cellphones
-
లేత వయసు.. వినని మనసు
రోజుల పరిచయానికి కన్నవారినే కాదనుకుంటున్నారు.. అంతా తమకే తెలుసునన్న భ్రమలో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక.. కనిపించేదంతా నిజమేమో అని రంగుల మాయలో పడుతూ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.. చేతుల్లోని సెల్ ఫోన్ ఈ మైనర్ ప్రేమ వ్యథలకు వారథి అవుతుండగా.. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాలు వారిని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా బాలికలు ఈ విషయంలో సమిధలవుతున్నారు. అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): అడుగు బయటపెడితే ఎటు వెళ్లాలో దారులు కూడా సరిగ్గా తెలియని అమాయక మైనర్లను.. చేతిలో ఉన్న ఫోన్లు, అందులో ఉన్న పలు ఆన్లైన్ సైట్లు తప్పుదోవ పట్టేలా చేస్తున్నాయి. ఆయా సైట్లలోని రంగుల ప్రపంచం మాదిరిగానే వాస్తవ పరిస్థితులు కూడా ఉంటాయనే భ్రమలో మితిమీరిన పరిచయాలను పెంచుకుంటూ.. వారి జీవితాలను వారే అంధకారంగా మార్చుకుంటున్నారు. పదిహేనేళ్ల వయస్సులోనే ‘తప్పు’టడుగులు వేసి గర్భం దాల్చడం.. బిడ్డలను కని రోడ్డున పడి.. తమ కన్నవారికి తీరని గుండె ఘోషను మిగుల్చుతున్నారు. సింగ్‌నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని మైనర్ బాలికలు, యువతులు ఫేస్బుక్, ఇన్‌స్టా్రగామ్ వంటి సైట్లలో పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి.⇒ సింగ్‌నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని సమీపంలోని ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లి ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలుపగా అతగాడు ఆ నగ్నఫొటోలతో వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ⇒ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్లో పోస్ట్‌లు, వీడియోలను చూసి ఓ యువకుడికి దగ్గరైంది. వారిళ్లల్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా కలుసుకున్నారు. ఆ బాలిక మూడు నెలల తరువాత గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ⇒ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క సింగ్‌నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోనే నెలలో నలభై కేసుల వరకూ బాలికలు అదృశ్యమయ్యారని, బాలికలు, యువతులపై లైంగిక దాడుల ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు, ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ వంటి విభాగాలు బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలో వీరికి అవగాహన సదస్సులు నిర్వహించడం, పోలీసులతో ఈ చట్టాల గురించి బాలబాలికలకు అవగాహన కల్పించడం చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల ఇవి అరకొరగా జరుగుతున్నా ప్రభావం చూపడం లేదు. బాలికలపై లైంగిక దాడులు, అదృశ్య కేసులను నియంత్రించాలంటే వారిపై నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా యుక్త వయస్సులో ఉన్న బాలబాలికల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారు స్కూల్‌కు, కాలేజ్‌కు, ట్యూషన్‌కు వెళ్తున్నారా.. లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తరచూ బాలికలకు సమాజంపై అవగాహన కల్పించడం, అప్రమత్తంగా ఉండి.. వారికి ఎప్పటికప్పుడు తోడుగా ఉండడం, వారితో ఎప్పుడూ స్నేహంగా నడుచుకోవడం.. ఫోన్లను దూరంగా ఉంచడం ద్వారా పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం తగ్గుతుందని మానసిక వైద్య నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి.. బాల బాలికలు తప్పుడు త్రోవలో వెళ్లేందుకు ప్రధాన కారణం సెల్ఫోన్లే. చిన్నపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం, ఫేస్బుక్, ఇన్‌స్టా్రగామ్, ఓటీటీ వంటి వాటికి ఎడిక్ట్ అవ్వడం, చదువు, సంప్రదాయాలను తెలుసుకోకుండా రీల్స్ పేరుతో చిన్నవయస్సులోనే చెడు అలవాట్లన్ని నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు అతి గారాబం చేయకూడదు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కదలికలపై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ శాఖ తరఫున పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు, సెల్‌ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. – బీహెచ్ వెంకటేశ్వర్లు, సింగ్‌నగర్ సీఐ -
TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్ -
బంగారు బాల్యం..బాధ్యతతో పదిలం
సాక్షి రాయచోటి : భావి భారత పౌరులు.. అలాంటి చిన్నారులు చేస్తున్న వికృత చేష్టలు సమాజం ఎటుపోతుందోనన్న సందేహాలకు సమాధానం దొరకని పరిస్థితి. బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక్క ఉపాధ్యాయులదే కాదు..సమాజంలో తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. చిన్నారులు ఏం చేస్తున్నారో..ఎటు పోతున్నారో.. ఎలా వ్యవహారిస్తున్నారో చూసుకో కపోతే అనేక తప్పులకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకటి, రెండు దశాబ్దాల కిందట నాగరిక పోకడలు అంతగా లేని కాలంలో...చిన్న పిల్లలు, బాలలు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని చెప్పిందే వేదంగా నడిచే పరిస్థితి ఉండేది.కాలం మారింది, కంప్యూటర్ పోకడలు పెరిగిన ప్రస్తుత కాలంలో చిన్నారులు అడిగిందే తడవుగా ఏదీ కాదనలేదన్నది ఇప్పటి పరిస్థితి. భావి భారత బాలలకు ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పకపోతే భవిష్యత్‌లో ఎలాంటి తప్పుడు పనులు చేసినా అది అందరిమీద పడుతుంది. ఒకనాడు ఇంటి పని మొదలుకొని పాఠశాల ముగియగానే ఇంటికి చేరుకుని కుటుంబీకులతో తిరుగుతుండడంతో వారి ప్రవర్తన, నియమావళి తెలిసేది. ప్రస్తుతం సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ముందుకు వెళుతూ టెక్నాలజీ యుగంలో విలాసవంతానికి పోతుండడంతో అనుకోని ఘటనలు ఎదురవుతున్నాయి. సెల్ఫోన్లు చూస్తున్నారంటే అప్రమత్తంగా ఉండాలి చిన్నారులు, బాలలు (18 ఏళ్లలోపు) సెల్ఫోన్లు చూస్తున్నారంటే కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళితే అనేక రకాల వెబ్సైట్లు అందుబాటులోకి వస్తాయి. పైగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. అవతలి వారు పంపిన లింక్ౖò³ ఒక చిన్న క్లిక్ చేస్తేనే ఖజానా ఖాళీ అవుతుంది.అదొక్కటే కాదు...అనేక రకాల అశ్లీల బొమ్మలు, లైక్‌లు, సబ్స్రై్కబ్ల కోసం రకరకాల అసత్య ప్రచారాలు జరుగుతున్న తరుణంలో చిన్నారులకు తెలియకుండా జరిగే ఒక క్లిక్‌తో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవమే. అన్నింటి కంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇన్‌స్ర్ట్రాగామ్, వాట్సాప్‌లను క్రియేట్ చేసుకుని పెద్దలకు తెలియకుండా చూసిన తర్వాత డెలీట్ చేసి ఏమి తెలియనట్లు యదావిధిగా ఫోన్‌ను అందిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను తగ్గించే ప్రయత్నం చేయడంతోపాటు పుస్తకాలు అలవాటు చేయడం, ఆటల ద్వారా వారిలో వినోదం పంచడం లాంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. కేసులతో జీవితాలు ఛిద్రం అన్నమయ్య జిల్లాలో అవనసరంగా చెడు మార్గంలో పయనిస్తూ పోలీసు కేసులతో తమ జీవితాలను వారే చిధ్రం చేసుకుంటున్నారు. రెండేళ్ల కిందట మదనపల్లె, రాజంపేట పరిధిలో మైనర్లు పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్నారు. నెలన్నర కిందట పీలేరులో గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులు రైలు కిందపడి చనిపోయిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే రాయచోటిలో మందలించిన టీచర్‌పై ముగ్గురు విద్యార్థులు చితకబాదడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటనను తలుచుకుంటేనే గగుర్పాటు కనిపిస్తోంది.పెరిగిన వింత పోకడలు సమాజంలో చదువుకునే బాలల్లో వింత పోకడలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా సెల్ఫోన్లలో క్రైం స్టోరీలు చూడడం మొదలు ఇతర అనేక రకాల కారణాలతో విద్యార్థులు కూడా వేరే వ్యవహారాలకు బానిసలవుతున్నారు. ఒకరిని కొట్టినా, తిట్టినా శిక్ష కఠినంగా ఉంటుందన్న విషయం తెలియకనో, లేక ఏమౌతుందిలే అన్న ధీమాతో ఏదంటే అది చేస్తున్నారు. తల్లిదండ్రులు, గురువులకు తెలియకుండా రహస్య ప్రాంతాలను ఎంచుకుని సిగరెట్లు తాగడం, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం ఇలా చెడు మార్గాలవైపు పయనిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంగా ప్రత్యేక శ్రద్ద పెట్టకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. దీనికితోడు చెడు సావాసంతో అనవసరంగా వెళ్లి వివాదాల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. -
HYD: మల్కాజ్‌గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్‌బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
సెల్ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?
‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ఒక తండ్రి ఆవేదన.‘మా పాపకు ఇన్‌స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు’ ఒక తల్లి ఆక్రోశం.‘స్కూల్‌కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు’ ఒక టీచర్ ఫిర్యాదు.‘వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్‌ఫోన్‌లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం, చూస్తున్నాం. తప్పేంటీ?’ ఈ తరం విద్యార్థి ప్రశ్న.సోషల్ మీడియాతోనే చిక్కు..పిల్లల మీద స్మార్ట్‌ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది.సమస్య ఎక్కడ మొదలైంది?ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్‌ను ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తుందనీ, పిల్లలు తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్ వలలో చిక్కుకుపోయారు.మారకపోతే ప్రమాదమే..ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు ఐnట్ట్చజట్చఝ, టn్చpఛిజ్చ్టి లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోష¯Œ ్స గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.ఐదు అంచెల్లో పరిష్కారం..1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది.2. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.3. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్‌ఫోన్‌దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్‌ఫోన్‌ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సమయం గడుపుతారు.4. స్మార్ట్ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్‌పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్‌ల కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్లే వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి.5. పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి.– సైకాలజిస్ట్ విశేష్ -
ఒక్క రోజే 98 సెల్ఫోన్లు మిస్సింగ్
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఊరేగింపులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు బారీగా తరలిరావడంతో శుక్రవారం ఒక్క రోజే 98 సెల్ పోన్లు మిస్సైనట్లు సైపాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో కింద పడిన సెల్‌ఫోన్‌ను కూడా వంగి తీసుకోలేకపోవడం, భక్తులు కిక్కిరిసి ఉండటంతో 98 సెల్ఫోన్లు ఒక్క రోజే పోయినట్లు ఫిర్యాదు అందాయి. (చదవండి: రైళ్లిక రయ్!) -
ఎవరికీ చెప్పుకోలేక... భయంతో మథనపడుతూ..
యువత పెడదోవ పడుతోంది. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం ‘సెల్ ఫోన్’ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. మంచికోసం వినియోగించాల్సిన తమ మేధస్సును పెడదోవ పట్టిస్తోంది. తల్లిదండ్రులకు తలనొప్పులు తెస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు తప్పులు చేస్తుంటే వారిని వారించడం తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు సమస్యను ఎవ్వరితోనూ చెప్పుకోలేక ఇద్దరూ లోలోన మథనపడుతున్నారు. సున్నితమైన అంశాలు కావడంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఏయూక్యాంపస్/ఎంవీపీ కాలనీ: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొంతమంది బాలురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొద్దిరోజుల్లో వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఓ బాలుడు మిగిలిన వారి తల్లిదండ్రులకు మత్తు పదార్థాల సేవనం గురించి తెలియజేశాడు. దీంతో కక్ష గట్టిన ఐదుగురు బాలురు ఓ రోజు రాత్రి ఆ అబ్బాయిని నమ్మించి తీసుకువెళ్లి గంజాయి సేవించిన తర్వాత విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని తుప్పల్లో పెట్టి పడేశారు. వీరంతా హైస్కూల్ స్థాయి విద్యార్థులే. మద్దిలపాలెం సమీపంలో సుమారు నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన పిల్లల విపరీత ప్రవర్తనకు ఓ నిదర్శనం. కొద్ది రోజుల క్రితం నగరంలోని డాబాగార్డెన్స్ సమీపంలో ఓ యువకుడిపై స్నేహితులే కత్తులు, మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. గతంలో తలెత్తిన చిన్నచిన్న వివాదాలకే కక్ష గట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు బాలురే కావడం గమనార్హం. ఆధునిక సమాజంలో ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సెల్ఫోన్లు తదితర సామాజిక మాధ్యమాలు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడడం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివిఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఇటీవల ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులూ మైనర్లే కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన నొక్కి చెప్పింది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. క్రమంగా బానిసలై.. సరదా కోసం స్నేహితుల ప్రోద్బలం, ప్రభావంతో ప్రారంభించిన చెడు అలవాట్లు పిల్లల మెడకు చుట్టుకుంటున్నాయి. రానురాను వీరు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు తక్కువ ధరకు లభించడంతో యువత దీన్ని అధికంగా అభ్యంతరకర పనులకు వినియోగిస్తున్నారు. ఇవి వారి లోచనలను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. సరదా కాస్తా అలవాటుగా మారిపోవడం, దానిలో గంటల తరబడి సమయం గడపడం విద్యా ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యువత భవిష్యత్తును అంధకార బంధురంగా మార్చివేస్తోంది. చెడువైపే ఆకర్షణ ఉన్నత పాఠశాల విద్యకు వచ్చిన నాటి నుంచి పిల్లల్లో విపరీత ఆలోచనలు మొదలవుతున్నాయి. 6, 7 తరగతులకు వచ్చిన ప్రతీ చిన్నారి సెల్‌ఫోన్ వినియోగించడం సాధారణమైపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇచ్చే ఈ చిన్న పరికరం పెను సమస్యలకు కారణంగా మారుతోంది. యుక్తవయస్సులోకి అడుగిడే సమయంలో మంచి కంటే చెడు వీరిని సులభంగా ఆకర్షిస్తోంది. సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలు వీక్షించడం, ధూమపానం, మద్యం వంటివి వీరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ కొరవడితే సులభంగా వీరు తప్పటడుగులు వేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంటి వరకు వివాదాలు స్నేహితులతో వివాదాలు, అనైతిక చర్యలకు పాల్పడటం, మత్తుపదార్థాల సేవనం, ప్రేమ వ్యవహారాలు, విపరీత ధోరణులతో తరచూ వివాదాలకు కేంద్రంగా యువత మారిపోతున్నారు. ఆ వివాదాలు ఇంటిమీదకు రావడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతోంది. గౌరవంగా జీవనం సాగిస్తున్న జీవితాలను అతలాకుతలం చేసే విధంగా యువత ప్రవర్తన ఉంటోంది. బయటకు పొక్కితే, పోలీసుల రికార్డుల్లో నమోదైతే తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందనే భయంతో తల్లిదండ్రులు సమస్యను ఎవ్వరికీ చెప్పకుండా గుండెల్లో దాచుకుంటున్నారు. ఇది యువతకు అవకాశంగా మారిపోయి వారు మరింత బరితెగించి ప్రవర్తించే దిశగా ప్రోత్సహించినట్లుగా మారుతోంది. దీనికి పరిష్కారం చూపుతూ మానసిక నిపుణుల సహకారంతో యువతను చక్కదిద్దే కేంద్రాలు ఏర్పాటు కావడం ఎంతో అవసరం. చెడ్డవారితో స్నేహాలు, వ్యసనాలకు అలవాటు పడిన యువతకు తప్పు చేయడం ఓ అలవాటుగా మారిపోతోంది. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ సరిపోకపోవడంతో ఇంట్లో డబ్బులు దొంగలించడం నుంచి తల్లిదండ్రుల ఏటీఎం కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు తెలుసుకుని నగదు బదిలీ చేసుకునే వరకు వెళ్తున్నారు. వీటిని తల్లిదండ్రులు గమనించకపోవడంతో కొనసాగించడం.. వారికి తెలిస్తే పశ్చాత్తాప భావన లేకుండా ప్రవర్తించడం పరిపాటిగా మారిపోయింది. అబద్ధాలు ఆడటం, పొంతన లేని సమాధానాలు చెప్పడం, నిజాలను దాచడం చేస్తూ వివాదాల్లో, సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తల్లిదండ్రులు వీటిని తెలుసుకునే సమయానికి వీరు చేయిదాటిపోతుండటం జరుగుతోంది. ఒక్కో దశలో తల్లిదండ్రులను ఎదిరించడం, తాను ఇలానే ఉంటానని తెగించి మాట్లాడటం వరకు వస్తోంది. నైతిక విలువలు బోధించాలి పిల్లలకు మార్కులు కాదు.. బిహేవియరల్ క్వాలిటీస్ ప్రధానం. దీనిని తల్లిదండ్రులు గమనించి చిన్నారులను తీర్చిదిద్దాలి. నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులను సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. శతక పద్యాలు, నీతి సూత్రాలు చిన్నారులకు బోధించే ప్రయత్నం జరగాలి. తద్వారా వారి భవిష్యత్ జీవనానికి బలమైన పునాదులు బాల్యంలోనే పడతాయి. – తాతా సందీప్ శర్మ, శతావధాని సమాజం పెను సవాల్ ఎదుర్కొంటోంది ఇంటర్నెట్ యుగంలో పిల్లలకు స్వేచ్ఛ పెరిగిపోయింది. ప్రస్తుతం సమాజాన్ని శాసిస్తున్న ఎలక్ట్రానిక్ గాడ్జాట్స్లో సెల్ ఫోన్ ముందు వరుసలో ఉంది. ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉన్న చాలా మంది తల్లిదండ్రులు వారి పనులకు ఆటంకం కలగకుండా పిల్లలకు సెల్ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దీంతో రెండున్నరేళ్ల నుంచే సెల్ ఫోన్ ప్రభావం పిల్లలపై కనిపిస్తోంది. క్రమంగా పబ్జీ వంటి గేమ్‌లతో పాటు ఆన్లైన్ క్రైమ్స్, అడల్ట్ కంటెంట్స్ ఉన్న వీడియోల వైపు ఆకర్షితులవుతున్నారు. గంటల తరబడి ఫోన్‌కి బానిసలై.. వ్యసనాలకు లోనై నేర మార్గం వైపు అడుగులు వేస్తున్నారు. మద్యం, మత్తుమందులు, సిగరెట్లను స్టేటస్ సింబల్‌గా, హీరోయిజంగా భావిస్తున్నారు. దీంతో సామాజిక బంధాలకు, చదువుకు క్రమంగా దూరమై.. కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. క్రియేటివ్ వర్క్స్, చిన్న చిన్న ఇంటి పనులను అలవాటు చేయాలి. ఇతరులతో స్నేహపూర్వకంగా మెలగడం, విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. – డాక్టర్ భవానీ, క్లినికల్ సైకాలజిస్ట్ -
శశిరేఖ స్వీట్ బాక్స్
ఇంటర్నెట్టూ, శాటిలైట్ టెక్నాలజీ, సెల్ఫోన్లు వగైరాలంటూ మనం ఇప్పుడు భుజాలు తట్టుకుంటున్నాం కానీ, ఇదంతా క్రీస్తుపూర్వం 3102–950 మధ్యలోనే ఉంది అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్! అన్నీ వేదాలలోనే ఉన్నాయట అని కొందరంటూ ఉంటారు. అలాగే ఈ ఇంటర్నెట్టూ, శాటిలైట్ టెక్నాలజీ కూడా ఇప్పటిదేమీ కాదు, మహాభారతం నాటి నుంచే ఉందని అంటున్నారు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌కుమార్ దేవ్. ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది ముఖ్యమంత్రిగా కాదు, తాను ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఒక వర్క్‌షాప్‌లో. ఇటీవల అగర్తలాలో కంప్యూటరీకరణ, సంస్కరణలపై ఒక వర్క్‌షాప్ జరిగింది. ఆ వర్క్‌షాప్‌కి చీఫ్‌గెస్ట్‌గా విచ్చేశారు విప్లవ్ దేవ్. ఇంటర్నెట్టూ, శాటిలైట్ టెక్నాలజీ, సెల్ఫోన్లు వగైరాలంటూ మనం ఇప్పుడు భుజాలు తట్టుకుంటున్నాం కానీ, ఇదంతా క్రీస్తుపూర్వం 3102–950 మధ్యలోనే ఉంది అన్నారు విప్లవ్! ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికొచ్చిన పాత్రికేయులను కూడా వదిలిపెట్టలేదాయన. రిపోర్టర్లు, జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు అంటూ ఇప్పుడు ఏవేవో చెప్పుకొస్తున్నారు కానీ, నా దృష్టిలో సిసలైన రిపోర్టరు సంజయుడే. పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్ర మహారాజుకు కురుక్షేత్ర యుద్ధంలో జరిగే ప్రతి ఘట్టాన్నీ సంజయుడు పూసగుచ్చినట్టు వర్ణించడం రిపోర్టింగ్ కాదంటారా? అసలు ‘మాయాబజార్’ వంటి కళాఖండాన్ని తీసిన కేవీ రెడ్డి 1957లోనే ఇప్పటి అత్యాధునిక టెక్నాలజీ ఏమీ వాడకుండానే శశిరేఖా అభిమన్యులు ‘ప్రియదర్శిని’ అనే పెట్టె ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీని వాడినట్టు చూపెట్టలేదా? అంటున్నారు. ‘నా ప్రియుడు ఇప్పుడెలా ఉన్నాడో ఏమో’ అని బెంగపెట్టుకున్న శశిరేఖ (సావిత్రి)కి, శ్రీకృష్ణుడు (ఎన్టీఆర్) ఒక అందమైన వజ్రపు పేటిక నిచ్చి దానిలో అభిమన్యుడితో శశిరేఖను సంభాషించనివ్వడమే కాదు, వారిద్దరూ పాడుకునే సన్నివేశాన్ని కూడా అత్యద్భుతంగా తీయలేదా? అంటూ మాయాబజార్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను గుర్తు చేశారు. ప్రాచీన భారతానికి, ఆధునిక టెక్నాలజీకి ముడిపెడుతూ త్రిపుర ముఖ్యమంత్రి చెప్పిన ఉదాహరణలు వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి ఆసక్తి కలిగించాయో లేదో కానీ, విప్లవ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిన నిర్వాహకులకు మాత్రం కొరుకుడు పడలేదు. సీఎం గారికి మహాభారతమంటే ఆసక్తి ఉండచ్చు. మాయాబజార్ చిత్రమంటే అమితమైన ఇష్టం ఉండి ఉండవచ్చు కానీ, మోడరన్ టెక్నాలజీ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతారు కదా అని పిలిస్తే ఇలా పాతచింతకాయ పచ్చడిని తీసి అందరికీ రుచిచూపించడమేంటా అని లోపల్లోపల తలలు పట్టుకున్నారు. – డి.వి.ఆర్. -
శ్రీనగర్ జైలులో సెల్ఫోన్లు, జిహాదీ సాహిత్యం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని సెంట్రల్ జైలులో జాతీయ దర్యాప్తు విభాగం (ఎన్ఐఏ) జరిపిన ఆకస్మిక సోదాల్లో పెద్ద మొత్తంలో సెల్ఫోన్లు, జిహాదీ సాహిత్యం, ఐపాడ్, పెన్‌డ్రైవ్, పాకిస్తాన్ జాతీయ జెండా బయటపడ్డాయి. ఈ జైలులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు శిక్ష అనుభవిస్తున్నారు. డ్రోన్ల నిఘా మధ్య, సిబ్బంది జైలు బ్యారక్లతోపాటు ఆవరణను క్షుణ్నంగా గాలించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద 25 సెల్ఫోన్లు, కొన్ని సిమ్ కార్డులు, 5 మెమరీ కార్డులు, 5 పెన్‌డ్రైవ్‌లు, ఒక ఐపాడ్, జిహాదీ సాహిత్యంతో కూడిన కీలక పత్రాలు, పాక్ జాతీయ పతాకం లభ్యమయ్యాయి. -
సెల్.. నో ఎంట్రీ!
... ఈ మాట వినగానే ఒక్కసారి గుండె ఆగినంత పనైందా? అర్ధరాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినట్లు ‘సెల్ ఫోన్లు బంద్’ అనే ప్రకటన ఏమైనా చేశారా? నోట్లు రద్దయినా తట్టుకున్నాం కానీ... చేతిలో సెల్ (మొబైల్) లేకుంటే ఎలా? బాడీలో ఏదో పార్ట్ తీసేసినట్టే కొందరు ఫీలవుతుంటారు. ఈ సెల్‌కి బంద్.. ప్రజలకు కాదు! ‘సాహో’ యూనిట్‌కి మాత్రమే! మేటర్ ఏంటంటే... ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగులోకి ఇకపై సెల్ ఫోన్స్‌కి ఎంట్రీ లేదట. షూటింగ్ స్పాట్‌కి ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురాకూడదని రూల్ పెట్టారట. ఎందుకంటే... భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సిన్మా స్టిల్స్, లొకేషన్లో ఫొటోలు బయటకొస్తే సినిమా రిలీజ్ సమయానికి ఇంట్రెస్ట్ తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే... లాకర్ రూమ్‌లో పెడుతున్నారట. గుడికో, బడికో వెళితే లాకర్రూమ్లో పెడతారు కదా, అలాగ! త్వరలో దుబాయ్‌లోని అబుదాబీలో జరగనున్న షెడ్యూల్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందట. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఖైదీలతో సెల్ఫోన్లు.. పోలీసులు అటెన్షన్!
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని ఓ జైలులో ఖైదీలతో సెల్ఫోన్లు ఉండటం కలకలం రేపింది. బారాముల్లా పోలీసులు, జైలు అధికారులు ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సబ్ జైలులో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వస్తువులు ఖైదీల వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీలలో భాగంగా కొందరు ఖైదీల వద్ద నుంచి 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టినట్లు చెప్పారు. జైలులో ఉన్న ఖైదీలకు సెల్ఫోన్లు ఎవరు అందించారు, వారు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు.. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జైలులో కుట్రపూరిత వస్తువులు ఉన్నాయని సమాచారం అందుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు జైలుకు రాగా వీరితో కలిసి జైలు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సెల్ఫోన్లతో పాటు మరికొన్ని అనుమానిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖైదీలకు సెల్ఫోన్లు ఎవరు అందించారన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్టు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరంలో ఆటోల్లో తిరుగుతూ సెల్ఫోన్లు, నగదు దొంగతనాలకు పాల్పడే ఏడుగురు పాత నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. వారి వద్ద నుంచి ఆటో, 38 సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గురువారం వ్యాస్ ఆడిటోరియంలో ఆయన నిందితుల వివరాలను మీడియాకు తెలిపారు. పందిపాడుకు చెందిన సయ్యద్ షేక్షావలి(32), షేక్షావలి(20), షేక్వలిబాషా(39), కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఎంతేజ(20), ముజాఫర్‌నగర్‌కు చెందిన షేక్ షేక్షావలి(20), ప్రకాష్‌నగర్‌కు చెందిన అక్బర్‌బాషా అలియాస్ బిల్లి, కర్నూలు పెద్ద మార్కెట్‌కు చెందిన షేక్ మదార్ షా(47) నగరంలోని ముజాఫర్‌నగర్ కేంద్రంగా నివాసం ఉంటూ ఆటోల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల జేబుల్లో ఉన్న సెల్ఫోన్లు, నగదును చాకచక్యంగా తస్కరించేవారు. ఎక్కువ రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లలో వీరు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. పైగా వీరిద్దరూ జేబు దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్షను కూడా అనుభవించారు. ఇలా దొరికారు ఇటీవల టుటౌన్ పోలీసు స్టేషన్లో ఐదుగురు వ్యక్తులు తమ సెల్ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ రమణమూర్తి, సీఐ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో పాత నేరస్తుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. వీరు దొంగిలించిన ఫోన్లను కొన్నాళ్లు వాడిన తరువాత అమ్ముకుంటారు. అయితే రోజుకోక ఫోన్ వాడుతుండడంతో ప్రవర్తనపై అనుమానం వచ్చి బంగారుపేట జంక్షన్ సమీపంలో ఆటోలో వెళ్తుండగా పోలీసులు పట్టుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. వారి వద్ద నుంచి 38 సెల్ఫోన్లతోపాటు రూ.15 వేల నగదు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2.30 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులను హార్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కాగా, సెల్‌ఫోన్ దొంగలపై నిçఘా ఉంచి నిందితులను పట్టుకున్న టూటౌన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, సీహెచ్ ఖాజావలి, పి.మోహన్‌కిషోర్‌రెడ్డి, కానిస్టేబుల్ సీహెచ్ అమర్నాథ్రెడ్డి, కృష్ణ, అయూబ్‌ఖాన్‌లను ఎస్పీ అభినందించి రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లను ఎలా కొట్టేస్తారో నిందితులతోనే చేసి చూపించారు. దొంగ ఫోన్లను కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తాం... దొంగల నుంచి సెల్ఫోన్ల వ్యాపారులు కొందరు పాత ఫోన్లను తక్కువగా వస్తున్నాయని కొనుగోలు చేస్తున్నారని, అలా కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఎక్కడైన సరే ఎవరిపైనైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సెల్ఫోన్లను పొగొట్టుకుంటే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. -
40 సెల్ఫోన్లు చోరీ
మచిలీపట్నం (కోనేరుసెంటర్) : మచిలీపట్నంలోని ఓ సెల్‌ఫోన్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 1.60 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు, మెమెరీ కార్డులను దుండగులు అపహరించారు. ఎస్సై బాషా తెలిపిన వివరాల ప్రకారం రామానాయుడుపేటకు చెందిన పరకాని లక్ష్మీనారాయణ బుట్టాయిపేటలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి వ్యాపారం ముగిసిన అనంతరం షాపునకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం షాపు తెరచి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. అనుమానం వచ్చిన నారాయణ ఆర్‌పేట పోలీసులకు ఫోన్లో సమాచారం అందించాడు. సీఐ వరప్రసాద్, ఎస్సై బాషా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైభాగంలోని సీలింగ్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించినట్లుగా గుర్తించారు. 40 సెల్ఫోన్లు, మెమెరీ కార్డులు, పవర్‌బ్యాంకులు, ఇతర వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్: ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు గురువారం రాత్రి పోలీసులు రంగంలోకి దిగారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 75 వేల నగదుతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఓన్లీ సెల్‌ఫోన్స్..!
హైదరాబాద్: కేవలం సెల్ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌టాప్స్‌ను తస్కరిస్తున్న దొంగను చిక్కడపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండల రమేష్ హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. వ్యసనాలకుబానిసైన అతడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సెల్ఫోన్ల దొంగగా మారాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్న రమేష్... అర్ధరాత్రి వేళల్లో రెసిడెన్షియల్ ఏరియాల్లో సంచరిస్తూ రెక్కీ చేస్తాడు. గాలి కోసమో, మరో కారణంతోనే తలుపులు, కిటికీలు తెరిచి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. తెల్లవారుజామున వాటిలోకి ప్రవేశించి కేవలం సెల్ఫోన్లు మాత్రమే తస్కరిస్తాడు. అవి దొరక్కపోతే మాత్రమే ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ‘జోలికి వెళ్తాడు’. ఈ పంథాలో నేరాలు చేస్తూ 2014 మేలో గోపాలపురం పోలీసులకు చిక్కాడు. బయటకు వచ్చినా మళ్లీ చోరీలు మొదలుపెట్టి చిక్కడపల్లి, గోపాలపురం, నారాయణగూడ ఠాణాల పరిధిలో చోరీలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు అతనిని అరెస్టు చేసి 20 ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. -
ఓ గొప్ప చరిత్ర
ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్టాపులూ, సెల్ఫోన్లూ, ఐపాడ్లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్తకాల మధ్యనే ఉన్నాను’ అన్నారు. కాలం మానవ మనోఫలకం మీద చేసిన సంతకం చరిత్ర. ఈ సంతకాలు అనేకం. అపూర్వం. అనూహ్యం. విచిత్రం. విడ్డూరం. మరొకప్పుడు అసంబద్ధమైన విపర్యయం. కొందరు రచయితలు జీవితమంతా పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తారు. చేస్తూనే ఉంటారు. వాళ్లతో పాటే వారి జ్ఞాపకాలూ కాల గర్భంలో కలసి పోతాయి. కొందరు ఇబ్బందిగా, ముక్తసరిగా, క్లుప్తంగా తమ మనసుని పేజీల్లో విప్పుతారు. చరిత్ర వారిని గుండెల్లో పొదువుకుంటుంది. రాసికాదు, వాసి- అన్నది పాత నానుడి. ఒకావిడ 89 సంవత్సరాల కింద పుట్టింది. 35 సంవత్సరాలు ఏమీ రాయాలనుకోలేదు. రాసినా ఏవేవో రాసింది. తన 35వ యేట - తన అనుభవాలు, జ్ఞాప కాలలో నుంచి - ఇద్దరు పసివారి మనసుల్లో ఆలోచనల రూపంగా ఒక నవల పుట్టింది. ఆ నవల ఆమెకే కాదు, ఆమె దేశానికీ, నవలా సాహిత్యానికీ, ఈ దశాబ్దపు రచనలకీ మకుటాయమానమైంది. ఆ రచయిత్రి పేరు హార్పర్ లీ. ఆమె ఇటీవలే కన్నుమూసింది. నల్లవారి పట్ల వివక్ష ఎక్కువగా ఉన్న ఆనాటి అలబామాలో మన్రోవిల్లీ ప్రాంతంలో ఒక నల్లజాతీయుడు తెల్ల జాతి అమ్మాయిని మానభంగం చేశాడన్న తప్పుడు కేసును నల్లవాని తరఫున వాదించిన తెల్ల లాయరు కథ ఇతివృత్తం. అసలు లీ నవలే రాయాలనుకోలేదు. ఎలా రాయాలో తెలీదు. తన 31వ యేట మొదట ఒక నమూనా ప్రతిని రాసింది. ఆమె అదృష్టవశాత్తు ఆ స్క్రిప్ట్ హోహోఫ్ టోర్నీ అనే ఆవిడ చేతిలో పడింది. ఆ రచనలో మంచి నవల లేదు. కాని మంచి నవలకి ప్రాతిపదికను గుర్తు పట్టింది. తర్వాత కేవలం రెండు సంవత్సరాలు లీతో చర్చలు జరిపి సంఘటనలను కుదించి, కత్తిరించి, కుట్టి, సవరణలు చేసి, మళ్లీ మళ్లీ తిప్పి రాయడం సాగుతూ వచ్చింది. ఓసారి విసుగెత్తి తన రచన మీద తనకే తృప్తి లేక ఓ శీతాకాలం రాత్రి చేతిలోని రచనని కిటికీలోంచి బయటకు మంచులో పారేసింది. ఇది తెలిసిన హోహోఫ్ నచ్చ చెప్పి వెంటనే ఆ కాగితాలను వెనక్కు తీసుకురమ్మని ఒత్తిడి చేసింది. ఎట్టకేలకు ఒక నవల రూపుదిద్దుకుంది. ఆ నవల పేరు ‘టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’. ఆ పుస్తకం కేవలం 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో 74 శాతం స్కూళ్లలో పాఠ్య పుస్తకమయింది. పులిట్జర్ బహుమతిని దక్కించుకుంది. 1999లో లైబ్రరీ జర్నల్ ఈ నవలని ఈ శతాబ్దపు గొప్ప నవలగా అభివర్ణించింది. తర్వాత 54 సంవత్స రాలు ఏమీ రాయలేదు. హార్పర్ లీ న్యూయార్క్‌లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో రిజర్వేషన్ గుమాస్తాగా పనిచేసింది. అప్పటి ఆమె పాప్యులారిటీకి ఒక్క ఉదాహరణ- 1956లో ఒక అభిమాని ఆమెకి ఒక సంవత్సరం పాటు జీతం కలసి వచ్చే పైకం చెక్కు పంపుతూ, ‘మీరు సంవత్సరం పాటు ఉద్యోగాన్ని వదిలి రచనలు చెయ్యండి. క్రిస్టమస్ శుభాకాంక్షలు’ అన్నాడు. 1962లో అప్పటి ప్రముఖ నటుడు గ్రిగరీ పెక్ లాయరుగా నటించిన చిత్రం అమెరికా సినీరంగంలో మరొక చరిత్రను సృష్టించింది. ఆ చిత్రానికి మూడు ఆస్కార్ బహుమతులు, ఉత్తమ నటనకు గ్రిగరీ పెక్కు ఆస్కార్ బహుమతి లభించాయి. విచిత్రం ఏమిటంటే ఆమెకి కీర్తి అన్నా, పరపతి అన్నా, పదిమందిలోకి రావడమన్నా ఇష్టం లేదు. సభల్లో పాల్గొనడం, అవార్డులు, గౌరవాలను స్వీకరించడం ఆమెకి నచ్చదు. ఆమె పెళ్లి చేసుకోలేదు. 2011లో ఒక ఆస్ట్రేలియా పత్రికా సంపాదకుడితో మాట్లాడుతూ, ‘‘ఇక నేనెప్పుడూ రచన చెయ్యను. అందుకు రెండు కారణాలు. 1. ఎంత డబ్బిచ్చినా నా నవల కారణంగా నా మీద వచ్చిన ఒత్తిడి, ప్రచారాన్ని నేను తట్టుకోలేను. 2. నేనేం చెప్పాలనుకున్నానో చెప్పేశాను. దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం నాకిష్టం లేదు’ అన్నారు. 2006 మే 7న ప్రపంచ ప్రఖ్యాత ప్రదర్శకురాలు ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్టాపులూ, సెల్ఫోన్లూ, ఐపాడ్లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్త కాల మధ్యనే ఉన్నాను’ అన్నారు. ముగ్గురు అమెరికా అధ్యక్షులు ఆమెకి తమ దేశపు అత్యున్నత గౌరవంతో సత్కరించారు. చివరి రోజుల్లో చూపు తగ్గి, బొత్తిగా కనిపించక, వినిపించక, జ్ఞాపకాలను మరచిపోతూ, వృద్ధాప్యం మీద పడగా వీల్‌చైర్‌లో తిరుగుతూ ఒక శరణాలయంలో, తను పుట్టిన ఊరు మన్రోవిలీలో నిద్రలో కన్నుమూసింది. కిందటి సంవత్సరమే ‘గో సెట్ ఏ వాచ్‌మేన్’ అనే ఆమె నవల ప్రతి బయటపడింది. కానీ అది మొదటి నవలకి మొదటి రూపమని చాలామంది తేల్చేశారు. అయినా మొదటి రోజుల్లోనే ఆ నవల 2 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. కొందరు చరిత్రను సృష్టిస్తారు. కొందరు తెర వెనుకనే జీవించి, ఏకాకిగా గడిపి, ఒంటరి జీవితాన్నే చరిత్రగా చేసుకుంటారు. కాలం మనోఫలకం మీద చెక్కిన విపర్యయం కూడా చరిత్రే. - గొల్లపూడి మారుతీరావు -
అటవీ సిబ్బంది అంటూ బురిడీ.. ఐదుగురు అరెస్ట్
హయత్‌నగర్: యువతీ, యువకులను బెదిరించి నగలు, సెల్ఫోన్లు, కెమెరాలు అపహరించుకపోయిన ఐదుగురు దొంగల ముఠా సభ్యులను బుధవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్‌కు చెందిన ఒకే అపార్ట్మెంట్లో నివసించే ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఈ నెల 5న తట్టిఅన్నారం పరిధిలోని వనస్థలిహిల్స్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మన్సూరాబాద్‌కు చెందిన అబ్ధుల్ ఖాదర్ కొడుకు అబ్ధుల్బైరి, బాతుని వెంకటేష్ కుమారుడు సునీల్, కొంగర్ ఆంజనేయులు కొడుకు శివప్రసాద్, రాయపురం స్వామి కొడుకు రాజశేఖర్, శ్రీరాముల నర్సింహ్మ కొడుకు నవీన్‌లు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బంది మంటూ బెదిరించారు. వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి బంగారు నగలు, సెల్ఫోన్లు, కెమెరా, రెండు వాచీలు లాక్కున్నారు. దీంతో బాధితులు ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన మూడు బంగారు గొలుసులు, ఒక రింగు, ఐదు సెల్ఫోన్లు, ఒక కెమెరా, రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు. -
జగదీశ్ మార్కెట్లో కార్డన్‌సెర్చ్
-
జగదీశ్ మార్కెట్లో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్ సిటీ: అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని అణువణువు జల్లెడ పట్టారు. రూ.లక్ష నగదుతో పాటు 57 బైక్‌లను, సుమారు 200 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వేధించడానికి 30 ఫోన్లు మార్చాడు!
అదే సంఖ్యలో సిమ్‌కార్డులు వినియోగం ఎట్టకేలకు షీ-టీమ్‌కు చిక్కిన నిందితుడు మరో కేసులో ఓ విద్యార్థికీ అరదండాలు సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సంక్షిప్త సందేశాల ద్వారా ఓ వివాహితను వేధించడానికి ఏకంగా 30 సెల్ఫోన్లు మార్చాడు. అదే సంఖ్యలో సిమ్కార్డులూ వినియోగించాడు. చివరకు విషయం షీ-టీమ్స్‌కు చేరడంతో బుధవారం పట్టుబడి కటకటాల్లోకి చేరాడు. ఇతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. ఇదే తరహా నేరానికి పాల్పడిన మరో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఓ మైనర్‌నూ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసినట్లు ఆమె వివరించారు. అంబర్పేట్ పరిధిలోని లాల్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాజిద్ హుస్సేన్ ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీలో ఉద్యోగి. అదే ప్రాంతంలో నివసించే ఓ వివాహితను వేధించడం ప్రారంభించిన ఇతగాడు దీనికోసం వివాహితకు సంబంధించిన అసభ్య వ్యాఖ్యలు, పరుష పదజాలంతో ఆమె భర్త, అత్తమామల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాడు. దీనికోసం దాదాపు 30 సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లు, అదే సంఖ్యలో బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వాడాడు. ఓ సెల్ఫోన్లో సిమ్‌కార్డు వేసి ఈ చర్యలతో వివాహిత కుటుంబ జీవితం ఇబ్బందుల పాలైంది. విసిగిపోయిన బాధితురాలు షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం సాజిద్ హుస్సేన్ ను బాధ్యుడిగా గుర్తించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అంబర్పేట్ పోలీసులకు అప్పగించాయి. సాజిద్ వినియోగించిన ఫోన్లన్నీ వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైనవిగా గుర్తించిన పోలీసులు అవి అతడి దగ్గరకు ఎలా వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రాంతానికి చెందిన కె.శ్రీశైలం విద్యార్థి. ఓ యువతిపై వేధింపులు ప్రారంభించిన ఇతగాడు ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులకూ అసభ్యపదజాలంతో కూడిన ఎస్సెమ్మెస్‌లు పంపాడు. యువతిని బెదిరిస్తూ కొన్ని ఈ-మెయిల్స్ చేశాడు. ఈ కేసునూ పర్యవేక్షించిన షీ-టీమ్స్ బుధవారం శ్రీశైలాన్ని అరెస్టు చేసి పెట్టీ కేసు నమోదు చేశాయి. నగరానికి చెందిన ఓ మైనర్ పరిచయస్థురాలైన బాలిక ఫొటోలు ఫేజ్‌బుక్‌లో పెట్టడంతో పాటు ఆమె తండ్రికీ ఆన్లైన్లో పంపిస్తూ వేధించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మైనర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, భవిష్యత్తులో పునరావృతం కాకూడదని హెచ్చరించి విడిచిపెట్టారు. -
బాలుడి కిడ్నాప్.. నిందితుల అరెస్ట్
హైదరాబాద్ : ఎల్బీనగర్లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ప్రగతి విజయ్ పాత్రో మార్బుల్ యజమాని ఆశిష్ కుమార్ కుమారుడైన యశేష్ విజయ్ పాత్రోని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడిని వదిలిపెట్టాలంటే రూ.కోటి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ బాబు జాన్సన్ గ్రామర్ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్నాడని, ఇతర వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు రాత్రి బాలుడిని ఇండికా కారులో వచ్చి వనస్థలిపురంలో వదిలివెళ్లారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మనోహర్, భానుప్రసాద్ లతో పాటు మరో ఇద్దరిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను మంగళవారం మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కిడ్నాపర్లలో బాలుడి సమీప బంధువు కూడా ఉన్నాడని, డబ్బు కోసమే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల నుంచి ఓ కారు, మత్తు పదార్థాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
మహానందిలో సెల్పోన్ల నిషిద్ధం
మహానంది : కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులను సెల్ఫోన్లతో ఆలయంలోకి రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ శంకర వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లు, కెమెరాలను ఆలయంలోకి అనుమతించమని చెప్పారు. అలాగే రుద్రగుండం, రెండు చిన్న కోనేరులలో పుణ్యస్నానాలాచరించే భక్తులు సాంప్రదాయ దుస్తులను దరిస్తేనే స్నానాలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. బీడీలు, సిగిరెట్లు, గుట్కాలు ఆలయంలోకి అనుమతించకుండా, రాజగోపురం వద్ద తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పవిత్రతకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. -
ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్
లండన్: మీరు అర్జెంట్‌గా ఫోన్ మాట్లాడుతున్నారు. అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చేతిలో ఉన్న ఫోన్‌ను తీసి విసిరి కొట్టాలనిపిస్తోంది కదా! అయితే మీలాంటి వారి కోసమే కేవలం ఆరే ఆరు నిమిషాల్లో ఫుల్ చార్జ్ అయ్యే బ్యాటరీ ఉందండి. అల్యూమినియంతో నిండిన క్యాప్సుల్స్ మీ సెల్‌ఫోన్‌ను ఆరు నిమిషాల్లో చార్జ్ చేస్తుంది. ప్రస్తుతమున్న లిథియం అయాన్ బ్యాటరీ కంటే దీనికి 4 రెట్లు సామర్థ్యం అధికంగా ఉండడమే కాదు, చార్జింగ్ తర్వాత ఎక్కువ సమయం వాడుకునే వీలుంటుంది. లిథియం బ్యాటరీలో అల్యూమినియం వాడకం విషయంలో తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ బీజింగ్‌లోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సింగ్వా యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఇందులో అల్యూమినియం చుట్టూ టైటానియం డై ఆక్సైడ్ కవచం ఉంటుంది. ఈ కవచం బ్యాటరీ రుణాత్మక ఎలక్ట్రోడ్‌గా పనిచేస్తుంది. -
ఆలయ భద్రత ‘గోవిందా’
- సెల్ఫోన్లు, కెమెరాలతో ఆలయంలోకి అనుమతి - తూతూమంత్రంగా సిబ్బంది తనిఖీలు - నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీటీడీ యంత్రాంగం చంద్రగిరి : ఏడు లోకాలను రక్షించే ఏడుకొండల వాడికి రక్షణ కరువైంది. శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అటువంటి ఆలయానికి భద్రత విషయంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నారాయణవనంలో శ్రీవారు పద్మావతి దేవిని వివాహం చేసుకుంటారు. అనంతరం దేవేరులు తిరుమలకు పయనమౌతారు. అయితే తొం డవాడ స్వర్ణముఖినది ఒడ్డున వెలసిన శ్రీఅగస్త్య మహాముని వివాహానంతరం దేవేరులు తిరుమలకు వెళ్లడం మంచిదికాదని వివరిస్తారు. దానికి అణుగుణంగా శ్రీనివాసుడు అమ్మవారితో కలసి ఆరు నెలల కాలం పాటు శ్రీనివాస మంగాపురంలో నివ శించాడని అందుకే ఆ గ్రామం శ్రీనివాస మం గాపురంగా నిలిచిందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా భక్తులు తిరుమలలో నిర్వహించలేనటువంటి సేవలను మంగాపురాలయంలో నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలకు కాలినడకన చేరుకోవడానికి శ్రీవారి మొట్టుదారి దగ్గరవడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అంతటి ప్రాముఖ్యత గల దేవాలయం శ్రీనివాస మంగాపురం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంపై టీటీడీ అధికారులు శీత కన్ను వేశారు. శ్రీనివాస మంగాపురంలోని స్వామివారిని దర్శిం చుకోవడానికి వస్తున్న భక్తులకు కనీస అవసరాలను తీర్చడంలో టీటీడీ పూర్తి గా వైఫల్యం చెందిదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు రోజుకు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆలయ పరిసరాలలో ఎక్కడాకాని లగేజి కౌంటర్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేదేమిలేక భక్తులు తమ లగేజీతోపాటే ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు నిషేధమని అధికారులకు తెలిసినా కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నా రు. సిబ్బంది సైతం భక్తులకు సూచనలు ఇస్తున్నారే తప్ప వారిని తనిఖీ చేసిన దాఖలు లేవు. దీంతో భక్తులు ఆలయంలోకి సెల్ఫోన్లు, వీడి యో కెమెరాలతో ప్రవేశిస్తున్నారు. భక్తులు అలయంలో ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తుండటంతో తోటి భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని తిరుమల తరహాలో ఆలయ సమీపం లో సెల్ ఫోన్, లగేజి కౌంటర్ల ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
ఇంజినీరింగ్ కాలేజీలో 17 సెల్ఫోన్లు చోరీ
