాయి. సమైక్య పరిరక్షణ వేదిక పేరుతో జిల్లా అధికారుల సంఘం గురువారం నిర్వహించిన ‘ సమైక్య సింహగర్జన ’ జిల్లా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక అపురూప ఘట్టంగా నిలిచిపోనుంది. సింహగర్జన సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. సభకు లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. సింహగర్జన సభకు విస్తృత ప్రచారం కల్పించడంతో నగరంలోని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా మూసివేశారు. సభా ప్రాంగణం పరిసరాలు మినహా మిగిలిన ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. ఎటుచూసినా కోలాహలం : సింహగర్జన సభకు హాజరయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది నగరానికి తరలి వచ్చారు. ట్రాక్టర్లు, లారీలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో జనం పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందుగానే వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అక్కడ నుంచి ఆయా బృందాలు ప్రదర్శనగా సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. తెలుగుతల్లి, జాతీయ నేతల వేషధారణలతో పాటు పలు రకాల విచిత్ర వేషధార ణలతో ప్రదర్శనగా రావడంతో కోలాహలం చోటు చేసుకుంది. అక్కడక్కడా డప్పు వాయిద్యాలతో సమైక్యవాదులు చిందులు తొక్కుతూ నినదించారు. నగరం నుంచి సభకు హాజరయ్యే వారి కోసం 15 కేంద్రాలను ఎంపిక చేసి అక్కడ నుంచే బయలుదేరే ఏర్పాట్లు చేశారు. దీంతో కలెక్టరేట్, ఆత్మకూరు బస్టాండ్, వీఆర్సీ సెంటర్, అయ్యప్పగుడి సెంటర్, మినీబైపాస్ రోడ్డు, ములుముడి బస్టాండ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వివిధ ఉద్యోగ సంఘాల సిబ్బంది, ప్రజాసంఘాలు ర్యాలీగా స్టేడియం చేరుకున్నాయి. ఈ ర్యాలీల్లోనూ విచిత్ర వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నృత్యాలు, నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం : సింహగర్జన సభా ప్రాంగణం సమైక్యవాదుల నృత్యాలు, నినాదాలతో దద్దరిల్లింది. సమైక్యాంధ్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ కళాకారులు పాడిన పాటలు సభకు హాజరైన వారిని ఉరకలెత్తించాయి. ‘ఆంధ్ర రాష్ట్రమా, సమైక్య రాష్ట్రమా ..నిన్నే ముక్కలు చేస్తే తల్లడిల్లిపోతాం’ అంటూ కళాంజలి ఆర్కెస్ట్రా అధినేత శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట అందరి హృదయాలను దోచుకుంది. సభికుల విజ్ఞప్తి మేరకు ఇదే పాటను పలుమార్లు పాడారు. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా డ్యాన్సులు చేశారు. సభ నిర్వాహకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసిన సమయంలో హాజరైన వారు కూడా నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. వక్తల ప్రసంగాల సమయంలోనూ సమైక్యాంధ్ర ప్రాధాన్యతను వివరించినప్పుడు జనం నుంచి విశేష స్పందన కనిపించింది. వేదికపైన జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు డి. రామిరెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత మధుసూదన్‌రావు ఉన్నారు. వీరితో పాటు కళాకారులకు మాత్రమే వేదికపైన అవకాశం కల్పించారు. జాతీయ గీతాలాపనతో ముగింపు: లక్షలాదిగా హాజరైన సింగహగర్జన సభను జాతీయ గీతాలాపనతో ముగించారు. ఉదయం తొమ్మిది గం టల నుంచి జనం సభాప్రాంగణానికి చేరుకోవడం మొదలైంది. నిర్ణీత సమయానికి మైదానం మొత్తం జనంతో నిండిపోయింది. ఎండ ఎక్కువగా ఉండటంతో ప్రసంగాలకు ముందే వెళ్లిపోవడం కనిపించింది. ఒంటిగంట వరకు జరగాల్సిన సభను ముందుగానే ముగించారు. సభ ముగిసే సమయానికి కూడా వేలాదిమంది రావడం కనిపించింది.