40 సెల్‌ఫోన్లు చోరీ
40 సెల్‌ఫోన్లు చోరీ
Published Sat, Jul 23 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
మచిలీపట్నం (కోనేరుసెంటర్) :
మచిలీపట్నంలోని ఓ సెల్‌ఫోన్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 1.60 లక్షల విలువ చేసే సెల్‌ఫోన్లు, మెమెరీ కార్డులను దుండగులు అపహరించారు. ఎస్సై బాషా తెలిపిన వివరాల ప్రకారం రామానాయుడుపేటకు చెందిన పరకాని లక్ష్మీనారాయణ బుట్టాయిపేటలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి వ్యాపారం ముగిసిన అనంతరం షాపునకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం షాపు తెరచి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. అనుమానం వచ్చిన నారాయణ ఆర్‌పేట పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. సీఐ వరప్రసాద్, ఎస్సై బాషా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైభాగంలోని సీలింగ్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించినట్లుగా గుర్తించారు. 40 సెల్‌ఫోన్లు, మెమెరీ కార్డులు, పవర్‌బ్యాంకులు, ఇతర వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement