
ప్రతీకాత్మక చిత్రం
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): కాకినాడ రూరల్ వాకలపూడి మహా లక్ష్మీనగర్‌లో పేకాట క్లబ్‌పై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటి సమీపంలోనే గత కొంతకాలంగా ‘నాగేశ్వర రావు’ పేకాట క్లబ్ నడుస్తోంది. స్థానిక పోలీసులు, అధికార పార్టీ నేతలకు నెలవారీగా మామూళ్లు అందుతుండటంతో పేకాట క్లబ్ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి. ఈ విషయం తెలిసి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ పిఠాపురం సీఐ అప్పారావుతో పేకాట క్లబ్‌పై దాడి చేయించారు.
పోలీసులు రాక గమనించి పేకాట క్లబ్ నిర్వాహకుడు నాగేశ్వరరావు పరారయ్యారు. నాగేశ్వర రావుపై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిసింది. సంఘటనాస్థలం నుంచి భారీగా నగదు, కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రూరల్‌తో పాటుగా కాకినాడ సిటీలోనూ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పలు పేకాట క్లబ్‌లు నడుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment