ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు గురువారం రాత్రి పోలీసులు రంగంలోకి దిగారు.
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 75 వేల నగదుతో పాటు ఎనిమిది సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.