ఆదిబట్ల: ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు చెందిన 17 సెల్ఫోన్లు చోరీ అయ్యాయి. వాటిలో 14 ఫోన్లను పోలీ సులు రికవరీ చేశారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు వెంకట్‌రెడ్డి, అతని మిత్రులు పరీక్ష రాసేందుకు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని శేరిగూడలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చారు. కళాశాలలో సెల్ఫోన్లు భద్రపర్చడానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వెంకట్‌రెడ్డి, అతడి మిత్రులు తమ 17 సెల్ఫోన్లను ఓ బ్యాగు లో ఉంచి కౌంటర్లో అప్పగించి టోకెన్లు తీసుకున్నారు. పరీక్ష అనంతరం గుర్తుతెలియని ఓ వ్యక్తి నకిలీ టోకెన్లతో విద్యార్థులకు చెందిన 17 సెల్ఫోన్లు ఉన్న బ్యాగును అపహరించుకుపోయారు. విష యం తెలుసుకున్న విద్యార్థులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం ఆధారంగా పోలీసులు ఓ బ్యాగ్‌లో లభించిన 14 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘సెకండ్’ సెల్ఫోన్లు కొనుగోలు చేయొద్దు
చాదర్‌ఘాట్: సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లను రసీదులు లేకుండా కొనుగోలు చేయవద్దని సుల్తాన్ బజార్ ఏసీపీ రావుల గిరిధర్ సూచించారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెకండ్‌హ్యాండ్ సెల్ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తప్పకుండా రసీదులు తీసుకోవాలన్నారు. ఒకవేళ రసీదులు లేకుండా కొనుగోలు చేస్తే, వాటి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు కొనుగోలుదారులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సెల్ఫోన్లను కొందరు దొంగలించి తక్కువ ధరకు అమ్ముతూ వినియోగదార్లను ఆకర్షిస్తున్నరన్నారు. అలాగే ఆటోల్లో ప్రయాణించేప్పుడు తప్పనిసరిగా ఆటో నంబర్‌ను రాసుకోవటం లేదా గుర్తు పెట్టుకోవటం చేయాలన్నారు. ఇటీవల ఆటోల్లో ప్రయాణించే వారిపై దాడి చేసి నగదు, సెల్ఫోన్లు దోపిడీ చేస్తున్నందున ప్రజలకు ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు ఏసీపీ చెప్పారు. -
సెల్ఫీ.. క్రేజీ!
అందంగా ముస్తాబయ్యి కొత్తబట్టలు వేసుకొని ఫొటో స్టూడియోకి వెళ్లి.. ఫ్లవర్వాజ్పై చేయి వేసి నిటారుగా నిల్చుని ఫొటో దిగడం ఒకనాటి మాట. ఇప్పుడు పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్స్‌కు తప్ప ఫొటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. సెల్‌ఫోన్స్‌లో కెమెరా ఫొటోల్లో ఓ విప్లవాన్నే తెచ్చింది. ఎవరో ఒకరు ఫొటో తీయడం పక్కకు పోయి... ఫ్రంట్ కెమెరాలతో సెల్ఫీస్ వచ్చాయి. తరువాత ఆ స్థానంలో గుల్ఫీస్, హెల్ఫీస్, వేల్ఫీస్... ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పెల్ఫీస్! ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్స్, హై రిజల్యూషన్ కలిగిన ట్యాబ్స్, మొబైల్స్‌కి ఆదరణ పెరిగింది. దాంతో తమ క్లాస్మేట్స్, పేరెంట్స్ ఫేవరెట్ ప్లేస్‌లో గుల్ఫీలు తీసుకుని మురిసిపోయిన నగరవాసులు ట్రెండ్‌ని సృష్టించారు. అతివలు తమ అందమైన కురులను మాత్రమే ఫొటో తీసి దానికి హెల్ఫీగా నామకరణం చేసి సోషల్ నెట్‌వర్క్స్‌లో అప్లోడ్ చేశారు. ఆ తరువాత వర్కవుట్స్ వంతు వ చ్చింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫొటోస్ను తీసి వాటిని ‘వెల్ఫీ’లుగా అప్డేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా... ఈ కోవలోకే చేరింది ‘పెల్ఫీ’! తమ బెస్ట్ బడ్డీలుగా పెంచుకుంటున్న పెట్స్‌తో సెల్ఫీలు దిగి.. సోషల్వెబ్సైట్స్లో, వాట్సప్‌లలో ప్రొఫైల్ పిక్చర్స్‌గా పెట్టేస్తున్నారు. అంతేకాదు ఆ ఫొటోకి తగ్గ కామెంట్ రాసి తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి తమ పెట్స్‌ని పార్లర్‌కి తీసుకెళ్లి, గ్రూమింగ్ చేయించి యాక్సెసరీస్ వేసి మరీ అందంగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. దానికి వచ్చే లైక్స్, కామెంట్స్‌ను చూసుకుని మురిసిపోతున్నారు. షార్ట్ ఫిలింస్... అయితే ఈ తరహా పెట్స్ ప్రిఫరెన్స్ వెస్ట్రన్ కంట్రీస్‌లో పాతదే! మన దేశంలోకి ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీస్, బిజినెస్‌మెన్స్, నిత్యం బిజీగా ఉండే పొలిటీషియన్స్ సైతం తీరిక దొరికినప్పుడల్లా రిలాక్స్ అవ్వడానికి ఇదే రూట్‌ని ఎంచుకుంటున్నారు. ‘పెల్ఫీ’స్తో కాలక్షేపం చేస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరైతే... తమ పెట్స్‌తో ఏకంగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలే తీస్తున్నారు. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ‘పెల్ఫీస్’ ట్రెండ్ సెలబ్రిటీస్‌కి కాలక్షేపం... సాధారణ జనానికి ఆసక్తిగా మారింది! - సిరి -
చర్లపల్లి జైల్లో ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఖైదీలనుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ నుంచి ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఎంఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ పహిల్వాన్ తో పాటు, అండర్ ట్రయల్ ఖైదీ నుంచి కూడా ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ నివారణలో భాగంగా హోమియో మందులు పంపిణీచేస్తుండగా వారి వద్ద ఏడు సెల్ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు బయటపడినట్టు చర్లపల్లి పోలీసులు పేర్కొన్నారు. -
బెంగళూరు మాదిరిగా వైఫై నగరంగా..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో బెంగళూరు మహానగరం తొలి ఫ్రీ వైఫై నగరంగా పేరొందింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నిత్యం మూడు గంటలపాటు సెల్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్‌తో ఉచితంగా నెట్ బ్రౌజ్ చేసుకునే సౌకర్యంతోపాటు500 ఎంబీ డేటా ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం విశేషం. నగరం నలుమూలల కూ వైఫై సౌకర్యం కల్పించేం దుకు కర్నాటక ఐటీ శాఖ ప్ర యత్నాలు ముమ్మరం చేసింది. డి-వాయిస్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. వై-ఫైని విని యోగిస్తున్న వారు ఏ హ్యాండ్ సెట్ వినియోగించారు, ఏ సమాచారం డౌన్లోడ్ చేసుకున్నారో సర్వర్ ద్వారా పసిగట్టే వీలుండడంతో పూర్తి భద్రత గల వై-ఫై నగరంగా ప్రా చుర్యం పొందింది. ఉచిత పార్కింగ్ యాప్ ద్వారా మీరున్న చోటు నుంచి దగ్గరున్న పార్కింగ్ కేంద్రాలు, గార్బేజ్ యాప్ ద్వారా చెత్త ఎక్కడ పడవేయాలో తెలుసుకోవడం ఈ వై-ఫై ప్రత్యేకత. అదే స్ఫూర్తితో.. కొత్త ఏడాదిలో బెంగళూరు బాట లో మన సైబర్‌సిటీగా పేరొందిన హైదరాబాద్ మహా నగరం కూడా వై-ఫై బాటలో వేగంగా ముందుకెళుతోంది. హైటెక్‌సిటీ, మాదాపూర్ పరిధిలో 8 కిలోమీటర్ల పరిధిలో 17 కేంద్రాల వద్ద వైఫై సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌సిటీ దిశ గా హైదరాబాద్ దూసుకుపోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ ఇతర వైఫై ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తున్న వారికి సాంకేతిక సేవలను ఉచితంగా వినియోగించుకునే సౌలభ్యం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ నిత్యం 750 ఎంబీ నిడివిగల వైఫై సేవలను వినియోగించుకోవచ్చు. వైఫై సేవల కోసం హైటెక్‌సిటీ మాదాపూర్ పరిధిలో మొత్తం 17 చోట్ల ఎయిర్టెల్ సంస్థ ప్రత్యేక పోల్స్ ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో నగరం నలుమూలలకు ఈ ఏడాదిలో వై-ఫై సదుపాయం కల్పించేందుకు సర్కారు చేస్తోన్న కృషి సఫలీకృతం కావాలని ఆశిద్దాం. -
దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
ఎనిమిది మంది నిందితుల అరెస్టు రూ.5.24 లక్షల దొంగనోట్లు స్వాధీనం దండపల్లె వాసులు, పోలీసులకు ఎస్పీ అభినందనలు చిత్తూరు(అర్బన్): జిల్లాలోని పశ్చి మ మండలాలు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠాకు పోలీసులు కళ్లెం వేశారు. గంగవరం కేంద్రంగా జరుగుతున్న ఈ తతంగంలో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు వారి నుంచి ప్రింటర్, స్కానర్‌తో పాటు రూ.5.24 లక్షల దొంగనోట్లను కూడా స్వాధీనం చేసుకున్నా రు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ శుక్రవారం స్థానిక పోలీసు అతిథిగృహంలో ఈ వివరాలను ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డితో కలిసి వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ములబాగిల్‌కు చెందిన శంకర్ అక్కడే సెల్ఫోన్లు, జిరాక్స్ దుకాణం నడిపేవాడు. వ్యసనాలకు బానిసైన ఇతడు అప్పులను తీర్చే క్రమంలో కలర్ జిరాక్స్ మిషన్కొని దాని ద్వారా దొంగనోట్లను ప్రింట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ములబాగిల్‌లో పెట్రోలు బంకు నడుపుతున్న విశ్వనాథ్‌కు రూ.6 లక్షల అప్పు చెల్లించాల్సి ఉంది. అందుకుగాను ఏడాది క్రితం రూ.6లక్షల దొంగనోట్లను ఇచ్చాడు. అవి దొంగనోట్లని కొన్ని నెలల తరువాత విశ్వనాథ్ గుర్తించాడు. శంకర్ నుంచి అప్పు వసూలు చేసుకున్నాడు. దొంగనోట్లను శంకర్ తన వద్దే ఉంచుకున్నా డు. స్నేహితులైన ములబాగిల్‌కు చెందిన బాబు, మంజునాథ్, గంగవరం మండలం దండపల్లెకు చెందిన మురళి, అంజలి, దీపశిఖ, హరితో ముందస్తు వ్యూహం పన్ని దొంగనోట్లను చెలామణి చేయడం ప్రారంభించారు. మహిళా సంఘం లో సభ్యులుగా ఉన్న అంజలి, దీపశిఖ సంఘం పొదుపు డబ్బులో దొంగనోట్లను పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. గ్రామం లో విలాసవంతమైన కార్లు, అనుమానిత వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండటంతో దండపల్లె గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. గంగవరం డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టారు. ఇక్కడ దొంగనోట్ల ప్రింటింగ్చేసి చెలామణి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.500,1000ల దొంగనోట్లు మొత్తం రూ.5,24,500లు, రెండు సెల్ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులు స్వాధీ నం చేసుకున్నారు. దొంగనోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ రామకృష్ణ, ఎస్ఐ దేవరాజులు, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, పళణి, దేవరాజులు, కానిస్టేబుల్ గణేష్, సిబ్బందిని ఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి క్యాష్ రివార్డులను సైతం అందజేశారు. సకాలంలో స్పందించి మంచి సమాచారం అందించిన దండపల్లె గ్రామస్తులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గెలిచే దమ్ములేకే అడ్డదారి రాజకీయూలు పలమనేరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే అధికార పార్టీ అడ్డదారి రాజకీయాలు చేస్తోందని జె డ్పీ మాజీ చైర్మన్ రెడ్డెమ్మ విమర్శిం చారు. బెరైడ్డిపల్లెలోని తన స్వగృహంలో శుక్రవారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు భయపడుతోందో ప్రజలకందరికీ తెలుసన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సహకార శాఖ మం త్రి కృష్ణారెడ్డితో వాయిదా వేయించిందన్నారు. అదే పంథాను ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీ పీ సైతం అనుసరిస్తూ నోటిఫికేషన్ వెలువడ్డాక మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ఎన్నికలు జరగకుండా స్టే ఇచ్చారన్నారు. ఎలాగూ ఈ సహకార సంఘాల్లో గెలవమని ఆ పా ర్టీకి తెలిసిందన్నారు. అందుకే ఇప్పు డు నాన్ అఫీషియల్ త్రీమెన్ కమిటీల ద్వారా చైర్మన్, సభ్యులను నియమిస్తుందన్నారు. ఇది సహకార చట్టానికే మచ్చలాంటిదని అన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు ఎదురైనపుడు అధికారుల కమిటీలు ఉండేవే గానీ ఇలా నామినేటేడ్ ద్వారా కమిటీలను ఎన్నిక చేసే విధానం ఇదే తొలిసారన్నారు. ఎన్నికలు నిర్వహించాల్సి న తరుణంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అధికార పార్టీ పదవీవ్యామోహంతో ఇలాంటి పనులకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అందుకే జిల్లాలో ఎక్కడైతే నామినేటేడ్ కమిటీలను ఏర్పాటు చేస్తారో ఆ పీఏసీఎస్‌ల తరపున తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. -
అందరికీ ఉచిత సెల్ఫోన్లు: చంద్రబాబు
టీడీపీలో కొట్టు, హరివర్ధన్‌రెడ్డి చేరిక సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా సెల్ఫోన్లు అందిస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల్లో పది శాతం మందికి సెల్ఫోన్లు లేవని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారికి ఫోన్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా చంద్రబాబు మంగళవారం తన నివాసంలో జరిగిన సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తానేనన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేవన్నారు. టీడీపీ పని అయిపోయిందని కొందరు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్రేన్‌తో లే పినా లేచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. -
హైటెక్ ప్రచారం
ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా సాగుతోంది. జెండాలు, వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, కరపత్రాలు, భారీ కటౌట్ల స్థానంలో తాజాగా కంప్యూటర్లు, సెల్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేని నేతలు సైతం ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రసంగ పాఠాలతో సోషల్ మీడియా (సెల్‌ఫోన్, ఇంటర్నెట్) ద్వారా విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని కాలనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువజన, కుల, ఉద్యోగ సంఘాల నేతల పేర్లు, ఫోన్ నెంబర్లను సేకరించి అభ్యర్థులే స్వయంగా ఓటర్లతో మాట్లాడుతున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఓటు ఎందుకు వేయాలో, ఎవరికి వేయాలో సూచిస్తూ ప్రతి రోజూ ఓటర్ల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించుకుని వారి సేవలను వినియోగించుకుంటున్నారు. హైటెక్ హంగులతో ఎంఐఎం ప్రచారం .. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీకి దీటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎంఐఎం ప్రచారంలో హైటెక్ హంగులు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు గుర్తింపు, పనితనంపై కూడళ్లలో భారీ హోర్డింగులతో ప్రచారాస్త్రాన్ని సందిస్తోంది. హోర్డింగ్‌లపై చారిత్రక ప్రదేశాలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీల ఫొటోలను ముద్రించారు. సాంస్కృతిక బృందాలు.. కంప్యూటర్ పరిజ్ఞానం లేని, చదువు రాని ఓటర్లను ఆకర్షించేందకు వారికి అర్థమయ్యే రీతిలో అభ్యర్థి గురించి ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ఎవరికి వారే స్వతహాగా ప్రత్యేక సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థి గొప్పతనం, ఆయన జీవన శైలి, ఇప్పటి వరకు ఆయన చేసిన సేవ, తదితర అంశాలే ఇతివృత్తంగా చేసుకుని సుప్రసిద్ధ రచయితలతో పాటలు రాయించి, ప్రముఖ గాయకులతో పాడిస్తున్నారు. స్టూడియోల్లో వీటిని రికార్డ్ చేయిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతుండటం విశేషం. ఓటరు దృష్టిని ఆకర్షించేందుకు పార్టీగుర్తు, జెండా రంగులో ప్రత్యేకంగా టీ-షర్టులు, చీరలు తయారు చేయించి కార్యకర్తలకు పంచుతున్నారు. బిజీగా ఫ్లెక్సీ సెంటర్లు.. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతుండటంతో వాటిని ముద్రించే ఫ్లెక్సీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకూ పనిలేక ఖాళీగా కనిపించిన ఆర్టిస్టులు, పెయింటర్లు ప్రచార రథాలు, బ్యానర్లు, జెండాల తయారీలో బిజీగా మారిపోయారు. ప్రచారానికి భారీ కాన్వాయ్‌తో బయలు దేరుతున్నారు. ఇందు కోసం వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలకు నెలవైన ఫంక్షన్ హాళ్లు తాజాగా ఎన్నికల ప్రచారానికి వేదికలవుతున్నాయి. సోషల్ మీడియాదే హవా ... ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల సంయుక్తంగా సోషల్ మీడియాపై ఓ సర్వే నిర్వహించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో 160 సీట్లను ఫేస్బుక్, ఆర్కూట్, ట్విట్టర్ల వంటి సోషల్ మీడియా డామినేట్ చేయబోతున్నాయని తేల్చింది. యువతరం మొత్తం సోషల్ మీడియాకే అతుక్కుపోయినట్ట పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు 7.5 కోట్లున్న ఈ సంఖ్య, ఎన్నికల సమయంలో 11 కోట్లు దాటిపోతుందనేది అంచనా. వీరిలో దాదాపు 97 శాతం ఫేస్బుక్ ఖాతాదారులే. సమయం దొరికితే చాలు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, వెబ్‌టీవీ...ఏదో ఒకదానికి కనెక్ట్ అవ్వడం సర్వసాధారణమని వెల్లడించింది. రంగంలోకి పీఆర్ ఏజెన్సీలు .. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచార బాధ్యతలను పీఆర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. గెలుపోటములపై ముందే ఓ అభిప్రాయానికి వచ్చేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. ఓటరు నాడి తెలుసుకుని వారికి ఏం కావాలో వాటినే ఎన్నికల ఎజెండాలో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఏ బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేయాలి. ఏ ఏ అంశాలపై మాట్లాడాలి. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి. తదితర అంశాలపై ముందే ఓ అవగాహనకు వచ్చి కాలనీల వారిగా ఎన్నికల ఎజెండాలను రూపొందించి అభ్యర్థులకు అందిస్తున్నాయి. -
బళ్లారిలో ముసుగు దొంగల బీభత్సం
వైద్యుడి ఇంట్లో రెండు గంటల హల్చల్ 40 తులాల బంగారం, 5 లక్షల నగదు దోపిడీ సాక్షి, బళ్లారి : ముసుగు దొంగలు బళ్లారిలో బీభత్సం సృష్టించారు. వైద్యుడి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో భయబ్రాంతులకు గురి చేసి రెండు గంటపాటూ నిర్బంధంలో ఉంచారు. 40 తులాల బంగారు నగలు, రూ. 5లక్షల నగదు దోచుకొని ఉడాయించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కీళ్లు, ఎముకల వ్యాధి నిపుణుడు, అరుణోదయ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సతీష్ కందుల నగరంలోని హవంబావిలో నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారు జామున 10 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు కాంపౌండ్ గోడ దూకి వంట గది కిటికీ పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. సతీష్ కందుల తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి సతీష్ కందుల ఉన్నారా? అని ప్రశ్నిస్తూ రాడ్లు, కత్తులు చూపి భయభ్రాంతులకు గురి చేశారు. అరిచినా, ఫోన్ చేసినా చంపుతామంటూ హెచ్చరించారు. తాము ఎలా చెబితే అలా చేయాలని సూచించారు. సెల్ఫోన్లు నీళ్లలో పడవేశారు. బీరువా తాళం తీసుకొని 40 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదు దోచుకున్నారు. పక్క గదిలో నిద్రిస్తున్న సతీష్ సోదరుడు సురేష్ గదిలోకి చొరబడి అతన్ని బెదిరించారు. ఇంట్లో ఏమైనా నగదు, బంగారు ఉన్నాయా అని ఆరా తీశారు. తర్వాత వైద్యుడి వదిన ప్రసన్నలక్ష్మి మెడలో ఉన్న మంగళ సూత్రం లాక్కున్నారు. అనంతరం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న సతీష్ కందుల గది తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమై ఉడాయించారు. జిల్లా ఎస్పీ చేతన్‌సింగ్ రాథోడ్ , ఏఎస్పీ సీ.కే.బాబా, డీఎస్పీలు రుద్రముని, మురగణ్ణ, సీఐలు, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. జాగీలం చోరీ జరిగిన ఇంటి నుంచి సిరుగుప్ప రోడ్డులో కిలోమీటర్ వరకు వెళ్లి ఆగిపోయింది. అదేవిధంగా నిపుణులు నిందితుల వేలిముద్రలు సేకరించారు. బళ్లారి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం నాల ుగు బృందాలు రంగంలోకి దిగినట్లు ఎస్పీ తెలిపారు. దొంగలు వెళ్లిన తర్వాత తెలిసింది : రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి ఎవరిగదుల్లో వారు నిద్రించారు. నాన్న గది, సోదరుడు గదిలోకి దుండగులు ప్రవేశించి బంగారు, నగదు మొత్తం దోచుకున్నారు. నా గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగలు వెళ్లిపోయే వరకు ఏమి జరిగిందో తెలియలేదు. సెక్యూరిటీని పెట్టుకోలేదు. -డాక్టర్ సతీష్ కందుల -
మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు
మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు చట్టాలెన్ని ఉన్నా రక్షణ కరువు ఆగని అబలలఆర్తనాదాలు శశికళ (పేరు మార్చాం) డిగ్రీ చదివింది. ఇంగ్లిషులోనూ ప్రావీణ్యం సంపాదించింది. చాలా తెలివిగల అమ్మాయి. ఒక్కగానొక్క మగబిడ్డతో జీవితం సంతృప్తిగా సాగుతోంది. ఒకరోజు ఆమెను విధి వెక్కిరించింది. భర్త చనిపోయాడు. మానసికంగా వేదనకు గురైంది. ఏం చేయాలో అర్థంకాలేదు. బిడ్డను తీసుకుని తిరుపతి వెళ్లింది. అక్కడ బస్టాండులో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడ్ని నమ్మింది. ఆ ప్రబుద్ధుడు ఆమెపై లైంగికదాడి చేసి పిల్లాడితోసహా పారిపోయాడు. ఇప్పుడామె జీవితం ఛిద్రమైంది. ప్రభుత్వం నడిపే మహిళా హాస్టల్లో ఉంటోంది. బిడ్డకోసం కన్నీరుమున్నీరవుతోంది. నగరానికి చెందిన స్నేహ (పేరు మార్చాం) 15 ఏళ్ల బాలిక. తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. పరిస్థితి బాగోలేక చదువుకు స్వస్తి పలికింది. ఓ రోజు ఇంట్లో వాళ్లు కూల్‌డ్రింక్స్ తెమ్మంటే బజారుకెళ్లింది. కూల్‌డ్రింక్స్ కొనుక్కుని వస్తుండగా తెలిసిన ఆటోడ్రైవర్ ఒకడు ఆమెను ఎక్కించుకున్నాడు. కిడ్నాప్ చేసి అతడితోపాటు మరికొందరు దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఆ పాప జీవితం కకావికలమైంది. హైదరాబాద్‌కు చెందిన ఆశాలతకు (పేరు మార్చాం) 16 ఏళ్లు ఉంటాయి. తల్లిదండ్రులు విడిపోయారు. ఏదో విషయంలో అలిగి ఇంట్లో చెప్పాపెట్టకుండా విజయవాడకు పారిపోయి వచ్చింది. కనకదుర్గ గుడికి చేరుకుంది. అక్కడ ఆమెకు ఒకడు పరిచయమయ్యాడు. మాయమాటలు చెప్పి సమీపంలో ఒక గదిలో ఉంచాడు. ఇంతలో ఆమెకు మరొకడు పరిచయమయ్యాడు. పరిచయమైన వారిద్దరూ కూడా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఐదేళ్ల చిన్నారి శ్యామల (పేరు మార్చాం).. ఒకటో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే ఇంజినీరింగ్ విద్యార్థి పాపపై కన్నేశాడు. దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. సాక్షి, విజయవాడ : ఈ సంఘటనలను చూస్తుంటే భయమేస్తోంది. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల మహిళ వరకు ఎవరికీ రక్షణ లేకుండాపోయింది. నిన్నగాక మొన్న మచిలీపట్నానికి చెందిన అనూహ్య ముంబైలో లైంగిక దాడి, హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఐదేళ్ల చిన్నారుల మొదలు 26 ఏళ్ల యువతులు ఎక్కువగా లైంగిక దాడులకు గురవుతున్నారు. జిల్లాలో ఇటువంటి కేసులు ఏడాదికేడాది బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2011లో జిల్లాలో 58 మందిపై లైంగికదాడి జరిగితే... 2012లో ఆ సంఖ్య 61కి చేరింది. 2013లో మహిళలపై లైంగిక దాడులు 63 జరిగాయి. పరువు పేరుతో బయటకు రాని కేసులు ఇంతకు నాలుగైదింతలు ఉండొచ్చని అంచనా. చదువుకునే బాలికలు, వివిధ దుకాణాల్లో పనిచేసే అమ్మాయిలు, షిఫ్టుల ప్రకారం రాత్రి వేళల్లో పనిచేసేవారు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఒంటరిగా నివసించేవారు ఎక్కువగా లైంగిక దాడులకు గురవుతున్నారు. అంతేకాదు తల్లిదండ్రులు స్వేచ్ఛ పేరుతో పిల్లలపట్ల గారాబం చేయడం, సెల్ఫోన్లు ఇవ్వడం, ‘మా వాడికి గర్ల్‌ఫ్రెండ్ ఉందంటూ’ వాడిని రెచ్చగొట్టడం, నైతిక విలువలు చెప్పకపోవడం, పాఠశాలల్లో అసభ్యకరమైన పాటలకు డ్యాన్సులు చేయించడం, సినిమాల్లో ప్రేమ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం.. ఇలా అనేక కారణాలు ప్రస్తుత పరిస్థితికి దారితీస్తున్నాయని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ కె.కృష్ణకుమారి అభిప్రాయపడుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో అనేక ఆకర్షణలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. ముందుజాగ్రత్తలు అవసరం.. సమాజంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా తల్లిదండ్రులు తమ అమ్మాయిలు, అబ్బాయిలకు హితబోధ చేస్తున్న పరిస్థితి లేదు. ఒంటరిగా దూర ప్రాంతాలకు వెళ్ళే అమ్మాయిలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కృష్ణకుమారి అంటున్నారు. రాత్రి వేళ లేదా తెల్లవారుజామున రైలు లేదా బస్సు దిగాక ఆటో లేదా క్యాబ్ ఎక్కేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఆసరా... లైంగికదాడులకు గురైన మహిళలు, బాలికలకు స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆసరా కల్పిస్తోంది. రేప్‌కు గురైన మహిళకు రూ. లక్ష, లైంగిక దాడికి యత్నం జరిగితే రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం ఇస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఇస్తోంది. 2013లో లైంగిక దాడికి, యత్నానికి గురైన వారికి మాత్రం పూర్తిస్థాయిలో నిధులు విడుదల కావాల్సి ఉంది. 2012 సంవత్సరంలో రూ. 19 లక్షలు ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలోని బాధితులకు అందజేసింది. అంతేగాకుండా లైంగిక దాడికి గురై ఎక్కడా ఆసరాలేని మహిళలకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆసరా ఇస్తున్నారు.